Tuesday, October 26, 2010

ప్రపంచ వూబకాయ నియంత్రణ దినం , World Obesity Controle Day


  • [Obesity+belly.jpg] [Obesity-An+overweight+child.jpg]

  • నేడు ప్రపంచ వూబకాయ నియంత్రణ దినం - బరువు తగ్గితే ఆరోగ్యం : అక్టోబర్ 26 న .

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అధిక బరువు, స్థూలకాయంతో సతమతమవుతున్నారు. సుమారు 120 కోట్ల మంది అధిక బరువుతో.. 30 కోట్ల మంది వూబకాయంతో బాధపడుతున్నారని అంచనా. వీరిలో 13 శాతం మంది, పిల్లలు యువకులే కావటం విశేషం. గత పదేళ్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలో పట్టణాల్లో ఉన్నత, మధ్య తరగతి మహిళల్లో 30-50 శాతం మంది.. పురుషుల్లో 32 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారని ఇటీవల జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అధిక బరువు, స్థూలకాయం వివిధ జబ్బులకు దారితీస్తుండటంతో వీటిని తగ్గించుకోవాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నివారించదగిన 10 ఆరోగ్య సమస్యల్లో స్థూలకాయం కూడా ఒకటి. ముఖ్యంగా స్థూలకాయుల సంఖ్య పెరిగిపోతుండటానికి టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడుపుతుండటం.. పిల్లలకు ఆటస్థలాలు కనుమరుగు అవుతుండటం.. వ్యాయామం చేయకపోవటం.. శారీరక శ్రమ అంతగా లేని ఉద్యోగాలు.. ఆహారంపై అవగాహన లేకుండా చిరుతిళ్లకు అలవాటు పడటం వంటి జీవనశైలి దోహదం చేస్తోంది.

మన సమాజంలో కేలరీలు అధికంగా ఉండే పిండి పదార్థాలు, వేపుళ్లు, నూనె, నెయ్యి, కొవ్వు పదార్థాల వాడకం ఒకప్పటికన్నా నేడు బాగా పెరిగిపోయింది. ఇలా ఎక్కువెక్కువగా తింటూ అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయకపోవటం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరగటానికి దారి తీస్తోంది. దీనికి దురలవాట్లు కూడా తోడైతే పరిస్థితి మరింత విషమిస్తుంది.

వ్యాధుల దాడి
స్థూలకాయం కారణంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, సంతాన సమస్యలు, క్యాన్సర్‌, వూపిరితిత్తుల జబ్బులు, పిత్తాశయంలో, కిడ్నీల్లో రాళ్లు, అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యల వంటివన్నీ చుట్టుముడుతున్నాయి. భారీ కాయాన్ని మోయాల్సి రావటంతో మోకాలి కీళ్లు అరిగే ప్రమాదమూ ఉంది. కాలేయం దెబ్బతింటుంది. ఇన్స్‌లిన్‌ రెసిస్టెన్స్‌ పెరుగుతుంది. దీంతో మధుమేహ నియంత్రణ కష్టమవుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) పెరిగి, మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) తగ్గుతుంది. ఇవి పక్షవాతానికి, గుండెజబ్బులకు దారితీస్తాయి. మనం కిలో బరువు పెరిగితే రోజుకి అదనంగా 30 కిలోమీటర్ల దూరం వరకు రక్తాన్ని నెట్టాల్సిన భారం గుండెపై పడుతుంది. దీంతో గుండె ఎక్కువ బలంతో పని చేస్తూ గుండె వైఫల్యానికి దారి తీస్తుంది.

బరువెందుకు పెరుగుతారు?
ఏ వయసులోనైనా బరువు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. చాలామంది మధ్యవయసులోనే ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. కొందరు చిన్నతనంతోనే అధిక బరువుతో ఉండొచ్చు.

* కొందరు వంశపారంపర్యంగా అధిక బరువు సమస్య బారిన పడొచ్చు. తల్లిదండ్రుల్లో ఇద్దరూ స్థూలకాయులైతే సుమారు 73 శాతం మంది పిల్లలకూ అది రావొచ్చు. ఎవరో ఒకరు స్థూలకాయులైతే పిల్లల్లో 45 శాతం మంది దీని బారినపడొచ్చు.

* స్త్రీలల్లో కొన్ని గ్రంథుల స్రావాలు అధిక బరువును తెచ్చిపెట్టొచ్చు. రజస్వల అయినపుడు, గర్భం ధరించినపుడు, ముట్లుడిగిన తర్వాత మహిళలు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. స్టిరాయిడ్లు, గర్భ నిరోధకమాత్రలు, ఇన్స్‌లిన్‌ వంటివి తీసుకోవటమూ దీనికి దోహదం చేయొచ్చు. మానసిక అలసట, అశాంతి, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం, స్వీట్లు ఎక్కువగా తినటం, వంటివన్నీ బరువు పెరగటానికి కారణమవుతున్నాయి.

మూడు రకాలు
ఎత్తును బట్టి ఉండాల్సిన బరువును మూడు రకాలుగా విభజించారు. 1. సామాన్య బరువు 2. అధిక బరువు 3. వూబకాయం. ఎత్తు బరువుల నిష్పత్తి (బాడీ మాస్‌ ఇండెక్స్‌-బీఎంఐ) ప్రకారం దీనిని గణించొచ్చు. బీఎంఐ 20-25 ఉంటే సాధారణ బరువుతో ఉన్నట్టు. 25-30 ఉంటే అధికబరువుగానూ 30-35 ఉంటే వూబకాయంగానూ పరిగణిస్తారు.

వ్యాధిగ్రస్థ వూబకాయం: బీఎంఐ 40కి పైగా ఉంటే వ్యాధిగ్రస్థ వూబకాయం (మార్బిడ్‌ ఒబేసిటీ)లోకి అడుగిడినట్టే. ఈ దశలో నడవటమే కష్టమవుతుంది. ఏమాత్రం వ్యాయామం చేయలేరు. కష్టపడి వ్యాయామం చేసేందుకు ప్రయత్నించినా, తిండి తగ్గించినా కూడా బరువు తగ్గటమన్నది మాత్రం దుర్లభంగా తయారవుతుంది.

తగ్గే మార్గాలు
* వ్యాయామం: సహజసిద్ధంగా బరువును తగ్గించుకోవటానికి వ్యాయామాన్ని మించింది లేదు. దీంతో శరీరాకృతిని కూడా తీర్చిదిద్దుకోవచ్చు. తలనొప్పి, నడుంనొప్పి, ఆందోళన వంటి సమస్యలూ తగ్గిపోతాయి. వయసు పైబడుతున్నా వ్యాయామాన్ని మానరాదు. వయసుకు తగ్గ వ్యాయామాలను ఎంచుకోవాలి.

* ఆహారం: వ్యాయామం చేయటంతో పాటు జీవన విధానాన్ని మార్చుకోవటమూ అవసరమే. ఇందులో ఆహార నియమాలు, మితం పాటించటం ముఖ్యమైనవి. ముఖ్యంగా కొవ్వులు, నూనె పదార్థాలను తగ్గించి సమతులాహారం తీసుకోవటంపై దృష్టి పెట్టాలి.

* ధూమానికి దూరం: అప్పుడుప్పుడు సిగరెట్లు, బీడీలు కాల్చితే అంతగా ముప్పు ఉండదని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. వీటిల్లోని నికోటిన్‌ గుండె, శ్వాసకోశం, ఇతర కండరాలకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఏమాత్రం పొగ తాగినా ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. పొగ తాగటం వల్ల రక్తంలో ఆక్సిజన్‌ మోతాదు పడిపోయి రకరకాల సమస్యలకు దారి తీస్తుంది. ఒకవేళ పొగ అలవాటుంటే వ్యాయామానికి అరగంట ముందూ తర్వాతా తాగకుండా ఉండటం మంచిది.

* ఆరోగ్యకరమైన జీవనశైలిని చిన్నప్పట్నుంచి పాటిస్తుంటే స్థూలకాయం ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

బేరియాట్రిక్‌ సర్జరీ
వూబకాయం ప్రమాదకర స్థాయికి (మార్బిడ్‌ ఒబేసిటీ) చేరినవారు బరువు తగ్గాలంటే 'బేరియాట్రిక్‌ సర్జరీ' సమర్థ మార్గం. ఆహారాన్ని తగ్గించి వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గనివారు, అధిక బరువు మూలంగా దైనందిన కార్యక్రమాలు చేయలేకపోతున్న వారికీ ఈ సర్జరీ మేలు చేస్తుంది. దీని ద్వారా తీసుకునే ఆహార పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. ఇది బరువు తగ్గటానికి దోహదం చేస్తుంది. బేరియాట్రిక్‌ సర్జరీలో వివిధ రకాలున్నాయి. సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణాశయం, పేగుల మొదటి భాగాల్లో జీర్ణమవుతుంది. అనంతరం చిన్నపేగుల గోడల ద్వారా పోషకాలు రక్తంలో కలుస్తాయి. మిగిలిన వ్యర్థాలు పెద్దపేగు ద్వారా బయటకు వెళ్తాయి. బేరియాట్రిక్‌ సర్జరీలో జీర్ణాశయంలో కొంతభాగాన్ని బాండ్‌తో బిగిస్తారు. దీనిని 'గ్యాస్ట్రిక్‌ బ్యాండింగ్‌' అంటారు. దీంతో జీర్ణాశయం సైజు తగ్గి ఆహారం తీసుకోవటం తగ్గిపోతుంది. ఇక చిన్నపేగుల బైపాస్‌ సర్జరీ ప్రక్రియలో పేగుల పొడవును తగ్గిస్తారు. దీని వల్ల ఆకలి తగ్గి క్రమంగా బరువు తగ్గుతారు.

* బేరియాట్రిక్‌ సర్జరీలో పొట్ట సైజును తగ్గించినంత మాత్రాన ఆకలి, తినాలనే కోరిక ఎలా తగ్గుతుందని చాలామంది అనుమానిస్తుంటారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో జీర్ణాశయానికి తగినట్టుగానే హార్మోన్ల ఉత్పత్తిలోనూ మార్పులు వస్తాయి. దీంతో ఎక్కువగా తినాలనే కోరిక కలగదు. వీటిని చేయించుకున్నవారిలో కొద్దిపాటి గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఎదురవ్వొచ్చు. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతూ వీటిని నివారించుకోవచ్చు.
ఇదీ బీఎంఐ.. ఎత్తు-బరువుల నిష్పత్తి
* బరువును కేజీల్లో ఎంతుందో చూసుకోవాలి.
* అలాగే ఎత్తును మీటర్లలో కొలుచుకోవాలి.
* తర్వాత ఎత్తు సంఖ్యను తిరిగి అదే సంఖ్యతో గుణించి.. ఆ వచ్చిన సంఖ్యతో బరువును భాగించాలి.
* ఉదాహరణకు మీ బరువు 68 కేజీలు, ఎత్తు 1.6 మీటర్లు ఉందనుకోండి. అప్పుడు ఎత్తు-బరువుల నిష్పత్తి (బీఎంఐ) 68/1.6X1.6 = 26 అవుతుంది.
నడుము చుట్టుకొలత
* స్త్రీలు 80 సెం.మీ. (31.6 అంగుళాలు), పురుషులు 90 సెం.మీ. (35.6 అంగుళాలు) మించి నడుం కొలత పెరగకుండా చూసుకోవాలి.
* బీఎంఐ తక్కువగా ఉండి, ఒక్క నడుము చుట్టుకొలత ఎక్కువున్నా వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని మరవరాదు.

డా|| కె.ఎస్‌.లక్ష్మి-ఒబేసిటీ సర్జన్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌,హైదరాబాద్‌
  • ===============================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

World Egg Day , ప్రపంచ గుడ్డు దినోత్సవం



  • ప్రతియేట " అక్టోబరు రెండో శుక్రవారము నాడు "
పిల్లల నుంచి పెద్దల దాకా గుడ్డు పౌష్టికాహారము అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే . ఎదిగే పొల్లలకు చాలినన్ని పొతీన్లు అందజేస్తుంది . పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు .

గుడ్ల వాడకాన్నీ , దానిలొని ఆరోగ్య ప్రయోజనాల్ని ప్రపంచవ్యాప్తం గా గల ప్రజలకు తెలియజెప్తూ ప్రతియేట అక్టోబరు రెండో శుక్రవారము నాడు " వరర్డ్ ఎగ్ డే " నిర్వహించడం జరుగుతుంది .

2010 సం. లో అక్టోబరు 08 తేదీన జరుపునే ఎగ్ డే సందర్భముగా అంతర్జాతీయ ప్రచారములో వివిధ దేశాలు పాల్గొంటున్నాయి . ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్‌ 1996 లో వరల్డ్ ఎగ్ డే ని ప్రకటించినది . కొన్ని దేశాలలో ఎగ్ ఫెస్టివల్ ను జరుపుతారు . ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్‌ ప్రపంచము లో గల ప్రజల మధ్య అనుసంధానము ఏర్పరిచే ... ప్రపంచగుడ్లపరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే ఏకైక సంస్థ . విభిన్న సంస్కృతులు , జాతీయతల నడుమ సంబందాలు అభివృద్ధిపరిచే సమాచారము తెలియజెప్పే అసాధారణ కమ్యూనితీ ఎది . ఐఇసి గుడ్ల ఉత్పత్తి పోషకాలు , మార్కెటింగ్ లకు సంబంధించిన తజా పరిణామాల్ని పర్యవేక్ష్క్షింస్తూంటుంది . 1996 లో వియన్నా లో జరిగిన ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్‌ సదస్సు లో అక్టోబర్ రెండో శుక్రవారము నాడు " వరర్డ్ ఎగ్ డే" నిర్వహించాలని ప్రకటించారు .
  • [Egg.jpg]

మన దేశము లో గుడ్డు వాడకం అధికమే . గుడ్డును పలు రూపాలలో ఆహారముగా తీసుకుంటారు .
  • పచ్చి గుడ్డుసొనను నోటిలో పోసుకొని మింగడము ,
  • గుడ్డును ఉడికించి తినడం ,
  • ఉడికించిన గుడ్డు బ్రెడ్ ని కలిపి టోస్ట్ గా తీసుకుంటారు . ,
  • గుడ్డును పలావు లో , బిర్యానిలో రుచికోసము వాడుతారు ,
  • బేకరీ లలో గుడ్డును వాడుతారు ,
  • గుడ్డు ఆమ్లెట్ , బుల్స్ ఐ , ఎగ్ ఫ్రై ... కూరగా వాడుతారు .,
ఏ ఒక్క వయసు కో ప్రిమితమైన ఆహారము కాదు గుడ్డు . బాల్యము నుండి వృద్దాప్యము వరకు అన్ని వయసులలో స్త్రీ పురుషులు బేదములేకుండా గుడ్డును తీసుకుంటారు . గుడ్డుమీద జరుగుతున్న పరిశోధనలు ఏటా కొత్త ఫలితాలను ఇస్టూఉనాయి . గుడ్డు ను తీసుకోవాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కిచెబుతున్నారు . ఉదయము అల్పాహారముతో గుడ్డు తీసుకోవడము మంచిదని తజా అధ్యయనములో తేలినది . గుడ్డులో సొన శక్తినిస్తుంది . శరీరం లొ ప్రతి అవయవము మీద ప్రభావము చూపుతుంది .
గుడ్డును శాకాహారము గా ప్రకటించి అందరికీ గుడ్డు అందించాలనే ఉద్యమము ఇటీవలి కాలం లో ఊపందుకుంది .
గుడ్డు ద్వారా : మనకందే పోషకాలు ->
  • క్యాలరీలు : 70-80 ,
  • ప్రోటీన్లు : 06 గ్రాములు ,
  • క్రొవ్వులు : 05 గ్రాములు ,
  • కొలెస్టిరాల్ : 190 గ్రాములు
  • నీరు : 87%.
ఉపయోగాలు :
మంచి చేసేవి ->
  • గుడ్డు పౌస్టికాహారము .. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి ,
  • పిల్లల పెరుగుదలకు మంచిది . ,
  • కూర గా వాడుకోవచ్చును .
  • కోడి గుడ్డు తింటే దృస్టికి ఎంతో మేలు కలుగుతుంది ... రోజు గుడ్డు తినేవారికి శుక్లాలు వచ్చే అవకాశము బాగా తగ్గుతుంది ,
  • గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది సధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంద్ కాబట్టి డైటింగ్ లో ఉన్నవారు గుడ్డు ను తీసుకోవచ్చు ,
  • బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది . ద్గ్డ్డులో ఉన్న నాణ్యమైన ప్రోటీల్న వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది . ఎక్కువ ఆహారము తీసుకోనివ్వదు ... పరిమిత ఆహారము తీసుకొని బరువును నియంత్రించుకోగలుగుతారు .
  • గుడ్డు తినటం వల్ల గుండె జబ్బులు పెరుగుతాయన్నది అపోహ మాత్రమేనని ఒక అధ్యయనము వల్ల తేలినది . వాస్తవం లో గుడ్డు తినేవారిలో రక్తనాళాలు మూసుకుపోవటం లేదా గుడెజబ్బులు రావటం బగా తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు .
  • మెడడు కు ఆరోగ్యాన్నిచ్చేపదార్దాలు గుడ్డులో ఉన్నాయి . గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాములు " కోలిన్‌ " అనే పోషక పదారదము ఉంది ... ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది . , మెదడులో సమాచార రవాణాన్ని మెరుగుపరుస్తుంది , మెదడు నుంది సంకేతాలు వేగంగా చేరవేయడం లో కూడా కోలిన్‌ ప్రాత్ర వహిస్తుసంది .
  • గుడ్డు లో ఉన్న ఐరన్‌ శరీరము చలా సులభం గా గహిస్తుంది . అలా గహించే రూపము లో ఐరన్‌ ఉన్నందున గుడ్డు గర్భిణీ స్త్రీలకు , బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది .
  • గుడ్డు ను ఆహారము గా తీసుకోవటానికి , లొలెస్టరాల్ కి ఎటువంటి సంబంధం లేదు . ప్రతి రోజూ రెండు కోడి గుడ్లు తీసుకునే వారికి లైపిడ్సు లో ఎటువంటి మార్పు లేకపోవడం గమనించారు . పైగా గుడ్డు వలన శరీరానికి మేలు చేసే కొలెస్టిరాల్ పెరుగుతుందని తేలింది .
  • స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడే శక్తి గుడ్డు కి ఉందని తేలినది . ఒక అద్యయనము లొ వారములో 6 రోజులు గుడ్డ్ను ఆహారము గా స్త్రీలకు ఇచ్చారు .. అటువంటి వాఇర్లో రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశము 44 శాతము తగ్గినట్లు తేలినది .
  • గుడ్డు వలన శిరోజాల ఆరోగ్యము మెరుగవుతుంది . గుడ్డులొ ఉన్న సల్ఫర్ , పలురకాల విటమిన్లు , లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది . మనుషుల గోళ్ళకు మంచి ఆరోగ్యాన్ని గుడ్డు అందిస్తుంది , .
  • గుడ్డు లో పలు రకాల లవణాలు , అరుదైన లవణాలతో పాటు ఫాసపరస్ , అయోడిన్‌ , సెలీనియం , ఐరన్‌ , జింక్ లు ఉన్నాయి ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే .
  • గుడ్డు లోని ప్రోటీన్ల వల్ల యవ్వనములోని కండరాలకు బలము , చక్కని రూపము యేర్పడుతుంది .
నస్తము చేసేవి ->
  • గుడ్డును బాగా ఉడికించి అందులోని బాక్టీరియాను పూర్తిగా సంహరించబడేలా చూసుకోవాలి . బాక్టీరియా వల్ల శరీరానికి నస్టము జరుగుతుంది ,
  • పచ్చి గుడ్దు తినడం మంచిదికాదు . తెల్లసొనలో " ఎవిడిన్‌ " అనే గ్లైకో పోటీన్‌ ఉన్నందున అది బి విటమిన్‌ ను శరీరానికి అందనీయకుండా చేస్తుంది .
  • కొలెస్టిరాల్ జబ్బులతో బాధపడుతున్నవారు గుడ్డును తీసుకొరాదు .
  • టైప్ 2 డయాబిటీస్ ఉన్నవారిలో గుడ్డు ను వాడరాదు . రిస్క్ ను ఎక్కువ చేస్తుందని రిపోర్తులున్నాయి .
  • కొంతమందిలో ఫుడ్ ఎలర్జీ కలిగే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయని అద్యయనాలు ఉన్నాయి .
  • కొన్ని యాంటిబయోటిక్స్ మందులు ఉదా. సెఫలొస్పోరిన్స్ ... గుద్దు వాడేవారిలో పనిచేయక పోవచ్చును , యాంటిబియోటిక్ రెసిస్టెంట్ .
  • గుడ్డు కంపు ను భరించలేము ... హిందూ బ్రహ్మిణ్లు ఇబ్బంది పడుదురు .. వాతావరణ వాసన కాలుస్యము .





  • =============================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

పోషకాహార దినోత్సవం , Balanced Diet Day


  • [Food+items+for+balanced+diet.jpg]

పోషకాహార దినోత్సవం--ఆరోగ్యానికి పోషకాహార మంత్రం


ఇప్పుడు ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. ఆరోగ్యంకోసం ఎన్నో సూత్రాలు పాటిస్తున్నాం. ఆరోగ్య ఆవశ్యకతను గుర్తిస్తున్నాం. మరి మన ఆహారంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటు న్నాయో గమనిస్తున్నామా? నిజానికి ఆహారనియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్లే ఎక్కువగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలుసుకోవాలి. చక్కని పోషకాహారం తీసుకోవడం వల్ల మాత్రమే ఆరోగ్యం, తద్వారా ఆనందం పొందగలుగుతాం. ఆరోగ్యమే మహా భాగ్యం అనే మన పెద్దలమాట గుర్తుకు తెచ్చుకునేందుకు మంచి తరుణం ఇది. ఈ రోజు పోషకాహార దినోత్సవం. మరి ఎలాంటి పోషకవిలువలను మనం కోల్పోతున్నాం, ఎటువంటి ఆహారం విలువైన పోషకాలను అందిస్తుందనేది తెలుసుకుందాం.

మంచి ఆరోగ్యం కావాలంటే పోషకాహారం తప్ప నిసరి. వేళప్రకారం భోజనం, పళ్లరసాలు, విత్త నాలు, కూరగాయలు, ఆకుకూరలు మెదలైనవి భోజనంలో ఉంటేనే ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది. సమతుల ఆహారపు అలవాట్లే మనపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈరోజుల్లో అతి ముఖ్య మైన పోషకాహారం పట్ల మనం శ్రద్ధ చూపించడం లేదు. రాబోయే కాలంలో శరీరంపై దాడిచేసే ఎన్నో రకాల వ్యాధులను ఎదుర్కోవడానికి పోషకాహారం ఎంతో ముఖ్యం. కూరగాయలు, పండ్లు, ధాన్యాలు మొదలైనవన్నీ సహజ శక్తికారకాలు.

మనదేశంలో ఆహారపు అలవాట్లు : మనదేశంలో ఆహారం పద్ధతుల్లో అధికంగా వెన్న, నెయ్యి, నూనె, కారం, పులుపు, మసాలాలు వాడు తుంటాం. అలాగే ఎక్కువగా వేయించిన వంట కాలను ఇష్టపడుతుంటాం. వీటివల్ల పోషకాల కంటే కొవ్వుశాతం ఎక్కువ అవుతుంటుంది.

పరిశోధకులేమంటున్నారంటే
బెంగళూరుకు చెందిన సెయింట్‌ జాన్స్‌ నేషనల్‌ అకాడమీ 2010 దాటేసరికి ప్రపంచ హృద్రోగుల్లో 60% భారత్‌లోనే ఉంటారని ప్రకటించింది. బ్రిటన్‌లోని విచ్‌ మ్యాగజైన్‌ పరిశీలన ప్రకారం భారత్‌లో సగటు మనిషి ఒకపూట చేసే భోజ నాన్ని బ్రిటన్‌లో ఒకరోజు ఆహారంగా ఇస్తారు. దీని వల్ల 23.2 గ్రాముల అధిక కొవ్వును పెంచు కుంటున్నట్లే అని చెబుతున్నారు. ఇందుకుకారణం మన దేశంలో నెయ్యి, నూనెలను అధికంగా వాడ టమే. చూశారా ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలను అందిం చడం పట్ల కూడా కాస్త శ్రద్ధ చూపించాలి అని పై పరిశోధనల వల్ల తెలుస్తోంది కదా! మనం రోజూ తీసుకునే కూరలు, పండ్లు ఇతర పదార్థాల్లో ఉండే పోషక విలువలేంటో ఇక్కడ చూద్దాం.

రోజుకో యాపిల్‌ --
యాపిల్‌లోని కొలొన్‌, ప్రొస్ట్రేట్‌, ఊపిరితిత్తుల కేన్సర్‌ నివారించడంలో పనికొస్తాయి. నిత్యం ఓ యాపిల్‌ను తినడం వల్ల డాక్టర్‌ను సంప్రదించే సందర్భాలు తగ్గిపోతాయట.

విటమిన్‌ సి యుక్తం ముల్లంగి --
ముల్లంగిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ముల్లంగి ఆకులు కూడా ముఖ్యమై నవే. ఇవి కాల్షియంను పుష్కలంగా కలిగి ఉంటాయి.

ఉల్లికాడలూ ఉపయోగమే --
రక్తపోటును నియంత్రించడానికి, జీర్ణవ్యవస్థ పని తీరుకు ఇవి ఎంతో ఉపయోగకరం. ఏడు రకాల కేన్సర్లను తగ్గించడంలో వీటికివేసాటి.

బహుప్రయోజనకారి కొబ్బరి --
ఫంగస్‌, బాక్టీరియాలనుంచి రక్షణకు తక్షణ ఔషధి కొబ్బరే. ఆయుర్వేద మందుల్లో అధికంగా ఉప యోగించే కొబ్బరినూనె బహువిధ ప్రయోజనకారి.

రుచికరం చెర్రీలు --
ఎన్నో విటమిన్లు, లవణాలకు పుట్టిల్లు చెర్రీ. అంతేనా రుచిలోనూ ఇది రాణి.

రసభరితం ప్లమ్స్‌ --
ఈ రుచికరమైన, తియ్యని, రసయుక్త ఫలాల్లో విటమిన్‌ సి ఎక్కువగా లభిస్తుంది.

శక్తికారకం పాలకూర --
ఐరన్‌, కాల్షియంల మేలు కలయిక పాలకూర. శరీ రంలో ఐరన్‌ లోపాన్ని తగ్గించడంలో బాగా పని చేస్తుంది.

రక్తహీనతకు బీట్‌రూట్‌ --
ఫోలెట్‌, పొటాషియమ్‌, మాంగనీస్‌ సమృద్ధిగా లభించే బీట్‌రూట్‌ చర్మరోగాలను నివారించడంలో సహాయం చేస్తుంది. రక్తహీనతకూ ఇది మందుగా పనిచేస్తుంది.

తీయ మామిడి --
వేసవిలో విరివిగా లభించే మామిడిపండులో పొటా షియమ్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీన్నిష్టపడని పిల్లలుంటారా?

టమాటాలు --
వీటిలో లాకోపెన్‌ అనే యాంటీఆక్సిడెంట్లను ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచ డంలో తోడ్పడతాయి.

చలువ కర్బుజా --
ఎక్కువకాలం పండించే పంటల్లో కర్బుజా పంట కూడా ఒకటి. చలువ చేసే గుణాలున్న ఈ పండు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది.

చేదు మందు కాకరకాయ --
చక్కెర వ్యాధికి చేదైన మందు కాకరకాయ. శరీ రంలో ఎన్నో రుగ్మతలను కేవలం దీని కషాయంతో తగ్గించవచ్చు.

బహుగుణాల బొప్పాయి --
పుష్కలమైన లవణాలు, ఫైబర్‌ను కలిగిఉంటుంది. చర్మ చికిత్సల్లో దీని పాత్ర అధికం. మన దేశంలో ఇది చాలా విరివిగా దొరుకుతుంది.

పుచ్చకాయలో మినరల్స్‌ మెండు--
వేసవిలో చల్లదనాన్నిచ్చే చక్కని పండు ఇది. కొలెస్ట్రాల్‌ లేని ఈ పుచ్చకాయ కళ్లకు కూడా చలువ చేస్తుంది.

పోషక విలువల అరటి --
డిప్రెషన్‌, ఎనీమియా, రక్తపోటు, మెదడు వ్యాధు లకు అరటిపండు దివ్యౌషధం.

బాదామ్‌లు భేష్‌ --
కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించి, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో సహకరిస్తుంది.

గుడ్డు వెరీ గుడ్డు --
ఎన్నో పోషకవిలువలున్న గుడ్డును నిత్యం నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పిల్లలకు తప్పని సరిగా ఇవ్వాల్సిన పోషకాహారం ఇది.

పుట్టగొడుగులు పలురకాలు --
ఇందులో అమైనో ఆసిడ్‌లతోపాటు విటమిన్‌ డి కూడా ఉంటుంది. వీటిలో కొవ్వుశాతం అతి తక్కువ కూడా.

ఉసిరి ఫలసిరి--
మొక్కల సామ్రాజ్యంలో సి విటమిన్‌ను పుష్క లంగా అందించే ఉసిరి సర్వరోగ నివారిణి. పచ్చిగా, కూరల్లో, నూనెగా ఇలా ఎన్నివిధాలైనా దీన్ని ఉప యోగించవచ్చు.

వీటికి దూరంగా ఉండాలి
డాల్డా, నెయ్యి, మీగడపెరుగు, జీడిపప్పు, నూనెతో చేసిన పదార్థాలు.అతిగా నూనెలో వేయించినవి.కూరగాయలు అతిచిన్న ముక్కలుగా కోయడం .ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలను కడగడం .ఎక్కువ మసాలా, కారంతో కూడిన పదార్థాలు వేటిలో ఎంతెంత? బంగాళదుంపతో చేసే కూరల్లో 4% నుంచీ 9% కొవ్ఞ్వ ఉంటుంది. పప్పుతో చేసే దాల్‌మఖనీ మొదలగు పదార్థాలు 3.7% వరకూ కొవ్వును ఉంటుంది.ఉడికించిన అన్నంలో 0.2%, పలావ్‌లో 3.4%, కిచిడీలో అత్యధికంగా 7.4% కొవ్వు పదార్థం ఉంటుంది.ఇక పాలు, పాల పదార్థాల్లో అయితే ఈ శాతం 25.9వరకూ కూడా ఉంది. స్వీట్లలో కూడా ఇంచుమించు ఇదేశాతంలో కొవ్ఞ్వ ఉంటుంది.

for some more details : -> Nutrition and Balanced diet
  • ==========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Sunday, October 24, 2010

ప్రపంచ తపలా దినోత్సవం , World postal Day


  • ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల 9 వ తేదిని "ప్రపంచ తపాలా దినోత్సవం " గా జరుపుకుంటారు.
వందల , వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చే ఆ తొకలేని పిట్ట కోసము ఆతృతగా ఎదురుచూసి " పోస్ట్ " అన్న కేక వినగానే ఉరుకులు , ప్రుగులులతో అందుకునే ఉత్తరాల్లొ ఎన్నోవిశేషాలు , అనేక కమ్మని కబుర్లు , కెరీర్ కు బాటలు .... మంచి ఉత్తరము అందుకున్నాప్పుడు కలిగే సంతోషము అంతా ఇంతా కాదు . అలాగే మనియార్డర్లు .. ఈ సంతోషము తోనే పోస్ట్ మ్యాన్‌ కు ఈనాము ఇచ్చే ఆనవాయితీ నెలకొనిపోయింది .

గతం లో సమాచార మార్పిడికి , క్షేమ సమాచారము తెలుసుకునేందుకు పోస్టు కార్డే(ఉత్తరము) ప్రధాన ఆధారము . పేదల నుండి ధనికుల వరకు ఎక్కువగా దీనిపైనే ఆధారపడేవారు . కాలగమనం లో వచ్చిన మార్పులు దీనిపై మెనుపర్భావము చూపాయి . ప్రస్తుతము పొస్టుకార్దు మనుగడకోసం పొరాడుతోంది . సెల్ ఫోన్లు , కంప్యూతర్లు , ఇతర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చాక దీని అవసరము తగ్గిపోయినది . ఇ-మెయిల్స్ చాలావరకు ప్రస్తుతం పోస్టుకార్దు పాత్రను పోసిస్తున్నాయి . కొన్ని ప్రదే్శములలో మాత్రం ఇప్పటికీ పోస్టుకార్డునే వినియోగిస్తున్నారు .

చరిత్రలొమి వెల్తే మెసెంజర్ల రూపములో తపాలా సర్వీసులుండేవి . వీళ్లు నడిచి లేదా గుర్రాలమీద వెళ్ళి వ్రాత ప్రతుల్ని అటూ ఇటూ చేరవేసేవారు . 1600 - 1700 సంవత్సరాలలో అనేక దేశాలవారు జాతీయ తపాలా వ్యవస్థ లను నెలకొల్పుకొని ఆయాదేశాల నడుమ తపాలా సౌకర్యాల్ని అందించుకునేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు . 1800 సంవత్సరము నాటికి ఇలా ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నవారు భారీగా తేలారు . దీంతో అంతర్జాతీయ తపాలా పంపిణీ క్లిస్టం గా, అసంపూర్తిగా , అసమర్ధవంతం గా మారిపోయింది .

అమెరికాకు చెందిన పోస్ట్ మాస్టర్ జనరల్ మాంట్ గోమెరి బ్లెయిర్ 1863 లొ 15 యూరొపియన్‌ దేశాలు , అమెరికన్‌ దేశాల ప్రతినిధులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసాడు . ఈ సదస్సు లో అంతర్జాతీయ పోస్టల్ సర్వీసులపై పరస్పర ఒప్పందాలకోసం ప్రతినిధులు అనేక సాధారణ సూత్రాల్ల్ని వెల్లడించారు . కాని ఒక అంతర్జాతీయ ఒప్పందము అయితే మాత్రము కుదరలేదు . . 1874 లో నార్త్ జర్మన్‌ కాంఫెడరేషన్‌ కు చెందిన ఓ సీనియర్ పోస్టల్ అధికారి హెయిన్‌రిచ్ బనీ స్టీఫెన్‌ స్విట్జర్లాండ్ లోని బెర్నె లో 22 దేశాల ప్రతినిధులతో ఒక సదస్సు ఏర్పాటుదేశాడు . ఆ ఏడాది అక్టోబరు తొమ్మిదో తీదీన ప్రతినిధులు బెర్నె ఒప్పందము పై సంతకాలుచేసి జనరల్ పోస్టల్ యూనియన్‌ ను నెలకొల్పారు . ఈ యూనియన్‌ లో సభ్యదేశాలు క్రమముగా పెరుగుతూ రాగా యూనియన్‌ పేరు 1878 లో యూనివర్షల్ పోస్టల్ యూనియన్‌ గా మారింది . ఇది 1948 లో ఐక్యరాజ్యసమితికి ప్రత్యేక ఏజెన్‌సీగా రూపాంతరం చెందినది . 1969 లో అక్టోబరు 1 నుంచి నవంబరు 16 వ తేదీవరకు జపాన్‌ టోకియో లో 16 వ యూనివర్షల్ పోస్టల్ యూనియన్‌ కాంగ్రెస్ ను నిర్వహించారు . ఈ కాంఫెరెన్సు లో ప్రతినిధులు అక్టోబరు 9 వ తేదీన " వరల్డ్ పోస్టల్ డే" ని నిర్వహించాలని తీర్మానించారు .

పోసటల్ డే ని ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశము ... ప్రపంచ వ్యాప్తం గా సందేశాల్ని సౌకర్యము గా పంపుకునే యంత్రాంగము నొకదానిని సృస్టించడ మే . అంతర్జాతీయ లేదా జాతీయ పోస్టల్ సర్వీసుల ప్రగతి లేదా చరిత్ర పై ప్రపంచ దేశాలు , మంత్రులు , సంస్థలు , అత్యున్నతష్థాయి అధికారులు ఈ రోజున ప్రకటనలు ఇస్తారు లేదా ప్రసంగాలు చేస్తారు . పోస్టల్ సర్వీసులు చరిత్ర , ప్రగతుల్ని తెలియజెప్తూ ప్రత్యేక తపాల బిల్లలను విడుదలచేయవచ్చు , యునెస్కో సహకారము తో గత 35 యేల్లుగా యూనియన్‌ యువతకు లెటర్ రైటింగ్ లొ ప్రపంచ పోటీల్ని నిర్వహిస్తూ ఉన్నది . విజేతలకు బహుమతులు ఇస్తూ ఉన్నారు . . వరల్డ్ పోస్ట్ డే అన్నది పబ్లిక్ హాలిడే కాదు కాబట్టి ప్రజలు దీనివల్ల ఏమాత్రము ప్రభావితం కారు . పోస్టల్ సర్వీసులు ఎదాతదం గానే ఉంటాయి .
యిప్పటికి సుమారు 150 దేశాల సభ్యత్వము కలిగిన "యూనివర్సల్ పోస్టల్ యూనియన్" 1874 సంవత్సరము లో 'బెర్న్' నగరములో ఏర్పాటు చేయబడినది.

1969 సం. లో టోక్యో నందు జరిగిన మహా సభలో "యూనివర్సల్ పోస్టల్ యూనియన్ " స్థాపించబడిన రోజును (అక్టోబర్-9) 'ప్రపంచ తపాలా దినోత్సవం' గా పరిగణించాలని నిర్ణయించ బడినది.

యూనివర్సల్ పోస్టల్ యూనియన్ లో సభ్యత్వము కలిగిన దేశాలలో నేడు 'వర్కింగ్ హాలిడే ' గా అనేక కార్య క్రమాలు నిర్వహించ బడుతాయి. సమావేశాలు, వర్క్ షాప్ లు , సంస్కృతిక కార్య క్రమాలు, ఆటల పోటీలు జరుగుతాయి. ఆయా దేశాలలో పోస్టల్ శాఖల ద్వారా కొత్త ప్రాడక్ట్స్ , కొత్త సేవలు ప్రారంభించ బడుతాయి. తపాల సేవల గురించి ప్రజలకు మీడియా ద్వారా తెలియజేయడం తో పాటు రకరకాల సావనీర్లు విడుదల చేస్తారు. తపాల శాఖలో విశిష్ట సేవలు అందించిన సిబ్బందిని సత్కరిస్తారు.


150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియాలో:

తోకలేని పిట్ట తొంభై ఊర్లు తిగిందని ఉత్తరాలపై ఓ సామెత ఉంది. సమాచార రంగంలో రానురాను విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఉత్తరం ప్రాధాన్యం తగ్గిన నేపథ్యంలో మార్పులను అందిపుచ్చుకుంటూ మనుగడను కొనసాగిస్తూనే ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది భారత తపాలశాఖ. పావురాల ద్వారా బట్వాడానుంచి.. స్పీడుపోస్టు.. ఈ-మెయిల్‌ ఇలా దూసుకెళ్తున్న భారత తపాలవ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని మూటగట్టుకుంది. ఉత్తర ప్రత్యుత్తరాల వారధులుగా అశేష సేవలందిస్తున్న ఈ విభాగం ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లు సాగింది.. ప్రైవేట్‌ రంగం నుంచి వచ్చిన పోటీని తట్టుకొని నిలబడుతోంది. అక్టోబర్‌ 9న ప్రపంచ తపాలశాఖ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఆశాఖ తీరుతెన్నులు.

రెండో అతి పెద్ద వ్యవస్థ
తపాలశాఖ గతంలో ఉత్తరాలు బట్వాడాకే పరిమితంకాగా కాలక్రమంలో అనేక సేవల్లోకి మారింది. ప్రస్తుతం దేశంలో సుమారు ఆరు లక్షల మంది తపాల సిబ్బంది 1.10లక్షల కార్యాలయాలతో సేవలందిస్తోంది. దేశంలో రైల్వే తర్వాత ఇదే అతి పెద్ద వ్యవస్థ.

ఇవీ విప్లవాత్మక మార్పులు
* స్పీడు పోస్టు కోసం మనదేశంలో 180 కేంద్రాలున్నాయి. 100కు పైగా దేశాలకు ఈ సౌకర్యం ఉంది. రూ.5 చెల్లిస్తే స్పీడు మనియార్డరు సదుపాయం ఉంది.

* ఈ-పోస్టు సర్వీసు.. ప్రపంచంలో ఏమూలనుంచైనా ఈ పోస్టు చేస్తే క్షణాల్లో ఎంపిక చేసిన పట్టణాల్లో పోస్టుమెన్‌ ద్వారా ఇంటికి అందుతుంది.

* బంగారు నాణాలు, ఫారెన్‌ ఎక్ఛేంజ్‌ కరెన్సీ మార్చుకోవడం లాంటి అనేక సౌకర్యాలు అందిస్తుంది.

* బిల్‌మెయిల్‌ సర్వీసు. పెద్ద పెద్ద సంస్థలు, ఫ్యాక్టరీలు తమ సంస్థ ఆర్థిక నివేదికలు, బిల్లులు, ఇతరత్రా చేరవేతకు 20గ్రా.లు మించకుండా రూ.3 రుసుం వసూలు చేస్తున్నారు.

* మేఘదూత్‌ పోస్టుకార్డు.. గ్రామీణ మార్కెటింగ్‌ విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కార్డు ఖరీదు 25 పైసలు. మరో నూతన పథకం ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ పోస్టు.. దీనిద్వారా 35 కిలోలు మించని ఆర్టికల్స్‌ పంచవచ్చు.

* మీడియా పోస్టు ద్వారా పోస్టల్‌ కార్యాలయాలు, లెటర్‌ బాక్సులపై తమ సంస్థల ప్రకటనలు రాసుకునే సదుపాయం ఉంది.

* 2006లో ఇన్‌స్టెంట్‌ మనీ ఆర్డర్‌ సర్వీసును ప్రారంభించింది. దీనిద్వారా దేశంలోని ముఖ్యమైన పట్టణాలకు ఈ సౌకర్యాన్ని వర్తింపజేశారు. దీనిద్వారా రూ.50వేల వరకు క్షణాల్లో పంపవచ్చు.

* ఫోన్‌ చేస్తే పోస్టాఫీసు సర్వీసులను ఇంటివద్దకే వచ్చి పోస్ట్‌మెన్‌ అందించే సౌకర్యాన్ని ప్రారంభించారు.

* ఉపాధిహామీ పథకం అమలులో భాగంగా నిధుల విడుదల, డబ్బుల చెల్లింపులను తపాలశాఖనే నిర్వహిస్తోంది.

వడ్డీ పథకాలు
* పొదుపు పథకాలైన ఎన్‌ఎస్‌సీ ఎనిమిదో విడుదల పత్రం ఆరు ఏళ్లకు ప్రతి రూ.100కు రూ.160 చెల్లిస్తారు.
* కిసాన్‌ వికాసపత్రం 8 సంవత్సరాల ఏడు నెలలకు రెట్టింపవుతోంది.
* అంధులకు దేశవిదేశాల్లో ఎక్కడకు పంపిన బ్త్లెండ్‌ లిటరేచర్‌కు పోస్టేజీ ఉచితం.
* నెలనెల పోస్టల్‌ సేవింగ్స్‌ పథకాలున్నాయి.
* గ్రామీణ తపాలబీమా పథకాన్ని తపాలశాఖ నిర్వహిస్తోంది. ప్రతిఏటా కోట్లాది రూపాయలను ప్రజలు పొదుపు చేసేలా చూస్తోంది. దీనివల్ల పలువురు నిరుద్యోగులకు ఉపాధిసైతం లభిస్తోంది.
* తపాల కార్యాయాల్లో రైల్వే టికెట్లు, పాస్‌పోర్టు ధరఖస్తులు, బీఈడీ, పీజీ, ఐసెట్‌ లాంటి వివిధ ధరఖస్తు ఫారాలను ఇస్తున్నారు.





  • ==========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Monday, October 18, 2010

World Arthritis Day , ప్రపంచ ఆర్త్థ్రెటిస్‌ దినం

  • సబితా పట్నాయిక్

నేడు ప్రపంచ ఆర్త్థ్రెటిస్‌ దినం--12 October 2010


మన ప్రతి కదలికకూ కీలే.. కీలకం! జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే... మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంటుంది. అది వేళ్ల జాయింట్లు కావచ్చు, మణికట్టు జాయింట్లు కావచ్చు.. భుజం జాయింట్లు కావచ్చు.. మోకాలి కీళ్లు కావచ్చు.. చివరికి పాదాల, వేళ్ల జాయింట్లు కావచ్చు.. దేనికైనా.. ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించటం మొదలుపెడితే..? కాలు కదపాలంటే కష్టం. చేయి మెదపాలంటే కష్టం. సంకెళ్లు వేసినట్టు.. జీవితం అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం!

ఈ కీళ్లకు వచ్చే అతి పెద్ద సమస్య ఆర్త్థ్రెటిస్‌! అంటే కీలు లోపలంతా వాచిపోయి.. కదపాలంటేనే తీవ్రమైన నొప్పి, బాధతో.. జాయింటులో ఓ విపత్తు తలెత్తటమన్న మాట. ఇది కీలు అరిగిపోవటం వల్ల రావచ్చు. దాన్ని ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌ అంటారు. ఇప్పుడు ఎక్కువ మంది అనుభవిస్తున్న మోకాళ్ల నొప్పుల బాధ ఇదే. ఇక ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్‌ తలెత్తి అది కీలుకు చేరటం వల్ల కీళ్లనొప్పి రావచ్చు. దీన్ని ఇన్ఫెక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు. సొరియాసిస్‌ వంటి చర్మ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపు, నొప్పి పలకరించవచ్చు. దాన్ని సొరియాటిక్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు. అలాగే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నీళ్ల విరేచనాల వంటి ఇన్ఫెక్షన్ల తర్వాత కూడా కీళ్ల వాపు రావచ్చు.దాన్ని రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు. చికున్‌గన్యా వంటి వైరల్‌ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపులు రావచ్చు, వీటిని వైరల్‌ రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు. ఇలా కీళ్ల వాపుల్లో ఎన్నో రకాలున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రత్యేకమైన, స్పష్టమైన కారణంతో వచ్చే కీళ్ల నొప్పులు! వీటికి భిన్నంగా... స్పష్టమైన కారణమేదీ తెలియకుండానే ఆరంభమయ్యే అతి పెద్ద సమస్య... రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌! కీళ్లవాతం!!

ఇది ఎవరికి, ఎందుకు వస్తుందో స్పష్టమైన కారణం ఇప్పటి వరకూ తెలియదు. కానీ ప్రతి వంద మందిలో ఒకరిని వేధిస్తోంది. ఒకసారి దీని బారిన పడ్డారంటే.. కీళ్లు ఎర్రగా వాచిపోతాయి. ఉదయం లేస్తూనే జాయింట్లు సహకరించవు. తీవ్రమైన నొప్పితో జీవితం నరక ప్రాయమవుతుంది. పైగా వేళ్లు, మణికట్టు వంటి చిన్న జాయింట్లను ఎక్కువగా పట్టి పీడించే ఈ కీళ్లవాతం.. దీర్ఘకాలం ఉండిపోయే సమస్య! దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కళ్ల వంటి ఇతరత్రా అవయవాలూ ప్రభావితమై పరిస్థితి మరింత విషమిస్తుంది. అదృష్టవశాత్తూ- దీన్ని పూర్తి నియంత్రణలోకి తీసుకువచ్చి.. తిరిగి హాయిగా జీవితం గడిపేలా తోడ్పాటునిచ్చే అత్యాధునిక చికిత్సా విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే 'ప్రపంచ ఆర్త్థ్రెటిస్‌ దినం' సందర్భంగా ఈ కీళ్లవాతానికి సంబంధించిన సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది సుఖీభవ!

  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjC9hcS40SSHch3M3uH_8cl70UaD7jQfz2CgJuPqg3ooPwYQwQ9Pt0UdcNRkbr75lGioPz_2-xdZ1ylNa4pgDaaxSyl8Hh1I7BfEavcwxCB026pqBnb-6EWj73UprkrFWWC97iHJruTg48/s1600/Arthritis.jpg

మన శరీరంలో ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఉంది. దీని పేరు 'రోగ నిరోధక వ్యవస్థ'. మనం వ్యాధుల బారినపడకుండా.. ఎటువంటి సూక్ష్మక్రిములూ మనపై దాడి చెయ్యకుండా నిరంతరం పహారా కాస్తుందీ వ్యవస్థ. రేయింబవళ్లు ఈ బాధ్యతలను ఇది అద్భుతంగా నిర్వర్తిస్తుంటుంది. కానీ.. ఒక్కోసారి ఇది పొరబడుతుంది! ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో తెలుసుకోలేని సందిగ్ధంలో పడిపోతూ.. ఏకంగా మన శరీర భాగాల మీదే దాడి చేసేస్తుంది. ఫలితమే రకరకాల 'ఆటో ఇమ్యూన్‌' సమస్యలు. కీళ్లవాతం.. రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ కూడా ఇలా తలెత్తే సమస్యే!

ఇది మన కీళ్లలో ఎముకల మధ్య ఉండే మృదువైన 'సైనోవియం' పొరను చూసి.. దాన్ని హానికారక శత్రువుగా పొరబడి... దానిపై దాడి చేసి దెబ్బతీయటం ఆరంభిస్తుంది. దీంతో కీళ్లు ఎర్రగా వాచిపోవటం, నొప్పుల వంటి బాధలన్నీ ఆరంభమవుతాయి. అయితే ఇది ఎందుకిలా ప్రవర్తిస్తుందో.. ఎవరిలో ఇటువంటి సమస్యలు తెచ్చిపెడుతుందో చెప్పటం కష్టం. ఇప్పుడిప్పుడే దీని వెనక ఉన్న జన్యుపరమైన, జీవనశైలీ పరమైన కారణాలను అర్థం చేసుకుంటున్నారు. మొత్తానికి దీన్ని ఎంత త్వరగా.. వీలైతే ముందుగానే గుర్తించి వెంటనే చికిత్స ఆరంభిస్తే కీళ్లు దెబ్బతినకుండా రక్షించుకోవటం, సాధారణ జీవితం గడపటం సాధ్యమవుతుంది.

నిర్ధారణ ఎలా?
రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ విషయంలో రక్త పరీక్షల వంటివాటి కంటే కూడా వైద్యుల విచక్షణకే ప్రాధాన్యత ఎక్కువ. లక్షణాల తీరు, కొన్ని పరీక్షల సహాయంతో వైద్యులే కచ్చితంగా నిర్ధారిస్తారు.

* రక్తపరీక్ష: రక్తంలో రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ (ఆర్‌ఏ ఫ్యాక్టర్‌) ఎలా ఉందో చూస్తారు. ఆరంభ దశలో ఇది 75% మందిలో పాజిటివ్‌గా ఉంటుంది. నెగిటివ్‌గా వచ్చినవారికి కొన్నాళ్ల తర్వాత మళ్లీ రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది.
* సీసీపీ యాంటీబాడీస్‌: వ్యాధి లక్షణాలు స్పష్టంగానే కనబడుతున్నా రక్తంలో 'ఆర్‌ఏ ఫ్యాక్టర్‌' నెగిటివ్‌ ఉన్న వారికి ఈ పరీక్ష అవసరం. ఇది పాజిటివ్‌ వస్తే కీళ్లవాతం ఉన్నట్టు బలంగా భావించాల్సి ఉంటుంది.
* ఈఎస్‌ఆర్‌, సీఆర్‌పీ: ఇవి కీళ్లవాతం బాధితుల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. హెమోగ్లోబిన్‌ తక్కువ ఉండొచ్చు.
* వీటికి తోడు వాచిన కీళ్లకు ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ వంటివీ వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడతాయి.

నాలుగంచెల మందులు
కీళ్లవాతానికి చికిత్స లేదని, ఒకసారి వచ్చిందంటే జీవితాంతం బాధలు పడాల్సిందేనని చాలామంది అపోహపడుతున్నారు. కానీ దీనికి సమర్థమైన చికిత్స ఉంది. దీనికి ఇచ్చే మందులను నాలుగు రకాలుగా విభజించొచ్చు.

1. నొప్పి నివారిణి మందులు: 'నాన్‌ స్టిరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ' రకం నొప్పి నివారణ మందుల్లో బ్రూఫెన్‌, నేప్రోసిన్‌, నిముసులైడ్‌, ఓవరాన్‌ వంటివి కొంచెం ఎక్కువ ప్రభావంతో పనిచేస్తాయి. ప్యారాసిటమాల్‌, ట్రెమడాల్‌ వంటివి తక్కువ ప్రభావం గలవి. వీటిని ముందుగా సిఫార్సు చేస్తారు. వీటితో పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు.

2. కార్టికో స్టిరాయిడ్స్‌: ఇవి నొప్పి తీవ్రతను తగ్గించటంలో బాగా తోడ్పడతాయి. వీటిని చాలా పరిమిత కాలానికే (అంటే కీళ్లవాతం తగ్గేందుకు ఇచ్చే దీర్ఘకాలిక మందుల ప్రభావం మొదలయ్యే వరకూ) ఇస్తారు. ఎక్కువ రోజులు వాడితే వీటితో దుష్ప్రభావాలుంటాయి గనక వీటిని తక్కువ మోతాదులో రెండు మూణ్నెల్లు మాత్రమే సిఫార్సు చేస్తారు.

3. వ్యాధి నియంత్రణ మందులు: 'డిసీజ్‌ మోడిఫైయింగ్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌'గా పిలిచే ఈ మందుల్లో ముఖ్యమైనది- 'మిథోట్రెక్సేట్‌'. ఇది వాస్తవానికి క్యాన్సర్‌కు వాడే మందు కావటంతో దీనిపై ఎన్నో అపోహలున్నాయి. కానీ.. ఇది కీళ్లవాతం చికిత్సల్లో బాగా పనికొస్తుంది. క్యాన్సర్‌ బాధితులకు దీన్ని పెద్దమోతాదులో ఇస్తే వీరికి చాలా స్పల్ప మోతాదుల్లో, అదీ వారానికి ఒకసారి మాత్రమే ఇస్తారు. వైద్యుల పర్యవేక్షణలో మెథోట్రెక్సేట్‌ను జాగ్రత్తగా వాడితే ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు.

* సల్ఫాసలజైన్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, లిఫ్లునోమైడ్‌, ఎజెతోయాప్రిన్‌ వంటివి కూడా కీళ్లవాతం చికిత్సలో ఉపయోగపడతాయి.

* ఈ మందులు వాడేటప్పుడు పరిస్థితి మెరుగవుతోందా? లేదా? దుష్పరిణామాలేమైనా ఉన్నాయా? అన్నది వైద్యులు పరీక్షిస్తుంటారు. సాధారణంగా 4-6 నెలల్లో వ్యాధి చాలావరకూ నిదానిస్తుంది.

* కీళ్లవాతం ఎలా తగ్గుముఖం పడుతోందన్నది ఎప్పటికప్పుడు 'డాస్‌ 28 స్కోర్‌' ఆధారంగానూ, ఈఎస్‌ఆర్‌, 'పేషెంట్‌ జనరల్‌ గ్లోబల్‌ స్కోర్‌' ఆధారంగా తరచూ అంచనా వేస్తుంటారు.

4. బయోలాజికల్స్‌ చికిత్స: కొత్తతరం ఖరీదైన మందులివి. ఎంబ్రెల్‌, రెమికేడ్‌, ఒరన్షియా, రిటుక్సిమబ్‌ వంటి ఈ బయోలాజికల్‌ మందులను ఇంజక్షన్‌ రూపంలో చర్మం కిందకు గానీ, రక్తనాళంలోకి గానీ ఇస్తారు. దీంతో సమస్య నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. ఫలితాలు చాలా బాగుంటాయి. గానీ వీటికి అయ్యే ఖరీదు చాలా ఎక్కువ. ఒకవేళ వీటిని వాడాక కొన్నాళ్ల తర్వాత వ్యాధి తిరిగి విజృంభిస్తే మళ్లీ 'డిసీజ్‌ మోడిఫికేషన్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌'తో చికిత్స చేస్తారు.
కీళ్లవాతం అంతా ప్రత్యేకమే

* సాధారణంగా ఇతరత్రా కీళ్ల నొప్పులైతే శరీరంలోని ఏదో ఒకవైపు కీలుకు మాత్రమే వస్తాయి. కానీ రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌లో- ఒకేసారి రెండు వైపులా వాపు కనిపిస్తుంది. అంటే ఉదాహరణకు కుడి చేతి వేలి కీళ్లు వాస్తే, ఎడమచేతి వేలి కీళ్లు కూడా వాస్తుంటాయి. కుడి మణికట్టు కీలు వాస్తే, ఎడమ మణికట్టు కీలూ వాస్తుంది. అలాగే ఈ వాపు ఏకకాలంలో శరీరంలోని చాలా కీళ్లకూ రావచ్చు.

* కీళ్లవాతం ఏ వయసు వారికైనా రావచ్చుగానీ సాధారణంగా పెద్దవారిలోనే.. అదీ 30-60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా- ఇది మహిళల్లో ఎక్కువ. ప్రతి నలుగురు కీళ్లవాతం బాధితుల్లో ముగ్గురు మహిళలే ఉంటున్నారు.

* కీళ్లవాతం.. సాధారణంగా శరీరంలోని చిన్న కీళ్లతో మొదలవుతుంది.అంటే చేతివేళ్లు, మణికట్టు, కాలివేళ్ల వంటి వాటితో ఆరంభమై క్రమేపీమోకాలు, తుంటి వంటి పెద్ద జాయింట్లకూ రావచ్చు. వాపు, నొప్పి వంటివన్నీ చిన్న జాయింట్లతో ఆరంభం కావటం దీని ప్రత్యేక లక్షణం. (అదే కీళ్లు అరిగిపోవటం వల్ల వచ్చే ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌ సాధారణంగా మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లతో మొదలవుతుంది)

* కీళ్లవాతం కొంతకాలం ఉద్ధృతంగా ఊపేస్తుంది. బాధలు తీవ్రతరమవుతాయి. మరికొంత కాలం నెమ్మదిస్తుంది. ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉండటం దీని మరో ప్రత్యేకత. మధుమేహం, హైబీపీల్లాగా ఇదీ దీర్ఘకాలిక సమస్య, దీనికి చికిత్స కూడా దీర్ఘకాలం తీసుకోవాల్సి ఉంటుంది.

* కీళ్లవాతంలో ఉదయం పూట కీళ్లు బిగుసుకుపోతుంటాయి. ఇలా కనీసం గంటకు పైగా బాధపడాల్సి ఉంటుంది. మిగతా కీళ్ల నొప్పులకూ, రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌కూ ఇదే ప్రధానమైన తేడా. అలాగే వీరిలో రాత్రి నొప్పులూ ఎక్కువ. కదులుతూ కాస్త అటూఇటూ తిరుగుతుంటే నొప్పి తగ్గినట్టుంటుంది. విశ్రాంతి తీసుకుంటే నొప్పి, బాధ ఎక్కువ అవుతాయి.
రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ దీర్ఘకాలిక సమస్య. కాబట్టి చికిత్స కూడా దీర్ఘకాలం, జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత కూడా మందులను కనీస మోతాదుల్లో దీర్ఘకాలం వాడుతుండాలి. తీవ్రత తగ్గిందని మందులు, చికిత్స పూర్తిగా మానేస్తే సమస్య మరింత ఉద్ధృతంగా ముంచుకొస్తుంది. మందులు తీసుకుంటుంటే హాయిగా సాధారణ జీవితం గడపగలుగుతారు.
రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ విషయంలో ఎటువంటి పథ్యాలూ లేవు. విటమిన్‌-సి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపల వంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిది.
* వ్యాయామం కీలకం కీళ్లవాతం బాధితుల్లో చాలామంది పూర్తి విశ్రాంతిగా పడుకుంటూ వ్యాయామం మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామం చేయకపోతే కీళ్లు గట్టిగా బిగుసుకుపోతాయి. కొన్నిసార్లు ఆపరేషన్‌ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. బాధలు ఉద్ధృతంగా ఉన్న సమయంలో మాత్రమే విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. మందులతో నొప్పి తగ్గాక వ్యాయామం మొదలెట్టాలి. నొప్పి తగ్గుతున్న కొద్దీ వ్యాయామం చేసే సమయాన్ని కూడా పెంచుకోవాలి. ఏరోబిక్‌, యోగా, నడక వంటి వ్యాయామాలు ఏవైనా చేయొచ్చు. బరువులు ఎత్తటం మాత్రం చేయకూడదు.

* రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ బాధితుల్లో చాలా కొద్దిమందికి మాత్రమే కీళ్ల మార్పిడి అవసరమవుతుంది. వ్యాధిని సత్వరమే గుర్తించి చికిత్స ఆరంభిస్తే ఈ కీళ్ల మార్పిడి అవసరం అంతగా రాదు. చిన్న కీళ్లకు ఈ మార్పిడి అవకాశమూ ఉండదు. అందుకే మందులతో చికిత్సకే ప్రాధాన్యం ఇస్తారు.

* లైంగిక జీవితంపై ఎటువంటి ప్రభావం ఉండదు. మందులు వాడుకుంటూ పూర్తి సాధారణ జీవితం గడపొచ్చు. కాకపోతే 'మిథోట్రెక్సేట్‌' తరహా మందులు వాడుతున్నప్పుడు గర్భం మాత్రం ధరించకూడదు. ఆ మందు ఆపేసిన తర్వాత.. 3 నెలలు ఆగి అప్పుడు మాత్రమే గర్భధారణకు ప్రయత్నించాలి. అవసరమైతే గర్భిణీ సమయంలో తక్కువ డోసులో స్టిరాయిడ్లు వాడొచ్చు.
కీళ్లవాతం లక్షణాలేమిటి?
* జాయింట్లు ఎర్రగా వాచిపోయి నొప్పి
* ముట్టుకుని చూస్తే వేడిగా ఉండటం
* కీలు కదలికలు కష్టంగా తయారవటం
* ఉదయం లేస్తూనే కీళ్ల కదలికలు బాధాకరంగా ఉండటం
* ఈ లక్షణాల తీవ్రత ఎప్పుడూ ఒకే తీరులో కాకుండా పెరుగుతూ తగ్గుతూ ఉండొచ్చు.

వీటికి తోడు...
* చాలామందిలో రక్తహీనత
* ఆకలి సరిగా లేకపోవటం
* నిస్సత్తువ, బరువు తగ్గిపోతుండటం
* బాధలు ఉద్ధృతంగా ఉన్నప్పుడు కొద్దిపాటి జ్వరం
* మోచేయి, మణికట్టు ప్రాంతంలో చిన్న బుడిపెలు (రుమటాయిడ్‌ నాడ్యూల్స్‌) ఉండొచ్చు. ఇవి ఉన్న వారిలో వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.
* ఎక్కువ కీళ్లు వాచటం, రెండు వైపులా ఒకే రకం కీళ్లు ప్రభావితం కావటం, నొప్పి.. ఈ లక్షణాలు 6 వారాల కన్నా ఎక్కువకాలం ఉంటే దాన్ని కీళ్లవాతం అని అనుమానించాలి.
వదిలేస్తే... విష వలయం!
కీళ్లవాతాన్ని అరుదైన సమస్యగా భావిస్తుంటారు గానీ ఇది చాలామందిలో కనిపిస్తుంది. మన జనాభాలో సుమారు ఒక శాతం మంది దీంతో బాధపడుతున్నారు. కానీ చాలామంది దాన్ని కీళ్లవాతంగా గుర్తించలేక.. ఏదో మామూలు కీళ్లనొప్పులేనని భావిస్తూ.. సమస్య ముదిరిపోయే వరకూ తాత్సారం చేస్తున్నారు. దీన్ని సత్వరం గుర్తించి చికిత్స చేయటం ఎంతో అవసరం. లేకపోతే పరిస్థితి ప్రాణాంతక సమస్యలకూ దారి తీస్తుంది.

* కీళ్లవాతం వచ్చిన తొలిదశలో కీళ్ల మీది పైపొర మాత్రమే దెబ్బతింటుంది. వ్యాధి ముదురుతున్నకొద్దీ క్రమేపీ అది కీళ్లను, లోపలి ఎముకలను కొరికేస్తుంది. ఇంకా తీవ్రమైతే కీళ్ల మధ్య ఖాళీ తగ్గిపోతుంది. దీంతో ఎముకల రాపిడి కారణంగా నొప్పి వస్తుంది. కొన్నాళ్లకు కీళ్లు మొత్తం దెబ్బతింటాయి.

* రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధులు ముంచుకొచ్చే అవకాశమూ ఎక్కువే. కీళ్లవాతాన్ని సరిగా నియంత్రించుకోకపోతే- వీరిలో గుండె జబ్బులు, పక్షవాతం వంటివి పదేళ్ల ముందుగానే వచ్చే ప్రమాదం ఉంది. కళ్లు పొడిబారటం, లాలాజలం తగ్గిపోవటంతో పాటు గుండె చుట్టూ, వూపిరితిత్తుల చుట్టూ నీరు చేరటం వంటి ఇబ్బందులూ ఎదురవ్వచ్చు. కీళ్లవాతాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకుంటే ఈ దుష్ప్రభావాల బెడద ఉండదు. లాలాజల గ్రంథులు దెబ్బతింటే నోరు ఎండిపోతుంది. దీంతో పిప్పిపళ్లు వచ్చి, త్వరగా దంతాలు వూడిపోతాయి. నాడుల చుట్టూ ఉండే రక్తనాళాలు దెబ్బతినటం వల్ల కాళ్లల్లో తిమ్మిరి, స్పర్శ తగ్గిపోవటం వంటివీ మొదలవుతాయి. చర్మం మీద పుండ్లు పడటం, నాడులు దెబ్బతిని న్యూరోపతీ రావొచ్చు.

* వ్యాధి ఉద్ధృతంగా ఉన్నప్పుడే ఇతరత్రా దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వ్యాధి ఉద్ధృతి తగ్గితే ఇతరత్రా దుష్ప్రభావాలు వచ్చే అవకాశం పెద్దగా ఉండదు. అందుకే వీడకుండా చికిత్స, క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం.. ఉత్తమం!

-డా.శరత్‌చంద్రమౌళి రుమటాలజిస్ట్‌ కిమ్స్‌ హాస్పిటల్‌ సికింద్రాబాద్‌


  • ===========================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Saturday, October 16, 2010

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ,World Mental Health Day



ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం--October 10 .


మన ఆలోచనలు, ఆచరణలూ అన్నీ మెదడుపైనే ఆధారపడి వుంటాయి. మెదడే గనుక లేకుంటే ఇంజన్‌ లేని రైలు, దారంలేని గాలిపటం అవుతాయి. మన కర్తవ్యాలను నెరవేర్చుకుంటూ, లక్ష్యాలను చేరి, ఆనందంగా జీవించేందుకు ఇతర శారీరక అవయవాలతోబాటు మానసిక ఆరోగ్యం సంతృప్తికరంగా వుండేలా చూసుకోవాలి. ఆ అవగాహన ఏర్పర్చుకోడానికి, అప్రమత్తంగా వంఉడటానికి, అవసరమైన ప్రణాళికలు రచించుకోడానికి, జాగ్రత్తలేంటో తెలుసుకుని పాటించడానికి ఉద్దేశించినదే ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈరోజున ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు చర్చలు జరపడం,సెమినార్లు నిర్వహించడం, మెంటల్‌ డిజార్డర్లేమీ చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మానసిక వైకల్యంతో బాధపడ్తున్నవారికి చికిత్స లాంటివన్నీ ఏర్పాటుచేస్తారు. మానసిక అనారోగ్యాన్ని అశ్రద్ధ చేసినా, చికిత్స మధ్యలో ఆపేసినా పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం వుంది.

శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడివుంటాయి. దీర్ఘకాలిక శారీరక సమస్యలు కొన్నిసార్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక దౌర్బల్యం శారీరకంగా క్షీణింపచేస్తుంది. కనుక అటు శారీరకంగాను, ఇటు మానసికంగానూ దృఢంగా వుండేట్లు చూసుకోవాలి. అప్రమత్తంగా వుండేందుకు అవస రమైన అంశాలను తెలుసుకోవాలి. 150 దేశాల మానసిక ఆరోగ్య కేంద్రాల సభ్యుల సలహా, సహకారాలతో 1992లో తొలిసారి వరల్డ్‌ పెడరేషన్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోద్బలంతో ఈ దినాన్ని జరిపారు. అంటే ఇవాళ 18వ వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ డే సెలబ్రేట్‌ చేసుకోబోతున్నాం. కొన్ని దేశాల్లో ఈరోజు మొదలు వారంపాటు మెంటల్‌ ఇల్‌నెస్‌ అవేర్‌నెస్‌ వీక్‌ పేరుతో సెమినార్లు, చికిత్సలు నిర్వహిస్తారు.

మానసిక రోగం పేరు చెప్తే చాలు మనందరికీ భయం. పొరపాటున అలాంటి వ్యాధి సోకితే జబ్బు తీవ్రత కంటే ఎక్కువగా మనం తల్లడిల్లిపోతాం. మనతోబాటు మనవాళ్ళూ ఆందోళన చెందుతారు. నిజానికి మనలో 40 శాతం పిచ్చివాళ్ళేననేది నిపుణుల అంచనా. అది మెడికల్‌ అనాలిసిస్‌ మాత్రమే. ఇంకా ఫ్రాంకుగా, నిఖార్సుగా చెప్పాలంటే పూర్తి నార్మల్‌గా వుండేవాళ్లు బహుశా ఏ రెండు శాతమో వుంటారు. మనచుట్టూ ఎంత అబ్‌నార్మాలిటీ?! ఎన్ని వింత పోకడలు? తిండి పిచ్చి, డబ్బు పిచ్చి, నగల పిచ్చి, పుస్తకాల పిచ్చి, పేరుపిచ్చి, సినిమాల పిచ్చి.. గొప్పలు చెప్పడం, అప్పులు చేయడం, ఆడంబరాలు పోవడం, షాపింగు, అతి వాగుడు, మితిమీరిన కోపం... అబ్బో.. చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత లిస్టవుతుంది.

ఏ లక్షణమైనా సరే అవధులు దాటినప్పుడు అది పిచ్చిచేష్ట అవుతుంది. లిమిట్స్‌లో ఉన్నంతవరకూ ఏదీ తప్పు కాదు. తిండి చాలా అవసరం. ''కోటి విద్యలూ కూటి కొరకే'' అని సామెత కూడా వుంది. ''తిండి కలిగితె కండ కలదోయ్‌/కండ కలవాడేను మనిషోయ్‌'' అని గురజాడ కూడా అన్నాడు. ఎవరూ ఏ నిర్వచనాలూ చెప్పకున్నా, సమయానికి మనకు ఆకలేస్తుంది. ఆ ఆకలి తీరితేనే రోజంతా శక్తి వుంటుంది. అలాగని పొద్దస్తమానం తిండి గురంచే మాట్లాడ్తూ, తిండియావతోనే వుంటూ, తింటూనే కనిపిస్తే చూసేవాళ్ళకి తెగ చిరాకేస్తుంది, కండొలిజా రైస్‌ వ్యాఖ్యానించినట్టు దేశానికి ఆహార పదార్థాల కొరతా వస్తుంది. భావం, భాష దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం. అవసరానికి అందంగా, ఆహ్లాదంగా, చేతనైతే కాస్త సరదాగా, చమత్కారంగా మాట్లాడ్తే అందరూ సంతోషిస్తారు. ఎంత అందమైన భావప్రకటన, ఏమి ఛలోక్తులు అని ప్రశంసిస్తారు కూడా. కానీ, అనవసరంగా, అసందర్భంగా మాట్లాడ్డమే ధ్యేయం అన్నట్టు పని మానేసి మాట్లాడేవాళ్ళని చూస్తే ''కొందరు తెలివైనవాళ్ళని డంబ్‌ అండ్‌ డెఫ్‌గా పుట్టించే దేవుడు వీళ్ళకి గళమెందుకు ఇచ్చాడా'' అనిపిస్తుంది. ఇది ప్రతిదానికీ వర్తిస్తుంది. ఎందులోనూ అతి ప్రదర్శించకుండా మన హద్దుల్లో మనం వుండి, బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నంతవరకు ఎవరూ మనని తప్పుపట్టరు.

ఈ జనసామాన్యమైన సంగతి అలా వుంచితే వైద్య పరిభాషలో డిప్రెషన్‌, యాంగ్జయిటీ, యాంగ్జయిటీ న్యూరోసిస్‌, బైపోలార్‌ డిజార్డర్‌, సోషల్‌ యాంగ్జయిటీ డిజార్డర్‌, పానిక్‌ డిజార్డర్‌, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌, పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌, ఫోబియా, మానియా, స్కిజోఫ్రీనియా, డిల్యూషనల్‌ డిజార్డర్‌, స్లీప్‌ డిజార్డర్‌ (ఇన్‌సోమ్నియా), ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌, సుపీరియారిటీ కాంప్లెక్స్‌, ఇల్యూషన్‌, అడిక్షన్‌ లాంటి మానసిక వైకల్యాలు అనేకం ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే మానసిక ఉద్రేకాలను నిగ్రహించు కోలేకపోవడమే రుగ్మతను తెచ్చిపెడ్తుంది. కష్ట సమయా లు, క్లిష్ట పరిస్థితుల్లో కుంగిపోకుండా బ్యాలెన్స్‌డ్‌గా వుండగల్గితే మెదడు సక్రమంగా పనిచేస్తుంది. కనుక వత్తిడికి గురికాకుండా సమస్య పరిష్కార దిశగా ఆలోచించమని చెప్తున్నారు సైకియాట్రిస్టులు. వత్తిడి, ఆందోళన తగ్గించుకోడానికి కొన్నిరకాల వ్యాయామాలను సూచిస్తున్నారు. ముఖ్యంగా మెడిటేషన్‌ వల్ల ఎంతటి స్ట్రెయినైనా, ఎలాంటి స్ట్రెస్సయినా మటుమాయమౌతుందని రుజువుచేసి చూపిస్తున్నారు.

మానసిక, శారీరక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడివుంటాయి గనుక ఒకదానికి చికిత్స తీసుకునేటప్పుడు రెండోదానిక్కూడా తీసుకోవడం మంచిదని మానసిక నిపుణులు చెప్తున్నారు. కొన్ని కాంప్లికేటెడ్‌ లేదా క్రానిక్‌ కేసులు నర్సింగ్‌హోమ్‌లో చేరి డాక్టర్‌ నిరంతర పర్యవేక్షణలో చికిత్స జరిపింతిచే ఫలితం వుంటుందని కూడా చెప్తున్నారు. మానసిక రోగులకు మందులతోబాటు మనోవేదన తగ్గించే చేయూత, ఆత్మీయత అవసరం. అనేక ఇతర కారణాలతోబాటు సహనం లేకపోవడం డిజార్డర్లకు దారితీస్తుందనేది వైద్యుల అభిప్రాయం. మరో సంగతేమంటే పని లేకపోవడం కూడా మానసిక వైకల్యానికి దారితీస్తుందట. అందుకే 'యాన్‌ ఐడీల్‌ మ్యాన్స్‌ బ్రెయిన్‌ ఈజ్‌ డెవిల్స్‌ వర్క్‌షాప్(An idle man's brain is devil's workshop)‌'' అన్నారు. చేతినిండా పని, మనసునిండా దాన్నెంత బాగా చేయాలా అనే తపన వుంటే ఇక లేనిపోని ఆలోచన్లకు, మైండు పాడుచేసుకోడానికీ తావెక్కడిది?

అనేక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్‌ ఇంప్రూవ్‌మెంట్‌ టీమ్‌లు ప్రపంచ మానసిక ఆరోగ్య దినానికి తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఆందోళన, వత్తిడి అనేవి డిప్రెషన్‌కు దారితీస్తాయి కనుక ముందుగా వాటికి చెక్‌పెట్టమని హితవు చెప్తున్నారు నిపుణులు. నిద్రలేమి లేదా ఇన్‌సోమ్నియా కూడా ఒకరకమైన మానసిక వ్యాధే. అంతూదరీలేని వ్యాకుల మనసులో పేరుకుపోయివుంటే నిద్రపట్టదు. ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. లేకుంటే శారీరక బడలిక తీరదు, మానసిక ప్రశాంతత లభించదు. కలతపరిచే ఆలోచనలు, చేటుచేసే చేష్టలు మానుకుంటే మానసిక రుగ్మతలేవీ దరిచేరవు అంటున్నారు సైకియాట్రిస్ట్‌ పెర్కిన్‌.

తగుమోతాదులో పౌష్టికాహారం, రోజులో కనీసం గంట సేపు వ్యాయామం, శక్తికి మించిన అలసట, దుర్భరమైన నొప్పి లేకుండా చూసుకోవడం, రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజులు, తీవ్ర ఉద్రేకాలకు లోనుకాకుండా, కుంగిపోకుండా వుండాలి. లోకంలో పరిష్కారం లేని సమస్యంటూ గుర్తించి, ప్రయత్నిస్తే ఆందోళనే వుండదు ఈపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే మానసిక రుగ్మతలు దరిచేరవని హామీ ఇస్తున్నారు నిపుణులు. ఇన్ని మాటలెందుకు.. క్లిష్టసమస్యలెదురైనా తలమునకల వకుండా ధైర్యంగా పరిష్కరించుకోగల్గితే, అందనివాటికి అర్రులు చాచి ఆందోళన చెందకుండా మనసు పదిలంగా వుంచుకుంటే చాలు మానసిక వైకల్యానికి తావే లేదు.

World Mental health Day,ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం-2013

మానసిక రుగ్మతలకు మెరుగైన చికిత్స---వృద్ధాప్యం మరో బాల్యం లాంటిది. పండుటాకులకూ పసిబిడ్డలకూ పెద్దగా తేడా ఉండదు. వృద్ధులతో వ్యవహరించేటప్పుడు కాస్త సున్నితంగా ఉండటం చాలా అవసరం. సగటు ఆయుర్దాయుం పెరగడంతో వృద్ధుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. వృద్ధుల సంఖ్యతోపాటే మలి వయసులో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్యా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా అక్టోబరు 10న నిర్వహించే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది వృద్ధుల్లో వచ్చే మానసిక రుగ్మతలపై అవగాహన కల్పించేందుకు కృషి జరుగుతోంది.

 మానసిక చికిత్సా విభాగానికి వచ్చే ప్రతి వంద మందిలో 25 మంది వృద్ధులుంటున్నారు. వీరిలో అత్యధికులు డిప్రెషన్‌, నిద్రలేమి, ఆందోళన, డిమెన్షియా వంటి ఆరోగ్య సమస్యలతో వస్తున్నారు. వీరందరికి మెరుగైన చికిత్స అందించడమే కాకుండా అవసరమైన వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపుతున్నారు. వ్యాధి తీవ్రత ఉన్న వారిని వార్డులో చేర్చుకుని వైద్య సేవలందిstaaరు.

వృద్ధాప్యంలోనూ సంతోషంగా..
వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల, ఇంట్లో వారు వృద్ధుల పట్ల కొద్దిపాటి శ్రద్ధ చూపిస్తే వృద్ధాప్యం ఎంతో సంతోషకరమైన దశగా మారుతుంది. వృద్ధులు కూడా ఈ వయసులో మారాలా? ఎలాగో జీవితం అయిపోయింది అన్న ధోరణిలోకి జారిపోకూడదు. ఏ వయసు వారైనా మంచి ఆహారపు అలవాట్లు, చక్కని వ్యాయామం, మద్యం, పొగ జోలికిపోకుండా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. మానసిక రుగ్మతలు ఉన్నవారికి dESamulO మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి తీసుకువస్తే వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చు.
  • ==========================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Friday, October 15, 2010

Indian Airforce Day , భారత వాయుసేన దినోత్సవం


  • ప్రతి సంవత్సరము అక్టోబర్ 08 న .
భారతదేశ త్రివిధ దళాల్లో వైమానిక దళము ఒకటి . దీని ప్రధాన భాద్యత గగనతలాన్ని రక్షించడము , యుద్ధసమయాల్లో వైమానిక దాడులు నుర్వహించడము .

భారత వైమానిక దళాని 1932 అక్టోబరు 08 న తొలుతగా యేర్పాటుచేసారు . రెండో ప్రపంచ యుద్ధకాలములో ఈ దళము అందించన సేవలకు గుర్తింపుగా 1945 లో " రాయల్ " అన్న పదాన్ని ముందు కలిపారు . 1947 లో మనదేశము స్వాతంత్రాన్ని సముపార్జించాక " రాయల్ ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ " యూనియన్‌ ఆఫ్ ఇండియాకు సేవలందించినది . 1950 లో భారతదేశము రిపబ్లిక్ గా మారాక ' రాయల్ ' ను తీసేసారు . స్వాతంత్రం వచ్చిన దగ్గరనుంచి భారతీయ వైమానిక దళం పాకిస్తాన్‌ తో నాలుగు యుద్ధాల్లో , చైనా తో ఒక యుద్ధం లో పాల్గొన్నది . ఆపరేషన్‌ విజయ్ , ఆపరేషన్‌ మేఘ్ దూత్ , ఆపరేషన్‌ కాక్టస్ వంటి ప్రధాన బాధ్యతల్ని సమర్ధ వంతం గా నిర్వహించినది . యుద్ధాలవిషయం అలా ఉంచితేఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతవైమానిక దళము చురుగ్గా పాల్గొన్నది .

ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ 1,70,000 మంది సిబ్బందితో , 1300 విమానాలతొ ప్ర్పంచం లో నాల్గవ పెద్ద దళం గా ఉన్నది . మొదటి స్థానము లొ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ , రెండెవ స్థానములో రష్యన్‌ ఎయిర్ ఫోర్స్ , మూడవ స్థానములో చైనా ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి . సోవియట్ కాలం నాటి యుద్ధవిమానాల్ని మార్చేందుకు ఐ.ఎ.ఎఫ్. విసృతమైన ఆధునికీకరణ కార్యక్రమాల్ని చేపట్టింది . 1947 ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చట్టము , భారత రాజ్యాంగము , 1950 నాటి ఎయిర్ ఫోర్స్ చట్టము , ఐ.ఎ.ఎఫ్. విధుల్ని స్పష్టము గా నిర్వచించాయి . దీనిప్రకారము భారత్ ను అన్ని కోణాల నుంచి రక్షించేందుకు భారత వైమానిక దళము సర్వసిద్ధం గా ఉంటుంది . ఇతర సాయుధ దళాల సహకారము తో భాతీయ గగన తలాన్ని రక్షిస్తూ , భారత భూభాగాన్ని , జాతి ప్రయోజనాల్ని అన్నిరకాల సవాళ్ళ నుంచి కాపాడు తుండాలి . యుద్ధ రంగం లో భారత సైన్యానికి ఐ.ఎ.ఎఫ్ వైమానిక మద్దతును అందిస్తూ వ్యూహాత్మకం గా వస్తు సామగ్రిని సైనికుల్ని ఆకాశమార్గాన పంపుతుంది .

సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించే దేశ అంతరిక్ష పరికరాల్ని సమర్ధవంతం గా ఉపయగించుకోవడం కోసము అంతరిక్షవిభాగానికి , ఇండియన్‌ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) లతో కలసి ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ ను నిర్వహిస్తుంది . ఈ సామగ్రికి ఎలాంటి నష్టం కలగకుండా కాపాడుతుంది . ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇతర సనికదళ శాఖలతో కలిసి బాధితులను కాపాడె ప్రయత్నాలు చేస్తుంది . ప్రబావిత ప్రదేశాల్లో బాధితులకు సహాయ సామాగ్రిని కిందకు జారవిడుస్తుంది .

1998 గుజరాత్ సైక్లోన్‌ , 2004 నాటి సునామీ విపత్తులలో ఇ.ఎ.ఎఫ్ . విసృతమైన సహాయ చర్యలు చేపట్టినది . శ్రీలంకలో ఆపరేషన్‌ రెయిన్‌ బో తరహాలో ఇతర దేశాలకు కూడా సహాయం అందిస్తూ ఉన్నది . ఇ.ఎ.ఎఫ్ తొలి విమానం వెస్ట్ లాండ్ వాపిటి . 1933 ఏప్రిల్ ఒకటో తేదీన తొలిదళాన్ని ఐదుగురు భారతీయ పైలట్ల తో ఏర్పాటు చేసుకున్నది . అప్పుడు ఏర్పాటైన తొలి స్క్యాడ్రాన్‌ 1938 దాకా నెంబర్ వన్‌ గా ఇ.ఎ.ఎఫ్ ఏకైక స్క్యాడ్రాన్‌ గా కొనసాగింది . రెండో ప్రపంచ యుద్ధకాలం లో ఇ.ఎ.ఎఫ్. చిహ్నం నుంచి ఎర్రని బిందువు తొలగించారు . జపనీస్ రెడ్ సీన్‌ ఎంబ్లం తో పోలిక లేకుండా ఉండేందుకు దీన్ని తొలగించారు . 1943 లో ఎయిర్ ఫోర్స్ నాలుగు స్క్యాడ్రన్ల సంఖ్య 1945 నాటికి తొమ్మిదికి పెరిగింది . స్వాతంత్ర్యాన్ని ప్రకటించాక యూనియన్‌ ఆఫ్ ఇండియా , డొమినియన్‌ ఆఫ్ పాకిస్తాన్‌ లు గా విడిపోయింది . సైనిక దళాలు కూడా అలాగే విభజనకు గురయ్యాయి . భారత వైమానిక దళం రాయల్ ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ గా ఉండిపోయింది . రాయల్ ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ చిహ్నం అశోక చక్రం నుంచి తీసుకున్న ' చక్ర ' గా మారింది . అదే సమయం లో జమ్ము -కాశ్మీర్ వివాదం చెలరేగింది . ఈ భూభాగము లోనికి పాకిస్తానీ దళాలు చొచ్చికు వస్తుండగా , ఆ సంష్థానము మహారాజు భారత సైనిక సహాయము కోరాడు . రెండు దేశాల నడుమ లాంచన ప్రకటన కేకుండానే భారత దళాలు వార్ జోన్‌ లోకి ప్రవేశించగానే యుద్ధం మొదలైనది . ఈ యుద్ధం లో పాకిస్థాన్‌ వైమానిక దళం తో ముఖాముఖి తలపడాలేదు కాని , భారతీయ దళాలకు సమర్ధవంతమైన రవాణా , అంతరిక్ష మద్దతు అందించినది . 1950 లో రాయల్ పదాన్ని తొలగించినప్పుడే ప్రస్తుత వైమానిక దళం చిహ్నాన్ని చేపట్టారు .

కాంగో సంక్షో్భము , గోవా విమోచనము సందర్భం గా 1960 - 61 లో ఇ.ఎ.ఎఫ్ విశి్ష్ట సేవలు చేసినది . 1962 లో చైనా భారత్ నడుమ సరిహద్దు వివాదము తలలెత్తాయి ... యుద్దం అనివార్యమయినది . సినో-ఇండియా యుద్ధం సందర్భం గా భారతీయ సైనిక వ్యూహకర్తలు కుట్రను పసికట్టడం లో విఫలమైనా చైనా దళాలకు వ్యతిరేకం గా ఐ .ఎ.ఎఫ్ ను అత్యంత సమర్ధవంతంగా వినియోగించుకున్నారు . దీని తర్వా 1965 లో పాకిస్తాన్‌ తో యుద్ధం లో సినో-ఇండియా యుద్ధ అనుభవ పాఠాల రీత్యా బారత్ తన వైమానిక దళాన్ని విసృతం గా వినియోగించుకున్నది . తర్వాత దళం సామర్ధ్యానీ పెంచుకున్నది . . . అనేక మార్పులు చేసినది .

వస్తు సామగ్రి అందజేత , రిస్క్ ఆపరేషన్ల సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు అనేక అంతరిక్ష నైకల్ని అమకూర్చుకున్నది . 1971 లో భారత్ -పాకిస్తాన్‌ నడుమ జరిగిన బంగ్లాదేశ్ విమోచనా యుద్ధం లో వైమానిక దళం విభిన్న ఆపరేషన్లు నిర్వహించి ఘనతికెక్కినది . ఇలా దాదాపు 8 దశాబ్దాల క్రితం ఏర్పడిన భారత వైమానిక దళము యుద్ధాలు , సహాయక చర్యల్లో పాల్గొంటూ మరెన్నో ఆపరేషన్లు నిర్వహిస్తూ భారత భూభాగాన్ని , భారతీయుల్ని కాపాడుతోంది . ఆన్ని సాయుధదళాలకు భారత రాస్ట్రపతే సుప్రీం కామాండర్ . రక్షణ మంత్రి నేతృత్వం లొ రక్షణ విభాగము ఎయిర్ ఫోర్స్ ను పర్యవేక్షిస్తుంది . పభుత్వ భద్రతా విధానానికి రూపకల్పన చేయడం ద్వారా ప్రధానమంత్రి , జాతీయ భద్రతామండలి పరోక్ష నాయకత్వాన్ని అందిస్తారు . ఎయిర్ చీఫ్ మార్షల్ వైమానిక దళ ప్రధాన కార్యాలయాన్ని అజమాయిషీ చేస్తూ వైమానిక దళానికి సారద్యం వహిస్తారు .

భారతీయ వైమానిక దళం 5 ఆపరేషనల్ , 2 ఫంక్షనల్ కమాండ్స్ గా విభజితమై ఉంది . దేశాన్ని అన్ని విధాలుగా రక్షిస్తున్న ఈ దళం సేవలను గుర్తిస్తూ , అది ఏర్పాటయిన రోజును ... అంటే అక్టోబర్ ఎనిమిదో తేదీన 'ఎయిర్ ఫోర్స్ డే ' జరుపుకుంటారు .
  • ========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Thursday, October 14, 2010

World Vegeterian Day , ప్రపంచ శాఖాహార దినోత్సవం

  • World Vegeterian Day , ప్రపంచ శాకాహార దినోత్సవం -- అక్టోబర్ 01.

శాకాహారము వల్ల కలిగే ప్రయోజనాల్ని మానవజాతికి తెలియజెప్పి , ఈ ఆహారము జీవన విధానాన్ని ఏవిధం గా మెరుగుపరుస్తుందో వివరిస్తూ ప్రోత్సహించే ఉద్దేశం తో వరల్డ్ వెజిటేరియన్‌ డే ను 1977 లో ప్రకటించారు . ముందుగా 1974 లో నార్త్ అమెరికన్‌ వెజిటేరియన్‌ సొసైటి (N.A.V.S) ఏర్పాతయినది . దీన్ని ఏర్పాటుచేయడానికి ప్రధాన ప్రధాన ఉద్దేశాలు రెండు . సొసైటీ సభ్యులకు మద్దతుగా నెట్ వర్క్ ఏర్పాటు చేయడం . .. సంబంధిత గ్రూపులు , శాకాహారులకు మద్దతు ఇవ్వడం ఒక భాగం కాగా , శాకాహారము ఏవిధమైన ప్రయోజనాలు ఇస్తుందో ప్రజలకు తెలియజెప్పడం రెందవది .

పౌష్టికాహారము విషయం లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది . చైనాలో సేవించే గ్రీన్‌ టీ లో యాంటి ఆక్షిడెంట్లు పుష్కరముగా లభిస్తే , ఫ్రాన్స్ లోని ' రెడ్ వైన్‌' లో ప్లేవనాయిడ్స్ దండిగా ఉంటాయి . ఇక ఇటలీ లో ఆలివ్ ఆయిల్ , అమెరికాలో రెడ్ బీన్స్ , జర్మనీ లో తినే ' బ్లాక్ బ్రెడ్ ' , బ్రెజిల్ లో వాడే ఎర్బామేట్ పానీయము , గ్రీస్ లో ఎక్కువగా వాడే నిమ్మ , భారతదేశములో వాడే లస్సి , జపాన్‌ లో వాడే పుట్టగొడుగులు , ఆస్ట్రేలియాలో వాడే ఫ్రూట్ సలాడ్స్ అన్ని మంచి విటమిన్ల తో కూడుకున్నవే .
శాఖము, ఆహారము అనేరెండు పదముల కలయిక. శాఖము అంటే చెట్టు . . . చెట్టు , మొక్కల నుండి వచ్చే ఆహారము అని అర్ధము . పుట్టిన ప్రతి జీవికి జీవించదానికి అతవసరమైనది ఆహారం . ఇది శాఖాహారమా , మంసాహారమా అనేది ఆజీవి పుట్తుక , అలవాట్లు , పరిసరాల పైన ఆధారపడి ఉంటుంది .

1977 లో నార్త్ అమెరికన్‌ సొసైటి " వరల్డ్ వెజిటేరియన్‌ డే " ను వార్షిక వేడుకగా ప్రకటించగా , 1978 లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్‌ యూనియన్‌ ఆమోదాన్ని తెలిపింది . అక్టోబర్ ఒకటో తేదీన అధికారికంగా ఈ వేడుక జరుపుకోవాలని ప్రకటించినది .

సులువుగా జీర్ణమయ్యే ఆహారము బార్లి లాంటివి అనేకము ఉన్నాయి . గోధుమతో పోల్చితే బార్లి శరీరములో పేరుకు పోయిన నీటిని బయటికి పంపిస్తుంది . ఆకుకూరలు , కాయకూరలు , గింజము , పప్పులు ఆరోగ్యానికు ఎంతో మంచిది . మాంసాహారము ఎన్నో జీర్ణకోస వ్యాధులకు కారణమవుతుంది . శాకాహారము జీర్ణకోశవ్యాధులను నయము చేస్తుంది .

  • ==========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Thursday, October 7, 2010

World Deaf Day , ప్రపంచ వినికిడి మెరుగు పరిచే దినోత్సవం




వరల్డ్ డెఫ్ డే -- సెప్టెంబర్ 23 న .

సమాజము లో చెవిటి వారు అంటే చిన్నచూపు , హేలన చేసే బావన ఉన్న ఈ రోజొల్లో వినికిడి విజ్ఞానము అభివృద్ధి చెంది వారికీ సమాజములో సమాన హోదా , గౌరవ , మర్యాదలు పొందుతున్నారు . చాలామంది చదువు కుంటున్నారు , ఉద్యోగాలు చేసుకుంటున్నారు . ప్రపంచవ్యాప్తము వారికీ ఒక సంఘం ఉండాలన్న ఉద్దేశము తో ..........
ఇటలీలోని రోమ్‌ లో వరల్డ్ డెఫ్ డే కి 1951 లో రూపకల్పన చేశారు . ఇది అంతర్జాతీయ ప్రభుత్వేతర సెంట్రల్ ఆర్గనైజేషన్‌ . వినికిడి లేనివారి జాతీయ అసోసియేషన్‌ లతో కూడి ఉన్నది . ప్రపంచవ్యాప్తం గా ఈ సంస్థలో 130 దేశాలు సభ్యత్వం కలిగివున్నాయి . జాతి , దేశము , మతము , లింగ వివక్ష , ఇతత ప్రాధాన్యాలు , భేదాలు లేకుండా ప్రజలందరికీ సమానత్వము , మానవ హక్కులు , గౌరవమర్యాదలు ఒకేమాదిరి ఉండాలన్నది ఈ వరల్డ్ డెఫ్ డే సిద్ధాంతము . దీనిని ఏటా సెప్టెంబర్ 23 న నిర్వహిస్తున్నారు .
సౌంజ్ఞల భాషను ఉపయోగించే వినికిడి లేనివారిపై , వారి కుటుంబము , మిత్రులుపై దృస్తి సారిస్తూ మానవహక్కులపై ఏర్పాటుచేసిన అనేక ఐక్యరాజ్యసమితి సదస్సులకు W.F.D. మద్దతు ఇచ్చినది . ఇది ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో కన్స్ల్టేటివ్ స్థాయి కలిగిఉంది . ఇంకా అనేక అనుబంధ సంస్థలతో బాంధవ్యాలు కలిగిఉంది . ఇంటర్నేషనల్ డిజెబిలిటీ అలయెన్స్ (IDA) లో డబ్ల్యు.ఎఫ్.డి.కి సభ్యత్వం ఉన్నది . సైన్‌ లాంగ్వేజెస్ స్థాయిని మెరుగుపరచడం , విన్లేనివారికి ఉత్తమ విద్య , సమాచారము , ఇతర సేవల్ని మెరుగుపరచడం , వర్దమాన దేశాల్లో వినికిడిశక్తి లేని వారి మానవహక్కుల్ని మెరుగుపరచడం , ప్రస్తుతం లేని ప్రాంతాలలో డెఫ్ ఆర్గనైజేషన్లు నెలకొల్పడాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశాలు .
డబ్ల్యు.ఎఫ్.డి . నిర్ణయాలు తీసుకునే విభాగము... జనరల్ అసెంబ్లీ ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి జరిగే జనరల్ అసెంబ్లీకి ఇద్దరు వినికిడి లోపము గల ప్రతినిధులను పంపేహక్కు ప్రతి సాధారణ సభ్యదేశానికీ ఉంటుంది . W.F.D కి యునైటెడ్ నేషన్స్ లో బి-కేటగిరి స్టేటస్ ఉంది . ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (E.N.C) రీజినల్ కమీషన్లు అయిన ఎకనామిక్ కమీషన్‌ ఫర్ ఆఫ్రికా (ఇసిఎ), ఎకనామిక్ కమీషన్‌ ఫర్ యూరఫ్ (ఇసిఇ ), ఎకనామిక్ కమీషన్‌ ఫర్ ల్యాటిన్‌ అమెఇకా అండ్ ది కరిబియన్‌ (ఇసిఎల్ ఎసి ) , ఎకనామిక్ అండ్ సోషల్ కమీషన్‌ ఫర్ వెస్టరన్‌ ఏసియా(ఎ ఎస్ సి డబ్ల్యూఎ ) , యునెస్కో , ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్‌ , వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ , వరల్డ్ బ్యాంక్ , కౌన్సిల్ అఫ్ యూరఫ్ం ల వంటి గ్రూపులకు డబ్ల్యు .ఎఫ్.డి ప్రాతినిధ్యము వహిస్తోంది . సలహాలు సూచనలు ఇస్తూఉంటాయి .
ఇండియాలో సుమారు 60 మిలియన్లు చెవిటివారు ఉన్నారు . పురుషులకు స్త్రీలకు వేర్వేలు ఆర్గనైజేషన్లు ఉన్నాయి . ఉదా. Delhi foundation of Deaf women , Madras foundation of Deaf Women . సెప్టెంబర్ 26 న " డే ఒఫ్ ది డెఫ్ " ఇండియాలో జరుపుకుంటారు .
చెవిటి వారికి ఆటలకు ఎమీతక్కువలేదు . ఎన్నో స్పోర్ట్స్ అసోషియేషన్లు ఉన్నాయి . ఉదా: " All India sports council of thd Deaf " , All India Cricket association of the Deaf" , "Delhi sports council for the Deaf" . మున్నగునవి .
ఎన్నో చెవిటి , మూగ స్కూల్స్ ఉన్నా్యి. మూగవారికి ప్రత్యేక సైన్‌ లాంగ్వేజ్ ఉన్నది .

2001 జనాభా లెక్కలు ప్రకారం, ఇండియాలో 2.19 కోట్ల మంది వికలాంగులు ఉన్నారు. వారు మొత్తం జనాభాలో 2.13% ఉన్నారు. వీరిలో కంటికి, వినికిడికి, మాట, లోకోమోటారు మరియు మానసిక సంబంధమైన వైకలాల్ని కలిగి ఉన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో 75% మంది వికలాంగులు ఉన్నారు, వికలాంగులలో 49 % అక్షరాస్యులు ఉన్నారు మరియు 34% మాత్రమే పనిచేస్తున్నారు. ఇంతకుముందు వైద్య పునరావాసానికి ప్రాముఖ్యత నిచ్చేవారు, మరి ఇప్పుడు సామాజిక పునరావాసానికి ప్రాముఖ్యతనిస్తున్నారు.


జనాభా లెక్కలు, ఇండియా 2001 ప్రకారం, వికలాంగుల డేటా

కదలిక 28%
చూపు 49%
వినికిడి 6%
మాట 7%
మానసిక 10%
ఉత్పాదక స్థానం: 2001 జనాభా లెక్కలు, ఇండియా

జాతీయ మోతాదు సర్వే సంస్థ (ఎన్ ఎస్ ఎస్ ఒ) 2002 ప్రకారం వికలాంగుల డేటా
కదలిక 51%
చూపు 14%
వినికిడి 15%
మాట 10%
మానసిక 10%
ఉత్పాదక స్థానం: జాతీయ మోతాదు సర్వే సంస్థ, 2002


ప్రభుత్వ పథకాలు

కొనుగోలు / ఫిట్టింగులలో సహాయోపకారణాలు మరియు ఉపకరణాలను వికలాంగులకు కల్పించ డానికి సహాయం ( ఎ డి ఐ పి పథకం ) వైకలాంగిక ప్రభావాన్ని తగ్గించి మరియు ఆర్థిక స్తోమతని పెంచి వారి భౌతిక, సామాజిక మరియు శాస్త్రీయంగా తయారు చేసిన, నూతనమైన ప్రమాణాలు గల సహాయోపకరణాలు మరియు ఉపకరణాలు, అవసరమైన వికలాంగులకు కొనుగోలు చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఈ పథకం క్రింద, సరఫరా చేసిన సహాయోపకరణాలు మరియు ఉపకరణాలపై ఐ ఎస్ ఐ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టేండర్డ్) మార్క్ ఉండాలి.

ఎ డి ఐ పి పథకం క్రింద, మొత్తం సహాయం మరియు ఆదాయ పరిమితి ఈ క్రింద ఇవ్వబడింది.

మొత్తం ఆదాయం మొత్తం సహాయం

(i) నెలకి 6500 రూపాయల వరకు (i) సహాయోపకరణాల/ ఉపకరణాల
మొత్తం ధర
(ii) నెలకి 6501 రూపాయల నుండి (ii) 50% సహాయోప కరణాల/ ఉపకరణాల
10000 రూపాయల వరకు మొత్తం ధర
స్వంచ్ఛంద సేవా సంస్థలు (ఎన్ జీ ఓ) , ఈ మంత్రిత్వశాఖ క్రింద ఉన్న జాతీయ సంస్థలు, కృత్రిమ అవయవాలు తయారు చేసే సంస్థ (ఒక భారత ప్రభుత్వ సంస్థ)ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

వికలాంగులకు జాతీయ ఫింఛను పథకం :

వికలాంగులకు జాతీయ ఫింఛను పథకం క్రింద, మెట్రిక్ తరువాత ఒక సంవత్సరం కన్నా ఎక్కువ ఉండే ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ కోర్సులు చదువుకోడానికి ప్రతి సంవత్సరం 500 క్రొత్త ఫింఛనులు ఇస్తారు. అయినప్పటికి, మెదడుకు సంబంధించిన పక్షవాతము, మానసిక మాంద్యము, ఒక్కటి కన్నా ఎక్కువ వైకల్యాలు మరియు అధిక లేదా త్రీవ్రమైన చెవుడు ఉన్న విద్యార్థుల విషయంలో 9 వ తరగతి నుండి చదువుకోడానికి విద్యార్థి ఫింఛన్లు ఇస్తారు. ఫింఛన్ల కొరకు ధరఖాస్తుల్ని తీసుకోనే ప్రకటనల్ని ప్రముఖ జాతీయ/ ప్రాంతీయ వార్తా పత్రికలలో జూన్ నెలలో ఇస్తారు మరియు మంత్రిత్వ శాఖ వైబ్ సైట్ లో కూడా పెడతారు. ఈ పథకానికి విస్తారమైన పబ్లిసిటీ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాల్ని / కేంద్రపాలిత ప్రాంతాల్ని కూడా అభ్యర్ధించడం జరిగింది.

40% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉండి, వారి నెలసరి ఆదాయం 15000 రూపాయలకన్నా ఎక్కువ లేని విద్యార్థులకి ఈ ఫింఛను తీసుకోవడానికి అర్హత కలదు. గ్రేడ్యుఏట్ మరియు పోస్టు గ్రేడ్యుఏట్ లెవెల్ టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు పగటిపూట చదివేవారికి నెలకి 700 రూపాయల ఫింఛను మరియు వసతి గృహాలలో చదివే విద్యార్థులకు నెలకి 1000 రూపాయల ఫింఛను ఇస్తారు. డిప్లోమో మరియు సర్టిఫికెట్ లెవెల్ ప్రొఫెషనల్ కోర్సులు పగటిపూట చదివేవారికి విద్యార్థి ఫింఛను లేదా నెలకి 400 రూపాయలు మరియు వసతి గృహాలలో చదివే విద్యార్థులకు నెలకి 700 రూపాయల ఫింఛను ఇస్తారు. ఈ ఫింఛను ఇవ్వడమే కాకుండా, సంవత్సరానికి 10,000 రూపాయల వరకూ కోర్సు ఫీజుని విద్యార్థులకు ఇస్తారు. ఈ పథకం క్రింద గ్రుడ్డి మరియు చెవిటి గ్రేడ్యుఏట్ మరియు పోస్టు గ్రేడ్యుఏట్ విద్యార్థులకి (ప్రొఫెషనల్ కోర్సు చదువు తున్న) ఎడిటింగు సాఫ్ట్ వేరుతో పాటు కంప్యూటర్ కొరకు మరియు మెదడుకి సంబంధించిన పక్ష వాతము ఉన్న విద్యార్థులకి సపోర్టు ఏక్సెస్ సాఫ్ట్ వేరు కొరకు ఆర్థిక సహాయం చేస్తారు.


జాతీయ సంస్థలు / అఖిలస్థాయి సంస్థలు

వికలాంగులకు అధికారమిచ్చే పోలసీకి అనుగుణంగా మరియు వారి పలు పరిమాణాల సమస్యల్ని ప్రభావితం చేయడానికి ఈ క్రిందనిచ్చిన జాతీయ సంస్థలు/అఖిలస్థాయి సంస్థలు ప్రతి పెద్ద వైకల్యం ఉన్న ప్రాంతంలో పెట్టారు.

* దృష్టి లోపముగల వారికి జాతీయ సంస్థ, డెహరాడూన్
* ఎముకల లోపముగల వారికి జాతీయ సంస్థ, కలకత్తా
* వినికిడి లోపముగల వారికి ఆలి యవర్ జంగ్ జాతీయ సంస్థ, ముంబాయి
* మానిసిక లోపముగల వారికి జాతీయ సంస్థ, సికింద్రాబాద్
* పూనరావాస అభ్యాసం మరియు రీసెర్చ్ జాతీయ సంస్థ, కటక్
* వికలాంగుల సంస్థ, క్రొత్త ఢిల్లీ
* ఒకటి కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారికి అధికారం కొరకు జాతీయ సంస్థ ( ఎన్ ఐ ఇ పి ఎమ్ డి ), చెన్నై

  • ======================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

ప్రపంచ ముద్దుల దినోత్సవం , World Kissing Day





ముద్దు ఎవరు ఎవరికి ఇచ్చేదయినా కావచ్చు. తల్లి తన తనయులకు లేదా తనయలకు ఇచ్చేదే కావచ్చు, లేదా భర్త తన భార్యకు ఇచ్చేదే కావచ్చు. ప్రియుడు తన ప్రియురాలికి ఇచ్చేదే కావచ్చు...ముద్దేదయినా దాని వెనుక ఉండే హృదయం ముఖ్యం. ఆ ముద్దు వెనక ఉండే భావం ముఖ్యం. దాని వెనక ఉండే స్వచ్చత ముఖ్యం. స్వచ్చమైన మనసుతో...స్వచ్చమైన భావంతో...స్వచ్చమైన హృదయంతో ఇచ్చే ముద్దు నిజంగా ఓ గొప్ప భావనే. ఒకరు ఒకరికి ఇచ్చే ముద్దు వారి మద్య ఆత్మీయానుబంధాలను పెంచేదిగా ఉంటే, ఆ ముద్దు వారి హృదయాలను గాయపరిచేది కాకుండా ఉండేది అయితే ముద్దు నిజంగా అమృత తుల్యమే.

ఓ జంట ఏకంగా 17 తోజుల పది గంటల ముప్పై నిమిషాల పాటు ముద్దు పెట్టుకుని రికార్డ్ సృస్టించారు . సదరు రికార్డు గిన్నిస్ పుస్తకం లొకి ఎక్కింది . 1984 సెప్టెంబర్ 24 వ తేదీన ఈ రికార్డు నెలకొల్పినందుకు గుర్తు గా అప్పటినుంచి సెప్టెంబర్ 24 వ తేదీన ఏటేటా ముద్దుల దినోత్సవాన్ని పాటిస్తున్నారు . రకరకాల ముద్దులపై అధ్యయనము జరిపే శాస్త్రం ను " ఫిలెమెటాలజీ " అంటాము .

అసలు ఇద్దరు ముద్దు ఎందుకు పెట్టుకుంటారు?
ముద్దు అనేది పరిపరివిధాలు ... ఆకలితో అల్లల్లాడిపోతున్న పాపడు - పాలిచ్చిన అమ్మకు మౌనంగా చెప్పే కృతజ్ఞత ముద్దు! అంతవరకు ఏడ్చిన అదే పాపడు ఆకలితీరి ఒక్కసారిగా కనుగుడ్లలో నీరు నింపుకుని ... బుల్లి పెదాలపై బోసినవ్వులు పులుముకుంటే ... తాదాత్మ్యతతో బిడ్డ బుగ్గలపై తల్లి చేసే సంతకం ముద్దు.
కాబట్టి - ముద్దు అంటే ప్రేయసీ ప్రేమికులు మోహదాహంతో పెట్టుకునేది మాత్రమే కాదన్నమాట! అయితే ప్రస్తుతం ।సహభాగి చుంబన దినోత్సవం (Kiss your mate day) సందర్భంగా మనం ముఖ్యంగా ప్రేమికుల మధ్య ఎలాంటి ముద్దులు ఉంటాయి, అసలు ముద్దులు ఎందుకు పెట్టుకుంటారు లాంటి అంశాల్ని తెలుసుకుందాం.

ముద్దు యొక్క చరిత్ర మానవాళి ఆవిర్భవించిన నాటి నుంచీ ఉంది. ఆడం, ఈవ్‌ల తొలి కలయిక నాడు రాజుకున్న నిప్పుసెగ ... ముద్దు. ఆనాటి నుంచి నేటి వరకు అనేక లక్షల కోట్ల మంది మనసుల్లో ఆ నిప్పుసెగ మంటలు రేపింది. మనిషి పుట్టి ... వేలకోట్ల మందిగా విస్తరించడానికి అసలు బీజం ముద్దే. అవును మరి -అదే కదా ... లైంగిక సంభోగానికి పూలబాట వేసేది.
అసలు ముద్దు ఎందుకు పెట్టుకుంటారు -

ఇది చాలా చిలిపి ప్రశ్న. చిక్కు ప్రశ్న కూడా. ఇదేం అడగడం - ముద్దు ఎందుకు పెట్టుకుంటారు అంటే - సరదాకి, సెక్స్‌కి, ఆనందానికి, పారవశ్యానికి ఇలా ... జవాబుల జాబితా సాగవచ్చు. కాని అసలు కారణం పైగా శాస్త్రీయంగా ఉండే కారణం ఏమిటో!
ఇద్దరు ముద్దు ఎందుకు పెట్టుకుంటారు?--ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది?-- ఏయే శరీరావయవాల్లో ముద్దు ప్రకంపనలు సృష్టిస్తుంది?

దంతాలు, బుగ్గల దగ్గరి ఎముకలు, పెదవులు ... ఇవన్నీ నరాలతో కూడినవి... ఎపుడైతే పెదాలు కలిసి తారట్లాడి ముద్దాడతాయో ... ఆ నరాలు ఒక్కసారిగా జివ్వుమంటూ వ్యాకోచిస్తాయి. దీంతో హాయిగా ఉంటుంది. ఇద్దరు ముద్దు పెట్టుకోవడానికి కారణం ఇదే! అని కొందరు కారణాలు చెప్పారు. ఇది అంతగా తార్కికమైన కారణం కాదు. అయితే ఇది శరీరానికి సంబంధించిన లాజిక్కు. ఇక మానసికపరమైన కారణమేమిటో చూద్దాం.

ఇద్దరు ఎందుకు ముద్దు పెట్టుకుంటారంటే - ఆకలిని తీర్చుకోవడానికి! ఏ ఆకలి -? మానసికపరమైన అశాంతిని, వ్యాకులతను శాంతింపచేసే ఆకలి ! ఏదో తెలియని భావావేశాన్ని రగిల్చే ... తీర్చే ఆకలి! లైంగిక సంపర్కం అనే సుందర సుమధుర సౌధానికి తొలి రాయి... చుంబనం భావతృప్తి అనే అపురూప అందాల జాబిల్లికి అసలు రేయి - చుంబనం .
ముద్దు ఆనందాన్నెందుకు ఇస్తుంది?

ముద్దు పెట్టుకుంటే అదో గొప్ప రిలీఫ్‌. అయితే దీనికి కారణం ఏమై ఉండవచ్చు. పొద్దున్నుంచీ ఏమీ తినకుండా రాత్రి ప్రశాంతంగా స్నానం చేసి, ఇష్టమైన అన్నం, కూర తిని పక్కమీద పడుకుంటే ఎంతటి రిలీఫ్‌ ఉంటుందో ... ముద్దు పెట్టుకున్నప్పుడూ అంతే!

శరీరంలోని వివిధ కండరాలు ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. ముద్దు దెబ్బకు! దాంతో మొత్తం శరీరమంతా హాయిగా రిలాక్స్‌డ్‌గా తయారవుతుంది. అడ్రినల్‌, పిట్యుటరీ, గొనాడ్‌ ... ఇంకా ఇతర గ్రంధులు ఇందుకు సహకరిస్తాయి. ఇవన్నీ మనిషిలోని లైంగిక ప్రవర్తనను నియంత్రించేవే! ఈ గ్రంధులు స్రవించే హార్మోన్లు రక్తంలోకి ప్రవేశించి, అక్కడి నుంచి వివిధ అవయవాలకు వెళ్లి రిలాక్సేషన్‌ను కలగచేస్తాయి. అంటే - లైంగిక సంపర్కం అనే ఆకలిని తీర్చే తొలి శృంగార ముద్ద - ముద్దు అన్న మాట.

యవ్వనంలో టీనేజ్ యువతీయువకులు సెక్స్ సంబంధాలకన్నా చుంబనాలు, ఆలింగనాలనే ఎంతో ముద్దని అంటున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని ప్రముఖ వెబ్‌సైట్ తెలిపింది. టీనేజ్‌లో సెక్స్ - ముద్దు, కౌగిళ్లు అనే అంశంపై తాము నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలిందని సదరు వైబ్‌సైట్ నిర్వాహకులు తెలిపారు.

సర్వేలో భాగంగా సాహచర్యం, నవ్వులు, జోకులతోపాటు యవ్వన సంబంధాలు( సెక్స్) గురించి తాము సర్వే నిర్వహించామన్నారు. సెక్స్ సంబంధాలకన్నా ఆలింగనాలు, చుంబనాలకే ఎక్కువ మంది ప్రాధాన్యతనిస్తున్నారనీ, ముఖ్యంగా పురుషులు సెక్స్ సంబంధాలపై మక్కువ చూపడం లేదని తమ సర్వేలో తేలింది.

ఆరోగ్య రంగానికి చెందిన బేయర్ సంస్థ పరిశోధకులు నిర్వహించిన సర్వేలోను ఇదే విషయం వెల్లడైంది. ఆలింగనం, చుంబనాలు... ఇతరత్రా పైపై పనులనే వ్యక్తులు ఇష్టపడుతుండటం గమనార్హం. అలాగే మనుషుల మధ్య పరస్పర అవగాహనా లోపంతో వ్యక్తుల మధ్యనున్న సత్సంబంధాలకు బీటలు వారుతున్నాయని, దీంతోపాటు శృంగారపరమైన అంశాలలోను అంతరాలు ఏర్పడుతున్నాయని ప్రముఖ పరిశోధకుడు క్రిస్టీన్ వేబర్ తెలిపారు.

ఇక కౌగిళ్లు, ముద్దుల విషయంలో పురుషులు మహా నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నారట. ఇష్టపడిన అమ్మాయి ఏ సోఫాలోనో ఆశీనురాలై ఉన్నప్పుడు అందరి కళ్లూ కప్పి చటుక్కున కౌగలించుకోవడంతోపాటు ముద్దు రుచిని కూడా చూపిస్తున్నారట. ఇటువంటి పనులతో వారు అమితానందాన్ని పొందుతున్నారని, ఇలాంటి సమయంలో వారికి రతిక్రియలో పాల్గొనాలన్న కోరిక బలీయంగా ఉన్నప్పటికీ దానిని ప్రక్కనపెట్టి మిన్నకుండిపోతున్నారట.
ముద్దుల్లో రకాలు...!
ము...ము...ము...ముద్దంటే చేదా...,
నీకా ఉద్దేశం లేదా, నీకా ఉద్దేశం ఉంటే లేదా...!
నిను ముద్దాడాలంటే, అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా...! అని అన్నాడో సినీ కవి. నిజమే మరి. ముద్దు పెట్టాలన్నాకూడా మనసు ప్రతిస్పందించాలి. ఈ ముద్దుల్లోకూడా చాలా రకాలున్నాయంటున్నారు పరిశోధకులు.

ముద్దంటే ఇష్టం ఉండనివారెవరుంటారు నేటి ఈ సమాజంలో. ప్రతి ప్రాణికి ముద్దంటే మహా ప్రీతి. అందునా మానవజాతికైతే మరీనూ... చిన్న పిల్లలనుంచి ముదుసలి వరకు ముద్దంటే భలే ఇష్టం. ఈ ముద్దుల్లోకూడా రకాలున్నాయంటున్నారు పరిశోధకులు.

ముద్దు పెట్టుకునే వ్యక్తి తన రెండు పెదవులతో మరొకరి శరీరంలో వివిధ భాగాల్ని సున్నితంగా స్పృశిస్తారు. అయితే వివిధ సంస్కృతులలో అనురాగం, గౌరవం, స్వాగతం, వీడ్కోలు మొదలైన ఇతర భావాలతో కూడుకున్న ముద్దులు పెట్టుకుంటారు. ఇలా చేసేటప్పుడు కొంచెం శబ్దం కూడా వస్తుంది.

రతి క్రీడకు ముందుగా ఆలింగనం చేసుకోవడం ఆ తర్వాత ముద్దులు. మీ ముద్దులు కూడా రతి క్రీడలో భాగమే. ప్రేమ ఎక్కువైనప్పుడే ఈ ముద్దుల ప్రమేయం ఉంటుందంటున్నారు పరిశోధకులు. ఆ ముద్దుల్లోకూడా రకరకాలుంటాయి.

శరీరంలోని ఎనిమిది ప్రదేశాలలో ముద్దులు పెడుతుంటారు. ముద్దు పెట్టే ప్రదేశాలు ముఖ్యంగా నుదురు, ముంగురులు, బుగ్గలు, కళ్ళు, వక్షస్థలం, స్థనాలు, పెదవులు, నాలుక - మనిషి శరీరంలోని ఈ ఎనిమిది భాగాలలో ముద్దాడతారని ప్రాచీన కామశాస్త్రాచార్యులు చెప్పారు. ఇవి కాక గజ్జలు, చంకలు, బొడ్డు కూడా ముద్దు పెట్టుకోదగిన ప్రదేశాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

ప్రేమలో మునిగిపోయినప్పుడు మనిషి తమకంతో తన ప్రమేయం లేకనే తనకు బాగా కావలసిన వారిని ముద్దులతో ముంచెత్తుతుంటాడు. ఈ ముద్దుల ప్రక్రియ కొనసాగేముందు శరీరంలోని 34 ముఖ కండరాలు 112 ఇతర కండరాలు పనిచేస్తాయని శాస్త్ర పరిసోధకులు తెలిపారు. ఈ కండరాలలో ప్రధానమైన కండరము పెదాలను దగ్గరగా చేసే ఆర్బిక్యులరిస్ ఓరిస్. దీనినే ముద్దుపెట్టే కండరం అని అంటారు. నేటి యువత ఫ్రెంచి ముద్దునే ఇష్టపడుతుంటారు.



చేతి ముద్దు : చేతి ముద్దు అంటే ఎదుటివారి చేతిని తీసి దానిపై ముద్దు పెట్టడం. ఇది ఉన్నత స్థాయికి చెందినవారు, గౌరవ సూచకంగా పెట్టుకొనే ముద్దు. ఈ ముద్దు పొందే వ్యక్తి తన చేయిని ముందుకు ఉంచుతారు. ముద్దిచ్చే వ్యక్తి ఆ చేతిని అందుకొని, ముందుకు వంగి సున్నితంగా వేళ్ళను పెదాలతో తాకుతాడు.

చెక్కిలి ముద్దు: చెక్కిలి అంటే బుగ్గ. ఎదుటి వ్యక్తిపై ప్రేమతో, స్నేహంతో లేదా గౌరవ సూచకంగా పెట్టే ముద్దును బుగ్గ మీద పెడుతుంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కువగా బుగ్గమీద ప్రేమతో ముద్దిస్తారు. బుగ్గమీద ముద్దుపెట్టుకొనే వ్యక్తులు ఒకరి బుగ్గను మరొకరి బుగ్గతో గాని పెదాలతో గాని సున్నితంగా తాకుతారు.

ఫ్రెంచి ముద్దు : ప్రస్తుతం చాలామంది ఫ్రెంచి ముద్దును ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందునా ప్రేమికులైతే మరీనూ...ఈ ఫ్రెంచి ముద్దును రొమాంటిక్ లేదా సెక్స్ సంబంధమైనదిగా భావిస్తారు. ఇందులొ ఒకరి నాలుక మరొకరి నోటిలోకి జొప్పించి ఇంకొకరి నాలుకను తాకడమే ఈ ముద్దులోని రహస్యం.

ఫ్లైయింగ్ కిస్ : ఫ్లైయింగ్ కిస్. దీనినే గాలి ముద్దు అనికూడా అంటుంటారు. ఆధునిక కాలంలో ఒక సంకేతంగా ఉపయోగించే ఊహాజనితమైన ముద్దు ఇది. పెదాలను ముద్దు పెట్టినట్లు గుండ్రంగా చుట్టి, ముద్దు శబ్దాన్ని, చేతులతో పంపడమే ఈ గాలి ముద్దు, అదే ఫ్లైయింగ్ కిస్. మీరు అందచేయదలచుకున్న అభినందనలను ముద్దుల రూపంలో ఎవరికి పంపాలో వారివైపుగా చూపిస్తూ ఈ ఫ్లైయింగ్ కిస్‌ను పంపుతారు.

ఇదండీ ముద్దుల్లో రకాలు. ఈ ముద్దుల్లో చాలామంది వారికి అనుగుణంగా మలచుకుని వాడుకుంటుంటారు. అయితే ముద్దు పెట్టుకున్నప్పుడు సుమారు 278 రకాల సూక్ష్మ జీవులు ఒకరి నోటి నుండి ఇంకొకరి నోటిలోకి దూసుకు వెళ్ళే ప్రమాదమూ లేకపోలేదని గ్రహించాలి . ఈ సూక్ష్మక్రిములలో కొన్ని మంచివీ ... మరికొన్ని చెడ్డవి ఉంటాయి .

విషయం ఏదైనా ప్రపంచ ముద్దుల దినోత్సవం సందర్భంగా స్వచ్చమైన "ముద్దు" లకూ జిందాబాద్.
  • ======================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Sunday, October 3, 2010

సమాచార హక్కు దినోత్సవం , Right to Information Day ,నేడు రైట్ టూ ఇన్ఫర్‌మేషన్ డే



నేడు రైట్ టూ ఇన్ఫర్‌మేషన్ డే--September 28th,
ప్రజలే ప్రభువులు ... అన్నది ప్రజాస్వామ్యము గర్వం గా చెప్పేసూత్రము . అయితే మన దేశములో ప్రజలను ఓటర్లుగా మాత్రమే చూస్తున్నాయి రాజకీయ పార్టీలు , ప్రతి ఐదేళ్ళకు వచ్చే ఎన్నికల సమయం లో దండాలు పెట్టి నిజముగానే తాము ప్రభువులు అనుకునే భ్రమ ఓటర్లకు లలిగించి తమ పబ్బం గడుపుకుంటున్నారు .

ప్రజా ప్రతినిధి ప్రజలకు జవాబుదారీగా నిలవాలి ... అలానిలిచే వ్యవస్థ మనరాజ్యాంగములో లేదు .ఇస్టమైతే గెలిపించుకోండి , లేకుంటే లేదు అంతేకాని ఎన్నికైన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకు ఆ ప్రతినిధులను ప్రశ్నిందేందుకు ఈమాత్రము వీలులేదు . ఇటువంటి లోపాన్ని రాజకీయ నాయకులు , అధికారయంత్రాంగము కలిసి తమకు అనుకూలము గా మలచుకున్నారు . ప్రజలనుండి వసూలుచేసిన పన్నులతోనే ప్రభుత్వము నడుస్తుంది కాని ఆ నిధులను ఏ పథకాల మీద పెట్టాలనేది రాజకీయ నిర్ణయముగా మార్చారు . ప్రజానిధులను తమ పార్టీనాయకులకు లభ్దిచేకూర్చేలాగా వెచ్చించే ఒక కొత్త సంస్కృతిని స్వతంత్ర భారతదేశ రాజకీయ నాయకులు ఆవిష్కరించారు .

అత్యున్నత ఆశయంతో చేసిన చట్టాలు కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం అవడం చూస్తూనే ఉన్నాం. ఒక కత్తి ఉంటే దాన్ని కూరగాయలు తరుక్కునేందుకు ఉపయోగించుకోవచ్చు, పీకల్ని కోయడానికి వాడవచ్చు. అనేక దశాబ్దాల పోరాటం తర్వాత ఎట్టకేలకు సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రభుత్వ వ్యవహారాలు పూర్తిగా పారదర్శకతతో ఉండేలా చూడటం, దేశ రక్షణకు సంబంధించిన అంశాలు మినహా ఇతర రంగాలకు సంబంధించి ప్రభుత్వంలో ఏం జరుగుతోందనేది సామాన్య ప్రజలు కూడా తెలుసుకునేలా చూడాలన్న మహదాశయంతో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు.

ప్రస్తుతం సాదారణ పౌరునికి ఆయుధంలా మారిన చట్టం సమాచార హక్కుచట్టం. వివిధ రంగాలో జరుగుతున్న అవినీతిని బయటపెడుతున్నది కూడా ఇదే చట్టం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా సమాచార హక్కు దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన దేశంలో ఈ చట్టం 2005 సంవత్సరం అక్టోబర్ 12 నుండి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఈ చట్టం ద్వారా అనేక కుంబకోణాలు బయటపడుతుండగా దీంతో అవినీతి పరుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. ఈ చట్టం క్రింద పౌరులు తమకు కావాల్సిన సమాచారాన్ని ముందుగా దరఖాస్తు చేసుకొని నెల రోజులోపు సమాచారాన్ని పొందవచ్చు. ఈ చట్టం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి శాఖలో ఒక అధికారిని నియమించి సమాచార బదిలికి ఉపయోగిస్తున్నారు. ఈ చట్టం నుండి దేశ రక్షణకు, ముఖ్యమైన రహస్యాలకు సంబంధించిన సమాచారం తప్ప మిగిలిన ప్రతి అంశాన్ని బయటపెట్టాల్సి ఉంటుంది.గత 20 సంవత్సరాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు అడిగినా ఇవ్సాల్సి ఉంటుంది. ఇది పౌరులకు వరమైనప్పటికీ ఈ చట్టం క్రింద వివిధ రకాల దరఖాస్తు చేసుకున్న వారి పై తరుచూ దాడులు జరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తుంది. ఈ విషయమై సమాచార ఉద్యమకారులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ చట్టం అందుబాటులోనికి రావటం ఒక మహాప్రసాదంగా భావించాలి. దీనిని ఘనంగా నిర్వహించడానికి వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావటం వల్ల ఈ చట్టం గురించి అందరికి తెలుస్తుందని పలువురి అన్నారు.

సమాచార కక్కు గురించిన ఉద్యమము ప్రపంచ వ్యాప్తము గా జరిగింది . సమాచారము సక్రమముగా అందినపుడే ప్రజలలో చైతన్యము వస్తుంది , ప్రభుత్వాలను బాధ్యతాయుతం చేయగలుగుతామన్న నమ్మకం తో ఐక్యరాజ్యసమితి నిరంతరము పనిచేస్తున్నది . సమాచారము ప్రజలకు అందుబాటులో ఉందేందుకు అనువైన మార్గాల్ని రూపొందించాలని యునెస్కో సూచించినది . ఆ సూచన ప్రకారము ఇప్పటికి 90 దేశాల్లో సమాచార హక్కు చట్టము రూపొందించబడినది . సమాచారము అందుబాటులోకి తెచ్చేందుకు తగిన మార్గాలను సూచించడం , ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తముగా 80 సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి . వ్యవస్థను సరిదిద్ధలనే యత్నాన్ని భారతదేశం లోను కొన్ని స్వచ్చంద సంస్థలు చేపట్టాయి . ప్రజాధనము వెచ్చించే తీరులో పారదర్శక ఉండితీరాలన్న నినాదము ప్రజల్ని చైతన్యవంతం చేయడం మఓలైంది . ఆ చైతన్య ఉద్యమం ఫలించి తొలిసారిగా రజస్థాన్‌ లొని గ్రామాలలో నిధుల మీద " సోషల్ అడిట్ " జరగాలని నిలదీశారు . గ్రామ సర్పంచి ఇష్టానుసారము నిధులు వెచ్చించేందుకు వీలులేదని , ఆ నిధుల కేటాయింపు విధానాన్ని ప్రజలందరికీ వివరించిన తర్వాతే తీసుకోవాలన్నది వారి డిమాండ్ . గ్రామీనుల వెనకున్నా స్వచ్చంద సంస్థలు , వ్యక్తుల మీద రాజకీయపార్టీలు , అధికాయంతాంగము దాడులు చేయించినా గ్రామస్తులు లొంగలేదు . గ్రామసర్పంచులు , సంబంధిత అధికారులు గ్రామమ్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల అంచనాలు వాటిని చేపడుతున్న కాంట్రాక్టర్ పేరు బహిరంగంగా ప్రదర్శించాల్సివచ్చింది . ఇది గ్రామస్తులు సాధించిన తొలి విజయము .

గ్రామాలలో ధైర్యము , చొరవ పెరిగింది అధికాలులు ప్రజాప్రతినిధులు బాధ్యతలో వ్యవహరించక తప్పలేదు .. అవినీతిదారులను మూసివేసే ప్రయత్నము మొదలైనది . ఇలాంటి ఒక ఉద్యమాన్ని నడిపిన నాయకురాలు అరుణారాయ్ . కేంద్ర సర్వీసులలో అధికారి అయిన ఆమె , అధికారులు రాజకీయనాయకులతో కలిసి దోపిడీచేస్తున్న తీరు నచ్చక , అధికారయంత్రాంగం లో వుంటూ ఆ దోపిడీని అడ్డుకోగలిగిన శక్తిసరిపోక , ఆ దోపిడీలో భాగస్వామికాలేక అధికారాన్నే వదులుకొని ప్రజాపక్షం లో నిలిచింది .. అందుకే ఆమెను ' రామన్‌ మెగసెసే 'అవార్డుతో సత్కరించారు . అలా వారు రూపొందించిన ఉద్యమ ఫలితమే సమాచార హక్కు ప్రజల్కు దక్కడం . . అటువంటి హక్కు ప్రజలకు ఉండి తీరాలన్న వారి దిమాండ్ అనుసరించి కేంద్రప్రభుత్వము 2005 లో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది . UPA ప్రభుత్వము అధికారములోకి రాగానే రూపొందించిన తొలి చట్టాలలో ఇది ఒకటి .

జాతీయ స్థాయిలో చీఫ్ ఇంఫర్మేషన్‌ కమిషనర్ , రాస్ట్ర స్థాయిలో ఇంఫర్మేషన్‌ కమీషనర్లు నియమించబడ్డారు . ప్రతి ప్రభుత్వ కార్యాలయం లో ఒక అధికానిని ఇంఫర్మేషన్‌ ఆఫీసర్ గా నామినేట్ చేయడం జరిగింది . గత 20 సంవత్సరాల కాలానికి సంబంధించిన ఏ సమ్మాచారము అడిగినా అంబంధిత అధికారి నెలరోజుల్లో అందించాలి . అందుకోసం ప్రజలు ఎవరయినా రుసుము చెళ్ళించి దరఖాస్తు మేసుకుంటే చాలు . నిర్దేశిత గడువులో సమాచారము అందించకపోయినా , అందించిన సమాచారము లోపభూయిష్టముగా ఉన్నా పైన ఉండే అప్పిలేట్ అధికారిని ఆశ్రయించ వచ్చు . అలా రాష్ట్రస్థాయి ఇన్ఫర్మేషన్‌ కమీషనర్ స్థాయి వరకు వివిధ హోదాలలో ఈ చట్టాము కింద బాధ్యతలు అప్పగించడం అయ్యింది .



  • =========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Saturday, October 2, 2010

ప్రపంచ పర్యాటక దినోత్సవం , World Tourism Day


  • సెప్టెంబర్ 27న

ప్రపంచ పర్యాటక దినోత్సవం-- సెప్టెంబర్ 27న : దేశ ఆర్ధిక ప్రగతిని రకరకాల అంశాలు ప్రభావితం చేస్తుంటాయి . ఆయా దేశాల్లో గల్ ఆర్ధిక , మానవ వనరులే ఆ దేశాభివృద్ధికి మూలము . . . వాటిని గుర్తించి సరైన విధంగా ఉపయోగించుకోవాల్సిన భాధ్యత పాలనా యంత్రాంగాలపై ఉంటుంది . ప్రతి ఖండములోనూ , ప్రతి దేశములోనూ చూడదగ్గ అందమైన ప్రదేశాలు , కట్టాడాలు అనేకము ఉంటాయి . . . వాటిని అభివృద్ధిపరచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయవనరులుగా తీర్చి దిద్దాలి . అంతర్జాతీయ వాణిజ్యములో టూరిజం కీలకపాత్ర పోసిస్తూఉన్నది . ఇందుకోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీని " ది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషం " (The world tourism Organazation) ఏర్పాటు చేసినది . పర్యాటక విధాన సంబంధిత అంశాల్లొ ఈ అంతర్జాతీయ టూరిజం సంస్థ ప్రపంచ వేదికగా పనిచేస్తుంది . పర్యాటక విభాగం లో " గ్లోబల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ " అమలును ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది . ఈ సంస్థ లో 154 దేశాలు , 7 టెరిటరీలు సభ్యత్వం కలిగిఉన్నాయి . ప్రవేటు రంగము , విద్యాసంస్థలు , టూరిజం అసోసియేషన్లు , స్థానిక టూరిజం అధారిటీల నుండి 400 మంది అఫిలియేట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు . ప్రధాన కార్యాలము ' మాడ్రిడ్ ' లో ఉన్నది . 1947 లో ఇంటర్నేషనల్ యూనియన్‌ ఆఫ్ అఫీషియల్ ట్రావెల్ ఆర్గనైజేషన్‌ (IUOTO) తొలి సమావేశము జరిగింది .

1970 ప్రాంతంలో యుఎన్‌డబ్ల్యుటిఒ్(UNWTO) శిల్పాల పరిరక్షణ బాధ్యతను చేపట్టారు. ‘గ్లోబల్ టూరిజం’లో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజది. ఆ తర్వాత 1980లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు ‘ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని’ సెప్టెంబర్ 27న నిర్వహించ నారంభించారు. అప్పట్నుంచీ - ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సెప్ట్ పేరిట నిర్వహిస్తూ వచ్చారు. 1980లో - 'టూరిజం కంట్రిబ్యూషన్ టు ది ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ టు పీస్ అండ్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్’ అని పేరు పెట్టారు. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తోంది. తాజాగా 2010 సంవత్సరాన్ని ‘టూరిజం అండ్ బయోడైవర్సిటీ’గా నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ సంస్థలు, అనేక ప్రైవేటు సంస్థలు ఉద్యోగుల రిక్రియేషన్‌కి ఎల్‌టిసి ల సదుపాయం కల్పించిన  తర్వాత - పర్యాటక రంగం ఎంతగానో పుంజుకుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక స్థలాలను మరింతగా అభివృద్ధి చేసి పర్యాటకులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. ఎపి టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్-- పర్యాటక రంగంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రాఛీన దేవాలయాలకు, శిల్పకళలకు, చారిత్రక కట్టడాలకు, ప్రముఖ ప్రర్యాటక , పుణ్యక్షేత్రాలు, దర్శనీయ కేంద్రాలకు సంబంధించి ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు ., మన వారసత్వ సంపద, చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు . , జిల్లా పర్యాటకాభివృద్ధి మండలి, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించి, పర్యాటకాభివృద్ధికి కృషి చేయడం జరుగుతోంది .కళలు, చిత్రలేఖనం, చేతితో తయారు చేసిన వస్తువులు తదితర ఆంశాలపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది ., అలాగే పర్యాటక అభివృద్ధి పై ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చర్చ నిర్వహించడం జరుగుతుంది .


మన దేశంలో ఉన్నన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు సహజ పర్యాటక ప్రాంతాలు మరే దేశంలోనూ లేవంటే అతిశయోక్తి కాదు. కాని పర్యాటక రంగానికి తగినన్ని నిధులు, దాని పట్ల తగినంత శ్రద్ద పెట్టకపోవడం వలన మనం ఆశించినంత గొప్పగా ఈ రంగం మన దేశంలో అభివద్ధి చెందలేదు.

2010 లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో మూడు జోన్లుగా పర్యాటక ప్రాంతాల విధానానికి ఆమోదముద్ర పడింది. ‘ఆమ్ ఆద్మీ’ పర్యాటకానికి ముఖ్యమంత్రి కె.రోశయ్య పచ్చజెండా ఊపారు. సీఎం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర నూతన పర్యాటక విధానానికి సిఎం ఒకే చేశారు. ఈ నూతన విధానాన్ని ప్రపంచ పర్యాటక దినోత్సవం అయిన సెప్టెంబర్ 27న సీఎం అధికారికంగా ప్రకటిస్తారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సమాచార శాఖ మంత్రి జె.గీతారెడ్డి వెల్లడించారు. పర్యాటక రంగాన్ని పల్లె ప్రజలకు చేరువ చేయటంతో పాటు భారీగా పెట్టుబడులు ఆకర్షించి.. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేయనుందని తెలిపారు. అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దేశీయ పర్యాటకుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని.. అంత ర్జాతీయ పర్యాటకుల ఆకర్షణలో ఐదవ స్థానంలో ఉందని చెప్పారు.

సీఎం సమీక్ష అనంతరం జె.గీతారెడ్డి పర్యాటక శాఖ అధికారులు జయేష్ రంజన్, స్వర్ణజిత్‌సేన్, సవ్యసాచి ఘోష్ తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. సామాన్యుడి బడ్జెట్‌కు అనుగుణంగా పర్యాటక విధానాన్ని రూపొందించి అమలు చేయనున్నామన్నారు. రాష్ట్రంలో హెలీ టూరిజం కింద హైదరాబాద్ నుంచి తిరుపతికి హెలికాప్టర్ సేవలు ప్రారంభించేందుకు ఫ్లైటెక్ ఏవియేషన్, బెంగుళూరు నుంచి పుట్టపర్తికి హెలికాప్టర్ సేవలు ప్రారంభించటానికి లేపాక్షి నాలెడ్జి హబ్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేశాయని గీతారెడ్డి తెలిపారు. కొత్తగా ఖరారు చేసిన విధానంలో రాష్టాన్ని మూడు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్-ఏగా హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ ఆథారిటీ ప్రాంతం ఒక్కటే వస్తుంది. జోన్-బీలో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్, విజయవాడ, గుంటూరు, మంగళగిరి పట్టణాభివృద్ధి ప్రాంతం, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా)లోని ప్రాంతం ఉంటాయి. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాలు జోన్-సీగా గుర్తిస్తారు. పర్యాటక ప్రాజెక్టులకు ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి రాయితీ రేట్లతో భూములు కేటాయించాలని ప్రతిపాదించారు. రూ.20 కోట్ల పెట్టుబడి పెట్టే పర్యాటక ప్రాజెక్టులకు మూలధన పెట్టుబడి సబ్సిడీ కింద రూ.20 లక్షల సబ్సిడీ ఇవ్వనున్నారు. 20 నుంచి 100 కోట్ల రూపాయల పెట్టుబడి వరకూ సబ్సిడీ గరిష్టంగా 30 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. వంద కోట్ల రూపాయల పైబడిన ప్రాజెక్టులకు ‘ప్రత్యేక రాయితీలు’ ఇవ్వనున్నారు. పర్యాటక ప్రాజెక్టులు నిర్వహించే సంస్థలు ఆయా ఆర్థిక సంవత్సరాల్లో చెల్లించిన వ్యాట్‌లో 25 శాతం మొత్తాన్ని తదుపరి ఏడాది తిరిగి చెల్లించనున్నారు. హోటళ్లకు సంబంధించి 1500 రూపాయల పైబడిన గదుల అద్దెకు సంబంధించి 5 శాతం విలాస పన్ను మినహాయింపు కల్పిస్తారు. థీమ్ పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులకు 25 శాతం ఎంటర్‌టైన్‌మెంట్ పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. పర్యాటక ప్రాజెక్టులకు జోన్-ఏలో విద్యుత్ రాయితీ యూనిట్‌కు 75 పైసలు, జోన్-బీలో 90పైసలు ఉంటుంది. జోన్-సీలో ఈ రాయితీ ఒక రూపాయిగా నిర్ణయించారు. మహిళా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు నెలకొల్పే ప్రాజెక్టులకు ఐదు లక్షల రూపాయల అదనపు రాయితీలు కల్పించనన్నుట్లు గీతారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థలను నెలకొల్పనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను మంజూరు చేసిందన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో పర్యాటక శాఖ ప్రగతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృధ్ధికి పూర్తి స్థాయిలో కృషిజరుగుతోందని ఎప్పటికప్పుడు ఆ శాఖ అధికారులు, ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ అది కేవలం ప్రకటనలకు, ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమవుతోంది. జిల్లాలో పర్యాటకశాఖ అభివృధ్ధిచేసేందుకు అనేక అవకాశాలున్నాయి. పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రాంతాలు, తీరప్రాంతాలు, చారిత్రాత్మక నిర్మాణాలు, విశాలమైన జాతీయ రహదారి ఇలా అన్ని విధాలా పర్యాటక అభివృధ్ధికి అవకాశాలున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. సిబ్బంది జీతాలకు మినహా ఇతరత్రా నిధుల విడుదలన్నదే లేకపోతోంది. దీంతో జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృధ్ధి అలానే ఉండిపోయింది. జిల్లాలో ప్రసిధ్ది చెందిన పుణ్యక్షేత్రాలు అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం వంటివి ఉన్నాయి. ద్వాపరయుగంలో బలరాముడు చేత ప్రతిష్టించిన మూడు శివలింగాలు సంగాం, రుద్రకోటేశ్వరస్వామి ఆలయం, కళ్లేపల్లి మణినాగేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలు అలానే ఉండిపోయాయి. వీటి అభివృధ్ధి ప్రభుత్వపరంగా ఏమాత్రం లేకపోతోంది. భక్తులు ఇచ్చిన విరాళాలతో దేవాదాయశాఖ అరసవిల్లిని అభివృధ్ధి చేస్తుండగా, శ్రీకూర్మం, ముఖలింగం మిగిలిన ఆలయాలు శిధిలావస్థకు చేరుకునేందుకు ఉన్నాయి. ఇక జిల్లాలో సుదూరమైన తీరప్రాంతం ఉంది. ఇందులో బారువ, కళింగపట్నం వంటి సముద్రప్రాంతాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళతారు. కళింగపట్నంలో లైట్‌హౌస్‌ కూడా ఉంది. అదేవిధంగా భావనపాడు తీరప్రాంతంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం ప్రతిపాదనలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం చేతులెత్తేసింది. బారువ తీర అందాలు పర్యాటకులు చూసేందుకు అక్కడ కాటేజీల నిర్మాణం, ఇతరత్రా అభివృధ్ధి పనులు చేస్తామన్న హామీలు కూడా నిలిచిపోయాయి. ఇక తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రాన్ని అభివృధ్ధి చేస్తామని దశాబ్దాలుగా వినిపిస్తున్న మాటలు నిలిచిపోతున్నాయి. అక్కడ పక్షులు తగ్గిపోతున్నాయి గాని అక్కడ అభివృధ్ధి జరగటం లేదు. జాతీయ రహదారిపై పర్యాటకులను ఆకర్షించేందుకు గాను పర్యాటకశాఖ డాబాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించి దశాబ్దం దాటింది అది కార్యరూపం దాల్చలేదు. ఇక జిల్లాలో పర్యాటకశాఖ అభివృధ్ధికి గత సంవత్సరం కేంద్రప్రభుత్వం అందించిన నిధులు సెంట్రల్‌ ఫైనాన్షియల్‌ అసిస్టెన్స్‌ క్రింద జిల్లాకు విడుదల చేసిన దాదాపు 3.2 కోట్ల రూపాయిలకు సంబంధించిన పనులు ఒక్కటి కూడా ఇంతవరకూ జిల్లాలో ఎక్కడా చేపట్టలేదు. దీంతో ఈ నిధులు మరో ఆరు మాసాలలో వెనుకకు వెళ్లిపోతాయన్న ఆందోళన కూడా జిల్లా పర్యాటక శాఖ అధికారులలో కనిపిస్తోంది. ఈ నిధులలో కళింగపట్నం రేవు అభివృధ్ధికి 52 లక్షలు, బారువ ప్రాంత అభివృధ్ధికి 51 లక్షలు, అరసవిల్లి, శ్రీముఖలింగం, శ్రీకూర్మం ఆలయాలకు 41.5 లక్షల రూపాయిల చొప్పున మంజూరుచేయగా, పర్యాటక సమాచార కేంద్రం ఏర్పాటుకు 46 లక్షలు, శాలిహుండం ప్రాంత అభివృధ్ధికి 41.5 లక్షలు, పురావస్తుశాఖ మ్యూజియం నిర్మాణానికి 40 లక్షలు మంజూరు చేశారు. వీటిలో మూడు ఆలయాలకు సంబంధించిన టెండర్లను ఆమదాలవలసకు చెందిన కాంట్రాక్టర్‌ ఒకరు టెండర్లు పొందినప్పటికీ ఇంతవరకూ పనులు ప్రారంభించలేదు. టూరిజం ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ నిర్మాణానికి అప్పట్లో కేటాయించిన 25 సెంట్ల భూమి అన్యాక్రాంతం జరిగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక చారిత్రక ఆధారాలుగా నిలుస్తున్న ఆమదాలవలస మండలంలోని పాండవులమెట్ట, దంతపురి ప్రాంతాలను ఇంతవరకూ పురావస్తుశాఖ గాని, పర్యాటకశాఖ గాని గుర్తించలేదు. దీంతో జిల్లాలో పర్యాటకశాఖ పరంగా జరుగుతున్న అభివృధ్ధి కనీసస్థాయిలో కూడా లేకపోతోందన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పర్యాటకప్రాంతాలను అభివృధ్ధి చేస్తే అన్ని విధాలా ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందన్నది అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.

  • మూలము : వివిద వార్తా పత్రికలు ./డా.వందన శేషగిరిరావు శ్రీకాకుళం .
  • ==========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS