Thursday, April 4, 2013

Olympic Day,ఒలింపిక్‌ క్రీడల దినోత్సవంగత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (23 June) -Olympic Day,ఒలింపిక్‌ క్రీడల దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


On 23 June, Olympic Day is celebrated all around the world: hundreds of thousands of people – young and old – get moving and participate in sporting and cultural activities, such as runs, exhibitions, music and educational seminars. Over the last two decades, the event has helped to spread the Olympic ideals to every corner of the world.

ఒలింపిక్‌ క్రీడలు... ఈ మాట వింటేనే క్రీడాకారులతో పాటు క్రీడాభిమానుల మది పులకిస్తుంది. క్రీడా స్ఫూర్తికి ఎవరెస్ట్‌గా భావించే ఒలింపిక్‌ క్రీడల్లో కనీసం ఒక్కసారైనా పాల్గొనాలని, పతకం దక్కించుకోవాలని ప్రతి క్రీడాకారుడు ఉవ్విళ్లూరుతుంటాడు. ఖండాంతర ఖ్యాతినార్జించిపెట్టే ఒలింపిక్‌ మెడల్‌ అంటే ఏ క్రీడాకారుడికి ఇష్టముండదు చెప్పండి! అలాంటి మహత్తర క్రీడా సమరానికి మరోసారి క్రీడాప్రపంచం సన్నద్ధమైంది. లండన్‌ వేదికగా... ఈ నెల 27 నుండి ప్రారంభం కానున్న వేసవి ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనడానికి 203 దేశాలు... 36 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు... సర్వసన్నద్ధమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్‌ చరిత్ర, ప్రస్తుత ఒలింపిక్‌ క్రీడలు, ఒలింపి్‌ క్రీడల్లో భారత్‌ పాత్ర... ఇత్యాది విషయాలపై ప్రత్యేక కథనం...

-ఒలింపిక్‌ మోటో... సిటియస్‌, ఆల్టియస్‌, ఫోర్టియస్‌... (ఫాస్టర్‌ (వేగంగా), హయ్య ర్‌ (ఎత్తుగా), స్ట్రాంగర్‌... (బలీయంగా)) అనే నినాదాన్ని క్రీడాకారులు తమ మదిలో అణువణువునా నింపుకొని ప్రతిష్టాత్మక లండన్‌ ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యారు. 27వ తేదీనుంచి తెరలోవబోతున్న ఈ ఈవెంట్‌ కోసం లండన్‌లో స్టేడియాలన్నీ సర్వహంగులతో ముస్తాబయ్యాయి. ఒలింపిక్స్‌లో పాలుపంచుకోనున్న దాదాపు అన్ని దేశాల క్రీడాకారులు తమ అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకొని లండన్‌ చేరుకున్నారు. క్రీడాసమరానికి మరికొద్ది రోజులే మిగిలివుంది.

ఒలింపిక్స్‌ పుట్టు పూర్వోత్తరాలు
ఒలింపిక్‌ క్రీడలు ప్రతి నాలుగేళ్ళ కోసారి జరుగుతాయి. క్రీ.పూ.776 లో ప్రారంభమైన ఒలింపిక్‌ క్రీడలు క్రీ.శ.393లో నిలిపివేశారు. మళ్ళీ క్రీ.శ.1896లో ఏథెన్స్‌లో ప్రారంభ మయ్యాయి. అప్పటి నుంచి మధ్యలో కొంతకాలం ప్రపంచ యుద్ధాల వల్ల అంతరాయం ఏర్పడినా...  దాదాపు నాలుగేళ్లకోసారి ఈ క్రీడలు జరుగుతూనేవు న్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ ఆధునిక క్రీడలకు ముఖ్యకారకుడు ఫ్రాన్స్‌ దేశానికి చెందిన పియరె డి కోబర్టీన్‌. 1924 నుంచి
సీతాకాలపు ఒలింపిక్‌ క్రీడలను కూడా జరుపుతున్నారు. 1896లో ప్రారంభమైన ఒలింపిక్‌  క్రీడలను వేసవి ఒలింపిక్‌ క్రీడలుగా పిలుస్తున్నారు. ఇంతవరకూ 29 వేసవి ఒలింపిక్‌ క్రీడలు జరుగగా 30వ ఒలింపిక్‌ క్రీడలు ఈసారి లండన్లో జరుగుతున్నాయి.

ప్రాచీన ఒలింపిక్‌ క్రీడలు
క్రీ.పూ.8వ శతాబ్దంలో ప్రాచీన గ్రీక్‌ సామ్రా జ్యం అనేక రాజ్యాలుగా చీలి ఉండేది. వాటి మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. శాంతి సామరస్యాలకు క్రీడలు పరిష్కారం చూపుతాయని గ్రహించిన గ్రీకులు క్రీ.పూ 776లో మొదటిసారిగా ఈ క్రీడలను నిర్వహించారు. అప్పటి నుంచి క్రీ.శ 393 వరకూ ప్రతి నాలుగేళ్లకోసారి ఒలింపిక్‌ క్రీడ లు సాఫీగానే జరుపుతున్నారు. ఈ పోటీలు జరిగేటప్పుడు యుద్ధాలు కూడా ఆపేవారు. అప్పట్లో ఈ క్రీడల్లో విజేతలకు ఆలివ్‌ కొమ్మలను గిఫ్ట్‌గా ఇచ్చేవారు. ఈ పోటీలు కూడా ఒక్కరోజు మాత్రమే జరిగేవి. ఈ పోటీ లకు జనాదరణ పెరగడంతో రోజులు, క్రీడాం శాలు పెరిగాయి.  పరుగుపందెం, కుస్తీ, రథా ల పోటీ, బాక్సింగ్‌, గుర్రపు స్వారీ అప్పట్లో జరిగే పోటీలు. ఆ తరువాత రోమన్‌ చక్రవర్తి థియోడొసియన్‌ గ్రీకు సామ్రాజ్యాన్ని జయిం చి ఈ పోటీలను నిషేధించాడు. ఆ తరువా త ఒలింపస్‌ పట్టణం వరదలు, భూకంపాల కారణంగా కాలగర్భంలో కలిసిపోయింది.

ఆధునిక ఒలింపిక్‌ క్రీడలు
-ఆ తరువాత ఈ క్రీడా పోటీ లకు జీవం పోసిన ఘనత ఫ్రాన్స్‌కు చెందిన క్రీడా పండి తుడు పియరీ డి కోబర్టీస్‌కే దక్కుతుంది. 1896లో ఒలింపిక్‌ క్రీడలను పునరుద్ద రించారు. ఎథెన్స్‌లో ఈ పోటీ లు జరిగాయి. ఆ తరువాత 6 ఒలింపిక్‌ క్రీడలు జరుగగా నే 1916లో బెర్లిన్‌లో జరగా ల్సిన పోటీలు మొదటి ప్రపం చ యుద్ధం కారణంగా రద్ద య్యాయయి. మళ్ళీ 1940, 44లలో జరగాల్సిన హెల్సింకీ, లండన్‌ ఒలింపిక్‌ క్రీడలు కూడా రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 
రద్దయ్యాయి. ఆ తరువాత ఈ క్రీడా పోటీలు నిరాటంకంగా జరుతున్నా... రాజకీయ   కారణాలతో అప్పుడప్పుడూ కొన్ని దేశాలు బహిష్కరిస్తున్నాయి. 1964 నుంచి చాలాకాలం పాటు దక్షిణాఫ్రికా ఈ పోటీల్లో పాల్గొనకుండా నిషేధించారు.

ఒలింపిక్స్‌ లోగో
రంగురంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించే చిహ్నమే ఒలింపిక్‌ చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నం. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా ఖండాలు కూడా కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిహ్నాల్ని ఎంపిక చేశారు. 1913లో రూ పొందించిన ఈ చిహ్నాం తొలిసారిగా 1914 లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలిం పిక్‌ క్రీడలలో ఈ లోగోను వాడుతున్నారు.

మొదటి క్రీడలు
1896లో ఏథెన్స్‌లో జరిగిన తొలి ఒలింపిక్‌ క్రీడలలో అథ్లెటిక్స్‌, సైక్లింగ్‌, కత్తియుద్ధం, జిమ్నాస్టిక్స్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, షూటింగ్‌, స్వి మ్మింగ్‌, టెన్నిస్‌, మల్లయుద్ధం వంటి 9 రకాల పోటీలు జరిగేవి. తర్వాత పోటీ అంశాలు పెరిగి ప్రస్తుతం 36 క్రీడాంశాలకు చేరింది. ఇక క్రీడాకారుల దృష్టిలో ఒలింపిక్‌ స్వర్ణ పతకం సాధించడమే అన్నిటి కంటే పెద్ద గౌరవం. ఒలింపిక్‌ చరిత్రలో అనేక స్వర్ణ పతకా లు సాధించిన క్రీడాకారులు కూడా ఉన్నారు. భారత్‌ తరపు న ఇంతవరకూ వ్యక్తిగత పోటీ లలో ఎవరూ స్వర్ణం సాధించ లేదు గానీ, మిల్కా సింగ్‌, పిటి ఉషలు తృటి లో పతకాలు సాధించే అవకాశాలు పోగొట్టు కున్నారు.

అభినవ్‌ బింద్రా 2008లో స్వర్ణం సాధించాడు.

2008లో బీజింగ్‌లో జరిగిన పోటీలు ఆగస్టు 8 శుక్రవారం రాత్రి 8-08 నిమిషాల నుంచి బీజింగ్‌లోని పిట్టగూడు (బర్డ్‌నెస్ట్‌) జాతీయ క్రీ డా ప్రాంగణంలో మైదానం మధ్యలో భూగో ళంలా ఏర్పాటు చేసిన తాత్కాలిక వేదికపై చై నా గాయకుడు లియూ హువాన్‌, బ్రిటన్‌ గా యని సారా బ్రిగామ్‌ కలిసి క్రీడల సందేశ గీతాన్ని ఆలపించిన తరువాత పోటీలు ప్రారంభమయ్యాయి. 16 రోజులు జరిగిన క్రీడల్లో మొత్తం 906 పతకాల కోసం 205 దేశాలకు చెందిన 10వేల ఐదువందల మంది క్రీడాకారులు పోటీపడ్డారు. ఇక లండన్‌లో ఇప్పుడు జరుగనున్న పోటీలకు 203 దేశాల నుంచి 36 క్రీడాంశాలలో పోటీ పడనున్నారు.

వినూత్న రీతిలో ఒలింపిక్‌ 2012
2012 ఒలింపిక్‌ క్రీడలను నభూతో నభవి ష్యతి అన్న రీతిలో జరిపేందుకు లండన్‌ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఓపెనింగ్‌ సెరమనీ క్రీ డల నిర్వహణ మొదలుకొని ముగింపు వేడు కల కోసం వినూత్న రీతిలో ప్లాన్‌చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో ఒలింపిక్‌ పతక విజేత లకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా నిర్వహించాలని లండన్‌ ఒలింపిక్‌ కమిటీ భావిస్తోంది. బ్రిటీష్‌ సంప్రదాయాన్ని ఒలింపిక్‌ స్ఫూర్తి చాటే విధంగా మోడల్‌
సెరమనీ కోసం పోడియం మోడల్‌ సెరమనీలో కాస్ట్యూమ్స్‌ తయారు చేయించింది.

2012 ఒలిపింక్స్‌ మస్కట్లు, థీమ్‌ సాంగ్స్‌
-మరోవైపు లండలన్‌ ఒలింపిక్స్‌ మస్కట్లు వెల్‌నాక్‌, మాండవెల్లి ప్రపంచమంతా సందడి చేస్తున్నాయి. వెల్‌నాక్‌, మాండవెల్లిపై బ్రిటిష్‌ రైటర్‌ మైకేల్‌ మార్పర్గో రాసిన కథల ఆధా రంగా లండన్‌ ఒలింపిక్‌ కమిటీ మూడు యానిమేషన్‌ షార్ట్‌ ఫిలిమ్స్‌ నిర్మించింది. దీన్ని   ఇంటర్‌నెట్‌లో ఈ మస్కట్ల లఘు చిత్రాలు వీక్షకుల్ని అలరిస్తున్నాయి. వీటిలో తొలి షార్ట్‌ ఫిల్మ్‌ ... ఔట్‌ ఆఫ్‌ రెయిన్‌ బో... వెల్‌నాక్‌, మాండవెల్లి ఏ విధంగా పుట్టాయో ఆటలను ఎలా నేర్చుకున్నాయో అన్నదే ఈ షార్ట్‌ ఫిల్మ్‌ కథ. ఇక వెల్‌నాక్‌, మాండవెల్లిలు చేసే సాహ సాలపై తీసిన చిత్రమే ‘‘అడ్వంచర్స్‌ ఆన్‌ ఎ రైయిన్‌బో ’’. ఇందులో లండన్‌ ఒలింపిక్‌ అథ్లెట్ల పాత్రలు కూడా ఉన్నాయి. స్టార్‌ అథ్లెట్ల ను కలుసుకున్న ఒలింపిక్‌ మస్కట్లు చేసే సా హాసాలు పిల్లల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక అడ్వెంచర్‌ రెయిన్‌ బోకి సీక్వెల్‌గా రెస్క్యూ రెయిన్‌ బో అనే మూడో షార్ట్‌ ఫిల్మ్‌ను తయా రు చేశారు. ఇందులో తుఫాన్‌ భీభత్సం ధ్వం సమైన స్కూల్‌ లైబ్రరీని అథ్లెట్ల సహాయంతో వెల్‌నాక్‌, మాండవెల్లి పునర్మిస్తారు.

ఇక ఈ లండన్‌ ఒలింపిక్స్‌ కోసం తయారు చేసిన అఫీషియల్‌ థీమ్‌ సాంగ్‌ నెట్‌లో సందడి చేస్తోంది. ప్రఖ్యాత రాక్‌ బ్యాండ్‌ మ్యూన్‌ నిర్మించిన గేమ్స్‌ థీమ్‌ సాంగ్‌ను గత నెల 27న విడుదల చేశారు. మ్యూన్‌ సర్వైవర్‌ పేరుతో రూపొందించిన ఈ వీడియో సాంగ్‌ను ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదా పు 10 లక్షల మంది వీక్షించారు. ప్రముఖ ఇంగ్లీష్‌ మ్యూజీషియన్‌ మాథ్యూ బెల్లెమి రాసి కంపోజ్‌ చేసిన ఈ పాట ఒలింపిక్‌ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. ‘‘లైఫ్‌ ఈజ్‌ ఏరేస్‌... ఐమ్‌ గోయింగ్‌ టు విన్‌... అంటూ సాగే ఈ పాట నెటిజన్లను అలరిస్తోంది.

ఒలింపిక్స్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ జిమ్నాస్టిక్స్‌
-శరీరాన్ని హరివిల్లులా వంచాలి... ఒంట్లో ఎముకలు ఉన్నాయా... లేవా అనేట్టుగా... బాడీ రబ్బరు బొమ్మను తలపించాలి... ప్రక్షకులు రెప్పవేయడం  మరచిపోయే టట్టు చేయాలి... అదే జిమ్నాస్టిక్స్‌... లండన్‌ ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నమ్మశక్యం కాని విన్యాసాలతో ప్రపంచ ప్రేక్షకులను అలరించే జిమ్నాస్టిక్స్‌లో చైనా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. చైనాకు గట్టిపోటీ ఇచ్చేందుకు యూరోపియన్‌ దేశాలు కొత్త ప్ర ణాళికలతో ముందుకు రావడంతో ఒలింపిక్స్‌ లో జిమ్నాస్టిక్స్‌ ఈవెంట్‌ కనుల పండువగా సాగడం ఖాయం. ఊహకందని విన్యాసాలతో ఆకట్టుకుంటేనే జిమ్నాస్టిక్స్‌ పతకంపై ఆశలు పెట్టుకోవచ్చు. ఒలింపిక్స్‌ ఈవెంట్‌లో చైనా, అమెరికా, రష్యా, యూరోపియన్‌ దేశాల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది.

జిమ్నాస్టిక్స్‌లో మూడు విభాగాల్లో పోటీ ఉం టుంది. ఆర్టిస్టిక్స్‌, రిథమిక్‌, ట్రంపోలిన్‌గా జి మ్నాస్టిక్స్‌ను విభజించారు. మెన్స్‌, విమెన్స్‌ విభాగాల్లో కలిసి 18 గోల్డ్‌, 18 సిల్వర్‌, 18 బ్రాంజ్‌ మెడల్స్‌తో మొత్తం 54 మెడల్స్‌ ఉం టాయి. ఇన్ని పతకాలు ఉన్నప్పటికీ ఒకొక్క పతకం కోసం కాంపిటీషన్‌ హైలెవల్లో ఉంటుంది. ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్స్‌ ఈవెంట్‌లో చైనా లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం డ్రాగన్‌ కంట్రీ పతకాలను కొల్లగొడుతుంది. ఇక తర్వాత స్థానాల్లో
అమెరికా, రష్యా, రొమే నియా, ఉత్తర కొరియా, పోలండ్‌ దేశాలు ఉంటున్నాయి.

భద్రతపై మాక్‌ - అంతా హైఅలర్ట్‌‌--
ఒలింపిక్స్‌పై టెర్రరిస్టులు కన్నేశారా?... లం డన్‌లో విధ్వంసానికి ప్లాన్‌ చేస్తున్నారా?... అవునననే అంటున్నాయి బ్రిటన్‌ నిఘా వర్గా లు. ఏ క్షణమైనా తీప్రవాదులు విరుచుకుపడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. దీంతో లండన్‌లో టైట్‌ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆధునాతన మిసైల్స్‌ను ఉపయో గిస్తున్నారు. ఒలింపిక్స్‌కు లండన్‌ ముస్తాబవు తోంది. ప్రారంభ వేడుకలకు ఆతిథ్యం ఇచ్చేం దుకు స్ట్రేట్‌ ఫోర్డ్‌ స్టేడియంలో సర్వం సిద్ధం చేశారు.

జూలై 27 నుంచి ఆగస్టు 12 వరకూ జరగనున్న ఈ మెగా ఈవెంట్‌కు ఇప్పుడు ఉ గ్రవాదుల భయం పట్టుకుంది. ఆల్‌ఖైదా ఏ క్షణమైనా దాడి చేయవచ్చని  బ్రిటన్‌ ఇంటిలి జెన్స్‌ కోడై కూస్తోంది. దీంతో స్ట్రేట్‌ ఫోర్డ్‌ స్టేడి యంతో పాటు లండన్‌లోని ప్రధాన ప్రాంతా ల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియా నికి వెళ్ళే దారుల్లో అంచలవారీగా నిఘా ఏ ర్పాటు చేశారు.

-ముఖ్యంగా తీవ్రవాదులు దా డిచేస్తే వారిని ప్రతిఘటించేందుకు అత్యాధుని క ఎయిర్‌ మిసైల్స్‌ రంగంలోకి దించారు. ఆ రుచోట్ల వాటిని అమర్చారు. నేలపైనా, గాల్లో నూ, లేక థేమ్స్‌ నదిలో నుంచి గాని టెర్రరి స్టులు దాడిచేసినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంచారు. లెగ్జింగ్టన్‌ బిల్డింగ్‌, ఫ్రెడ్‌ విగ్‌ టవర్‌, ఈస్ట్‌ లండన్‌, అక్సాస్‌వుడ్‌ ఎల్దాన్‌ విలియమ్‌, గిర్లింగ్‌ రిజర్వాయర్‌ ప్రాంతాలకు ఈ మిసైల్స్‌ ను నేవీ హెలికాప్టర్ల సహాయంతో తరలించా రు. అటు ఒలింపిక్స్‌ జరిగే స్టేడియం పరిసరాల్లోనూ, థేమ్స్‌ నది ఒడ్డున మిలటరీ, ఎయిర్‌ఫోర్స్‌ ట్రయల్న్‌ జరుపుతున్నారు. అటు ఎయిర్‌పోర్ట్‌లోనూ నిఘా పెంచారు. విదేశాల నుంచి వేల సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉండటంతో భారీగా రక్షణ చర్యలు చేపట్టారు. అనుమానితులపై నిఘా పెంచారు. గేమ్స్‌ ప్రారంభానికి ముందురోజు నుంచే స్టేడియం పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలులోకి వస్తాయి. ఎలాంటి విఘాతం లేకుండా ఒలింపిక్స్‌ను జరుపుతామని లండన్‌ రక్షణశాఖ ప్రకటించింది.

ఇప్పటి వరకు జరిగిన పోటీలు

సంవత్సరం          వేదిక
1896    ఏథెన్స్‌
1900    పారిస్‌
1904    సెయింట్‌ లూయిస్‌
1908    లండన్‌
1912    స్టాక్‌హోమ్‌
1916    బెర్లిన్‌ (మొదటి ప్రపంచ యుద్ధం వల్ల రద్దు)
London-Olympic
1920    ఆంట్‌వెర్ఫ్‌
1924    పారిస్‌
1928    ఆమ్‌స్టర్‌డాం
1932    లాస్‌ ఏంజిల్స్‌
1936    బెర్లిన్‌
1940    హెల్సింకీ (2వ ప్రపంచయుద్ధం వల్ల రద్దు)
1944    లండన్‌ (2వ ప్రపంచ యుద్ధం వల్ల రద్దు)
1948    లండన్‌
1952    హెల్సింకీ
1956    మెల్బోర్న్‌
1960    రోమ్‌
1964    టోక్యో
1968    మెక్సికో సిటీ
1972    మునిట్‌ (మునిచ్‌)
1976    మాంట్రియల్‌
1980    మాస్కో
1984    లాస్‌ ఏంజిల్స్‌
1988    సియోల్‌
1992    బార్సిలోనా
london-0
1996    అట్లాంటా
2000    సిడ్నీ
2004    ఏథెన్స్‌
2008    బీజింగ్‌
2012    లండన్‌మన రాష్ట్రం నుంచి వీరే..chmpions

లండన్‌ వెళ్ళడానికి అంధ్రప్రదేశ్‌ నుంచి క్రీడాకారులు సిద్దమయ్యారు. టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా, బ్యాడ్మింటన్‌ ప్లేయర్స్‌ సైనా నెహ్వాల్‌, గుత్తా జ్వాల, పారుపల్లి కశ్యప్‌, అశ్వినీ పొన్నప్పలతో పాటు కోచ్‌ గోపిచంద్‌, రోయింగ్‌ ప్లేయర్స్‌ ఉన్నారు.

ఒలింపిక్స్‌లో భారత్‌ టెన్నిస్‌
విశ్వక్రీడల చరిత్రలో మన ప్రస్థానం గురించి చెప్పాలంటే చాలా తక్కువనే చెప్పాలి. మన పొరుగు దేశాలు ఒలిం పిక్స్‌ లో వందల సంఖ్యలో పతకాలు తన్నుపోతుం టే మనం మాత్రం ఒకటి, రెండింటికే సంబర పడిపో తున్నాం. చిన్న దేశాలు, పేద దేశాలు సైతం మన కన్నా ఎక్కువ పతకాలను గెలుస్తుంటే... మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇటువంటి పరిస్థితిల్లోనూ ఇండియా పతకం గెలవడాఁకి ఉన్న కొద్ది అవకాశాలనూ మనమే
కాలరాస్తున్నాం. క్రీడాసమాఖ్యలో రాజకీయాలు, ప్లేయర్ల వ్యక్తిగత పట్టింపులు, ఆర్థిక  ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ దేశ ప్రతిష్టను విస్మరిస్తున్నాం.

ఇందుకు నిదర్శనమే ఒలింపిక్స్‌కు ఎంపిక చేసిన టెన్నిస్‌ టీమ్‌. ఏఐటీఏ, మహేష్‌ భూపతి, లియాండర్‌ పేస్‌ ఎవరి వాదనలు ఎలా ఉన్నా వీరంతా దేశం కోసం వ్యక్తిగత పట్టింపులను పక్కకు పెట్టలేమని నిరూపించారు. అపార అనుభవం ఉన్న పేస్‌, భూపతి జోడిని ఒలింపిక్స్‌కు ఎంపిక చేయకపోవడమే అందుకు నిదర్శనం. పేస్‌, విష్ణువర్థన్‌ జోడి... ఒలింపిక్స్‌లో పతకం గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఫార్మాలిటీకి పార్టిసిపేట్‌ చేయడం మినహా ఈ జోడి పెద్దగా సాధించేది ఏమీ ఉండదని విశ్లేషకుల అభిప్రాయం. ఒలింపిక్స్‌లో ఆడితే భూపతి, బోపన్న పెయిర్‌ కూడా పతకం గెలుస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భూపతిని కాదని సానియా జోడిగా పేస్‌ను ఎందుకు ఎంపిక చేశారు.

-ఇటేవలే ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి జోరు మీదున్న సానియా, భూపతిని ఎందుకు కాదన్నారు. టెక్నికల్‌గా చూస్తే సానియాకు భూపతినే కరెక్ట్‌ జోడి. మెన్స్‌ డబుల్స్‌తో పాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ భారత్‌ పతకం గెలిచే అవకాశాలు సన్నగిల్లాయి. దేశ ప్రతిష్టను పణంగా పెట్టి ప్లేయర్లు పట్టింపులకు పోవడం చూస్తుంటే... అభిమానుల మనసు చివుక్కుమంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని క్రీడల్లో ప్రబలశక్తిగా చూడడం అత్యాశే అవుతుంది.

హాకీ
ఒలింపిక్స్‌లో హాకీ అంటే ఇండియాకు గోల్డ్‌ ఖాయం. మిగిలిన దేశాలు ఇతర పతకాల కోసమే పోటీ పడేవి. ఇయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఒలింపిక్స్‌కు క్వాలిఫై అవ డమే గగనం. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో హాకీ బెర్త్‌ మిస్సయిన ఇండి యా... లండన్‌కు అర్హత సాధించి పరువు కాపాడింది. ఇటు వంటి నేపథ్యంలో ఒలింపిక్స్‌ హాకీలో భారత ప్రస్థానం ఏంటి? 1928 నుంచి 1956 వరకూ మాత్రం స్వర్ణయుగమనాలి. వరుసగా ఆరు ఒలింపిక్స్‌లో భారత్‌ స్వర్ణ పతకాలు
సాధించిదంటే ఇండియా ప్రపంచ హాకీని ఎంతలా ఏలిందనేది అర్థం అవు తుంది. అయితే భారత్‌ ఆ జోరును కొన సాగించలేకపోయింది. అప్పటి నుంచి భారత హాకీ తిరోగమనంలో పయనించింది. తర్వాత 1964, 1980 ల్లో ఇండియా ఒలింపిక్స్‌ స్వర్ణాలు దక్కించుకుంది. ఆ తర్వాత హాకీలో ఇండియాకు ఒక్క గోల్డ్‌ మెడల్‌ కూడా రాలేదు. హాకీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనం ఆటతీరులో మార్పులు చేసుకోలేకపోవడం...ఇతర దే శాలు కఠోర సాధనతో బలీయంగా ఎదగడం తదితర కారణాల తో ఇండియా బలీహ నంగా మారింది. దీంతో ఎనిమిది స్వర్ణాలు కైవసం చేసు కున్నదేశం ఇప్పుడు క్వాలిఫై అవడానికే ముప్పుతిప్పలు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లండన్‌లో మెడల్‌ ఎంత దుర్లభమో అర్థం అవుతుంది. ఇండియా ఉన్న పూల్‌-బిలో జర్మనీ, నెదర్లాండ్స్‌, కొ రియా, న్యూజీలాండ్‌ లాంటి పటిష్టమైన దేశాలపైనా విజయాలు సాధించాలంటే మన గ్యాంగ్‌ తీవ్రంగా శ్రమించక తప్పదు.

బాక్సింగ్‌
ఈ ఒలింపిక్స్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళల బాక్సింగ్‌లో సత్తా చాటేందుకు ఇండియన్‌ స్టార్‌ మేరీ కోమ్‌ సిద్దమౌవు తోంది. ఐదు సార్లు వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ గెలిచిన ఈ మణిపురీ బాక్సర్‌ తర్వాతి లక్ష్యం లండన్‌ గోల్డ్‌మెడలే. దీనికోసం పూర్తి స్థాయిలో సిద్ధమైంది మేరీ కోమ్‌.


Courtesy with - దీవి సాయిమనోహర్‌ @surya Telugu daily  

  • ===================
 Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .