Friday, December 10, 2010

World Milk Day , ప్రపంచ పాలదినోత్సవం

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (జూన్ 01‌ ) ప్రపంచ పాలదినోత్సవం గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
  • ప్రపంచ పాలదినోత్సవం ప్రతి సంవత్సరము జూన్‌ 01 వ తేదీన జరుపుకుంటారు .
మిల్క్ డే ని అధికారికంగా జరపడం ఆరంభించి 10 సంవత్సరాలు అయింది . ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O)మానవ ఆరోగ్యములో పాలకున్న ప్రాధాన్యతను ప్రజలందరూ అర్ధము చేసుకోవాలనే లక్ష్యము తో ఈ " వరల్డ్ మిల్క్ డే " ని 2001 సం. లో శ్రీకారము చుట్టింది . అయితే అంతము ముందు అనేక దశాబ్దాల క్రితమే ప్రైవేటు సంస్థలు మిల్క్ డే ని జరుపుతుండేవి . అవి ఆయా దేశాఅలలో భిన్న తేదీలలో జరుగు తుండేవి . కొన్ని దేశాలలో జనవరి 01 న , కొన్ని దేశాలలో ఆగష్టు , సెప్టెంబరు నెలలో జరిగేవి . ఆ ప్రైవేటు సంస్థలు తమ అమ్మకాలులను పెంచుకునేందుకు పాల దినోత్సవాలను జరిపేవి .

కుటుంబాలకు అవసరమైన పాలకోసము ఎవరి ఇంట్లో వారే గేదెలను ,ఆవులను పెంచుకునే రోజులనుండి పశువుల పెంపకము , పాల ఉత్పత్తి , ఒక వృత్తిగా మారింది . అది నేటికీ భారతదేశము లో కొనసాగుతుంది . ప్రతిరోజూ " పాలండీ అమ్మగారు " అంటూ ఇంటిల్లి పాదిని నిద్రలేపే సన్నివేశము మనందరికీ తెలిసినదే . అలా ఇంటిముందు కొలిచి పాలను ఇవ్వడం వల్ల అనారోగ్యము వస్తుందని ... అందుకని పరిశుద్దమైన పరిసరాలలో పాలు పితికి , సీసాలో పోసి సరఫరా చేయాలనే ఉద్దేశ్యముతో స్వీడన్‌ లో మొదట సారిగా పాల వ్యాపారము మొదలైనది . 1878 లో అలా " మిల్క్ బాటిల్ " అనే ఆలోచన వచ్చి నది . ఆ మిల్క్ బాటిల్ నే తొలిగా సరఫరా చేసిన రోజునే ఆ సంస్థ " మిల్క్ డే " గా జరపటం మొదలు పెట్టింది . అలా ప్రతి దేశములో ఒక కొత్త కంపెనీ తమ వ్యాపార ఓపినింగ్ డే ని మిల్క్ డే గా ప్రకటించాయి . అటువంటి కంపెనీల రికార్డులన్ని పరిశీలించి జూన్‌ 01 న " మిల్క్ బాటిల్ " అందించినట్లు గా గుర్తించారు . ఆ తేదీనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) ఖరారు చేసింది . అలా గ్లాస్ బాటిల్ పాలు సరఫరా మొదలై ఇప్పుడు పాలిథీన్‌ కవర్లలోకి మారినది . మిల్క్ బాటిల్ స్థానము లో మిల్క్ ప్యాకెట్స్ రావడం మొదలైనది .

పాలకున్న ప్రాముఖ్యత ప్రత్యేకముగా చెప్పనక్కరలేదు . మనిషి తొలి ఆహారము తల్లిపాలు . భవిష్యత్తులో పిల్ల ఆరోగ్యమంతా తల్లి అందించే చనుపాలమీదే ఆధారపది ఉంటుంది . ఒక వయసు తర్వాత ఆవు , గేదె పాలు తాగడం మొదలు పెడతారు . తిరిగి వయసు మల్లి జీర్ణశక్తి మందగించిన తరువాత మనిషి ఆధారపడేది పాలమీదే . అనారోగ్యము వచ్చినా , ఆరోగ్యము మెరుగు పడాలన్నా పాలు త్రాగా్ల్సిందే . వయసుతో సంభందము లేకుండా తాగే పానీయము పాలు . ఒక్కోక్క ప్రారంతము లో ఒక్కొక్క జీవి పాలను ప్రజలు ఉపయోగిస్తారు . మన ప్రాంతములో అధికశాతము గేదె , ఆవు పాలను వినియోగిస్తారు . కొన్ని ప్రాంతాలలో మేక , గొర్రె , రాజస్తాన్‌ లొ ఒంటె పాలను , గంగా నదీతీరము ఆవు పాలును , మరికొన్ని ప్రాంతాలలో గుర్రం , గాడిద , ఏనుగు పాలును వాడు తారు .

జీవులలో పాలిచ్చి పిల్లల్ని పెంచేవి క్షీరదాలు ... చుంచెలుక మొదలుకుని ఏనుగు వరకు భిన్న సైజులలో ఆ జీవులుంటాయి . క్షీరదాలలో అత్యున్నత స్థాయికి చేరిన జీవి మనిషి . తల్లి పాలలో మిగిలిన పాలలో లభించని ప్రత్యేక ప్రొటీన్‌ ఉన్నది . దీనిలో లినోలిక్ యాసిడ్ , ఓలిక్ యాసిడ్ లు అధికము . లవణాలు తక్కువ . వీటివలన పసివయసులో మూత్ర పిండాలమీద ఒత్తిడి పడకుండా ఉంటుంది . అయితే ఏ జీవిపాలను కుటుంబాలు తీసుకుంటాయనేది స్థానికము గా అందుబాటు ను బట్టి ఉంటుంది . పాలల్లో అధికంగా ఉండేది కెసిన్‌ ప్రోటీన్‌ మిసెల్లెస్ . దీనిలో కాల్సియం లభిస్తుంది . పొటాసియం , మెగ్నీషియం , సెలీనియం , విటమిన్‌ ' ఎ ' , విటమిన్‌ 12 , విటమిన్‌ ' డి ' కె
' వంటివి పాలలో లభిస్తాయి . పాలు టానిక్ వంటివి . పాలను తాగితే హైపర్ టెన్‌షన్ , రక్తనాళాల జబ్బులు , గుండె జబ్బులు వచ్చే అవకాశము తక్కువ . శరీరము అంతగా లావెక్కదు . జీర్ణ నాళ కాన్స్ ర్ వచ్చే శాతము తక్కువ . పాలు తాగితే కండరాలకు చక్కని రూపము వస్తుంది .
‌పాలలో పాదార్దాల నిష్పత్తి : శాతము -> ప్రతి 100 యం .ఎల్ పాలలో ..........
నీరు ---------------------: 80.
ప్రోటీన్‌--------------------:3.2.
కొవ్వులు -----------------:4.1 ,
కార్బోహైడ్రేట్స్ -------------: 4-5 .,
కొలెస్టిరాల్ ---------------: 8-10 ,
కాల్సియం ---------------: 120 ఐ.యు ,
శక్తి (కాలరీస్)------------: 67 ,

జంతువుల పాలను మనిషి ఉపయోగించడం సుమారు 7000 వేల ఏళ్ళ క్రితమే ఆరంభించాడు . జంతువులను మాంసము కోసమే పెంచడము మొదలు పెట్టిన మానవుడు ఆ తర్వాత ఆ జీవుల పాలను రుచిచూసాడు . అక్కడి నుండి గేదెల పెంపకాన్ని మొదలు పెట్టాడు . ఆరంభములో జంతువుల పాలు జీర్ణము చేసుకోవడం మనిషికి చాలా ఇబ్బంది గానే ఉండేది . పచ్చి పాలను తాగడం లో ఉన్న ఇబ్బందిని అధిగమించేందుకు పాలను వేడి చేయడం , ఇతర రూపాలలోకి మార్చే ప్రయత్నాలు... జరిగాయి . ఆ విధం గా మనిషి తన తొలి ప్రయోగాలను పాలతోనే ప్రారంభించాడు . నేడు మనం ఘనంగా చెప్పుకునే బయో టెక్నాలజీని పాలు తోడువేయడం అనే ప్రక్రియగా మనిషి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రారంభించాడు .

నిత్యజీవితం లో పాలకున్న ప్రాముఖ్యత ప్రత్యేకం గా చెప్పనవసరము లేదు . పాలు , పాలమీద వచ్చే మీగడ , పాల నుంచి తీసే వెన్న , వెన్న కాచగా వచ్చే నెయ్యి , పాలను తోడేస్తే పెరుగు , చిలికితే మజ్జిగ , పాలనుంచి తీసే జున్ను , ఇక పాలను ఉపయోగించి చేసే తీపి పదార్దాలు ... ఇలా పాలతో ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్నీకాదు . పాలను పొడిగామార్చి .. ఉత్పత్తి తక్కువగా ఉండే రోజుల్లొ ఉపయోగించుకునే విధానము వచ్చింది .

మన దేశము అనేక పాల డైరీ లు ... ఆనంద్ డైరీ , సంగం డైరీ , విజయ డైరీ మున్నగునవి గుర్తింపు పొందినవి ఉన్నాయి .
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .