Monday, August 12, 2013

closing Day of Telegraph in India, ఇండియాలో మూయబడిన తంత్రి దినము

  •  

  • గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (15.జూలై-2013 .) -   closing Day of Telegraph in India, ఇండియాలో మూయబడిన తంత్రి దినము - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము 


జులై 15తో టెలిగ్రాఫ్‌కు ముగింపు-సాంేకతికత పెరగడంతో పనికిరాకుండా పోయిన టెలిగ్రాఫ్ ,
తొలి తరంలో ఎంతో కీలక భూమిక--టెలిగ్రాములది 160 ఏళ్ల చరిత్ర,
తొలిసారి 1850లో మన దేశంలో ఏర్పాటు--కొల్‌కతా - డైమండ్ హార్బర్‌ల మధ్య పంపిణీ.

ఇవాళ సాంకేతిక అద్భుతం అనుకున్నది రేపు పాత పద్ధతిగా మారుతుంది. రేపు వచ్చేది.. ఎల్లుండికి కనుమరుగవుతుంది. సమాజంలోకి కొత్త వస్తువులు రావడం పాత వస్తువులు పోవడం సహజం. మనిషి పుట్టుక చావు ఎలానో సాంకేతిక అలాగే . . . ఇలా కాలగర్భంలో కలిసిపోయిన వస్తువులు, పద్దతులు ఎన్నో ఉన్నాయి . ఇక వాటిని మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకోవడమే. తాజాగా చరిత్ర పుస్తకాలకు ఎక్కబోతోంది టెలిగ్రాఫ్‌. .. టెలిఫోన్‌, సెల్‌ఫోన్లు పల్లెలకు విస్తరించడంతో టెలిగ్రాఫ్‌కు ఆదరణ కరువైనది.

ఒకప్పుడు ప్రధాన సమాచార పంపిణీ వ్యవస్థగా ఉన్నది కొద్ది రోజుల్లో అటెకక్కబోతోంది. ఈ సందర్భంగా టెలిగ్రాఫ్‌కు సంబంధించి పలు విశేషాలు... ఆఖరు టెలిగ్రామ్‌ ఆదివారము మధ్యాహ్నం 11 గంటల 45 నిముషాలకి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రసిడెంట్ రాహుల గాంధీ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఢిల్లీ టెలిగ్రాఫ్ ఆఫీషునుండి టెలిగ్రామ్‌ వెళ్ళింది.

ఇప్పుడంటే ప్రతీ వ్యక్తి చేతిలో ఫోన్‌ ఉంది కానీ 18వ శతాబ్దంలో సమాచార మార్పిడికి ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. ఎంతో మంది శ్రమించి 1895లో టెలిగ్రాఫ్‌ విధానం ప్రవేశపెట్టారు. డాట్‌.. డాష్‌.. ఫుల్‌స్టాప్‌ల ఆధారంగా ఇది ఒక చోటి నుంచి మరోచోటికి సమాచారాన్ని పంపిస్తుంది. సాంకేతికత పెరిగిపోవడంతో దీంతో ఉపయోగం లేకుండా మారింది. కానీ 19వ శతాబ్దం ఆరంభంలో టెలిగ్రాఫ్‌ సమాచార పంపిణీలో కీలక పాత్ర పోషించింది. దాదాపు 160 ఏళ్ల చరిత్ర ఉన్న టెలిగ్రాఫ్‌ కథ జులై -15-2013 తో ముగియనుంది.

టెలిగ్రాఫ్‌ అంటే సంకేతాల ద్వారా సమాచారాన్ని పంపించడం. ఈ పద్దతిని కనిపెట్టిన వ్యక్తి మోర్స్‌. అయన పూర్తి పేరు శామ్యూల్‌ ఫిన్లీ బ్రీస్‌మోర్స్‌. ఈయన 1791 ఏప్రిల్‌ 27న అమెరికాలో చార్ట్‌టౌన్‌లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి మోర్సికి బొమ్మలు వేయడమన్నా, చేయడమన్నా చాలా ఇష్టం. ఎప్పుడూ రకరకాల బొమ్మలు చేస్తూనో, రంగులతో బొమ్మలు చిత్రిస్తూనో గడిపేవాడు. అల్లరి అబ్బాయేకాని చదువులో కూడా ముందుండేవాడు. లెక్కలు, సైన్స్‌లను అంతగా ఇష్టపడేవాడు కాదు. అందువల్ల లండన్‌లో పెయింటింగ్‌ నేర్చుకున్నాడు.

1832లో న్యూయార్క్‌ యూనివర్శిటీలో చిత్రకళ ఆచార్యుడిగా ఉద్యోగం చేశాడు. అదే సమయంలో ఎలక్ట్రోమాగ్నెటిక్‌ టెలిగ్రాప్‌ పరికరాన్ని రుపొందించాడు. దీనితో తీగెల ద్వారా, సంకేతాల ద్వారా సమాచారాన్ని పంపించవచ్చు. అందుకోసం ప్రత్యేకంగా సంకేతాలనీ రూపొందించాడు. దానినే మోర్స్‌ కోడ్‌ అంటారు. వాషింగ్‌టన్‌ డిసి, బాల్టిమోర్‌
అనే రెండు ప్రదేశాల మధ్య టెలిగ్రాఫ్‌ లైన్‌ నిర్మించారు. ఆ తరువాత 1844 మే, 24న మోర్స్‌ మొట్టమొదటి టెలిగ్రాఫ్‌ పంపాడు. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రాఫ్‌ వ్యవస్థను విస్తరించి సమాచారాన్ని వేగంగా చేరవేయడంలో సహాయపడింది. చిన్న సంకేతాలను డాట్‌(.) అనీ, దీనికంటే ఎక్కువ కాలవ్యవధి ఉండే సంకేతాలను డాష్‌(-) అనీ పేరు పెట్టి, వీటిద్వారా ఇంగ్లీషు భాషలోని అక్షరాలకు, సంఖ్యలకూ, విరామ చిహ్నాలకు, సంకేతాలను తయారు చేశారు. అమెరికాలో తొలి టెలిగ్రామ్‌ను 1838 జనవరి 11న మూడు కిలోమీటర్ల దూరానికి ప్రయోగాత్మకంగా పంపారు.

దృశ్య టెలిగ్రాఫ్‌
క్రీ.పూ.500 ప్రాంతంలో పర్షియా చక్రవర్తి డేరియన్‌ రాజాజ్ఞలను, వార్తలనూ ప్రకటించడానికి బిగ్గరగా అరవగలిగే వాళ్లను కొండశిఖరాలపై నియోగించేవాడట. గ్రీకులు దృశ్య టెలిగ్రాఫ్‌ విధానాన్ని వాడేవారు. మండుతున్న దివిటీల సముదాయాన్ని పర్వత శిఖరాల నుంచి ప్రత్యేక పద్ధతిలో తిప్పుతూ సంకేతాల ద్వారా అక్షరాలను ఇతరులకు సూచిస్తుండేవారు. కార్తజీనియన్లు, రోమన్లు ఇలాంటి పద్ధతులనే ఉపయోగించారు. ఆఫ్రికాలో మరో పద్ధతి ఇప్పటికీ అమలులో ఉంది. తొర్ర పరిమాణాలు వేరు వేరుగా ఉండే చెట్టు బోదెలతో తయారుచేసిన ఢంకాలను బజాయిస్తే, వివిధ శబ్ద స్వరాలు ఏర్పడతాయి. వీటి సంకేతాల ద్వారా సందేశాలు పంపుతూ ఉండేవారు.

టెలిగ్రాఫ్‌ విధానంలో మార్పులు
మోర్స్‌ విధానాన్ని అమెరికాలో థామస్‌ అల్వా ఎడిసన్‌, జర్మనీలో వెర్నర్‌ సీమెన్స్‌, ఇంగ్లండ్‌లోఆయన సోదరుడు విల్లియం మెరుగుపరచారు. లండన్‌లో జన్మించిన డేవిడ్‌ ఎడ్వర్డ్‌ హగ్స్‌ అనే సంగీత శాస్తజ్ఞ్రుడు మోర్స్‌ కోడ్‌తో నిమిత్తం లేకుండా అక్షరాలను, అంకెలను నేరుగా ప్రసారం చేయగలిగిన టెలిగ్రాఫ్‌ యంత్రాన్ని నిర్మించాడు. పియానోలో ఉన్నట్టుగా ఇందులో ఒక కీ బోర్డు ఉంటుంది. 52 కీ.లు ఉంటాయి. ఒక్కొక్క కీని అదిమినపుడు దానికి అనుగుణంగా ఉండే అక్షరం అవతలి పట్టణంలో ముద్రించబడుతుంది. ప్రస్తుతం మనం విస్తృతంగా వాడుతున్న టెలిప్రింటర్‌ ఈ సాధనం నుండే తయారుచేయబడినది. అనేక దేశాల్లో టెలిగ్రాఫ్‌ యంత్రాల స్థానే టెలిప్రింటర్లు వచ్చాయి. టెలిఫోన్‌ లాగా మనకు కావలసిన సంఖ్యను డయల్‌ చేసి సందేశాలను టెలిప్రింటర్‌ ద్వారా పంపడానికి వీలయింది. నాగరికత అభివృద్ధి చెందటంలో టెలిగ్రాఫ్‌ ఎలాంటి కీలక పాత్ర ధరించిందో, జీవిత విధానంలో ఎలాంటి మూలభూతమైన మార్పులు తీసుకొచ్చిందో ఇదంతా మానవ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. దీని కారణంగా సువిశాల ప్రపంచం కుంచించుకు పోయింది. వార్తలు క్షణాల్లో ప్రపంచం నలుమూలలా వ్యాపించాయి. కాలం, దూరం,అత్యల్పమైపోయింది. మంచికో, చెడ్డకో ప్రపంచ దేశాలన్నీ టెలిగ్రాఫ్‌ తీగలతోనూ, కేబుల్స్‌తోను అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్నాయి. అయితే సాంకేతికత కారణంగా ఈ  బంధం జులై 15తో తెగిపోనుంది.

మన దేశంలో...
1850లో కొల్‌కత్తా, డైమండ్‌ హార్బర్‌ల మధ్య మొదటి ప్రయోగాత్మక విద్యుత్‌ టెలిగ్రాఫ్‌ లైన్‌ ప్రారంభం అయింది. 1851లో దాన్ని బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ కోసం ఆరంభించారు. ఆ కాలంలో ప్రజా పనుల విభాగంలో తంతి(టెలిగ్రాఫ్‌) కూడా ఓ విభాగంగా మారింది. ఉత్తర ప్రాంతంలోని కొల్‌కతా, పెషావర్‌లను ఆగ్రా, ముంబయ్‌ల మీదుగా సిన్ద్వా లోయల ద్వారా, దక్షిణాన ఉన్న చెన్నైతో పాటు ఊటీ ఉదక మండలం, బెంగుళూరులను కలిపే 4,000 మైళ్ల (6,400 కిలోమీటర్ల) టెలిగ్రాఫ్‌ లైన్ల నిర్మాణం నవంబర్‌ 1853లో ప్రారంభమైంది.
భారతదేశంలోని టెలిగ్రాఫ్‌కు మార్గదర్శకత్వం వహించిన డాక్టర్‌ విలియం ఓషౌఘ్నెస్సి ప్రజా పనుల విభాగానికి చెందినవారు. ఆయన ఈ కాలమంతా టెలికాం రంగ అభివృద్ధి కోసమే పనిచేశారు. 1854 నుంచి టెలిగ్రాఫ్‌ సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పెరిగిన సాంకేతికతో ఇక టెలిగ్రాంలతో అవసరం లేదని, వాటికి మంగళం పాడేయాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 2013 జూలై 15నుంచి టెలిగ్రాం అన్న పదం ఇక వినపడదు. విదేశాలకు పంపే టెలిగ్రాంలను రెండు నెలల క్రితమే ఆపేశారు.

తొలి టెలిగ్రాఫ్‌
1794లో తొలిసారిగా పారిస్‌, లిల్లీ నగరాలు మధ్య తొలి చాప్‌ టెలిగ్రాఫ్‌ సంబంధం ఏర్పాటయింది. ఎత్తయిన స్తంభాలు, అక్షరాలు, చిహ్నాల ద్వారా సంకేతాలను తెలియజేసేవారు. మొదటి సారి పారిస్‌ నుంచి 130 మైళ్ల దూరంలో ఉండే లిల్లీ నగరానికి 22 స్తంబాల మీదుగా సందేశాలను పంపడానికి 2 నిమిషాల సమయం మాత్రమే పట్టింది. స్కాట్లండ్‌ వైద్యుడు చార్లెస్‌ మారిసన్‌ విద్యుత్‌ ద్వారా సంకేతాలను ప్రసారం చేయవచ్చని 1753లోనే సూచించాడు.

విశేషాలు
  • 1845 జనవరి ఒకటిన ఓ హత్య జరిగింది. ‘‘సాల్టిల్‌లో ఓ హత్య జరిగింది. హంతకుడు స్లో అనే ప్రాంతంలో రైలు ఎక్కాడు. గోధుమ రంగు కోటు ధరించి ఉన్నాడు’’ అనే టెలిగ్రాఫ్‌ ద్వారా పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇలా అందింది. అప్రమత్తమైన పోలీసులు హంతకుడి పట్టుకున్నారు. కోర్టు ఉరి శిక్ష వేసింది. టెలిగ్రాఫ్‌ తీగలే ఉరితీశాయని ప్రజలు బాహాటంగా చెప్పుకున్నారు. 
  • తొలిసారిగా 1848లో హాంబర్డ్‌, కక్స్‌ హావన్‌ మధ్య మోర్స్‌ టెలిగ్రాఫ్‌ సౌకర్యం ఏర్పాటయింది.
  • 1895లో ఫ్రాన్స్‌ లో ఆల్బెర్ట్‌ టర్‌పైన్‌ అనే శాస్తజ్ఞ్రుడు మోర్స్‌ కోడ్‌ ఉపయోగించి 25 మీటర్ల దూరం వరకు రేడియో సంకేతాలను ప్రసారం, గ్రహించడం చేశాడు.
  • 1897, మే 17న ఇటలీలో మార్కోనీ అనే శాస్తజ్ఞ్రుడు 6 కి.మీ వరకు రేడియో సంకేతాలను పంపించగలిగాడు. మార్కోనీ కాడిఫ్‌ తపాలా కార్యాలయ ఇంజనీర్‌ సహకారంతో మొదటి వైర్‌లెస్‌ సంకేతాలను నీటి పైనుండి లివర్‌నాక్‌ నుండి వేల్స్‌ వరకు ప్రసారం చేయించాడు.
  • మన దేశంలో 1902లో సాగర్‌ ఐలాండ్స్‌, సాండ్‌ హెడ్‌‌‌‌స మధ్య మొట్టమొదటి వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ కేంద్రం ప్రారంభం అయింది.
  • సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లోని తమ రాజ భవనానికి మాత్రం టెలిగ్రాఫ్‌ సౌకర్యాన్ని కల్పించడానికి జార్‌ అనుమతి ఇచ్చాడు. కానీ తీగలు బయటి నుంచి ఎవరికీ కనబడరాదన్న షరతును విధించాడు. కార్ల్‌ సీమెన్స్‌ అతని అభీష్టం మేరకు నీటి గొట్టాల పక్కన తీగ అమర్చాడు. దీంతో ప్రభావితుడైన జార్‌ రష్యా అంతటా టెలిగ్రాఫ్‌ తీగల ఏర్పాటుకు అంగీకరించాడు.
  • 1850 : మొట్టమొదటి టెలిగ్రాఫ్‌ లైన్స్‌ కలకత్తా నుంచి డైమండ్‌ హార్బర్‌ వరకు ప్రారంభమయ్యాయి.
  • 1851 : ఈస్ట్‌ ఇండియా కంపెనీ అవసరాల కోసం టెలిగ్రాఫ్‌ విధానం అందుబాటులోకి వచ్చింది.
  • 1853 : టెలిగ్రాఫ్‌ కోసం ప్రత్యేక విభాగం ఏర్పడింది. ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
  • 1854 : దేశం మొత్తం మీద నాలుగు వేల మైళ్ల టెలిగ్రాఫ్‌ లైన్లు నిర్మాణం జరిగింది.
  • 1885 : ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం అమల్లోకి వచ్చింది.
  • 1902 : సాగర్‌ ఐలాండ్‌, శాండ్‌ హెడ్‌ ల మధ్య తొలి వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ స్టేషన్‌ ఏర్పాటైంది.
  • 1927 : ఇండియా, యుకె మధ్య రేడియో టెలిగ్రాఫ్‌ వ్యవస్థ ప్రారంభమైంది.
  • 1995 : భారత్‌లో ఇంటర్నెట్‌ వ్యవస్థ ఆరంభం.

===========================
collected by Dr.Seshagirirao(Srikakulam)
  • =============================
Visit My Website - > Dr.seshagirirao.com/

U.T.F formation Day , యూటీఎఫ్ ఆవిర్భావ దినము .

  •  

  •  
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.10- ఆగస్ట్.) -U.T.F formation Day ,  యూటీఎఫ్  ఆవిర్భావ దినము .- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము



ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ మొదటిగా 10- ఆగస్ట్ 1974 లో అమలాపురము లో స్థాపించబడి ఆగస్ట్ 20 న కాకినాడలో రిజిస్ట్రేషన్‌ చేయబడినది. అక్టోబర్ 20 ,21 -1974 లో రాజమండ్రిలో యు.టి.ఎఫ్ ప్రధమ మహా సభ జరిగినది . 1974 నవంబర్ 03 న వేతన స్తంభన సదస్సు(హైదరాబాద్ ) లో యు.టి.ఎఫ్ పాల్గొన్నది.

1975 జనవరిలో ఐక్య-ఉపాధ్యాయ పత్రిక స్థాపన , యు.టి.ఎఫ్ ఆఫీషు విజయవాడకు మార్పు జరిగినది. 1975 జనవరి 11 & 12 తేదీలలో ఖాజీపేటలో తెలంగాణా  జిల్లాల సదస్సు నిర్వహణ , 1975 ఫిబ్రవరి 10 న యు.టి.ఎఫ్ పక్షాన మహా విజ్ఞాపన పత్రము సమర్పణ , 1975 సెప్టెంబర్ లో యు.టి.ఎఫ్ చే 15 వేల సంతకాల తో  కార్డు క్యాంపెయిన్‌,1976 ఏప్రిల్ లో నేటివిటీ ఉత్తర్వు , నిర్భంద రిటైర్ మెంట్ పై 2 వేల సంతకాలతో విజ్ఞప్తి , 1976 సెప్టెంబర్ లో పనిదనముల పెంపు పై యు.టి.ఎఫ్ గుంటూరు సదస్సు ... మున్నగు అనేక ఉపద్యాయ సమస్యలు పరిష్కరించడములో పాలుపంచుకొన్నది. తన సేవలను ఉపాధ్యాయ సంక్షేమము కొరకు అందిస్తూనే ఉన్నది.

 శ్రీకాకు్ళం లో వజ్రవుకొత్తూరు మరడలర వూండిగల్లీలో శనివారము  యూటీఎఫ్ ‌ ఆవిర్భావ దిన పేడుకలు నిర్వహించారు. ఆ శాఖ అధ్యక్షుడు కె.రపేుష్‌ అధ్యక్షతన జరిగిన పేడుకల్లో శాఖ జిల్లా కార్యదర్శి బి.చిట్టిబాబు మాట్లాడుతూ 1974 ఆగస్టు 10న ఏర్పాటైన యూటీఎఫ్ ‌ ఉపాధ్యాయ సమస్యలవై అలువెరగని పోరాటర చేసిరదన్నారు.

  • వీఆర్‌సీల సాధన,
  • నేషనల్‌ ఇంక్రిమెంట్లు,
  • ప్రమోషన్లు.......
వంటి కీలక సమస్యలవై రాజీలేని పోరాటం చేసి సాధించిన ఘనత యూటీఎఫ్  ‌దేనన్నారు. వ్రధాన కార్యదర్శి పేణుగోపాల్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆదరాభిమానాలతో రాష్ట్రంలోని అతివెద్ద ఉపాధ్యాయ సంఘంగా ఏర్పడిందని చెప్పారు. ఇందులో డి.రామారావు, కె.కేశవనారాయణ, ఎం.మోహనరావు, వి.రవికుమార్‌, కె.సింహాచలం, శ్రీరాములు  తదితరులు ఉన్నారు.

  • ============================
 Visit My Website - > Dr.seshagirirao.com/

Monday, May 27, 2013

Taekwondo day, తైక్వాండో దినోత్సవం

  •  

  •  
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (4th July) -Taekwondo day, తైక్వాండో దినోత్సవం - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

The Taekwondo Day was established as the 4th of September in July 2006, to commemorate the day that Taekwondo became officially an Olympic sport.

Taekwondo was chosen as Olympic sport on the 4th of September of 1994, at the 103rd IOC General Assembly, during the period from Sydney 2000 until Rio de Janeiro 2016.

The first Taekwondo Day event was celebrated on the 4th of September 2006 at the Olympic Park of Seoul, and it has been celebrated yearly since then.

అతివలపై అకృత్యాలు పెరుగుతున్న సందర్భంలో ఆత్మరక్షణ విద్యల ప్రాధాన్యత పెరిగింది. ప్రతిచోట మన రక్షణ కోసం ఎవరో ఒకరు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుేక జరిగే హింసను మౌనంగా భరించకుండా ‘కౌంటర్‌ అటాక్‌’ చేయడం వంటి మెలకువళను నేర్చుకోవాలి. తైక్వాండో మార్షల్‌ ఆర్ట్‌లో ప్రావీణ్యత సంపాదించడం వల్ల ఆత్మరక్షణ నమ్మకంతో పాటు, ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపవుతుంది. ‘తైక్వాండో’ ఆత్మరక్షణ విద్య గురించి మరిన్ని వివరాలు.

తైక్వాండో గురించి...
--తైక్వాండో అనేది కొరియాకు చెందిన ఒక ఆత్మరక్షణ విద్య. ఇది కొరియా దేశ జాతీయ క్రీడ కూడా. ‘తై’ అంటే ‘ కాలితో కొట్టడం లేదా దాడి చేయడం’ అని, ‘క్వా’ అంటే ‘పిడికిలి తో దాడి చేయడం’, ‘డో’ అంటే ‘దాడి చేసే విధానం..లేదా పద్ధతి’ అని అర్థం. మొత్తానికి ‘తైక్వాండో’ అంటే ‘కాలిని, చేతి ని వాడి దాడి చేయడం’ అని అర్థం వస్తుంది. తైక్వాండో ఆత్మరక్షణ విద్యతో పాటు ఒక క్రీడ, ఒక వ్యాయామం కూడా. కొన్ని సందర్భాలలో దీన్ని ‘ధ్యానం’, ‘ఫిలాసఫీ’గా కూడా చెబుతుంటారు. ఇది 1989లో అత్యంత పాపులర్‌ మార్షల్‌ ఆర్ట్‌గా ఎదిగింది. తైక్వాండోలో కింగ్‌ టెక్నిక్‌లపై ప్రాధాన్యత ఉంటుంది. అయితే దీనికీ కరాటే, కుంగ్‌ఫూకి చాలా తేడా ఉం టుంది. కొరియా దేశ వాసులు అనాది నుంచే తమ చేతులను అద్భుతమైన ఆయుధంగా భావించే వారు. అందుకే తైక్వాండో లో చేతులతో చేసే దాడికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.

మహిళల కోసం...
--ఆత్మరక్షణ కోసం మహిళలకు తైక్వాండో చాలా ఉపయోగక రంగా ఉంటుంది. పరిస్థితిని గమనించి వెంటనే స్వందించే అవకాశం ఉంటుంది. అపాయకరమైన సమయంలో ఎలా తమను తాము తమాయించుకోవాలి, ఎప్పుడు ప్రతిదాడికి సిద్ధం అవ్వాలి, శరీర భాగాల్లో ఎక్కడ దాడి చేయాలి వంటి విషయాలు తైక్వాండో నిపుణులు విపులంగా తెలియజేస్తారు. దాడి జరిగినప్పుడు వెంటనే స్పందించే వేగాన్ని సాధించవచ్చు. ఆత్మరక్షణ క్రీడలలో మహిళ భాగస్వామ్యాన్ని పెంచేలా నిపుణులు తోడ్పడతారు.

తైక్వాండో క్లబ్‌లు...
మనదేశంలో చాలా చోట్ల తైక్వాండో క్లబ్‌లు ఉన్నాయి. క్లబ్‌లో అడుగుపెటడంతోనే శిక్షణ ప్రారంభమౌతుంది. సాధన చేసే వారిని చూసి కసి పెరుగుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్న కొంత మంది మహిళలు తైక్వాండో క్లాస్‌లో చేరి తమ ఆరోగ్యాన్ని పెంచుకున్నారు. ఈ మార్పును చూసి వైద్యులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా మంది ఇందులో సాధన ప్రారంభించి బ్లాక్‌బెల్ట్‌ సాధించి గానీ వదలరు. ఇందులో బోర్టు బ్రేకింగ్‌ అనే ఫీట్‌ కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటుంది.అయితే సాధన చేస్తే ఇందులో ఎక్స్‌పర్ట్‌ కావచ్చు. వారానికి 3-4 సార్లు సాధన చేస్తే చాలు. కొందరైతే రోజుకు రెండుసార్లు, గంటల కొద్ది సాధన చేస్తారు.

సేవ్‌ యువర్‌ సెల్ఫ్‌...
--నేడు మహిళలు ఇంటినుంచి బయటికి వెళ్లాలంటేనె చాలా సార్లు ఆలోచిస్తున్నారు.వెళ్లలేక కాదు. బయట ఎప్పుడు ఏంజరుగుతుందో అనే భయంతో.బయటికి వెళ్తే చాలు టీజింగ్‌లు వంటి అనేక సమస్యలు నేడు మహిళలు ఎదుర్కొంటున్నారు. అయితే తైక్వాండో నేర్చుకోవడం వల్ల (తైక్వాండో లాంటి మరే ఆత్మ రక్షణ విద్యనైనా) మిమ్మల్ని మీరు రక్షించుకోగలరనే నమ్మకం కలుగుతుంది. అంతులేని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం లో ఉపయోగకరంగా ఉంటుంది.

ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఈ విద్యను నేర్చుకునే సమయంలో మన శరీరం సరికొత్త ఆకృతిని సంతరించుకుంటుంది. ఈ కోర్సు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ మార్పును గమనించవచ్చు.అంతులేని ఆత్మవిశ్వాసాన్ని సాధించవచ్చు.తైక్వాండోలో ప్రావీణ్యం పొందాలను కునే వారు మంచి నిపుణుల వద్ద చేరాలి. డాక్టర్‌ను సంప్రదించి ఈ విద్యను నేర్చుకోవడానికి ఆరోగ్యపరమైన సమస్యలు ఏవీ లేవుకదా అనే అంశాన్ని నిర్దారించుకోవాలి. ఏ పోరాట విద్య అయినా.... అది ఆత్మరక్షణకు మాత్రమే అని గమనించాలి.

తైక్వాండో వల్ల ప్రయోజనాలు...
--*తైక్వాండో ఆత్మరక్షణ విద్య వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. *ప్రపంచంతో పోటి పడి గెలవగలం అనే నమ్మకం ఏర్పడుతుంది కూడా.    *తైక్వాండో సాధన చేయడం వల్ల మహిళలలో శారీరకంగా ఫిట్‌నెస్‌ కలుగుతుంది. *బరువు కంట్రోల్‌లో ఉంటుంది...కొంచెం తగ్గుతుంది కూడా.* రెగ్యులర్‌గా సాధన చేయడంతో శరీరం చక్కని ఆకృతిని సంతరించుకుంటుంది.    *తైక్వాండో వల్ల గుండెకు సంబంధించిన క్రియలు చక్కగా జరుగుతాయి.   *శ్వాసతీసుకునే విధానం మెరుగువౌతుంది. *హాయిగా నిద్రపోవచ్చు. *మీలో ఏదో కొత్త శక్తి వచ్చినట్టు     ఉత్సాహాంగా ఉండగలుగుతారు.    *స్ట్రెస్‌ మాయం అవు తుంది. *మానసికంగా ఫిట్‌ అవుతారు.    *సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంలో ఎంతగానో ఉపకరిస్తుంది.    *ప్రమాదకర సంద ర్భాల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుస్తుంది.    *రెగ్యులర్‌గా సాధన చేయడంతో ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది.
    ఇవి కేవలం కొన్ని లాభాలు మాత్రమే. ఇంకా ఎన్నో విధాలుగా తైక్వాండో మీకు ఉపయోగ పడగలదు.

    నేర్చుకోవాలనుకునే వారు...

    తైక్వాండో సాధన ప్రారంభించడానికి మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రవేశం ఉండాల్సిన అవసరం లేదు. టీనేజి నుంచి 45 సంవత్సరాల మహిళల వరకు ఎవ్వరైనా సాధన ప్రారంభించవచ్చు.
    కంఫర్ట్‌గా ఉన్న దుస్తులు ధరించాలి. అథ్లెట్‌ షూస్‌ వాడాలి. అయితే సాండిల్స్‌, హై హీల్స్‌, ఫ్లిప్‌-ఫ్లాప్‌లు ధరించరాదు.
    నిస్సందేహంగా పెళ్లైన వారు తైక్వాండో నేర్చుకోవచ్చు.
    తైక్వాండో కాంపిటీషన్‌లో భాగం తీసుకొనే వారు తైక్వాండో యూనిఫార్మ్‌ను ధరించాలి.

    స్కూల్‌ను ఎంచుకునే ముందు...
 
    ముందు మీరు ఆత్మరక్షణ కోసం తైక్వాండో నేర్చుకుంటున్నారా, లేక మంచి శరీరాకృతి కోసమా, లేదా ఒక వ్యాయామం కోసమా అని తేల్చుకోవాలి. మీ ప్రాధాన్యతను బట్టి ట్రైనర్‌ మీకు ఆయా అంశాలలో ప్రాధాన్యతనిస్తారు.
    మీరు జాయిన్‌ అయ్యే స్యూల్‌లో మంచి ఇన్‌స్ట్రక్టర్‌ ఉన్నాడా లేదా అనేది పరిశీలించాలి.
    మీకు ట్రైనింగ్‌ ఇవ్వబోయే వ్యక్తికి ఎంత వరకు పరిజ్ఞానం ఉందో కనుక్కొవాలి.
    ట్రైనింగ్‌లో ఎలాంటి అంశాలపై ప్రాధాన్యత ఇస్తున్నారో కనుక్కోవాలి.

Courtesy with Surya Telugu daily news paper
  •  ================ 
Visit My Website - > Dr.seshagirirao.com/

Friday, May 24, 2013

International Biodiversity Day,నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం

  •  
  •  

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.మే 22.) -International Biodiversity Day,నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం  - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము



మే 22 తేదీని అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంగా, 2010ని అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని ప్లానెటరీ సొసైటీఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యదర్శి ఎన్‌ రఘునందన్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఆక్టివిజమ్‌(సిఇఎ), సొసైటీఫర్‌ హ్యూమన్‌ అవేర్‌నెస్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (షార్డ్‌), అట్లాంటా ఫౌండేషన్‌ సహకారంతో శనివారం నుంచి జూన్‌ 5 వరకు జీవవైవిధ్యానికిసంబంధించిన వీడియోలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పేర్కొన్నారు.


భూమిపై జీవాల మధ్య భేదాన్నే 'జీవవైవిధ్యం' అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అంతెందుకు మీలో ఎంతమంది 'పిచ్చుక'ను చూశారు? చాలామంది చూడలేదనే చెపుతారు కదూ! ఇదివరకూ ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి. రాను రానూ అవి కనుమరుగైపోతున్నాయి. నేడు అంతర్జాతీయ 'జీవవైవిధ్య దినోత్సవం'.  ఈ నెల 20వ తేదీన 'పిచ్చుకల దినోత్సవం' కూడా. మరి ఈ సందర్భంగా మన దేశంలో 'జీవవైవిధ్యం' గురించి, అందులో పిచ్చుకమ్మ పరిస్థితి ఎలా ఉందో ఏమిటో తెలుసుకుందాం.

ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో మనదేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు మనదేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్రతీరాలను అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు.

వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు మనదేశంలో అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం. అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి.

విశేషమేమిటంటే.. మన దేశంలో ఆదివాసులు(గిరిజనులు, కొండజాతి ప్రజలు)  ఎక్కడున్నారో అక్కడ జీవవైవిధ్యం ఎక్కువగాను, పదిలంగాను ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువమందే ఆదివాసులు నివసిస్తున్నారంట. వారిలో దాదాపు 53 తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరాం,అరుణాచల్‌ప్రదేశ్‌లో 80 శాతానికంటే ఎక్కువమంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటలలో వైవిధ్యాలు, రకాలు, ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాలలోనే అధికం. ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యుమార్పిడివల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్య యనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశ పెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఎలా కాపాడుకొందాం..?

మన జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. జంతువుల్ని, మొక్కల్ని పరిరక్షించుకోవాలి. చాలా మంది జంతువుల చర్మాలతో చేసే వస్తువుల్ని వాడుతుంటారు. దీన్ని మానుకోవాలి. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.

పిచ్చుక

ఏదేమైనా అంతరించిపోతున్న పక్షుల జాబితాలో మన పిచ్చుకమ్మ కూడా చేరిపోయింది. పాపం కదూ! ఇక పిచ్చుక విషయానికొస్తే... పిచ్చుకను ఇంగ్లీషులో స్పారో అంటారు. ఇది చిన్ని పక్షి. కొంచెం బొద్దుగా, గోధుమరంగు ఈకలు ఉంటాయి. ఈకల చివర్లలో ముదురు గోధుమరంగుతో చిత్రకారుడు చిత్రించినట్లే ఉంటాయి. పొట్ట భాగంలో తెలుపురంగు ఉంటుంది. దీని తోక పొట్టిగా ఉంటుంది. ముక్కు మాత్రం చాలా గట్టిగా ఉంటుందర్రా! వడ్డు గింజల్ని మనం కూడా అంత వేగంగా వలవలేం. ఇది మాత్రం ముక్కుతో టక్కున వలిచి, గింజను గుటుక్కున మింగేస్తుంది. ఇది చిన్ని చిన్ని పురుగుల్ని కూడా తింటుందర్రా! దీని నాలుకలో గట్టి ఎముక ఉంటుందంట.

ప్రాచీనకాలంలో అసలు ఈ పిచ్చుకలు యూరప్‌, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో బాగా ఉండేవి. ఆస్ట్రేలియా, అమెరికాకు కూడా విస్తరించి అక్కడ పట్టణాల్లో బాగా స్థిరపడిపోయాయంట. అమెరికా పిచ్చుకలు ఆధునిక పిచ్చుకలకు నాటి పిచ్చుకలకు కొన్ని పోలికలున్నా తేడాలు చాలానే ఉన్నాయంట. మానవుడి జీవనశైలిలో వచ్చిన మార్పులు 'పిచ్చుకపై బ్రహ్మస్త్రం'గా పరిణమించింది. పట్టణీకరణ, చెట్లు తగ్గిపోవడం, రసాయనాల వాడకం అధికం కావడం వంటి
కారణాలు కూడా ఇవి అంతరించి పోవడానికి దారితీశాయి. ప్రధానంగా సెల్యూలర్‌ టవర్లు  నుంచి వెలువడే అయస్కాంతతరంగాలు పిచ్చుక జాతికి ముప్పుగా  మారిందంట. నిజమైన పిచ్చుకలలో ఇంచుమించుగా 35 జాతులున్నా పిచ్చుక తన గూడును ఎంతో అందంగా నిర్మించుకుంటుంది. కానీ నేటి పరిస్థితుల్లో వీటిని రక్షించుకోవాలంటే కృత్రిమమైన పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేయాలంటున్నారు మన శాస్త్రవేత్తలు.

    'ఈ భూప్రపంచం ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చగలదు. కానీ దురాశను తీర్చడం మాత్రం సాధ్యం కాదు'-----    -మహాత్మాగాంధీ
    'ఈ భూమిపై తేనెటీగలు పూర్తిగా అంతరించిపోయిన నాలుగు సంవత్సరాలకు మానవజాతి మిగలకపోవచ్చు' -----    - ఐన్‌స్టీన్‌

 Srikakulam

  ప్రకృతి మన నేస్తం-పర్యావరణ రక్షణలో సిక్కోలు సైతం..మూగజీవాలకు అంతులేని కష్టం పర్యావరణ పరిరక్షణ.. ఇప్పుడిది మానవాళికి అత్యవసరం..పచ్చదనం హరించుకుపోతూ.. పర్యావరణానికి నేస్తాలయిన జంతువులు, పక్షులు మృత్యువాత పడడంతో విశ్వం మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాలకు కారకుడు బుద్ధిజీవిగా పేరొందిన మనిషేనన్న కఠోర నిజం ఆలోచింపజేయాల్సిన తరుణమిదే. విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శనల్లో పర్యావరణ
హితానికే ఎక్కువ కల్పిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య సదస్సులను ఏర్పాటు చేసి ప్రపంచానికి అవగాహన కలిగిస్తోంది. ఇందులో సిక్కోలు కూడా  'మేము సైతం' అంటోంది. మంగళవారం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం'

జిల్లాలో 70.767 హెక్టార్ల అటవీ విస్తీర్ణముంది.. జిల్లాలో 50 రకాల జంతుజాతులు, 122 రకాల పక్షులు, 35 రకాల సర్ప జాతులు ఉన్నాయి. అందులో ప్రధానమైన వన్యప్రాణులు వివిధ సమస్యల మూలంగా మృత్యువాత పడుతున్నాయి.

సిక్కోలు జీవవైవిధ్యం.. చిన్నారి హితులు
* తేలినీలాపురం.. జీవవైవిధ్యంలో మన జిల్లా ప్రాధాన్యానికి చక్కని ఉదాహరణ. సుమారు 5 వేల కిలోమీటర్ల దూరంలోని సైబీరియా నుంచి ఇక్కడకు వచ్చిన విహంగ నేస్తాలను చూసేందుకు ఏటా పాఠశాల చిన్నారులు వెళ్తుంటారు.

* ఎక్కడ నుంచో మన జిల్లాకు వచ్చిన వయ్యారిభామ, గుర్రపుడెక్క, ఈఫటోరియం, సర్కారుతుమ్మ మొదలైనవి విస్తరించి.. స్థానికంగా మొక్కల పెరుగుదలకు ఆటంకంగా మారి, మనకు వ్యాధులు కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పలుచోట్ల పాఠశాల చిన్నారులు వయ్యారిభామ మొక్కలను పుష్పాలు రాకముందే తగలబెడుతూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు.

* కాశీబుగ్గ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులు రుషీకేశ్‌, ధనుష్‌ 'వ్యర్థంతో అర్థం' అనే ప్రాజెక్టును తయారు చేశారు. మన ఇళ్లల్లో ఉన్న చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేయడం. తడి చెత్త నుంచి వ్యర్థ ఆహార పదార్థాలతో వంటగ్యాస్‌ తయారీ, పొడిచెత్తను మళ్లీ   ఉపయోగించడం, పునఃశ్చక్రియ చేయడాన్ని వివరించారు.

* ఇదే పాఠశాలకు చెందిన శిరీష ప్రాజెక్టు 'అలల నుంచి విద్యుత్తు' ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి విజ్ఞాన ప్రదర్శనలో చోటుచేసుకుంది.

* జిల్లాలో ఇలాంటి పర్యావరణమిత్రులు చాలా పాఠశాలల్లో ఉన్నారు

వెంటాడుతోన్న నిర్లక్ష్యం
* ప్రధాన నీటి వనరులుగా ఉన్న తమిరి చెరువు, సుంకిడి సాగరం, గంగాసాగరం, మహేంద్రతనయ నదితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువుల వద్దకు వన్యప్రాణులు వస్తున్నాయి.

* వన్యప్రాణులు నివసించే మహేంద్రగిరుల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేయకపోవడం, ఆక్రమణలు, ఇతర సమస్యల మూలంగా చిన్న చెరువులు, కాలువలు మాయమవడంతో వీటి మనుగడకు ముప్పు ఏర్పడింది.

* కాశీబుగ్గ అటవీ రేంజి పరిధిలో 7811 ఎకరాల విస్తీర్ణంలో జింక, దుప్పి, అడవి పంది, కుందేలు, హైనా తదితర 20కి పైగా జంతు జాతులు, నెమలి, కంసుపిట్ట, అడవికోడి తదితర 35 రకాల పక్షిజాతులు మహేంద్రగిరుల్లో ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో జింకలు, దుప్పిలు, కుందేళ్లు, అడవి పందులు, నెమళ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి.

* బీల ప్రాంతంలో పాముల మెట్ట, కాకులమెట్టల పరిధిలో మొక్కలు, చెట్లు తొలగించడంతో అడవి పందులు పొలాలపై పడి ధ్వంసం చేస్తున్నాయి. గత ఖరీఫ్‌తోపాటు.. ప్రస్తుతం రబీలో వరి పంట అడవి పందుల దాడికి పెద్దఎత్తున నష్టపోయింది.

* మహేంద్రగిరుల్లో ఆహారం కొరత, మంచినీరు దొరక్కపోవడంతో ఎలుగుబంట్లు ఉద్దానం, తీరప్రాంత గ్రామాల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. ఎర్రముక్కాం, సిరిమామిడి, మామిడిపల్లి, దున్నూరు, లోహరిబంద గ్రామాల్లో ఇళ్లల్లో చొరబడి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఆరు నెలల కాలంలో ఐదుగురు వ్యక్తులు ఎలుగుబంట్ల దాడికి గురై గాయాలపాలయ్యారు.

పంట రక్షణ పేరిట..
పంట పొలాలు, చెరుకు తోటలు, దుంప, కూరగాయలు, ఇతర వ్యవసాయ పంటలను వన్యప్రాణుల నుంచి రక్షించుకునే పేరిట గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే చర్యలకు ఎక్కువ జంతువులు బలవుతున్నాయి. బాతుపురం, మాలగోవిందపురం, కోష్ఠ, బోగాబెణి, భోగాపురం, కళింగదళ, కృష్ణాపురం, కుంబరినౌగాం, గురంటి, కొనక, సాబకోట, గంతరు, గూండాం, పొత్తంగి, కిల్లోయి, ఎం.ఎస్‌.పల్లి, జె.భైరిపురం, జలంత్రకోట, జె.శాసనాం, రామకృష్ణాపురం, సుంకిడి, బుషాభద్ర, పొత్రఖండ తదితర ప్రాంతాల్లో విద్యుత్తు తీగలు ఏర్పాటు చేస్తున్నారు. అడవిపందులు, జింక, దుప్పిలను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. కంచిలి మండలంలో క్వారీల పేలుళ్ల ప్రభావం వన్యప్రాణుల పాలిట శాపంగా మారింది. రిజర్వు అటవీ ప్రాంతంలో ఎటువంటి పేలుళ్లు చేపట్టకూడదన్న అంశాన్ని పెడచెవిన పెట్టారు. సోంపేట, కంచిలి, మందస లాంటి మండల కేంద్రాల్లో సైతం అధికసంఖ్యలో కోతులు చొరబడుతున్నాయి.

కలప దొంగలు..
మహేంద్రగిరుల్లో దట్టంగా పెరిగిన అటవీ ప్రాంతంలో ఉన్న విలువైన కలప అక్రమ నరికివేతకు గురవుతున్నాయి. మద్ది, టేకు, ఇరుగుడు, తెల్ల గుమ్మడి, మామిడి, నరమామిడి, నీలగిరి, వెదురు నరికివేసి అక్రమ రవాణా సాగిస్తున్నారు.

కంటితుడుపు చర్యలే..
కాశీబుగ్గ రేంజి పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో 20 వేలకుపైగా వన్యప్రాణులు ఉండగా వాటికి నీటి ఏర్పాట్ల కోసం కేవలం రూ. 50 వేలు మంజూరు చేశారు. ఈ మొత్తాలతో నాలుగైదు నీటి కుండీలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి లేదు.

వన్య ప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు
జీవవైవిధ్యానికి విఘాతం కలిగించి వన్యప్రాణుల ఉనికికి ముప్పు కలిగిస్తే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. వివిధ కారణాలతో వన్యప్రాణులు జనావాసాల మధ్యకు రావడం పరిపాటిగా మారింది. తాగునీటికోసం గ్రామాలవైపు వస్తున్న మూగ జీవాలపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవు. వన్యప్రాణులను వేటాడిన వారికి వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వివిధ కేసులు నమోదు చేస్తాం. వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తే అటవీ శాఖాధికారులకు సమాచారమివ్వాలి. అడవుల నరికివేతతోపాటు సహజసిద్ధంగా ఉన్న నీటి వనరులు నాశనం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్న సమాచారాన్ని ఇస్తే కఠినంగా వ్యవహరిస్తాం.----అరుణ్‌ ప్రకాశ్‌, అటవీశాఖ రేంజర్‌, కాశీబుగ్గ

పర్యావరణం, జీవావరణానికి ముప్పు
పాలకుల చర్యలతో పర్యావరణం, జీవావరణానికి పెనుముప్పు ఏర్పడింది. అడవులను కాపాడాల్సిన ప్రభుత్వాలే వాటిని గనులు, ఇతర అంశాలకు కేటాయించి జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నారు. జిల్లాలో అపారమైన చిత్తడి నేలలు, అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ వాటి రక్షణ కోసం చర్యలు తీసుకోకపోవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడి ప్రాణాలు కోల్పోతున్నాయి.----బీన ఢిల్లీరావు, ప్రధాన కార్యదర్శి, పర్యావరణ పరిరక్షణ సంఘం,స్వేచ్ఛావతి.. స్వర్ణముఖధారి


courtesy with : న్యూస్‌టుడే - పలాస పట్టణం, సోంపేట/కంచిలి

  • =======================
 Visit My Website - > Dr.seshagirirao.com/

Saturday, May 4, 2013

Frist Andhra meet of 100 years , ప్రథమాంధ్ర మహాసభ శతజయంతి



  •  



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.....) -Frist Andhra meet of 100 years  , ప్రథమాంధ్ర మహాసభ శతజయంతి- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము




సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం శాతవాహనుల సామ్రాజ్యం విస్తరించిన కాలంలో తెలుగు భాష, సంస్కృతిల వికాసం ప్రారంభమైంది. శాతవాహనులు తెలుగు ప్రజల సంస్కృతీ వికాసానికి ఎనలేని కృషి చేశారు. శాతవాహనుల సామ్రాజ్యం అంతమైన తరువాత తెలుగు నేల చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఆ తరువాత విదేశీ దాడులమూలంగా తెలుగు ప్రజలు తమ అస్తిత్వాన్ని కోల్పో యారు. పరాయి పాలనలో తెలుగు భాష, సంస్కృతిలకు గ్రహణం పట్టింది. తెలుగునేలలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిష్‌వారి పాలనలో మద్రాసు రాష్ట్రంలో ఉండగా, తెలంగాణ జిల్లాలు హైదరాబాద్‌ రాజ్యంలో ఉండేవి. ఇరవ య్యవ శతాబ్దం ప్రారంభం దాకు తెలుగువారికి ఒక అస్తిత్వం, గుర్తింపు ఉండేవి కావు. 1913లో బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ జరిగిన అనంతరమే తెలుగునేలలో స్వాతంత్య్రోదమ్య స్ఫూర్తి రగిలింది. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు అనేకమంది మహనీయులు నడుంబిగించారు.

తెలుగువాడి వాణి, తెలుగువాడి జీవం ఆంధ్ర మహాసభలే. ఆంధ్ర భాష, ఆంధ్ర సంస్కృతి ఈ సభల ద్వారా అభివృద్ధిలోకి వచ్చాయి. ఆంధ్రోద్యమానికి ఇవి ఆయువుపట్టులాంటివి. ఈ ఆంధ్ర మహాసభలకు బాపట్లలోనే అంకురార్పణ జరిగింది. ఆంధ్రోద్యమానికి బీజం బాపట్ల గడ్డమీదే పడింది. బాపట్లే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర భావనకు నారుపోసింది. ఆంధ్రుల స్వరాష్ట్ర వాంఛకు బాపట్ల రూపురేఖలు దిద్దింది. ఆంధ్రుల హృదయాలలో మోసులెత్తిన అభిమాన, చైతన్యాలకు బాపట్ల ముత్యాల పందిరి వేసింది. తెలుగువారి వ్యక్తిత్వం, ఆంధ్రభాష గుర్తింపు కోసం కృషి చేయాలన్న పూనిక బాపట్లలోనే జరిగింది.

19వ శతాబ్దం ప్రారంభానికి కోస్తా రాయలసీమ జిల్లాలు ఆంగ్లేయుల పాలన క్రింద మద్రాసు రాష్ట్రంలోను, తెలంగాణా ప్రాంతం అసఫ్‌జాహీ రాజుల పాలనలో హైదరాబాద్‌ రాష్ట్రంలోను ఉన్నాయి.

ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభం దాకా ఆంధ్రులకొక ప్రత్యేక అస్తిత్వం, గుర్తింపు ఉండేవికావు. వారిని 'మద్రాసీ'లుగానే ఉత్తర భారత ప్రాంతంలో వ్యవహరించేవారు, స్వదేశీ, వందేమాతరం ఉద్యమాలతో తెలుగుజాతి జాగృతమైంది.

1908లో బొంబాయి నుండి కాశీనాధుని నాగేశ్వరరావు సారథ్యంలో 'ఆంధ్రపత్రిక', ముట్నూరి కృష్ణారావు సారథ్యంలో బందరు నుండి 'కృష్ణాపత్రిక' వెలువడటం ఆంధ్రోద్యమానికి దోహదం చేసింది. 1908లో బందరులో తొలిసారిగా ఆంధ్ర మహాసభ అంటూ ఒకటి జరిగినా, దానిని మత సంస్కరణ, సామాజిక పునరుద్ధరణ ఆశయాలతో నిర్వహించారు. 1910లో విజ్ఞాన చంద్రికా మండలివారు ప్రచురించిన 'ఆంధ్రల చరిత్ర' -తెలుగువారి మహోన్నత చరిత్రను, పూర్వ వైభవాన్ని గుర్తు చేసింది.

1911లో ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం మద్రాసు రాష్ట్రంలోను, నిజాం రాజ్యంలోను, మైసూర్‌ సెంట్రల్‌ ప్రావిన్స్‌లో ఉండే తెలుగు ప్రజల మొత్తం ప్రాంతాన్ని బృహదాంధ్ర చిత్రపటంగా రూపొందించారు. తెలుగువారంతా ఒక ప్రత్యేక పాలనా విభాగంగా రూపొందాలన్న కోరిక 1911 డిసెంబర్‌ 12వ తేదీన ఢిల్లీ దర్బారు జరిగే సమయంలో వ్యక్తమయింది. మద్రాసు రాష్ట్రంలో తెలుగువారి దుస్థితిపై పత్రికలలో ప్రచురింపబడిన వ్యాసాలు ఆంధ్రులలో నూతన భావాలకు, ఉత్సాహానికి దోహదం చేశాయి.

మద్రాసు రాష్ట్ర విస్తీర్ణంలో ఆంధ్రా ప్రాంతం 58 శాతం, జనాభాలో తెలుగువారు 40 శాతం ఉన్నప్పటికీ, విద్య, ఉపాధి, పారిశ్రామిక రంగాలలో వారు ఎంతో నిరాదరణకు గురయ్యేవారు. 1911లో బెంగాల్‌ రాష్ట్ర విభజన రద్దై, బీహార్‌ ప్రత్యేక రాష్ట్రస్థాయి పొందాక, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అనేక విధాలుగా అణగారి ఉన్న, తెలుగువారు భాషా ప్రాతిపదికపై ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడానికి ఉద్యుక్తులయ్యారు. మొదటిసారిగా ఈ భావం గుంటూరు 'యంగ్‌మెన్స్‌ లిటరరీ సొసైటీ' సభ్యులలో తలెత్తింది.

1912 మే లో నిడదవోలులో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు మండలాల సంయుక్త కాంగ్రెస్‌ సమావేశంలో ఉన్నవ లక్ష్మీనారాయణ, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ తీర్మానాన్ని ప్రతిపాదించారు. కాని జిల్లా సభలో ఆ చర్చ రాదని, దానికోసం ప్రత్యేకంగా ఆంధ్ర మహాసభ నొకదానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

గుంటూరుకు చెందిన ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం, చల్లా శేషగిరిరావు, దేశభక్త కొండా వెంకటప్పయ్య, వింజమూరి భావనాచారి పరస్పరం చర్చించుకొని అఖిలాంధ్ర సమావేశం నిర్వహించడానికి ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కొండా వెంకటప్పయ్యను కార్యదర్శిగా ఎన్నుకొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ వీరు ఆంగ్ల, తెలుగు భాషలలో 'ఆంధ్రోద్యమం' అనే ఒక చిన్నపుస్తకాన్ని ప్రచురించారు. డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య, కోపల్లె హనుమంతరావులు కలసి 'ఆంధ్ర రాష్ట్రం' అనే పుస్తకాన్ని రాశారు. 1913లో బాపట్లలో ప్రథమ ఆంధ్ర మహాసభను జరపాలని నిర్ణయించారు.

1912లో కొమఱ్ఱాజు లక్ష్మణరావు 'ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ' ప్రచురణ కూడా ఆంధ్రుల్లో ఐక్యతా భావాన్ని పెంపొందించింది. భారతజాతిని బలోపేతం చేయాలంటే, ముందు ఆంధ్రుల ఐకమత్యం ఎంతో అవసరమని 1912లో 'కృష్ణాపత్రిక' ప్రబోధించింది. తగిన అవకాశాలు, ప్రోత్సాహం లేకనే ఆంధ్రులు వెనుకబడి ఉన్నారు కాని, తమిళుల కంటే వారు ఏ మాత్రం తీసిపోరని 'భరతమాత' పత్రిక 1912 సంవత్సరంలోనే పేర్కొంది.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమనేది, అన్నివిధాల -విస్తీర్ణంలోను, జనాభాలోను, ఆదాయంలోను -ఆచరణ యోగ్యమయినదని మిగతా ఏ రాష్ట్రాలకు అది తీసిపోదని 1912 నవంబర్‌ 29 నాటి 'ధర్మప్రకాశిక' ప్రకటించింది. గవర్నర్‌ కార్యవర్గంలోనూ, హైకోర్టు న్యాయమూర్తులుగాను, రెవిన్యూ బోర్డు సభ్యులుగాను వ్యవహరించుటకు తగిన ఆంధ్రులు అనేకమంది ఉన్నారని 1912 అక్టోబర్‌ 9 నాటి 'దేశమాత' పత్రిక పేర్కొంది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా బెజవాడ అన్ని విధాల యోగ్యమయినదని 1912 ఆగస్టు 23 నాటి 'కృష్ణాపత్రిక' ప్రకటించింది.

1912 మార్చి 14న ఆంధ్ర మహాసభ కార్యనిర్వాహక వర్గంవారు న్యాపతి సుబ్బారావు పంతులు అధ్యక్షతన సమావేశమై, కొండా వెంకటప్పయ్యను ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగాను, న్యాపతి సుబ్బారావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, నోరి వెంకటేశ్వర్లును కార్యదర్శులుగా ఎన్నుకొన్నారు. కాంగ్రెస్‌ మహాసభలకు

బాపట్లకు చెందిన చోరగుడి వెంకటాద్రి ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా వ్యవహరించారు. బాపట్లలో జిల్లా కాంగ్రెస్‌ మహాసభ పూర్తయిన మరుసటి రోజు అనగా 1913 మే 26న ఆంధ్ర మహాసభ జరపాలని నిర్ణయించారు.

1913 మే 24వ తేదీ కృష్ణాపత్రికలో ముట్నూరు కృష్ణారావు 'మాతృ సందర్శనము' పేరిట దిగువ సంపాదకీయం రాశారు.

''రేపు బాపట్ల మహాక్షేత్రమున ఆంధ్ర జనని మహా వైభవంతో అవతరించబోతున్నది. ఆమె నారాధింప అష్టదిక్పాలురు, అష్టవసువులు సప్త మహాఋషులు, యక్ష, కిన్నెర గంధర్వులతో నరుదెంచుచున్నారు. ఆనాడు వైకుంఠంబు నుండి నాదోపాసకుడగు త్యాగరాజాచార్యుడు, నారదాది ముని బృందములతో

నేతెంచుచున్నారు. రాజరాజ నరేంద్ర, ప్రతాపరుద్ర, శ్రీకృష్ణ దేవరాయాది నృపతులు, వారి ననుగమించి బొబ్బిలి, పల్నాడు, కొండవీడు, గుత్తి, పెనుగొండ వీరులను సమావేశమగుచున్నారు. వేయేల, ఆంధ్ర చరిత్రలక్ష్మి, సపరివారముగ నా సభాస్థలి నావిర్భవింపబోవుచున్నది.

అదిగో, అన్నివైపుల నుండియు విద్యాధివరులు, సంఘ సంస్కర్తలు, మతోథ్థరకులు, రాజ్యాంగ వేత్తలు, గాయకులు, కవులు, దేశభక్తులు, ఆమె ప్రియ పుత్రులగు వారెల్లరూ తల్లి చరణారవిందములపై తమ పూజాద్రవ్యముల నర్పింపబోవుతున్నారు. ఏమి ఆ కోలాహలము, ఆ సంబరము, అమ్మ తనయనుంగు బిడ్డలను జూచుటకు వచ్చుచున్నదనియా?

ఆంధ్ర జననీ, నేడు గదా, మా తపస్సు ఫలించె, మా యభీష్టము లీడేరె, మా కన్నుల కఱవుతీరె. తల్లీ, నీ చల్లని చూపుల వలన మాకు కల తాపములన్నియు నుపశమించుగాక, నీ హస్త స్పర్శచే మాకెక్కువ జవసత్తువులు చేకూరుగాక, నీ సందర్శనముచే మా మనోధైర్యము చిక్కబడును గాక, నీయాశీర్వచనంబుచే మాకెల్ల శుభములు చేకూరుగాక''. ఈ విధంగా ప్రథమాంధ్ర మహాసభ ఏర్పడి తెలుగు భాష, సంస్కృతి వికాసానికి దోహదం చేసింది. ఈ ప్రథమాంధ్ర మహాసభ శతజయంతి సంవత్సరంలో మాతృభాషాబిమానులంతా నడుం బిగించి తెలుగు భాష పరిరక్షణకోసం కృషి చేయాల్సిన ఆవశక్యత ఉంది.

apr  -   Sat, 4 May 2013
  •  ============================
 Visit My Website - > Dr.seshagirirao.com/

Friday, April 19, 2013

International Migratory-Birds Day,అంతర్జాతీయ వలసపక్షుల దినోత్సవం

  •  

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.మే 13న.) -International Flying-Birds Day-అంతర్జాతీయ వలసపక్షుల దినోత్సవం గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

ప్రతి సంవత్సరము మే నెల 2 వ వారము చివరిలో ఈ దినోత్సవాన్ని జరుపుతారు. ఒక్కో దేసము లో ఒక్కో తేదీలలో సీజన్‌ బట్టి జరుపుకునే తారీఖు మారుతూ ఉంటుంది.
-మే 13న ప్రతి సంవత్సరం ‘ఇంటర్నేషనల్‌ మైగ్రేటరీ బర్డ్‌ డే’గా పరిగణిస్తారు. ఇందులో భాగంగా వలస పక్షుల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి సొసైటీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ వారు ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు.

దీన్ని 2006 లో ప్రారంభించారు . వలస పక్షులను కాపాడే ఉద్దేశముతో పక్షుల ప్రేమికులు వాటిని కాపాడేందుకు ప్రచారము , విదివిధానలు ప్రజలకు తెలియజేయడములో ముఖ్యపాత్ర పోషిస్తారు.  ప్రతి సంవత్సరము పక్షుల ఫండగలు, ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాములు , వాటి గుడ్లు , పిల్లలను కాపాడే ప్రోగ్ర్రాములు చేపడతారు.

  • ========================= 
Visit My Website - > Dr.seshagirirao.com/

Saturday, April 6, 2013

padma Awards celebrations,పద్మ అవార్డుల ప్రధానోత్సవం

  •  

  •  
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (..జనవరి 26.) - padma Awards celebrations,పద్మ పురస్కారాలు సత్కరించడం - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


పద్మశ్రీ(Padma Shri) భారత ప్రభుత్వముచే ప్రదానం చేసే పౌర పురస్కారం.  జనవరి 26న పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పొందేవారి పేర్లు వెల్లడించడం ఆనవాయితీగా వస్తున్నది . ఈ అవార్డులు,ఎంతో గౌరవం, ప్రతిష్ట ఇమిడివున్నది . వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ మరియు ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ప్రాధమికంగా ఇచ్చే పౌరపురస్కారం. పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అత్యున్నత పురస్కారం భారతరత్న, రెండవది పద్మ విభూషణ్ మూడవది పద్మ భూషణ్ మరియు నాలుగవది పద్మశ్రీ. ఈ పురస్కారం క్రింద ఒక పతకం వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ" లు వ్రాయబడి వుంటాయి. ఈ పురస్కారాన్ని 1954లో స్థాపించారు. ఫిబ్రవరి 2010 నాటికి, మొత్తం 2336
మంది పౌరులు ఈ పురస్కారాన్ని పొందారు.

Award Rank : 1.భారతరత్న ← 2.పద్మ విభూషణ్ ← 3.పద్మ భూషణ్ ← 4.పద్మశ్రీ → లేదు

అసలు ఈ పద్మ అవార్డులు ఎవరికిస్తారు? ఎవరిస్తారు? ఎలా ఇస్తారు?

ఎవరికిస్తారు?
ఏదైనా ఒక రంగంలో ‘ప్రత్యేకమైన సేవ’ చేసినవారిని ‘పద్మశ్రీ’తో భారత ప్రభుత్వం గౌరవిస్తుంది. ‘అత్యున్నత స్థాయిగల ప్రత్యేక సేవ’చేసినవారిని ‘పద్మభూషణ్’తో సత్కరిస్తుంది. ‘అసామాన్యమైన ప్రత్యేక సేవ’ చేసిన వారిని ‘పద్మవిభూషణ్’తో సన్మానిస్తుంది. జాతి,వృత్తి, స్థాయి, లింగభేదాలు లేకుండా ‘అందరూ’ దీనికి అర్హులే! నిజానికి ఈ అవార్డులను భారతీయులకే ఇస్తారనే భావన ఉన్నా, వాళ్లకే సాధారణంగా ఇస్తూనే ఉన్నా అదేమీ నియమం కాదు. భారతీయేతరులకు కూడా ఇవ్వవచ్చు.

కళ(సంగీతం, శిల్పం, చిత్రం, సినిమా, రంగస్థలం, ఫొటోగ్రఫీ); సమాజ సేవ(దాతృత్వం, సేవ); ప్రజా సంబంధాలు(ప్రజాజీవితం, మానవ హక్కులు, రాజకీయాలు); సైన్స్ అండ్ ఇంజినీరింగ్(పరిశోధన, ఐటీ, న్యూక్లియర్ సైన్స్, స్పేస్); వాణిజ్యం, పరిశ్రమలు(బ్యాంకింగ్, ఆర్థిక  కార్యకలాపాలు, వ్యాపారం, టూరిజం); వైద్యం(ఆయుర్వేదం, హోమియో, సిద్ధ, ఆల్లోపతి, నాచురోపతి); విద్య, సాహిత్యం(జర్నలిజం, బోధన, పుస్తక రచన, అక్షరాస్యతా కృషి, విద్యా సంస్కరణలు); పౌర సేవ(కార్యనిర్వహణ పరంగా ప్రభుత్వ ఉద్యోగులకు); క్రీడలు(అథ్లెటిక్స్, సాహసం, పర్వతారోహణ, క్రీడాభివృద్ధి, యోగా); వన్యప్రాణి సంరక్షణ, భారత సంస్కృతి పరిరక్షణ, ప్రచారంలాంటి ఏ రంగంలోనైనా అసామాన్యమైన కృషి చేసినవారికి ఈ పద్మ అవార్డులు ప్రదానం చేయడం ద్వారా వాళ్లను గౌరవించుకోవడం, తద్వారా వాళ్ల స్ఫూర్తి యావజ్జాతికీ అందుతుందనేది ఇందులోని అంతరార్థంగా చెప్పుకోవచ్చు.

కీ.శే. మినహాయింపు
సర్వసాధారణంగా మరణించిన వారికి ఈ పురస్కారాలు ప్రదానం చేయరు. కానీ, ‘అత్యధిక అర్హత’ కలిగిన వ్యక్తుల విషయంలో దీనికి సడలింపు ఉంది. అదీ, అవార్డులు ప్రకటించేనాటికి ఏడాది లోపున మరణించివుంటేనే! గతేడాది సంగీతస్రష్ట భూపేన్ హజారికాకు ఇలాగే పద్మవిభూషణ్ ప్రదానం చేశారు. మొన్న జూలైలో మరణించిన నటుడు రాజేశ్ ఖన్నాకు కూడా అలాగే ప్రకటిస్తారేమోనని ఒక అంచనా!

అలాగే, మరో సడలింపు ఏమిటంటే, సాధారణంగా ఒక పద్మ పురస్కారాన్ని ప్రకటించిన ఐదేళ్లకుగానీ మరో మెట్టున ఉండే అవార్డును ఇవ్వరు. అంటే ఈ ఏడాది పద్మశ్రీ గెలుచుకున్నవారికి పద్మభూషణ్ ఇవ్వాలన్నా, పద్మభూషణ్ అందుకున్నవారికి పద్మవిభూషణ్ ఇవ్వాలన్నా ఐదేళ్లు ఆగాల్సిందే! అయినప్పటికీ అత్యధిక అర్హత కలిగిన వ్యక్తుల విషయంలో అవార్డుల కమిటీ ఈ నిబంధనను సడలించవచ్చు. అలాగే ఈ క్రమంతో నిమిత్తం లేకుండా నేరుగానే అత్యున్నత అవార్డు(పద్మవిభూషణ్)ను కూడా ఇవ్వొచ్చు.

ఎవరిస్తారు?
ప్రతి ఏడాదీ ప్రధానమంత్రి ‘పద్మ అవార్డుల కమిటీ’ని ఏర్పాటుచేస్తారు. ఇందులో క్యాబినెట్ సెక్రెటరీ (xx), హోమ్ సెక్రెటరీ (xx), ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి xx), రాష్ట్రపతి కార్యదర్శి (xx) సభ్యులుగా ఉంటారు. వీళ్లు కాకుండా ఇతర రంగాల ప్రముఖులు కూడా భాగస్వాములవుతారు. ఈ యేడు శాస్త్రవేత్త అనిల్ కకోద్కర్, సినీనటి రత్నా పాఠక్ షా కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ... రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు, మంత్రిత్వ శాఖలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు; అందరినీ, అన్నింటినీ నిర్దేశిత ఫారం, తగిన పత్రాలతో ‘ప్రతిపాదనలు’ పంపమని ఆహ్వానాలు పంపుతుంది. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వాలు కూడా జిల్లాలకు ఇలాంటి ఆహ్వానాలు పంపి ప్రతిపాదనలు తీసుకుంటాయి. భారతరత్న, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలు కూడా ఎవరి పేరైనా సూచించవచ్చు. అంతేకాదు, వ్యక్తిగత స్థాయిలో ఎవరైనా తమ పేరును తామే ‘రెకమెండ్’ చేసుకోవచ్చు.

ఎలా ఇస్తారు?
సుమారు 1000 నుంచి 1200 ప్రతిపాదనలు ప్రతి సంవత్సరమూ వస్తాయని అంచనా. ఇందులోంచి 120కి మించకుండా కమిటీ షార్ట్ లిస్ట్ చేస్తుంది. మరణానంతర పురస్కారాలు, విదేశీయులకు ఇచ్చేవి అదనం. ఆ కమిటీ జాబితాను ముందుగా ప్రధాని ముందు ఉంచుతుంది. తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో తుది జాబితా రూపుదిద్దుకుంటుంది. అవార్డు కమిటీ ప్రతిపాదన లేకుండా ఏ అవార్డునూ ప్రకటించరు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకటించే ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్‌లో జరిపే మరో వేడుకలో ‘ప్రథమ పౌరుడు’ ప్రదానం చేస్తారు. ఈ ఉత్సవం మార్చ్, ఏప్రిల్ నెలల్లో జరుగుతుంటుంది.

ఇది గౌరవమేగానీ బిరుదు కాదు. కాబట్టి పేరుకుముందుగానీ వెనకగానీ దీన్ని లెటర్‌హెడ్స్, విజిటింగ్ కార్డ్స్, పోస్టర్లు, పుస్తకాల్లో ముద్రించుకోవడం కుదరదు. పురస్కార గ్రహీత అని వేసుకోవచ్చు. పద్మభూషణ్ ఫలానా అనడానికీ, పద్మభూషణ్ పురస్కార గ్రహీత అనడానికీ మధ్య ఉన్న తేడా బహుశా, ‘ఒకరు, అందరిలో ఒకరు’ అన్న ధ్వని! ఉల్లంఘించినవారి పురస్కారాన్ని వెనక్కి తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.

ఈ పురస్కారాలకు నగదు బహుమానం ఉండదు. రైలు, విమాన ఛార్జీల్లో రాయితీ లభించదు. అయితే, ఈ అవార్డులకున్న ఉత్కృష్టత, వాటిని అంటివున్న ప్రతిష్ట రీత్యా విశిష్ట సేవలందించినవారు దీన్ని ఆశించడం సహజం. మనిషి గుర్తింపు జరుగుతుంది. లేదూ, వాళ్లు కోరుకోవడంకన్నా వాళ్లను గౌరవించడం ద్వారా జాతి తనను తాను గౌరవించుకున్నట్టు అవుతుంది. అయితే ఈ అవార్డులు వచ్చినవాళ్లందరూ గొప్పవాళ్లు, రానివాళ్లు కాదు అని అనుకోకూడదు.

వచ్చినవాళ్లకు వందనం... రానివాళ్లకు అభివందనం
ఆశాభోంస్లే అద్భుత గాయనే! ఆమె పద్మవిభూషణ్ అవడం సంపూర్ణంగా సమంజసమే! అయితే, అంతేస్థాయి మధుర గాయని ఎస్.జానకి రాలేదు. గీత రచయిత జావేద్ అఖ్తర్ మహానుభావుడే. ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్ రెండూకాగలిగినప్పుడు, పాటల శిల్పి వేటూరి సుందర్రామ్మూర్తికి రాలేదు. మరణానంతరమైనా ఆయన్ని  గౌరవించుకోలేదు. ఎం.జి.రామచంద్రన్ భారతరత్న , ఎన్టీ రామారావు పద్మశ్రీ ఇచ్చారు .
  •  

  •  
‘పద్మ’ పురస్కారాలు  -ముఖ్య విషయాలు :

  • - 1954లో అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ పద్మ అవార్డులను ప్రవేశపెట్టారు.
  • - {పతీ సంవత్సరం గణతంత్ర దినోత్సవాన వీటిని ప్రకటిస్తారు.
  • - భారతదేశం తన ముద్దుబిడ్డలను గౌరవించుకోవడానికి ఏర్పాటుచేసుకున్న పురస్కారాల్లో భారతరత్న అత్యున్నతమైనది.
  • పద్మవిభూషణ్ ద్వితీయ, పద్మభూషణ్ తృతీయ, పద్మశ్రీ చతుర్థ స్థానాల్లో ఉంటాయి.
  • - ఇంతవరకూ 41 మందికి భారతరత్న, 288 మందికి పద్మవిభూషణ్, 1169 మందికి పద్మభూషణ్, 2497 మందికి పద్మశ్రీ పురస్కారాలుదక్కాయి.
  • - భారతరత్న అవార్డుకు ప్రతిపాదనలు స్వీకరించడం జరగదు. వాటిని నేరుగా ప్రధానమంత్రే రాష్ట్రపతికి రెకమెండ్ చేస్తారు. సంవత్సరానికి మూడుకు మించకుండా ఇస్తారు. అయితే 2008 నుంచి ఒక్క భారతరత్న కూడా ప్రకటించలేదు.
  • - కేంద్ర తొలి విద్యాశాఖా మంత్రి అబుల్ కలామ్ అజాద్ తనకు భారతరత్న ఇవ్వడాన్ని సున్నితంగా తిరస్కరించారు, తానూ సెలక్షన్ కమిటీలో ఉన్నానన్న కారణంగా. ఆయనకు మరణానంతరం 1992లో ప్రదానం చేశారు.
  • - నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు ప్రకటించిన(1992) భారతరత్న పురస్కారాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కారణం? ఆయన మరణించినట్టుగా ధ్రువీకరణ ఏమిటన్న ప్రజాహిత వ్యాజ్యానికి జవాబు ఇవ్వలేకపోవడం వల్ల. పురస్కారాల చరిత్రలో ఒక అవార్డును వెనక్కి తీసుకోవడం ఇదే మొదటిసారి.
  • - విదేశీసంతతి వాళ్లలో భారతరత్న స్వీకరించినవాళ్లు: భారత పౌరసత్వం స్వీకరించిన మదర్ థెరీసా(1980), అఫ్గానిస్తాన్ యోధుడు ఖాన్
  •  అబ్దుల్ గఫార్ ఖాన్(1987), దక్షిణాఫ్రికా సూరీడు నెల్సన్ మండేలా(1990)
  • - 2011లోనే క్రీడాకారులకు భారతరత్న కూడా ఇవ్వవచ్చునన్న సవరణ చేశారు.
  • - సీనియర్ నటి రేఖకూ నటుడు సైఫ్ అలీఖాన్‌కు పద్మశ్రీ అవార్డు ఒకేసారి వచ్చింది(2010).

గాంధీజీకి భారతరత్న ఎందుకివ్వలేదు?
అవార్డుల్ని నెలకొల్పినప్పుడు ‘మరణానంతరం’ కూడా ఇచ్చే వెసులుబాటు లేదు. 1966లోనే మరణానంతరం కూడా ప్రదానం చేయొచ్చని సడలింపు చేశారు. మొదట్లో ఈ నిబంధన ఉండటంవల్లే మహాత్మాగాంధీకి ఈ  పురస్కారం ప్రకటించలేదు. ఒకవేళ తర్వాత ఇద్దామని యోచించినా, ‘జాతిపిత’ స్థాయికి ‘భారతరత్న’ సరిపోయేది కాదని మిన్నకుండివుంటారు.

ఈసారి తెలుగు పద్మాలు?
మన త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్యను ఈసారి భారతరత్న అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినట్టు సమాచారం. అలాగే, ‘జ్ఞానపీఠ్’ గ్రహీత సి.నారాయణరెడ్డి పేరు పద్మవిభూషణ్ కోసమూ; సుప్రసిద్ధ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు, ప్రఖ్యాత నిర్మాత డి.రామానాయుడు పేర్లు పద్మభూషణ్ విభాగంలోనూ పరిశీలనలో ఉన్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. సుప్రసిద్ధ గాయని ఎస్.జానకిని పద్మశ్రీ పురస్కారం కోసం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
మొన్న జూలైలో మరణించిన హిందీ సూపర్‌స్టార్ రాజేశ్‌ఖన్నాకు ఈసారి పద్మవిభూషణ్ ప్రకటిస్తారేమోనని ఊహాగానాలు వెలువడుతున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎంపీగా కూడా పనిచేశారాయన. చిత్రంగా సినీరంగంలో తన సమకాలీనులైన దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్, శశికపూర్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, వహీదా రెహమాన్, హేమామాలిని వంటి హేమాహేమీలకు పద్మ అవార్డులు దక్కాయి. రాజేశ్‌ఖన్నా పేరు పరిగణనలోకి రాకపోవడమంటే... తోచడం, తోచకపోవడమనే మానవ పరిమితిగా చూడాల్సిందేనా? ‘షోలే’ లాంటి చిత్రానికి దర్శకత్వం వహించిన రమేష్ సిప్పీ పేరు పద్మశ్రీకి వినబడుతోంది. ఊహలు నిజమైతే గాయకుడు కైలాష్ ఖేర్ కూడా పద్మశ్రీ అందుకోవచ్చు!


sources:-- http://www.sakshi.com/main/Weeklydetails.
               http://en.wikipedia.org/wiki/Padma_Shri_Awards.
               http://te.wikipedia.org/wiki/
  • ===============================
Dr.Seshagirirao.com/

Thursday, April 4, 2013

Olympic Day,ఒలింపిక్‌ క్రీడల దినోత్సవం



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (23 June) -Olympic Day,ఒలింపిక్‌ క్రీడల దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


On 23 June, Olympic Day is celebrated all around the world: hundreds of thousands of people – young and old – get moving and participate in sporting and cultural activities, such as runs, exhibitions, music and educational seminars. Over the last two decades, the event has helped to spread the Olympic ideals to every corner of the world.

ఒలింపిక్‌ క్రీడలు... ఈ మాట వింటేనే క్రీడాకారులతో పాటు క్రీడాభిమానుల మది పులకిస్తుంది. క్రీడా స్ఫూర్తికి ఎవరెస్ట్‌గా భావించే ఒలింపిక్‌ క్రీడల్లో కనీసం ఒక్కసారైనా పాల్గొనాలని, పతకం దక్కించుకోవాలని ప్రతి క్రీడాకారుడు ఉవ్విళ్లూరుతుంటాడు. ఖండాంతర ఖ్యాతినార్జించిపెట్టే ఒలింపిక్‌ మెడల్‌ అంటే ఏ క్రీడాకారుడికి ఇష్టముండదు చెప్పండి! అలాంటి మహత్తర క్రీడా సమరానికి మరోసారి క్రీడాప్రపంచం సన్నద్ధమైంది. లండన్‌ వేదికగా... ఈ నెల 27 నుండి ప్రారంభం కానున్న వేసవి ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనడానికి 203 దేశాలు... 36 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు... సర్వసన్నద్ధమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్‌ చరిత్ర, ప్రస్తుత ఒలింపిక్‌ క్రీడలు, ఒలింపి్‌ క్రీడల్లో భారత్‌ పాత్ర... ఇత్యాది విషయాలపై ప్రత్యేక కథనం...

-ఒలింపిక్‌ మోటో... సిటియస్‌, ఆల్టియస్‌, ఫోర్టియస్‌... (ఫాస్టర్‌ (వేగంగా), హయ్య ర్‌ (ఎత్తుగా), స్ట్రాంగర్‌... (బలీయంగా)) అనే నినాదాన్ని క్రీడాకారులు తమ మదిలో అణువణువునా నింపుకొని ప్రతిష్టాత్మక లండన్‌ ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యారు. 27వ తేదీనుంచి తెరలోవబోతున్న ఈ ఈవెంట్‌ కోసం లండన్‌లో స్టేడియాలన్నీ సర్వహంగులతో ముస్తాబయ్యాయి. ఒలింపిక్స్‌లో పాలుపంచుకోనున్న దాదాపు అన్ని దేశాల క్రీడాకారులు తమ అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకొని లండన్‌ చేరుకున్నారు. క్రీడాసమరానికి మరికొద్ది రోజులే మిగిలివుంది.

ఒలింపిక్స్‌ పుట్టు పూర్వోత్తరాలు
ఒలింపిక్‌ క్రీడలు ప్రతి నాలుగేళ్ళ కోసారి జరుగుతాయి. క్రీ.పూ.776 లో ప్రారంభమైన ఒలింపిక్‌ క్రీడలు క్రీ.శ.393లో నిలిపివేశారు. మళ్ళీ క్రీ.శ.1896లో ఏథెన్స్‌లో ప్రారంభ మయ్యాయి. అప్పటి నుంచి మధ్యలో కొంతకాలం ప్రపంచ యుద్ధాల వల్ల అంతరాయం ఏర్పడినా...  దాదాపు నాలుగేళ్లకోసారి ఈ క్రీడలు జరుగుతూనేవు న్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ ఆధునిక క్రీడలకు ముఖ్యకారకుడు ఫ్రాన్స్‌ దేశానికి చెందిన పియరె డి కోబర్టీన్‌. 1924 నుంచి
సీతాకాలపు ఒలింపిక్‌ క్రీడలను కూడా జరుపుతున్నారు. 1896లో ప్రారంభమైన ఒలింపిక్‌  క్రీడలను వేసవి ఒలింపిక్‌ క్రీడలుగా పిలుస్తున్నారు. ఇంతవరకూ 29 వేసవి ఒలింపిక్‌ క్రీడలు జరుగగా 30వ ఒలింపిక్‌ క్రీడలు ఈసారి లండన్లో జరుగుతున్నాయి.

ప్రాచీన ఒలింపిక్‌ క్రీడలు
క్రీ.పూ.8వ శతాబ్దంలో ప్రాచీన గ్రీక్‌ సామ్రా జ్యం అనేక రాజ్యాలుగా చీలి ఉండేది. వాటి మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. శాంతి సామరస్యాలకు క్రీడలు పరిష్కారం చూపుతాయని గ్రహించిన గ్రీకులు క్రీ.పూ 776లో మొదటిసారిగా ఈ క్రీడలను నిర్వహించారు. అప్పటి నుంచి క్రీ.శ 393 వరకూ ప్రతి నాలుగేళ్లకోసారి ఒలింపిక్‌ క్రీడ లు సాఫీగానే జరుపుతున్నారు. ఈ పోటీలు జరిగేటప్పుడు యుద్ధాలు కూడా ఆపేవారు. అప్పట్లో ఈ క్రీడల్లో విజేతలకు ఆలివ్‌ కొమ్మలను గిఫ్ట్‌గా ఇచ్చేవారు. ఈ పోటీలు కూడా ఒక్కరోజు మాత్రమే జరిగేవి. ఈ పోటీ లకు జనాదరణ పెరగడంతో రోజులు, క్రీడాం శాలు పెరిగాయి.  పరుగుపందెం, కుస్తీ, రథా ల పోటీ, బాక్సింగ్‌, గుర్రపు స్వారీ అప్పట్లో జరిగే పోటీలు. ఆ తరువాత రోమన్‌ చక్రవర్తి థియోడొసియన్‌ గ్రీకు సామ్రాజ్యాన్ని జయిం చి ఈ పోటీలను నిషేధించాడు. ఆ తరువా త ఒలింపస్‌ పట్టణం వరదలు, భూకంపాల కారణంగా కాలగర్భంలో కలిసిపోయింది.

ఆధునిక ఒలింపిక్‌ క్రీడలు
-ఆ తరువాత ఈ క్రీడా పోటీ లకు జీవం పోసిన ఘనత ఫ్రాన్స్‌కు చెందిన క్రీడా పండి తుడు పియరీ డి కోబర్టీస్‌కే దక్కుతుంది. 1896లో ఒలింపిక్‌ క్రీడలను పునరుద్ద రించారు. ఎథెన్స్‌లో ఈ పోటీ లు జరిగాయి. ఆ తరువాత 6 ఒలింపిక్‌ క్రీడలు జరుగగా నే 1916లో బెర్లిన్‌లో జరగా ల్సిన పోటీలు మొదటి ప్రపం చ యుద్ధం కారణంగా రద్ద య్యాయయి. మళ్ళీ 1940, 44లలో జరగాల్సిన హెల్సింకీ, లండన్‌ ఒలింపిక్‌ క్రీడలు కూడా రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 
రద్దయ్యాయి. ఆ తరువాత ఈ క్రీడా పోటీలు నిరాటంకంగా జరుతున్నా... రాజకీయ   కారణాలతో అప్పుడప్పుడూ కొన్ని దేశాలు బహిష్కరిస్తున్నాయి. 1964 నుంచి చాలాకాలం పాటు దక్షిణాఫ్రికా ఈ పోటీల్లో పాల్గొనకుండా నిషేధించారు.

ఒలింపిక్స్‌ లోగో
రంగురంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించే చిహ్నమే ఒలింపిక్‌ చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నం. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా ఖండాలు కూడా కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిహ్నాల్ని ఎంపిక చేశారు. 1913లో రూ పొందించిన ఈ చిహ్నాం తొలిసారిగా 1914 లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలిం పిక్‌ క్రీడలలో ఈ లోగోను వాడుతున్నారు.

మొదటి క్రీడలు
1896లో ఏథెన్స్‌లో జరిగిన తొలి ఒలింపిక్‌ క్రీడలలో అథ్లెటిక్స్‌, సైక్లింగ్‌, కత్తియుద్ధం, జిమ్నాస్టిక్స్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, షూటింగ్‌, స్వి మ్మింగ్‌, టెన్నిస్‌, మల్లయుద్ధం వంటి 9 రకాల పోటీలు జరిగేవి. తర్వాత పోటీ అంశాలు పెరిగి ప్రస్తుతం 36 క్రీడాంశాలకు చేరింది. ఇక క్రీడాకారుల దృష్టిలో ఒలింపిక్‌ స్వర్ణ పతకం సాధించడమే అన్నిటి కంటే పెద్ద గౌరవం. ఒలింపిక్‌ చరిత్రలో అనేక స్వర్ణ పతకా లు సాధించిన క్రీడాకారులు కూడా ఉన్నారు. భారత్‌ తరపు న ఇంతవరకూ వ్యక్తిగత పోటీ లలో ఎవరూ స్వర్ణం సాధించ లేదు గానీ, మిల్కా సింగ్‌, పిటి ఉషలు తృటి లో పతకాలు సాధించే అవకాశాలు పోగొట్టు కున్నారు.

అభినవ్‌ బింద్రా 2008లో స్వర్ణం సాధించాడు.

2008లో బీజింగ్‌లో జరిగిన పోటీలు ఆగస్టు 8 శుక్రవారం రాత్రి 8-08 నిమిషాల నుంచి బీజింగ్‌లోని పిట్టగూడు (బర్డ్‌నెస్ట్‌) జాతీయ క్రీ డా ప్రాంగణంలో మైదానం మధ్యలో భూగో ళంలా ఏర్పాటు చేసిన తాత్కాలిక వేదికపై చై నా గాయకుడు లియూ హువాన్‌, బ్రిటన్‌ గా యని సారా బ్రిగామ్‌ కలిసి క్రీడల సందేశ గీతాన్ని ఆలపించిన తరువాత పోటీలు ప్రారంభమయ్యాయి. 16 రోజులు జరిగిన క్రీడల్లో మొత్తం 906 పతకాల కోసం 205 దేశాలకు చెందిన 10వేల ఐదువందల మంది క్రీడాకారులు పోటీపడ్డారు. ఇక లండన్‌లో ఇప్పుడు జరుగనున్న పోటీలకు 203 దేశాల నుంచి 36 క్రీడాంశాలలో పోటీ పడనున్నారు.

వినూత్న రీతిలో ఒలింపిక్‌ 2012
2012 ఒలింపిక్‌ క్రీడలను నభూతో నభవి ష్యతి అన్న రీతిలో జరిపేందుకు లండన్‌ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఓపెనింగ్‌ సెరమనీ క్రీ డల నిర్వహణ మొదలుకొని ముగింపు వేడు కల కోసం వినూత్న రీతిలో ప్లాన్‌చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో ఒలింపిక్‌ పతక విజేత లకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా నిర్వహించాలని లండన్‌ ఒలింపిక్‌ కమిటీ భావిస్తోంది. బ్రిటీష్‌ సంప్రదాయాన్ని ఒలింపిక్‌ స్ఫూర్తి చాటే విధంగా మోడల్‌
సెరమనీ కోసం పోడియం మోడల్‌ సెరమనీలో కాస్ట్యూమ్స్‌ తయారు చేయించింది.

2012 ఒలిపింక్స్‌ మస్కట్లు, థీమ్‌ సాంగ్స్‌
-మరోవైపు లండలన్‌ ఒలింపిక్స్‌ మస్కట్లు వెల్‌నాక్‌, మాండవెల్లి ప్రపంచమంతా సందడి చేస్తున్నాయి. వెల్‌నాక్‌, మాండవెల్లిపై బ్రిటిష్‌ రైటర్‌ మైకేల్‌ మార్పర్గో రాసిన కథల ఆధా రంగా లండన్‌ ఒలింపిక్‌ కమిటీ మూడు యానిమేషన్‌ షార్ట్‌ ఫిలిమ్స్‌ నిర్మించింది. దీన్ని   ఇంటర్‌నెట్‌లో ఈ మస్కట్ల లఘు చిత్రాలు వీక్షకుల్ని అలరిస్తున్నాయి. వీటిలో తొలి షార్ట్‌ ఫిల్మ్‌ ... ఔట్‌ ఆఫ్‌ రెయిన్‌ బో... వెల్‌నాక్‌, మాండవెల్లి ఏ విధంగా పుట్టాయో ఆటలను ఎలా నేర్చుకున్నాయో అన్నదే ఈ షార్ట్‌ ఫిల్మ్‌ కథ. ఇక వెల్‌నాక్‌, మాండవెల్లిలు చేసే సాహ సాలపై తీసిన చిత్రమే ‘‘అడ్వంచర్స్‌ ఆన్‌ ఎ రైయిన్‌బో ’’. ఇందులో లండన్‌ ఒలింపిక్‌ అథ్లెట్ల పాత్రలు కూడా ఉన్నాయి. స్టార్‌ అథ్లెట్ల ను కలుసుకున్న ఒలింపిక్‌ మస్కట్లు చేసే సా హాసాలు పిల్లల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక అడ్వెంచర్‌ రెయిన్‌ బోకి సీక్వెల్‌గా రెస్క్యూ రెయిన్‌ బో అనే మూడో షార్ట్‌ ఫిల్మ్‌ను తయా రు చేశారు. ఇందులో తుఫాన్‌ భీభత్సం ధ్వం సమైన స్కూల్‌ లైబ్రరీని అథ్లెట్ల సహాయంతో వెల్‌నాక్‌, మాండవెల్లి పునర్మిస్తారు.

ఇక ఈ లండన్‌ ఒలింపిక్స్‌ కోసం తయారు చేసిన అఫీషియల్‌ థీమ్‌ సాంగ్‌ నెట్‌లో సందడి చేస్తోంది. ప్రఖ్యాత రాక్‌ బ్యాండ్‌ మ్యూన్‌ నిర్మించిన గేమ్స్‌ థీమ్‌ సాంగ్‌ను గత నెల 27న విడుదల చేశారు. మ్యూన్‌ సర్వైవర్‌ పేరుతో రూపొందించిన ఈ వీడియో సాంగ్‌ను ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదా పు 10 లక్షల మంది వీక్షించారు. ప్రముఖ ఇంగ్లీష్‌ మ్యూజీషియన్‌ మాథ్యూ బెల్లెమి రాసి కంపోజ్‌ చేసిన ఈ పాట ఒలింపిక్‌ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. ‘‘లైఫ్‌ ఈజ్‌ ఏరేస్‌... ఐమ్‌ గోయింగ్‌ టు విన్‌... అంటూ సాగే ఈ పాట నెటిజన్లను అలరిస్తోంది.

ఒలింపిక్స్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ జిమ్నాస్టిక్స్‌
-శరీరాన్ని హరివిల్లులా వంచాలి... ఒంట్లో ఎముకలు ఉన్నాయా... లేవా అనేట్టుగా... బాడీ రబ్బరు బొమ్మను తలపించాలి... ప్రక్షకులు రెప్పవేయడం  మరచిపోయే టట్టు చేయాలి... అదే జిమ్నాస్టిక్స్‌... లండన్‌ ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నమ్మశక్యం కాని విన్యాసాలతో ప్రపంచ ప్రేక్షకులను అలరించే జిమ్నాస్టిక్స్‌లో చైనా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. చైనాకు గట్టిపోటీ ఇచ్చేందుకు యూరోపియన్‌ దేశాలు కొత్త ప్ర ణాళికలతో ముందుకు రావడంతో ఒలింపిక్స్‌ లో జిమ్నాస్టిక్స్‌ ఈవెంట్‌ కనుల పండువగా సాగడం ఖాయం. ఊహకందని విన్యాసాలతో ఆకట్టుకుంటేనే జిమ్నాస్టిక్స్‌ పతకంపై ఆశలు పెట్టుకోవచ్చు. ఒలింపిక్స్‌ ఈవెంట్‌లో చైనా, అమెరికా, రష్యా, యూరోపియన్‌ దేశాల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది.

జిమ్నాస్టిక్స్‌లో మూడు విభాగాల్లో పోటీ ఉం టుంది. ఆర్టిస్టిక్స్‌, రిథమిక్‌, ట్రంపోలిన్‌గా జి మ్నాస్టిక్స్‌ను విభజించారు. మెన్స్‌, విమెన్స్‌ విభాగాల్లో కలిసి 18 గోల్డ్‌, 18 సిల్వర్‌, 18 బ్రాంజ్‌ మెడల్స్‌తో మొత్తం 54 మెడల్స్‌ ఉం టాయి. ఇన్ని పతకాలు ఉన్నప్పటికీ ఒకొక్క పతకం కోసం కాంపిటీషన్‌ హైలెవల్లో ఉంటుంది. ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్స్‌ ఈవెంట్‌లో చైనా లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం డ్రాగన్‌ కంట్రీ పతకాలను కొల్లగొడుతుంది. ఇక తర్వాత స్థానాల్లో
అమెరికా, రష్యా, రొమే నియా, ఉత్తర కొరియా, పోలండ్‌ దేశాలు ఉంటున్నాయి.

భద్రతపై మాక్‌ - అంతా హైఅలర్ట్‌‌--
ఒలింపిక్స్‌పై టెర్రరిస్టులు కన్నేశారా?... లం డన్‌లో విధ్వంసానికి ప్లాన్‌ చేస్తున్నారా?... అవునననే అంటున్నాయి బ్రిటన్‌ నిఘా వర్గా లు. ఏ క్షణమైనా తీప్రవాదులు విరుచుకుపడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. దీంతో లండన్‌లో టైట్‌ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆధునాతన మిసైల్స్‌ను ఉపయో గిస్తున్నారు. ఒలింపిక్స్‌కు లండన్‌ ముస్తాబవు తోంది. ప్రారంభ వేడుకలకు ఆతిథ్యం ఇచ్చేం దుకు స్ట్రేట్‌ ఫోర్డ్‌ స్టేడియంలో సర్వం సిద్ధం చేశారు.

జూలై 27 నుంచి ఆగస్టు 12 వరకూ జరగనున్న ఈ మెగా ఈవెంట్‌కు ఇప్పుడు ఉ గ్రవాదుల భయం పట్టుకుంది. ఆల్‌ఖైదా ఏ క్షణమైనా దాడి చేయవచ్చని  బ్రిటన్‌ ఇంటిలి జెన్స్‌ కోడై కూస్తోంది. దీంతో స్ట్రేట్‌ ఫోర్డ్‌ స్టేడి యంతో పాటు లండన్‌లోని ప్రధాన ప్రాంతా ల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియా నికి వెళ్ళే దారుల్లో అంచలవారీగా నిఘా ఏ ర్పాటు చేశారు.

-ముఖ్యంగా తీవ్రవాదులు దా డిచేస్తే వారిని ప్రతిఘటించేందుకు అత్యాధుని క ఎయిర్‌ మిసైల్స్‌ రంగంలోకి దించారు. ఆ రుచోట్ల వాటిని అమర్చారు. నేలపైనా, గాల్లో నూ, లేక థేమ్స్‌ నదిలో నుంచి గాని టెర్రరి స్టులు దాడిచేసినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంచారు. లెగ్జింగ్టన్‌ బిల్డింగ్‌, ఫ్రెడ్‌ విగ్‌ టవర్‌, ఈస్ట్‌ లండన్‌, అక్సాస్‌వుడ్‌ ఎల్దాన్‌ విలియమ్‌, గిర్లింగ్‌ రిజర్వాయర్‌ ప్రాంతాలకు ఈ మిసైల్స్‌ ను నేవీ హెలికాప్టర్ల సహాయంతో తరలించా రు. అటు ఒలింపిక్స్‌ జరిగే స్టేడియం పరిసరాల్లోనూ, థేమ్స్‌ నది ఒడ్డున మిలటరీ, ఎయిర్‌ఫోర్స్‌ ట్రయల్న్‌ జరుపుతున్నారు. అటు ఎయిర్‌పోర్ట్‌లోనూ నిఘా పెంచారు. విదేశాల నుంచి వేల సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉండటంతో భారీగా రక్షణ చర్యలు చేపట్టారు. అనుమానితులపై నిఘా పెంచారు. గేమ్స్‌ ప్రారంభానికి ముందురోజు నుంచే స్టేడియం పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలులోకి వస్తాయి. ఎలాంటి విఘాతం లేకుండా ఒలింపిక్స్‌ను జరుపుతామని లండన్‌ రక్షణశాఖ ప్రకటించింది.

ఇప్పటి వరకు జరిగిన పోటీలు

సంవత్సరం          వేదిక
1896    ఏథెన్స్‌
1900    పారిస్‌
1904    సెయింట్‌ లూయిస్‌
1908    లండన్‌
1912    స్టాక్‌హోమ్‌
1916    బెర్లిన్‌ (మొదటి ప్రపంచ యుద్ధం వల్ల రద్దు)
London-Olympic
1920    ఆంట్‌వెర్ఫ్‌
1924    పారిస్‌
1928    ఆమ్‌స్టర్‌డాం
1932    లాస్‌ ఏంజిల్స్‌
1936    బెర్లిన్‌
1940    హెల్సింకీ (2వ ప్రపంచయుద్ధం వల్ల రద్దు)
1944    లండన్‌ (2వ ప్రపంచ యుద్ధం వల్ల రద్దు)
1948    లండన్‌
1952    హెల్సింకీ
1956    మెల్బోర్న్‌
1960    రోమ్‌
1964    టోక్యో
1968    మెక్సికో సిటీ
1972    మునిట్‌ (మునిచ్‌)
1976    మాంట్రియల్‌
1980    మాస్కో
1984    లాస్‌ ఏంజిల్స్‌
1988    సియోల్‌
1992    బార్సిలోనా
london-0
1996    అట్లాంటా
2000    సిడ్నీ
2004    ఏథెన్స్‌
2008    బీజింగ్‌
2012    లండన్‌



మన రాష్ట్రం నుంచి వీరే..chmpions

లండన్‌ వెళ్ళడానికి అంధ్రప్రదేశ్‌ నుంచి క్రీడాకారులు సిద్దమయ్యారు. టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా, బ్యాడ్మింటన్‌ ప్లేయర్స్‌ సైనా నెహ్వాల్‌, గుత్తా జ్వాల, పారుపల్లి కశ్యప్‌, అశ్వినీ పొన్నప్పలతో పాటు కోచ్‌ గోపిచంద్‌, రోయింగ్‌ ప్లేయర్స్‌ ఉన్నారు.

ఒలింపిక్స్‌లో భారత్‌ టెన్నిస్‌
విశ్వక్రీడల చరిత్రలో మన ప్రస్థానం గురించి చెప్పాలంటే చాలా తక్కువనే చెప్పాలి. మన పొరుగు దేశాలు ఒలిం పిక్స్‌ లో వందల సంఖ్యలో పతకాలు తన్నుపోతుం టే మనం మాత్రం ఒకటి, రెండింటికే సంబర పడిపో తున్నాం. చిన్న దేశాలు, పేద దేశాలు సైతం మన కన్నా ఎక్కువ పతకాలను గెలుస్తుంటే... మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇటువంటి పరిస్థితిల్లోనూ ఇండియా పతకం గెలవడాఁకి ఉన్న కొద్ది అవకాశాలనూ మనమే
కాలరాస్తున్నాం. క్రీడాసమాఖ్యలో రాజకీయాలు, ప్లేయర్ల వ్యక్తిగత పట్టింపులు, ఆర్థిక  ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ దేశ ప్రతిష్టను విస్మరిస్తున్నాం.

ఇందుకు నిదర్శనమే ఒలింపిక్స్‌కు ఎంపిక చేసిన టెన్నిస్‌ టీమ్‌. ఏఐటీఏ, మహేష్‌ భూపతి, లియాండర్‌ పేస్‌ ఎవరి వాదనలు ఎలా ఉన్నా వీరంతా దేశం కోసం వ్యక్తిగత పట్టింపులను పక్కకు పెట్టలేమని నిరూపించారు. అపార అనుభవం ఉన్న పేస్‌, భూపతి జోడిని ఒలింపిక్స్‌కు ఎంపిక చేయకపోవడమే అందుకు నిదర్శనం. పేస్‌, విష్ణువర్థన్‌ జోడి... ఒలింపిక్స్‌లో పతకం గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఫార్మాలిటీకి పార్టిసిపేట్‌ చేయడం మినహా ఈ జోడి పెద్దగా సాధించేది ఏమీ ఉండదని విశ్లేషకుల అభిప్రాయం. ఒలింపిక్స్‌లో ఆడితే భూపతి, బోపన్న పెయిర్‌ కూడా పతకం గెలుస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భూపతిని కాదని సానియా జోడిగా పేస్‌ను ఎందుకు ఎంపిక చేశారు.

-ఇటేవలే ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి జోరు మీదున్న సానియా, భూపతిని ఎందుకు కాదన్నారు. టెక్నికల్‌గా చూస్తే సానియాకు భూపతినే కరెక్ట్‌ జోడి. మెన్స్‌ డబుల్స్‌తో పాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ భారత్‌ పతకం గెలిచే అవకాశాలు సన్నగిల్లాయి. దేశ ప్రతిష్టను పణంగా పెట్టి ప్లేయర్లు పట్టింపులకు పోవడం చూస్తుంటే... అభిమానుల మనసు చివుక్కుమంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని క్రీడల్లో ప్రబలశక్తిగా చూడడం అత్యాశే అవుతుంది.

హాకీ
ఒలింపిక్స్‌లో హాకీ అంటే ఇండియాకు గోల్డ్‌ ఖాయం. మిగిలిన దేశాలు ఇతర పతకాల కోసమే పోటీ పడేవి. ఇయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఒలింపిక్స్‌కు క్వాలిఫై అవ డమే గగనం. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో హాకీ బెర్త్‌ మిస్సయిన ఇండి యా... లండన్‌కు అర్హత సాధించి పరువు కాపాడింది. ఇటు వంటి నేపథ్యంలో ఒలింపిక్స్‌ హాకీలో భారత ప్రస్థానం ఏంటి? 1928 నుంచి 1956 వరకూ మాత్రం స్వర్ణయుగమనాలి. వరుసగా ఆరు ఒలింపిక్స్‌లో భారత్‌ స్వర్ణ పతకాలు
సాధించిదంటే ఇండియా ప్రపంచ హాకీని ఎంతలా ఏలిందనేది అర్థం అవు తుంది. అయితే భారత్‌ ఆ జోరును కొన సాగించలేకపోయింది. అప్పటి నుంచి భారత హాకీ తిరోగమనంలో పయనించింది. తర్వాత 1964, 1980 ల్లో ఇండియా ఒలింపిక్స్‌ స్వర్ణాలు దక్కించుకుంది. ఆ తర్వాత హాకీలో ఇండియాకు ఒక్క గోల్డ్‌ మెడల్‌ కూడా రాలేదు. హాకీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనం ఆటతీరులో మార్పులు చేసుకోలేకపోవడం...ఇతర దే శాలు కఠోర సాధనతో బలీయంగా ఎదగడం తదితర కారణాల తో ఇండియా బలీహ నంగా మారింది. దీంతో ఎనిమిది స్వర్ణాలు కైవసం చేసు కున్నదేశం ఇప్పుడు క్వాలిఫై అవడానికే ముప్పుతిప్పలు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లండన్‌లో మెడల్‌ ఎంత దుర్లభమో అర్థం అవుతుంది. ఇండియా ఉన్న పూల్‌-బిలో జర్మనీ, నెదర్లాండ్స్‌, కొ రియా, న్యూజీలాండ్‌ లాంటి పటిష్టమైన దేశాలపైనా విజయాలు సాధించాలంటే మన గ్యాంగ్‌ తీవ్రంగా శ్రమించక తప్పదు.

బాక్సింగ్‌
ఈ ఒలింపిక్స్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళల బాక్సింగ్‌లో సత్తా చాటేందుకు ఇండియన్‌ స్టార్‌ మేరీ కోమ్‌ సిద్దమౌవు తోంది. ఐదు సార్లు వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ గెలిచిన ఈ మణిపురీ బాక్సర్‌ తర్వాతి లక్ష్యం లండన్‌ గోల్డ్‌మెడలే. దీనికోసం పూర్తి స్థాయిలో సిద్ధమైంది మేరీ కోమ్‌.


Courtesy with - దీవి సాయిమనోహర్‌ @surya Telugu daily  

  • ===================
 Visit My Website - > Dr.seshagirirao.com/

Saturday, February 16, 2013

World Radio day,ప్రపంచ రేడియో దినోత్సవం

  •  

  •  

  •  గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (ఫిబ్రవరి 13.) -World Radio day,ప్రపంచ రేడియో దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


ఫిబ్రవరి 13న జరగనున్న ప్రపంచ రేడియో దినోత్స వంతో సమానంగా యునెస్కో చొరవతో అదే రోజున 1946లో రేడియో యునైటెడ్‌ నేషన్స్‌ వ్యవస్థాపక దినోత్సవం కూడా జరగడం హర్షదాయకం. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని నిర్వహిం చేందుకు యునెస్కో సిద్ధమవుతున్నది. బిబిసి, రేడియో ఫ్రాన్స్‌ ఇంటర్నేషనల్‌, రేడియో ఎక్సిటిరియర్‌ డి ఎస్పనా, ది వాయిస్‌ ఆఫ్‌ రష్యా, రేడియో చైనా ఇంటర్నేషనల్‌ తదితర రేడియో కేంద్రాలన్నీ కూడా ఫిబ్రవరి 13న యునెస్కో ప్రధాన కార్యాలయం నుండి ప్రసారం కానున్నాయి. ప్రపంచ రేడియో దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయా రేడియోలు తమ కార్యక్రమాలను అక్కడ నుండి ప్రసారం చేయ నున్నాయి. ప్రపంచ రేడియో ఉత్సవాల సందర్భంగా ప్రస్తుత రేడియో జర్నలిజం, రేడియో చరిత్రలపై చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి. అదేవిధంగా ఎనౌన్సర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, షార్ట్‌వేవ్‌, యువతకు సంబంధించిన రేడియో కార్య క్రమాలు తదితర అంశాలపై విస్తృతస్థాయిలో చర్చా కార్య క్రమాలు జరగనున్నాయి. ఈ రోజుల్లో రేడియో ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉంది. ఏ సమయం లోనైనా సరే సుదూర ప్రాంత వార్తలను అందించడం లోనూ, పేదలు, మైనార్టీలు, మహిళలకు సంబం ధించిన సమస్యలపై తమ గొంతుకను వినిపించ డంలోనూ రేడియో ముందంజలో ఉందని యునెస్కో జనరల్‌ డైరెక్టర్‌ ఇరినాబొకొవా తెలిపారు. నేటి కాలంలో రేడియో అత్యంత సమాచార వనరుగా మారింది. ప్రపంచ జనాభాలో 95 శాతానికి పైగా ప్రజలు రేడియోను వినియోగిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి 75 శాతం మందికి పైగా గృహిణులు వివిధ అంశాల సమాచారం కోసం రేడియోపై ఆధార పడుతున్నారు.

సమాచార తరంగిణి ఆకాశవాణి

    భారతదేశంలో మెదటి రేడియో ప్రసారాలు 1923 జూన్‌లో రేడియో క్లబ్‌ ఆఫ్‌ బొంబారుూ ద్వారా ప్రసారమయ్యేవి.  తరువాత బ్రాడ్‌ కాష్టింగ్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా జూలై 1927లో కలకత్తా, బొంబాయి నగరాలలో ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ ప్రసారాలు చేసింది.  ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ప్రసారాలు చేసింది. 1936 సంవత్సరంలో ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది.  భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి 6 ఆకాశవాణి కేంద్రాలు (కలకత్తా, ఢిల్లీ, బొంబాయి, మద్రాసు, లక్నో, తిరుచిరాపల్లి) మాత్రమే ఉన్నాయి.

ఇప్పుడు 215 కేంద్రాలు 337 ప్రసార కేంద్రాల (144 ఎంవివి కేంద్రాలు, 54ఎస్‌వివి కేంద్రాలు, 139 ఎఫ్‌ఎం కేంద్రాలు)తో 77 ఆకాశవాణి కేంద్రాలు 99.13% ప్రజలకు ప్రస్తుతం ప్రజలకు సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి.  1938లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో తెలుగు కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు తేనెలొలికే తెలుగులో తొలి సారి తన వాణిని వినిపించిన మొదటి మహిళా అనౌన్సర్‌ శ్రీమతి పున్నావజ్జుల భానుమతిగారు. ఈమెను రేడియో భానుమతి అని కూడా పిలుస్తారు. ఈమె కూతురు జ్యోత్స్న కూడా రేడియో అనౌన్సర్‌గా రిటైర్‌ అయ్యింది.  తెలుగులో మొదటి రేడియో నాటకం ‘అనార్కలి’ మద్రాసు కేంద్రం ద్వారా 1938 జూన్‌లో ప్రసారమైంది. శ్రీయుత విశ్వనాథ సత్యనారాయణ, వింజమూరి నరసింహరావు, ముద్దు కృష్ణ సమర్పించి నటించారు.  నటుడు కొంగర జగ్గయ్య, ఉష శ్రీ, ప్రయాగ రామకృష్ణ లాంటి ఎందరో మహానుభావులు ఆకాశవాణిలో పనిచేశారు.   మన రాష్టంలో అదిలాబాద్‌, కడప, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, అనంతపురం, కర్నూలు, కొత్తగూడెం, నిజామాబాద్‌, తిరుపతి, వరంగల్‌లో ఆకాశవాణి ప్రసార కేంద్రాలు ఉన్నాయి.


ఆదరణ పెరిగింది
-ఈ మధ్య కాలంలో రేడియో ప్రసారాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఆల్‌ఇండియా రేడియో తోపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎఫ్‌ఎం రేడియోలు రావడం వల్ల శ్రోతలు ఆయా ప్రసారాలను వినడానికి పోటీ పడుతున్నారు. టివిల రాకతో రేడియో ప్రసారాలకు ఆదరణ తగ్గలేదు. టివి అనేది ఒకే దగ్గర కూర్చొని వీక్షించే అవకాశం ఉంది. కాని రేడియో మాత్రం ఎక్కడికైనా తీసుకువెళ్లే వీలుంది. వెస్ట్రన్‌ నుంచి ఈ కాన్సెప్ట్‌ను తీసకున్నారు. ముఖ్యంగా రేడియోలో ప్రయోజిత కార్యక్రమాలు, ఫోన్‌ఇన్‌ ప్రోగ్రామ్స్‌, ప్రత్యక్ష కార్యక్రమాలు, ఫిలిమ్‌ మ్యూజిక్‌ వంటి వారికి మంచి ఆదరణ ఉంటోంది. ప్రజలతో మమేకం అవ్వడం ఎక్కువైంది. దీంతో శ్రోతల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని సేకరించే వీలు ఎక్కువైంది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులు రేడియోను వింటూ తమ పనులు చేస్తున్నారు.----- సి.జయపాల్‌రెడ్డి, ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌,-ఆకాశవాణి కేంద్రం, వరంగల్‌

మనబాణి ఆకాశవాణి

పెన్నులోనూ... మెుబైల్‌ ఫోన్‌లోనూ... కారులోనూ... ఇతర వాహనాల్లోనూ రేడియోలు అమరిపోతున్నాయి . కాలక్షేపానికి, విజ్ఞాన సముపార్జనకు మంచి మాధ్యమంగా మారింది. రేడియో ఆకాశవాణిలో పనిచేసి.. తమ శ్రావ్యమైన స్వరంతో శ్రోతలను కట్టిపడేసి... ఓ వెలుగువెలిగిన పండితులు ఎందరో ఉన్నారు. ఉషశ్రీ రామాయణ వ్యాఖ్యానం రేడియోకు ఎంత పేరు తెచ్చిందో... ఆయనకూ..  రామాయణానికి అంతే ప్రఖ్యాతి తెచ్చింది. సినీ ప్రముఖులు, సాహితీ శ్రేష్ఠలు.. నాటకరంగ ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధులూ ఒకరేమిటి ఎందరో మహానుభావులకు ‘స్వరం గా'' మారింది మన రేడియో.



ఎడ్ల బండికి రేడియో పెట్టండి... పసిడి పంటలకు పట్టం కట్టండి , స్వాతంత్య్ర సమర సమయంలో అది బలమైన ప్రచారం సాధనం. కొత్తగా ఎన్ని మాధ్యమాలు పుట్టుకొస్తున్నా చెరగని ఆదరణ దీని సొంతం. గాంధీలాంటి వారితో సైతం కీర్తించబడిన ఘనత దీనిది. ఏం పెద్దయ్యా... అంటూ శ్రోతలు విన్నారంటే టక్కున చెప్పేస్తారు అది పాడిపంటలు కార్యక్రమమని. బాలవినోదం, బాలానందం లాంటి ప్రసారాలను అందిస్తూ చిన్నారులకు దగ్గరయింది. స్ర్తీలకు, కార్మికులకు ప్రత్యేక కార్యక్రమాలను ఇవ్వడంలో విన్నూత శైలి. ఇప్పటికీ చాలామంది విద్యకు సంబంధించిన ప్రసారాలను ఈ మాధ్యమంలోనే వింటారట.. ఎందుకంటే పూర్తి దృష్టి చేప్పేదానిపైనే ఉంటుంది కాబట్టి. దీన్ని ఎక్కడికంటే అక్కడికి తేలికగా తీసుకుపోవచ్చు... ఖర్చుకూ బయపడాల్సిన అవసరం లేదు. అందుకే రేడియో అందరి ఆదరణ పొందింది... ఎఫ్‌.ఎం.ల రాకతో జనాదరణ విపరీతంగా పెరిగింది. అయితే ఆకాశవాణి సంప్రదాయ రీతిలో హుందాగా కార్యక్రమాలను  నిర్వహిస్తుండగా.. ప్రైవేట్‌ ఎఫ్‌.ఎం.లు మారుతున్నపోకడలకు అనుగుణంగా రెచ్చిపోతున్నాయి.

ఎలా పనిచేస్తుంది...
- కాంతి వేగ పౌనపున్యాలతో విద్యుత్‌ అయస్కాంత తరంగాలను మాడ్యులేషన్‌తో గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేసేదే దూర శ్రవణ ప్రక్రియ అని అంటారు. ఇలాంటి శబ్దాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అని అంటారు. మొదటి రోజులలో వాల్‌‌వలను ఉపయోగించి తయారు చేసేవారు. వీటికి ఎక్కువ విద్యుత్‌ వినియోగంతో పాటు పరిమాణంలోనూ చాలా పెద్దవిగా ఉండేవి. ప్రస్తుత టెలివిజన్‌లా ఒక చోట ఉంచి మాత్రమే వినాల్సి వచ్చేది. 1960 వచ్చేటప్పటికి, ట్రాన్సిస్టర్లు వచ్చాయి. వీటితో తయారైన రేడియో అందుబాటులోకి వచ్చింది. ఇవి తక్కువ విద్యుత్‌తో పాటు బ్యాటరీల  ద్వారా కూడా పనిచేసేవి. రానురాను సాంకేతిక అభివృద్ధి చెందడంతో ఈ రేడియోలు అతి చిన్న పరిమాణంలోకి మారాయి. ప్రసుత్తం ప్రతీ మొబైల్‌లో రేడియో అప్లికేషన్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నారు.

రకాలు...
ప్రజలు వినే రేడియో తరంగాలు మూడు రకాల ఫ్రీక్వెన్సీలలో ఉంటాయి. మధ్య తరహా(మీడియం వేవ్), అతి చిన్న తరంగాలు(షార్ట్ వేవ్), ఎఫ్‌.ఎమ్‌(ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్‌) . 
 మధ్య తరహా తరంగాలు : ఈ ఫ్రీక్వెన్సీని ముఖ్యంగా కొద్ది ప్రాంతంలో అంటే 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధి వరకు ప్రసారానికి వాడతారు. ఈ ప్రసారాలలో నాణ్యత, ధ్వనిలో స్వచ్ఛత మధ్య రకంగా ఉంటుంది. మనం వింటున్న హైదరాబాద్‌, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు ఈ విధమైన ప్రసారాలు
చేస్తున్నాయి.‚

అతి చిన్న తరంగాలు : ఈ ప్రీక్వెన్సీని సుదూర ప్రాంతాలకు ప్రసారానికి వాడతారు. రేడియో ట్రాన్స్‌మిటర్‌కు అనుసంధించిన ఏరియల్‌ కోణాన్ని బట్టి  ప్రసార దూరాన్ని నియంత్రిస్తారు. సామాన్యంగా 3500 కిలోమీటర్లను దాటి ఈ ప్రసారాలు ఉంటాయి. ట్రాన్స్‌మిటరు ఏరియల్‌ కోణాన్ని నియంత్రించి ఈ దూరాన్ని పెంచవచ్చు.. తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో జరెగే ప్రసారాలు చాలా దూరం వినబడినా, ధ్వనిలో నాణ్యత ఉండదు. ప్రస్తుతం ఈ పద్ధతిలో చాలా తక్కువ రేడియో స్టేషన్‌లు ప్రసారాలు చేస్తున్నాయి. బి.బి.సి, వి.వొ.ఎ అనే అంతర్జాతీయ రేడియో సంస్థలు ఈ విధానంలో దశాబ్దాలపాటు ప్రసారాలు చేశాయి.. చేస్తున్నాయి.

ఎఫ్‌.ఎమ్‌. : ఈ ప్రీక్వెన్సీని తక్కువ పరిధిలో ప్రసారాలకు వాడతారు. ప్రస్తుతం ఈ ప్రసార విధానంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రేడియో స్టేషన్‌లు ప్రసారాలు అందిస్తున్నాయి. మన భారతదేశంలో కూడ అనేక ప్రైవేట్‌ ఛానల్స్‌ ఈ విధానాన్నే పాటిస్తున్నాయి. రేడియో మిర్చి, రెడ్‌ ఎఫ్‌.ఎమ్‌., (93.5) ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయి. ఈ ధ్వని తరంగాలు ప్రసారమయ్యే మధ్యలో ఎతైన భవంతులు, కొండలు వస్తే అక్కడితో ఆగిపోతాయి. వచ్చినంత వరకైనా ఈ పద్ధతిలోని ప్రసారాలు నాణ్యతను, ధ్వని స్వచ్ఛతను కలిగి ఉంటాయి. ఇవి కాక, సాంకేతిక పరిజ్ఞాన్ని వాడుకొని శాటిలైటు రేడియోలు, ఇంటర్‌నెట్‌ రేడియోలు కూడా కొన్నిచోట్ల అందుబాటులో ఉన్నాయి.

రెయిన్‌బో : కొత్తగా వస్తున్న ఎఫ్‌.ఎం.లకు ధీటుగా ఆకాశవాణి తింటే గారెలే తినాలి... వింటే రెయిన్‌బో వినాలి అంటూ దాని అనుబంధ ఎఫ్‌.ఎం. ‘రెయిన్‌బో’
ప్రచారం చేపట్టింది. దీనికి విస్తృత ప్రచారం కల్పించడం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఆకాశవాణి...
-ఆలిండియా రేడియో(ఎ.ఐ.ఆర్‌) ప్రభుత్వ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార యంత్రాంగ అధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి విభాగం. దూరదర్శన్‌ కూడ ప్రసార భారతిలో భాగమే. ఆకాశవాణి ప్రపంచంలోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం పార్లమెంట్‌ వీధిలో భారత పార్లమెంట్‌ పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్‌లో ఉంది. ఆకాశవాణి భవన్‌లో నాటక విభాగం, ఎఫ్‌.ఎం రేడియో విభాగం, జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రసారమయ్యే స్టేషన్‌ కూడా ఉంది. ఈ స్టేషన్‌లో 24 గంటలు కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి.

నాటి గొంతులు వినోచ్చు...
23 భాషల్లో విభిన్న మతాలకు సంబంధించిన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విషయాలను అందించడంలో ఆకాశవాణి ఎప్పుకప్పుడు ముందుం టోంది. దాదాపు 100 నుంచి 80 ఏళ్ల క్రితం నాటి ప్రముఖుల ఇంటర్వ్యూలు ఇక్కడి లైబ్రరీలో నిక్షిప్తమయి ఉన్నాయి. గ్రామ్‌ ఫోన్‌ రికార్డుల నుంచి ఇప్పటి డీవీడీల వరకు లభ్యమవుతాయి. గాంధీ, నెహ్రూ లాంటి ప్రముఖులు సొంత గొంతు వినాలన్నా మా వద్ద రికార్డు అయి ఉంటుంది. ఇందిరాగాంధీ లాంటి వారు రేడియోలో మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ముందస్తు సిద్ధమై మాట్లాడేవారు. ప్రస్తుతం ఆరు స్టేషన్లపై ప్రసారాలు అందిస్తున్నాము.- - - -- శ్రీలక్ష్మి, ఆకాశవాణి, హైదరాబాద్‌


సభ్యతతో ఆదరణ
ఇతర ఎఫ్‌.ఎంల్లోలాగా ఆకాశవాణి కార్యక్రమాల్లో ఎక్కడా అసభ్య పదజాలంగాని, ద్వంద్వ అర్థాలు వచ్చే ఉచ్చరణగాని ఉండదు. శ్రోతలకు నమస్కారం అంటూ కార్యక్రమాలను ప్రారంభిస్తాం. అందుకే రేడియో ప్రసారాల్లో ఆకాశవాణికి ఆదరణ ఎక్కువగా ఉంది. పాత తరం నుంచి కొత్త తరం వివిధ సంగీత పరికరాల కచేరీలను అందిస్తున్నాం. మధ్య తరగతి వారిని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ కార్యక్రమాలను ప్రసారం చేస్తాం.. విద్య, సమాచారం, వినోదం ఈ మూడు రంగాలను సమ తూకంతో ఆకాశవాణి ప్రసారాలు ఉంటాయి. ప్రస్తుతం మూడు పద్దతుల్లో ప్రసారాలు అందిస్తున్నాం.. ప్రయిమరీ (150కి.మీ.), సెకండరీ(300 కి.మీ.), తర్డ్‌(450 కి.మీ.) వీటిలో ఉన్నాయి.- - -- ఎస్‌.రమేష్‌, ట్రాన్సిమిషన్‌ ఎగ్జిక్యూటివ్‌, ఆకాశవాణి, హైదరాబాద్‌


అందరి హృదయవాణి...
-మారుతున్న కాలనుగుణంగా ఎప్పుటికప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు అందించడంలో ఆకాశవాణి ముందుంటోంది. కళలు, సాహిత్యం గురించి ఎంతగానో ప్రసారం చేస్తున్నాం... పాతతరం ప్రముఖులు జీవిత విశేషాలపై మూడు గంటలు ‘నా జీవన యానం’ పేర పలు విషయాలను అందిస్తున్నాం. ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రఖ్యాత కవి విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘వేయి పడగలు’ నవలను నాటక రూపంలో అందించడానికి ఏర్పాట్లు చేశాము. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, నాటి కవులు, కళాకారులు, కళల గురించి, నాటి సుమధుర గీతాలు, విద్య, సామాజిక అంశాలు, ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం ఇలా ఒకటేమిటి ఎన్నో బృహత్తర ప్రసారాలను శ్రోతలకు అందిస్తున్నాము. ఈ క్రమంలో అందుకున్న పురస్కారాలు అనేకం.. తాజా ఎల్లమ్మ కొడుకు రాములు రూపకానికి  డాక్యుమెంటరీ విభాగంలో జాతీయ పురస్కారం వచ్చింది... ఇది ఈ నెల 16న అందుకోవాల్సి ఉంది. సైకిల్‌ ఉన్నంత వరకు రేడియో ఉంటుంది. ఆదరణ తగ్గింది అని అనుకోవడం అపోహ మాత్రమే...- మంగళగిరి ఆదిత్యప్రసాద్‌, స్టేషన్‌ డైరెక్టర్‌, ఐ.బి.ఎస్‌, ఆకాశవాణి, హైదరాబాద్‌


పాడిపంటలు...
-ఏం పెద్దయ్యా... ఎండలు అప్పుడే ఇలా మండిపోతున్నయ్‌... ఇగ రెండు నెలలు పోతే ఎట్టా ఉంటుందో ఏమో... చేలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతా ఉన్నాము... కనీసం తోటలకు చుక్కల(డ్రిప్‌) తడికైనా నీళ్లు లేవాయే.... అంటూ పాడిపంటలు కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు డా.కె. విజయ. వ్యవసాయ కార్యక్రమాలపై ఆమె స్పందిస్తూ... రోజుకు మూడుసార్లు వ్యవసాయ రంగంపై కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాం. చిన్న, సన్న కారు రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా సలహాలు, సూచనలు అందిస్తాము. ఒక్కొక్కసారి రైతుల సూచనల మేరకు కూడా ఆయా పంటపై కార్యక్రమాలను ప్రసారం చేస్తాం.. సేంద్రియ ఎరువుల వాడకంపై  ప్రోత్సహిస్తున్నాం. చదువురాని వారికి, పల్లె ప్రజలకు అర్థమయ్యే రీతిలో  జానపదాలు, పాఠల రూపంలో వివరాలను అందిస్తున్నాం.. రైతులు-అధికారులు-శాస్తవ్రేత్తలు- ప్రభుత్వం వీరి మధ్య వారధిగా ఆకాశవాణి పనిచేస్తోంది. వ్యవసాయంపై ఇన్ని కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న మాధ్యమం మరోటి లేదు..- - - డా.కె.విజయ, కార్యక్రమ నిర్వహణ అధికారి, వ్యవసాయదారుల విభాగం, ఆకాశవాణి, హైదరాబాద్‌


రేడియో అద్భుతమైన, శక్తివంతమైన ప్రసార సాధనం.. దేవుడిలో ఉన్న అద్భుతం అందులో ఉంది. - మహాత్మాగాంధీ, చివరి రేడియో ప్రసంగం (1947 నవంబర్‌ 12)


వ్యవసాయం...
వ్యవసాయ విషయాలను రైతులకు చెప్పడానికి 1966లో పంటసీమలు   కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించడం,  నిర్వహించడంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అప్పట్లో పని చేస్తున్న శ్రీ గుమ్మలూరి సత్యనారాయణగారి కృషి ఎంతగానో ఉంది. పంటల గురించి, కొత్త రకాల వంగడాలు, సస్యరక్షణ, వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు చక్కగా వివరించే కార్యక్రమాలు ప్రసారం చేసి ఆయా కార్యక్రమాల ద్వారా వ్యవసాయదారులకు ఎంతగానో దగ్గరయ్యారు. రైతులకు వారి భాషలో, అయా ప్రాంతాల యాసలలో, ఒక్కొక్కసారి అనుభవజ్ఞులైన రైతులతో సంభాషణలు పొందుపరచి కార్యక్రమాన్ని ఆసక్తి కరంగా వినిపించేవారు. ప్రభుత్వ వ్యవసాయ విభాగాలు, రైతులకు చెప్పాల్సిన విషయాలను ఈ కార్యక్రమం ద్వారా అందించేవి. పంటల గురించే కాక, పశు సంరక్షణ, పాడి పశువులను సాకడం కూడా చక్కగా వివరించేవారు. ప్రస్తుతం టీవీల్లో వస్తున్న కార్యక్రమాలకు స్పూర్తి, రేడియోలో వచ్చే పంటసీమలు కార్యక్రమమే కావడం గమనార్హం. దేశాభివృద్ధిలో రేడియో పాత్ర
దేశాభివృద్ధిలో ప్రభుత్వాధీంలో ఉన్న రేడియో, అన్ని రంగాలలోనూ సమాచారాన్ని ఇస్తూ దేశ సమగ్రతకూ, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోంది.

సంఘం రేడియో...
దళిత మహిళలు ప్రారంభించిన సంఘం రేడియో ఆసియాలోనే తొలి మహిళా రేడియో. భారత్‌లోనే తొలి గ్రామీణ కమ్యూనిటీ రేడియో. జహీరాబాద్‌కు ఐదారు మైళ్ల దూరంలోని మాచునూరు గ్రామంలో ఇది మొగ్గతొడిగింది. ఇది జనం కోసం, జనమే నడిపే రేడియో. దీని కార్యక్రమాలు ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ప్రసారమవుతాయి. జహీరాబాద్‌ చుట్టుపక్కల పాతిక  కిలోమీటర్ల పరిధిలోని నూట యాభై పల్లెల్లో సంఘం రేడియో వినొచ్చు. పస్తాపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న దక్కన్‌ డెవలప్‌ మెంట్‌ సొసైటీ(డీ.డీ.ఎస్‌.) అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ల తరుఫున పోరాడింది. సంఘం మనుషులు ఏ చెట్టు కిందో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న పెద్దల ముందు మైకుపెడతారు. వాళ్ల అనుభవ  సారమంతా రికార్డు అవుతుంది. ఇలా వారి జీవితానుభవాలను పిల్లలు తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. కొంత మంది కథలు చెబుతారు.. మరి కొందరు సంగీత కచేరీ కూడా చేస్తారు. బుందేల్‌ఖండ్‌లో కూడా ఈ మధ్యే కార్యక్రమాలు ప్రారంభమ య్యాయి.

కచ్‌ మహిళా వికాస్‌ సంఘటన్‌(గుజరాత్‌), ఆల్టర్నేటివ్‌ ఫర్‌ ఇండియా  డెవలప్‌మెంట్‌ (జార్ఖండ్‌), వాయిస్‌ ప్రాజెక్ట్‌ (కర్ణాటక)... ఇప్పటికే కమ్యూనిటీ రేడియోల్ని జనానికి పరిచయం చేశాయి. ఇంకో ఏడాదిలో పాతిక దాకా కొత్త రేడియోలు రావచ్చని ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ రేడియో ఫోరం అంచనా చెబుతోంది. కమ్యూనిటీ రేడియో లైసెన్సు కింద చాలా విశ్వవిద్యాలయాలు సొంత స్టేషన్లు పెట్టుకున్నాయి. ఒక యూనిట్‌ స్థాపనకు ఐదు లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతోంది.

మూలము : వివిధ వార్తా పత్రికల కదనాల ఆదారముగా .
  • ================== 
Visit My Website - > Dr.seshagirirao.com/

Thursday, January 10, 2013

National Farmers Day - జాతీయ రైతు దినోత్సవం


  •  

  •  
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసెంబర్‌ 23 న) -రైతు దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

డిసెంబర్‌ 23 న -అంతర్జాతీయ రైతు దినోత్సవం (ఇంటర్నేషనల్‌ ఫార్మర్స్‌ డే). మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌సింగ్‌ జన్మదినం అయిన ఈ రోజును భారత్‌లో రైతు దినోత్సవం (కిసాన్‌ దివస్‌) గా జరుపుకుంటారు. భారత భాగ్య విధాతా! జీవన సౌభాగ్య ప్రధాతా! ఓ రైతన్నా నీకు మా నెనరులు!
ఈ లోకాన్నీ నడిపించే ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడైతే ఆ సూర్యుడినుండి వచ్చే శక్తిని వినియోగించుకుని లోకములోని ప్రజలందరి ఆకలి బాధను తొలగించె పరోక్ష దైవాలు రైతులు. నేలతల్లిని నమ్ముకొని , పలురకాల ప్రతికూల పరిష్తితులను తట్టుకుంటూ , శ్రమించి పంటలను పండించి దేశ ఆర్ధికవ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తారు వ్యవసాయధారులు . ఒకప్పుడు అందరి వృత్తీ వ్యవసాయమే.
--
రైతుకుటుంబము నుండి వచ్చి ప్రధాని పదవిని అలంకరించిన చరణసింగ్ జన్మదినమైన డిశంబరు 23 ని జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం గా (కిసాన్‌ దివస్ ) జరుపుకుంటోంది భారతదేశము.

అంతర్జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం ఏప్రిల్ 17 న జరుపుతారు. అయితే మనదేశము తమకంటూ ప్రత్యేకముగా వ్యవసాయదారుల దినోత్సవం ఉండాలనే లక్ష్యముతో చౌదరి చరణ్ సింగ్ జన్మదినోస్తవాన్ని అందుకు ఎంచుకున్నారు.  చౌదరి చరణ్ సింగ్ చేపట్టిన ఉద్యమాల ఫలితం గానే జమీందారీ చట్టం రద్దు అయింది. కౌలుదారీ చట్టం వచ్చింది. మరికొందరు నాయకుల ఆలోచనల నుండి భూసంస్కరణలొచ్చాయి. పేదలకు భూముల పంపిణీ జరిగింది. వ్యవసాయదారులకు అనుకూలమైన  పరురకాల విధానాలను రూపొందించడం జరిగింది. రైతులను  వడ్డీ్వ్యాపారుల కబంధహస్తాలనుండి విడిపించి వారికి బ్యాం ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టేలా చేయడం వెనుక చరణ్ సింగ్ నిర్వహించిన రైతు ఉద్యమాలున్నాయి. రైతుల గురించి , వ్యవసారం గురించి అంతగా ఆలోచించి , వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన చరణ్ సింగ్ దేశ ప్రధాని అయినపుడు రైతాంగం ఆనందపడింది .  అయితే ఆయన పార్లమెంట్ ని ఎదుర్కోలేకపోయి  తాత్కాలిక ప్రధానిగానే 1980 వ సంవత్సరము పదవి నుండి తప్పుకోవాల్సివచ్చింది. చరణ్ సింగ్ రైతు నాయకుడిగానే 1987 మే 29 న మరణించారు. రైతులకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని " కిసాన్‌ దివస్ " గా ప్రకటించింది.

వ్యవసాయం

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార మరియు ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి (Agriculture) అంటారు. వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్ధిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము.
ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమిష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే నని అంచనా.

చరిత్ర

ఆదిమ మానవులు మొదటగా జంతువుల మాంసం, దుంపలు, కాయలు, పండ్లు మొదలైన వాటిని ఆహారంగా తీసుకునేవారు. కొంత కాలమైన తర్వాత నెమ్మదిగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని కొద్ది మొత్తంలో ఆహారాన్ని ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు. ఆధునిక పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పప్పుదినుసులు మొదలైన ఆహార పదార్థాలు, పశుపోషణ మొదలైన వృత్తులు క్రీపూ 7000 లోనే మధ్యధరా ప్రాంతానికి చెందిన దేశాల్లో బాగా వ్యాప్తి చెంది ఉండేవి. . క్రీ.పూ 3000 నాటికి ఈజిప్షియన్లు, మెసపుటేమియన్లు పెద్ద ఎత్తున వ్యవసాయ పద్ధుతులు, ఎరువుల వాడకం, సాగునీటి పద్ధతులు చేపట్టారు

హరిత విప్లవం

భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి ఒక కారణం వ్యవసాయంలో పురాతన పద్దతులు పాటించడం. వ్యవసాయంలో యాంత్రీకరణం ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పాదకతలను పెంచే నిమిత్తమై మూడో ప్రణాళికా కాలం నుంచే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించడం ఈ ప్రణాళిక యొక్క ముఖ్యోద్దేశం.

భారతదేశంలో వ్యవసాయం--భారతదేశంలో పంట కాలాన్ని మూడు విధాలుగా వర్గీకరించారు. అవి
    ఖరీఫ్ పంట కాలం : జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్క జొన్న, పత్తి,చెరకు, నువ్వులు, సోయాబీన్, వేరు శనగ.
    రబీ పంటకాలం : అక్టోబర్ నుంచి మార్చి, ఏప్రిల్ వరకు సాగయ్యే పంటలు - గోధుమ, బార్లీ, మినుములు, ప్రొద్దు తిరుగుడు, ధనియాలు, ఆవాలు మొదలైనవి.
    జైద్ పంటకాలం : మార్చి నుంచి జూన్ వరకు సాగయ్యే పంటలు - పుచ్చకాయలు, దోస కాయలు, కూరగాయలు, మొదలైనవి.


  • =============================

 Visit My Website - > Dr.seshagirirao.com/