ఆగస్టు 3న జాతీయ గుండె మార్పిడి దినోత్సవం. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 1967లో గుండె మార్పిడి విధానం క్రిస్టియాన్ బర్నార్డ్ చేశారు. 1994లో ఎయిమ్స్ డాక్టర్ పి.వేణుగోపాల్ ఆధ్వర్యంలో భారత దేశంలో గుండె మార్పిడి విధానం జరిగింది. ఈ విధానాన్ని 2004లో మన రాష్ట్రంలో లక్దీకపూల్ గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖులే చేశారు.
3 ఆగస్టు 2011న జాతీయ గుండె మార్పిడి దినోత్సవం సందర్భంగా హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ గురించి డాక్టర్ గోపాలకృష్ణ గోఖులే మాట్లాడుతూ “గుండె శరీరంలో చాలా ముఖ్యమైందని తెలిపారు. గుండెలో గోడలు, కవాటాలు రక్తం ఓ పద్ధతిలో ప్రవహించడానికి పనిచేస్తుంటాయి. ఇవి దెబ్బతింటే ప్రమాదం అని అన్నారు. గుండెకు రక్తం రసఫరా చేసే కరోనరి ఆర్టరీ శాఖల్లో అడ్డంకులు ఏర్పడితే రక్త ప్రసరణలేక ఈ ప్రాంత గుండె కందర కణాలకు మరణిస్తాయని, ఈ పరిస్థితిని గమనిస్తే చికిత్స ద్వారా సరి చేయవచ్చని పేర్కొన్నారు.
హృదయ స్పందనలో మార్పులు ఉన్నప్పడు, గుండె కండరాల వ్యాధితో బాధపడుతున్నప్పుడు, కంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కు దారి తీసినప్పుడు, పుట్టుకతో తీవ్రమైన గుండె లోపాలుండి ఆపరేషన్ తో నయం చేయలేని స్థితిలో ఉన్నవారికి తప్పని సరిగా గుండె మార్పిడి విధానం చేయాలి.
ఊపిరితిత్తులు, లివర్, నరాల వ్యాధులు, రక్తనాళాల సమస్యలు, హెపటైటిస్ ఇన్ఫెక్షన్, తలలో క్యాన్సర్, ఇన్సులిన్ తీసుకుంటున్న మధుమేహ వ్యాధి గ్రస్థులకు గుండె మార్పిడి పనికి రాదు
- =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .