Monday, October 3, 2011

అంతర్జాతీయ బాలల అత్యాచార నివారణ దినోత్సవం ,International child Abuse prevention dayగత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబర్‌ 19) -అంతర్జాతీయ బాలల అత్యాచార నివారణ దినోత్సవం - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాముప్రతి సమ్వత్సరము -- నవంబర్‌ 19 జరుపుకుంటున్నారు .
బాలలపై అత్యాచారం... స్ర్తీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ 2007వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా చేసిన ఒక సర్వే లో బాలలు... ముఖ్యంగా పసిపిల్లలు, 5-12 సంవత్సరాల మధ్య వయస్సు వారు, ఎక్కువ హింసకు, అత్యాచారానికి గురవుతున్నారని తెలియజేసింది. ఈ అత్యాచారాలు భౌతిక, లైంగిక, మనస్సుకు సంబందించినవి.
ఈ అధ్యయనంలో భయంకర వాస్తవాలు వెలుగుచూశాయి.

భౌతిక అత్యాచారం...
- ప్రతి ముగ్గురి పిల్లల్లో ఇద్దరు శ్రమదోపిడికి గురవుతున్నారు.
- 69% శ్రమదోపిడికి గురవు తున్న పిల్లల్లో 54.68% బాలురే.
- 50% పైగా పిల్లలు ఒకటి లేదా పలురకాలైన శ్రమదోపిడికి గురవుతున్నారు.
- కుటుంబపరంగా శ్రమదోపిడి కి గురవుతున్న పిల్లలలో 88.60% మందిని తమ తల్లితం డ్రులే ప్రోత్సహిస్తున్నారు.
- మిగతా రాష్ట్రాలతో పోల్చి చూ స్తే ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, ఢిల్లీలలో పిల్లలు ఎక్కువగా శ్రమదోపిడి గురవుతున్నారు.
- 50.20% బాలలు వారాని కి ఏడు రోజు లు పని చేస్తు న్నారు.

లైంగిక అత్యాచారం...
- 53.22% బాలలు ఒకటి లేదా పలురకా లైన లైంగిక అత్యాచారాన్ని ఎదుర్కొన్నవారే.
- ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, ఢిల్లీలలో బాలలు, బాలికలు ఎక్కువ శాతం లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు.
- 21.90 % బాలలు తీవ్రమైన లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు.
- 50.76 % ఇతర లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు.
- ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బీహార్‌ మరియు ఢిల్లీలలో అత్యధిక శాతం బాలలు లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు.
- 50% లైంగిక అత్యాచారాలు పిల్లలకు బాగా నమ్మకమున్న వారు, బాధ్యతతెలిసిన వారే చేయడం విచారకరం.

మానసిక అత్యాచారం, బాలికల పట్ల నిర్లక్ష్యం...
- ప్రతి రెండవ పిల్లవాడు మానసిక అత్యాచారానికి గురవుతున్నాడు.
- మానసిక అత్యాచార విషయంలో బాలబాలికలు సమానస్థాయిలో ఉన్నారు.
- 83% కేసులలో తల్లితండ్రులే నిందితులు.
- 48.40% బాలికలు తాము బాలురుగా పుట్టి వుంటే బాగుండునని కోరుకుంటున్నారు.

  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .