Monday, August 12, 2013

U.T.F formation Day , యూటీఎఫ్ ఆవిర్భావ దినము .

  •  

  •  
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.10- ఆగస్ట్.) -U.T.F formation Day ,  యూటీఎఫ్  ఆవిర్భావ దినము .- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాముఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ మొదటిగా 10- ఆగస్ట్ 1974 లో అమలాపురము లో స్థాపించబడి ఆగస్ట్ 20 న కాకినాడలో రిజిస్ట్రేషన్‌ చేయబడినది. అక్టోబర్ 20 ,21 -1974 లో రాజమండ్రిలో యు.టి.ఎఫ్ ప్రధమ మహా సభ జరిగినది . 1974 నవంబర్ 03 న వేతన స్తంభన సదస్సు(హైదరాబాద్ ) లో యు.టి.ఎఫ్ పాల్గొన్నది.

1975 జనవరిలో ఐక్య-ఉపాధ్యాయ పత్రిక స్థాపన , యు.టి.ఎఫ్ ఆఫీషు విజయవాడకు మార్పు జరిగినది. 1975 జనవరి 11 & 12 తేదీలలో ఖాజీపేటలో తెలంగాణా  జిల్లాల సదస్సు నిర్వహణ , 1975 ఫిబ్రవరి 10 న యు.టి.ఎఫ్ పక్షాన మహా విజ్ఞాపన పత్రము సమర్పణ , 1975 సెప్టెంబర్ లో యు.టి.ఎఫ్ చే 15 వేల సంతకాల తో  కార్డు క్యాంపెయిన్‌,1976 ఏప్రిల్ లో నేటివిటీ ఉత్తర్వు , నిర్భంద రిటైర్ మెంట్ పై 2 వేల సంతకాలతో విజ్ఞప్తి , 1976 సెప్టెంబర్ లో పనిదనముల పెంపు పై యు.టి.ఎఫ్ గుంటూరు సదస్సు ... మున్నగు అనేక ఉపద్యాయ సమస్యలు పరిష్కరించడములో పాలుపంచుకొన్నది. తన సేవలను ఉపాధ్యాయ సంక్షేమము కొరకు అందిస్తూనే ఉన్నది.

 శ్రీకాకు్ళం లో వజ్రవుకొత్తూరు మరడలర వూండిగల్లీలో శనివారము  యూటీఎఫ్ ‌ ఆవిర్భావ దిన పేడుకలు నిర్వహించారు. ఆ శాఖ అధ్యక్షుడు కె.రపేుష్‌ అధ్యక్షతన జరిగిన పేడుకల్లో శాఖ జిల్లా కార్యదర్శి బి.చిట్టిబాబు మాట్లాడుతూ 1974 ఆగస్టు 10న ఏర్పాటైన యూటీఎఫ్ ‌ ఉపాధ్యాయ సమస్యలవై అలువెరగని పోరాటర చేసిరదన్నారు.

  • వీఆర్‌సీల సాధన,
  • నేషనల్‌ ఇంక్రిమెంట్లు,
  • ప్రమోషన్లు.......
వంటి కీలక సమస్యలవై రాజీలేని పోరాటం చేసి సాధించిన ఘనత యూటీఎఫ్  ‌దేనన్నారు. వ్రధాన కార్యదర్శి పేణుగోపాల్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆదరాభిమానాలతో రాష్ట్రంలోని అతివెద్ద ఉపాధ్యాయ సంఘంగా ఏర్పడిందని చెప్పారు. ఇందులో డి.రామారావు, కె.కేశవనారాయణ, ఎం.మోహనరావు, వి.రవికుమార్‌, కె.సింహాచలం, శ్రీరాములు  తదితరులు ఉన్నారు.

  • ============================
 Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .