- World Vegeterian Day , ప్రపంచ శాకాహార దినోత్సవం -- అక్టోబర్ 01.
శాకాహారము వల్ల కలిగే ప్రయోజనాల్ని మానవజాతికి తెలియజెప్పి , ఈ ఆహారము జీవన విధానాన్ని ఏవిధం గా మెరుగుపరుస్తుందో వివరిస్తూ ప్రోత్సహించే ఉద్దేశం తో వరల్డ్ వెజిటేరియన్ డే ను 1977 లో ప్రకటించారు . ముందుగా 1974 లో నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటి (N.A.V.S) ఏర్పాతయినది . దీన్ని ఏర్పాటుచేయడానికి ప్రధాన ప్రధాన ఉద్దేశాలు రెండు . సొసైటీ సభ్యులకు మద్దతుగా నెట్ వర్క్ ఏర్పాటు చేయడం . .. సంబంధిత గ్రూపులు , శాకాహారులకు మద్దతు ఇవ్వడం ఒక భాగం కాగా , శాకాహారము ఏవిధమైన ప్రయోజనాలు ఇస్తుందో ప్రజలకు తెలియజెప్పడం రెందవది .
పౌష్టికాహారము విషయం లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది . చైనాలో సేవించే గ్రీన్ టీ లో యాంటి ఆక్షిడెంట్లు పుష్కరముగా లభిస్తే , ఫ్రాన్స్ లోని ' రెడ్ వైన్' లో ప్లేవనాయిడ్స్ దండిగా ఉంటాయి . ఇక ఇటలీ లో ఆలివ్ ఆయిల్ , అమెరికాలో రెడ్ బీన్స్ , జర్మనీ లో తినే ' బ్లాక్ బ్రెడ్ ' , బ్రెజిల్ లో వాడే ఎర్బామేట్ పానీయము , గ్రీస్ లో ఎక్కువగా వాడే నిమ్మ , భారతదేశములో వాడే లస్సి , జపాన్ లో వాడే పుట్టగొడుగులు , ఆస్ట్రేలియాలో వాడే ఫ్రూట్ సలాడ్స్ అన్ని మంచి విటమిన్ల తో కూడుకున్నవే .
శాఖము, ఆహారము అనేరెండు పదముల కలయిక. శాఖము అంటే చెట్టు . . . చెట్టు , మొక్కల నుండి వచ్చే ఆహారము అని అర్ధము . పుట్టిన ప్రతి జీవికి జీవించదానికి అతవసరమైనది ఆహారం . ఇది శాఖాహారమా , మంసాహారమా అనేది ఆజీవి పుట్తుక , అలవాట్లు , పరిసరాల పైన ఆధారపడి ఉంటుంది .
1977 లో నార్త్ అమెరికన్ సొసైటి " వరల్డ్ వెజిటేరియన్ డే " ను వార్షిక వేడుకగా ప్రకటించగా , 1978 లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్ ఆమోదాన్ని తెలిపింది . అక్టోబర్ ఒకటో తేదీన అధికారికంగా ఈ వేడుక జరుపుకోవాలని ప్రకటించినది .
సులువుగా జీర్ణమయ్యే ఆహారము బార్లి లాంటివి అనేకము ఉన్నాయి . గోధుమతో పోల్చితే బార్లి శరీరములో పేరుకు పోయిన నీటిని బయటికి పంపిస్తుంది . ఆకుకూరలు , కాయకూరలు , గింజము , పప్పులు ఆరోగ్యానికు ఎంతో మంచిది . మాంసాహారము ఎన్నో జీర్ణకోస వ్యాధులకు కారణమవుతుంది . శాకాహారము జీర్ణకోశవ్యాధులను నయము చేస్తుంది .
- ==========================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .