ముద్దు ఎవరు ఎవరికి ఇచ్చేదయినా కావచ్చు. తల్లి తన తనయులకు లేదా తనయలకు ఇచ్చేదే కావచ్చు, లేదా భర్త తన భార్యకు ఇచ్చేదే కావచ్చు. ప్రియుడు తన ప్రియురాలికి ఇచ్చేదే కావచ్చు...ముద్దేదయినా దాని వెనుక ఉండే హృదయం ముఖ్యం. ఆ ముద్దు వెనక ఉండే భావం ముఖ్యం. దాని వెనక ఉండే స్వచ్చత ముఖ్యం. స్వచ్చమైన మనసుతో...స్వచ్చమైన భావంతో...స్వచ్చమైన హృదయంతో ఇచ్చే ముద్దు నిజంగా ఓ గొప్ప భావనే. ఒకరు ఒకరికి ఇచ్చే ముద్దు వారి మద్య ఆత్మీయానుబంధాలను పెంచేదిగా ఉంటే, ఆ ముద్దు వారి హృదయాలను గాయపరిచేది కాకుండా ఉండేది అయితే ముద్దు నిజంగా అమృత తుల్యమే.
ఓ జంట ఏకంగా 17 తోజుల పది గంటల ముప్పై నిమిషాల పాటు ముద్దు పెట్టుకుని రికార్డ్ సృస్టించారు . సదరు రికార్డు గిన్నిస్ పుస్తకం లొకి ఎక్కింది . 1984 సెప్టెంబర్ 24 వ తేదీన ఈ రికార్డు నెలకొల్పినందుకు గుర్తు గా అప్పటినుంచి సెప్టెంబర్ 24 వ తేదీన ఏటేటా ముద్దుల దినోత్సవాన్ని పాటిస్తున్నారు . రకరకాల ముద్దులపై అధ్యయనము జరిపే శాస్త్రం ను " ఫిలెమెటాలజీ " అంటాము .
అసలు ఇద్దరు ముద్దు ఎందుకు పెట్టుకుంటారు?
ముద్దు అనేది పరిపరివిధాలు ... ఆకలితో అల్లల్లాడిపోతున్న పాపడు - పాలిచ్చిన అమ్మకు మౌనంగా చెప్పే కృతజ్ఞత ముద్దు! అంతవరకు ఏడ్చిన అదే పాపడు ఆకలితీరి ఒక్కసారిగా కనుగుడ్లలో నీరు నింపుకుని ... బుల్లి పెదాలపై బోసినవ్వులు పులుముకుంటే ... తాదాత్మ్యతతో బిడ్డ బుగ్గలపై తల్లి చేసే సంతకం ముద్దు.
కాబట్టి - ముద్దు అంటే ప్రేయసీ ప్రేమికులు మోహదాహంతో పెట్టుకునేది మాత్రమే కాదన్నమాట! అయితే ప్రస్తుతం ।సహభాగి చుంబన దినోత్సవం (Kiss your mate day) సందర్భంగా మనం ముఖ్యంగా ప్రేమికుల మధ్య ఎలాంటి ముద్దులు ఉంటాయి, అసలు ముద్దులు ఎందుకు పెట్టుకుంటారు లాంటి అంశాల్ని తెలుసుకుందాం.
ముద్దు యొక్క చరిత్ర మానవాళి ఆవిర్భవించిన నాటి నుంచీ ఉంది. ఆడం, ఈవ్‌ల తొలి కలయిక నాడు రాజుకున్న నిప్పుసెగ ... ముద్దు. ఆనాటి నుంచి నేటి వరకు అనేక లక్షల కోట్ల మంది మనసుల్లో ఆ నిప్పుసెగ మంటలు రేపింది. మనిషి పుట్టి ... వేలకోట్ల మందిగా విస్తరించడానికి అసలు బీజం ముద్దే. అవును మరి -అదే కదా ... లైంగిక సంభోగానికి పూలబాట వేసేది.
అసలు ముద్దు ఎందుకు పెట్టుకుంటారు -
ఇది చాలా చిలిపి ప్రశ్న. చిక్కు ప్రశ్న కూడా. ఇదేం అడగడం - ముద్దు ఎందుకు పెట్టుకుంటారు అంటే - సరదాకి, సెక్స్‌కి, ఆనందానికి, పారవశ్యానికి ఇలా ... జవాబుల జాబితా సాగవచ్చు. కాని అసలు కారణం పైగా శాస్త్రీయంగా ఉండే కారణం ఏమిటో!
ఇద్దరు ముద్దు ఎందుకు పెట్టుకుంటారు?--ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది?-- ఏయే శరీరావయవాల్లో ముద్దు ప్రకంపనలు సృష్టిస్తుంది?
దంతాలు, బుగ్గల దగ్గరి ఎముకలు, పెదవులు ... ఇవన్నీ నరాలతో కూడినవి... ఎపుడైతే పెదాలు కలిసి తారట్లాడి ముద్దాడతాయో ... ఆ నరాలు ఒక్కసారిగా జివ్వుమంటూ వ్యాకోచిస్తాయి. దీంతో హాయిగా ఉంటుంది. ఇద్దరు ముద్దు పెట్టుకోవడానికి కారణం ఇదే! అని కొందరు కారణాలు చెప్పారు. ఇది అంతగా తార్కికమైన కారణం కాదు. అయితే ఇది శరీరానికి సంబంధించిన లాజిక్కు. ఇక మానసికపరమైన కారణమేమిటో చూద్దాం.
ఇద్దరు ఎందుకు ముద్దు పెట్టుకుంటారంటే - ఆకలిని తీర్చుకోవడానికి! ఏ ఆకలి -? మానసికపరమైన అశాంతిని, వ్యాకులతను శాంతింపచేసే ఆకలి ! ఏదో తెలియని భావావేశాన్ని రగిల్చే ... తీర్చే ఆకలి! లైంగిక సంపర్కం అనే సుందర సుమధుర సౌధానికి తొలి రాయి... చుంబనం భావతృప్తి అనే అపురూప అందాల జాబిల్లికి అసలు రేయి - చుంబనం .
ముద్దు ఆనందాన్నెందుకు ఇస్తుంది?
ముద్దు పెట్టుకుంటే అదో గొప్ప రిలీఫ్. అయితే దీనికి కారణం ఏమై ఉండవచ్చు. పొద్దున్నుంచీ ఏమీ తినకుండా రాత్రి ప్రశాంతంగా స్నానం చేసి, ఇష్టమైన అన్నం, కూర తిని పక్కమీద పడుకుంటే ఎంతటి రిలీఫ్ ఉంటుందో ... ముద్దు పెట్టుకున్నప్పుడూ అంతే!
శరీరంలోని వివిధ కండరాలు ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. ముద్దు దెబ్బకు! దాంతో మొత్తం శరీరమంతా హాయిగా రిలాక్స్‌డ్‌గా తయారవుతుంది. అడ్రినల్, పిట్యుటరీ, గొనాడ్ ... ఇంకా ఇతర గ్రంధులు ఇందుకు సహకరిస్తాయి. ఇవన్నీ మనిషిలోని లైంగిక ప్రవర్తనను నియంత్రించేవే! ఈ గ్రంధులు స్రవించే హార్మోన్లు రక్తంలోకి ప్రవేశించి, అక్కడి నుంచి వివిధ అవయవాలకు వెళ్లి రిలాక్సేషన్‌ను కలగచేస్తాయి. అంటే - లైంగిక సంపర్కం అనే ఆకలిని తీర్చే తొలి శృంగార ముద్ద - ముద్దు అన్న మాట.
యవ్వనంలో టీనేజ్ యువతీయువకులు సెక్స్ సంబంధాలకన్నా చుంబనాలు, ఆలింగనాలనే ఎంతో ముద్దని అంటున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని ప్రముఖ వెబ్‌సైట్ తెలిపింది. టీనేజ్‌లో సెక్స్ - ముద్దు, కౌగిళ్లు అనే అంశంపై తాము నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలిందని సదరు వైబ్‌సైట్ నిర్వాహకులు తెలిపారు.
సర్వేలో భాగంగా సాహచర్యం, నవ్వులు, జోకులతోపాటు యవ్వన సంబంధాలు( సెక్స్) గురించి తాము సర్వే నిర్వహించామన్నారు. సెక్స్ సంబంధాలకన్నా ఆలింగనాలు, చుంబనాలకే ఎక్కువ మంది ప్రాధాన్యతనిస్తున్నారనీ, ముఖ్యంగా పురుషులు సెక్స్ సంబంధాలపై మక్కువ చూపడం లేదని తమ సర్వేలో తేలింది.
ఆరోగ్య రంగానికి చెందిన బేయర్ సంస్థ పరిశోధకులు నిర్వహించిన సర్వేలోను ఇదే విషయం వెల్లడైంది. ఆలింగనం, చుంబనాలు... ఇతరత్రా పైపై పనులనే వ్యక్తులు ఇష్టపడుతుండటం గమనార్హం. అలాగే మనుషుల మధ్య పరస్పర అవగాహనా లోపంతో వ్యక్తుల మధ్యనున్న సత్సంబంధాలకు బీటలు వారుతున్నాయని, దీంతోపాటు శృంగారపరమైన అంశాలలోను అంతరాలు ఏర్పడుతున్నాయని ప్రముఖ పరిశోధకుడు క్రిస్టీన్ వేబర్ తెలిపారు.
ఇక కౌగిళ్లు, ముద్దుల విషయంలో పురుషులు మహా నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నారట. ఇష్టపడిన అమ్మాయి ఏ సోఫాలోనో ఆశీనురాలై ఉన్నప్పుడు అందరి కళ్లూ కప్పి చటుక్కున కౌగలించుకోవడంతోపాటు ముద్దు రుచిని కూడా చూపిస్తున్నారట. ఇటువంటి పనులతో వారు అమితానందాన్ని పొందుతున్నారని, ఇలాంటి సమయంలో వారికి రతిక్రియలో పాల్గొనాలన్న కోరిక బలీయంగా ఉన్నప్పటికీ దానిని ప్రక్కనపెట్టి మిన్నకుండిపోతున్నారట.
ముద్దుల్లో రకాలు...!
ము...ము...ము...ముద్దంటే చేదా...,
నీకా ఉద్దేశం లేదా, నీకా ఉద్దేశం ఉంటే లేదా...!
నిను ముద్దాడాలంటే, అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా...! అని అన్నాడో సినీ కవి. నిజమే మరి. ముద్దు పెట్టాలన్నాకూడా మనసు ప్రతిస్పందించాలి. ఈ ముద్దుల్లోకూడా చాలా రకాలున్నాయంటున్నారు పరిశోధకులు.
ముద్దంటే ఇష్టం ఉండనివారెవరుంటారు నేటి ఈ సమాజంలో. ప్రతి ప్రాణికి ముద్దంటే మహా ప్రీతి. అందునా మానవజాతికైతే మరీనూ... చిన్న పిల్లలనుంచి ముదుసలి వరకు ముద్దంటే భలే ఇష్టం. ఈ ముద్దుల్లోకూడా రకాలున్నాయంటున్నారు పరిశోధకులు.
ముద్దు పెట్టుకునే వ్యక్తి తన రెండు పెదవులతో మరొకరి శరీరంలో వివిధ భాగాల్ని సున్నితంగా స్పృశిస్తారు. అయితే వివిధ సంస్కృతులలో అనురాగం, గౌరవం, స్వాగతం, వీడ్కోలు మొదలైన ఇతర భావాలతో కూడుకున్న ముద్దులు పెట్టుకుంటారు. ఇలా చేసేటప్పుడు కొంచెం శబ్దం కూడా వస్తుంది.
రతి క్రీడకు ముందుగా ఆలింగనం చేసుకోవడం ఆ తర్వాత ముద్దులు. మీ ముద్దులు కూడా రతి క్రీడలో భాగమే. ప్రేమ ఎక్కువైనప్పుడే ఈ ముద్దుల ప్రమేయం ఉంటుందంటున్నారు పరిశోధకులు. ఆ ముద్దుల్లోకూడా రకరకాలుంటాయి.
శరీరంలోని ఎనిమిది ప్రదేశాలలో ముద్దులు పెడుతుంటారు. ముద్దు పెట్టే ప్రదేశాలు ముఖ్యంగా నుదురు, ముంగురులు, బుగ్గలు, కళ్ళు, వక్షస్థలం, స్థనాలు, పెదవులు, నాలుక - మనిషి శరీరంలోని ఈ ఎనిమిది భాగాలలో ముద్దాడతారని ప్రాచీన కామశాస్త్రాచార్యులు చెప్పారు. ఇవి కాక గజ్జలు, చంకలు, బొడ్డు కూడా ముద్దు పెట్టుకోదగిన ప్రదేశాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ప్రేమలో మునిగిపోయినప్పుడు మనిషి తమకంతో తన ప్రమేయం లేకనే తనకు బాగా కావలసిన వారిని ముద్దులతో ముంచెత్తుతుంటాడు. ఈ ముద్దుల ప్రక్రియ కొనసాగేముందు శరీరంలోని 34 ముఖ కండరాలు 112 ఇతర కండరాలు పనిచేస్తాయని శాస్త్ర పరిసోధకులు తెలిపారు. ఈ కండరాలలో ప్రధానమైన కండరము పెదాలను దగ్గరగా చేసే ఆర్బిక్యులరిస్ ఓరిస్. దీనినే ముద్దుపెట్టే కండరం అని అంటారు. నేటి యువత ఫ్రెంచి ముద్దునే ఇష్టపడుతుంటారు.
చేతి ముద్దు : చేతి ముద్దు అంటే ఎదుటివారి చేతిని తీసి దానిపై ముద్దు పెట్టడం. ఇది ఉన్నత స్థాయికి చెందినవారు, గౌరవ సూచకంగా పెట్టుకొనే ముద్దు. ఈ ముద్దు పొందే వ్యక్తి తన చేయిని ముందుకు ఉంచుతారు. ముద్దిచ్చే వ్యక్తి ఆ చేతిని అందుకొని, ముందుకు వంగి సున్నితంగా వేళ్ళను పెదాలతో తాకుతాడు.
చెక్కిలి ముద్దు: చెక్కిలి అంటే బుగ్గ. ఎదుటి వ్యక్తిపై ప్రేమతో, స్నేహంతో లేదా గౌరవ సూచకంగా పెట్టే ముద్దును బుగ్గ మీద పెడుతుంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కువగా బుగ్గమీద ప్రేమతో ముద్దిస్తారు. బుగ్గమీద ముద్దుపెట్టుకొనే వ్యక్తులు ఒకరి బుగ్గను మరొకరి బుగ్గతో గాని పెదాలతో గాని సున్నితంగా తాకుతారు.
ఫ్రెంచి ముద్దు : ప్రస్తుతం చాలామంది ఫ్రెంచి ముద్దును ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందునా ప్రేమికులైతే మరీనూ...ఈ ఫ్రెంచి ముద్దును రొమాంటిక్ లేదా సెక్స్ సంబంధమైనదిగా భావిస్తారు. ఇందులొ ఒకరి నాలుక మరొకరి నోటిలోకి జొప్పించి ఇంకొకరి నాలుకను తాకడమే ఈ ముద్దులోని రహస్యం.
ఫ్లైయింగ్ కిస్ : ఫ్లైయింగ్ కిస్. దీనినే గాలి ముద్దు అనికూడా అంటుంటారు. ఆధునిక కాలంలో ఒక సంకేతంగా ఉపయోగించే ఊహాజనితమైన ముద్దు ఇది. పెదాలను ముద్దు పెట్టినట్లు గుండ్రంగా చుట్టి, ముద్దు శబ్దాన్ని, చేతులతో పంపడమే ఈ గాలి ముద్దు, అదే ఫ్లైయింగ్ కిస్. మీరు అందచేయదలచుకున్న అభినందనలను ముద్దుల రూపంలో ఎవరికి పంపాలో వారివైపుగా చూపిస్తూ ఈ ఫ్లైయింగ్ కిస్‌ను పంపుతారు.
ఇదండీ ముద్దుల్లో రకాలు. ఈ ముద్దుల్లో చాలామంది వారికి అనుగుణంగా మలచుకుని వాడుకుంటుంటారు. అయితే ముద్దు పెట్టుకున్నప్పుడు సుమారు 278 రకాల సూక్ష్మ జీవులు ఒకరి నోటి నుండి ఇంకొకరి నోటిలోకి దూసుకు వెళ్ళే ప్రమాదమూ లేకపోలేదని గ్రహించాలి . ఈ సూక్ష్మక్రిములలో కొన్ని మంచివీ ... మరికొన్ని చెడ్డవి ఉంటాయి .
విషయం ఏదైనా ప్రపంచ ముద్దుల దినోత్సవం సందర్భంగా స్వచ్చమైన "ముద్దు" లకూ జిందాబాద్.
- ======================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .