The Taekwondo Day was established as the 4th of September in July 2006, to commemorate the day that Taekwondo became officially an Olympic sport.
Taekwondo was chosen as Olympic sport on the 4th of September of 1994, at the 103rd IOC General Assembly, during the period from Sydney 2000 until Rio de Janeiro 2016.
The first Taekwondo Day event was celebrated on the 4th of September 2006 at the Olympic Park of Seoul, and it has been celebrated yearly since then.
అతివలపై అకృత్యాలు పెరుగుతున్న సందర్భంలో ఆత్మరక్షణ విద్యల ప్రాధాన్యత పెరిగింది. ప్రతిచోట మన రక్షణ కోసం ఎవరో ఒకరు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుేక జరిగే హింసను మౌనంగా భరించకుండా ‘కౌంటర్ అటాక్’ చేయడం వంటి మెలకువళను నేర్చుకోవాలి. తైక్వాండో మార్షల్ ఆర్ట్‌లో ప్రావీణ్యత సంపాదించడం వల్ల ఆత్మరక్షణ నమ్మకంతో పాటు, ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపవుతుంది. ‘తైక్వాండో’ ఆత్మరక్షణ విద్య గురించి మరిన్ని వివరాలు.
తైక్వాండో గురించి...
--తైక్వాండో అనేది కొరియాకు చెందిన ఒక ఆత్మరక్షణ విద్య. ఇది కొరియా దేశ జాతీయ క్రీడ కూడా. ‘తై’ అంటే ‘ కాలితో కొట్టడం లేదా దాడి చేయడం’ అని, ‘క్వా’ అంటే ‘పిడికిలి తో దాడి చేయడం’, ‘డో’ అంటే ‘దాడి చేసే విధానం..లేదా పద్ధతి’ అని అర్థం. మొత్తానికి ‘తైక్వాండో’ అంటే ‘కాలిని, చేతి ని వాడి దాడి చేయడం’ అని అర్థం వస్తుంది. తైక్వాండో ఆత్మరక్షణ విద్యతో పాటు ఒక క్రీడ, ఒక వ్యాయామం కూడా. కొన్ని సందర్భాలలో దీన్ని ‘ధ్యానం’, ‘ఫిలాసఫీ’గా కూడా చెబుతుంటారు. ఇది 1989లో అత్యంత పాపులర్ మార్షల్ ఆర్ట్‌గా ఎదిగింది. తైక్వాండోలో కింగ్ టెక్నిక్‌లపై ప్రాధాన్యత ఉంటుంది. అయితే దీనికీ కరాటే, కుంగ్‌ఫూకి చాలా తేడా ఉం టుంది. కొరియా దేశ వాసులు అనాది నుంచే తమ చేతులను అద్భుతమైన ఆయుధంగా భావించే వారు. అందుకే తైక్వాండో లో చేతులతో చేసే దాడికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.
మహిళల కోసం...
--ఆత్మరక్షణ కోసం మహిళలకు తైక్వాండో చాలా ఉపయోగక రంగా ఉంటుంది. పరిస్థితిని గమనించి వెంటనే స్వందించే అవకాశం ఉంటుంది. అపాయకరమైన సమయంలో ఎలా తమను తాము తమాయించుకోవాలి, ఎప్పుడు ప్రతిదాడికి సిద్ధం అవ్వాలి, శరీర భాగాల్లో ఎక్కడ దాడి చేయాలి వంటి విషయాలు తైక్వాండో నిపుణులు విపులంగా తెలియజేస్తారు. దాడి జరిగినప్పుడు వెంటనే స్పందించే వేగాన్ని సాధించవచ్చు. ఆత్మరక్షణ క్రీడలలో మహిళ భాగస్వామ్యాన్ని పెంచేలా నిపుణులు తోడ్పడతారు.
తైక్వాండో క్లబ్‌లు...
మనదేశంలో చాలా చోట్ల తైక్వాండో క్లబ్‌లు ఉన్నాయి. క్లబ్‌లో అడుగుపెటడంతోనే శిక్షణ ప్రారంభమౌతుంది. సాధన చేసే వారిని చూసి కసి పెరుగుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్న కొంత మంది మహిళలు తైక్వాండో క్లాస్‌లో చేరి తమ ఆరోగ్యాన్ని పెంచుకున్నారు. ఈ మార్పును చూసి వైద్యులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా మంది ఇందులో సాధన ప్రారంభించి బ్లాక్‌బెల్ట్ సాధించి గానీ వదలరు. ఇందులో బోర్టు బ్రేకింగ్ అనే ఫీట్ కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటుంది.అయితే సాధన చేస్తే ఇందులో ఎక్స్‌పర్ట్ కావచ్చు. వారానికి 3-4 సార్లు సాధన చేస్తే చాలు. కొందరైతే రోజుకు రెండుసార్లు, గంటల కొద్ది సాధన చేస్తారు.
సేవ్ యువర్ సెల్ఫ్...
--నేడు మహిళలు ఇంటినుంచి బయటికి వెళ్లాలంటేనె చాలా సార్లు ఆలోచిస్తున్నారు.వెళ్లలేక కాదు. బయట ఎప్పుడు ఏంజరుగుతుందో అనే భయంతో.బయటికి వెళ్తే చాలు టీజింగ్‌లు వంటి అనేక సమస్యలు నేడు మహిళలు ఎదుర్కొంటున్నారు. అయితే తైక్వాండో నేర్చుకోవడం వల్ల (తైక్వాండో లాంటి మరే ఆత్మ రక్షణ విద్యనైనా) మిమ్మల్ని మీరు రక్షించుకోగలరనే నమ్మకం కలుగుతుంది. అంతులేని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం లో ఉపయోగకరంగా ఉంటుంది.
ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఈ విద్యను నేర్చుకునే సమయంలో మన శరీరం సరికొత్త ఆకృతిని సంతరించుకుంటుంది. ఈ కోర్సు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ మార్పును గమనించవచ్చు.అంతులేని ఆత్మవిశ్వాసాన్ని సాధించవచ్చు.తైక్వాండోలో ప్రావీణ్యం పొందాలను కునే వారు మంచి నిపుణుల వద్ద చేరాలి. డాక్టర్‌ను సంప్రదించి ఈ విద్యను నేర్చుకోవడానికి ఆరోగ్యపరమైన సమస్యలు ఏవీ లేవుకదా అనే అంశాన్ని నిర్దారించుకోవాలి. ఏ పోరాట విద్య అయినా.... అది ఆత్మరక్షణకు మాత్రమే అని గమనించాలి.
తైక్వాండో వల్ల ప్రయోజనాలు...
--*తైక్వాండో ఆత్మరక్షణ విద్య వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. *ప్రపంచంతో పోటి పడి గెలవగలం అనే నమ్మకం ఏర్పడుతుంది కూడా. *తైక్వాండో సాధన చేయడం వల్ల మహిళలలో శారీరకంగా ఫిట్‌నెస్ కలుగుతుంది. *బరువు కంట్రోల్‌లో ఉంటుంది...కొంచెం తగ్గుతుంది కూడా.* రెగ్యులర్‌గా సాధన చేయడంతో శరీరం చక్కని ఆకృతిని సంతరించుకుంటుంది. *తైక్వాండో వల్ల గుండెకు సంబంధించిన క్రియలు చక్కగా జరుగుతాయి. *శ్వాసతీసుకునే విధానం మెరుగువౌతుంది. *హాయిగా నిద్రపోవచ్చు. *మీలో ఏదో కొత్త శక్తి వచ్చినట్టు ఉత్సాహాంగా ఉండగలుగుతారు. *స్ట్రెస్ మాయం అవు తుంది. *మానసికంగా ఫిట్ అవుతారు. *సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. *ప్రమాదకర సంద ర్భాల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుస్తుంది. *రెగ్యులర్‌గా సాధన చేయడంతో ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది.
ఇవి కేవలం కొన్ని లాభాలు మాత్రమే. ఇంకా ఎన్నో విధాలుగా తైక్వాండో మీకు ఉపయోగ పడగలదు.
నేర్చుకోవాలనుకునే వారు...
తైక్వాండో సాధన ప్రారంభించడానికి మార్షల్ ఆర్ట్స్ ప్రవేశం ఉండాల్సిన అవసరం లేదు. టీనేజి నుంచి 45 సంవత్సరాల మహిళల వరకు ఎవ్వరైనా సాధన ప్రారంభించవచ్చు.
కంఫర్ట్‌గా ఉన్న దుస్తులు ధరించాలి. అథ్లెట్ షూస్ వాడాలి. అయితే సాండిల్స్, హై హీల్స్, ఫ్లిప్-ఫ్లాప్‌లు ధరించరాదు.
నిస్సందేహంగా పెళ్లైన వారు తైక్వాండో నేర్చుకోవచ్చు.
తైక్వాండో కాంపిటీషన్‌లో భాగం తీసుకొనే వారు తైక్వాండో యూనిఫార్మ్‌ను ధరించాలి.
స్కూల్‌ను ఎంచుకునే ముందు...
ముందు మీరు ఆత్మరక్షణ కోసం తైక్వాండో నేర్చుకుంటున్నారా, లేక మంచి శరీరాకృతి కోసమా, లేదా ఒక వ్యాయామం కోసమా అని తేల్చుకోవాలి. మీ ప్రాధాన్యతను బట్టి ట్రైనర్ మీకు ఆయా అంశాలలో ప్రాధాన్యతనిస్తారు.
మీరు జాయిన్ అయ్యే స్యూల్‌లో మంచి ఇన్‌స్ట్రక్టర్ ఉన్నాడా లేదా అనేది పరిశీలించాలి.
మీకు ట్రైనింగ్ ఇవ్వబోయే వ్యక్తికి ఎంత వరకు పరిజ్ఞానం ఉందో కనుక్కొవాలి.
ట్రైనింగ్‌లో ఎలాంటి అంశాలపై ప్రాధాన్యత ఇస్తున్నారో కనుక్కోవాలి.
Courtesy with Surya Telugu daily news paper
- ================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .