Saturday, December 11, 2010

National Law Day , జాతీయ న్యాయ దినోత్సవం


  • ప్రతి సంవత్సరము నవంబర్ 26 న జరుపు కుంటారు .
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబర్ 26 న )National Law Day(జాతీయ న్యాయ దినోత్సవం) గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

మన దేశము లో ప్రతి ఏటా నవంబర్ 26 న " నేషనల్ లా డే " నిర్వహిస్తారు . 1979 లో నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ రొజున న్యాయ దినోత్సవం నిర్వహించాలని ప్రకటించారు . 1949 లో భారత రాజ్యాంగ కమిటి, రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది . కమిటీ సభ్యులు 1949 నవంబరు 26 వ తీదీన తొలి ముసాయిదా ప్రతుల పై సంతకాలు చేశారు . అది 1950 జనవరి 26 వ తీదీ నుంచి అమల్లోకి వచ్చింది . రాజ్యాంగ మౌలిక లక్ష్యం -- సామాజిక , ఆర్ధిక , రాజకీయ న్యాయాన్ని అందరరికీ అంచించడం . ఈ లక్ష్యము ప్రజల హక్కులకు రూపాన్ని ఇచ్చింది . ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిరక్షించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి గల , సమర్ధవంతమైన న్యాయాన్ని ఇవ్వగల వ్యవస్థ అవసరము . చట్టము ముందు సమాన పరిగణన , వ్యక్తిగత స్వేచ్చ వంటి అంశాల అధ్యయనము ద్వారా బారతీయ న్యాయవ్యవస్థ కీలక సామాజిక పాత్రను బలోపేతము చేయడం జరిగినది .

ముఖ్యముగా గత మూడు దశాబ్దాలలో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్‌ (పి.ఐ.యల్) ఉద్యమ వికాసము తర్వాత ఇది మరింతగా బలపడింది . హక్కుల అవగాహనను వివిధ దశల్లో విసృత పరిచారు . ప్రాధమిక హక్కులకు పెద్దపీట వేశారు . వీటన్నింటికీ రక్షణ న్యాయవవస్థ . . . కాబట్టి రాజ్యాంగ ముసాయిదా సంతకాల రోజును జాతీయ న్యాయదినోత్సవాన్ని జరపడానికి ఎంచుకున్నారు . ఈ దినోత్సవము నాడు న్యాయవాదులు సమావేశమై ప్రతిజ్ఞ చేస్తారు . చట్టము ముందు అందరూ సమానమేనని తెలిలజేయడం , సత్వర న్యాయము కోసము కృషిచేయడం .. న్యాయదినోత్సవ ధ్యేయాలు . ప్రభుత్వాలు చట్టాలు ప్రజా వ్యతిరేకముగా ఉన్నా, రాజ్యాంగాన్ని అతిక్రమించేవిగా ఉన్నా అవి చెల్లవని చెప్పే అధికారము రాజ్యాంగ ధర్మాసనాలకు ఉన్నది .. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పులకు కూడా చట్ట హోదా ఉంటుంది .

2008 నాటికి 1.8 కోట్ల కేసులు కోర్టుల ముందు పెండింగ్ లో ఉన్నట్లు అంచనా . కొన్నేళ్ళుగా పెండింగ్ కేసుల పెరుగుదల స్థిరము గా కొనసాగుతున్నది . 2008 లో 14,000 మంది న్యాయమూర్తులు 1.7 కోట్ల కేసుల్ని పరిష్కరించారు . సగటున ఒక్కోన్యాయమూర్తికి ఏటా 1200 కేసులు చొప్పున పరిష్కరించగలరన్నమాట. కేసుల నమోదు రేటు రాను రాను పెరుగుతుంది . మనదేశము లో న్యాయమూర్తుల కొరత ఉన్నందున కేసుల పరిష్కారము సత్వరము జరుగుటలేదు . కేసు పరిష్కారానికి చాలా కాల వ్యవధి పడుతున్నది . న్యాయము అందడము లో జాప్యము జరుగుతుందన్న కారణముగా చాలా మంది కోర్టుల్ని ఆశ్రయించడానికి సందేహిస్తుంటారు . అయితే న్యాయవాద వృత్తిలో ఉన్న వారంతా చట్టబద్దము గా సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరము ఉన్నది . ఈ మేరకు ప్రజల్లో విశ్వాసము పెంపొందించగలగాలి . ఆప్పుడే న్యాయ పరిరక్షణ సంపూరణము కాగలదు ... న్యాయదినోత్సవం నిర్వహణ ప్రక్రియ ఫలవంతంగా ఉండగలదు .
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .