Showing posts with label National Farmers Day - జాతీయ రైతు దినోత్సవం. Show all posts
Showing posts with label National Farmers Day - జాతీయ రైతు దినోత్సవం. Show all posts

Thursday, January 10, 2013

National Farmers Day - జాతీయ రైతు దినోత్సవం


  •  

  •  
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసెంబర్‌ 23 న) -రైతు దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

డిసెంబర్‌ 23 న -అంతర్జాతీయ రైతు దినోత్సవం (ఇంటర్నేషనల్‌ ఫార్మర్స్‌ డే). మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌సింగ్‌ జన్మదినం అయిన ఈ రోజును భారత్‌లో రైతు దినోత్సవం (కిసాన్‌ దివస్‌) గా జరుపుకుంటారు. భారత భాగ్య విధాతా! జీవన సౌభాగ్య ప్రధాతా! ఓ రైతన్నా నీకు మా నెనరులు!
ఈ లోకాన్నీ నడిపించే ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడైతే ఆ సూర్యుడినుండి వచ్చే శక్తిని వినియోగించుకుని లోకములోని ప్రజలందరి ఆకలి బాధను తొలగించె పరోక్ష దైవాలు రైతులు. నేలతల్లిని నమ్ముకొని , పలురకాల ప్రతికూల పరిష్తితులను తట్టుకుంటూ , శ్రమించి పంటలను పండించి దేశ ఆర్ధికవ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తారు వ్యవసాయధారులు . ఒకప్పుడు అందరి వృత్తీ వ్యవసాయమే.
--
రైతుకుటుంబము నుండి వచ్చి ప్రధాని పదవిని అలంకరించిన చరణసింగ్ జన్మదినమైన డిశంబరు 23 ని జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం గా (కిసాన్‌ దివస్ ) జరుపుకుంటోంది భారతదేశము.

అంతర్జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం ఏప్రిల్ 17 న జరుపుతారు. అయితే మనదేశము తమకంటూ ప్రత్యేకముగా వ్యవసాయదారుల దినోత్సవం ఉండాలనే లక్ష్యముతో చౌదరి చరణ్ సింగ్ జన్మదినోస్తవాన్ని అందుకు ఎంచుకున్నారు.  చౌదరి చరణ్ సింగ్ చేపట్టిన ఉద్యమాల ఫలితం గానే జమీందారీ చట్టం రద్దు అయింది. కౌలుదారీ చట్టం వచ్చింది. మరికొందరు నాయకుల ఆలోచనల నుండి భూసంస్కరణలొచ్చాయి. పేదలకు భూముల పంపిణీ జరిగింది. వ్యవసాయదారులకు అనుకూలమైన  పరురకాల విధానాలను రూపొందించడం జరిగింది. రైతులను  వడ్డీ్వ్యాపారుల కబంధహస్తాలనుండి విడిపించి వారికి బ్యాం ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టేలా చేయడం వెనుక చరణ్ సింగ్ నిర్వహించిన రైతు ఉద్యమాలున్నాయి. రైతుల గురించి , వ్యవసారం గురించి అంతగా ఆలోచించి , వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన చరణ్ సింగ్ దేశ ప్రధాని అయినపుడు రైతాంగం ఆనందపడింది .  అయితే ఆయన పార్లమెంట్ ని ఎదుర్కోలేకపోయి  తాత్కాలిక ప్రధానిగానే 1980 వ సంవత్సరము పదవి నుండి తప్పుకోవాల్సివచ్చింది. చరణ్ సింగ్ రైతు నాయకుడిగానే 1987 మే 29 న మరణించారు. రైతులకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని " కిసాన్‌ దివస్ " గా ప్రకటించింది.

వ్యవసాయం

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార మరియు ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి (Agriculture) అంటారు. వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్ధిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము.
ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమిష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే నని అంచనా.

చరిత్ర

ఆదిమ మానవులు మొదటగా జంతువుల మాంసం, దుంపలు, కాయలు, పండ్లు మొదలైన వాటిని ఆహారంగా తీసుకునేవారు. కొంత కాలమైన తర్వాత నెమ్మదిగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని కొద్ది మొత్తంలో ఆహారాన్ని ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు. ఆధునిక పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పప్పుదినుసులు మొదలైన ఆహార పదార్థాలు, పశుపోషణ మొదలైన వృత్తులు క్రీపూ 7000 లోనే మధ్యధరా ప్రాంతానికి చెందిన దేశాల్లో బాగా వ్యాప్తి చెంది ఉండేవి. . క్రీ.పూ 3000 నాటికి ఈజిప్షియన్లు, మెసపుటేమియన్లు పెద్ద ఎత్తున వ్యవసాయ పద్ధుతులు, ఎరువుల వాడకం, సాగునీటి పద్ధతులు చేపట్టారు

హరిత విప్లవం

భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి ఒక కారణం వ్యవసాయంలో పురాతన పద్దతులు పాటించడం. వ్యవసాయంలో యాంత్రీకరణం ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పాదకతలను పెంచే నిమిత్తమై మూడో ప్రణాళికా కాలం నుంచే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించడం ఈ ప్రణాళిక యొక్క ముఖ్యోద్దేశం.

భారతదేశంలో వ్యవసాయం--భారతదేశంలో పంట కాలాన్ని మూడు విధాలుగా వర్గీకరించారు. అవి
    ఖరీఫ్ పంట కాలం : జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్క జొన్న, పత్తి,చెరకు, నువ్వులు, సోయాబీన్, వేరు శనగ.
    రబీ పంటకాలం : అక్టోబర్ నుంచి మార్చి, ఏప్రిల్ వరకు సాగయ్యే పంటలు - గోధుమ, బార్లీ, మినుములు, ప్రొద్దు తిరుగుడు, ధనియాలు, ఆవాలు మొదలైనవి.
    జైద్ పంటకాలం : మార్చి నుంచి జూన్ వరకు సాగయ్యే పంటలు - పుచ్చకాయలు, దోస కాయలు, కూరగాయలు, మొదలైనవి.


  • =============================

 Visit My Website - > Dr.seshagirirao.com/