Showing posts with label International child Abuse prevention day. Show all posts
Showing posts with label International child Abuse prevention day. Show all posts

Monday, October 3, 2011

అంతర్జాతీయ బాలల అత్యాచార నివారణ దినోత్సవం ,International child Abuse prevention day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబర్‌ 19) -అంతర్జాతీయ బాలల అత్యాచార నివారణ దినోత్సవం - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము



ప్రతి సమ్వత్సరము -- నవంబర్‌ 19 జరుపుకుంటున్నారు .
బాలలపై అత్యాచారం... స్ర్తీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ 2007వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా చేసిన ఒక సర్వే లో బాలలు... ముఖ్యంగా పసిపిల్లలు, 5-12 సంవత్సరాల మధ్య వయస్సు వారు, ఎక్కువ హింసకు, అత్యాచారానికి గురవుతున్నారని తెలియజేసింది. ఈ అత్యాచారాలు భౌతిక, లైంగిక, మనస్సుకు సంబందించినవి.
ఈ అధ్యయనంలో భయంకర వాస్తవాలు వెలుగుచూశాయి.

భౌతిక అత్యాచారం...
- ప్రతి ముగ్గురి పిల్లల్లో ఇద్దరు శ్రమదోపిడికి గురవుతున్నారు.
- 69% శ్రమదోపిడికి గురవు తున్న పిల్లల్లో 54.68% బాలురే.
- 50% పైగా పిల్లలు ఒకటి లేదా పలురకాలైన శ్రమదోపిడికి గురవుతున్నారు.
- కుటుంబపరంగా శ్రమదోపిడి కి గురవుతున్న పిల్లలలో 88.60% మందిని తమ తల్లితం డ్రులే ప్రోత్సహిస్తున్నారు.
- మిగతా రాష్ట్రాలతో పోల్చి చూ స్తే ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, ఢిల్లీలలో పిల్లలు ఎక్కువగా శ్రమదోపిడి గురవుతున్నారు.
- 50.20% బాలలు వారాని కి ఏడు రోజు లు పని చేస్తు న్నారు.

లైంగిక అత్యాచారం...
- 53.22% బాలలు ఒకటి లేదా పలురకా లైన లైంగిక అత్యాచారాన్ని ఎదుర్కొన్నవారే.
- ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, ఢిల్లీలలో బాలలు, బాలికలు ఎక్కువ శాతం లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు.
- 21.90 % బాలలు తీవ్రమైన లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు.
- 50.76 % ఇతర లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు.
- ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బీహార్‌ మరియు ఢిల్లీలలో అత్యధిక శాతం బాలలు లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు.
- 50% లైంగిక అత్యాచారాలు పిల్లలకు బాగా నమ్మకమున్న వారు, బాధ్యతతెలిసిన వారే చేయడం విచారకరం.

మానసిక అత్యాచారం, బాలికల పట్ల నిర్లక్ష్యం...
- ప్రతి రెండవ పిల్లవాడు మానసిక అత్యాచారానికి గురవుతున్నాడు.
- మానసిక అత్యాచార విషయంలో బాలబాలికలు సమానస్థాయిలో ఉన్నారు.
- 83% కేసులలో తల్లితండ్రులే నిందితులు.
- 48.40% బాలికలు తాము బాలురుగా పుట్టి వుంటే బాగుండునని కోరుకుంటున్నారు.

  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/