Tuesday, December 7, 2010

Homeguards Day , హోంగార్డుల దినోత్సవం


  • ప్రతి సంవత్సరము డిసెంబర్ 06 న జరుపుకుంటారు .
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసెంబర్ 06) హోంగార్డుల దినోత్సవం గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.

ప్రజలకు భద్రత కల్పించేది ఎవరని ఏ విద్యార్ధిక్ని అడిగినా ......... వెంటనే వచ్చే సమాదానము ' పోలీసులు ' అని .. అది నిజమే . అయితే వారి వెన్నంటే ఉంటూ పగలనక్ , రేయనక నిత్యము అందుబాటులో ఉండే హోంగార్డులు అంతగా ఎవరికీ గుర్తుకు రారు . వీరు ఎన్నోరకాల విధులను నిర్వర్తితిస్తూ ప్రజలకు బయట ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటం లో కీలక పాత్ర పోషిస్తున్నారు . ట్రాఫిక్ నియంత్రణ , రాత్రి వేళల్లో పెట్రోలింగ్ , ఎన్నికల సమయం లో వి.ఐ.పి.లు వచ్చినప్పుడు , పండగలు జరిగినప్పుడు , ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు , పభుత్వ , ప్రైవేటు రంగ సంస్థలలో ఉద్యోగులు సమ్మె చేసినపుడు ... ఎక్కువశాతము విధులు నిర్వహించేది వీరే . నామమాత్రపు వేతనాలతో తమ జీవితాలను వలంటీర్లు గా సమాజానికి అంకితం చేస్తున్న హోంగార్డుల దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని కోరుకుందాం.
హోంగార్డుల వ్యవస్థ ఎలా ప్రారంభమైనది ?:
పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకము సన్నగిల్లడము తో అప్పట్లో కేంద్ర హోంమంత్రి గా ఉన్న మొరార్జీదేశాయ్ ప్రత్యామ్నాయ వ్యవస్థ కొసము ఆలోచించారు . సమాజములో చైతన్యవంతులు , విద్యావంతులు , సేవాభావమున్న వారిని ఏకం చేయాలని , వారు పోలీసులకు , ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని సంకల్పించారు . ఆ ప్రయత్నము ఫలించి శాంతిభద్రతల పరిరక్షణకు ఒక బృందము తయారైనది . అలా ఏర్పాటైన వ్యవస్థే " గృహ రక్షక దళ సంస్థ (HomeGuards)" 1946 డెసెంబర్ 06 న దేశము లో ఈ వ్యవస్థ ఆరంభమైనది . 1962 లో చైనా దురాక్రమణ జరిపినప్పుడు అక్కడ ప్రజలను ఆదుకోవడము లో హోంగార్డులు చేసిన కృషి , సేవలను జాతి ఎన్నటికీ మరువదు . అప్పటి నుండి హోంగార్డులు వ్యవస్థ పై గౌరవము పెరిగినది . దీంతో ఈ వ్యవస్థను రాస్ట్రాలలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయము జరిగింది .

సమస్యల మధ్యే విధులు :
రాస్ట్ర ప్రభుత్వము .. పోలీసు , అగ్నిమాపక , సైనిక దళాల్లో పని చేసే వారికి వివిధ పతకాలు , ప్రోత్సాహక్కల్ను క్రమము తప్పకుండా ప్రతి రిపబ్లిక్ దినోత్సవాల్లో అందిస్తోంది . . కానీ హోంగార్డులు ఏళ్ళ తరబడి స్వచ్చంద సేవలా పనిచేస్తున్నా వారికి కనీసము మెచ్చుకోలు కూడా ఉండటం లేదు . తమ గురించి కనీసము ఒక ప్రశంస అయినా విందామని నిరీక్షించే హోంగార్డులకు అడుగడుగునా నిరాశే ఎదురవుతుంది . అలాగే రోజుకు రూ.200 చోప్పున్న ఇవ్వాలని హోంగా్ర్డులు ఏళ్ళ తరబడి డిమాండ్ చేస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు . మరోవైపు పోలీసు అధికాలుల ఇళ్ళలో వంట చేయడము , మార్కెట్ కు వెళ్ళి సామాన్లు కొనుగోలు చేసి తీసుకు రావడం . షాపింగ్ లు , ఊర్లకు వెళ్తే సామానులు మోసుకెళ్ళడము , ఆఫీసర్ల పిల్లలు స్కూల్ కు తీసుకు వెళ్ళి రావడము , ఒళ్ళు నొప్పులుగా ఉంటే ఉన్నతాధికారులకు మసాజ్ చేయడం తదితర పనుల నుంచి తమను తప్పించాలని కోరుతున్నా వాటి నుంచి విముక్తి లభించడము లేదని హోంగార్డులు వాపోతున్నారు . అధికారుల చెప్పిన పనులు చేయక పోతే చేధింపులకు గురిచేస్తారని మరికొందరు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు .

శ్రీకాకుళం జిల్లాలో :
క్రమశిక్షణ , సహనము , సమయస్పూర్తి , నిజాయితీ ముఖ్య లక్షణాలుగా హోంగార్డుల వ్యవస్థ 1966 ఆగస్టు 29 న శ్రీకాకుళం జిల్లాలో ఏర్పడినది . ఆప్పటి కలెక్టర్ శంకరగురుస్వామి , ఎస్పీ కె .రాధాకృష్ణమూర్తి ల అధ్వర్యములో వ్యవస్థను ప్రారంభించారు . మొదటి కమాండెంట్ గా హెచ్ .కిషన్‌ సింగ్ నియమితులయ్యారు . ప్రస్తుతము (2010) 76 మహిళా హోంగార్డులతో పాటు మొత్తము 841 మంది కొనసాగుతున్నారు . ఎంపికైన ప్రారంభములో హోంగార్డులకు బేసిక్ , రిఫ్రెష్ ర్ , లీడర్ షిప్ వంటి అంశాలలో శిక్షణ ఇస్తుంటారు . ప్రస్తుతము వీరికి రోజుకు రూ.130 గౌరవ వేతనము ఇస్తున్నారు .
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .