సమాజంలో అణువణువునా అవినీతి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అవినీతి, అధికారం ఒేక నాణేనికి రెండు ముఖాలుగా మారిపోయారుు.అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని ఉరి తీసినా, చైనాలో అవినీతిని అడ్డుకోలేక పోయారు.
భారతదేశంలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రతీఏటా రూ.10లక్షల కోట్లు, రోజుకు రూ.2,750కోట్లు, గంటకు రూ.115కోట్లు, నిముషానికి రూ.1.80కోట్లు ఖర్చు పెడుతున్నారు. సుమారు తొమ్మిదికోట్ల మంది నిరుద్యోగులున్నారు. ఎనిమిదికోట్లు మంది పాఠశాలలకు దూరంగా ఉన్నారు. 35కోట్లుమంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. 52కోట్ల మందికి రక్షిత మంచినీరే లేదు. మరెందరికో మరుగుదొడ్లు సౌకర్యం లేనేలేదు. మరి మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్న సొమ్ము ఏమవుతుంది? ఇదే సామాన్యుడ్ని తొలుస్తున్న ప్రశ్న. ఎక్కడ చూసినా అవినీతి. ఏ పధకం ఊసెత్తినా అవినీతే. ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా అవినీతివరదే. ఎయిడ్స్ మహమ్మారీకన్నా ఎక్కువగా అదుపులేని పెనుభూతంగా మారి అభివృద్దికి అడ్డుగోలు అవుతుంది. చైనాతో పోలిస్తే అభివృద్దిలో వెనుకంజ వేస్తూ అవినీతిలో మనదేశం ముందుంది. 2007లో ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌ఫరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ సెంటర్ ఫర్ మీడియా స్పడీస్ (సిఎంఎస్) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో 11 ప్రజాసేవ అంశాల్లో ఏదో ఒకదానిని పొందేందుకు మూడువంతులు మంది నిరుపేదలు ఏడాది పరిధిలో రూ.900కోట్లు లంచాలుగా చెల్లించినట్లు తేలింది. 2003 అక్టోబర్ 31న అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ తరువాత డిసెంబర్9న అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.యూరప్‌లోని కొన్ని దేశాల్లో అవినీతి అతి తక్కువ స్థాయిలో ఉండగా, ఆఫ్రికాదేశాల్లో అవినీతి తారస్థాయిలో ఉంది.
అవినీతిని అంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై ఐక్యరాజ్యసమితి చారిత్రాత్మక పత్రాన్ని డిసెంబర్ 9న రూపొందించింది. దీంతో ప్రతీఏటా అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు.
అవినీతి ప్రభావం
అవినీతి కారణంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారుతాయి. దారిద్య్రం, వివిధ రంగాల్లో అస్థిరత పెరిగిపోతాయి. అంతిమంగా అది మౌలిక వసతుల వైఫల్యానికి, రాజ్య వైఫల్యానికి దారి తీస్తుంది. ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థలు, ఎన్జీవోలు, మీడియా, వ్యక్తులు కలసికట్టుగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకోవాల్సి ఉంది. అవినీతి వల్ల మానవ హక్కుల ఉల్లంఘనలు, మార్కెట్ అనిశ్చితి, జీవన ప్రమాణాల నాణ్యంలో క్షీణత లాంటివి చోటు చేసుకుంటాయి. వ్యవస్థీకృత నేరాలు పెరిగిపోతాయి.
అవినీతిని అరికట్టగలిగే మార్గాలు(నిరోధించడమెలా?)--
కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం, హక్కుల కమిషన్లను ఆశ్రయించడం, ఇంటర్నెట్, టీవీ, ప్రింట్ మీడియాను ఆశ్రయించడం, సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరడం వంటి వాటి ద్వారా అవినీతిని కొంతమేరకైనా తగ్గించవచ్చు. యాంటీ కరెప్షన్ సంస్థలు ఏర్పాటు చేయడం, రాజకీయ పక్షాలకు నిధులు అందించడం లో, పాలనావ్యవహారాల్లో పారదర్శకత పెంచడం, ప్రతిభ, సామర్థ్యం లాంటి అంశాల కారణంగా నియామకాలు, ప్రమోషన్లు చేపట్టడం లాంటి చర్యలు తీసుకోవాలని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లావా దేవీలను గుర్తించడం, వివిధ దేశాలు పరస్పరం సహకరించు కోవడం, అన్ని రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం లాంటి వాటి ద్వారా అవినీతిని కొంతమేరకు తగ్గించవచ్చు.
ఎన్నికల రాజకీయ వ్యవస్థలో అవినీతి తొలగించేందుకు సంస్కరణలు చేపట్టాలి. ప్రతీ కార్యాలయంలో సేవల వివరాలు అవి పొందే విధి విధానాలు ఏ పని ఎన్నిరోజుల్లో చేస్తారో వివరించే ఫిజికల్ చార్టర్‌లు చాలా శాఖల్లో ప్రకటించారు. వీటిని సక్రమంగా అమలుజరిగేలా కార్యాచరణ ఉండాలి. పారదర్శకతకోసం సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం ప్రజలకు తెలుసుకునే వీలు కలిగింది. దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే అవినీతి దూరమవుతుంది. కేంద్రీకృత పాలన అవినీతికి మూలమైంది. దీనికి విరుగుడుగా అధికార వికేంద్రీకరణ జరగాల్సి ఉంది. జవాబుదారీతనంతో స్థానిక ప్రభుత్వాలు సాధించాలి. మనదేశాన్ని మనమే రక్షించుకునే దిశగా ప్రతీఒక్కరూ అవినీతికి వ్యతిరేకంగా ప్రతిన బూనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
---
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సి.వి.సి.) గురువారం ఒక కొత్త వెబ్‌సైట్ 'విజ్ ఐ'ని ప్రారంభించారు. పౌరులె వరైనా అవినీతికి సంబంధించిన వీడియోలు లేదా ఆడియోలను నేరుగా తమ మొబైల్‌నుంచి ఈ వెబ్‌సైట్‌కు అప్‌లోడ్ చేయవచ్చు. ఇకనుంచి ఎవరైనా సరే అవినీతిపై కత్తి ఝుళిపించవచ్చు. చేయవలసిందల్లా... ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నారని తెలిస్తే వెంటనే రంగంలోకి దిగి మొబైల్ సహాయంతో సాక్ష్యాధారాలు సేకరించాలి. సివిసి వెబ్‌సైట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ సివిసి డాట్ ఎన్‌ఐసి డాట్ ఇన్ ఓపెన్ చేసి మొబైల్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఆడియోలు కాని వీడాయోలు కాని అప్‌లోడ్ చేయడం ప్రారంభించాలి. వాటిని తదుపరి విచారణకు కమిషన్ పరిశీలిస్తుంది. ప్రత్యామ్నాయంగా ఎవరైనా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా 9223174440కు ఎస్.ఎమ్.ఎస్. చేయవచ్చు. అవినీతిపై ఫిర్యాదు చేయడానికి పౌరులకు ఈ వెబ్‌సైట్ చక్కగా ఉపయోగపడుతుందని సి.వి.సి. పి.జె. థామస్ చెప్పారు. పౌరుల నుంచి ఫిర్యాదులు అందుకునేందుకు ఈ వెబ్‌సైట్ ఒక పోస్టాఫీసులా పని చేస్తుందని మాజీ సి.వి.సి. ఎన్. విఠల్ చెప్పారు. అయితే సి.వి.సి. మాత్రం కేవలం ఫిర్యాదులు సేకరించడానికే పరిమితం కాకుండా అవినీతి ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు ఆదేశించే అధికారాలు కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
భారత్‌లో అవినీతి
స్వతంత్ర భారతంలో ఉన్నతస్థాయి అవినీతికి బీజాలు 1948లో పడ్డాయి. నాటి జీపుల స్కామ్‌లో వి.కె కృష్ణమీనన్ పేరు విన్పించింది.
ఇదీ మన స్థానం.. ప్రస్థానం
దక్షిణాసియాలోనే గాకుండా యావత్ ప్రపంచంలోనూ అవినీతి బాగా ప్రబలిన దే శాల్లో భారత్ ఒకటి. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అధ్యయనం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో పని నిమిత్తం 75 శాతం ప్రజానీకం ంచాలు చెల్లించుకోవల్సి వచ్చింది. 2010కి పారదర్శకతకు సంబంధించి సంస్థ రూపొందించిన జాబితాలో మన ర్యాంకు171. కింది నుంచి 20వ స్థానం. భారత ఎంపీలు 540 మందిలో నాలుగోవంతు మంది క్రిమినల్ ఛార్జీలు ఎదుర్కొంటున్నట్లు 2008లో వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. మనుష్యులను అక్రమం గా తరలించడం, ఇమ్మి గ్రేషన్ నిబంధనల ఉల్లంఘ న, రేప్, హత్య లాంటి ఆరోపణలు కూడా వీటిలో ఉన్నాయి. 1948 నుంచి 2008 నాటికి దేశం నుం చి రూ. 20 లక్షల కోట్ల మేరకు డబ్బు అక్రమంగా విదేశాలకు చేరుకున్నట్లు ఓ అంచనా.
1950-80 మధ్యకాలం దాకా దేశంలో సోష లిజం ప్రభావిత విధానాలు అమల్లో ఉన్నాయి.
ని యంత్రణలు, రక్షణాత్మక విధానాలు, ప్రభుత్వ యాజమాన్యం అధికంగా ఉండేవి. ఇవన్నీ కూడా వ్యవస్థల్లో లొసుగుల అన్వేషణకు దారి తీశాయి. లైసెన్స్ రాజ్ వ్యవస్థ అవినీతికి ఊతమిచ్చింది. ఆ తరువాత వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు అవి నీతిని వ్యవస్థీకృతం చేసేందుకు దోహదపడ్డాయి. నేరగాళ్ళు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల మధ్య అనుబంధం బలపడింది. 1993 అక్టోబర్‌లో కేంద్ర మాజీ హోమ్ శాఖ కార్యదర్శి ఎన్.ఎన్ ఓహ్రా ఇచ్చిన నివేదికలో ఈ విషయం మరింత స్పష్టమైంది. అప్రచురితంగా ఉన్న ఈ నివేదిక అనుబంధాల్లో మరెంతో కీలక సమాచారం ఉన్నట్లు భావిస్తున్నారు.
కొన్నేళ్ళ క్రితం బీహార్‌లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఆహారంలో 80 శాతాన్ని అధికారులు కొల్లగొట్టారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యవస్థీకృత మాఫియా రాజ్యమేలుతోంది.
టెండర్లలో గోల్‌మాల్
టెండర్ల(tenders) దాఖలు, పనులు చేయడంలో కొంతమంది కాంట్రా క్టర్లదే ఇష్టారాజ్యంగా మారింది. చేపట్టిన పనుల్లో నాణ్యం సరిచూ డడంలో నిర్లక్ష్యం చోటు చేసుకుం టోంది. ఈ మొత్తం వ్యవహారంలో పాలకులు, అధి కారులు, కాంట్రాక్టుర్లు చేతులు కలుపుతున్నారు. ఫలితంగా రోడ్లు, ఆనకట్టలు లాంటి వాటిలో పెను అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.
వైద్యంలో...(health)--
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి అధికమైపోయింది. మందులు దొరక్కపోవడం మొదలుకొని అడ్మి షన్‌కు, మెరుగైన చికిత్సకు, రోగ నిర్ధారణ పరీక్షలకు లంచాలు ఇవ్వకతప్పని పరిస్థితి. బిడ్డ పుట్టినా, రోగి చచ్చినా ముడుపులు చెల్లించాల్సిందే. బీమా సంస్థలకు, ప్రయివేటు ఆసుపత్రులకు, ప్రభుత్వ సిబ్బందికి ఉన్న అవినీతి బంధం అందరికీ తెలిసిందే.
రవాణారంగం..
అవినీతికి మారుపేరుగా ఆర్టీఏ ను, ట్రాఫిక్ విభాగాన్ని చెబుతుం టారు. డ్రైవింగ్ లైసెన్సులు, పర్మి ట్లు, రవాణా, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన లాంటి అంశాల్లో అవినీతికి బాగా ఆస్కా రముంది. కేరళ లోని తిరువనంతపురం లాంటి విమానాశ్రయాల్లో ప్రయాణికుల విలువైన వస్తువులు తరచూ మాయమవుతుంటాయి.
ఆదాయపు పన్ను శాఖలో...(Income-Tax-Department-India)--
పన్ను చెల్లింపు లావాదేవీల్లో అనుకూలంగా వ్యవహరిం చేందు కు లంచాలు తీసుకుంటూ పటు ్టబడ్డ సిబ్బందికి లెక్కలేదు.
గనులు...
భారత్‌లోని గనుల్లో తవ్వితే బయటపడేది ఖనిజాలు కాదని, అవినీతి అని పలువురు విమర్శి స్తుంటారు.
న్యాయవిభాగంలో...(law)--
న్యాయవిభాగంలో అవినీతి ఇటీవలి కాలంలో అధికంగా వార్తల్లోకి ఎక్కు తోంది. ఒక న్యాయమూర్తిపై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే వరకూ వ్యవహారం వెళ్లింది. న్యాయ మూర్తులను ప్రలోభ పరిచే యత్నాలు జోరందుకున్నాయి. కేంద్రమంత్రి ఒకరు కూడా ఈ వివాదంలో చిక్కుకున్నారు.
సైనికదళాల విభాగంలో...
త్రివిధదళాల అధికారు లెందరో అవినీతికి పాల్పడ ినట్లు ఆరోపణలు వచ్చాయి. రక్షణ రహస్యాలను విక్ర యించే వారు కొందరైతే, ఆయా ఉపకరణాలను నల్లబ జారుకు తరలించిన వారు మరికొందరు. తుపాకులు, క్షిపణులు, విమానాల కొనుగోలులోనూ అక్రమాలు చోటు చేసుకున్న ఉదంతాలున్నాయి. భోఫోర్స్‌లాంటి వాటిని ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
పోలీసు వ్యవస్థలో...
వ్యక్తి నుంచి డబ్బులు తీసు కొని ప్రత్యర్థి ముఠా నేతల ను ఎన్‌కౌం టర్ చేయడం మొదలుకొని తప్పుడు కేసులు బనాయించడం వరకూ ఎన్నో రకాలుగా పోలీసు వ్యవస్థలో అవినీతి చోటు చేసుకుంది.
ఆధ్యాత్మిక వ్యవహారాల్లో...
ఉత్తర భారతదేశంలో కొన్ని చర్చ్‌ల వ్యవహారాల్లో అక్రమా లు చోటు చేసుకున్నాయని కొంత మంది చర్చ్ నాయకులే ఆందోళన వ్యక్తం చేశారు. బాప్తిజం సర్టిఫి కెట్లను అమ్ము కుంటున్న ఉదంతాలు కోకొల్లలు. హిందూ, ముస్లిం ధార్మిక వ్యవహారాల్లోనూ ఇలాంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దానధర్మాలుగా ఇచ్చిన భూము లు, ఇతర ఆస్తులు చేతులు మారుతున్నాయి.
కొత్త వ్యవస్థల రూపకల్పన
అవినీతికి కళ్ళెం వేసేందుకు నూతన విభాగాల,వ్యవస్థల ఏర్పా టు యత్నాలు కూడా దేశంలో జరి గాయి. కేంద్ర, రాష్టస్థ్రాయిలో అవినీతి నిరోధక విభాగాల ఏర్పా టు, లోకాయుక్త, అంబుడ్స్ మన్ వ్యవస్థలు, సమాచారహక్కు చట్టం లాంటివి ఇలాంటివే.
ఎన్‌జీవోల పాత్ర...
అవినీతిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు ప్రభుత్వేతర సంస్థలు కృషి చేస్తున్నాయి. ఫిఫ్త్ పిల్లర్ అనే సంస్థ జీరో రూపీ నోట్లను జారీ చేసింది. ఎవరైనా లంచం అడిగితే వీటిని ఇవ్వాల్సిందిగా సూచించింది. లంచం తీసుకోవడం నేరం అనే హెచ్చరిక ఆ నోట్లపై ఉంటుంది. టాటా గ్రూప్ చేపట్టిన జాగో రే కార్యక్రమానికి కూడా మంచి స్పందన లభించింది. అందులో పది లక్షల ఓట్లు పోలయ్యాయి.
- =========================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .