అంతర్జాతీయ ఆర్ధిక ప్రగతిలో వైమానిక విభాగానికి కీలక పాత్ర ఉన్ననది . ప్రపంచ వ్యాప్తముగాగల ప్రజల నడుమ స్నేహము , అవగాహన పెరగడానికి , ఆర్ధిక , సామాజికముగా ఎదిగేందుకు ప్రత్యక్షముగా , పరోక్షముగా ఈ విభాగము దోహదపడుతుంది . ప్రపంచవ్యాప్తముగా గల జబాభాకు ఆర్ధిక , సామాజిక , సాంస్కృతిక ప్రయోజనాలను అందజేస్తుసంది . ఏడాదికేడాది వైమానిక రవాణాకు ప్రాధాన్యము పెరుగుతూవస్తోంది . అవకాశాలు విస్తృతం అవుతున్నాయి . ప్రపంచీకరణలో వైమానిక రంగానికే తొలి ప్రధాన్యము . లక్షలాది మంది ప్రయాణికులు ఈ రంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. కార్గోవిమానాలు , ప్యాసింజర్ విమానాలు సముద్రాలు దాటుతూ ఖండాంతర సరిహద్దుల్ని చెరిపేసున్నాయి . ఖండాల నడుమ ఆర్ధిక పురోగతికి వైమానిక శాఖ తన వంతు కృషిని అందిస్తున్నది . ప్రపంచ మార్కెటిలో వ్యాపారానికి ముఖ్యముగ ద్వీప కల్పాల నడుమగల చిన్న దేశాలకు ఇతోధికంగా సాయ పడుతున్నారు . ప్రపంచములో అతి పెద్ద పరిశ్రమ అయిన ట్ర్రావెల్ మరియు టూరిజం లో ఇది అంతర్భాగము . సామాజిక ప్రయోజనాల కల్పన మరో ముఖ్యమైన , విలువైన పని . అలాగే లక్షలాదిమందికి విమానాలు , విమానాశ్రయాలు , ఏరోస్పేస్ కంపెనీల్లో ప్రత్యక్షము గా , పరోక్షం గా ఉద్యోగాలు కల్పిస్తుంది .
ఇంతతి మహోన్నత పాత్రగల వైమానిక విభాగాన్ని గుర్తిస్తూ ప్రతియేటా డిసెంబర్ 07 న "ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే " ని నిర్వహిస్తున్నారు . ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ 1994 లో ఈ రోజును ఆరంభించినది . ఈ సంస్థ 1994 డిసెంబర్ 07 వ తేదీన ఏర్పాటైనది . సంస్థ 50 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అందుకు గుర్తుగా " ఎ 29-1 అసెంబ్లీ తీర్మానం ద్వారా ఏవియేషన్ డే ను ప్రకతించారు . కెనడియన్ ప్రభుత్వ సహకారముతో ఐసిఎఒ (ICAO) చొరవతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానము ద్వారా డిసెంబర్ 07 తేదీని అంతర్జాతీయ వైమానిక దినం గా అధికారికంగా ప్రకటించింది . అధికారిక ఐక్యరాజ్యసమితి దినాల జాబితో చేర్చారు .
సామాజిక , ఆర్ధికాభివృద్ధి లో అంతర్జాతీయ వైమానిక విభగానికిగల ప్రపంచ ప్రాముఖ్యం గురించి ప్రజలకు జాగృతపరచడం , అంతర్జాతీయ విమాన రవాణా క్రమబద్దీకరణ , రక్షణ , సామర్ధ్యం పెంపుదలలో ఐసిఎఒ పాత్ర గురించి తెలియజెప్పడము ఈనాటి ముఖ్య ఉద్దేశ్యం . వైమానిక భద్రత విషయం లో ఐసిఎఒ అత్యవసర నాయకత్వ పాత్ర పోషిస్తుంది . ప్రపంచవ్యాప్తం గా వైమానిక భద్రతను పెంపొందించడం ఈ సంస్థ పూర్తిస్థాయి లక్ష్యము . వివిదహ్ ప్రభుత్వాలకు భద్రతా ప్రమాణాల అమలులో సహకరించడం , వాటి లోటుపాట్లను పరిష్కరిండము లో ఈ సంస్థ బాగా సహకరిస్తుంది . అలాగే వాతావరణం పై వైమానిక ప్రబావము లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రోస్తహిస్తుంది . 2050 దాకా ప్రపంచమంతటా ఏటా 2 శాతము చొప్పున ఇంధన సామర్ధ్యాన్ని మెరుగుపరచాలని , విమానానికి గ్లోబల్ సిఒ2 ప్రమాణాలు పాటించాలని అంతర్జాతీయ వైమానికరంగమ్లో మార్కెట్ ఆధారిత అంచనాలతో ఫ్రేమ్ వర్క్ అవసరమని సిఒ2 ఎమిషన్ల పై ఐసిఎఒ ద్వరాఅన్ని దేశాల కార్యక్రమాలకు , ప్రణాళికలకు సమన్వయం అవసరమని ఐసిఎఒ సభ్యులంతా అంగీకరంచారు . ఈ సిఫార్సులన్నింటినీ ఈ యేడాది డిశంబరు 07 తేదీన ఐసిఎఒ అసెంబ్లీ సమీక్షింది . 190 దేశాల నడుమ వైమానిక విభాగానికి సంబంధించిన అన్ని రంగాల్లో సహకారానికి ఈ సంస్థ ఓ వేదికగా పనిచేస్తోంది .
విమానయానం లో శరీర స్పందన : ఆరోగ్యముగా ఉన్నవాళ్ళు కూడా విమానాలలో ప్రయాణించేటప్పుడు అంతవరకు అనుభవం లేని వాతావరణ స్థితిని , తెలియని అందోళనను ఎదుర్కొంటారు . విమానం కదలిక , గాలిలోకి ఎగరడం లాంటి స్థితిని కొత్తగా చవిచూసినప్పుడు అసౌకర్యభావన కలగవచ్చు . శరీరం లో గహణశక్తి గల వివిధ అవయవాలు భిన్నమైన అనుభూతుల్ని కేంద్రనాడీవ్యవస్థకు పంపుతాయి . అన్ని అనుభూతుల మధ్య సమన్వయము , సమతౌల్యము పొందలేని శరీరం విమానయానానికి అనుకూలముగా మారుతుంది . విరేచనానికి వెళ్ళాలన్న అనుమానం కలుగుతుంది . మనం ఓచోట కూచుని చుట్టూ చూడగలం . . అయితే చెవులు లేదా అంతరంగికంగా ఉండే గ్రహణ అవయవాలు మనం పైకి , కిందకు కదులుతున్న ఆనుభూతులను గహించి స్పందిస్తాయి . అప్పుడు తలతిరుగుడు , ఆకలి లేకపోవడం , కళ్ళు తిరిగినట్తుగా అనిపించడం , తేనుపులు , నోటిలో అధికంగా లాలాజలం ఊరడం లాంటివి జరుగుతాయి .
తీసుకోవలసిన జాగ్రత్తలు :
- విమానం లో కూర్చున్న తర్వాత బాగా రిలాక్స్ (మానసికంగా) కావాలి ,
- హాయిగా ప్రయాణించడానికి అనువుగా ఉండే సీట్లు ఎంపిక చేసుకోవాలి . విమానం ఎక్కేముందు మితిమీరిన ఆత్రుత పనికిరాదు .
- ప్రయాణానికి ముందు మద్యము సేవించకూడదు , సుగంధ ద్రవ్యాలు గల ఆహారపదా్ర్ధాలు విమానములో ప్రయాణించే ముందు తీసుకోకూడదు . విమానము లో అటు ఇటు ఎక్కువగా తిరగకూడాదు .
- విమానము లోపల ఉన్నవాటిని చూసేందుకు లేదా అంశాలను చదివేందుకు యత్నించకుండా ముందువైపు దూరం గా ఉన్నటువంటి వస్తువులను చూస్తూ కూర్చోవాలి . ప్రయాణానికి ముందురోజు తగినంతగానిద్రపోవాలి .
- నిమ్మికాయ చప్పరించడం వంటి వాంతిని తగ్గించే లక్షణము గల పదార్ధములనే తినాలి .
- సిగరేట్ తాగకూడదు .
- =========================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .