Monday, December 13, 2010

సరిహద్దు బద్రతాదళ దినోత్సవము , Border Security Force Day


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (December 01)సరిహద్దు బద్రతాదళ దినోత్సవము గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.



సరిహద్దు భద్రతాదళాలు భారతదేశ సరిహదూ భూభాగాల్ని పరిరక్షస్తూ సరిహద్దుల వెంబడి ఎటువంటి చొరబాట్లు జరక్కుండా పరిరక్షిస్తుంటాయి . ఈ కార్యకలాపాల నిర్వహణ కోసం సరిహద్దు భద్రతాదళానికి విసృతమైన ఇంటలిజెన్స్ నెట్ వర్క్ ఉన్నది . 1965 ఆరంభము లో కచ్ భూభాగము ద్వరాపాకిస్తానీయులు చొరబడడం తో అదే సంవత్సరము దిశంబరు 01 వ తేదీన సరిహద్దు భద్రతాదళాన్ని ఏర్పాటు చేసారు .
BSF లో దాదాపు 1,80,000 సైనికులు ఉన్నారు . అప్పట్లో 26 బెటాలియన్‌లు తో ఏర్పాటు అయిన బి.యస్ .యఫ్ . ఇప్పుడు " ఆర్గానిక్ ఆర్టిల్లరి , ఎయిర్ , యానిమల్ , వాటర్ వింగుల సహకారము తొ 157 బెటాలియన్లకు విస్తరించి ప్రపంచము లోనే అతిపెద్దదైన బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్ గా ఆవిర్భవించినది . దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్ల భారత సరిహద్దులును పరిరక్షించడము , చొరబాట్లను , సరిహద్దు ప్రాంతాల నేరాల్ని నిరోధించడము , సరిహద్దు వెంబడి ప్రజలకు రక్షణ కల్పించడము , నిద్రోహ చర్యలను ఎదుర్కోంటూ , ఉగ్రవాద చర్యలను , ఉగ్రవాద చొరబా్ట్లను అరికడుతూ , జాతీయ విపత్తుల్లో సహాయ సహకారాలు అందించడం , రక్షణ చర్యలు చేపట్టడము , శాంతి భద్రతల పర్యవేక్షణలో సాయపడడము వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాయి .

1990 ఆరంభము లో చొరబాటులను ఎదుర్కోడానికి సైన్యము తన దళాల్ని పంపేందుకు సంసిద్ధత వ్యక్తము చేయకపోవడముతో భారత ప్రభుత్వము పూర్తిస్థాయి ప్రారామిలటరీ దళాల్ని కాశ్మీరుకు పంపినది . బి.యస్.యఫ్. అంతకుముందెన్నడు చిరబాట్లను అరికట్టే ఆపరేషన్లు నిర్వహించలేదు ... అయితే తదనంతర కాలములో బి.ఎస్.ఎఫ్. తనకు తాను సరిహద్దు దళమం గా మారి ఆయా ప్రదేశాల్లో ఇంటలిజెన్స్ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుంది . ప్రత్యేక పరికరాలు శిక్షణ లేకుండానే మరిన్ని యూనిట్లు కాశ్మీర్ చేరుకున్నాయి .

తొలి మూడేళ్ళలో సరిహద్దు భద్రతాదళం చేపట్టిన కఠిన చర్యల ఫలితం గా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదన్న ఆరోపణల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది . తీవ్రవాదులకు సహకరిస్తున్నారన్న అనుమానం తో నిర్భందితులపై ఒత్తిడి చర్యలు బాగా పెరిగాయి . వెయ్యిమంది చొప్పున్న గల కనీసం 56 బెటాలియన్ల సరిహద్దు భద్రతాదళం కాశ్మీర్ లో మోహరించినది . కాశ్మీర్ లోయలో 39 , దోడా జిల్లాలో 7 దళాలు చిరబాటు నియంత్రణ ఆపరేషన్స్ లో నిమగ్నమై ఉన్నారు . మరో 10 బెటాలియన్లు నియంత్రణ రేఖ వెంబడి నిరంతర నిఘాలో నిమగ్న మై ఉంటారు .
ఉగ్ర వాదులతో జరిపిన పోరాటాల్లో 1990 నుంచి 2010 వరకు దాదాపు 5000 (ఐదు ) వేల మంది తీవవాదులను బి.ఎస్.ఎఫ్ హతమార్చింది . ఇంచుమించు 12 వేల మందిని నిర్బంధించింది . అనేక వేల ఆయుధాల్ని , వందకోట్ల రూపాయిల విలువైన నిషిద్ద వస్తువులను స్వాధీనపరచుకోవడం జరిగింది . 1500 మంది సైనికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు . వీరు మదేశ భద్రతకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరము డిసెంబరు 01 న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డే ని నిర్వహిస్తారు .
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .