Sunday, December 5, 2010

భారత నౌకాదళ దినోత్సం , Indian Navy Day


ప్రతి సంవత్సరము డిసెంబర్ 04 న భారత నౌకాదళ దినోత్సం , Indian Navy Day -- జరుపుకుంటారు .


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (Dec 04) Indian Navy Day గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

విధి నిర్వహణలోప్రాణాలు కోల్పోయిన నౌకదళ సిబ్బందికి శనివారం ఇక్కడ ఘన నివాళులు అర్పించారు. ఇండో- పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా 1971లో కరాచీ ఓడల రేవులో అనేక మంది భారత నావీ సిబ్బంది ప్రాణాలు విడిచారు. ఆ యుద్ధంలో భారతీయ నావికాదళం చూపించిన తెగువ వల్లే పాక్ ఘోరంగా ఓడిపోయింది. దానికి గుర్తుగా డిసెంబర్ 4న దేశ వ్యాప్తంగా నేవీ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత నౌకాదళం ప్రావీణ్యాలు, సత్తా చాటే విధంగా పలు యుద్ధ విన్యాసాలు ప్రదర్శించారు.నౌకాదళ దినోత్సవంలో తమిళనాడు- పాండీచ్ఛేరి నావల్ ఇన్‌చార్జి రాజీవ్ గిరోత్రా, పలువురు నేవీ రిటైర్డ్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాక్‌పై సాధించిన విజయానికి గుర్తుగా నావీ వీక్‌గా పాటిస్తున్నారు. తమిళనాడులోని మైలాపూర్, కరపక్కంలలోని వృద్ధాశ్రయాల్లో దస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు.

అబ్బురపరిచిన నౌకా విన్యాసాలు--విశాఖపట్నం,

విశాఖ సాగర తీరానికి దాదాపు యాభై నాటికల్‌ మైళ్ల దూరంలో వున్నట్టుండి ఒక్కసారి భీకర శబ్దాలు...శత్రుదేశాల నౌకలను గురిచేసి ఆయుధాలను సంధించిన నావికాదళాలు...ఈ పరిస్థితిని గమనించిన నావికాదళ హెలికాఫ్టర్‌ కూడా అప్రమత్తమైంది. క్షణాల్లో నౌకవైపు దూసుకుపోయింది. నౌకపై దిగీ దిగ్గానే నావికాళ సభ్యులు గుళ్ల వర్షం కురిపించారు. ఇదంతా కళ్లకు కట్టినట్టు నావికాదళ అధికారులు మంగళవారం చూపించారు. నావికా ఉత్సవాల్లో భాగంగా తూర్పు నావికాదళం మంగళవారం 'డేఎట్‌ సీ' కార్యక్రమం నిర్వహించింది. డిసెంబర్‌ 4న నౌకాదళ దినోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతియేటా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతోపాటు, మీడియా ప్రతినిధులను డే ఎట్‌ సీ కు తీసుకువెళ్తారు. రియర్‌ అడ్మిరల్‌ పి.మురుగేశన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని పలు కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత వివిధ అంశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం దాదాపు 900మంది పాఠశాల విద్యార్థులు, 500వందల మంది రక్షణ శాఖలో పనిచేస్తున్న వారి బంధువులు, 20మంది సీనియర్‌ సిటిజన్స్‌ను ఐఎన్‌ఎస్‌ జలాశ్వ నౌకలో నడిసముద్రంలోకి తీసుకువెళ్లారు. నెమ్మదిగా కదులుతున్న నౌకపై ఒకదాని వెనుక ఒకటి చొప్పున ఆరు హెలికాప్టర్లు దిగాయి. అక్కడి నుంచి నౌక నేరుగా దాదాపు 50 నాటికల్‌ మైళ్ల దూరంలోకి వెళ్లింది. శత్రుదేశాల నౌకలను ఎదిరించే తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు.

గుళ్ల వర్షంతోపాటు, నావికా సిబ్బంది హెలికాప్టర్ల గుండా నడి సముద్రంలో వున్న నౌకపై దిగడం, నీటిలో చిక్కుకున్న వ్యక్తులను ఆదుకోవడం చూపరులకు గగుర్పాటు కలిగించింది. దాదాపు ఐదు గంటల పాటు శత్రుదేశాల నౌకలతో పోరాడే దృశ్యాలను చూపించారు. ఈ సందర్భంగా రియర్‌ అడ్మిరల్‌ మురుగేశన్‌ మాట్లాడుతూ 1971లో భారత నావికాదళం అపూర్వమైన తన ప్రతిభ కనబరిచిందని అన్నారు. పాకిస్థాన్‌లో నావికాదళం దుందుడుకుతనానికి ముకుతాడు వేయడంతో భారత నావికాదళాలు అలుపులేని పోరాటం చేశాయని కొనియాడారు. డిసెంబర్‌లో ఈ సంఘటన జరగడంతో ప్రతియేటా నేవి వీక నిర్వహిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే డేఎట్‌ సీ, ఇతరత్రా కార్యక్రమాలు జరుపుతామన్నారు. నాలుగో తేదీన రామకష్ణ బీచ్‌ వద్ద గల విక్టరీ ఎట్‌ సీ స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తామన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత నావికాదళం శక్తిమంతమైనదని అన్నారు. దేశరక్షణ కోసం అహర్నిశలూ కృషి చేసే ఎంతోమంది నావికా సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మురుగేశన్‌ సతీమణి మేథ మురుగేశన్‌, వివిధ విభాగాలకు చెందిన కమాండెంట్లు పాల్గొన్నారు.

* భారత నౌకాదళ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు--డిసెంబరు 4.
* భారత నౌకాదళ తొలి అడ్మిరల్--ఆర్.డి.కఠారి.
* భారత నౌకాదళ ప్రధాన స్థావరం ఏ నగరంలో ఉన్నది--కొత్త ఢిల్లీ.
* 1967లో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టబడిన తొలి జలాంతర్గామి--ఐ.ఎన్.ఎస్.కల్వరి.
* స్వాతంత్ర్యానికి పూర్వం భారత నౌకాదళం పేరు--రాయల్ నౌకాదళం.
* బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా బొంబాయి నౌకాదళం తిరుగుబాటు ఎప్పుడు జరిగింది--1946.
* 2000లో సముద్ర మ్యూజియంగా మార్చబడిన భారత నౌకాదళ నౌక--సి.ఎన్.ఎస్.విక్రాంత్.
* భారత నౌకాదళ తొలి శిక్షణ నౌక--తరింగిణి.
* భారత నౌకాదళంలో జలాంతర్గాముల విభాగాన్ని ఎప్పుడు ఏర్పాటుచేశారు--1987.
* 1961లో భారత నౌకాదళంలో స్థానం పొందిన ప్రసిద్ధ నౌక--సి.ఎన్.ఎస్.విక్రాంత్.

కుర్పుర వార్షికోత్సవం :

నాడు భారత విజయానికి ప్రతీకగా నిలిచిన కుర్సుర జలాంతర్గామి నేడు మ్యూజియం రూపంలో విశాఖ పర్యాటకులకు వీచికగా నిలుస్తోంది. ఆసియా ఖండంలోనే తొలి మ్యూజియమ్‌గా ఏర్పాటైన కుర్సుర ఈ నెల 9న ఎనిమిదో వార్షికోత్సవం జరుపుకోనుంది. 1971లో భారత్‌ - పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో దేశ గౌరవానికి, ప్రతిభాపాటవాలకు ప్రతిరూపంగా నిలిచి భారత్‌ విజయానికి ప్రతీకగా నిలిచింది. భారత పౌరుషానికి మారుపేరుగా, నావికాదళంలో విశేషమైన సేవలందించిన కుర్సుర సబ్‌మెరైన్‌ తయారీస్థాయి నుంచి ఇప్పటి మ్యూజియమ్‌ రూపుదాల్చే వరకూ ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకుని ప్రపంచ దేశాల నావికాదళాల్లో ఏ యుద్ధ నౌకకు, జలాంతర్గామికి దక్కని అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది.

భారత నావికాదళంలో మొదటి తరానికి చెందిన జలాంతర్గాముల్లో కీలకమైనదిగా చరిత్ర పుటల్లో నిలిచిన కుర్సుర


సబ్‌మెరైన్‌ నాటి సోవియట్‌లో నిర్మితమైన ఐ-641 శ్రేణికి చెందినది. 1945 టన్నుల బరువు, 8 మీటర్ల ఎత్తు, 91.3 మీటర్ల పొడవున్న ఈ భారీ లోహపు తిమింగలం సోవియట్‌లో నిర్మాణానంతరం 1969 డిసెంబరు 18న భారత నౌకాదళంలో ప్రవేశించింది. తూర్పు నౌకాదళం జలాంతర్గామి యూనిట్‌కు సారధ్యం వహిస్తూ 31 సంవత్సరాలు విస్తృత సేవలందించిన కుర్సుర సబ్‌మెరైన్‌ను 2001 ఫిబ్రవరి 28న సేవల నుంచి ఉపసంహరించారు.

సబ్‌మెరైన్‌ లోపల..

నౌకాదళంలో ఉండగా కెప్టెన్‌ సారధ్యంలో 75 మంది సిబ్బంది ఇందులో ఉండేవారు. రెండు వేల హార్స్‌ పవర్‌ సామర్థ్యంతో హైపవర్‌ ఇంజన్లు మూడు ఉన్నాయి. ఒక్కొక్కటీ 652 కిలోల బరువుండే 448 బ్యాటరీలు ఉన్నాయి. ఇవిగాక సబ్‌మెరైన్‌ను నడిపేందుకు మూడు ప్రొపెల్లర్లు, మూడు షాఫ్ట్స్‌ ఉన్నాయి. సముద్ర జలాల అడుగున ప్రయాణించే సమయంలో కుర్సుర గరిష్ట వేగం గంటకు 15.5 నాటికల్‌ మైళ్లు. అప్పట్లో ఇదే ఎక్కువ స్పీడు. సముద్ర గర్భంలో శత్రువుల ఉనికి, అవతలి నుంచి ఆయుధాల ప్రయోగాన్ని కనిపెట్టేందుకు అత్యంత శక్తివంతమైన సోనార్‌ వ్యవస్థ కుర్సురలో ఉన్నాయి. 2001లో నౌకాదళం సేవల నుంచి ఉపసంహరించిన తరువాత విశాఖలోని ఆర్‌కె బీచ్‌లో కుర్సుర సబ్‌మెరైన్‌ను యథాతథంగా మ్యూజియమ్‌గా నెలకొల్పారు. సందర్శకులు టార్పెడోలతో సహా యుద్ధ వ్యవస్థలన్నింటినీ ఇందులో చూడవచ్చు.

వైస్‌అడ్మిరల్‌ వినోద్‌ పశ్రీచా ఆలోచన.. ఉడా ఆచరణ...

2001లో కుర్సుర సబ్‌మెరైన్‌ను నేవీ నుంచి ఉపసంహరించిన అనంతరం మ్యూజియమ్‌గా మార్చి సాధారణ ప్రజలకు నౌకాదళ పనితీరును తెలియజెప్పాలనే ఆలోచనతో అప్పటి తూర్పు నౌకాదళం ప్రధానాధిపతి వైస్‌ అడ్మిరల్‌ వినోద్‌ పశ్రీచా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి నేవీ ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడంతో పాటు విశాఖలో బీచ్‌ఒడ్డున నిలబెట్టేందుకు అవసరమైన పనులన్నింటికీ వినోద్‌ పశ్రీచా ప్రత్యేక చొరవ చూపడంతో ఆయన ఆలోచన కార్యరూపం దాల్చింది. దీన్ని ఒడ్డుకు చేర్చి మ్యూజియమ్‌గా నెలకొల్పేందుకు ఏడాదికి పేగా సమయం పట్టింది. 2002 ఆగస్టు 9న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి ఏటా రెండున్న లక్షల మంది పర్యాటకులకు కనువిందు చేస్తోంది.

సందర్శకుల సౌకర్యార్థం...

ఆయుధ సామగ్రితో యథాతథంగా మ్యూజియమ్‌గా నెలకొల్పిన అనంతరం సందర్శకుల సౌకర్యార్థం ద్వారాలను మార్పు చేశారు. 91.3 మీటర్ల పొడవున్న దీన్ని చివరి వరకూ పూర్తి చూడలంటే కనీసం 23 నిమిషాల సమయం పడుతుంది. సందర్శకులు అంతసేవు లోపల ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా 21 ఎసి మిషన్లను ఏర్పాటు చేశారు.

నిర్వహణ కమిటీలు...

కుర్సుర సబ్‌మెరైన్‌ మ్యూజియమ్‌ నిర్వహణ కోసం రెండు కమిటీలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఉన్నతాధికారులతో కూడిన ఎపెక్స్‌ కమిటీ కాగా, రెండోది మేనేజ్‌మెంట్‌ కమిటీ. మ్యూజియమ్‌కు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే ఎపెక్స్‌ కమిటీకి తూర్పు నౌకాదళం ప్రధానాధికారి ఛైర్మన్‌గా, ఉడా వైస్‌ ఛైర్మన్‌, జిల్లా కలెక్టర్‌, జివిఎంసి కమిషనర్‌, నగర పోలీసు కమిషనర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తదితరులు సభ్యులుగా వ్యవహరిస్తారు. రెండో కమిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీకి ఉడా ఉపాధ్యక్షులు ఛైర్మన్‌గా, నేవీ అధికారులు, ఉడా అధికారులు సభ్యులుగా ఉంటారు.

అరుదైన గౌరవం...

సేవల నుంచి ఉపసంహరించిన అనంతరం మ్యూజియమ్‌గా రూపాంతరం చెందినప్పటికీ నేవీలో ఇతర యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లతో సమానంగా అధికారిక గౌరవాన్ని కుర్సుర అందుకుంటోంది. ప్రతి ఏటా ఆగస్టు 15న, జనవరి 26న, డిసెంబరు 4న (నౌకాదళ దినోత్సవం) అధికారిక నౌకలకిచ్చే డ్రెస్సింగ్‌ షిప్‌ గౌరవాన్ని కుర్సుర అందుకుంటోంది.


  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .