Wednesday, December 29, 2010

జాతీయ గణిశాస్త్ర దినోత్సవం(మేథమెటిక్స్‌ డే),National Mathematics Day


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసెంబర్ 22) - మేథమెటిక్స్ డే - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.

సర్వశాస్త్రాలకు తల్లివంటిది గణితం , అటువంటి గణితశాస్త్రానికి పుట్టిల్లు భారతదేశము . మిగిలిన ప్రపంచములో విజ్ఞానశాస్త్రము ఉదయించకముందే ఇక్కడ మహాపురుషులు ఖగోళశాస్త్రాన్ని అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్ళారు . కాల గమనము , గ్రహణాల అంచనాలు , పంచాంగ నిర్మాణము  వంటివన్నీ వారి ప్రతిభకు నిదర్శనము . అంకెలు కనుగొన్నది , గణితం లో కీలకమైన సున్నాని కనుగొన్నది భారతీయులే.

అటువంటి  గణిత శాస్త్రములోనె కాక అనేక ఇతర శాస్త్రాలలో కూడా ముందున్న భారతదేశము పలుకారణాలు చేత (ముఖ్యము గా రాజకీయం వలన) తన విజ్ఞానశాస్త్ర ప్రగతిలో వెనకపడిపోయి ఐరోపాకి దాసోహమైపోయింది. ఐరోపా ఖండములో విజ్ఞానశాస్త్ర ప్రగతి వేగం పుంజుకుని , భారతీయులు వారిమీద ఆధారపడాల్సివచ్చింది. అయినప్పటికీ అడపాదడపా భారతదేశములో ఒక్కో మేధావి జన్మించి , తమ పూర్వీకుల విజ్ఞానానికి వారసుడుగా ప్రపంచాన్ని అబ్బురపరుస్తుంటారు. అటువంటి గణితశాస్త్ర మేధావి " శ్రీనివాసరామానుజం "

శ్రీనివాస రామానుజన్‌ జయంతి ని (జననము తేది 22-12-1887--మరణము తేదీ 26-04-1920 ), గణిత శాస్త్రం పై ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వము మేథమెటిక్స్‌ డే (గణిశాస్త్ర దినోత్సవం) గా ప్రకటించింది.

1887వ సంవత్సరంలో తమి ళనాడులో కోమలతామ్మాళ్‌, శ్రీనివాస అ య్యంగార్‌ దంపతులకు జన్మించారు శ్రీని వాస రామానుజన్‌. విద్యార్థి దశ నుంచే గణితశాస్త్రం పట్ల అమితాసక్తి కలిగిన రామా నుజన్‌ ఎన్నో గణిత సిద్ధాంతాలను ఆవిష్కరిం చారు. ఈయన ఆవిష్కరించిన 120 గణిత సిద్ధాంతాలను కేంబ్రిడ్జ్‌ ప్రొఫెసర్‌ జి.హెచ్‌. హార్డీకి పంపారు. రామానుజన్‌ మేధస్సుకు ఆశ్చర్యపడిన హార్డీ ఆయనను బ్రిటన్‌కు ఆహ్వానించారు. అంతేకాక, 28-12-1918 న రామానుజన్‌ను 'ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ'మెంబర్ గా ఎన్నుకున్నారు. దీంతో రాయల్‌ సొసైటీలో ఫెలోషిప్‌ పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. కేవలం 30 ఏళ్ళ వయస్సులోనే గణితంలో అనేక చిక్కు సమస్యలను పరిష్కరించి, ఎన్నో కొత్త సిద్ధాంతాలను ఆవిష్కరించారు. క్షయవ్యాధికి గురై 1919లో స్వదేశం చేరుకున్న ఆయన 26-04-1920న పిన్నవయస్సులోనే మరణించారు. 1962లో రామానుజన్‌ 75వ జన్మదినం సందర్భంగా... భారత ప్రభుత్వం తపాలా బిళ్ళను విడుదల చేసింది.

పూర్తి జీవితవిశేషాల గురించి వికీపిడియాను చూడండి -> శ్రీనివాస రామానుజన్‌.

  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

Monday, December 27, 2010

ప్రపంచ జంతువుల హక్కుల దినం , International Animal Protection Day


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసెంబర్..10) ప్రపంచ జంతువుల హక్కుల దినం... గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని, పరిసరాలను కబళించి కలుషితం చేస్తూ జీవిస్తాడు. జంతువులు, పక్షులు తమ కోసం కాక, ప్రకృతిలో భాగంగా జీవిస్తూ, మనుషుల దౌష్ట్యానికి బలైపోతూ మనుగడ సాగిస్తున్నాయి. మనిషి తన ఉనికి కోసం, ఆహారం, వినోదం కోసం వెంపర్లాడుతూ జంతుజాలాన్ని బంధించి, బానిసలుగా మార్చి వాటి స్వేచ్ఛను, ప్రాణాలను హరించి తన స్వార్థానికి వాడుకుంటున్నాడు. జంతువులు, పక్షుల నుంచి మనిషి పొందుతున్న ప్రతిఫలానికి కనీస కృతజ్ఞత కూడా లేకుండా వాటి పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం, హద్దులు మీరిన హింస క్షమించరాని నేరంగానే మిగిలిపోతోంది.

మనుషులకు ఏ చిన్న కష్టం తెలెత్తినా వెంటనే ధర్నాలు, ఆందోళనలు, న్యాయ పోరాటాలు చేస్తారు. హక్కులు హరించుకు పోతున్నాయంటూ వార్తా పత్రికలు పతాక శీర్షికలుగా మారుస్తాయి. జంతువులకు, పక్షులకు కూడా కొన్ని హక్కులుంటాయని మనుషులు ఎందుకు గుర్తించరన్నది అందరూ ఆలోచించాలి. సృష్టిలోని ప్రతిప్రాణీ జీవించడానికి సమాన హక్కులు ఉండాలి. ఒక జీవి ప్రాణాలను హరించే హక్కు మరో జీవికి లేదు, ఉండకూడదు.

మనిషికి రక్షణ, ఆహారం, ఆరోగ్యాలను ప్రసాదిస్తున్న జంతుజాలంపై కృతజ్ఞతాభావంతో మెలగాల్సిందిపోయి, క్రూరంగా హింసించడం అమానుషం. దాన్ని గుర్తించి జంతువులు, పక్షుల సంక్షేమం కోసం ఎంతో కృషి సాగించిన ‘సాధు టీఎల్ వాస్వాని’ పుట్టిన రోజైన నవంబర్ 25ను ప్రతి సంవత్సరం జంతు ప్రేమికులు, జంతు సంరక్షణా సంస్థలు ఇండియాలో‘జంతువుల హక్కుల దినం’గా పాటిస్తున్నాయి. ఆ రోజును ‘నో మీట్ డే’గా పాటించాలని ఆ సంస్థలు కోరడం అందరూ ఆహ్వానించదగ్గ అంశం. అలాగే, జంతువులు, పక్షులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయన్నది బాధ్యత గల ప్రతి ఒక్కరూ గుర్తించి వాటి రక్షణకు కృషి చేయాలి. పురాణాల కాలం నుంచీ మనుషులకు జంతువులకు అవినాభావ సంబంధం ఉంది. నేటికీ వాటి ద్వారానే మనుషులు ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పొందుతున్నారు. బిడ్డకు తల్లిపాలు చాలకపోతే ఆవు పాలు పడతారు. మనిషి ఆహారంలో సగ భాగం వాటి మాంసాన్ని వాడటం బాధాకరం.

ఇంటి కాపలాకు, నేర పరిశోధనకూ కుక్కలను గణనీయంగా వినియోగిస్తారు. వ్యవసాయానికి, మంచు కొండల్లో, ఎడారుల్లో మనుషులను గమ్యానికి చేరవేయడానికి జంతువులను ఉపయోగిస్తారు. సర్కస్ వంటి ప్రదర్శనల్లో ఎన్నో జంతువులు, పక్షులతో విన్యాసాలు చేయిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషి జంతువులపై ఆధారపడి జీవిస్తున్నాడు తప్ప, జంతువులు కేవలం ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయినా, మనుషులు వాటిని వెంటాడి, వేటాడి హరించడం క్షంతవ్యం కాదు. మనుషుల నుంచి తప్పించుకోవడానికి జంతువులకు ఉన్న ఆవాసం అడవి. దాన్ని కూడా వదలకుండా నేడు మనిషి హరిస్తుండటం తెలిసిందే. మాంసం కోసం, చర్మాల కోసం జంతువులను వేటాడే వాళ్లు కొందరైతే, కేవలం వినోద క్రీడగా కాలక్షేపానికి క్రూరంగా వేటాడతారు. దీని ప్రభావంతోనే, 1972లో ‘వన్యప్రాణుల సంరక్షణా చట్టం’ రూపొందింది. దీని ప్రకారం వన్యప్రాణులను వేటాడటమే కాదు, పట్టుకుని బంధించడం కూడా నేరమే. ఇక పెంపుడు జంతువుల పేరుతో కూడా అనేక హింసలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు, నోరు లేని మూగ జీవాలకు స్వేచ్ఛ, సంరక్షణ కల్పించడానికి అనేక సంస్థలు నడుం బిగించడం మంచి పరిణామం. పీపుల్స్ ఫర్ ఏనిమల్స్, జీవ రక్షా సమితి, జీవ బంధు, బ్లూ క్రాస్ వంటి సంస్థలు జంతువుల రక్షణకు ఎన్నో కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహించడం మూలంగా కొంతైనా ఉపశమనం లభిస్తోందన్నది కాదనలేని వాస్తవం. దీనికి అందరూ సహకరించడం కనీస కర్తవ్యంగా భావించాలని మనవి.

హక్కులు కేవలం మనిషికే కాదు జంతువులకూ ఉండాలన్న ఉద్దేశ్యంతో యూనివర్సల్ డిక్లరేషన్ యానిమల్ రైట్స్‌ని ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌ని 1998లో ప్రపంచ దేశాలు ఆమోదించాయి.మానవ హక్కుల దినమైన డిసెంబర్ 10న జంతువుల హక్కుల దినంగా చేయడంద్వారా మనుషులు, జంతువులు ఒకటేనన్న సందేశం అందరికీ అందించడమే దీని ప్రధాన లక్ష్యం.

Source : Wikipedia.org/
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం,International Human Rights Day


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (Dec 10 న ) International Human Rights Day గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

ప్రతి మనిషి మనిషిగా జీవించడానికి కొన్ని హక్కులు ఉండాలి. ఇందులో జాతి, భాష, కుల, మతాలకతీతంగా మనిషిగా జీవించే హక్కు కలిగి ఉండడమే ప్రధాన ఉద్దేశ్యం.అలాంటి మానవ హక్కుల దినాన్ని 10.12.1948న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అప్పటినుండి ప్రతిసంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 10వ తేదీ ని అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. వివక్షత లేనటువంటి మానవ సమాజ నిర్మాణమే ఈ అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ లక్ష్యం.

మానవ హక్కులను రక్షించేందుకు, మరిన్ని సౌకర్యాలు కలిగించేందుకు అమెరికా 1945 నుండి ప్రయత్నిస్తోంది. ఆ దేశ జనరల్‌ అసెంబ్లి అధికార ప్రకటనలను గౌరవించే ఉద్దేశంతో 1948వ సంవత్సరంలో డిసెంబర్‌ 10వ తేదీని డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌గా (యు.డి.హెచ్‌.ఆర్‌) నిర్ణయించారు. మరి రెండేళ్ళ తర్వాత 1950 డిసెంబర్‌ 4వ తేదీన జరిగిన 317వ జనరల్‌ అసెంబ్లి ప్రత్యేక సమావేశంలో మానవ హక్కుల దినోత్సవానికి సాధారణ ప్రణాళిక రచించి అమలు జరిపారు. ఆరోజున అన్ని రాష్ట్రాల అధికార ప్రతినిధులనూ ఆహ్వానించడమే కాకుండా ఆసక్తి ఉన్న సంస్థలు ఈరోజున మానవ హక్కుల దినోత్సవం జరిపినట్లయితే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని జనరల్‌ అసెంబ్లి సూచించింది.

ప్రతీ మనిషికి దక్కవలసిన హక్కులు దక్కుతున్నాయా? హక్కులు పరిరక్షించేందుకు మనమంతా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామా? మన హక్కులను కాపాడుకోగల్గుతున్నామా? అంతా అనుకున్నట్టే జరిగితే అనుకోవాల్సిందింకేముంది? భయపడాల్సింది, బాధపడాల్సిందీ ఏముంటుంది? అలా జరగడం లేదు కనుకనే, కోట్లాదిమంది అశాంతితో, అభద్రతాభావంతో తల్లడిల్లిపోతున్నారు కనుకనే మానవ హక్కుల దినోత్సవం అనేది పుట్టుకొచ్చింది. ఇతర దేశాలతో పోల్చినప్పుడు అమెరికాలో ఈరోజుకు చాలా ప్రాధాన్యత వుంది. న్యూయార్క్‌ సిటీ హెడ్‌ క్వార్టర్స్‌ క్యాలండర్‌లో డిసెంబర్‌ 10వ తేదీ హైలైట్‌ చేసి కనిపిస్తుంది. పై స్థాయి రాజకీయ సభలు, సమావేశాలు అలాగే సాంస్కృతిక సంస్థలకు సంబంధించిన ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు మొదలైనవన్నీ ఈ ప్రత్యేకదినాన ఏర్పాటు చేస్తారు.

ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్‌ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మానవ హక్కుల రంగంలో చురుగ్గా పనిచేస్తున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. సాధారణ, సాంఘిక సమస్యలను చర్చిస్తాయి.

2006వ సంవత్సరంలో మానవ హక్కుల దినాన్ని పురస్కరించుకుని పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం సలిపారు. నిజంగా తిండి, బట్ట, గూడు లాంటి కనీస అవసరాలు తీరకపోవడం ఎంత విషాదం?! ఈ సందర్భంగా ఎందరో ఉపయుక్తమైన ప్రకటనలు విడుదల చేశారు. పేదరికాన్ని రూపుమాపాలని, అందుకు మనమంతా కృషిచేయాలని మేధావులెందరో అభిప్రాయపడ్డారు. 2008 డిసెంబర్‌ 10న యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ 60వ వార్షికోత్సవం జరిగింది. యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జనరల్‌ ఆ ఏడాది అంతా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలు, ఉపన్యాసాలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. యు.డి.హెచ్‌.ఆర్‌ రూపొందించిన డాక్యుమెంట్‌ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తమ హక్కులేంటో తెలియజెప్పడం, అవసరమైన సహకారం అందించడం ధ్యేయంగా పెట్టుకుని అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. 1998లో మాల్దావా ''ఫిఫ్టీ ఇయర్స్‌ ఆఫ్‌ ది యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌'' అంటూ ఒక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. తైవాన్‌లో షియా మింగ్‌-టెహ్‌ 1979లో హ్యూమన్‌ రైట్స్‌ ప్రదర్శనలు నిర్వహించింది. 2004లో చైనా, మాల్దివులు, వియత్నాం దేశాల్లో ఖైదీలుగా ఉన్న సైబర్‌ డిసిడెంట్స్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇంటర్నేషనల్‌ పెన్‌ ప్రదర్శనలు నిర్వహించింది. అమెరికా, ఆఫ్రికా, యూరప్‌ దేశాలు మానవ హక్కుల సంరక్షణకోసం యథాశక్తి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రత్యేక దినాన సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. చిలీ మాజీ ప్రెసిడెంటు, డిక్టేటర్‌ ఆగస్టో పినోచెట్‌ ఎంత విధ్వంసం సృష్టించాడో, మానవ హక్కులకు భంగం కలిగించాడో విదితమే.

ఆ చండశాసనుడు 91 ఏళ్ళ వయసులో 2006 డిసెంబర్‌ 10న గుండెపోటుతో మరణించాడు. కాలిఫోర్నియాలోని గే హక్కుల (హోమో సెక్సువల్స్‌, ఇంకా వారిని సమర్థించేవాళ్ళు) కార్యకర్తలు ''కాలింగ్‌ ఇన్‌ 'గే''' పేరుతో సమాన హక్కులకోసం పోరాడుతూ ప్రజలను సహాయం అర్థించారు. గే పెళ్ళిళ్ళపై నిషేధం విధించినందుకు ఈవిధంగా నిరసన తెలియజేశారు. పారిస్‌లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ 60వ మానవ హక్కుల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఆ ఏడాది కాంబోడియా, తదితర దేశాల్లో ఉత్సవాలు జరిగాయి. 5వేలకు పైగా ప్రజలు ఈ సందర్భంగా మార్చింగ్‌ జరిపారు. వెయ్యిమందికి పైగా పెద్ద బెలూన్లను విడుదల చేశారు. రష్యా, భారత్‌ల్లోనూ మానవ హక్కుల దినోత్సవాలను గొప్పగా జరిపారు. గత సంవత్సరం కూడా ఈ ప్రత్యేక దినాన సభలు, సమావేశాలతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నించాయి. ఈరోజు కూడా మనదేశంతో సహా అనేక దేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మనమంతా మన బాధ్యతలను సక్రమంగా, నిజాయితీగా నిర్వహిద్దాం. మన కనీస హక్కులకోసం నిస్సంశయంగా పోరాడుదాం. ''బ్రతుకు, బ్రతకనివ్వు'' అనే సిద్ధాంతాన్ని నమ్ముదాం, ఆచరిద్దాం.

source : wikipedia.org
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

Thursday, December 23, 2010

International volunteer Day,అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా దినోత్సవం


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (December 05) International volunteer Day గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1985 డిసెంబర్ 17 తేదీన చేసిన తీర్మానం ద్వారా ఇంటర్నేషనల్ వలంటీర్ డే ఫర్ ఎకనామిక్ , సోషల్ డెవలప్మెంట్ ను ప్రకటించినది . డిసెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం " ఇంటార్నేషనల్ వలంటీర్ డే ఫర్ ఎకనామిక్ , సోషల్ డెవలప్ మెంట్ ,ను పాటించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వివిధ ప్రభుత్వాలకు పిలుపు ఇచ్చింది . స్వచ్చంద కార్యకర్తలు , కమిటీలు , సంస్థలు , స్థానిక , జాతీయ , అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి కోసం తమ వంతు కృషిని అందిస్తారు . ప్రభుత్వ సంస్థలు , లాభేతర సంస్థలు , కమ్మ్యూనిటీ గ్రూపులు , ఎకడమిక్ ప్రవేట్ రంగం తో కలసి అభివృద్ధి లో భాగం పంచుకోవడానికి ప్రజలు , స్వచ్చంద కార్యకర్తలకు ఈ రోజు ఒక మహత్తరమైన అవకాశం వంటిది . ఇన్ని సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ వలంటీర్ డే ను న్యూహత్మకం గా ఉపయోగిస్తున్నారు . మిలీనియం అభివృద్ధి లక్ష్యాల్ని అందుకోవడానికి అనేక దేశాలు స్వచ్చంద కార్యకర్తల సేవలపై దృష్టిని సారించాయి . పేదరికము , ఆకలి , రుగ్మతలు , నిరక్షరాస్యత , వాతావరణలోపాలు , మహిళలపట్ల వివక్ష వంటి సమస్యల్ని ఎదుర్కోవడం లో లక్ష్యాలు నిర్ణయించి ఆ దిశగా వలంటీర్లను ప్రోస్తహిస్తున్నారు .

ఐక్యరాజ్యసమితి వ్యవస్థ , ప్రభుత్వాలు , స్వచ్చంద కార్యకర్తల భాగస్వామ్యం గల సంస్థల పరస్పర సమన్వయం తో ఏర్పడింది ఈ ఇంటర్నేషనల్ వలంటీర్ డే . మీడియా , ఎకడమిక్ , ఫౌండేషన్లు , ప్రవేటురంగం , ఫెయిత్ గ్రూఫ్స్ , స్పోర్ట్స్ , ఎఇక్రియేషన్‌ సంస్థల పతినిధులు కూడా ఆ యా కార్యక్రమాల్లో పాల్గొంటారు . 2001 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వలంటీర్స్ గా ప్రకటించారు . జపాన్‌ పభుత్వం యు.ఎన్‌.జనరల్ అసెంబ్లీ52 వ స్వ్షన్‌ సందర్భం గా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కు చేసిన ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు . 1997 లో 123 దేశాల సహాయ సౌజన్యముతో తీర్మానము చేశారు . 2001 లో యునైటెడ్ నేషన్స్ వలంటీర్స్ ప్రొగ్రామ్‌ ను డిజైన్‌ చేసారు . 2008 లో ఈ యు.ఎన్‌. ని గుర్తింపును వక్కాణిస్తూ యు.ఎన్‌ తీర్మానం చేసింది . 2011 లో పదో వార్షికోత్సవం నాటికి ప్రపంచవ్యాప్తం గాగల వలంటీర్లు , కమ్యూనిటీలు సాధించాల్సిన లక్ష్యాలు నిర్ణయిస్తారు .

ప్రపంచవ్యాప్తం గా శాంతి , అభివృద్ది లకు మద్దతుగా వలంటీరిజాన్ని మెరుగుపరచడానికి ఏర్పడ్డ ఐక్యరాజ్య సంస్థకు చెందినదీ యునైటెడ్ నేషన్స్ వలంటీర్స్ ప్రోగ్రాం . డిసెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం " ఇంటార్నేషనల్ వలంటీర్ డే ఫర్ ఎకనామిక్ , సోషల్ డెవలప్ మెంట్ ,ను పాటించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వివిధ ప్రభుత్వాలకు పిలుపు ఇచ్చింది .
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

Wednesday, December 22, 2010

సివిల్ ఏవియేషన్‌ డే, విమానయాన దినోత్సవం ,Civil Aviation Day


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు Dec 07 - Civil Aviation - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

అంతర్జాతీయ ఆర్ధిక ప్రగతిలో వైమానిక విభాగానికి కీలక పాత్ర ఉన్ననది . ప్రపంచ వ్యాప్తముగాగల ప్రజల నడుమ స్నేహము , అవగాహన పెరగడానికి , ఆర్ధిక , సామాజికముగా ఎదిగేందుకు ప్రత్యక్షముగా , పరోక్షముగా ఈ విభాగము దోహదపడుతుంది . ప్రపంచవ్యాప్తముగా గల జబాభాకు ఆర్ధిక , సామాజిక , సాంస్కృతిక ప్రయోజనాలను అందజేస్తుసంది . ఏడాదికేడాది వైమానిక రవాణాకు ప్రాధాన్యము పెరుగుతూవస్తోంది . అవకాశాలు విస్తృతం అవుతున్నాయి . ప్రపంచీకరణలో వైమానిక రంగానికే తొలి ప్రధాన్యము . లక్షలాది మంది ప్రయాణికులు ఈ రంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. కార్గోవిమానాలు , ప్యాసింజర్ విమానాలు సముద్రాలు దాటుతూ ఖండాంతర సరిహద్దుల్ని చెరిపేసున్నాయి . ఖండాల నడుమ ఆర్ధిక పురోగతికి వైమానిక శాఖ తన వంతు కృషిని అందిస్తున్నది . ప్రపంచ మార్కెటిలో వ్యాపారానికి ముఖ్యముగ ద్వీప కల్పాల నడుమగల చిన్న దేశాలకు ఇతోధికంగా సాయ పడుతున్నారు . ప్రపంచములో అతి పెద్ద పరిశ్రమ అయిన ట్ర్రావెల్ మరియు టూరిజం లో ఇది అంతర్భాగము . సామాజిక ప్రయోజనాల కల్పన మరో ముఖ్యమైన , విలువైన పని . అలాగే లక్షలాదిమందికి విమానాలు , విమానాశ్రయాలు , ఏరోస్పేస్ కంపెనీల్లో ప్రత్యక్షము గా , పరోక్షం గా ఉద్యోగాలు కల్పిస్తుంది .

ఇంతతి మహోన్నత పాత్రగల వైమానిక విభాగాన్ని గుర్తిస్తూ ప్రతియేటా డిసెంబర్ 07 న "ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్‌ డే " ని నిర్వహిస్తున్నారు . ఇంటర్నేషనల్‌ సివిల్ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ 1994 లో ఈ రోజును ఆరంభించినది . ఈ సంస్థ 1994 డిసెంబర్ 07 వ తేదీన ఏర్పాటైనది . సంస్థ 50 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అందుకు గుర్తుగా " ఎ 29-1 అసెంబ్లీ తీర్మానం ద్వారా ఏవియేషన్‌ డే ను ప్రకతించారు . కెనడియన్‌ ప్రభుత్వ సహకారముతో ఐసిఎఒ (ICAO) చొరవతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానము ద్వారా డిసెంబర్ 07 తేదీని అంతర్జాతీయ వైమానిక దినం గా అధికారికంగా ప్రకటించింది . అధికారిక ఐక్యరాజ్యసమితి దినాల జాబితో చేర్చారు .

సామాజిక , ఆర్ధికాభివృద్ధి లో అంతర్జాతీయ వైమానిక విభగానికిగల ప్రపంచ ప్రాముఖ్యం గురించి ప్రజలకు జాగృతపరచడం , అంతర్జాతీయ విమాన రవాణా క్రమబద్దీకరణ , రక్షణ , సామర్ధ్యం పెంపుదలలో ఐసిఎఒ పాత్ర గురించి తెలియజెప్పడము ఈనాటి ముఖ్య ఉద్దేశ్యం . వైమానిక భద్రత విషయం లో ఐసిఎఒ అత్యవసర నాయకత్వ పాత్ర పోషిస్తుంది . ప్రపంచవ్యాప్తం గా వైమానిక భద్రతను పెంపొందించడం ఈ సంస్థ పూర్తిస్థాయి లక్ష్యము . వివిదహ్ ప్రభుత్వాలకు భద్రతా ప్రమాణాల అమలులో సహకరించడం , వాటి లోటుపాట్లను పరిష్కరిండము లో ఈ సంస్థ బాగా సహకరిస్తుంది . అలాగే వాతావరణం పై వైమానిక ప్రబావము లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రోస్తహిస్తుంది . 2050 దాకా ప్రపంచమంతటా ఏటా 2 శాతము చొప్పున ఇంధన సామర్ధ్యాన్ని మెరుగుపరచాలని , విమానానికి గ్లోబల్ సిఒ2 ప్రమాణాలు పాటించాలని అంతర్జాతీయ వైమానికరంగమ్లో మార్కెట్ ఆధారిత అంచనాలతో ఫ్రేమ్‌ వర్క్ అవసరమని సిఒ2 ఎమిషన్ల పై ఐసిఎఒ ద్వరాఅన్ని దేశాల కార్యక్రమాలకు , ప్రణాళికలకు సమన్వయం అవసరమని ఐసిఎఒ సభ్యులంతా అంగీకరంచారు . ఈ సిఫార్సులన్నింటినీ ఈ యేడాది డిశంబరు 07 తేదీన ఐసిఎఒ అసెంబ్లీ సమీక్షింది . 190 దేశాల నడుమ వైమానిక విభాగానికి సంబంధించిన అన్ని రంగాల్లో సహకారానికి ఈ సంస్థ ఓ వేదికగా పనిచేస్తోంది .

విమానయానం లో శరీర స్పందన : ఆరోగ్యముగా ఉన్నవాళ్ళు కూడా విమానాలలో ప్రయాణించేటప్పుడు అంతవరకు అనుభవం లేని వాతావరణ స్థితిని , తెలియని అందోళనను ఎదుర్కొంటారు . విమానం కదలిక , గాలిలోకి ఎగరడం లాంటి స్థితిని కొత్తగా చవిచూసినప్పుడు అసౌకర్యభావన కలగవచ్చు . శరీరం లో గహణశక్తి గల వివిధ అవయవాలు భిన్నమైన అనుభూతుల్ని కేంద్రనాడీవ్యవస్థకు పంపుతాయి . అన్ని అనుభూతుల మధ్య సమన్వయము , సమతౌల్యము పొందలేని శరీరం విమానయానానికి అనుకూలముగా మారుతుంది . విరేచనానికి వెళ్ళాలన్న అనుమానం కలుగుతుంది . మనం ఓచోట కూచుని చుట్టూ చూడగలం . . అయితే చెవులు లేదా అంతరంగికంగా ఉండే గ్రహణ అవయవాలు మనం పైకి , కిందకు కదులుతున్న ఆనుభూతులను గహించి స్పందిస్తాయి . అప్పుడు తలతిరుగుడు , ఆకలి లేకపోవడం , కళ్ళు తిరిగినట్తుగా అనిపించడం , తేనుపులు , నోటిలో అధికంగా లాలాజలం ఊరడం లాంటివి జరుగుతాయి .

తీసుకోవలసిన జాగ్రత్తలు :
  • విమానం లో కూర్చున్న తర్వాత బాగా రిలాక్స్ (మానసికంగా) కావాలి ,
  • హాయిగా ప్రయాణించడానికి అనువుగా ఉండే సీట్లు ఎంపిక చేసుకోవాలి . విమానం ఎక్కేముందు మితిమీరిన ఆత్రుత పనికిరాదు .
  • ప్రయాణానికి ముందు మద్యము సేవించకూడదు , సుగంధ ద్రవ్యాలు గల ఆహారపదా్ర్ధాలు విమానములో ప్రయాణించే ముందు తీసుకోకూడదు . విమానము లో అటు ఇటు ఎక్కువగా తిరగకూడాదు .
  • విమానము లోపల ఉన్నవాటిని చూసేందుకు లేదా అంశాలను చదివేందుకు యత్నించకుండా ముందువైపు దూరం గా ఉన్నటువంటి వస్తువులను చూస్తూ కూర్చోవాలి . ప్రయాణానికి ముందురోజు తగినంతగానిద్రపోవాలి .
  • నిమ్మికాయ చప్పరించడం వంటి వాంతిని తగ్గించే లక్షణము గల పదార్ధములనే తినాలి .
  • సిగరేట్ తాగకూడదు .


Source : Wikipedia.org
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

Tuesday, December 21, 2010

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే , Armed forces Flag Day



ఏటా డిసెంబర్ 07 వ తేదీన " ఫ్లాగ్ డే " ని నిర్వహిస్తారు.

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసెంబర్ 07) - ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.

భారితీయ సైనిక సిబ్బందికి సహాయ సహకారాలు అందించడము కోసము ఉద్దేశించిన దినము 'ఆర్మ్‌డ్ ఫొరెస్ ఫ్లాగ్ డే లేదా ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా' . భారతీయ సైనిక సిబ్బంది సంక్షేమము కోసము ఈ రోజున నిధులు వసూలు చే్స్తారు . ఏటా డిసెంబర్ 07 వ తేదీన " ఫ్లాగ్ డే " ని నిర్వహిస్తారు . 1949 నుండి జరుపుకుంటూ వస్తున్నారు . భారత దేశానికి స్వాతంత్రము వచ్చిన వెంటనే రక్షణ సిబ్బంది సంక్షేమ నిర్వహణ అవసరము పభుత్వానికి ఏర్పడింది . 1949 ఆగస్టు 28 వ తేదీన రక్షణమంత్రి నేతృత్వములో ఏర్పడిన కమిటీ ప్రతి సంవత్సరము డిసెంబర్ 07 న ఫ్లాగ్ డే ని పాటించాలని నిర్ణయించినది . ఈ ఫ్లాగ్ డే నాడు జెండాలను పంచి అందుకు గాను విరాలాలు సేకరిస్తారు .

దేశరక్షణకోసము పోరాడే సైనిక సిబ్బంది కుటుంబీకులు , వారిపై ఆధారపడి జీవించేవారి పరిరక్షణ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత సాధారణ ప్రజలు పాలు పంచుకోవాలనే ఉద్దేశము తో విరాలాలు వసూలు చేసున్న దృస్ట్యా ఫ్లాగ్ డే కు అత్యధిక ప్రాధాన్యత లభించినది . ఫ్లాగ్ డే ప్రధానము గా మూడు ప్రయోజనాల్ని దృస్టిలో ఉంచుకుంటుంది .
1. యుద్ధము లో గాయపడినవారికి పునరావాసము కల్పించడం ,
2. సర్వీసులో గల సిబ్బంది ,వారి కుటుంభీకుల సంక్షేమము ,
3. మాజీ సైనికోద్యోగులు , వారి కుటుంబీకుల సంక్షేమము , పునర్నివాసము కల్పించడం ,

సైనిక సిబ్బంది సేవలకు కృతజ్ఞత , ప్రశంసలు తెలియజేయడానికి ఫ్లాగ డే ఒక అవకాశము గా భావిస్తారు . అలాగే దేశరక్షణ చర్యల్లో భాగంగా ప్రాణాలు కోల్ఫోయిన సిబ్బంది సేవల గురింపునకు కూడా ఈదో అవకాశము . భారత సైన్యము , వైమానికదళము , నౌకాదళము మూడూ ఫ్లాగ్ డే సందర్భము గా విభిన్న షోలు , కార్నివాల్స్ , నాటకాలు , ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు . జాతీయ భద్రతకోసము తమ సిబ్బంది చేపట్టే కార్యక్రమాలను వీటి ద్వారా సాధారణ ప్రజలకు వివరిస్తారు . దేశము అంతా ఎరుపు , నిండు నీలము , లేత నీలము రంగుల చిన్న పెద్ద్ కార్ ఫ్లాగ్ లను మూడు విభాగాలకు చిహ్నం గా పంచిపెట్టి విరాళాలు స్వీకరిస్తారు .

సంక్షేమ నిధుల్ని 1993 లో రక్షణమంత్రిత్వ శాఖ ' ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ డే ఫండ్ " గా మార్చింది . ఇతరత్రా నిధులు కూడా దీనిలో కలిసి ఉంటాయి . దేశవ్యాప్తంగా నిధుల సేకరణ నిర్వహణ కేంద్రీయ సైనిక బోర్డ్ కూడా సేవలు చేస్తాయి . ఇది రక్షణశాఖలో భాగము . నిధుల సేకరణ అధికారికంగాను , స్వచ్చంద సంస్థల ద్వారా అనధికారికం గాను జరుగుతుంది . కేంద్ర రక్షణమంత్రి అధ్యక్షతనగల మేనేజింగ్ కమిటీ నిధుల పంపిణీ బాధ్యత చేపడుతుంది . ఈ కమిటీలో అన్నిరాస్ట్రాల , కేంద్రపాలిత ప్రాంతాల అధిపతులు సభ్యులుగా ఉంటారు .

  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

Tuesday, December 14, 2010

అంతర్జాజీతీయ స్త్రీ హంసా వ్యతిరేక దినోత్సవం , International Day for the Elimination of Violence agaist Women


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (November 25) "అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము " గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


" ఓ దేశ మహిళ స్థితిగతుల్ని చూసి ఆ దేశ పరిస్థితిని ఇట్టే చెప్పేయవచ్చును " అన్నారు పండిత జవహర్ లాల్ నెహ్రూ. నిజమే కదా . ఒక దేశ మహిళలు ఆ దేశము యొక్క నాగరికతకు ప్రతిబింబం వంటి వారు . నాగరికత ఆరంభం అయిననాటి నుంచి భారతీయ మహిళలకు ఎంతో గుర్తింపు , ప్రాధాన్యత ఉన్నాయి . మన దేశములోని గొప్ప మహిళల గురించి చరిత్ర పేర్కొంటుంది ఎన్నో విశేషాలు . దేశ జనాభా లో దాదాపుగా సగము సంఖ్య వారిది . వివిద రూపాలలో జాతీయ , ఆర్ధిక పురోగతిలో మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారు . మహిళలు మంచి స్థాయిని అనుభవిస్తున్నట్లయితే అక్కడి సమాజము సరైన వికాసం తో , బాధ్యతతో ఉన్నదని అర్ధము .

ప్రాచీన భారతం లో ఈ జీవితం లోని అన్ని కోణాల్లోనూ పురుషు లతో సమంగా తమ స్థాయిని అనుభవించే వారు . పురుషులు మాదిరిగానే చదువుకునే వారు . గొప్ప పండితులు , కవయిత్రులు , ఫిలాసఫర్లు గా ఎదిగినవారూ ఉన్నారు . ఒక్క మాటలో చెప్పలంటే స్త్రీ ఆ రోఉల్లో " లక్ష్మీ దేవి " కి తీసిపోని స్థానాన్ని అనుభవించినది . అర్ధాంగి గా సంపూర్ణ పాత్ర పోషించేది . స్వయంవరం ద్వారా తన భర్త ను ఎంఫికచేసుకునే స్వేచ్చ ఆనాటి మహిళలకు ఉండేవని పురాణాలు వలన మనకు అవగతం అవుతుంది . వైదిక యుగం తరువాత స్త్రీ స్థాయి తగ్గనారంభించింది . సమాజము లో లింగవివక్షత పాకడం మొదలైంది . మధ్య ప్రాచీన కాలం నాటికి మహిళ స్థితిగతుల్లో గణనీయమైన తేడాలొచ్చేశాయి . నిజం చెప్పాలంటే స్త్రీ జీవితం లో చీకటికోణము మొదలైంది .. అప్పుడే.

నేటి సమాజము లో స్త్రీ లు అనేక సామాజిక , ఆర్ధిక , రాజకీయము , విద్యాపరము గా సమస్యలు ఎదుర్కొంటున్నారు . గృహ హింసలు , స్త్రీలపై అత్యాచారాలు , లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి . అత్మనూనతా భావానికి లోనై స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . వీటిన్నింటినీ అరికట్టే ప్రయత్నములో 1999 డిసెంబరు 17 వ తేదీన ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని చేసింది . ప్రతి సంవత్సరము నవంబరు 25 న స్త్రీల హక్కుల పరిరక్షణ , స్త్రీ హింసా వ్యతిరేక దినము గా పాటించాలని ఈ తీర్మానము సారాంశము .
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

Monday, December 13, 2010

సరిహద్దు బద్రతాదళ దినోత్సవము , Border Security Force Day


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (December 01)సరిహద్దు బద్రతాదళ దినోత్సవము గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.



సరిహద్దు భద్రతాదళాలు భారతదేశ సరిహదూ భూభాగాల్ని పరిరక్షస్తూ సరిహద్దుల వెంబడి ఎటువంటి చొరబాట్లు జరక్కుండా పరిరక్షిస్తుంటాయి . ఈ కార్యకలాపాల నిర్వహణ కోసం సరిహద్దు భద్రతాదళానికి విసృతమైన ఇంటలిజెన్స్ నెట్ వర్క్ ఉన్నది . 1965 ఆరంభము లో కచ్ భూభాగము ద్వరాపాకిస్తానీయులు చొరబడడం తో అదే సంవత్సరము దిశంబరు 01 వ తేదీన సరిహద్దు భద్రతాదళాన్ని ఏర్పాటు చేసారు .
BSF లో దాదాపు 1,80,000 సైనికులు ఉన్నారు . అప్పట్లో 26 బెటాలియన్‌లు తో ఏర్పాటు అయిన బి.యస్ .యఫ్ . ఇప్పుడు " ఆర్గానిక్ ఆర్టిల్లరి , ఎయిర్ , యానిమల్ , వాటర్ వింగుల సహకారము తొ 157 బెటాలియన్లకు విస్తరించి ప్రపంచము లోనే అతిపెద్దదైన బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్ గా ఆవిర్భవించినది . దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్ల భారత సరిహద్దులును పరిరక్షించడము , చొరబాట్లను , సరిహద్దు ప్రాంతాల నేరాల్ని నిరోధించడము , సరిహద్దు వెంబడి ప్రజలకు రక్షణ కల్పించడము , నిద్రోహ చర్యలను ఎదుర్కోంటూ , ఉగ్రవాద చర్యలను , ఉగ్రవాద చొరబా్ట్లను అరికడుతూ , జాతీయ విపత్తుల్లో సహాయ సహకారాలు అందించడం , రక్షణ చర్యలు చేపట్టడము , శాంతి భద్రతల పర్యవేక్షణలో సాయపడడము వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాయి .

1990 ఆరంభము లో చొరబాటులను ఎదుర్కోడానికి సైన్యము తన దళాల్ని పంపేందుకు సంసిద్ధత వ్యక్తము చేయకపోవడముతో భారత ప్రభుత్వము పూర్తిస్థాయి ప్రారామిలటరీ దళాల్ని కాశ్మీరుకు పంపినది . బి.యస్.యఫ్. అంతకుముందెన్నడు చిరబాట్లను అరికట్టే ఆపరేషన్లు నిర్వహించలేదు ... అయితే తదనంతర కాలములో బి.ఎస్.ఎఫ్. తనకు తాను సరిహద్దు దళమం గా మారి ఆయా ప్రదేశాల్లో ఇంటలిజెన్స్ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుంది . ప్రత్యేక పరికరాలు శిక్షణ లేకుండానే మరిన్ని యూనిట్లు కాశ్మీర్ చేరుకున్నాయి .

తొలి మూడేళ్ళలో సరిహద్దు భద్రతాదళం చేపట్టిన కఠిన చర్యల ఫలితం గా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదన్న ఆరోపణల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది . తీవ్రవాదులకు సహకరిస్తున్నారన్న అనుమానం తో నిర్భందితులపై ఒత్తిడి చర్యలు బాగా పెరిగాయి . వెయ్యిమంది చొప్పున్న గల కనీసం 56 బెటాలియన్ల సరిహద్దు భద్రతాదళం కాశ్మీర్ లో మోహరించినది . కాశ్మీర్ లోయలో 39 , దోడా జిల్లాలో 7 దళాలు చిరబాటు నియంత్రణ ఆపరేషన్స్ లో నిమగ్నమై ఉన్నారు . మరో 10 బెటాలియన్లు నియంత్రణ రేఖ వెంబడి నిరంతర నిఘాలో నిమగ్న మై ఉంటారు .
ఉగ్ర వాదులతో జరిపిన పోరాటాల్లో 1990 నుంచి 2010 వరకు దాదాపు 5000 (ఐదు ) వేల మంది తీవవాదులను బి.ఎస్.ఎఫ్ హతమార్చింది . ఇంచుమించు 12 వేల మందిని నిర్బంధించింది . అనేక వేల ఆయుధాల్ని , వందకోట్ల రూపాయిల విలువైన నిషిద్ద వస్తువులను స్వాధీనపరచుకోవడం జరిగింది . 1500 మంది సైనికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు . వీరు మదేశ భద్రతకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరము డిసెంబరు 01 న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డే ని నిర్వహిస్తారు .
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

Sunday, December 12, 2010

జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం , National Fuel Conservation Day


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసెంబర్‌ 14) "జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం" గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం (డిసెంబర్‌ 14): ఆర్థికపరమైన పెరుగుదల, పునర్నిర్మాణ రంగం ముఖ్యంగా ఇంధన రంగంపైనే ఆధారపడి ఉంది. ఈ రం గానికి ప్రత్యేకత కల్పిస్తూ... మొత్తం ప్రణాళిక లో 30 శాతం ఈ రంగానికే కేటాయించబ డింది. ఆర్థికరంగంలో సరళీకృత విధానాల ద్వారా ఇంధనం డిమాండ్‌ అధికమైంది. డి మాండ్‌, సప్లై ల మధ్య సమన్వయం కోసం తీసుకున్న వివిధ రకాల వ్యూహాలతో ఇంధ నాన్ని పరిరక్షించడమే తక్షణ కర్తవ్యంగా మారింది.
ఇంధన వృథా-జాతికి వ్యథ--మనం శ్రమించాలంటే శక్తి అవసరం. ఏ వస్తువు పనిచేయాలన్నా దానికి తగిన ఇంధనం కావాలి. పెట్రోల్లేక పోతే బండి, బస్సూ ఏదీ కదలదు. విద్యుత్తు లేకపోతే టీవీ, మిక్సీ, రిఫ్రిజిరేటరు, మైక్రోవేవ్‌ - ఏవీ పనిచేయవు. ఫ్యూయల్‌ నిల్లయితే(Nil)విమానం నేలమీద కూడా నడవదు. సిలిండర్‌లో గ్యాస్‌ నిండుకుంటే అన్నం, కూరలు కాదు గదా గుక్కెడు కాఫీ కూడా వెచ్చబడవు. పత్రహరితం కరువైతే మొక్కలు వాడిపోతాయి. వాటికదే ఇంధనం లాంటిది. మొత్తానికి ఇంధనం లేకపోతే ''జగమే మాయ, బ్రతుకే లోయ..'' అని పాడుకోవాల్సివస్తుంది. ఇవాళ ''జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం'' కనుక ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతను ఒకసారి గుర్తుచేసు కుందాం.

ఇంధనాలను సంరక్షించుకోవాల్సిన, పొదుపు చేయాల్సిన బాధ్యత మనందరిమీదా వుంది. అసలు వ్యర్థమైన ఖర్చులను ఎవరూ, ఎప్పుడూ ప్రోత్సహించరు. అందుకే ''అడవి కాచిన వెన్నెల'', ''బూడిదలో పోసిన పన్నీరు'' లాంటి సామెతలు పుట్టుకొచ్చాయి. ఈ సామెతలు వృథా అయిపోవడాన్ని మాత్రమే సూచిస్తున్నాయి. ఇంధనాలను కనుక దుబారా చేస్తే డబ్బు దండగే కాకుండా అవి ఇంకెందరికో దొరక్కుండాపోయే అవకాశం వుంది. ఇవి అమూల్యమైనవి. ఇంధన వనరులు తక్కువ కనుక ఆచితూచి, ఆలోచించి ఉపయోగించడం విజ్ఞత అనిపించు కుంటుంది. చిన్నతనంలో ''డబ్బును దుబారా చేయొద్దు, నీళ్ళలా ఖర్చుపెట్టొద్దంటూ'' పెద్దలు జాగ్రత్తలు నేర్పిస్తారు. పొదుపుకు సంబంధించి మర్యాద రామన్నతో సహా అసంఖ్యాకమైన నీతి కథలు పుట్టుకొచ్చాయి. డబ్బే కాదు, నీళ్ళయినా జాగ్రత్తగానే వాడాలి. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో వాడుకోడానికి, తాగడానికి నీళ్ళు లేక అవస్త పడ్తున్నవాళ్ళెందరో! కనుక, పొదుపు చేయడం అనే కళ తెలిస్తే మనకూ మంచిది, తోటివారికీ మంచిది.

ఇంధనాన్ని పొదుపు చేయమని చాటి చెప్పడానికే డిసెంబర్‌ 14వ తేదీని జాతీయ ఇంధన పొదుపు దినోత్సవంగా గుర్తించి, ఇంధన పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎనర్జీ కన్‌సర్వేషన్‌ అంశంపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. 2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి ఎనర్జీ మ్యానేజర్లు, ఆడిటర్లను ఎవరో ఒకర్ని నియమించకూడదు. ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, ప్రోజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్సింగ్‌, ఇంప్లిమెంటేషన్లలో నిపుణులైనవారిని, క్వాలిఫైడ్‌ ప్రొఫెషనల్స్‌ను ఆయా ఉద్యోగాలకు నియమించాలి. ఇలా చేయడంవల్ల ఇంధనం దుబారా కాదు, సంస్థలూ నష్టపోవు.

ఇంతకీ ఇంధన పొదుపు అంటే వీలైనంత తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తూ యథావిధిగా పని కొనసాగేలా చూడటమే! ఎక్కడా ఇంధనం వృథా కాకుండా జాగ్రత్తపడాలి. సమర్థతను బట్టి తక్కువ ఇంధనంతో పని పూర్తి చేయొచ్చని ఎందరో రుజువు చేసి చూపుతున్నారు. ఎక్కువమందితో తక్కువ పని రాబట్టడం కంటే తక్కువమందితో ఎక్కువ పని రాబట్టడం ఉత్తమ పద్ధతి. పది వేల చొప్పున జీతం చెల్లిస్తూ పదిమందిని తీసుకోవడం కంటే రెట్టింపు జీతంతో ఇద్దరు పనిమంతులను నియమించుకోవడం తెలివైన పని. అవసరమైనచోట మ్యాన్‌పవర్‌ ముఖ్యమే. చేతినిండా పని లేకపోతే మొత్తం వాతావరణమే కాలుష్యం అవుతుంది. జీతం తక్కువ అనే అసంతృప్తితో నానా రాజకీయాలూ, అరాచకమూ సృష్టించే అవకాశం వుంది. నిజాయితీగా చెప్పుకుంటే అంతమందికి ఫాన్లు, లైట్లు, ఎకామిడేషనూ, గట్రా అంతా దండగే అంటున్నాయి అనేక సంస్థలు. ఎక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఎక్కువ పని చేయడానికి ఉద్యోగులు రొష్టుపడరు. వాళ్ళకు అనవసరమైన న్యూసెన్స్‌ క్రియేట్‌ చేసేంత తీరిక, ఓపిక వుండవు. మరి, ''కొందరికి పని దొరకదు, నిరుద్యోగులుగా మిగుల్తారు'' అనే మాట హాస్యాస్పదం. ఇవాళ ఒక కొత్త సంస్థ వెలిసి, అందులో వందమందికి ఉద్యోగావకాశం వచ్చిందనుకుందాం. ఆ సంస్థ లేకముందు వాళ్ళకి ఉద్యోగమే లేదా? ఒకవేళ ఆ కొత్తగా వచ్చిన సంస్థ మూతపడితే మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం వుండదా?! కనుక, పని చేయాలనే తపన, చేసే నైపుణ్యం వుంటే ఎక్కడో ఒకచోట దొరికితీరుతుంది.

సరే, అసలు విషయానికొస్తే, ఫాక్టరీల్లో వీలైనంతగా ఇంధనాన్ని పొదుపుచేస్తూ, ఉత్పాదన పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అనేక సంస్థలు నష్టాల్లో ఉన్నాయంటే, ఏకంగా మూత పడ్తున్నాయంటే ఇంధన దుర్వినియోగం, ఎక్కువైన సిబ్బం దే ప్రధాన కారణం. ఖర్చు విష యంలో సరైన ప్రణాళిక లేకపో వడం, ఇంధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టడం అనేది పెద్ద డ్రాబ్యాక్‌. ఒక్క ఫాక్టరీలనే కాదు, మనచుట్టూ ఎందరో పెట్రోల్‌ వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తుంటారు. ముఖ్యంగా ప్రభు త్వ రంగ సంస్థల్లో ఈ దుబారా మరీ ఎక్కువ. ప్రభుత్వ కార్యాలయాల్లో వందమంది చేసే పనిని ప్రైవేట్‌ ఆఫీసుల్లో పదిమంది ఇట్టే పూర్తిచేస్తారంటే అతిశయోక్తి కాదు. ఇది ఇంధనానికీ వర్తిస్తుంది. దూర ప్రయాణం వెళ్ళే ఆర్టీసీ బస్సులు కొన్నిసార్లు సగం సీట్లు కూడా నిండకుండానే ప్రయాణిస్తుం టాయి. ఎంత డీజిల్‌ దండగ? పావుగంట, పది నిమిషాలు, అర్ధగంట సమయం తేడాతో బస్సులు వెళ్తుంటాయి కదా! బస్సు నిండని పక్షంలో ఇటువారిని అటు సర్దితే ఎంత ఇంధనం సేవ్‌ అవుతుంది?! ఎటూ ట్రాఫిక్‌ జామ్‌ లేదా సాంకేతిక కారణాలతో ఎన్నోసార్లు బస్సులు రెండు మూడు గంటలు ఆలస్యంగానే వెళ్తాయి. అలాంటప్పుడు ఈపాటి ఎడ్జస్ట్‌మెంట్‌ అంత కష్టమైన విషయమా? ఇక నిత్యం రోడ్లమీద బస్సులు, ఇతర వాహనాలు సిగ్నల్‌ పాయింట్ల వద్ద, ఇతరత్రా ఆగినప్పుడు కూడా ఇంజన్‌ ఆఫ్‌ చేయకపోవడం చూస్తుంటాం. దానివల్ల ఎంత డీజిల్‌ లేదా పెట్రోల్‌ దండగ? పైగా అదనపు పొల్యూషన్‌. ఇళ్ళల్లోనూ ఎంతో గ్యాస్‌ వేస్టవుతుంటుంది. మనం గదిలో లేకున్నా ఫాన్లు, లైట్లు, ఏసీ ఆన్‌లో వుంటుంది.

ఇంధనం వృథా అవడానికి మరో ముఖ్య కారణం చవకబారు యంత్రాలు, నైపుణ్యం లేని ఉద్యోగులు. కొంత ఖరీదు ఎక్కువైనప్పటికీ మంచి మెషినరీ అమర్చుకోవడంవల్ల తక్కువ ఇంధనంతో పని పూర్తవుతుంది. అలాగే స్కిల్స్‌ లేని ఉద్యోగులవల్ల లేదా పనిధ్యాస లేనివారి కారణంగా అనేకసార్లు ఇంధనం వ్యర్థమౌతుంది. కనుక తాడు చాల్లేదని నుయ్యి పూడ్చుకున్న చందంగా తక్కువ ఖర్చుతో పనైపోతుంది కదాని కక్కుర్తి పడినట్లయితే ఆనక తడిసి మోపెడు ఖర్చవుతుంది.

ఇంధనాలు అమూల్యమైనవి. ఆ వనరులను కాపాడుకోవడం మన బాధ్యత. వృథా చేసినందువల్ల అటు డబ్బు దండగ, ఇటు ఇంధనానికే షార్టేజ్‌ వచ్చే ప్రమాదం. ఈ రెండింటిని మించిన మరో జటిల సమస్య పొంచి వుంది. అదే వాతావరణ కాలుష్యం. ఇంధనాలను అతిగా ఖర్చుపెట్టడంవల్ల మొక్కలు, జంతువులు, ఇతర సహజ వనరులన్నీ దెబ్బతింటాయి. చెట్లు, జంతువులే లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. నదీనదాలు ఎండిపోవడం, ఓజోన్‌ పొరకు మరింత చిల్లులు పడటం లాంటి అనర్థాలతో కష్టాల ఊబిలో కూరుకుపోయి నట్లవుతుంది మన పని. వాతావరణ కాలుష్యం అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, మితిమీరిన ఎండలు లాంటి ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ కారణమౌతుంది. కనుక, ఎలా చూసినా ఇంధనాన్ని పొదుపు చేయడం మన కనీస కర్తవ్యం.

1991 డిసెంబర్‌ 14న జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంధనం పొదుపు చేయడంలో చాతుర్యం చూపిన సంస్థలను ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేశారు. అప్పట్నుంచీ ఏటా పుర స్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ పవర్‌ తరపున జాతీయ గుర్తిం పును ఇవ్వాలనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్‌ యూనిట్లకు, హోటళ్ళకు, ఆసుపత్రి భవనాలకు, కార్యాలయాలకు, షాపింగ్‌ మాల్‌ బిల్డింగులకు, జోనల్‌ రైల్వే, రాష్ట్ర సంబంధ ఏజెన్సీలు, మున్సిపాలిటీలు, థర్మల్‌ పవర్‌ స్టేషన్లు - ఇలా కుటీర పరిశ్రమలతో సహా అనేక సంస్థలకు అవార్డులు ఇస్తున్నారు. ఆయా ఆర్గనైజేషన్లు తమ లాభం పొందుతూనే, సమాజానికి సేవలు అందిస్తూనే, ఇంధనాన్ని ఎంత వరకూ పొదుపు చేస్తున్నాయి, వాతారణాన్ని ఎలా సంరక్షిస్తున్నాయి అనే అంశాలను దృష్టిలో వుంచుకుని బహుమతులను నిర్ణయిస్తారు. ఈ ప్రత్యేక దినాన ఇంధ నాన్ని పొదుపు చేయడానికి మనమూ సంసిద్దమౌదాం
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

Saturday, December 11, 2010

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం, International Anti-Corruption Day

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసెంబర్‌ 9న..) -అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

సమాజంలో అణువణువునా అవినీతి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అవినీతి, అధికారం ఒేక నాణేనికి రెండు ముఖాలుగా మారిపోయారుు.అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని ఉరి తీసినా, చైనాలో అవినీతిని అడ్డుకోలేక పోయారు.

భారతదేశంలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రతీఏటా రూ.10లక్షల కోట్లు, రోజుకు రూ.2,750కోట్లు, గంటకు రూ.115కోట్లు, నిముషానికి రూ.1.80కోట్లు ఖర్చు పెడుతున్నారు. సుమారు తొమ్మిదికోట్ల మంది నిరుద్యోగులున్నారు. ఎనిమిదికోట్లు మంది పాఠశాలలకు దూరంగా ఉన్నారు. 35కోట్లుమంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. 52కోట్ల మందికి రక్షిత మంచినీరే లేదు. మరెందరికో మరుగుదొడ్లు సౌకర్యం లేనేలేదు. మరి మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్న సొమ్ము ఏమవుతుంది? ఇదే సామాన్యుడ్ని తొలుస్తున్న ప్రశ్న. ఎక్కడ చూసినా అవినీతి. ఏ పధకం ఊసెత్తినా అవినీతే. ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా అవినీతివరదే. ఎయిడ్స్‌ మహమ్మారీకన్నా ఎక్కువగా అదుపులేని పెనుభూతంగా మారి అభివృద్దికి అడ్డుగోలు అవుతుంది. చైనాతో పోలిస్తే అభివృద్దిలో వెనుకంజ వేస్తూ అవినీతిలో మనదేశం ముందుంది. 2007లో ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌ఫరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ సెంటర్‌ ఫర్‌ మీడియా స్పడీస్‌ (సిఎంఎస్‌) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో 11 ప్రజాసేవ అంశాల్లో ఏదో ఒకదానిని పొందేందుకు మూడువంతులు మంది నిరుపేదలు ఏడాది పరిధిలో రూ.900కోట్లు లంచాలుగా చెల్లించినట్లు తేలింది. 2003 అక్టోబర్‌ 31న అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్‌ తరువాత డిసెంబర్‌9న అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.యూరప్‌లోని కొన్ని దేశాల్లో అవినీతి అతి తక్కువ స్థాయిలో ఉండగా, ఆఫ్రికాదేశాల్లో అవినీతి తారస్థాయిలో ఉంది.
అవినీతిని అంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై ఐక్యరాజ్యసమితి చారిత్రాత్మక పత్రాన్ని డిసెంబర్‌ 9న రూపొందించింది. దీంతో ప్రతీఏటా అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు.

అవినీతి ప్రభావం
అవినీతి కారణంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారుతాయి. దారిద్య్రం, వివిధ రంగాల్లో అస్థిరత పెరిగిపోతాయి. అంతిమంగా అది మౌలిక వసతుల వైఫల్యానికి, రాజ్య వైఫల్యానికి దారి తీస్తుంది. ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థలు, ఎన్జీవోలు, మీడియా, వ్యక్తులు కలసికట్టుగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకోవాల్సి ఉంది. అవినీతి వల్ల మానవ హక్కుల ఉల్లంఘనలు, మార్కెట్‌ అనిశ్చితి, జీవన ప్రమాణాల నాణ్యంలో క్షీణత లాంటివి చోటు చేసుకుంటాయి. వ్యవస్థీకృత నేరాలు పెరిగిపోతాయి.

అవినీతిని అరికట్టగలిగే మార్గాలు(నిరోధించడమెలా?)--
కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం, హక్కుల కమిషన్లను ఆశ్రయించడం, ఇంటర్నెట్‌, టీవీ, ప్రింట్‌ మీడియాను ఆశ్రయించడం, సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరడం వంటి వాటి ద్వారా అవినీతిని కొంతమేరకైనా తగ్గించవచ్చు. యాంటీ కరెప్షన్‌ సంస్థలు ఏర్పాటు చేయడం, రాజకీయ పక్షాలకు నిధులు అందించడం లో, పాలనావ్యవహారాల్లో పారదర్శకత పెంచడం, ప్రతిభ, సామర్థ్యం లాంటి అంశాల కారణంగా నియామకాలు, ప్రమోషన్లు చేపట్టడం లాంటి చర్యలు తీసుకోవాలని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లావా దేవీలను గుర్తించడం, వివిధ దేశాలు పరస్పరం సహకరించు కోవడం, అన్ని రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం లాంటి వాటి ద్వారా అవినీతిని కొంతమేరకు తగ్గించవచ్చు.

ఎన్నికల రాజకీయ వ్యవస్థలో అవినీతి తొలగించేందుకు సంస్కరణలు చేపట్టాలి. ప్రతీ కార్యాలయంలో సేవల వివరాలు అవి పొందే విధి విధానాలు ఏ పని ఎన్నిరోజుల్లో చేస్తారో వివరించే ఫిజికల్‌ చార్టర్‌లు చాలా శాఖల్లో ప్రకటించారు. వీటిని సక్రమంగా అమలుజరిగేలా కార్యాచరణ ఉండాలి. పారదర్శకతకోసం సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం ప్రజలకు తెలుసుకునే వీలు కలిగింది. దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే అవినీతి దూరమవుతుంది. కేంద్రీకృత పాలన అవినీతికి మూలమైంది. దీనికి విరుగుడుగా అధికార వికేంద్రీకరణ జరగాల్సి ఉంది. జవాబుదారీతనంతో స్థానిక ప్రభుత్వాలు సాధించాలి. మనదేశాన్ని మనమే రక్షించుకునే దిశగా ప్రతీఒక్కరూ అవినీతికి వ్యతిరేకంగా ప్రతిన బూనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
---
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ (సి.వి.సి.) గురువారం ఒక కొత్త వెబ్‌సైట్‌ 'విజ్‌ ఐ'ని ప్రారంభించారు. పౌరులె వరైనా అవినీతికి సంబంధించిన వీడియోలు లేదా ఆడియోలను నేరుగా తమ మొబైల్‌నుంచి ఈ వెబ్‌సైట్‌కు అప్‌లోడ్‌ చేయవచ్చు. ఇకనుంచి ఎవరైనా సరే అవినీతిపై కత్తి ఝుళిపించవచ్చు. చేయవలసిందల్లా... ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నారని తెలిస్తే వెంటనే రంగంలోకి దిగి మొబైల్‌ సహాయంతో సాక్ష్యాధారాలు సేకరించాలి. సివిసి వెబ్‌సైట్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్‌ సివిసి డాట్‌ ఎన్‌ఐసి డాట్‌ ఇన్‌ ఓపెన్‌ చేసి మొబైల్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం ఆడియోలు కాని వీడాయోలు కాని అప్‌లోడ్‌ చేయడం ప్రారంభించాలి. వాటిని తదుపరి విచారణకు కమిషన్‌ పరిశీలిస్తుంది. ప్రత్యామ్నాయంగా ఎవరైనా వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు లేదా 9223174440కు ఎస్‌.ఎమ్‌.ఎస్‌. చేయవచ్చు. అవినీతిపై ఫిర్యాదు చేయడానికి పౌరులకు ఈ వెబ్‌సైట్‌ చక్కగా ఉపయోగపడుతుందని సి.వి.సి. పి.జె. థామస్‌ చెప్పారు. పౌరుల నుంచి ఫిర్యాదులు అందుకునేందుకు ఈ వెబ్‌సైట్‌ ఒక పోస్టాఫీసులా పని చేస్తుందని మాజీ సి.వి.సి. ఎన్‌. విఠల్‌ చెప్పారు. అయితే సి.వి.సి. మాత్రం కేవలం ఫిర్యాదులు సేకరించడానికే పరిమితం కాకుండా అవినీతి ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు ఆదేశించే అధికారాలు కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు.

భారత్‌లో అవినీతి
స్వతంత్ర భారతంలో ఉన్నతస్థాయి అవినీతికి బీజాలు 1948లో పడ్డాయి. నాటి జీపుల స్కామ్‌లో వి.కె కృష్ణమీనన్‌ పేరు విన్పించింది.

ఇదీ మన స్థానం.. ప్రస్థానం
దక్షిణాసియాలోనే గాకుండా యావత్‌ ప్రపంచంలోనూ అవినీతి బాగా ప్రబలిన దే శాల్లో భారత్‌ ఒకటి. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ అధ్యయనం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో పని నిమిత్తం 75 శాతం ప్రజానీకం ంచాలు చెల్లించుకోవల్సి వచ్చింది. 2010కి పారదర్శకతకు సంబంధించి సంస్థ రూపొందించిన జాబితాలో మన ర్యాంకు171. కింది నుంచి 20వ స్థానం. భారత ఎంపీలు 540 మందిలో నాలుగోవంతు మంది క్రిమినల్‌ ఛార్జీలు ఎదుర్కొంటున్నట్లు 2008లో వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. మనుష్యులను అక్రమం గా తరలించడం, ఇమ్మి గ్రేషన్‌ నిబంధనల ఉల్లంఘ న, రేప్‌, హత్య లాంటి ఆరోపణలు కూడా వీటిలో ఉన్నాయి. 1948 నుంచి 2008 నాటికి దేశం నుం చి రూ. 20 లక్షల కోట్ల మేరకు డబ్బు అక్రమంగా విదేశాలకు చేరుకున్నట్లు ఓ అంచనా.
1950-80 మధ్యకాలం దాకా దేశంలో సోష లిజం ప్రభావిత విధానాలు అమల్లో ఉన్నాయి.

ని యంత్రణలు, రక్షణాత్మక విధానాలు, ప్రభుత్వ యాజమాన్యం అధికంగా ఉండేవి. ఇవన్నీ కూడా వ్యవస్థల్లో లొసుగుల అన్వేషణకు దారి తీశాయి. లైసెన్స్‌ రాజ్‌ వ్యవస్థ అవినీతికి ఊతమిచ్చింది. ఆ తరువాత వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు అవి నీతిని వ్యవస్థీకృతం చేసేందుకు దోహదపడ్డాయి. నేరగాళ్ళు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల మధ్య అనుబంధం బలపడింది. 1993 అక్టోబర్‌లో కేంద్ర మాజీ హోమ్‌ శాఖ కార్యదర్శి ఎన్‌.ఎన్‌ ఓహ్రా ఇచ్చిన నివేదికలో ఈ విషయం మరింత స్పష్టమైంది. అప్రచురితంగా ఉన్న ఈ నివేదిక అనుబంధాల్లో మరెంతో కీలక సమాచారం ఉన్నట్లు భావిస్తున్నారు.
కొన్నేళ్ళ క్రితం బీహార్‌లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఆహారంలో 80 శాతాన్ని అధికారులు కొల్లగొట్టారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యవస్థీకృత మాఫియా రాజ్యమేలుతోంది.

టెండర్లలో గోల్‌మాల్‌
టెండర్ల(tenders) దాఖలు, పనులు చేయడంలో కొంతమంది కాంట్రా క్టర్లదే ఇష్టారాజ్యంగా మారింది. చేపట్టిన పనుల్లో నాణ్యం సరిచూ డడంలో నిర్లక్ష్యం చోటు చేసుకుం టోంది. ఈ మొత్తం వ్యవహారంలో పాలకులు, అధి కారులు, కాంట్రాక్టుర్లు చేతులు కలుపుతున్నారు. ఫలితంగా రోడ్లు, ఆనకట్టలు లాంటి వాటిలో పెను అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.

వైద్యంలో...(health)--
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి అధికమైపోయింది. మందులు దొరక్కపోవడం మొదలుకొని అడ్మి షన్‌కు, మెరుగైన చికిత్సకు, రోగ నిర్ధారణ పరీక్షలకు లంచాలు ఇవ్వకతప్పని పరిస్థితి. బిడ్డ పుట్టినా, రోగి చచ్చినా ముడుపులు చెల్లించాల్సిందే. బీమా సంస్థలకు, ప్రయివేటు ఆసుపత్రులకు, ప్రభుత్వ సిబ్బందికి ఉన్న అవినీతి బంధం అందరికీ తెలిసిందే.

రవాణారంగం..
అవినీతికి మారుపేరుగా ఆర్టీఏ ను, ట్రాఫిక్‌ విభాగాన్ని చెబుతుం టారు. డ్రైవింగ్‌ లైసెన్సులు, పర్మి ట్లు, రవాణా, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన లాంటి అంశాల్లో అవినీతికి బాగా ఆస్కా రముంది. కేరళ లోని తిరువనంతపురం లాంటి విమానాశ్రయాల్లో ప్రయాణికుల విలువైన వస్తువులు తరచూ మాయమవుతుంటాయి.

ఆదాయపు పన్ను శాఖలో...(Income-Tax-Department-India)--
పన్ను చెల్లింపు లావాదేవీల్లో అనుకూలంగా వ్యవహరిం చేందు కు లంచాలు తీసుకుంటూ పటు ్టబడ్డ సిబ్బందికి లెక్కలేదు.

గనులు...
భారత్‌లోని గనుల్లో తవ్వితే బయటపడేది ఖనిజాలు కాదని, అవినీతి అని పలువురు విమర్శి స్తుంటారు.

న్యాయవిభాగంలో...(law)--
న్యాయవిభాగంలో అవినీతి ఇటీవలి కాలంలో అధికంగా వార్తల్లోకి ఎక్కు తోంది. ఒక న్యాయమూర్తిపై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే వరకూ వ్యవహారం వెళ్లింది. న్యాయ మూర్తులను ప్రలోభ పరిచే యత్నాలు జోరందుకున్నాయి. కేంద్రమంత్రి ఒకరు కూడా ఈ వివాదంలో చిక్కుకున్నారు.

సైనికదళాల విభాగంలో...
త్రివిధదళాల అధికారు లెందరో అవినీతికి పాల్పడ ినట్లు ఆరోపణలు వచ్చాయి. రక్షణ రహస్యాలను విక్ర యించే వారు కొందరైతే, ఆయా ఉపకరణాలను నల్లబ జారుకు తరలించిన వారు మరికొందరు. తుపాకులు, క్షిపణులు, విమానాల కొనుగోలులోనూ అక్రమాలు చోటు చేసుకున్న ఉదంతాలున్నాయి. భోఫోర్స్‌లాంటి వాటిని ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

పోలీసు వ్యవస్థలో...
వ్యక్తి నుంచి డబ్బులు తీసు కొని ప్రత్యర్థి ముఠా నేతల ను ఎన్‌కౌం టర్‌ చేయడం మొదలుకొని తప్పుడు కేసులు బనాయించడం వరకూ ఎన్నో రకాలుగా పోలీసు వ్యవస్థలో అవినీతి చోటు చేసుకుంది.

ఆధ్యాత్మిక వ్యవహారాల్లో...
ఉత్తర భారతదేశంలో కొన్ని చర్చ్‌ల వ్యవహారాల్లో అక్రమా లు చోటు చేసుకున్నాయని కొంత మంది చర్చ్‌ నాయకులే ఆందోళన వ్యక్తం చేశారు. బాప్తిజం సర్టిఫి కెట్లను అమ్ము కుంటున్న ఉదంతాలు కోకొల్లలు. హిందూ, ముస్లిం ధార్మిక వ్యవహారాల్లోనూ ఇలాంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దానధర్మాలుగా ఇచ్చిన భూము లు, ఇతర ఆస్తులు చేతులు మారుతున్నాయి.

కొత్త వ్యవస్థల రూపకల్పన
అవినీతికి కళ్ళెం వేసేందుకు నూతన విభాగాల,వ్యవస్థల ఏర్పా టు యత్నాలు కూడా దేశంలో జరి గాయి. కేంద్ర, రాష్టస్థ్రాయిలో అవినీతి నిరోధక విభాగాల ఏర్పా టు, లోకాయుక్త, అంబుడ్స్‌ మన్‌ వ్యవస్థలు, సమాచారహక్కు చట్టం లాంటివి ఇలాంటివే.

ఎన్‌జీవోల పాత్ర...
అవినీతిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు ప్రభుత్వేతర సంస్థలు కృషి చేస్తున్నాయి. ఫిఫ్త్‌ పిల్లర్‌ అనే సంస్థ జీరో రూపీ నోట్లను జారీ చేసింది. ఎవరైనా లంచం అడిగితే వీటిని ఇవ్వాల్సిందిగా సూచించింది. లంచం తీసుకోవడం నేరం అనే హెచ్చరిక ఆ నోట్లపై ఉంటుంది. టాటా గ్రూప్‌ చేపట్టిన జాగో రే కార్యక్రమానికి కూడా మంచి స్పందన లభించింది. అందులో పది లక్షల ఓట్లు పోలయ్యాయి.
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

National Law Day , జాతీయ న్యాయ దినోత్సవం


  • ప్రతి సంవత్సరము నవంబర్ 26 న జరుపు కుంటారు .
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబర్ 26 న )National Law Day(జాతీయ న్యాయ దినోత్సవం) గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

మన దేశము లో ప్రతి ఏటా నవంబర్ 26 న " నేషనల్ లా డే " నిర్వహిస్తారు . 1979 లో నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ రొజున న్యాయ దినోత్సవం నిర్వహించాలని ప్రకటించారు . 1949 లో భారత రాజ్యాంగ కమిటి, రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది . కమిటీ సభ్యులు 1949 నవంబరు 26 వ తీదీన తొలి ముసాయిదా ప్రతుల పై సంతకాలు చేశారు . అది 1950 జనవరి 26 వ తీదీ నుంచి అమల్లోకి వచ్చింది . రాజ్యాంగ మౌలిక లక్ష్యం -- సామాజిక , ఆర్ధిక , రాజకీయ న్యాయాన్ని అందరరికీ అంచించడం . ఈ లక్ష్యము ప్రజల హక్కులకు రూపాన్ని ఇచ్చింది . ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిరక్షించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి గల , సమర్ధవంతమైన న్యాయాన్ని ఇవ్వగల వ్యవస్థ అవసరము . చట్టము ముందు సమాన పరిగణన , వ్యక్తిగత స్వేచ్చ వంటి అంశాల అధ్యయనము ద్వారా బారతీయ న్యాయవ్యవస్థ కీలక సామాజిక పాత్రను బలోపేతము చేయడం జరిగినది .

ముఖ్యముగా గత మూడు దశాబ్దాలలో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్‌ (పి.ఐ.యల్) ఉద్యమ వికాసము తర్వాత ఇది మరింతగా బలపడింది . హక్కుల అవగాహనను వివిధ దశల్లో విసృత పరిచారు . ప్రాధమిక హక్కులకు పెద్దపీట వేశారు . వీటన్నింటికీ రక్షణ న్యాయవవస్థ . . . కాబట్టి రాజ్యాంగ ముసాయిదా సంతకాల రోజును జాతీయ న్యాయదినోత్సవాన్ని జరపడానికి ఎంచుకున్నారు . ఈ దినోత్సవము నాడు న్యాయవాదులు సమావేశమై ప్రతిజ్ఞ చేస్తారు . చట్టము ముందు అందరూ సమానమేనని తెలిలజేయడం , సత్వర న్యాయము కోసము కృషిచేయడం .. న్యాయదినోత్సవ ధ్యేయాలు . ప్రభుత్వాలు చట్టాలు ప్రజా వ్యతిరేకముగా ఉన్నా, రాజ్యాంగాన్ని అతిక్రమించేవిగా ఉన్నా అవి చెల్లవని చెప్పే అధికారము రాజ్యాంగ ధర్మాసనాలకు ఉన్నది .. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పులకు కూడా చట్ట హోదా ఉంటుంది .

2008 నాటికి 1.8 కోట్ల కేసులు కోర్టుల ముందు పెండింగ్ లో ఉన్నట్లు అంచనా . కొన్నేళ్ళుగా పెండింగ్ కేసుల పెరుగుదల స్థిరము గా కొనసాగుతున్నది . 2008 లో 14,000 మంది న్యాయమూర్తులు 1.7 కోట్ల కేసుల్ని పరిష్కరించారు . సగటున ఒక్కోన్యాయమూర్తికి ఏటా 1200 కేసులు చొప్పున పరిష్కరించగలరన్నమాట. కేసుల నమోదు రేటు రాను రాను పెరుగుతుంది . మనదేశము లో న్యాయమూర్తుల కొరత ఉన్నందున కేసుల పరిష్కారము సత్వరము జరుగుటలేదు . కేసు పరిష్కారానికి చాలా కాల వ్యవధి పడుతున్నది . న్యాయము అందడము లో జాప్యము జరుగుతుందన్న కారణముగా చాలా మంది కోర్టుల్ని ఆశ్రయించడానికి సందేహిస్తుంటారు . అయితే న్యాయవాద వృత్తిలో ఉన్న వారంతా చట్టబద్దము గా సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరము ఉన్నది . ఈ మేరకు ప్రజల్లో విశ్వాసము పెంపొందించగలగాలి . ఆప్పుడే న్యాయ పరిరక్షణ సంపూరణము కాగలదు ... న్యాయదినోత్సవం నిర్వహణ ప్రక్రియ ఫలవంతంగా ఉండగలదు .
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

Friday, December 10, 2010

World Milk Day , ప్రపంచ పాలదినోత్సవం

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (జూన్ 01‌ ) ప్రపంచ పాలదినోత్సవం గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
  • ప్రపంచ పాలదినోత్సవం ప్రతి సంవత్సరము జూన్‌ 01 వ తేదీన జరుపుకుంటారు .
మిల్క్ డే ని అధికారికంగా జరపడం ఆరంభించి 10 సంవత్సరాలు అయింది . ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O)మానవ ఆరోగ్యములో పాలకున్న ప్రాధాన్యతను ప్రజలందరూ అర్ధము చేసుకోవాలనే లక్ష్యము తో ఈ " వరల్డ్ మిల్క్ డే " ని 2001 సం. లో శ్రీకారము చుట్టింది . అయితే అంతము ముందు అనేక దశాబ్దాల క్రితమే ప్రైవేటు సంస్థలు మిల్క్ డే ని జరుపుతుండేవి . అవి ఆయా దేశాఅలలో భిన్న తేదీలలో జరుగు తుండేవి . కొన్ని దేశాలలో జనవరి 01 న , కొన్ని దేశాలలో ఆగష్టు , సెప్టెంబరు నెలలో జరిగేవి . ఆ ప్రైవేటు సంస్థలు తమ అమ్మకాలులను పెంచుకునేందుకు పాల దినోత్సవాలను జరిపేవి .

కుటుంబాలకు అవసరమైన పాలకోసము ఎవరి ఇంట్లో వారే గేదెలను ,ఆవులను పెంచుకునే రోజులనుండి పశువుల పెంపకము , పాల ఉత్పత్తి , ఒక వృత్తిగా మారింది . అది నేటికీ భారతదేశము లో కొనసాగుతుంది . ప్రతిరోజూ " పాలండీ అమ్మగారు " అంటూ ఇంటిల్లి పాదిని నిద్రలేపే సన్నివేశము మనందరికీ తెలిసినదే . అలా ఇంటిముందు కొలిచి పాలను ఇవ్వడం వల్ల అనారోగ్యము వస్తుందని ... అందుకని పరిశుద్దమైన పరిసరాలలో పాలు పితికి , సీసాలో పోసి సరఫరా చేయాలనే ఉద్దేశ్యముతో స్వీడన్‌ లో మొదట సారిగా పాల వ్యాపారము మొదలైనది . 1878 లో అలా " మిల్క్ బాటిల్ " అనే ఆలోచన వచ్చి నది . ఆ మిల్క్ బాటిల్ నే తొలిగా సరఫరా చేసిన రోజునే ఆ సంస్థ " మిల్క్ డే " గా జరపటం మొదలు పెట్టింది . అలా ప్రతి దేశములో ఒక కొత్త కంపెనీ తమ వ్యాపార ఓపినింగ్ డే ని మిల్క్ డే గా ప్రకటించాయి . అటువంటి కంపెనీల రికార్డులన్ని పరిశీలించి జూన్‌ 01 న " మిల్క్ బాటిల్ " అందించినట్లు గా గుర్తించారు . ఆ తేదీనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) ఖరారు చేసింది . అలా గ్లాస్ బాటిల్ పాలు సరఫరా మొదలై ఇప్పుడు పాలిథీన్‌ కవర్లలోకి మారినది . మిల్క్ బాటిల్ స్థానము లో మిల్క్ ప్యాకెట్స్ రావడం మొదలైనది .

పాలకున్న ప్రాముఖ్యత ప్రత్యేకముగా చెప్పనక్కరలేదు . మనిషి తొలి ఆహారము తల్లిపాలు . భవిష్యత్తులో పిల్ల ఆరోగ్యమంతా తల్లి అందించే చనుపాలమీదే ఆధారపది ఉంటుంది . ఒక వయసు తర్వాత ఆవు , గేదె పాలు తాగడం మొదలు పెడతారు . తిరిగి వయసు మల్లి జీర్ణశక్తి మందగించిన తరువాత మనిషి ఆధారపడేది పాలమీదే . అనారోగ్యము వచ్చినా , ఆరోగ్యము మెరుగు పడాలన్నా పాలు త్రాగా్ల్సిందే . వయసుతో సంభందము లేకుండా తాగే పానీయము పాలు . ఒక్కోక్క ప్రారంతము లో ఒక్కొక్క జీవి పాలను ప్రజలు ఉపయోగిస్తారు . మన ప్రాంతములో అధికశాతము గేదె , ఆవు పాలను వినియోగిస్తారు . కొన్ని ప్రాంతాలలో మేక , గొర్రె , రాజస్తాన్‌ లొ ఒంటె పాలను , గంగా నదీతీరము ఆవు పాలును , మరికొన్ని ప్రాంతాలలో గుర్రం , గాడిద , ఏనుగు పాలును వాడు తారు .

జీవులలో పాలిచ్చి పిల్లల్ని పెంచేవి క్షీరదాలు ... చుంచెలుక మొదలుకుని ఏనుగు వరకు భిన్న సైజులలో ఆ జీవులుంటాయి . క్షీరదాలలో అత్యున్నత స్థాయికి చేరిన జీవి మనిషి . తల్లి పాలలో మిగిలిన పాలలో లభించని ప్రత్యేక ప్రొటీన్‌ ఉన్నది . దీనిలో లినోలిక్ యాసిడ్ , ఓలిక్ యాసిడ్ లు అధికము . లవణాలు తక్కువ . వీటివలన పసివయసులో మూత్ర పిండాలమీద ఒత్తిడి పడకుండా ఉంటుంది . అయితే ఏ జీవిపాలను కుటుంబాలు తీసుకుంటాయనేది స్థానికము గా అందుబాటు ను బట్టి ఉంటుంది . పాలల్లో అధికంగా ఉండేది కెసిన్‌ ప్రోటీన్‌ మిసెల్లెస్ . దీనిలో కాల్సియం లభిస్తుంది . పొటాసియం , మెగ్నీషియం , సెలీనియం , విటమిన్‌ ' ఎ ' , విటమిన్‌ 12 , విటమిన్‌ ' డి ' కె
' వంటివి పాలలో లభిస్తాయి . పాలు టానిక్ వంటివి . పాలను తాగితే హైపర్ టెన్‌షన్ , రక్తనాళాల జబ్బులు , గుండె జబ్బులు వచ్చే అవకాశము తక్కువ . శరీరము అంతగా లావెక్కదు . జీర్ణ నాళ కాన్స్ ర్ వచ్చే శాతము తక్కువ . పాలు తాగితే కండరాలకు చక్కని రూపము వస్తుంది .
‌పాలలో పాదార్దాల నిష్పత్తి : శాతము -> ప్రతి 100 యం .ఎల్ పాలలో ..........
నీరు ---------------------: 80.
ప్రోటీన్‌--------------------:3.2.
కొవ్వులు -----------------:4.1 ,
కార్బోహైడ్రేట్స్ -------------: 4-5 .,
కొలెస్టిరాల్ ---------------: 8-10 ,
కాల్సియం ---------------: 120 ఐ.యు ,
శక్తి (కాలరీస్)------------: 67 ,

జంతువుల పాలను మనిషి ఉపయోగించడం సుమారు 7000 వేల ఏళ్ళ క్రితమే ఆరంభించాడు . జంతువులను మాంసము కోసమే పెంచడము మొదలు పెట్టిన మానవుడు ఆ తర్వాత ఆ జీవుల పాలను రుచిచూసాడు . అక్కడి నుండి గేదెల పెంపకాన్ని మొదలు పెట్టాడు . ఆరంభములో జంతువుల పాలు జీర్ణము చేసుకోవడం మనిషికి చాలా ఇబ్బంది గానే ఉండేది . పచ్చి పాలను తాగడం లో ఉన్న ఇబ్బందిని అధిగమించేందుకు పాలను వేడి చేయడం , ఇతర రూపాలలోకి మార్చే ప్రయత్నాలు... జరిగాయి . ఆ విధం గా మనిషి తన తొలి ప్రయోగాలను పాలతోనే ప్రారంభించాడు . నేడు మనం ఘనంగా చెప్పుకునే బయో టెక్నాలజీని పాలు తోడువేయడం అనే ప్రక్రియగా మనిషి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రారంభించాడు .

నిత్యజీవితం లో పాలకున్న ప్రాముఖ్యత ప్రత్యేకం గా చెప్పనవసరము లేదు . పాలు , పాలమీద వచ్చే మీగడ , పాల నుంచి తీసే వెన్న , వెన్న కాచగా వచ్చే నెయ్యి , పాలను తోడేస్తే పెరుగు , చిలికితే మజ్జిగ , పాలనుంచి తీసే జున్ను , ఇక పాలను ఉపయోగించి చేసే తీపి పదార్దాలు ... ఇలా పాలతో ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్నీకాదు . పాలను పొడిగామార్చి .. ఉత్పత్తి తక్కువగా ఉండే రోజుల్లొ ఉపయోగించుకునే విధానము వచ్చింది .

మన దేశము అనేక పాల డైరీ లు ... ఆనంద్ డైరీ , సంగం డైరీ , విజయ డైరీ మున్నగునవి గుర్తింపు పొందినవి ఉన్నాయి .
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

Tuesday, December 7, 2010

Homeguards Day , హోంగార్డుల దినోత్సవం


  • ప్రతి సంవత్సరము డిసెంబర్ 06 న జరుపుకుంటారు .
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసెంబర్ 06) హోంగార్డుల దినోత్సవం గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.

ప్రజలకు భద్రత కల్పించేది ఎవరని ఏ విద్యార్ధిక్ని అడిగినా ......... వెంటనే వచ్చే సమాదానము ' పోలీసులు ' అని .. అది నిజమే . అయితే వారి వెన్నంటే ఉంటూ పగలనక్ , రేయనక నిత్యము అందుబాటులో ఉండే హోంగార్డులు అంతగా ఎవరికీ గుర్తుకు రారు . వీరు ఎన్నోరకాల విధులను నిర్వర్తితిస్తూ ప్రజలకు బయట ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటం లో కీలక పాత్ర పోషిస్తున్నారు . ట్రాఫిక్ నియంత్రణ , రాత్రి వేళల్లో పెట్రోలింగ్ , ఎన్నికల సమయం లో వి.ఐ.పి.లు వచ్చినప్పుడు , పండగలు జరిగినప్పుడు , ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు , పభుత్వ , ప్రైవేటు రంగ సంస్థలలో ఉద్యోగులు సమ్మె చేసినపుడు ... ఎక్కువశాతము విధులు నిర్వహించేది వీరే . నామమాత్రపు వేతనాలతో తమ జీవితాలను వలంటీర్లు గా సమాజానికి అంకితం చేస్తున్న హోంగార్డుల దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని కోరుకుందాం.
హోంగార్డుల వ్యవస్థ ఎలా ప్రారంభమైనది ?:
పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకము సన్నగిల్లడము తో అప్పట్లో కేంద్ర హోంమంత్రి గా ఉన్న మొరార్జీదేశాయ్ ప్రత్యామ్నాయ వ్యవస్థ కొసము ఆలోచించారు . సమాజములో చైతన్యవంతులు , విద్యావంతులు , సేవాభావమున్న వారిని ఏకం చేయాలని , వారు పోలీసులకు , ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని సంకల్పించారు . ఆ ప్రయత్నము ఫలించి శాంతిభద్రతల పరిరక్షణకు ఒక బృందము తయారైనది . అలా ఏర్పాటైన వ్యవస్థే " గృహ రక్షక దళ సంస్థ (HomeGuards)" 1946 డెసెంబర్ 06 న దేశము లో ఈ వ్యవస్థ ఆరంభమైనది . 1962 లో చైనా దురాక్రమణ జరిపినప్పుడు అక్కడ ప్రజలను ఆదుకోవడము లో హోంగార్డులు చేసిన కృషి , సేవలను జాతి ఎన్నటికీ మరువదు . అప్పటి నుండి హోంగార్డులు వ్యవస్థ పై గౌరవము పెరిగినది . దీంతో ఈ వ్యవస్థను రాస్ట్రాలలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయము జరిగింది .

సమస్యల మధ్యే విధులు :
రాస్ట్ర ప్రభుత్వము .. పోలీసు , అగ్నిమాపక , సైనిక దళాల్లో పని చేసే వారికి వివిధ పతకాలు , ప్రోత్సాహక్కల్ను క్రమము తప్పకుండా ప్రతి రిపబ్లిక్ దినోత్సవాల్లో అందిస్తోంది . . కానీ హోంగార్డులు ఏళ్ళ తరబడి స్వచ్చంద సేవలా పనిచేస్తున్నా వారికి కనీసము మెచ్చుకోలు కూడా ఉండటం లేదు . తమ గురించి కనీసము ఒక ప్రశంస అయినా విందామని నిరీక్షించే హోంగార్డులకు అడుగడుగునా నిరాశే ఎదురవుతుంది . అలాగే రోజుకు రూ.200 చోప్పున్న ఇవ్వాలని హోంగా్ర్డులు ఏళ్ళ తరబడి డిమాండ్ చేస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు . మరోవైపు పోలీసు అధికాలుల ఇళ్ళలో వంట చేయడము , మార్కెట్ కు వెళ్ళి సామాన్లు కొనుగోలు చేసి తీసుకు రావడం . షాపింగ్ లు , ఊర్లకు వెళ్తే సామానులు మోసుకెళ్ళడము , ఆఫీసర్ల పిల్లలు స్కూల్ కు తీసుకు వెళ్ళి రావడము , ఒళ్ళు నొప్పులుగా ఉంటే ఉన్నతాధికారులకు మసాజ్ చేయడం తదితర పనుల నుంచి తమను తప్పించాలని కోరుతున్నా వాటి నుంచి విముక్తి లభించడము లేదని హోంగార్డులు వాపోతున్నారు . అధికారుల చెప్పిన పనులు చేయక పోతే చేధింపులకు గురిచేస్తారని మరికొందరు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు .

శ్రీకాకుళం జిల్లాలో :
క్రమశిక్షణ , సహనము , సమయస్పూర్తి , నిజాయితీ ముఖ్య లక్షణాలుగా హోంగార్డుల వ్యవస్థ 1966 ఆగస్టు 29 న శ్రీకాకుళం జిల్లాలో ఏర్పడినది . ఆప్పటి కలెక్టర్ శంకరగురుస్వామి , ఎస్పీ కె .రాధాకృష్ణమూర్తి ల అధ్వర్యములో వ్యవస్థను ప్రారంభించారు . మొదటి కమాండెంట్ గా హెచ్ .కిషన్‌ సింగ్ నియమితులయ్యారు . ప్రస్తుతము (2010) 76 మహిళా హోంగార్డులతో పాటు మొత్తము 841 మంది కొనసాగుతున్నారు . ఎంపికైన ప్రారంభములో హోంగార్డులకు బేసిక్ , రిఫ్రెష్ ర్ , లీడర్ షిప్ వంటి అంశాలలో శిక్షణ ఇస్తుంటారు . ప్రస్తుతము వీరికి రోజుకు రూ.130 గౌరవ వేతనము ఇస్తున్నారు .
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

అంతర్జాతీయ స్త్రీ ఆరొగ్య పరిరక్షణ దినము , International Day of Action for Women health


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు May 28) "ఇంటర్నేషనల్ డే ఒఫ్ యాక్షన్‌ ఫర్ ఉమెన్‌ హెల్త్ " గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
ప్రతిసంవత్సరము మే 28 న జరుపుకుంటారు ..............
నెలంతా హుషారుగా , ఆరోగ్యము గా చలాకీగానే ఉండే అనేకానేక మంది మహిళలు నెలలో మూడు నుండి ఏడు రోజులు పాటు మాత్రము ఏదో ఒకరకమైన ఇబ్బంది పెట్టే ఋఉతుక్రమము తో సతమతం అవుతున్నామని అంటుంటారు . ఋఉతుక్రమము లో శారీరక , మానసిక మార్పులు సహజము అని అందరూ గుర్తించాలి . జీవితము లో దైనందిన కార్యక్రమాలలో ఎదురయ్యే ఇబ్బందుల్ని , అనేక అంశాల్ని ఎదుర్కోడానికి , పరిష్కరించుకోవడానికి ఏవిదంగా అన్యితే ప్రయత్నిస్తారో అదేమాదిరి ఋతుక్రమ సమస్యలను ఎదుర్కోని పరిష్కరించు కోవడాన్ని తెలుసుకోవాలి . అలా మూలమూలన , వాడవాడల ఎలా పరిష్కరించుకోవాలో వాటిఅవస్యకత ఏమిటో తెలియజెప్పేందుకే ఈ " ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్‌ ఫర్ ఉమెన్‌ హెల్త్ " ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము .
ఎందుకీ ఋతుక్రమము :
రజస్వల అయినప్పటినుంచి మెనోపాజ్ దశ వరకు నెలనెలా ఋతుస్రావము అయితేనే ఆరోగ్యము . గర్భసంచి లైనింగ్ (ఎండోమెట్రియం ) షెడ్డింగ్ వల్ల ఋతుస్రావము అవుతుంది . ఇది స్త్రీ సెక్ష్ హార్మొన్లు ( ఈస్ట్రోజం , ప్ర్రొజిస్టోన్‌ , లుటినైజింగ్ -యల్.ఎహ్ ) ప్రభావము , అధీనము లో జరుగుతూ ఉంటుంది . అండము విడుదళకు , ఋతుస్రావానికి కారణమవుతుంటాయి . సాధారణం గా ఋతుక్రమము 28 రోజులు ఒకసారి అయి ఋతుస్రావము 3 నుంచి 7 రోజులు అవుతూ ఉంటుంది . ఋతుస్రావము ఎర్రగా ఉన్నా , ముదురు ఎరుపు రంగులో ఉన్నా అలోచించాల్చిన పనిలేదు . ఇక రంగులలో తేడాను బట్టి శరీర ఆరోగ్య స్థితిని అంచనా వేయవలసి ఉంటుంది .
పి.ఎమ్‌.ఎస్. అంటే :
ప్రీ-మెనుస్ట్రువల్ సిండ్రోం అని దీని పూర్తి నామము . కొంతమంది లో ఋతుక్రమము రావడానికి ముందు వంటిలో వేడి , కడుపులో నొప్పి , తలనొప్పి , కండరాల బలహీనత వంటి లక్షణాలు ఉంటాయి . ఈ సమ్యము లో ఒత్తిడి , డిప్రషన్‌ కి లోనవుతారు ... ఈ పరిస్థితినే పి.యం.ఎస్ . అంటారు . ఇది హార్మోనుల సమతుల్యము లేకపోవడము వల్ల కలుగుతుంది . కొంతమందిలో ఈ లక్షణాలు ఋతుక్రమ సమయము లోనూ ఉంటాయి . సుమారు 3 - 4 రోజులు విశ్రాంతి తీసుకొని చిన్నపాటి వైద్యము తీసుకుంటే సరిపోతుంది .
కొంతమంది లో విపరీతమైన నొప్పి ఉంటుంది .. దీనిని " డిస్మెనూరియా " అంటాము .
కొంతమంది లో రక్తస్రావము ఎక్కువ అవుతూ ఉంటుంది . దీనిని " హైపర్ మెట్రేజియా " అంటాము .
కొంతమంది లో అసలు ఋతుస్రావము జరికీ జరగ నట్టే అతి తక్కువ బ్లీదింగ్ అవుతుంది .
వీటికన్నింటికీ తగిన కారణాలు తెలుసుకుని తగిన వైద్యము కోసము మంచి గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి .

గర్భిణీ కాలము లో స్త్రీలు ఎన్నో అనారోగ్యాలకు గురి అవుతూ ఉంటారు . సరియైన సమయము తగు వైద్యము తీసుకోవడం వలన ఆరోగ్యము చెడిఫోకుండా కాపాడుకోగలరు .

బాలింతరాలు బిడ్డలకు పాలు ఇచ్చుటవలన నీరసము , రక్తహీనతకు , లోనవుదురు . మంచి ఆహారము తీసుకోవాలి .

ఋతుక్రమము 45 - 50 సంవత్సరాల వయసు లో ఆగిపోవడానిని మెనోపాజ్ అంటాము . ఈ కాలము లో అనేక రుగ్మతలకు స్త్రీలు లోనవుతూ ఉంటారు .

ఈ విధము గా అనేక దశలలో అనేకానేక రుగ్మతలకు స్త్రీలు గురి అవుతూఉంటారు . ఏ వయసు వారికి ఆ సంభందిత ఆరోగ్య సూచనలు ఇవ్వడం , అవగాహన కల్పించడము , సహాయ సహకారాలు అందించడము మున్నగు పనులు ఈ రోజున వివిద ప్రబుత్వ , స్వచ్చంద సంస్థలు చేపట్టలనే ఉద్దేశము తో ప్రతిసంవత్సరము వుమెన్‌ హెల్త్ డే ని జరుపు కుంటున్నారు .
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

Sunday, December 5, 2010

భారత నౌకాదళ దినోత్సం , Indian Navy Day


ప్రతి సంవత్సరము డిసెంబర్ 04 న భారత నౌకాదళ దినోత్సం , Indian Navy Day -- జరుపుకుంటారు .


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (Dec 04) Indian Navy Day గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

విధి నిర్వహణలోప్రాణాలు కోల్పోయిన నౌకదళ సిబ్బందికి శనివారం ఇక్కడ ఘన నివాళులు అర్పించారు. ఇండో- పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా 1971లో కరాచీ ఓడల రేవులో అనేక మంది భారత నావీ సిబ్బంది ప్రాణాలు విడిచారు. ఆ యుద్ధంలో భారతీయ నావికాదళం చూపించిన తెగువ వల్లే పాక్ ఘోరంగా ఓడిపోయింది. దానికి గుర్తుగా డిసెంబర్ 4న దేశ వ్యాప్తంగా నేవీ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత నౌకాదళం ప్రావీణ్యాలు, సత్తా చాటే విధంగా పలు యుద్ధ విన్యాసాలు ప్రదర్శించారు.నౌకాదళ దినోత్సవంలో తమిళనాడు- పాండీచ్ఛేరి నావల్ ఇన్‌చార్జి రాజీవ్ గిరోత్రా, పలువురు నేవీ రిటైర్డ్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాక్‌పై సాధించిన విజయానికి గుర్తుగా నావీ వీక్‌గా పాటిస్తున్నారు. తమిళనాడులోని మైలాపూర్, కరపక్కంలలోని వృద్ధాశ్రయాల్లో దస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు.

అబ్బురపరిచిన నౌకా విన్యాసాలు--విశాఖపట్నం,

విశాఖ సాగర తీరానికి దాదాపు యాభై నాటికల్‌ మైళ్ల దూరంలో వున్నట్టుండి ఒక్కసారి భీకర శబ్దాలు...శత్రుదేశాల నౌకలను గురిచేసి ఆయుధాలను సంధించిన నావికాదళాలు...ఈ పరిస్థితిని గమనించిన నావికాదళ హెలికాఫ్టర్‌ కూడా అప్రమత్తమైంది. క్షణాల్లో నౌకవైపు దూసుకుపోయింది. నౌకపై దిగీ దిగ్గానే నావికాళ సభ్యులు గుళ్ల వర్షం కురిపించారు. ఇదంతా కళ్లకు కట్టినట్టు నావికాదళ అధికారులు మంగళవారం చూపించారు. నావికా ఉత్సవాల్లో భాగంగా తూర్పు నావికాదళం మంగళవారం 'డేఎట్‌ సీ' కార్యక్రమం నిర్వహించింది. డిసెంబర్‌ 4న నౌకాదళ దినోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతియేటా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతోపాటు, మీడియా ప్రతినిధులను డే ఎట్‌ సీ కు తీసుకువెళ్తారు. రియర్‌ అడ్మిరల్‌ పి.మురుగేశన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని పలు కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత వివిధ అంశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం దాదాపు 900మంది పాఠశాల విద్యార్థులు, 500వందల మంది రక్షణ శాఖలో పనిచేస్తున్న వారి బంధువులు, 20మంది సీనియర్‌ సిటిజన్స్‌ను ఐఎన్‌ఎస్‌ జలాశ్వ నౌకలో నడిసముద్రంలోకి తీసుకువెళ్లారు. నెమ్మదిగా కదులుతున్న నౌకపై ఒకదాని వెనుక ఒకటి చొప్పున ఆరు హెలికాప్టర్లు దిగాయి. అక్కడి నుంచి నౌక నేరుగా దాదాపు 50 నాటికల్‌ మైళ్ల దూరంలోకి వెళ్లింది. శత్రుదేశాల నౌకలను ఎదిరించే తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు.

గుళ్ల వర్షంతోపాటు, నావికా సిబ్బంది హెలికాప్టర్ల గుండా నడి సముద్రంలో వున్న నౌకపై దిగడం, నీటిలో చిక్కుకున్న వ్యక్తులను ఆదుకోవడం చూపరులకు గగుర్పాటు కలిగించింది. దాదాపు ఐదు గంటల పాటు శత్రుదేశాల నౌకలతో పోరాడే దృశ్యాలను చూపించారు. ఈ సందర్భంగా రియర్‌ అడ్మిరల్‌ మురుగేశన్‌ మాట్లాడుతూ 1971లో భారత నావికాదళం అపూర్వమైన తన ప్రతిభ కనబరిచిందని అన్నారు. పాకిస్థాన్‌లో నావికాదళం దుందుడుకుతనానికి ముకుతాడు వేయడంతో భారత నావికాదళాలు అలుపులేని పోరాటం చేశాయని కొనియాడారు. డిసెంబర్‌లో ఈ సంఘటన జరగడంతో ప్రతియేటా నేవి వీక నిర్వహిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే డేఎట్‌ సీ, ఇతరత్రా కార్యక్రమాలు జరుపుతామన్నారు. నాలుగో తేదీన రామకష్ణ బీచ్‌ వద్ద గల విక్టరీ ఎట్‌ సీ స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తామన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత నావికాదళం శక్తిమంతమైనదని అన్నారు. దేశరక్షణ కోసం అహర్నిశలూ కృషి చేసే ఎంతోమంది నావికా సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మురుగేశన్‌ సతీమణి మేథ మురుగేశన్‌, వివిధ విభాగాలకు చెందిన కమాండెంట్లు పాల్గొన్నారు.

* భారత నౌకాదళ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు--డిసెంబరు 4.
* భారత నౌకాదళ తొలి అడ్మిరల్--ఆర్.డి.కఠారి.
* భారత నౌకాదళ ప్రధాన స్థావరం ఏ నగరంలో ఉన్నది--కొత్త ఢిల్లీ.
* 1967లో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టబడిన తొలి జలాంతర్గామి--ఐ.ఎన్.ఎస్.కల్వరి.
* స్వాతంత్ర్యానికి పూర్వం భారత నౌకాదళం పేరు--రాయల్ నౌకాదళం.
* బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా బొంబాయి నౌకాదళం తిరుగుబాటు ఎప్పుడు జరిగింది--1946.
* 2000లో సముద్ర మ్యూజియంగా మార్చబడిన భారత నౌకాదళ నౌక--సి.ఎన్.ఎస్.విక్రాంత్.
* భారత నౌకాదళ తొలి శిక్షణ నౌక--తరింగిణి.
* భారత నౌకాదళంలో జలాంతర్గాముల విభాగాన్ని ఎప్పుడు ఏర్పాటుచేశారు--1987.
* 1961లో భారత నౌకాదళంలో స్థానం పొందిన ప్రసిద్ధ నౌక--సి.ఎన్.ఎస్.విక్రాంత్.

కుర్పుర వార్షికోత్సవం :

నాడు భారత విజయానికి ప్రతీకగా నిలిచిన కుర్సుర జలాంతర్గామి నేడు మ్యూజియం రూపంలో విశాఖ పర్యాటకులకు వీచికగా నిలుస్తోంది. ఆసియా ఖండంలోనే తొలి మ్యూజియమ్‌గా ఏర్పాటైన కుర్సుర ఈ నెల 9న ఎనిమిదో వార్షికోత్సవం జరుపుకోనుంది. 1971లో భారత్‌ - పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో దేశ గౌరవానికి, ప్రతిభాపాటవాలకు ప్రతిరూపంగా నిలిచి భారత్‌ విజయానికి ప్రతీకగా నిలిచింది. భారత పౌరుషానికి మారుపేరుగా, నావికాదళంలో విశేషమైన సేవలందించిన కుర్సుర సబ్‌మెరైన్‌ తయారీస్థాయి నుంచి ఇప్పటి మ్యూజియమ్‌ రూపుదాల్చే వరకూ ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకుని ప్రపంచ దేశాల నావికాదళాల్లో ఏ యుద్ధ నౌకకు, జలాంతర్గామికి దక్కని అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది.

భారత నావికాదళంలో మొదటి తరానికి చెందిన జలాంతర్గాముల్లో కీలకమైనదిగా చరిత్ర పుటల్లో నిలిచిన కుర్సుర


సబ్‌మెరైన్‌ నాటి సోవియట్‌లో నిర్మితమైన ఐ-641 శ్రేణికి చెందినది. 1945 టన్నుల బరువు, 8 మీటర్ల ఎత్తు, 91.3 మీటర్ల పొడవున్న ఈ భారీ లోహపు తిమింగలం సోవియట్‌లో నిర్మాణానంతరం 1969 డిసెంబరు 18న భారత నౌకాదళంలో ప్రవేశించింది. తూర్పు నౌకాదళం జలాంతర్గామి యూనిట్‌కు సారధ్యం వహిస్తూ 31 సంవత్సరాలు విస్తృత సేవలందించిన కుర్సుర సబ్‌మెరైన్‌ను 2001 ఫిబ్రవరి 28న సేవల నుంచి ఉపసంహరించారు.

సబ్‌మెరైన్‌ లోపల..

నౌకాదళంలో ఉండగా కెప్టెన్‌ సారధ్యంలో 75 మంది సిబ్బంది ఇందులో ఉండేవారు. రెండు వేల హార్స్‌ పవర్‌ సామర్థ్యంతో హైపవర్‌ ఇంజన్లు మూడు ఉన్నాయి. ఒక్కొక్కటీ 652 కిలోల బరువుండే 448 బ్యాటరీలు ఉన్నాయి. ఇవిగాక సబ్‌మెరైన్‌ను నడిపేందుకు మూడు ప్రొపెల్లర్లు, మూడు షాఫ్ట్స్‌ ఉన్నాయి. సముద్ర జలాల అడుగున ప్రయాణించే సమయంలో కుర్సుర గరిష్ట వేగం గంటకు 15.5 నాటికల్‌ మైళ్లు. అప్పట్లో ఇదే ఎక్కువ స్పీడు. సముద్ర గర్భంలో శత్రువుల ఉనికి, అవతలి నుంచి ఆయుధాల ప్రయోగాన్ని కనిపెట్టేందుకు అత్యంత శక్తివంతమైన సోనార్‌ వ్యవస్థ కుర్సురలో ఉన్నాయి. 2001లో నౌకాదళం సేవల నుంచి ఉపసంహరించిన తరువాత విశాఖలోని ఆర్‌కె బీచ్‌లో కుర్సుర సబ్‌మెరైన్‌ను యథాతథంగా మ్యూజియమ్‌గా నెలకొల్పారు. సందర్శకులు టార్పెడోలతో సహా యుద్ధ వ్యవస్థలన్నింటినీ ఇందులో చూడవచ్చు.

వైస్‌అడ్మిరల్‌ వినోద్‌ పశ్రీచా ఆలోచన.. ఉడా ఆచరణ...

2001లో కుర్సుర సబ్‌మెరైన్‌ను నేవీ నుంచి ఉపసంహరించిన అనంతరం మ్యూజియమ్‌గా మార్చి సాధారణ ప్రజలకు నౌకాదళ పనితీరును తెలియజెప్పాలనే ఆలోచనతో అప్పటి తూర్పు నౌకాదళం ప్రధానాధిపతి వైస్‌ అడ్మిరల్‌ వినోద్‌ పశ్రీచా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి నేవీ ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడంతో పాటు విశాఖలో బీచ్‌ఒడ్డున నిలబెట్టేందుకు అవసరమైన పనులన్నింటికీ వినోద్‌ పశ్రీచా ప్రత్యేక చొరవ చూపడంతో ఆయన ఆలోచన కార్యరూపం దాల్చింది. దీన్ని ఒడ్డుకు చేర్చి మ్యూజియమ్‌గా నెలకొల్పేందుకు ఏడాదికి పేగా సమయం పట్టింది. 2002 ఆగస్టు 9న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి ఏటా రెండున్న లక్షల మంది పర్యాటకులకు కనువిందు చేస్తోంది.

సందర్శకుల సౌకర్యార్థం...

ఆయుధ సామగ్రితో యథాతథంగా మ్యూజియమ్‌గా నెలకొల్పిన అనంతరం సందర్శకుల సౌకర్యార్థం ద్వారాలను మార్పు చేశారు. 91.3 మీటర్ల పొడవున్న దీన్ని చివరి వరకూ పూర్తి చూడలంటే కనీసం 23 నిమిషాల సమయం పడుతుంది. సందర్శకులు అంతసేవు లోపల ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా 21 ఎసి మిషన్లను ఏర్పాటు చేశారు.

నిర్వహణ కమిటీలు...

కుర్సుర సబ్‌మెరైన్‌ మ్యూజియమ్‌ నిర్వహణ కోసం రెండు కమిటీలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఉన్నతాధికారులతో కూడిన ఎపెక్స్‌ కమిటీ కాగా, రెండోది మేనేజ్‌మెంట్‌ కమిటీ. మ్యూజియమ్‌కు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే ఎపెక్స్‌ కమిటీకి తూర్పు నౌకాదళం ప్రధానాధికారి ఛైర్మన్‌గా, ఉడా వైస్‌ ఛైర్మన్‌, జిల్లా కలెక్టర్‌, జివిఎంసి కమిషనర్‌, నగర పోలీసు కమిషనర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తదితరులు సభ్యులుగా వ్యవహరిస్తారు. రెండో కమిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీకి ఉడా ఉపాధ్యక్షులు ఛైర్మన్‌గా, నేవీ అధికారులు, ఉడా అధికారులు సభ్యులుగా ఉంటారు.

అరుదైన గౌరవం...

సేవల నుంచి ఉపసంహరించిన అనంతరం మ్యూజియమ్‌గా రూపాంతరం చెందినప్పటికీ నేవీలో ఇతర యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లతో సమానంగా అధికారిక గౌరవాన్ని కుర్సుర అందుకుంటోంది. ప్రతి ఏటా ఆగస్టు 15న, జనవరి 26న, డిసెంబరు 4న (నౌకాదళ దినోత్సవం) అధికారిక నౌకలకిచ్చే డ్రెస్సింగ్‌ షిప్‌ గౌరవాన్ని కుర్సుర అందుకుంటోంది.


  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

World Day of Remembrance for Road Trafic Victims, రహదారి ప్రమాద మరణాల సంస్మరణ దినము


ప్రతి సంవత్సరము నవంబరు మూడవ ఆదివారము జరుపుతారు . 2010 సం . లో నవంబరు 21 న .

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .
పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (2010 నవంబరు 21) రహదారి ప్రమాద మరణాల గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

ప్రమాదాలు కావాలని ఎవరూ చేయరు , గురికారు . అనుకోకుండా ఏదో తెలియని కారణతో జరుగుతూ ఉంటాయి . చిన్నపొరపాటు , కనురెప్ప కాలములో అంతా జరిగిపోతుంది . గాయాలు కావచ్చును ... ప్రాణాలు పోవచ్చును . . అకస్మికముగా జరిగిపోతాయి కాని వాటి తాలూక ప్రభావము చాలాకాలము ఒకోసారి జీవితమంతా అలాగే ఉండిపోతుంది . ప్రతి యేటా కొన్ని లక్షల మంది ప్రమాద బారిని పడుతున్నారు . ఈ ప్రమాదాల్ని , వాటి తాలూకు కస్ట నస్టాలు , ప్రభావిత కుటుంబీకులు తెలిసినవారు ఎప్పుడూ గుర్తుతెచ్చుకుంటారు . ప్రమాదబాదితులందరూ గుర్తుతెచ్చుకుంటూనే ఉంటారు . ప్రతి యేటా ఈ స్పురణకు సంకేతం గా నవంబరు మూడవ ఆదివారము నాడు " ది వర్ల్డ్ డే ఒఫ్ రిమెంబెరెన్స్ " జరుపుతారు .

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు జాగ్రత్త తీసుకోవాలి . బాధితుల కష్టనష్టాల్ని విగతా ప్రపంచము గుర్తెరిగి వీలైనంత పరిధిలో ప్రమాదాలు జరక్కుండా కృషిచేయాలన్న అంశాన్ని ఎత్తి చూపేదే ఈ ప్రత్యేక రిమెంబెరెన్స్ డే . ఈ రోజూ ఎంతో మంది తమ సందేశాలను అందిస్తారు .

యూరోపియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ట్రాఫిక్ విక్టిమ్స్ సంష్థ అధ్వర్యము లో బాధిత సంఘాలు 1993 నుండి ఈ రోజును నిర్వహిస్తున్నాయి . బాధితులు , బాధిత కుటుంబాలు , సన్నిహితులు .. వారికి మద్దతుపలికేవారికి ఇది అత్యంత ప్రత్యేక దినము . రానురాను దీనికి ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది . ప్రమాదం తాలూకు కష్టనష్టాల్ని ఎత్తిచూపేందుకు తగిన కార్యాచరణకు దీన్నో అవకాశము గా ఉపయోగించుకోవడం అనేది ఆరంభమైనది . 2003 నుండి ప్రపంచ ఆరోగ్య సంష్థ (W.H.O) ఈ రోజుకు మదతు ఇవ్వడము ఆరంభించినది . ఐక్యరాజ్యసమితి 60/5 తీర్మానము ద్వారా గుర్తించాక మద్దతు మరింత పెరిగింది . నవంబరు మూడో ఆదివారము ను " వరల్డ్ డే ఆఫ్ రెమెంబెరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ " గా పేర్కొంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సర్వసభ్య సమావేశము 2005 అక్టోబర్ 26 న చేసిన ప్రతిపాదనకు అమోదము లబించినది . ఈ ప్రపంచదినాన్ని పాటించడము ఖండఖండాలకు వ్యాపించింది . ప్రతి ఏటా ఈ దినము జరుపుకునే దేశాలు సంఖ్య పెరుగుతూ వస్తుంది . రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు తీసుకోవలసినటువంటి చర్యల్ని , ప్రతి ఒక్కరి బాధ్యతను ఈ సందర్భముగా గుర్తు చే్స్తారు .

1993 లో తొలిసాఎఇగా ' రోడ్ పీస్ ' ఈ రోజు ప్రాధాన్యతను గురించి తెలియజెప్పడం ఆరంభించినది . ఈ రోజు వివిధ కార్యక్రమాలు ఎలావిర్వహించాలి , ఎలా ప్రణాళిక రూపొందించాలన్న దానికి మార్గదర్శక సూత్రాలు రూపొందించారు . రోడ్డు విపత్తుల , బాధితుల అనుభవాల ప్రాతిపదికగా ప్రభుత్వేతర సంస్థల సహకారము తో ఈ నియమావళిని రూపొందించారు . గత కొన్ని సంవత్సరాలు గా రెమెంబెరెన్స్ సందర్భంగా తీసుకున్న వివిధ చ్ర్యలను పొందుపరిచేరు . వర్కింగ్ గ్రూపు ఏర్పాటు , లక్ష్యాలు , సందేశాల అభివృద్ధి , రాజకీయ మద్దతు పొందడము , భాగస్వామ్యాన్ని విసృతపరచడము , నిధుల సేకరణ , రోడ్డు ప్రమాదాల బాధితులకు సహాయము ఈ రోజు చేపట్టే పనులు .

బ్రిటన్‌ దేశము లో విసృతము గా కార్యక్రమాలు నిర్వహిస్తారు . వివిధదేశాలలో విభిన్న కార్యక్రమాలు నిర్వహించినా ఈ రోజు లక్ష్యము ఒక్కటే ... బాధితుల అనుభవాల స్మరణ , నివారణ , బాధితులకు వారి కుటుంబీకులకు సానుభూతి , సహ్కారాన్ని తెలియజేయడము .

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రాధమికంగా కావలసిన జాగ్రత్తలు :
  • ప్రయాణము లో అప్రమత్తం గా ఉండడము ,
  • ప్రయాణము లో హడావిడి తగదు ,
  • మరుసటి నాటి ఉదయము సుదీర్ఘ ప్రయాణము అవసరము అనుకున్నాప్పుడు రాత్రి నిద్ర చాలినంత పోవాలి ,
  • వెళ్ళేముందు ఏదోఒకటి తినాలి .. ఆకలి తో డ్రైవింగ్ చేయకూడదు .
  • మెలకువగా ఉండాలంటే బాగా కెఫైన్‌ గల పానీయాలు అవసరమని భావించకూడదు .. వాటి ప్రభావము తగ్గినంతనే నిద్రలోకి నెట్టెస్తాయి .
  • డ్రైవింగ్ లో అప్రమత్తం గా ఉండాలి , మనసు ఎక్కడో విహరించకూడదు .
  • ప్రతి రెండు గంటలకు ఒకసారి విరామము అవసరము . తూలుతున్నట్లు అనిపిస్తే ఏదో కాస్త తిని అవసరమనుకుంటే కొద్దిసేపు నిద్ర పోవాలి .
  • దూరప్రయాలలో ఇంకొకరి సహాయము తో డ్రైవింగ్ షేర్ చేసుకుంటే మంచిది .
  • సరి అయిన సిగ్నల్స్ లేనిదే వాహనాలను క్రాస్ చేయరాదు , ఓవర్ టేక్ చేయరాదు .
  • డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్‌ లో మాట్లాడడము మంచిది కాదు .
  • డ్రైవింగ్ సమయములో ముందు ఆల్కహాల్ తీసుకోకూడదు ... మత్తులో పడి ప్రమాదాలు జరుగుతాయి .
  • వాతావరణము అనుకూలము గా లేనప్పుడు తక్కువ స్పీడ్ లో ప్రయాణించాలి .
  • బయలు దే్రే ముందు వాహనము కండిషన్‌ లో వున్నది లేనిదీ తనికీ చేయించుకోవాలి ,
  • ట్రాఫిక్ నిబందనలు , ట్రాఫిల్ సిగ్నల్స్ తూచా తప్పకుండా పాటించాలి .

  • ==============================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Saturday, December 4, 2010

ప్రపంచ వికలాంగుల దినోత్సవం , World Handicaped people Day


ప్రతి సంవత్సరము డిసెంబర్ 03 న ప్రపంచ వికలాంగుల దినోత్సవము జరుపురారు .

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .
పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసంబరు ౧౩) వికలాంగుల గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

సాధ్యమైనంత వరకూ మనం వికలాంగులు అనే పదం మన వాడుక భాషలో వాడడం లేదు. ఇంగ్లీషు లో మాత్రం హేన్డికాప్పుడు, డిజేబుల్ద్, ఫిసికాల్లీ చాలేన్జ్ద్ అని రక రకాల పదాలలో వాడుతూ ఉంటాము. కాని చాలా మందికి ఎందుకు ఎ పదాన్ని వాడుతున్నామో తెలియదు. అలాంటి సమయాల్లో ఒక్కోసారి మంచి ఉద్దేశ్యాన్ని చెడ్డగాను, చెడ్డ ఉద్దేశ్యం మంచిగాను చెప్పే ప్రమాదము వుంది. కాబట్టి ఈ పరిస్తితి నుండి బయటపడే ప్రయత్నానికి ఈరోజే నాంది పలుకుదాం.

ప్రపంచం లో పనికి రాని వాడంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైన వాల్లే ఉండరు. తెలివికి, తెలివిలేని తనానికి మధ్యనే జీవితం. చేయడానికి ,చేయలేకపోవడానికి మధ్యలోనే మనం. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేక పొతే మనం వాళ్ల కన్నా గొప్ప వాళ్ళం అనుకోవడం సర్వ సాధారణమైపోయింది. అయితే వికలాంగులను అర్ధం చేసుకోడానికి ఐరిస్ అనే ఆవిడ ఏమంటారంటే "కూర్చున్న చోటినుండి లేవలేక పోవడం శారీరక సమస్య ఐతే, అలా లేవలేక పోవడానికి సరైన సహకారాన్ని అందించక పోవడమే అసలైన వైకల్యం అంటారు". అందుకే సమాజం లో ఎవరు ఎ పని చేసినా, చేయలేక పోయినా దాని వెనుక సమాజం పాత్ర ఎంతైనా వుంటుంది. ఆ సహకారం, ప్రోత్సాహం తో ఎవరైనా ఎంత ముందుకైన వెళ్ళగలం అనే సత్యాన్ని తోటి వారు అవగాహన చేసుకోవాలి. నిజమైన సామర్ధ్యం గురుంచి చర్చించు కుంటే ఎవరు ఎవరినీ తక్కువగా చూడలేము. అలా అర్ధం చేసుకోలేక కొన్ని తరాలుగా కొంత మంది పై నిర్లక్ష్య గా సామర్ధ్యం అని చెప్పి, చేయగలిగినవాళ్ళను కూడా అసమర్ధులుగా మార్చిన సమాజం నుండి బయటికి వచ్చి అందరినీ అర్ధం చేసుకొనే సమాజం వైపు మన పెద్ద వాళ్లు ప్రారభించిన అడుగులు ముందుకు తీసుకు వెల్లడానికి ఈరోజే నిర్ణయం తీసుకుందాం.
1992 లో యునైటెడ్ నేషన్స్ వికలాంగుల సహాయార్దము దీనిని ప్రారంభించినది . అప్పటి నుండి ప్రపంచవ్యాప్తము గా జరుపుకొంటున్నారు .

వికలాంగులు మానసికంగా ఆధైర్య పడకుండా ఆత్మస్థైర్యంతో అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లాలి . వికలాంగులు ఈ రోజు క్రీడలను నిర్వహిస్తారు . వికలాంగ క్రీడాకారులు సాధారణ క్రీడాకారులకు ఏమాత్రం తీసిపోకుండా ఆత్మస్థైర్యంతో క్రీడలలో పాల్గొనాలి .

వికలాంగులు -ప్రభుత్వ సంక్షేమ పథకాలు :

వికలాంగుల పునరావాసానికి ప్రభుత్వం అందించే సౌకార్యాలు, రాయితీలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వికలాంగుల పునరావసం మరియు వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. 1995వ సంవత్సరములో కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టం చేయబడి 7-2-96వ తేదీన అమలులోకి తేబడిన వికలాంగుల సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం చట్టం, 1995 ఒకటవ చాప్టరులో వికలాంగుల నిర్వచనం ఈ విధంగా యివ్వబడి అమలులో ఉంది.

అ) అంధత్వం, తక్కువ కంటిచూపు :
ఈ క్రింద తెలిపిన పరిస్థితులకు లోనైన ఏ వ్యక్తి అయిన ఈ పరిధిలోకి వస్తాడు.
1) పూర్తిగా చూపు కనిపించకపోవడం లేదా
2) కళ్ళద్దాలు ధరించినప్పటికీ కొంచెం మెరుగ్గా ఉండే కంటిచూపు 6/60 లేదా 20/200 (స్నెలెన్‌) మించినట్టయితే లేదా,
3) కంటిచూపు పరిధి 20 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే, తక్కువ కంటిచూపు కలిగిన వ్యక్తి అంటే దృష్టిదోషాన్ని చికిత్సతో సరిచేసిన అనంతరం కూడా ఆ వ్యక్తి దృష్టిలోపం కలిగి ఉండటం, అయితే తగిన సహకార సాధనంతో ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి లేదా ప్రణాళిక రూపందించడానికి అవసరమైన దృష్టి, శక్తి కలిగి వున్నప్పటికి తక్కువ కంటిచూపు కలిగి వ్యక్తిగానే పరిగణించబడుతుంది.

ఆ) కుష్ఠు వ్యాధిగ్రస్తులు - వ్యాధి నయమయినవారు :
”కుష్ఠువ్యాధి నయమయిన వ్యక్తి” అంటే కుష్ఠు వ్యాధి నయమైన తర్వాత ఈ క్రింది కారణాలతో బాధపడే వ్యక్తి.
1) అరికాళ్ళు, అరిచేతులు మరియు కంటిలో పూర్తిగా గాని పాక్షికంగా కాని స్పర్శ లేకుండుట, మరియు కంటిలో పాక్షికంగా కాని, పూర్తిగా కాని చచ్చుబడినట్లుగా బయ టకు తెలియని వైకల్పం లేకపోవుట.
2) అంగవైకల్యముతో చచ్చుబడిన చేతులు, కాళ్ళు కదిలిక కలిగి, దైనందిన కార్యకలా పాలు నిర్వహించగలగడం.
3) పూర్తి అంగవైకల్యం మరియు వయస్సు పై బడిన కొద్దీ, దైనందిన కార్యక్రమాల్లో మార్పు కాని, వృత్తిలో ప్రావీణ్యతతో పాల్గొన లేకపోవుట.

ఇ) వినికిడి లోపం :
వినికిడి లోపం అంటే సంభాషణల తరంగాల పరిధిలో చెవికి సంబంధించి 60 డిసిబుల్స్‌ లేదా అంతకంటే ఎక్కువ వినికిడిని కోల్పోవడం.

ఈ) కదలిక లేకపోవడం లేదా చలనశక్తికి సంబంధించిన వికలాంగత :
”చలనశక్తి వైకల్యం” అంటే ఎముకలు, కీళ్ళు, కండరాలు వైకల్యం వల్ల చలనాంగముల కదలిక తగినంతగా లేకపోవడం లేదా ఏ రకమైన సెరిబ్రల్‌ పాల్సీ (మెదడుకు పక్షవాతం) అయినా.

ఉ) బుద్ధి మాంద్యం :
”మానసిక వికలంగత” అంటే బుద్ధి మాంద్యతే కాకుండా మానసిక ఇతర మానసిక అస్వస్తత, బుద్ధిమాంద్యం అంటే ఒక వ్యక్తి మానసికంగా అసంపూర్తిగా ఎదగడం లేదా ఎదుగుదల ఆగిపోవడంతో ప్రత్యేకంగా అతి తక్కువ తెలివితేటలు కలిగి ఉండటం.

వికలాంగత గల వ్యక్తి అంటే ఒక వ్యక్తి 40 శాతానికి తక్కువ లేకుండా వైకల్యం కలిగి ఉన్నట్లుగా మెడికల్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వడం. అయితే మెడికల్‌ బోర్డు ప్రతినెల నిర్ణీత సమయాల్లో జిల్లా వైద్యశాల యందు సమావేశమై సర్టిఫికెట్లు ఉచితంగా అందజేస్తుంది.
వికలాంగుల పునరావస నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే 1981 సం|| ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల సహకార సంస్థ. 1983 సంవత్సరం వికలాంగుల సంక్షేమ శాఖ స్థాపించడం జరిగింది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ పథకాలు అమలు పర్చే నిమిత్తం సహాయ సంచాలకుల కార్యాలయాలు పనిచేస్తున్నవి. వికలాంగుల సహకార సంస్థ కార్యకలాపాలు పదవిరీత్యా జాయింటు కలెక్టరు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టగరుగా, సహాయ సంచాలకులు పదవిరీత్యా వికలాంగుల సహకార సంస్థ జిల్లా మేనేజరుగా వ్యవహరిస్తారు. మొత్తం మీద జిల్లా కలెక్టరు గారి అధికార పర్యవేక్షణలో వికలాంగు సంక్షేమం కొరకు నిర్దేశించబడిన పునరావాస కార్యక్రమాలు అమలుపరచబడు తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగులు పునరావాసం మరియు అభివృద్ధి కొరకు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా విభజించబడినవి.

1) విద్య :
అంధ మరియు బధిర, మూగ బాలబాలికలకు ప్రత్యేక పాఠశాలలకు నడుపబడుచున్నవి. వికలాంగలు సంక్షేమ శాఖ మరియు ప్రాథమిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు నడుపబడు చున్నవి. భారత ప్రభుత్వం ద్వారా సహాయం పొంది, పొందుండా కూడా ఉన్న ప్రభుత్వే తర సంస్థలు విద్యారంగములో తమ వంతు సహాయం అందిస్తున్నవి.
ప్రత్యేక పాఠశాలల్లో ప్రవేశ నిమిత్తం ఆయా పాఠశాల ప్రిన్సిపాల్స్‌ / హెడ్‌ మాస్టర్లను సంప్రదించవలయును. ప్రతి సంవత్సరం మే నెల నుంచే తమ, తమ పిల్లలను చేర్పించడానికి చర్యలు తీసుకొన వలయును. అంగవైకల్య శాతం, తల్లి దండ్రుల ఆదాయ పరిమితికి లోబడి పాఠశాల స్క్రీనింగు కమిటీ విద్యార్థులను ఎంపిక చేస్తుంది.
ఇది గాక విద్యాశాఖ ద్వారా సమీకృత విద్యావిధానం కూడ ప్రవేశపెట్టబడి నది. ప్రతి జిల్లాలో బధిరులకు, అంధులైన విద్యార్థుల కొరకు ఒక్కొక్క తరగతి గుర్తించిన పాఠశాలలో ప్రారంభించబడినది. అందరికీ విద్య లక్ష్యంతో అవసరమైన ప్రతిచోట ఇటువంటి విద్యావిధానం అమలుకు విద్యాశాఖ దశలవారీగా చర్యలు తీసుకుంటున్నది.
విద్యాపరంగా ఈ దిగువ సూచించిన పథకాలు ప్రస్తుతం అమలులో ఉన్నవి :
అ) అన్ని రకాల విద్యా సంస్థలలో ప్రవేశానికి వికలాంగులయిన విద్యార్థులకు రిజర్షేన్‌ కల్పించబడినది. విశ్వవిద్యాలయాలు, సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు వగైరాలతో సహా ప్రతి యొక్క వికలాంగుడు తమకు అన్నిటా సమాన అవకాశాలు, సంఘంలో ప్రత్యేకించి ప్రభుత్వ యాజమాన్య సంస్థలో కల్పించబడాలి అనే ప్రాతపదిక గుర్తుంచుకొని జీవితంలో వారి హక్కుల సాధనకు ముందుకుపోవాలి. డాక్టరు కోర్సులలో 0.25% ఇంజనీరింగు కోర్సులలో 0.50% ప్రవేశంలో రిజర్వేషను కలదు.
ఆ) వికలాంగుల ఆశ్రమ పాఠశాలలే కాకుండా, వసతి గృహాలలో కూడా ఉండి చదువుకొనేందుకు వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా 3అవకాశాలు కల్పించబడినవి. వికలాంగులైన బాలబాలికలు తమ దగ్గరలో గల రాష్ట్ర సంక్షేమ శాఖ ఏ వసతి గృహంలో నయినా వారి నిబంధనలకు లోబడి ప్రవేశం పొందవచ్చును.
ఇ) ప్రభుత్వ గుర్తింపు మరియు సహాయం పొందిన విద్యాసంస్థలో చదివే వికలాంగ విద్యార్థులకు వారి విద్యా స్థాయిననుసరించి ఉపకార వేతనం మంజూరు చేయబడుతుంది. చలన సంబంధమైన వైకల్యం కల వారికి ప్రయాణపు అలవెన్సు, చలన పరికరాలను నిరంతరం ఉపయోగంలో ఉంచేందుకు (మెయింటెనెన్స్‌ అలవెన్సు), అంధులకు రీడర్సు అలవెన్సు మంజూరు చేయబడతాయి.
ఈ) ప్రి మెట్రిక్‌ (1 నుంచి 8 తరగతి వరకు) పోస్టు మెట్రిక్‌ (9వ తరగతి నుంచి ఆపైన) చదువులకు చెల్లించే ట్యూషన్‌ ఫీజులు వసతిగృహంలోని విద్యార్థులకు కొన్ని పరిమితులకు లోబడి చెల్లించబడతాయి.
ఉ) మానిసిక వికలాంగులకు ఉపకార వేతనాలు చెల్లించబడతాయి.
ఊ) మెట్రిక్‌ పూర్వపు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచిత సరఫరా (1 నుంచి 10వ తరగతి వరకు) (ప్రస్తుతం విద్యాశాఖ ద్వారా సరఫరా చేయబడుతున్నవి) అంధ విద్యార్థులకు రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ద్వారా బ్రెయిలీలో పాఠ్యపుస్తకాలు ముద్రించి సరఫరా చేయబడుచున్నవి.
ఋ) రీసెర్చి స్కాలర్లుకు ఉపకారవేతనాలు చెల్లించబడతాయి.
ఎ) ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల సహకారం సంస్థ ద్వారా అంధ విద్యార్థులకు టేప్‌ రికార్డులు, క్యాసెట్‌లు చదువుకొనే నిమిత్తం ఉచిత సరఫరా.
ఏ) అంధులు, చలన సంబంధమైన వైకల్యం కలవారికి పబ్లిక్‌ పరీక్షల సమయంలో 30 ని|| అదనంగా అనుమతిస్తారు.
ఐ) బధిర విద్యార్థులకు పబ్లిక్‌ 10వ తరగతిలో రెండు లాంగ్వేజెస్‌ వ్రాయకుండా ఇంటర్‌లో ఇంగ్లీషు లాంగ్వేజి వ్రాయకుండా మినహాయింపు.
ఒ) వికలాంగులైన 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు రాయితీ.
ఓ) అంధ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షల సమయంలో ”స్కైబ్‌”ని ఇస్తారు.

2. శిక్షణ :
వికలాంగుల కొరకు వికలాంగలు సహకార సంస్థ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుచుండేవి. ప్రస్తుత తరుణంలో పారిశ్రామిక శిక్షణ సంస్థలు, బి.యి.డి, టి.టి.సి, కోర్సులలో వికలాంగులకు ప్రవేశానికి రిజర్వేషన్లు కలవు. వృత్తి విద్యా కోర్సులలో ట్యూషన్‌ ఫీజు తిరిగి ఇచ్చే పథకం కలదు. రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ సంస్థలు 1995 వికలాంగులకు సమాన అవకాశాలు. సంపూర్ణ భాగస్వామ్యం చట్టం అనుసరించి ఎంపిక చేసిన ఐ.టి.ఐలలో ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించింది. అయితే ప్రభుత్వం, మారుతున్న పరిస్థితులలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌లో శిక్షణలాంటి క్రొత్త కోర్సులలో ప్రవేశానికి చర్యలు తీసుకొంటుంది. ఐ.టి.ఐ సీట్లలో 2 శాతం మరియు టి.టి.సి.లో 3 శాతం రిజర్వేషన్లు, కలవు. అన్ని కోర్సులలో రిజర్వేషన్లు వికలాంగులకు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం గుర్తించి తదనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇది నిరంతర ప్రక్రియ. కాలానుగుణంగా సమాన అవకాశాలు, ప్రత్యేక అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఏ అంశాన్నయినా ప్రభుత్వ దృష్టికి తీసుకురావచ్చు.

3. ఉపాధి అవకాశాలు :
వికలాంగుల పునరావసం నిమిత్తం ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం పోస్టులు వికలాంగులకు కేటాయించబడినవి. (1 శాతం అంధులకు, 6వ రోష్టరు పాయింటు, 1 శాతం మూగ బధిరులకు, 31వ రోష్టరు పాయింటు, 1 శాతం చలన సంబంధమైన అంగవైకల్యం గల వారికి 56వ రోష్టరు పాయింటు)
వికలాంగుల కొరకు గుర్తించిన పోస్టులు 3 సం||ల వరకు ఖాళీగా ఉంచాలి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వయో పరిమితి అర్హత, వికలాంగుల కొరకు 10 సం||లు సడలించారు.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో వికలాంగులకు కేటాయించబడిన ఉద్యోగాల నియామకం ఆ పోస్టు స్థాయిననుసరించి ఉపాధి కల్పన కార్యలయం ద్వారా గాని, పేపరు ప్రకటనలు, సర్వీస్‌ కమీషను ద్వారా గాని జరుగుతాయి.
కాలేజి సర్వీసు కమీషన్‌ నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు, అభ్యర్థికి రూ. 180/- పరీక్ష రుసుము ఇవ్వబడుతుంది. ఆదాయ పరిమితి సం|| రూ. 3600/-

4. స్వయం ఉపాధి :
అందరికి ఉద్యోగాలు లభించవు. కానీ జీవనం సాగించాలి. అందుచేత ప్రజల విస్తృత ప్రయోజనాలు, ఆర్థిక స్వావలంబన దిశగా ప్రయాణం సాగించేటట్లు చేయటానికి స్వయం ఉపాధి పథకాలు ప్రవేశపెట్ట బడినవి. స్వయం ఉపాధికి నిర్దేశించిన అన్ని గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి పథకాలలో వికలాంగులకు 3 శాతం కేటాయించారు. అలాగే సి.యం.ఇ.వై., పి.యం.ఆర్‌.వై. అన్ని బలహీన వర్గాల ఆర్థిక సహాయ సంస్థలలో వికలాంగులకు ప్రత్యేక కేటాయింపు ఉంది.
యన్‌.హెచ్‌.యఫ్‌.డి.సి. ద్వారా బ్యాంకులతో నిమిత్తం లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వమే స్వయం ఉపాధికి అప్పులిచ్చే పథకం ప్రవేశపెట్టింది.
వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా సబ్సిబీ యిచ్చే పథకం అమలులో ఉంది. దీని ద్వారా చిన్న, చిన్న వ్యాపారాలకు బ్యాంకులు అప్పు మంజూరు పత్రం ఇవ్వనిచో ప్రత్యేక పరిస్థితులలో నేరుగా రూ.3,000 మంజూరు చేయవచ్చు.
అయితే వికలాంగులు స్వయం ఉపాధిపథకం కోరే ముందు ఆ పథకం గురించి సరైన అవగాహన ఉండాలి. ఆ ఉపాధి పథకం వివరాలు పూర్తిగా తెలుసుకొని అందులో అవసరమయిన శిక్షణ పొంది ఉంటే ఆ పథకం సద్వినియోగానికి తోడ్పడుతుంది.

ఇవి గాక అనేక ఉపాధి పథకాలు రాష్ట్ర ప్రభుత్వంచే అమలు చేయబడుతున్నవి.
అ) వికలాంగులయినటువంటి ‘లా’ కోర్సు చదివిన పట్టభద్రులు లా పుస్తకాలు కొనుగోలు మరియు ఎన్‌రోల్‌మెంటు ఫీజు నిమిత్తం రూ. 1,700 మంజూరు అవుతున్నాయి.
ఆ) సివిల్‌ సప్లయిస్‌ వారి రేషన్‌ షాపులలో 3 శాతం వికలాంగుల నిమిత్తం కేటాయించాలి.
ఇ) స్టాంపుల అమ్మకం వ్యాపారం మంజూరు చేయునపుడు వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఈ) ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సహాయ సంస్థ అందచేసిన రుణాలలో వికలాంగులైన లబ్దిదారుల నిమిత్తం రూ. 50,000 వరకు తక్కువ వడ్డీతో అప్పు మంజూరు చేయబడుతుంది.

5. విద్య మరియు చలనన సంబంధమైన పరికరములు సరఫరా :
వికలాంగుల పునరావాసానికి, ‘చలనం’ అతి ముఖ్యమైన అంశం, వారు పరికరాల సహాయంతో ఇతర మార్గాల ద్వారా క్రొత్త క్రొత్త ప్రాంతాలకు వెళుతున్నట్లయితే ఎన్నో విషయాలు తెలుసుకోవడం, విద్యసభ్యసించడం ద్వారా వారి స్వయం పునరావసాన్ని మార్గం సుగమం చేసుకుంటారు. అందుచేత చలన పరికరాలు వికలాంగుల పునరావసంలో విడదీయలేని అంశం. ఈ పరికరాలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా సరఫరా చేయబడుచున్నవి. అయితే రాష్ట్ర ప్రభుత్వ కూడ ముందుకు వచ్చి, వికలాంగు లందరికీ చలన పరికరాలు అందచేయాలనే ఉద్దేశ్యంతో వారి అవసరాలను గుర్తించి దశల వారీగా వాటిని తీర్చే ప్రయత్నం చేయు చున్నది. ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల సహకార సంస్థ ఈ చలన పరికరాలు అందచేసే బాధ్యత తీసుకొన్నది. వికలాంగుల సహకార సంస్థ పరిధితో గల మూడు చక్రాల బళ్లు, సరఫరా కేంద్రాలు, కృత్తిమ అవయవములు, కాలిపర్లు, వినికిడి యంత్రాల సరఫరా కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమం అమలు పరచబడుతోంది. అంధులకు చేతికర్రలు కాసెట్స్‌, టేపురికార్డర్స్‌ బ్రెయిలీ పలకలు, టైపురైటర్లు, ఇతర విద్యసభ్యసించేందుకు అవసరమైన అన్ని పరికరాలను సరఫరా చేస్తుంది. పోలియో సోకిన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయబడుచున్నది.

6. సాంఘిక భద్రత :
వికలాంగుల కొంత బలహీనులు కావటం వలన వారికి సాంఘిక భద్రత కల్పించే విషయమై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు పరుస్తోంది.
అ) వికలాంగులకు పెన్షన్‌ నెలకు రూ.500/-
ఆ) సకలాంగుల, వికలాంగులను వివాహం చేసుకుంటే ఇచ్చే రూ.10,000/-లు ప్రోత్సాహక బహుమతి.
ఇ) బలహీనవర్గాల ఇండ్ల కేటాయింపులో లబ్దిదారుల వాటా వికలాంగులు 3 వాయిదాలలో కట్టే సౌకర్యం.
ఈ) ఎ.పి. హౌసింగు బోర్డు ద్వారా కట్టి మంజూరయ్యే ఇళ్ళలో 2 శాతం వికలాంగులకు కేటాయింపు.

7. అన్నిప్రభుత్వ పథకాలలో 3% నిధులు వికలాంగులకొరకు వినియోగం :
వికలాంగుల చట్టం 1995 నందలి ఏర్పాట్లననుసరించి అన్ని అభివృద్ధి పథకాలు మరియు దారిద్య్ర నిర్మూలన పథకములలో 3% నిధులు వికలాంగుల సంక్షేమం, పునరావాసానికి కేటాయించి ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
తదునుగుణంగా జిల్లా గ్రామీణాభి వృద్ధి సంస్థ, ఇందిరా క్రాంతి పథం, యస్‌.సి. కార్పొరేషన్‌, బి.సి. కార్పొరేషన్‌, మహిళా శిశు సంక్షేమ ఏజన్సీ, సెట్రాజ్‌, కెవిఐబి, జిల్లా పారిశ్రామిక కేంద్రం, మైనారిటీ కార్పొరేషన్‌ మొదలగు అన్ని సంస్థలు వారి వారి వార్షిక లక్ష్యములలో 3% వికలాంగులకు కేటాయించి ఖర్చు చేస్తాయి.
సర్వ శిక్షా అభియాన్‌ 15 సం||లోపు విద్యార్థులకు సహాయ వస్తు పరికరముల పంపిణీ మరియు ఆర్‌బిసి సెంటర్ల జరుగుచున్నది.

8. జాతీయ ట్రస్టు :
ఔటిజం, సెరెబ్రిల్‌ పాల్సి, బుద్ధి మాంద్యం, మరియు బహుళ వైకల్యం కలిగివున్న వారి సంక్షేమం మరియు పునరావాసం కొరకు భారత ప్రభుత్వము జాతీయ ట్రస్టును ఏర్పాటు చేసింది. ఈ జాతీయ ట్రస్టు క్రింద స్థాయిలో జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో స్థానిక స్థాయి కమిటీలు పనిచేస్తాయి. సంరక్షకత్వం ఇచ్చే అధికారం చట్టబద్ధంగా ఈ కమిటీలకు సంక్రమింప చేయబడింది.

9. ఇతర రాయితీలు :
అ) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిటీబస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం, సబర్టన్‌ బస్సులలో 50 శాతం రాయితీ.
ఆ) రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో ఉద్యోగం చేసే వికలాంగులకు నెలకు రూ.400/- మించకుండా ప్రయాణపు రాయితీ (మూలవేతనంపై 10 శాతం)
ఇ) స్వయం ఉపాధితో జీవనం గడిపే వికలాంగులు మోటారు వాహనంపై ఇంటి నుంచి వ్యాపార స్థలం లేదా పనిచేసే స్థలంకు వెళ్ళి రావటానికి నెలకు రూ.25 లీటర్లకు మించకుండా పెట్రోలు వాడకంపై 50 శాతం రాయితీ.
ఈ) అంధ వికలాంగులయిన అధ్యాపకులకు వారు పాఠ్య ప్రణాళికలు వగైరా తయారు చేసుకొనే నిమిత్తం సహాయకుని నియమించు కొనేందుకు నెలవారీ రీడర్స్‌ ఎలవెన్సు మంజూరు.
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా డిశంబరు 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం, జనవరి 4న అంధుల లిపి ప్రదాత లూయీ బ్రెయిలీ జన్మదినోత్సవం వికలాంగులు జరుపుకుంటారు.
వికలాంగులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు-రాయితీలు
వికలాంగుల పునరావాసంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా అనేక పథకాలు రాయితీలు ప్రవేశపెట్టింది. అవి-
క) సాంఘిక న్యాయం, అధికారిత్వ మంత్రిత్వ శాఖ ద్వారా వివిధ కేటగిరీలకు చెందిన వికలాంగుల నిమిత్తం జాతీయ సంస్థలు, వాటి పరిధిలో ప్రాంతీయ సంస్థలు నెలకొల్పడం జరిగింది. అవి :
1) అంధులకు జాతీయ సంస్థ డెహ్రడూన్‌లో
2) మూగ, బధిర వికలాంగులకు జాతీయ సంస్థ ముంబాయిలో
3) చలన సంబంధమయిన లోపం కలవారి జాతీ సంస్థ కలకత్తాలో
4) మానసిక వికలాంగుల కొరకు జాతీయ సంస్థ - బోయినపల్లి, సికింద్రాబాద్‌లో పనిచేస్తున్నాయి.
ప్రతి సంస్థకు వాటి అవసరా లననుసరించి ప్రాంతీయ సంస్థలు నెలకొల్పడం జరిగింది. ప్రతి జాతీయ సంస్థలో ఇతర కేటగిరీలకు చెందిన వికలాంగులకు కూడా సమాచారం అందించే నిమిత్తం ఆయా కేటగిరిల విభాగాలను ఏర్పాటు చేశారు. ఇవిగాక చలన సంబంధమైన వికలాంగుల నిమిత్తం ఢిల్లీలో ఒక సంస్థ (|.ఆ.క.) కటక్‌లో నిర్థార్‌ (ఒరిస్సా), చలన సంబంధమైన పరికరాల సరఫరా నిమిత్తం కాన్పూరులో అలింకో సంస్థ ఉన్నాయి. బధిర వికలాంగుల శిక్షణ నిమిత్తం, హైదరాబాదులో ఒక శిక్షణ పనిచేస్తున్నది.
వికలాంగుల పూర్తి పునరావాసం లక్ష్యంగా పైలట్‌ ప్రాజెక్టులు దేశంలో 11 చోట్ల మంజూరు చేయగా ఒకటి విజయవాడలో పనిచేస్తుంది. అవి పూర్తి స్థాయి సంస్థలుగా 1991 నుంచే మార్పు చెందినవి.
వికలాంగుల సేవలో నిమగ్న మయిన ప్రభుత్వేతర సంస్థలకు ప్రత్యక పాఠశాలలు స్థాపించడం దగ్గర నుంచి పరికరాల సరఫరా వరకు వికలాంగుల పునరావాసంకు అవసరమయిన ఏ పథకం కైన 90 శాతం నిధులు మంజూరు చేసి మారుమూల గ్రామాలలోని వికలాంగు లకు సైతం సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో, కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం అభ్యున్నతి మంత్రిత్వ శాఖ, పథకాలు అమలు చేస్తుంది.
ప్రతిభావంతులైన వికలాంగులకు, వికలాంగులకు అధిక సంఖ్యలో ఉద్యోగాలిచ్చి ఆదుకొనే సంస్థలకు వికలాంగుల కదలిక వగైరాల నిమిత్తం పరిశోధనలు చేసి కొత్త, కొత్త పరికరాలు కనుగొన్న వ్యక్తులకు, సంస్థలకు జాతీయ పురస్కారాలు ప్రతి సం||ము ప్రపంచ వికలాంగుల దినోత్సవమైన డిశెంబరు 3వ తేదీన భారత రాష్ట్రపతి ఒక ప్రత్యేక ఫంక్షన్‌లో అందచేస్తారు.
ఖ) కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ :
ఈ శాఖ పరిధిలో ప్రతి రాష్ట్రంలో వృత్తి పునరావాస కేంద్రాలు స్థాపించబడినవి. మన రాష్ట్రంలో విద్యానగర్‌, అవరణ హైదరాబాద్‌లో ఈ కేంద్రం పనిచేస్తుంది. వికలాంగుల ఉపాధి స్వయం ఉపాధికి సూచనల నిమిత్తం ప్రత్యేక ఉపాధి కేంద్రాలు, ప్రత్యేక సెల్స్‌ పనిచేస్తున్నాయి. మన రాష్ట్రంలో హైదరాబాద్‌, విశాఖపట్నంలో ఉన్నాయి.
గ) ప్రయాణ రాయితీలు :
అ) రైల్వే శాఖ : రైళ్ళ ప్రయాణానికి వికలాంగులయిన వారికి ఎస్కార్టులో 75 శాతం ప్రయాణ రాయితీ ఉంది. మూగ, బధిర వికలాంగులకు ఎస్కార్టు సౌకర్యం లేదు. అంధులు, చలన సంబంధమయిన వైకల్యం కలవారు, క్షయ, క్యాన్సర్‌ జబ్బుతో బాధపడేవారు. మానసిక వికలాంగులు, లెప్రసీ వ్యాధి సోకిన వారు (నాన్‌-ఇన్‌ఫెక్షన్‌) తలస్వేమియా వంటి పెద్ద వ్యాధులు సోకినవారు ఈ రాయితీకి అర్హులు.
ఆ) పౌర వియానయాశం : విమాన ప్రయాణంలో అంధులైన వారికి ప్రయాణ రాయితీ.
ఇ) టూరిజం శాఖ : ప్రభుత్వ టూరిజం కార్పోరేషన్‌ హోటల్స్‌లో బసచేసే వికలాంగులకు రాయితీలు పంపుటకు పోస్టేజ్‌ రాయితీ, లైసెన్సు ఫీజు, అంధ వికలాంగులకు శిక్షణ యిచ్చే సంస్థలకు వైర్‌లెస్‌ సెట్లు ఉపయోగించేందుకు కట్టే కస్టమ్‌ డ్యూటీ రాయితీలు.
ఈ) కస్టమ్‌ డ్యూటీ రాయితీలు : అంగవైకల్యం అధిగమించడానికి అవసర మయ్యే వస్తువులు విదేశాల నుంచి తెప్పించు కోవలసి వస్తే కస్టమ్‌ డ్యూటీ రాయితీ ఇస్తారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వాతావరణ సెన్సర్స్‌, డ్రాఫ్టింగు, డ్రాయింగు ఎయిడ్స్‌, ప్రత్యేక గడియారాలు, ఆర్థోపెడిక్‌ పరి కరాలు, వీల్‌ చైర్స్‌, ఆడియో క్యాసెట్‌ మొదలగునవి. అంధ మరియు బధిర వికలాంగులకు సంబంధించిన రిజిస్టర్డ్‌ కో-ఆపరేటివ్‌ సంఘాలు ఎక్విప్‌మెంట్‌, పరికరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఘ) మానవ వనరుల అభివృద్ధి :
అ) వికలాంగులయిన బాలబాలికలకు గ్రామీణ ప్రాంతాలలో విద్యావకాశాలు అందుబాటులో తెచ్చేందుకు సమీకృత విద్యావిధానం (ఇన్‌టిగ్రేటెడ్‌ ఎడ్యుకేషన్‌) ప్రవేశపెట్టారు. ఈ విద్యావిధానంలో వికలాంగులయిన పిల్లలకు ఎన్నో సౌకర్యాలు కలుగచేసారు. పుస్తకాలు యితర స్టేషనరీ నిమిత్తం సం||కు రూ.400 యూనిఫార్మ్‌ అలవెన్స్‌ రూ.50/- ట్రాన్స్‌పోర్టు ఎలవెన్సు నెలకు రూ.50 అంధ విద్యార్థులకు రీడర్స్‌ అలవెన్సు నెలకు రూ.50/- ఎస్కార్టు, అలవెన్సు ఎక్విప్‌మెంటు కొనుటకు అయ్యే అసలు ఖరీదు 5 సంవత్సరములకు రూ.2,000 మించకుండా మంజూరు.
ఆ) విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం సంవత్సరానికి ఒక్క ఫెలోషిప్‌ అయినా వికలాంగుడయిన యువ విద్యార్థికి ఇవ్వాలని సూచించింది.
విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం విశ్వవిద్యాలయాలకు ఈ దిగువ సూచనలిచ్చింది.
అ) విశ్వవిద్యాలయాలు, కాలేజీలలో ఉపాధ్యాయ వృత్తికి అర్హులైనపుడు, అంధులనే సాకుతో నిరాకరించకూడదు.
ఆ) అర్హత గల అంధులయిన అభ్యర్థులను బ్యుటోరియల్‌ పనికి, పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులకు నియమించవచ్చును. అయితే పరిమిత సంఖ్య ఉన్నపుడే వారికి నియమించాలి.
ఇ) సంగీతం నేర్పే పోస్టులకు అంధులయిన అభ్యర్థులకు ప్రాధాన్యత యివ్వాలి.
చ) ఆదాయపు పన్ను రాయితీలు :
ప్రభుత్వ ఉద్యోగి వికలాంగుడయితే ఆదాయపు పన్ను చట్టం 461లోని కొన్ని క్లాజులననుసరించి 80 యు రాయితీలు యివ్వబడినవి. అలాగే ప్రభుత్వ ఉద్యోగిపై పూర్తిగా ఆధారపడిన వికలాంగులని నిమిత్తం కూడా సెక్షన్‌ 80 డి ఇంద రాయితీ కల్పించబడింది.
ఛ) గృహవసతి :
జనరల్‌ పూల్‌ ఇండ్ల కేటాయింపు- అర్హులయిన కేంద్ర ప్రభుత్వ వికలాంగులయిన ఉద్యోగస్తులకు గృహవసతి కేటాయింపులు సానుభూతితో పరిశీలించి ప్రతి ఉద్యోగస్తుని అవసరం ప్రతిపదికన జరుగుంది. ఇది వారిక జనరల్‌ పూల్‌ ఇండ్ల కేటాయింపు కంటే చాలా ముందుగా జరుగుతుంది. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ వారు షాపులను, 1 శాతం ఇండ్ల స్థలాలను 1 శాతం ఇండ్లను (ప్లాట్స్‌) వికలాంగులకు కేటాయించారు.

జ) ఇతర సౌకర్యాలు :
అ) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ నియామకములో 10 సం|| యమో సడ లింపు ఇవ్వబడింది. వికలాంగులు యస్‌.సి., యస్‌.టి. అభ్యర్థులయితే మరో 5 సంవత్సరములు అదనంగా వయో సడ లింపు ఉంటుంది.
ఆ) వికలాంగులయిన అభ్యర్థులకు టైపు అర్హత వారు ఇతరత్రా అర్హులయితే సడలించబడింది. టైపు చేయలేరని మెడికల్‌ బోర్డు సర్టిపై చేస్తే సరిపోతుంది. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ మెడికల్‌ బోర్డు ఇస్తే సరిపోతుంది. సకలాంగుల వలే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ విధానం అంతా ఆచరించవనసరం లేదు.
ఇ) మూగ, చెవుడు అభ్యర్థులను క్లరికల్‌ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించరాదు.
ఈ) ఒకే కన్ను అంధత్వం గల వార్ని గ్రూపు సి.డి. ఉద్యోగాలకు, వారు దృష్టి తీవ్రత అవరోధం కానట్లయితే మెడికల్‌ బోర్డు సిఫార్సు చేయవచ్చును.
ఉ) వికలాంగులయిన కేంద్ర ప్రభుత్వోద్యోగులకు క్రొత్త వేతన సవరణ సంఘం స్కేల్స్‌ అనుసరించి ప్రయాణ రాయితీ కొన్ని నిబంధనల మేరకు అత్యధికంగా నెలకు రూ.750/-లు మంజూరు చేయబడినది. ఇది ఈ వేతన సవరణ సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వంచే క్రొత్తగా ప్రవేశపెట్టిన పథకం.
ఊ) వికలాంగులయిన వ్యక్తులను కేంద్ర ప్రభుత్వ శాఖలలో గల గ్రూపు సి.డి. ఉద్యోగ నియామకాలలో 3% రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారు. (అంధులకు 1% బధిరులకు 1%, చలన సంబంధమైన వారికి 1%)
ఋ) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు విక లాంగులయిన పిల్లలు ఉన్నట్లయితే 1 నుంచి 12వ తరగతి వరకు నెలకు రూ.50/- ఫీజు రీయింబర్స్‌మెంటు యిస్తారు.
ౠ) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల పదవీ విరమణ అనంతరం ఉద్యోగస్తులు వారి యితర సహచరులు కాలం చేసిన తర్వాత, వారికి మానసిక వికలాంగులయిన సంతానం ఉన్నట్లయితే అట్టి మానసిక విక లాంగునికి దగ్గరి బంధువులను గార్డియన్‌గా పెన్ష్‌నర్‌ నామినేట్‌ చేస్తే అట్టి వికలాంగుని జీవితకాలమంతా కుటుంబ పెన్షన్‌ వస్తుంది. ఇదే సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు వర్తిస్తుంది.
  • ==========================
Visit My Website - > Dr.seshagirirao-MBBS