Saturday, October 2, 2010

ప్రపంచ పర్యాటక దినోత్సవం , World Tourism Day


  • సెప్టెంబర్ 27న

ప్రపంచ పర్యాటక దినోత్సవం-- సెప్టెంబర్ 27న : దేశ ఆర్ధిక ప్రగతిని రకరకాల అంశాలు ప్రభావితం చేస్తుంటాయి . ఆయా దేశాల్లో గల్ ఆర్ధిక , మానవ వనరులే ఆ దేశాభివృద్ధికి మూలము . . . వాటిని గుర్తించి సరైన విధంగా ఉపయోగించుకోవాల్సిన భాధ్యత పాలనా యంత్రాంగాలపై ఉంటుంది . ప్రతి ఖండములోనూ , ప్రతి దేశములోనూ చూడదగ్గ అందమైన ప్రదేశాలు , కట్టాడాలు అనేకము ఉంటాయి . . . వాటిని అభివృద్ధిపరచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయవనరులుగా తీర్చి దిద్దాలి . అంతర్జాతీయ వాణిజ్యములో టూరిజం కీలకపాత్ర పోసిస్తూఉన్నది . ఇందుకోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీని " ది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషం " (The world tourism Organazation) ఏర్పాటు చేసినది . పర్యాటక విధాన సంబంధిత అంశాల్లొ ఈ అంతర్జాతీయ టూరిజం సంస్థ ప్రపంచ వేదికగా పనిచేస్తుంది . పర్యాటక విభాగం లో " గ్లోబల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ " అమలును ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది . ఈ సంస్థ లో 154 దేశాలు , 7 టెరిటరీలు సభ్యత్వం కలిగిఉన్నాయి . ప్రవేటు రంగము , విద్యాసంస్థలు , టూరిజం అసోసియేషన్లు , స్థానిక టూరిజం అధారిటీల నుండి 400 మంది అఫిలియేట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు . ప్రధాన కార్యాలము ' మాడ్రిడ్ ' లో ఉన్నది . 1947 లో ఇంటర్నేషనల్ యూనియన్‌ ఆఫ్ అఫీషియల్ ట్రావెల్ ఆర్గనైజేషన్‌ (IUOTO) తొలి సమావేశము జరిగింది .

1970 ప్రాంతంలో యుఎన్‌డబ్ల్యుటిఒ్(UNWTO) శిల్పాల పరిరక్షణ బాధ్యతను చేపట్టారు. ‘గ్లోబల్ టూరిజం’లో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజది. ఆ తర్వాత 1980లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు ‘ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని’ సెప్టెంబర్ 27న నిర్వహించ నారంభించారు. అప్పట్నుంచీ - ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సెప్ట్ పేరిట నిర్వహిస్తూ వచ్చారు. 1980లో - 'టూరిజం కంట్రిబ్యూషన్ టు ది ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ టు పీస్ అండ్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్’ అని పేరు పెట్టారు. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తోంది. తాజాగా 2010 సంవత్సరాన్ని ‘టూరిజం అండ్ బయోడైవర్సిటీ’గా నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ సంస్థలు, అనేక ప్రైవేటు సంస్థలు ఉద్యోగుల రిక్రియేషన్‌కి ఎల్‌టిసి ల సదుపాయం కల్పించిన  తర్వాత - పర్యాటక రంగం ఎంతగానో పుంజుకుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక స్థలాలను మరింతగా అభివృద్ధి చేసి పర్యాటకులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. ఎపి టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్-- పర్యాటక రంగంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రాఛీన దేవాలయాలకు, శిల్పకళలకు, చారిత్రక కట్టడాలకు, ప్రముఖ ప్రర్యాటక , పుణ్యక్షేత్రాలు, దర్శనీయ కేంద్రాలకు సంబంధించి ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు ., మన వారసత్వ సంపద, చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు . , జిల్లా పర్యాటకాభివృద్ధి మండలి, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించి, పర్యాటకాభివృద్ధికి కృషి చేయడం జరుగుతోంది .కళలు, చిత్రలేఖనం, చేతితో తయారు చేసిన వస్తువులు తదితర ఆంశాలపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది ., అలాగే పర్యాటక అభివృద్ధి పై ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చర్చ నిర్వహించడం జరుగుతుంది .


మన దేశంలో ఉన్నన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు సహజ పర్యాటక ప్రాంతాలు మరే దేశంలోనూ లేవంటే అతిశయోక్తి కాదు. కాని పర్యాటక రంగానికి తగినన్ని నిధులు, దాని పట్ల తగినంత శ్రద్ద పెట్టకపోవడం వలన మనం ఆశించినంత గొప్పగా ఈ రంగం మన దేశంలో అభివద్ధి చెందలేదు.

2010 లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో మూడు జోన్లుగా పర్యాటక ప్రాంతాల విధానానికి ఆమోదముద్ర పడింది. ‘ఆమ్ ఆద్మీ’ పర్యాటకానికి ముఖ్యమంత్రి కె.రోశయ్య పచ్చజెండా ఊపారు. సీఎం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర నూతన పర్యాటక విధానానికి సిఎం ఒకే చేశారు. ఈ నూతన విధానాన్ని ప్రపంచ పర్యాటక దినోత్సవం అయిన సెప్టెంబర్ 27న సీఎం అధికారికంగా ప్రకటిస్తారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సమాచార శాఖ మంత్రి జె.గీతారెడ్డి వెల్లడించారు. పర్యాటక రంగాన్ని పల్లె ప్రజలకు చేరువ చేయటంతో పాటు భారీగా పెట్టుబడులు ఆకర్షించి.. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేయనుందని తెలిపారు. అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దేశీయ పర్యాటకుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని.. అంత ర్జాతీయ పర్యాటకుల ఆకర్షణలో ఐదవ స్థానంలో ఉందని చెప్పారు.

సీఎం సమీక్ష అనంతరం జె.గీతారెడ్డి పర్యాటక శాఖ అధికారులు జయేష్ రంజన్, స్వర్ణజిత్‌సేన్, సవ్యసాచి ఘోష్ తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. సామాన్యుడి బడ్జెట్‌కు అనుగుణంగా పర్యాటక విధానాన్ని రూపొందించి అమలు చేయనున్నామన్నారు. రాష్ట్రంలో హెలీ టూరిజం కింద హైదరాబాద్ నుంచి తిరుపతికి హెలికాప్టర్ సేవలు ప్రారంభించేందుకు ఫ్లైటెక్ ఏవియేషన్, బెంగుళూరు నుంచి పుట్టపర్తికి హెలికాప్టర్ సేవలు ప్రారంభించటానికి లేపాక్షి నాలెడ్జి హబ్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేశాయని గీతారెడ్డి తెలిపారు. కొత్తగా ఖరారు చేసిన విధానంలో రాష్టాన్ని మూడు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్-ఏగా హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ ఆథారిటీ ప్రాంతం ఒక్కటే వస్తుంది. జోన్-బీలో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్, విజయవాడ, గుంటూరు, మంగళగిరి పట్టణాభివృద్ధి ప్రాంతం, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా)లోని ప్రాంతం ఉంటాయి. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాలు జోన్-సీగా గుర్తిస్తారు. పర్యాటక ప్రాజెక్టులకు ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి రాయితీ రేట్లతో భూములు కేటాయించాలని ప్రతిపాదించారు. రూ.20 కోట్ల పెట్టుబడి పెట్టే పర్యాటక ప్రాజెక్టులకు మూలధన పెట్టుబడి సబ్సిడీ కింద రూ.20 లక్షల సబ్సిడీ ఇవ్వనున్నారు. 20 నుంచి 100 కోట్ల రూపాయల పెట్టుబడి వరకూ సబ్సిడీ గరిష్టంగా 30 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. వంద కోట్ల రూపాయల పైబడిన ప్రాజెక్టులకు ‘ప్రత్యేక రాయితీలు’ ఇవ్వనున్నారు. పర్యాటక ప్రాజెక్టులు నిర్వహించే సంస్థలు ఆయా ఆర్థిక సంవత్సరాల్లో చెల్లించిన వ్యాట్‌లో 25 శాతం మొత్తాన్ని తదుపరి ఏడాది తిరిగి చెల్లించనున్నారు. హోటళ్లకు సంబంధించి 1500 రూపాయల పైబడిన గదుల అద్దెకు సంబంధించి 5 శాతం విలాస పన్ను మినహాయింపు కల్పిస్తారు. థీమ్ పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులకు 25 శాతం ఎంటర్‌టైన్‌మెంట్ పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. పర్యాటక ప్రాజెక్టులకు జోన్-ఏలో విద్యుత్ రాయితీ యూనిట్‌కు 75 పైసలు, జోన్-బీలో 90పైసలు ఉంటుంది. జోన్-సీలో ఈ రాయితీ ఒక రూపాయిగా నిర్ణయించారు. మహిళా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు నెలకొల్పే ప్రాజెక్టులకు ఐదు లక్షల రూపాయల అదనపు రాయితీలు కల్పించనన్నుట్లు గీతారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థలను నెలకొల్పనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను మంజూరు చేసిందన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో పర్యాటక శాఖ ప్రగతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృధ్ధికి పూర్తి స్థాయిలో కృషిజరుగుతోందని ఎప్పటికప్పుడు ఆ శాఖ అధికారులు, ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ అది కేవలం ప్రకటనలకు, ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమవుతోంది. జిల్లాలో పర్యాటకశాఖ అభివృధ్ధిచేసేందుకు అనేక అవకాశాలున్నాయి. పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రాంతాలు, తీరప్రాంతాలు, చారిత్రాత్మక నిర్మాణాలు, విశాలమైన జాతీయ రహదారి ఇలా అన్ని విధాలా పర్యాటక అభివృధ్ధికి అవకాశాలున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. సిబ్బంది జీతాలకు మినహా ఇతరత్రా నిధుల విడుదలన్నదే లేకపోతోంది. దీంతో జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృధ్ధి అలానే ఉండిపోయింది. జిల్లాలో ప్రసిధ్ది చెందిన పుణ్యక్షేత్రాలు అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం వంటివి ఉన్నాయి. ద్వాపరయుగంలో బలరాముడు చేత ప్రతిష్టించిన మూడు శివలింగాలు సంగాం, రుద్రకోటేశ్వరస్వామి ఆలయం, కళ్లేపల్లి మణినాగేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలు అలానే ఉండిపోయాయి. వీటి అభివృధ్ధి ప్రభుత్వపరంగా ఏమాత్రం లేకపోతోంది. భక్తులు ఇచ్చిన విరాళాలతో దేవాదాయశాఖ అరసవిల్లిని అభివృధ్ధి చేస్తుండగా, శ్రీకూర్మం, ముఖలింగం మిగిలిన ఆలయాలు శిధిలావస్థకు చేరుకునేందుకు ఉన్నాయి. ఇక జిల్లాలో సుదూరమైన తీరప్రాంతం ఉంది. ఇందులో బారువ, కళింగపట్నం వంటి సముద్రప్రాంతాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళతారు. కళింగపట్నంలో లైట్‌హౌస్‌ కూడా ఉంది. అదేవిధంగా భావనపాడు తీరప్రాంతంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం ప్రతిపాదనలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం చేతులెత్తేసింది. బారువ తీర అందాలు పర్యాటకులు చూసేందుకు అక్కడ కాటేజీల నిర్మాణం, ఇతరత్రా అభివృధ్ధి పనులు చేస్తామన్న హామీలు కూడా నిలిచిపోయాయి. ఇక తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రాన్ని అభివృధ్ధి చేస్తామని దశాబ్దాలుగా వినిపిస్తున్న మాటలు నిలిచిపోతున్నాయి. అక్కడ పక్షులు తగ్గిపోతున్నాయి గాని అక్కడ అభివృధ్ధి జరగటం లేదు. జాతీయ రహదారిపై పర్యాటకులను ఆకర్షించేందుకు గాను పర్యాటకశాఖ డాబాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించి దశాబ్దం దాటింది అది కార్యరూపం దాల్చలేదు. ఇక జిల్లాలో పర్యాటకశాఖ అభివృధ్ధికి గత సంవత్సరం కేంద్రప్రభుత్వం అందించిన నిధులు సెంట్రల్‌ ఫైనాన్షియల్‌ అసిస్టెన్స్‌ క్రింద జిల్లాకు విడుదల చేసిన దాదాపు 3.2 కోట్ల రూపాయిలకు సంబంధించిన పనులు ఒక్కటి కూడా ఇంతవరకూ జిల్లాలో ఎక్కడా చేపట్టలేదు. దీంతో ఈ నిధులు మరో ఆరు మాసాలలో వెనుకకు వెళ్లిపోతాయన్న ఆందోళన కూడా జిల్లా పర్యాటక శాఖ అధికారులలో కనిపిస్తోంది. ఈ నిధులలో కళింగపట్నం రేవు అభివృధ్ధికి 52 లక్షలు, బారువ ప్రాంత అభివృధ్ధికి 51 లక్షలు, అరసవిల్లి, శ్రీముఖలింగం, శ్రీకూర్మం ఆలయాలకు 41.5 లక్షల రూపాయిల చొప్పున మంజూరుచేయగా, పర్యాటక సమాచార కేంద్రం ఏర్పాటుకు 46 లక్షలు, శాలిహుండం ప్రాంత అభివృధ్ధికి 41.5 లక్షలు, పురావస్తుశాఖ మ్యూజియం నిర్మాణానికి 40 లక్షలు మంజూరు చేశారు. వీటిలో మూడు ఆలయాలకు సంబంధించిన టెండర్లను ఆమదాలవలసకు చెందిన కాంట్రాక్టర్‌ ఒకరు టెండర్లు పొందినప్పటికీ ఇంతవరకూ పనులు ప్రారంభించలేదు. టూరిజం ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ నిర్మాణానికి అప్పట్లో కేటాయించిన 25 సెంట్ల భూమి అన్యాక్రాంతం జరిగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక చారిత్రక ఆధారాలుగా నిలుస్తున్న ఆమదాలవలస మండలంలోని పాండవులమెట్ట, దంతపురి ప్రాంతాలను ఇంతవరకూ పురావస్తుశాఖ గాని, పర్యాటకశాఖ గాని గుర్తించలేదు. దీంతో జిల్లాలో పర్యాటకశాఖ పరంగా జరుగుతున్న అభివృధ్ధి కనీసస్థాయిలో కూడా లేకపోతోందన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పర్యాటకప్రాంతాలను అభివృధ్ధి చేస్తే అన్ని విధాలా ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందన్నది అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.

  • మూలము : వివిద వార్తా పత్రికలు ./డా.వందన శేషగిరిరావు శ్రీకాకుళం .
  • ==========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .