Sunday, October 3, 2010

సమాచార హక్కు దినోత్సవం , Right to Information Day ,నేడు రైట్ టూ ఇన్ఫర్‌మేషన్ డేనేడు రైట్ టూ ఇన్ఫర్‌మేషన్ డే--September 28th,
ప్రజలే ప్రభువులు ... అన్నది ప్రజాస్వామ్యము గర్వం గా చెప్పేసూత్రము . అయితే మన దేశములో ప్రజలను ఓటర్లుగా మాత్రమే చూస్తున్నాయి రాజకీయ పార్టీలు , ప్రతి ఐదేళ్ళకు వచ్చే ఎన్నికల సమయం లో దండాలు పెట్టి నిజముగానే తాము ప్రభువులు అనుకునే భ్రమ ఓటర్లకు లలిగించి తమ పబ్బం గడుపుకుంటున్నారు .

ప్రజా ప్రతినిధి ప్రజలకు జవాబుదారీగా నిలవాలి ... అలానిలిచే వ్యవస్థ మనరాజ్యాంగములో లేదు .ఇస్టమైతే గెలిపించుకోండి , లేకుంటే లేదు అంతేకాని ఎన్నికైన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకు ఆ ప్రతినిధులను ప్రశ్నిందేందుకు ఈమాత్రము వీలులేదు . ఇటువంటి లోపాన్ని రాజకీయ నాయకులు , అధికారయంత్రాంగము కలిసి తమకు అనుకూలము గా మలచుకున్నారు . ప్రజలనుండి వసూలుచేసిన పన్నులతోనే ప్రభుత్వము నడుస్తుంది కాని ఆ నిధులను ఏ పథకాల మీద పెట్టాలనేది రాజకీయ నిర్ణయముగా మార్చారు . ప్రజానిధులను తమ పార్టీనాయకులకు లభ్దిచేకూర్చేలాగా వెచ్చించే ఒక కొత్త సంస్కృతిని స్వతంత్ర భారతదేశ రాజకీయ నాయకులు ఆవిష్కరించారు .

అత్యున్నత ఆశయంతో చేసిన చట్టాలు కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం అవడం చూస్తూనే ఉన్నాం. ఒక కత్తి ఉంటే దాన్ని కూరగాయలు తరుక్కునేందుకు ఉపయోగించుకోవచ్చు, పీకల్ని కోయడానికి వాడవచ్చు. అనేక దశాబ్దాల పోరాటం తర్వాత ఎట్టకేలకు సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రభుత్వ వ్యవహారాలు పూర్తిగా పారదర్శకతతో ఉండేలా చూడటం, దేశ రక్షణకు సంబంధించిన అంశాలు మినహా ఇతర రంగాలకు సంబంధించి ప్రభుత్వంలో ఏం జరుగుతోందనేది సామాన్య ప్రజలు కూడా తెలుసుకునేలా చూడాలన్న మహదాశయంతో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు.

ప్రస్తుతం సాదారణ పౌరునికి ఆయుధంలా మారిన చట్టం సమాచార హక్కుచట్టం. వివిధ రంగాలో జరుగుతున్న అవినీతిని బయటపెడుతున్నది కూడా ఇదే చట్టం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా సమాచార హక్కు దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన దేశంలో ఈ చట్టం 2005 సంవత్సరం అక్టోబర్ 12 నుండి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఈ చట్టం ద్వారా అనేక కుంబకోణాలు బయటపడుతుండగా దీంతో అవినీతి పరుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. ఈ చట్టం క్రింద పౌరులు తమకు కావాల్సిన సమాచారాన్ని ముందుగా దరఖాస్తు చేసుకొని నెల రోజులోపు సమాచారాన్ని పొందవచ్చు. ఈ చట్టం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి శాఖలో ఒక అధికారిని నియమించి సమాచార బదిలికి ఉపయోగిస్తున్నారు. ఈ చట్టం నుండి దేశ రక్షణకు, ముఖ్యమైన రహస్యాలకు సంబంధించిన సమాచారం తప్ప మిగిలిన ప్రతి అంశాన్ని బయటపెట్టాల్సి ఉంటుంది.గత 20 సంవత్సరాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు అడిగినా ఇవ్సాల్సి ఉంటుంది. ఇది పౌరులకు వరమైనప్పటికీ ఈ చట్టం క్రింద వివిధ రకాల దరఖాస్తు చేసుకున్న వారి పై తరుచూ దాడులు జరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తుంది. ఈ విషయమై సమాచార ఉద్యమకారులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ చట్టం అందుబాటులోనికి రావటం ఒక మహాప్రసాదంగా భావించాలి. దీనిని ఘనంగా నిర్వహించడానికి వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావటం వల్ల ఈ చట్టం గురించి అందరికి తెలుస్తుందని పలువురి అన్నారు.

సమాచార కక్కు గురించిన ఉద్యమము ప్రపంచ వ్యాప్తము గా జరిగింది . సమాచారము సక్రమముగా అందినపుడే ప్రజలలో చైతన్యము వస్తుంది , ప్రభుత్వాలను బాధ్యతాయుతం చేయగలుగుతామన్న నమ్మకం తో ఐక్యరాజ్యసమితి నిరంతరము పనిచేస్తున్నది . సమాచారము ప్రజలకు అందుబాటులో ఉందేందుకు అనువైన మార్గాల్ని రూపొందించాలని యునెస్కో సూచించినది . ఆ సూచన ప్రకారము ఇప్పటికి 90 దేశాల్లో సమాచార హక్కు చట్టము రూపొందించబడినది . సమాచారము అందుబాటులోకి తెచ్చేందుకు తగిన మార్గాలను సూచించడం , ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తముగా 80 సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి . వ్యవస్థను సరిదిద్ధలనే యత్నాన్ని భారతదేశం లోను కొన్ని స్వచ్చంద సంస్థలు చేపట్టాయి . ప్రజాధనము వెచ్చించే తీరులో పారదర్శక ఉండితీరాలన్న నినాదము ప్రజల్ని చైతన్యవంతం చేయడం మఓలైంది . ఆ చైతన్య ఉద్యమం ఫలించి తొలిసారిగా రజస్థాన్‌ లొని గ్రామాలలో నిధుల మీద " సోషల్ అడిట్ " జరగాలని నిలదీశారు . గ్రామ సర్పంచి ఇష్టానుసారము నిధులు వెచ్చించేందుకు వీలులేదని , ఆ నిధుల కేటాయింపు విధానాన్ని ప్రజలందరికీ వివరించిన తర్వాతే తీసుకోవాలన్నది వారి డిమాండ్ . గ్రామీనుల వెనకున్నా స్వచ్చంద సంస్థలు , వ్యక్తుల మీద రాజకీయపార్టీలు , అధికాయంతాంగము దాడులు చేయించినా గ్రామస్తులు లొంగలేదు . గ్రామసర్పంచులు , సంబంధిత అధికారులు గ్రామమ్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల అంచనాలు వాటిని చేపడుతున్న కాంట్రాక్టర్ పేరు బహిరంగంగా ప్రదర్శించాల్సివచ్చింది . ఇది గ్రామస్తులు సాధించిన తొలి విజయము .

గ్రామాలలో ధైర్యము , చొరవ పెరిగింది అధికాలులు ప్రజాప్రతినిధులు బాధ్యతలో వ్యవహరించక తప్పలేదు .. అవినీతిదారులను మూసివేసే ప్రయత్నము మొదలైనది . ఇలాంటి ఒక ఉద్యమాన్ని నడిపిన నాయకురాలు అరుణారాయ్ . కేంద్ర సర్వీసులలో అధికారి అయిన ఆమె , అధికారులు రాజకీయనాయకులతో కలిసి దోపిడీచేస్తున్న తీరు నచ్చక , అధికారయంత్రాంగం లో వుంటూ ఆ దోపిడీని అడ్డుకోగలిగిన శక్తిసరిపోక , ఆ దోపిడీలో భాగస్వామికాలేక అధికారాన్నే వదులుకొని ప్రజాపక్షం లో నిలిచింది .. అందుకే ఆమెను ' రామన్‌ మెగసెసే 'అవార్డుతో సత్కరించారు . అలా వారు రూపొందించిన ఉద్యమ ఫలితమే సమాచార హక్కు ప్రజల్కు దక్కడం . . అటువంటి హక్కు ప్రజలకు ఉండి తీరాలన్న వారి దిమాండ్ అనుసరించి కేంద్రప్రభుత్వము 2005 లో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది . UPA ప్రభుత్వము అధికారములోకి రాగానే రూపొందించిన తొలి చట్టాలలో ఇది ఒకటి .

జాతీయ స్థాయిలో చీఫ్ ఇంఫర్మేషన్‌ కమిషనర్ , రాస్ట్ర స్థాయిలో ఇంఫర్మేషన్‌ కమీషనర్లు నియమించబడ్డారు . ప్రతి ప్రభుత్వ కార్యాలయం లో ఒక అధికానిని ఇంఫర్మేషన్‌ ఆఫీసర్ గా నామినేట్ చేయడం జరిగింది . గత 20 సంవత్సరాల కాలానికి సంబంధించిన ఏ సమ్మాచారము అడిగినా అంబంధిత అధికారి నెలరోజుల్లో అందించాలి . అందుకోసం ప్రజలు ఎవరయినా రుసుము చెళ్ళించి దరఖాస్తు మేసుకుంటే చాలు . నిర్దేశిత గడువులో సమాచారము అందించకపోయినా , అందించిన సమాచారము లోపభూయిష్టముగా ఉన్నా పైన ఉండే అప్పిలేట్ అధికారిని ఆశ్రయించ వచ్చు . అలా రాష్ట్రస్థాయి ఇన్ఫర్మేషన్‌ కమీషనర్ స్థాయి వరకు వివిధ హోదాలలో ఈ చట్టాము కింద బాధ్యతలు అప్పగించడం అయ్యింది .  • =========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .