గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .
పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (2010 నవంబరు 21) రహదారి ప్రమాద మరణాల గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
ప్రమాదాలు కావాలని ఎవరూ చేయరు , గురికారు . అనుకోకుండా ఏదో తెలియని కారణతో జరుగుతూ ఉంటాయి . చిన్నపొరపాటు , కనురెప్ప కాలములో అంతా జరిగిపోతుంది . గాయాలు కావచ్చును ... ప్రాణాలు పోవచ్చును . . అకస్మికముగా జరిగిపోతాయి కాని వాటి తాలూక ప్రభావము చాలాకాలము ఒకోసారి జీవితమంతా అలాగే ఉండిపోతుంది . ప్రతి యేటా కొన్ని లక్షల మంది ప్రమాద బారిని పడుతున్నారు . ఈ ప్రమాదాల్ని , వాటి తాలూకు కస్ట నస్టాలు , ప్రభావిత కుటుంబీకులు తెలిసినవారు ఎప్పుడూ గుర్తుతెచ్చుకుంటారు . ప్రమాదబాదితులందరూ గుర్తుతెచ్చుకుంటూనే ఉంటారు . ప్రతి యేటా ఈ స్పురణకు సంకేతం గా నవంబరు మూడవ ఆదివారము నాడు " ది వర్ల్డ్ డే ఒఫ్ రిమెంబెరెన్స్ " జరుపుతారు .
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు జాగ్రత్త తీసుకోవాలి . బాధితుల కష్టనష్టాల్ని విగతా ప్రపంచము గుర్తెరిగి వీలైనంత పరిధిలో ప్రమాదాలు జరక్కుండా కృషిచేయాలన్న అంశాన్ని ఎత్తి చూపేదే ఈ ప్రత్యేక రిమెంబెరెన్స్ డే . ఈ రోజూ ఎంతో మంది తమ సందేశాలను అందిస్తారు .
యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాఫిక్ విక్టిమ్స్ సంష్థ అధ్వర్యము లో బాధిత సంఘాలు 1993 నుండి ఈ రోజును నిర్వహిస్తున్నాయి . బాధితులు , బాధిత కుటుంబాలు , సన్నిహితులు .. వారికి మద్దతుపలికేవారికి ఇది అత్యంత ప్రత్యేక దినము . రానురాను దీనికి ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది . ప్రమాదం తాలూకు కష్టనష్టాల్ని ఎత్తిచూపేందుకు తగిన కార్యాచరణకు దీన్నో అవకాశము గా ఉపయోగించుకోవడం అనేది ఆరంభమైనది . 2003 నుండి ప్రపంచ ఆరోగ్య సంష్థ (W.H.O) ఈ రోజుకు మదతు ఇవ్వడము ఆరంభించినది . ఐక్యరాజ్యసమితి 60/5 తీర్మానము ద్వారా గుర్తించాక మద్దతు మరింత పెరిగింది . నవంబరు మూడో ఆదివారము ను " వరల్డ్ డే ఆఫ్ రెమెంబెరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ " గా పేర్కొంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సర్వసభ్య సమావేశము 2005 అక్టోబర్ 26 న చేసిన ప్రతిపాదనకు అమోదము లబించినది . ఈ ప్రపంచదినాన్ని పాటించడము ఖండఖండాలకు వ్యాపించింది . ప్రతి ఏటా ఈ దినము జరుపుకునే దేశాలు సంఖ్య పెరుగుతూ వస్తుంది . రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు తీసుకోవలసినటువంటి చర్యల్ని , ప్రతి ఒక్కరి బాధ్యతను ఈ సందర్భముగా గుర్తు చే్స్తారు .
1993 లో తొలిసాఎఇగా ' రోడ్ పీస్ ' ఈ రోజు ప్రాధాన్యతను గురించి తెలియజెప్పడం ఆరంభించినది . ఈ రోజు వివిధ కార్యక్రమాలు ఎలావిర్వహించాలి , ఎలా ప్రణాళిక రూపొందించాలన్న దానికి మార్గదర్శక సూత్రాలు రూపొందించారు . రోడ్డు విపత్తుల , బాధితుల అనుభవాల ప్రాతిపదికగా ప్రభుత్వేతర సంస్థల సహకారము తో ఈ నియమావళిని రూపొందించారు . గత కొన్ని సంవత్సరాలు గా రెమెంబెరెన్స్ సందర్భంగా తీసుకున్న వివిధ చ్ర్యలను పొందుపరిచేరు . వర్కింగ్ గ్రూపు ఏర్పాటు , లక్ష్యాలు , సందేశాల అభివృద్ధి , రాజకీయ మద్దతు పొందడము , భాగస్వామ్యాన్ని విసృతపరచడము , నిధుల సేకరణ , రోడ్డు ప్రమాదాల బాధితులకు సహాయము ఈ రోజు చేపట్టే పనులు .
బ్రిటన్ దేశము లో విసృతము గా కార్యక్రమాలు నిర్వహిస్తారు . వివిధదేశాలలో విభిన్న కార్యక్రమాలు నిర్వహించినా ఈ రోజు లక్ష్యము ఒక్కటే ... బాధితుల అనుభవాల స్మరణ , నివారణ , బాధితులకు వారి కుటుంబీకులకు సానుభూతి , సహ్కారాన్ని తెలియజేయడము .
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రాధమికంగా కావలసిన జాగ్రత్తలు :
- ప్రయాణము లో అప్రమత్తం గా ఉండడము ,
- ప్రయాణము లో హడావిడి తగదు ,
- మరుసటి నాటి ఉదయము సుదీర్ఘ ప్రయాణము అవసరము అనుకున్నాప్పుడు రాత్రి నిద్ర చాలినంత పోవాలి ,
- వెళ్ళేముందు ఏదోఒకటి తినాలి .. ఆకలి తో డ్రైవింగ్ చేయకూడదు .
- మెలకువగా ఉండాలంటే బాగా కెఫైన్ గల పానీయాలు అవసరమని భావించకూడదు .. వాటి ప్రభావము తగ్గినంతనే నిద్రలోకి నెట్టెస్తాయి .
- డ్రైవింగ్ లో అప్రమత్తం గా ఉండాలి , మనసు ఎక్కడో విహరించకూడదు .
- ప్రతి రెండు గంటలకు ఒకసారి విరామము అవసరము . తూలుతున్నట్లు అనిపిస్తే ఏదో కాస్త తిని అవసరమనుకుంటే కొద్దిసేపు నిద్ర పోవాలి .
- దూరప్రయాలలో ఇంకొకరి సహాయము తో డ్రైవింగ్ షేర్ చేసుకుంటే మంచిది .
- సరి అయిన సిగ్నల్స్ లేనిదే వాహనాలను క్రాస్ చేయరాదు , ఓవర్ టేక్ చేయరాదు .
- డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ లో మాట్లాడడము మంచిది కాదు .
- డ్రైవింగ్ సమయములో ముందు ఆల్కహాల్ తీసుకోకూడదు ... మత్తులో పడి ప్రమాదాలు జరుగుతాయి .
- వాతావరణము అనుకూలము గా లేనప్పుడు తక్కువ స్పీడ్ లో ప్రయాణించాలి .
- బయలు దే్రే ముందు వాహనము కండిషన్ లో వున్నది లేనిదీ తనికీ చేయించుకోవాలి ,
- ట్రాఫిక్ నిబందనలు , ట్రాఫిల్ సిగ్నల్స్ తూచా తప్పకుండా పాటించాలి .
- ==============================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .