Monday, October 3, 2011

నేడు అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం ,International girls child Day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (September 24th) నేడు అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం -గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

September 24th

మా ఇంట ఆడపిల్ల పుట్టింది... మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటిదీపం అని సంభరపడి సంబరాలు చేసుకునే ఆ నాటి పరిస్థితి భూతద్దం పెట్టి వెదికినా ఈనాడు కనిపించదు. ప్రస్తుతం ఆడ పిల్ల పుట్టిందంటే అయ్యో ఆడపిల్లనా అని తల్లిదండ్రుల వైపు సానుభూతిగా చూసే పరిస్థితి. ఆడపిల్లను ఎందుకు కన్నామా? అని తల్లిదండ్రులు కంటనీరు పెట్టడం ఈనాడు మనం చూస్తున్నాం.

స్త్రీల అభివృద్ధి కాంక్షించే వారందరినీ ఆవేధనకు గురిచేస్తున్న సమస్య రోజురోజుకు పడిపోతున్న స్త్రీ, పురుష నిష్పత్తి.ఈనాడు దేశవ్యాప్తంగా 1000 మంది బాలలు ఉంటే 933 మంది బాలికలు ఉన్నారని, ఇక మన రాష్ట్రంలో 1000 మంది బాలలకు 972 మంది బాలికలున్నారు. దీనిని బట్టి చూస్తే ఆడపిల్లల జనన శాతం ఎంతగా పడిపోతుందో అర్థమవుతుంది.

నేటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా స్త్రీ పురుషుల మధ్య అసమానతలు కొనసాగుతుండటం, లింగ వివక్ష, ఆడపిల్లల పట్ల నేరాలు పెరగడం, ముఖ్యంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న వరకట్న దురాచారం పెచ్చుమీరడం వల్ల పెళ్లీడుకు వచ్చిన అమ్మాయి గుండెల మీద కుంపటిలా భావించడం ద్వారా భ్రూణహత్యలు పెరిగిపోతున్నాయి. అనంతపురం లాంటి కరవు ప్రాంతాలలో ఆడపిల్లలను వ్యభిచారానికి ప్రోత్సహించడం, ఇతర ప్రాంతాలకు అమ్మడం జరుగుతుంది. ఈనాడు అమ్మాయిలు మగవాడికి తామేమీ తీసిపోమన్నట్లుగా అన్ని రంగాలలో ఆకాశమే హద్దుగా

ధైర్య సాహాసాలు ప్రదర్శిస్తూ దూసుకెళ్తున్నారు. అయినా ద్వితీయ శ్రేణి పౌరురాలుగానే గుర్తించబడుతున్నారు. లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, వరకట్న వేధింపులకు బలవుతున్నారు.ఆరు సంవత్సరాల అమ్మాయి నుండి 60 సంవత్సరాల ముసలి బామ వరకు హత్యాచారానికి బలవుతున్న దుస్థితి కనిపిస్తుంది. అమ్మాయిలు స్కూళ్లకు, కళాశాలకు, పని ప్రదేశాల నుండి ఇంటికి వచ్చువరకు తల్లిదండ్రులకు ఒకటే ఆందోళన. ఏ ప్రేమోన్మాది వెంటపడి తమ బిడ్డను ఏం చేస్తాడోనని తల్లిదండ్రులు ఆవేధన. ఈ పరిస్థితికి కారణం ప్రసార మాధ్యమంలో స్త్రీని చూపే విధానం. స్త్రీల శరీరాన్ని ఒక వస్తువుగా చూపడం, స్త్రీల శరీరాన్ని లైంగిక దృష్టితో చూపడం, వ్యాపార ప్రకటనలు, ఇలాంటివన్నీ బాలికలపై, మహిళలపైన అత్యాచారాలకు, లైంగిక హింసకు గురవుతున్నాయి. మహిళలకు, అమ్మాయిలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం నిర్వీర్యమై ఆడపిల్లల పట్ల జరుగుతున్న హింసను నిశ్చిలంగా చూస్తుందే తప్పా రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వరకట్న నిషేధ చట్టం లాగానే, లింగనిర్దారణ నివారణ చట్టం నీరుగారిపోయింది. లింగనిర్దారణ పరీక్షలు జరిపినందుకు ఒక్క డాక్టర్‌నైనా లేక ఒక వ్యక్తినైనా దోషిగా నిలబెట్టి పిఎన్‌డిటి యాక్టు ద్వారా శిక్షించిన దాఖలాలు దేశవ్యాప్తంగా ఎక్కడా లేదు. ఈవ్‌టీజింగ్‌, లైంగిక వేధింపులు, అత్యాచార దాడులు ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట లెక్కకు మించి జరుగుతూనే ఉన్నా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం గుడ్లప్పగించి చూస్తున్నాయే తప్పా ద్రోషులను శిక్షించడం లేదు. ఆడ పిల్లల సమస్య వారిఒకరిదే కాదు ఇది సమాజ సమస్యగా భావించినప్పుడే ఆడపిల్లల పట్ల అభద్రతా భావం పోయి ఆడపిల్ల పుట్టిందంటూ ఆనందపడే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై చర్యలు తీసుకోవాలి. లైంగిక వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌, ర్యాగింగ్‌ తదితర సమస్యలపై తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు కౌన్సిలర్లతో కమిటీలు నియమించాలి. రాష్ట్రస్థాయిలో పిల్లల హక్కుల కమీషన్‌ ఏర్పాటుచేయాలి, పుట్టిన పిల్లలను చెత్తకుండీలలో పడివేయకుండా 108 తరహాలో సమాచార వ్యవస్థ ఏర్పాటుచేసి ప్రభుత్వమే తీసుకొని సంరక్షించాలి. తప్పిపోయిన

పిల్లల కోసం ఏర్పాటుచేసిన వసతి గృహాలలో కనీస, మౌళిక వసతులు మెరుగుపరచాలి. ప్రాథమిక విద్యకు నిధులు కేటాయించాలి, బాల కార్మీకుల కేసుల్లో అక్కడికక్కడే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి, మండల కేంద్రాలలో ఆడపిల్లలకు వృత్తి, విద్యా, శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేయడం లాంటివి చేస్తూ, వరకట్న దురాచారాన్ని రూపుమాపేలా చర్యలు తీసుకుంటే ఆడపిల్ల పుట్టిందంటూ అదిరిపడటమా అని, ఆనందపడే రోజులు వస్తాయి.
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .