Saturday, October 16, 2010

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ,World Mental Health Day



ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం--October 10 .


మన ఆలోచనలు, ఆచరణలూ అన్నీ మెదడుపైనే ఆధారపడి వుంటాయి. మెదడే గనుక లేకుంటే ఇంజన్‌ లేని రైలు, దారంలేని గాలిపటం అవుతాయి. మన కర్తవ్యాలను నెరవేర్చుకుంటూ, లక్ష్యాలను చేరి, ఆనందంగా జీవించేందుకు ఇతర శారీరక అవయవాలతోబాటు మానసిక ఆరోగ్యం సంతృప్తికరంగా వుండేలా చూసుకోవాలి. ఆ అవగాహన ఏర్పర్చుకోడానికి, అప్రమత్తంగా వంఉడటానికి, అవసరమైన ప్రణాళికలు రచించుకోడానికి, జాగ్రత్తలేంటో తెలుసుకుని పాటించడానికి ఉద్దేశించినదే ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈరోజున ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు చర్చలు జరపడం,సెమినార్లు నిర్వహించడం, మెంటల్‌ డిజార్డర్లేమీ చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మానసిక వైకల్యంతో బాధపడ్తున్నవారికి చికిత్స లాంటివన్నీ ఏర్పాటుచేస్తారు. మానసిక అనారోగ్యాన్ని అశ్రద్ధ చేసినా, చికిత్స మధ్యలో ఆపేసినా పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం వుంది.

శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడివుంటాయి. దీర్ఘకాలిక శారీరక సమస్యలు కొన్నిసార్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక దౌర్బల్యం శారీరకంగా క్షీణింపచేస్తుంది. కనుక అటు శారీరకంగాను, ఇటు మానసికంగానూ దృఢంగా వుండేట్లు చూసుకోవాలి. అప్రమత్తంగా వుండేందుకు అవస రమైన అంశాలను తెలుసుకోవాలి. 150 దేశాల మానసిక ఆరోగ్య కేంద్రాల సభ్యుల సలహా, సహకారాలతో 1992లో తొలిసారి వరల్డ్‌ పెడరేషన్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోద్బలంతో ఈ దినాన్ని జరిపారు. అంటే ఇవాళ 18వ వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ డే సెలబ్రేట్‌ చేసుకోబోతున్నాం. కొన్ని దేశాల్లో ఈరోజు మొదలు వారంపాటు మెంటల్‌ ఇల్‌నెస్‌ అవేర్‌నెస్‌ వీక్‌ పేరుతో సెమినార్లు, చికిత్సలు నిర్వహిస్తారు.

మానసిక రోగం పేరు చెప్తే చాలు మనందరికీ భయం. పొరపాటున అలాంటి వ్యాధి సోకితే జబ్బు తీవ్రత కంటే ఎక్కువగా మనం తల్లడిల్లిపోతాం. మనతోబాటు మనవాళ్ళూ ఆందోళన చెందుతారు. నిజానికి మనలో 40 శాతం పిచ్చివాళ్ళేననేది నిపుణుల అంచనా. అది మెడికల్‌ అనాలిసిస్‌ మాత్రమే. ఇంకా ఫ్రాంకుగా, నిఖార్సుగా చెప్పాలంటే పూర్తి నార్మల్‌గా వుండేవాళ్లు బహుశా ఏ రెండు శాతమో వుంటారు. మనచుట్టూ ఎంత అబ్‌నార్మాలిటీ?! ఎన్ని వింత పోకడలు? తిండి పిచ్చి, డబ్బు పిచ్చి, నగల పిచ్చి, పుస్తకాల పిచ్చి, పేరుపిచ్చి, సినిమాల పిచ్చి.. గొప్పలు చెప్పడం, అప్పులు చేయడం, ఆడంబరాలు పోవడం, షాపింగు, అతి వాగుడు, మితిమీరిన కోపం... అబ్బో.. చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత లిస్టవుతుంది.

ఏ లక్షణమైనా సరే అవధులు దాటినప్పుడు అది పిచ్చిచేష్ట అవుతుంది. లిమిట్స్‌లో ఉన్నంతవరకూ ఏదీ తప్పు కాదు. తిండి చాలా అవసరం. ''కోటి విద్యలూ కూటి కొరకే'' అని సామెత కూడా వుంది. ''తిండి కలిగితె కండ కలదోయ్‌/కండ కలవాడేను మనిషోయ్‌'' అని గురజాడ కూడా అన్నాడు. ఎవరూ ఏ నిర్వచనాలూ చెప్పకున్నా, సమయానికి మనకు ఆకలేస్తుంది. ఆ ఆకలి తీరితేనే రోజంతా శక్తి వుంటుంది. అలాగని పొద్దస్తమానం తిండి గురంచే మాట్లాడ్తూ, తిండియావతోనే వుంటూ, తింటూనే కనిపిస్తే చూసేవాళ్ళకి తెగ చిరాకేస్తుంది, కండొలిజా రైస్‌ వ్యాఖ్యానించినట్టు దేశానికి ఆహార పదార్థాల కొరతా వస్తుంది. భావం, భాష దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం. అవసరానికి అందంగా, ఆహ్లాదంగా, చేతనైతే కాస్త సరదాగా, చమత్కారంగా మాట్లాడ్తే అందరూ సంతోషిస్తారు. ఎంత అందమైన భావప్రకటన, ఏమి ఛలోక్తులు అని ప్రశంసిస్తారు కూడా. కానీ, అనవసరంగా, అసందర్భంగా మాట్లాడ్డమే ధ్యేయం అన్నట్టు పని మానేసి మాట్లాడేవాళ్ళని చూస్తే ''కొందరు తెలివైనవాళ్ళని డంబ్‌ అండ్‌ డెఫ్‌గా పుట్టించే దేవుడు వీళ్ళకి గళమెందుకు ఇచ్చాడా'' అనిపిస్తుంది. ఇది ప్రతిదానికీ వర్తిస్తుంది. ఎందులోనూ అతి ప్రదర్శించకుండా మన హద్దుల్లో మనం వుండి, బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నంతవరకు ఎవరూ మనని తప్పుపట్టరు.

ఈ జనసామాన్యమైన సంగతి అలా వుంచితే వైద్య పరిభాషలో డిప్రెషన్‌, యాంగ్జయిటీ, యాంగ్జయిటీ న్యూరోసిస్‌, బైపోలార్‌ డిజార్డర్‌, సోషల్‌ యాంగ్జయిటీ డిజార్డర్‌, పానిక్‌ డిజార్డర్‌, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌, పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌, ఫోబియా, మానియా, స్కిజోఫ్రీనియా, డిల్యూషనల్‌ డిజార్డర్‌, స్లీప్‌ డిజార్డర్‌ (ఇన్‌సోమ్నియా), ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌, సుపీరియారిటీ కాంప్లెక్స్‌, ఇల్యూషన్‌, అడిక్షన్‌ లాంటి మానసిక వైకల్యాలు అనేకం ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే మానసిక ఉద్రేకాలను నిగ్రహించు కోలేకపోవడమే రుగ్మతను తెచ్చిపెడ్తుంది. కష్ట సమయా లు, క్లిష్ట పరిస్థితుల్లో కుంగిపోకుండా బ్యాలెన్స్‌డ్‌గా వుండగల్గితే మెదడు సక్రమంగా పనిచేస్తుంది. కనుక వత్తిడికి గురికాకుండా సమస్య పరిష్కార దిశగా ఆలోచించమని చెప్తున్నారు సైకియాట్రిస్టులు. వత్తిడి, ఆందోళన తగ్గించుకోడానికి కొన్నిరకాల వ్యాయామాలను సూచిస్తున్నారు. ముఖ్యంగా మెడిటేషన్‌ వల్ల ఎంతటి స్ట్రెయినైనా, ఎలాంటి స్ట్రెస్సయినా మటుమాయమౌతుందని రుజువుచేసి చూపిస్తున్నారు.

మానసిక, శారీరక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడివుంటాయి గనుక ఒకదానికి చికిత్స తీసుకునేటప్పుడు రెండోదానిక్కూడా తీసుకోవడం మంచిదని మానసిక నిపుణులు చెప్తున్నారు. కొన్ని కాంప్లికేటెడ్‌ లేదా క్రానిక్‌ కేసులు నర్సింగ్‌హోమ్‌లో చేరి డాక్టర్‌ నిరంతర పర్యవేక్షణలో చికిత్స జరిపింతిచే ఫలితం వుంటుందని కూడా చెప్తున్నారు. మానసిక రోగులకు మందులతోబాటు మనోవేదన తగ్గించే చేయూత, ఆత్మీయత అవసరం. అనేక ఇతర కారణాలతోబాటు సహనం లేకపోవడం డిజార్డర్లకు దారితీస్తుందనేది వైద్యుల అభిప్రాయం. మరో సంగతేమంటే పని లేకపోవడం కూడా మానసిక వైకల్యానికి దారితీస్తుందట. అందుకే 'యాన్‌ ఐడీల్‌ మ్యాన్స్‌ బ్రెయిన్‌ ఈజ్‌ డెవిల్స్‌ వర్క్‌షాప్(An idle man's brain is devil's workshop)‌'' అన్నారు. చేతినిండా పని, మనసునిండా దాన్నెంత బాగా చేయాలా అనే తపన వుంటే ఇక లేనిపోని ఆలోచన్లకు, మైండు పాడుచేసుకోడానికీ తావెక్కడిది?

అనేక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్‌ ఇంప్రూవ్‌మెంట్‌ టీమ్‌లు ప్రపంచ మానసిక ఆరోగ్య దినానికి తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఆందోళన, వత్తిడి అనేవి డిప్రెషన్‌కు దారితీస్తాయి కనుక ముందుగా వాటికి చెక్‌పెట్టమని హితవు చెప్తున్నారు నిపుణులు. నిద్రలేమి లేదా ఇన్‌సోమ్నియా కూడా ఒకరకమైన మానసిక వ్యాధే. అంతూదరీలేని వ్యాకుల మనసులో పేరుకుపోయివుంటే నిద్రపట్టదు. ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. లేకుంటే శారీరక బడలిక తీరదు, మానసిక ప్రశాంతత లభించదు. కలతపరిచే ఆలోచనలు, చేటుచేసే చేష్టలు మానుకుంటే మానసిక రుగ్మతలేవీ దరిచేరవు అంటున్నారు సైకియాట్రిస్ట్‌ పెర్కిన్‌.

తగుమోతాదులో పౌష్టికాహారం, రోజులో కనీసం గంట సేపు వ్యాయామం, శక్తికి మించిన అలసట, దుర్భరమైన నొప్పి లేకుండా చూసుకోవడం, రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజులు, తీవ్ర ఉద్రేకాలకు లోనుకాకుండా, కుంగిపోకుండా వుండాలి. లోకంలో పరిష్కారం లేని సమస్యంటూ గుర్తించి, ప్రయత్నిస్తే ఆందోళనే వుండదు ఈపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే మానసిక రుగ్మతలు దరిచేరవని హామీ ఇస్తున్నారు నిపుణులు. ఇన్ని మాటలెందుకు.. క్లిష్టసమస్యలెదురైనా తలమునకల వకుండా ధైర్యంగా పరిష్కరించుకోగల్గితే, అందనివాటికి అర్రులు చాచి ఆందోళన చెందకుండా మనసు పదిలంగా వుంచుకుంటే చాలు మానసిక వైకల్యానికి తావే లేదు.

World Mental health Day,ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం-2013

మానసిక రుగ్మతలకు మెరుగైన చికిత్స---వృద్ధాప్యం మరో బాల్యం లాంటిది. పండుటాకులకూ పసిబిడ్డలకూ పెద్దగా తేడా ఉండదు. వృద్ధులతో వ్యవహరించేటప్పుడు కాస్త సున్నితంగా ఉండటం చాలా అవసరం. సగటు ఆయుర్దాయుం పెరగడంతో వృద్ధుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. వృద్ధుల సంఖ్యతోపాటే మలి వయసులో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్యా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా అక్టోబరు 10న నిర్వహించే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది వృద్ధుల్లో వచ్చే మానసిక రుగ్మతలపై అవగాహన కల్పించేందుకు కృషి జరుగుతోంది.

 మానసిక చికిత్సా విభాగానికి వచ్చే ప్రతి వంద మందిలో 25 మంది వృద్ధులుంటున్నారు. వీరిలో అత్యధికులు డిప్రెషన్‌, నిద్రలేమి, ఆందోళన, డిమెన్షియా వంటి ఆరోగ్య సమస్యలతో వస్తున్నారు. వీరందరికి మెరుగైన చికిత్స అందించడమే కాకుండా అవసరమైన వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపుతున్నారు. వ్యాధి తీవ్రత ఉన్న వారిని వార్డులో చేర్చుకుని వైద్య సేవలందిstaaరు.

వృద్ధాప్యంలోనూ సంతోషంగా..
వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల, ఇంట్లో వారు వృద్ధుల పట్ల కొద్దిపాటి శ్రద్ధ చూపిస్తే వృద్ధాప్యం ఎంతో సంతోషకరమైన దశగా మారుతుంది. వృద్ధులు కూడా ఈ వయసులో మారాలా? ఎలాగో జీవితం అయిపోయింది అన్న ధోరణిలోకి జారిపోకూడదు. ఏ వయసు వారైనా మంచి ఆహారపు అలవాట్లు, చక్కని వ్యాయామం, మద్యం, పొగ జోలికిపోకుండా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. మానసిక రుగ్మతలు ఉన్నవారికి dESamulO మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి తీసుకువస్తే వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చు.
  • ==========================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .