Tuesday, December 14, 2010

అంతర్జాజీతీయ స్త్రీ హంసా వ్యతిరేక దినోత్సవం , International Day for the Elimination of Violence agaist Women


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (November 25) "అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము " గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


" ఓ దేశ మహిళ స్థితిగతుల్ని చూసి ఆ దేశ పరిస్థితిని ఇట్టే చెప్పేయవచ్చును " అన్నారు పండిత జవహర్ లాల్ నెహ్రూ. నిజమే కదా . ఒక దేశ మహిళలు ఆ దేశము యొక్క నాగరికతకు ప్రతిబింబం వంటి వారు . నాగరికత ఆరంభం అయిననాటి నుంచి భారతీయ మహిళలకు ఎంతో గుర్తింపు , ప్రాధాన్యత ఉన్నాయి . మన దేశములోని గొప్ప మహిళల గురించి చరిత్ర పేర్కొంటుంది ఎన్నో విశేషాలు . దేశ జనాభా లో దాదాపుగా సగము సంఖ్య వారిది . వివిద రూపాలలో జాతీయ , ఆర్ధిక పురోగతిలో మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారు . మహిళలు మంచి స్థాయిని అనుభవిస్తున్నట్లయితే అక్కడి సమాజము సరైన వికాసం తో , బాధ్యతతో ఉన్నదని అర్ధము .

ప్రాచీన భారతం లో ఈ జీవితం లోని అన్ని కోణాల్లోనూ పురుషు లతో సమంగా తమ స్థాయిని అనుభవించే వారు . పురుషులు మాదిరిగానే చదువుకునే వారు . గొప్ప పండితులు , కవయిత్రులు , ఫిలాసఫర్లు గా ఎదిగినవారూ ఉన్నారు . ఒక్క మాటలో చెప్పలంటే స్త్రీ ఆ రోఉల్లో " లక్ష్మీ దేవి " కి తీసిపోని స్థానాన్ని అనుభవించినది . అర్ధాంగి గా సంపూర్ణ పాత్ర పోషించేది . స్వయంవరం ద్వారా తన భర్త ను ఎంఫికచేసుకునే స్వేచ్చ ఆనాటి మహిళలకు ఉండేవని పురాణాలు వలన మనకు అవగతం అవుతుంది . వైదిక యుగం తరువాత స్త్రీ స్థాయి తగ్గనారంభించింది . సమాజము లో లింగవివక్షత పాకడం మొదలైంది . మధ్య ప్రాచీన కాలం నాటికి మహిళ స్థితిగతుల్లో గణనీయమైన తేడాలొచ్చేశాయి . నిజం చెప్పాలంటే స్త్రీ జీవితం లో చీకటికోణము మొదలైంది .. అప్పుడే.

నేటి సమాజము లో స్త్రీ లు అనేక సామాజిక , ఆర్ధిక , రాజకీయము , విద్యాపరము గా సమస్యలు ఎదుర్కొంటున్నారు . గృహ హింసలు , స్త్రీలపై అత్యాచారాలు , లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి . అత్మనూనతా భావానికి లోనై స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . వీటిన్నింటినీ అరికట్టే ప్రయత్నములో 1999 డిసెంబరు 17 వ తేదీన ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని చేసింది . ప్రతి సంవత్సరము నవంబరు 25 న స్త్రీల హక్కుల పరిరక్షణ , స్త్రీ హింసా వ్యతిరేక దినము గా పాటించాలని ఈ తీర్మానము సారాంశము .
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .