Tuesday, October 26, 2010

పోషకాహార దినోత్సవం , Balanced Diet Day


  • [Food+items+for+balanced+diet.jpg]

పోషకాహార దినోత్సవం--ఆరోగ్యానికి పోషకాహార మంత్రం


ఇప్పుడు ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. ఆరోగ్యంకోసం ఎన్నో సూత్రాలు పాటిస్తున్నాం. ఆరోగ్య ఆవశ్యకతను గుర్తిస్తున్నాం. మరి మన ఆహారంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటు న్నాయో గమనిస్తున్నామా? నిజానికి ఆహారనియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్లే ఎక్కువగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలుసుకోవాలి. చక్కని పోషకాహారం తీసుకోవడం వల్ల మాత్రమే ఆరోగ్యం, తద్వారా ఆనందం పొందగలుగుతాం. ఆరోగ్యమే మహా భాగ్యం అనే మన పెద్దలమాట గుర్తుకు తెచ్చుకునేందుకు మంచి తరుణం ఇది. ఈ రోజు పోషకాహార దినోత్సవం. మరి ఎలాంటి పోషకవిలువలను మనం కోల్పోతున్నాం, ఎటువంటి ఆహారం విలువైన పోషకాలను అందిస్తుందనేది తెలుసుకుందాం.

మంచి ఆరోగ్యం కావాలంటే పోషకాహారం తప్ప నిసరి. వేళప్రకారం భోజనం, పళ్లరసాలు, విత్త నాలు, కూరగాయలు, ఆకుకూరలు మెదలైనవి భోజనంలో ఉంటేనే ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది. సమతుల ఆహారపు అలవాట్లే మనపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈరోజుల్లో అతి ముఖ్య మైన పోషకాహారం పట్ల మనం శ్రద్ధ చూపించడం లేదు. రాబోయే కాలంలో శరీరంపై దాడిచేసే ఎన్నో రకాల వ్యాధులను ఎదుర్కోవడానికి పోషకాహారం ఎంతో ముఖ్యం. కూరగాయలు, పండ్లు, ధాన్యాలు మొదలైనవన్నీ సహజ శక్తికారకాలు.

మనదేశంలో ఆహారపు అలవాట్లు : మనదేశంలో ఆహారం పద్ధతుల్లో అధికంగా వెన్న, నెయ్యి, నూనె, కారం, పులుపు, మసాలాలు వాడు తుంటాం. అలాగే ఎక్కువగా వేయించిన వంట కాలను ఇష్టపడుతుంటాం. వీటివల్ల పోషకాల కంటే కొవ్వుశాతం ఎక్కువ అవుతుంటుంది.

పరిశోధకులేమంటున్నారంటే
బెంగళూరుకు చెందిన సెయింట్‌ జాన్స్‌ నేషనల్‌ అకాడమీ 2010 దాటేసరికి ప్రపంచ హృద్రోగుల్లో 60% భారత్‌లోనే ఉంటారని ప్రకటించింది. బ్రిటన్‌లోని విచ్‌ మ్యాగజైన్‌ పరిశీలన ప్రకారం భారత్‌లో సగటు మనిషి ఒకపూట చేసే భోజ నాన్ని బ్రిటన్‌లో ఒకరోజు ఆహారంగా ఇస్తారు. దీని వల్ల 23.2 గ్రాముల అధిక కొవ్వును పెంచు కుంటున్నట్లే అని చెబుతున్నారు. ఇందుకుకారణం మన దేశంలో నెయ్యి, నూనెలను అధికంగా వాడ టమే. చూశారా ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలను అందిం చడం పట్ల కూడా కాస్త శ్రద్ధ చూపించాలి అని పై పరిశోధనల వల్ల తెలుస్తోంది కదా! మనం రోజూ తీసుకునే కూరలు, పండ్లు ఇతర పదార్థాల్లో ఉండే పోషక విలువలేంటో ఇక్కడ చూద్దాం.

రోజుకో యాపిల్‌ --
యాపిల్‌లోని కొలొన్‌, ప్రొస్ట్రేట్‌, ఊపిరితిత్తుల కేన్సర్‌ నివారించడంలో పనికొస్తాయి. నిత్యం ఓ యాపిల్‌ను తినడం వల్ల డాక్టర్‌ను సంప్రదించే సందర్భాలు తగ్గిపోతాయట.

విటమిన్‌ సి యుక్తం ముల్లంగి --
ముల్లంగిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ముల్లంగి ఆకులు కూడా ముఖ్యమై నవే. ఇవి కాల్షియంను పుష్కలంగా కలిగి ఉంటాయి.

ఉల్లికాడలూ ఉపయోగమే --
రక్తపోటును నియంత్రించడానికి, జీర్ణవ్యవస్థ పని తీరుకు ఇవి ఎంతో ఉపయోగకరం. ఏడు రకాల కేన్సర్లను తగ్గించడంలో వీటికివేసాటి.

బహుప్రయోజనకారి కొబ్బరి --
ఫంగస్‌, బాక్టీరియాలనుంచి రక్షణకు తక్షణ ఔషధి కొబ్బరే. ఆయుర్వేద మందుల్లో అధికంగా ఉప యోగించే కొబ్బరినూనె బహువిధ ప్రయోజనకారి.

రుచికరం చెర్రీలు --
ఎన్నో విటమిన్లు, లవణాలకు పుట్టిల్లు చెర్రీ. అంతేనా రుచిలోనూ ఇది రాణి.

రసభరితం ప్లమ్స్‌ --
ఈ రుచికరమైన, తియ్యని, రసయుక్త ఫలాల్లో విటమిన్‌ సి ఎక్కువగా లభిస్తుంది.

శక్తికారకం పాలకూర --
ఐరన్‌, కాల్షియంల మేలు కలయిక పాలకూర. శరీ రంలో ఐరన్‌ లోపాన్ని తగ్గించడంలో బాగా పని చేస్తుంది.

రక్తహీనతకు బీట్‌రూట్‌ --
ఫోలెట్‌, పొటాషియమ్‌, మాంగనీస్‌ సమృద్ధిగా లభించే బీట్‌రూట్‌ చర్మరోగాలను నివారించడంలో సహాయం చేస్తుంది. రక్తహీనతకూ ఇది మందుగా పనిచేస్తుంది.

తీయ మామిడి --
వేసవిలో విరివిగా లభించే మామిడిపండులో పొటా షియమ్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీన్నిష్టపడని పిల్లలుంటారా?

టమాటాలు --
వీటిలో లాకోపెన్‌ అనే యాంటీఆక్సిడెంట్లను ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచ డంలో తోడ్పడతాయి.

చలువ కర్బుజా --
ఎక్కువకాలం పండించే పంటల్లో కర్బుజా పంట కూడా ఒకటి. చలువ చేసే గుణాలున్న ఈ పండు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది.

చేదు మందు కాకరకాయ --
చక్కెర వ్యాధికి చేదైన మందు కాకరకాయ. శరీ రంలో ఎన్నో రుగ్మతలను కేవలం దీని కషాయంతో తగ్గించవచ్చు.

బహుగుణాల బొప్పాయి --
పుష్కలమైన లవణాలు, ఫైబర్‌ను కలిగిఉంటుంది. చర్మ చికిత్సల్లో దీని పాత్ర అధికం. మన దేశంలో ఇది చాలా విరివిగా దొరుకుతుంది.

పుచ్చకాయలో మినరల్స్‌ మెండు--
వేసవిలో చల్లదనాన్నిచ్చే చక్కని పండు ఇది. కొలెస్ట్రాల్‌ లేని ఈ పుచ్చకాయ కళ్లకు కూడా చలువ చేస్తుంది.

పోషక విలువల అరటి --
డిప్రెషన్‌, ఎనీమియా, రక్తపోటు, మెదడు వ్యాధు లకు అరటిపండు దివ్యౌషధం.

బాదామ్‌లు భేష్‌ --
కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించి, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో సహకరిస్తుంది.

గుడ్డు వెరీ గుడ్డు --
ఎన్నో పోషకవిలువలున్న గుడ్డును నిత్యం నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పిల్లలకు తప్పని సరిగా ఇవ్వాల్సిన పోషకాహారం ఇది.

పుట్టగొడుగులు పలురకాలు --
ఇందులో అమైనో ఆసిడ్‌లతోపాటు విటమిన్‌ డి కూడా ఉంటుంది. వీటిలో కొవ్వుశాతం అతి తక్కువ కూడా.

ఉసిరి ఫలసిరి--
మొక్కల సామ్రాజ్యంలో సి విటమిన్‌ను పుష్క లంగా అందించే ఉసిరి సర్వరోగ నివారిణి. పచ్చిగా, కూరల్లో, నూనెగా ఇలా ఎన్నివిధాలైనా దీన్ని ఉప యోగించవచ్చు.

వీటికి దూరంగా ఉండాలి
డాల్డా, నెయ్యి, మీగడపెరుగు, జీడిపప్పు, నూనెతో చేసిన పదార్థాలు.అతిగా నూనెలో వేయించినవి.కూరగాయలు అతిచిన్న ముక్కలుగా కోయడం .ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలను కడగడం .ఎక్కువ మసాలా, కారంతో కూడిన పదార్థాలు వేటిలో ఎంతెంత? బంగాళదుంపతో చేసే కూరల్లో 4% నుంచీ 9% కొవ్ఞ్వ ఉంటుంది. పప్పుతో చేసే దాల్‌మఖనీ మొదలగు పదార్థాలు 3.7% వరకూ కొవ్వును ఉంటుంది.ఉడికించిన అన్నంలో 0.2%, పలావ్‌లో 3.4%, కిచిడీలో అత్యధికంగా 7.4% కొవ్వు పదార్థం ఉంటుంది.ఇక పాలు, పాల పదార్థాల్లో అయితే ఈ శాతం 25.9వరకూ కూడా ఉంది. స్వీట్లలో కూడా ఇంచుమించు ఇదేశాతంలో కొవ్ఞ్వ ఉంటుంది.

for some more details : -> Nutrition and Balanced diet
  • ==========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .