ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1985 డిసెంబర్ 17 తేదీన చేసిన తీర్మానం ద్వారా ఇంటర్నేషనల్ వలంటీర్ డే ఫర్ ఎకనామిక్ , సోషల్ డెవలప్మెంట్ ను ప్రకటించినది . డిసెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం " ఇంటార్నేషనల్ వలంటీర్ డే ఫర్ ఎకనామిక్ , సోషల్ డెవలప్ మెంట్ ,ను పాటించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వివిధ ప్రభుత్వాలకు పిలుపు ఇచ్చింది . స్వచ్చంద కార్యకర్తలు , కమిటీలు , సంస్థలు , స్థానిక , జాతీయ , అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి కోసం తమ వంతు కృషిని అందిస్తారు . ప్రభుత్వ సంస్థలు , లాభేతర సంస్థలు , కమ్మ్యూనిటీ గ్రూపులు , ఎకడమిక్ ప్రవేట్ రంగం తో కలసి అభివృద్ధి లో భాగం పంచుకోవడానికి ప్రజలు , స్వచ్చంద కార్యకర్తలకు ఈ రోజు ఒక మహత్తరమైన అవకాశం వంటిది . ఇన్ని సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ వలంటీర్ డే ను న్యూహత్మకం గా ఉపయోగిస్తున్నారు . మిలీనియం అభివృద్ధి లక్ష్యాల్ని అందుకోవడానికి అనేక దేశాలు స్వచ్చంద కార్యకర్తల సేవలపై దృష్టిని సారించాయి . పేదరికము , ఆకలి , రుగ్మతలు , నిరక్షరాస్యత , వాతావరణలోపాలు , మహిళలపట్ల వివక్ష వంటి సమస్యల్ని ఎదుర్కోవడం లో లక్ష్యాలు నిర్ణయించి ఆ దిశగా వలంటీర్లను ప్రోస్తహిస్తున్నారు .
ఐక్యరాజ్యసమితి వ్యవస్థ , ప్రభుత్వాలు , స్వచ్చంద కార్యకర్తల భాగస్వామ్యం గల సంస్థల పరస్పర సమన్వయం తో ఏర్పడింది ఈ ఇంటర్నేషనల్ వలంటీర్ డే . మీడియా , ఎకడమిక్ , ఫౌండేషన్లు , ప్రవేటురంగం , ఫెయిత్ గ్రూఫ్స్ , స్పోర్ట్స్ , ఎఇక్రియేషన్ సంస్థల పతినిధులు కూడా ఆ యా కార్యక్రమాల్లో పాల్గొంటారు . 2001 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వలంటీర్స్ గా ప్రకటించారు . జపాన్ పభుత్వం యు.ఎన్.జనరల్ అసెంబ్లీ52 వ స్వ్షన్ సందర్భం గా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కు చేసిన ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు . 1997 లో 123 దేశాల సహాయ సౌజన్యముతో తీర్మానము చేశారు . 2001 లో యునైటెడ్ నేషన్స్ వలంటీర్స్ ప్రొగ్రామ్ ను డిజైన్ చేసారు . 2008 లో ఈ యు.ఎన్. ని గుర్తింపును వక్కాణిస్తూ యు.ఎన్ తీర్మానం చేసింది . 2011 లో పదో వార్షికోత్సవం నాటికి ప్రపంచవ్యాప్తం గాగల వలంటీర్లు , కమ్యూనిటీలు సాధించాల్సిన లక్ష్యాలు నిర్ణయిస్తారు .
ప్రపంచవ్యాప్తం గా శాంతి , అభివృద్ది లకు మద్దతుగా వలంటీరిజాన్ని మెరుగుపరచడానికి ఏర్పడ్డ ఐక్యరాజ్య సంస్థకు చెందినదీ యునైటెడ్ నేషన్స్ వలంటీర్స్ ప్రోగ్రాం . డిసెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం " ఇంటార్నేషనల్ వలంటీర్ డే ఫర్ ఎకనామిక్ , సోషల్ డెవలప్ మెంట్ ,ను పాటించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వివిధ ప్రభుత్వాలకు పిలుపు ఇచ్చింది .
- =========================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .