Friday, October 15, 2010

Indian Airforce Day , భారత వాయుసేన దినోత్సవం


  • ప్రతి సంవత్సరము అక్టోబర్ 08 న .
భారతదేశ త్రివిధ దళాల్లో వైమానిక దళము ఒకటి . దీని ప్రధాన భాద్యత గగనతలాన్ని రక్షించడము , యుద్ధసమయాల్లో వైమానిక దాడులు నుర్వహించడము .

భారత వైమానిక దళాని 1932 అక్టోబరు 08 న తొలుతగా యేర్పాటుచేసారు . రెండో ప్రపంచ యుద్ధకాలములో ఈ దళము అందించన సేవలకు గుర్తింపుగా 1945 లో " రాయల్ " అన్న పదాన్ని ముందు కలిపారు . 1947 లో మనదేశము స్వాతంత్రాన్ని సముపార్జించాక " రాయల్ ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ " యూనియన్‌ ఆఫ్ ఇండియాకు సేవలందించినది . 1950 లో భారతదేశము రిపబ్లిక్ గా మారాక ' రాయల్ ' ను తీసేసారు . స్వాతంత్రం వచ్చిన దగ్గరనుంచి భారతీయ వైమానిక దళం పాకిస్తాన్‌ తో నాలుగు యుద్ధాల్లో , చైనా తో ఒక యుద్ధం లో పాల్గొన్నది . ఆపరేషన్‌ విజయ్ , ఆపరేషన్‌ మేఘ్ దూత్ , ఆపరేషన్‌ కాక్టస్ వంటి ప్రధాన బాధ్యతల్ని సమర్ధ వంతం గా నిర్వహించినది . యుద్ధాలవిషయం అలా ఉంచితేఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతవైమానిక దళము చురుగ్గా పాల్గొన్నది .

ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ 1,70,000 మంది సిబ్బందితో , 1300 విమానాలతొ ప్ర్పంచం లో నాల్గవ పెద్ద దళం గా ఉన్నది . మొదటి స్థానము లొ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ , రెండెవ స్థానములో రష్యన్‌ ఎయిర్ ఫోర్స్ , మూడవ స్థానములో చైనా ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి . సోవియట్ కాలం నాటి యుద్ధవిమానాల్ని మార్చేందుకు ఐ.ఎ.ఎఫ్. విసృతమైన ఆధునికీకరణ కార్యక్రమాల్ని చేపట్టింది . 1947 ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చట్టము , భారత రాజ్యాంగము , 1950 నాటి ఎయిర్ ఫోర్స్ చట్టము , ఐ.ఎ.ఎఫ్. విధుల్ని స్పష్టము గా నిర్వచించాయి . దీనిప్రకారము భారత్ ను అన్ని కోణాల నుంచి రక్షించేందుకు భారత వైమానిక దళము సర్వసిద్ధం గా ఉంటుంది . ఇతర సాయుధ దళాల సహకారము తో భాతీయ గగన తలాన్ని రక్షిస్తూ , భారత భూభాగాన్ని , జాతి ప్రయోజనాల్ని అన్నిరకాల సవాళ్ళ నుంచి కాపాడు తుండాలి . యుద్ధ రంగం లో భారత సైన్యానికి ఐ.ఎ.ఎఫ్ వైమానిక మద్దతును అందిస్తూ వ్యూహాత్మకం గా వస్తు సామగ్రిని సైనికుల్ని ఆకాశమార్గాన పంపుతుంది .

సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించే దేశ అంతరిక్ష పరికరాల్ని సమర్ధవంతం గా ఉపయగించుకోవడం కోసము అంతరిక్షవిభాగానికి , ఇండియన్‌ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) లతో కలసి ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ ను నిర్వహిస్తుంది . ఈ సామగ్రికి ఎలాంటి నష్టం కలగకుండా కాపాడుతుంది . ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇతర సనికదళ శాఖలతో కలిసి బాధితులను కాపాడె ప్రయత్నాలు చేస్తుంది . ప్రబావిత ప్రదేశాల్లో బాధితులకు సహాయ సామాగ్రిని కిందకు జారవిడుస్తుంది .

1998 గుజరాత్ సైక్లోన్‌ , 2004 నాటి సునామీ విపత్తులలో ఇ.ఎ.ఎఫ్ . విసృతమైన సహాయ చర్యలు చేపట్టినది . శ్రీలంకలో ఆపరేషన్‌ రెయిన్‌ బో తరహాలో ఇతర దేశాలకు కూడా సహాయం అందిస్తూ ఉన్నది . ఇ.ఎ.ఎఫ్ తొలి విమానం వెస్ట్ లాండ్ వాపిటి . 1933 ఏప్రిల్ ఒకటో తేదీన తొలిదళాన్ని ఐదుగురు భారతీయ పైలట్ల తో ఏర్పాటు చేసుకున్నది . అప్పుడు ఏర్పాటైన తొలి స్క్యాడ్రాన్‌ 1938 దాకా నెంబర్ వన్‌ గా ఇ.ఎ.ఎఫ్ ఏకైక స్క్యాడ్రాన్‌ గా కొనసాగింది . రెండో ప్రపంచ యుద్ధకాలం లో ఇ.ఎ.ఎఫ్. చిహ్నం నుంచి ఎర్రని బిందువు తొలగించారు . జపనీస్ రెడ్ సీన్‌ ఎంబ్లం తో పోలిక లేకుండా ఉండేందుకు దీన్ని తొలగించారు . 1943 లో ఎయిర్ ఫోర్స్ నాలుగు స్క్యాడ్రన్ల సంఖ్య 1945 నాటికి తొమ్మిదికి పెరిగింది . స్వాతంత్ర్యాన్ని ప్రకటించాక యూనియన్‌ ఆఫ్ ఇండియా , డొమినియన్‌ ఆఫ్ పాకిస్తాన్‌ లు గా విడిపోయింది . సైనిక దళాలు కూడా అలాగే విభజనకు గురయ్యాయి . భారత వైమానిక దళం రాయల్ ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ గా ఉండిపోయింది . రాయల్ ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ చిహ్నం అశోక చక్రం నుంచి తీసుకున్న ' చక్ర ' గా మారింది . అదే సమయం లో జమ్ము -కాశ్మీర్ వివాదం చెలరేగింది . ఈ భూభాగము లోనికి పాకిస్తానీ దళాలు చొచ్చికు వస్తుండగా , ఆ సంష్థానము మహారాజు భారత సైనిక సహాయము కోరాడు . రెండు దేశాల నడుమ లాంచన ప్రకటన కేకుండానే భారత దళాలు వార్ జోన్‌ లోకి ప్రవేశించగానే యుద్ధం మొదలైనది . ఈ యుద్ధం లో పాకిస్థాన్‌ వైమానిక దళం తో ముఖాముఖి తలపడాలేదు కాని , భారతీయ దళాలకు సమర్ధవంతమైన రవాణా , అంతరిక్ష మద్దతు అందించినది . 1950 లో రాయల్ పదాన్ని తొలగించినప్పుడే ప్రస్తుత వైమానిక దళం చిహ్నాన్ని చేపట్టారు .

కాంగో సంక్షో్భము , గోవా విమోచనము సందర్భం గా 1960 - 61 లో ఇ.ఎ.ఎఫ్ విశి్ష్ట సేవలు చేసినది . 1962 లో చైనా భారత్ నడుమ సరిహద్దు వివాదము తలలెత్తాయి ... యుద్దం అనివార్యమయినది . సినో-ఇండియా యుద్ధం సందర్భం గా భారతీయ సైనిక వ్యూహకర్తలు కుట్రను పసికట్టడం లో విఫలమైనా చైనా దళాలకు వ్యతిరేకం గా ఐ .ఎ.ఎఫ్ ను అత్యంత సమర్ధవంతంగా వినియోగించుకున్నారు . దీని తర్వా 1965 లో పాకిస్తాన్‌ తో యుద్ధం లో సినో-ఇండియా యుద్ధ అనుభవ పాఠాల రీత్యా బారత్ తన వైమానిక దళాన్ని విసృతం గా వినియోగించుకున్నది . తర్వాత దళం సామర్ధ్యానీ పెంచుకున్నది . . . అనేక మార్పులు చేసినది .

వస్తు సామగ్రి అందజేత , రిస్క్ ఆపరేషన్ల సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు అనేక అంతరిక్ష నైకల్ని అమకూర్చుకున్నది . 1971 లో భారత్ -పాకిస్తాన్‌ నడుమ జరిగిన బంగ్లాదేశ్ విమోచనా యుద్ధం లో వైమానిక దళం విభిన్న ఆపరేషన్లు నిర్వహించి ఘనతికెక్కినది . ఇలా దాదాపు 8 దశాబ్దాల క్రితం ఏర్పడిన భారత వైమానిక దళము యుద్ధాలు , సహాయక చర్యల్లో పాల్గొంటూ మరెన్నో ఆపరేషన్లు నిర్వహిస్తూ భారత భూభాగాన్ని , భారతీయుల్ని కాపాడుతోంది . ఆన్ని సాయుధదళాలకు భారత రాస్ట్రపతే సుప్రీం కామాండర్ . రక్షణ మంత్రి నేతృత్వం లొ రక్షణ విభాగము ఎయిర్ ఫోర్స్ ను పర్యవేక్షిస్తుంది . పభుత్వ భద్రతా విధానానికి రూపకల్పన చేయడం ద్వారా ప్రధానమంత్రి , జాతీయ భద్రతామండలి పరోక్ష నాయకత్వాన్ని అందిస్తారు . ఎయిర్ చీఫ్ మార్షల్ వైమానిక దళ ప్రధాన కార్యాలయాన్ని అజమాయిషీ చేస్తూ వైమానిక దళానికి సారద్యం వహిస్తారు .

భారతీయ వైమానిక దళం 5 ఆపరేషనల్ , 2 ఫంక్షనల్ కమాండ్స్ గా విభజితమై ఉంది . దేశాన్ని అన్ని విధాలుగా రక్షిస్తున్న ఈ దళం సేవలను గుర్తిస్తూ , అది ఏర్పాటయిన రోజును ... అంటే అక్టోబర్ ఎనిమిదో తేదీన 'ఎయిర్ ఫోర్స్ డే ' జరుపుకుంటారు .
  • ========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .