Saturday, July 31, 2010

N.C.C. Day , ఎన్‌.సి.సి. డే



  • ఎన్‌.సి.సి. డే -- జూలై 15 . (1948 జూలై 15)
15-07-1948 న నేషనల్‌ కాడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌. సి.సి-National Cadet Corps) ప్రారంభించ బడింది. యువతీ యువకులకు సైనిక శిక్షణనిచ్చి అత్యవస ర పరిస్థితుల్లో సేవల నిమిత్తం సిద్ధంగా ఉంచటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 16 డైరెక్టరేట్లు ఉన్నాయి.

స్కూలు రోజులనుంచి తలపై ఎర్రటి కుచ్చులుగల టోపి తో ఖాకీ దుస్తులు ధరించి శిక్షణ తీసుకునే విద్యార్ధులనే ఎన్‌.సి.సి. స్టూడెంట్స్ అంటాము . నేటి చిన్నారులే రేపటి పౌరులు ... క్రమశిక్షణాయుత , దేశభక్తిగ పౌరులను తయారుచేయడమే ఎన్‌.సి.సి. ముఖ్య ఉద్దేశము . ఎన్‌.సి.సి. లో చేరే పిల్లలు దృఢ చిత్తము తో శిక్షణ సాగిస్తుంటారు . సైనిక , నౌక , వైమానిక త్రిదళ సేవా సంస్థల తో కూడినదే ఈ ఎన్‌.సి.సి. . . దీని మూలానికి సంబందించిన ఆనవాళ్ళు తొలి ప్రపంచయుద్ధకాలం నాటివి . రక్షణలో రెండో వరసగా , సైనిక దళాలలో చేరేందుకు వీలుగా శిక్షణ పొందిన యువతను సమకూర్చుకునేందుకు గాను బ్రిటిషర్లు ఆ రోజుల్లో ' యూనివర్శిటీ కార్ప్స్(University Crops) ' ను ఏర్పాటు చేసారు .

మనకు స్వతంత్రము వచ్చాక నేటి ఎన్‌.సి.సి. రక్షణ మంత్రిత్వ శాఖ అధ్వర్యము లో 1948 Arpil 16 న ఎన్‌.సి.సి. చట్టము మనుగడలోనికి వచ్చినది . వేసవి సెలవుల అనంతరము పాఠశాలలు , కళాశాలలు పున:ప్రారంభించాల్సిన వెంటనే ఎన్‌.సి.సి. ని 1948 జూలై 15 న లాంచనప్రాయంగా ప్రారంభించారు . ఎన్‌.సి.సి. లో యువతుల విభాగము 1949 జూలై లో ఆరంభము అయినది . 1950 ఏప్రిల్ 01 న ఎయిర్ వింగ్ ఆరంభంచారు . ముంబై , కోల్కటా లలో ఒక్కో ఎయిర్ స్క్వాడ్ ను ఏర్పాటుచేశారు . 1952 జూలై లో నావల్ వింగ్ మెదలు పెట్టేరు . దీంతో కార్ప్స్ లో త్రిదళాల ప్రాతినిధ్యము పూర్తయినట్లయింది . ప్రస్తుతము ఎన్‌.సి.సి . లో 13 లక్షల మంది కేడెట్ లు ఉన్నట్లు అంచనా .

శిక్షణ :
ఎన్‌.సి.సి.లో శిక్షణా రూపాలు వెన్నెముక వంటివి దీని వల్ల కార్ప్స్ కు ఆకృతిని , రూపాన్ని ఇవ్వడమే కాకుండా సంస్థ లో ని అన్నివిభాగాలు పై నియంత్రణ ఏర్పడుతుంది . శిక్షణ మూడంచెలుగా సాగుతుంది . రెగ్యులర్ ఆఫీషర్లు , పూర్తిస్థాయి అధికారులు , పూర్తిష్థాయి మహిళాఅధికారులు ... స్టూడెంట్సు కు పూర్తిస్థాయి శిక్షన యిస్తారు .
వీరే కాకుండా అసోసియేట్ ఎన్‌.సి.సి. ఆఫీసర్లు (ఎ.ఎన్‌.ఒ), జూనియర్ కమిషన్‌డ్ ఆఫీషర్లు (జె.సి.ఒ.లు), నాన్‌ కమిషన్‌డు ఆఫీషర్లు , వారితొ సమానమైన నేవి , ఎయిర్ ఫోర్సు అధికార్లు , శాశ్విత ఇన్‌స్ట్రక్టర్లు హోదాలో గాళ్ కేడెట్ ఇన్‌స్ట్రక్టర్లు , సివిల్ గ్లైడింగ్ ఇన్‌స్ట్రక్టర్లు , షిప్ మోడలింగ్ ఇన్‌స్ట్రక్టర్లు , ఎరో మోడలింగ్ ఇన్‌స్ట్ర్క్టర్లు , వివిధస్ఠాయిలలో కేడెట్లకు శిక్షన ఇస్తారు . గ్వాలియర్ లోని సింధియాల ప్రముఖ ప్రిన్‌సెస్ ప్యాలెస్ లో ఎన్‌.సి.సి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడామి (ఒ.టి.ఎ ) ఉన్నది .

మహిళా వి్భాగము : 1948 లో XXXI పార్లమెంటు చట్టము మేరకు ఎన్‌.సి.సి. ప్రారంభము కాగా , గాళ్స్ డివిజం సీనియర్ వింగ్ 1949 ఆగస్టు లో ఆరంభమయినది . తొలి బింగాల్ గాళ్స్ , సెకండ్ సెంట్రల్ ప్రావిన్‌స్ , ధర్డ్ పంజాబ్ గాళ్స్ ఎన్‌.సి.సి. ట్రూపులు కోల్ కతా , నాగపూర్ ,లూధియానా లో మొదలైనాయి . 1954 లో జూనియర్ విభాగము ఏర్పడి , తరువాత మిగతా భారతదేశము లోకి వ్యాపించాయి .

మూలము : వికిపెడియా .
  • ====================================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Friday, July 30, 2010

యాంటీ ర్యాగింగ్‌ డే , Ati-Ragigng Day




అక్టోబర్‌ 11న 'యాంటీ ర్యాగింగ్‌ డే' గా పరిగణిస్తున్నారు.

కోటి ఆశల కలలు 'కళ్ల'లో నింపుకుని, రంగురంగుల 'హరివిల్లు'ల్లా 'బెదురుకన్నుల లేడి పిల్ల'ల్లా అచ్చం ఒకప్పటి 'నీ' రూపంలా విజ్ఞాన సౌధంలో అడుగుపెడితే, వారిని స్వాగతిస్తూ, స్నేహ హస్తాన్ని కదా నీవు అందించాలి. కానీ మన సంస్కృతి కాని 'రాగింగ్‌'కు బానిసలై, శాడిజాన్ని జత చేర్చుకుని, ఆ లేత పాదాల కింద 'ముళ్లు' పరవడం అవమానంతో దహించుకు పోయేలా చేయడం, ఇది నీకిప్పుడు ఆనందాన్నే కలిగించి వుండొచ్చు. కానీ, నీ ఈ పైశాచిక క్రీడకు 'మూల్యం' లెక్క కట్టలేము .

ర్యాగింగ్‌ హబ్‌గా దక్షిణ భారతదేశం

ప్రపంచవ్యాప్తంగా ర్యాగింగ్‌ కోరలున్నా, దక్షిణ ఆసియాలోనే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రీసు ఒలంపిక్స ప్రారంభమైనప్పుడు ఎనిమిదో సెంచరీ ఎ.డిలో ర్యాగింగ్‌ మొగ్గ తొడిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆర్మీ క్యాంపులో ఇది కొత్త పుంతలు తొక్కింది. 20వ శతాబ్దం వచ్చేసరికి పశ్చిమ దేశాల్లో హింసరూపం తీసుకుంది. బ్రిటీష్‌ ప్రభుత్వ పాలనలో విదేశాల నుండి ఈ సంస్కృతి మన దేశంలోకి ప్రవేశించింది. ఆర్మీ క్యాంపుల్లోనూ వేర్వేరు రూపాల్లో దీన్ని అవలంభించేవారు. 1970వ సంవత్సరం వరకు పరిస్థితి సాధారణంగా ఉన్నా 1980 తర్వాత మీడియా విస్తరణతో ర్యాగింగ్‌ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. సినిమాల్లో ఆడపిల్లల్ని ఆటపట్టించే దృశ్యాలు, మగవాళ్లని ధీరోదాత్తులుగా చూపేవి. మగపిల్లలు సహజంగానే దీనికి ఆకర్షితులయ్యేవారు. కొత్తగా కళాశాలల్లో చేరి వేధింపులకు గురైనవారు మరుసటి సంవత్సరం అంతకంటే తీవ్రంగా ర్యాగింగ్‌కు పాల్పడడం పరిపాటిగా మారింది. విస్తృతంగా ప్రయివేటు ఇంజరీంగ్‌, మెడికల్‌ కళాశాలలు ప్రారంభం కావడంతో ఇది మరింత దారి తప్పింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశం 'ర్యాగింగ్‌ హబ్‌' గా పేరుగాంచింది.

వికృత చేష్టల వెనుక...

ఇతరులను హింసించి ఆనందించే వ్యక్తిత్వాన్ని ఓ రకంగా మానసిక దౌర్బల్యంగా చెప్పాలి. చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు, చుట్టుపక్కల వారి ఆదరణ పొందని వ్యక్తులే తమ ఆధిక్యాన్ని చాటుకోడానికి ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడతారనే అభిప్రాయం ఉంది. అన్ని సందర్భాల్లోనూ ఇది నిజం కాకపోవచ్చు. సహచర బృందం నుండి అందే ప్రోత్సాహం, ఆ వయసులో సహజంగా ఉండే దుందుడుకుతనం వల్ల వచ్చే 'మాస్‌ హిస్టీరియా' విద్యార్థులు రెచ్చిపోవడానికి కారణమౌతోంది. మిగిలిన వారికంటే తాము తక్కువ కాదని నిరూపించుకోవడానికి కొందరు విజృంభిస్తున్నారు. సరదా కాస్తా శృతి మించి ఉన్మాదంగా మారుతోంది. హింసకు ప్రేరేపిస్తోంది.

సీనియర్లు, జూనియర్ల నడుమ స్నేహపూరిత వాతావరణం ఏర్పడేందుకు తగిన పరిస్థితులను కల్పించడమే దీని వెనుక ఉద్దేశ్యమని చాలా మంది చెప్పుకొంటున్నా, శృతిమించిన ఆగడాలతో విద్యార్థులు కళాశాల పేరు చెబితేనే వణికిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొందరు శాశ్వతంగా అంగవైకల్యానికి గురి కావడమో, విద్యాసంవత్సరాన్ని కోల్పోయి కెరీర్‌కు దూరమవడమో జరుగుతోంది.

ర్యాగింగ్‌లో భాగంగా దృఢమైన వస్తువులతో చితకబాదటం, ప్రమాద భరితమైన పనులు చేయమని బెదిరించడం, దుస్తులు తొలగించమనడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసహజ లైంగిక క్రియలకు పాల్పడమని సూచించడం వంటి జుగుప్సాకర పద్ధతులు చోటు చేసుకుంటున్నాయి. వీటివల్ల బాధితులకు మానసిక వేదన (మెంటల్‌ ఏగోనీ) అధికమౌతుంది. విపరీతమైన భయం, మానసిక అలజడితో ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. కొందరు పిచ్చివారైపోతున్నారు. వెనకబడిన ప్రాంతాలు, గ్రామాల నుండి వచ్చిన వారు ఎక్కువ వేధింపులకు గురవుతున్నారని అంచనా.

అనేక సందర్భాల్లో ర్యాగింగ్‌ కేసులు వెలుగులోకి రావడం లేదు. ఒక స్వచ్ఛంద సంస్థ అంచనా ప్రకారం ర్యాగింగ్‌ వల్ల ఏటా పది మంది మృత్యువాత పడుతున్నారు. వందలాది మంది తీవ్రంగా గాయపడడం లేదా మనోవ్యాధులకు గురికావడం సంభవిస్తోంది. ర్యాగింగ్‌ పైన చైతన్యానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. చట్ట ప్రకారం రిజిస్టరైన 'సేవ్‌' సంస్ఠ (సొసైటీ ఎగెనెస్ట్‌ వయొలెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌) ఈ అంశంలో చెప్పుకోదగ్గ కృషి చేసింది. అక్టోబర్‌ 11న 'యాంటీ ర్యాగింగ్‌ డే' గా పరిగణిస్తున్నారు.

ర్యాగింగ్‌ నిరోధక చట్టం

1997లో తమిళనాడు రాష్ట్రం మొట్టమొదటి సారిగా ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా చట్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే ఏడాది ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్ట ప్రకారం ర్యాగింగ్‌కు పాల్పడే వారిని విద్యా సంస్థ నుంచి బయటకు పంపేయవచ్చు. ఆరునెలల జైలు శిక్ష, మరే విద్యా సంస్థలోనూ చేరకుండా నిషేధం విధించవచ్చు. ర్యాగింగ్‌కు పాల్పడినవారి ఫలితాలు నిలిపివేయడం, స్కాలర్‌షిప్పులు, ట్రావెల్‌ కన్సెషన్‌ లాంటి సౌలభ్యాలను దూరం చేయడం, కళాశాలల్లో నిర్వహించే వివిధ పోటీల్లో పాల్గొనకుండా నియంత్రించడం వంటి చర్యలను సూచించింది. ర్యాగింగ్‌కు విధించే శిక్షలేమిటో విద్యార్థులందరికీ తెలిసేలా బ్రోచర్లు, పోస్టర్లు ముద్రించాలని సూచించింది. కళాశాల నోటీసు బోర్డులో ర్యాగింగ్‌కు పాల్పడేవారి ఫొటోలు ఉంచాలని చెప్పటమే కాదు, భవిష్యత్తు నాశనం అవుతుందన్న స్పృహ వారిలో కలిగేలా కఠిన చర్యలు చేపట్టాలని కోరింది.

క్రిమినల్‌ కేసులు బనాయిస్తే వీసాలు, పాస్‌పోర్టులు లభించటం కష్టమౌతుందన్న స్పృహ కలిగించాలని సూచించింది.

ఈ సూచనల్లో ఏ ఒక్కటి పాటించిన దాఖలాలు లేవు. పోస్టర్ల ప్రచారాన్ని మాత్రం అన్ని రాష్ట్రాలు నిర్వహించాయి.

సుప్రీం హెచ్చరికలు

ర్యాగింగ్‌ కేసులు విచారణ చేపట్టిన అపెక్స కోర్టు - సీబీఐ మాజీ డైరెక్టర్‌ రాఘవన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఆదేశించింది. దీని తీవ్రత దృష్ట్యా భారత శిక్షా స్మృతిలో ర్యాగింగ్‌ను ప్రత్యేకంగా చేర్చాలని రాఘవన్‌ కమిటీ ప్రతిపాదించింది. కేంద్రం, రాష్ట్రం, ఆయా కళాశాలల స్థాయిలో యాంటీ ర్యాగింగ్‌ సెల్స్‌ ఏర్పాటుకు, బాధితులు తమ ఆవేదనను తక్షణం పంచుకోడానికి వీలుగా టోల్‌ఫ్రీ నెంబరు సౌకర్యం కలిగించడం, ప్రాథమిక స్థాయిలో కౌన్సిలింగ్‌ ఏర్పాట్ల వంటివి రాఘవన్‌ కమిటీ ప్రతిపాదనల్లో ముఖ్యమైనవి. ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. పుస్తకాల్లో ర్యాగింగ్‌ను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించింది.

మే 16, 2007లో సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను నిషేధించడమే కాదు, ర్యాగింగ్‌కు పాల్పడేవారిపైన తక్షణం ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) రూపొందించాలని ఆదేశించింది. హిమాచల్‌ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ సంఘటనల దరిమిలా సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోమారు కఠిన ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థల్లో పెరిగిపోయిన మద్యపానమే ర్యాగింగ్‌ మహమ్మారికి కారణమని తేల్చి చెప్పి తదనుగుణమైన చర్యలను ఆదేశించింది.

అన్ని రాష్ట్రాల్లో కదలిక...

హిమాచల్‌ ప్రదేశ్‌లో అమీన్‌ కచ్రూ మరణానికి కారకులైన నలుగురు విద్యార్థులపై ... హత్య, యాంటీ ర్యాగింగ్‌ ఆర్డినెన్స్‌ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. కళాశాల ప్రిన్సిపల్‌ని తొలగించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రానున్న విద్యా సంవత్సరం నుండి ర్యాగింగ్‌ను మానవ హక్కుల అంశంలో పాఠ్యాంశంగా చేర్చాలని ఆ రాష్ట్రం యోచిస్తోంది. విద్యారంగ నిపుణులందరితో చర్చించి ప్లస్‌-1, ప్లస్‌-2లలో ఒక భాగంగా చేర్చాలని ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి ఇప్పటికే సూచించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో బాపట్ల కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థినులను అరెస్టు చేశారు. వారు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సంఘటన చోటు చేసుకున్న వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌పై ఎటువంటి చర్య తీసుకోనందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు దీనిపై వివరాలు పంపవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణపై 11 మంది విద్యార్థులను అరెస్టు చేసి ఆనక బెయిల్‌పై విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కూడా విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చింది. సాధారణ దుస్తులు ధరించిన (మఫ్టీ) పోలీసుల సహకారం తీసుకుని నిందితులను పట్టుకొంటామని, ఇందులో భాగస్వాములైన వారిని కళాశాల నుంచి పంపేస్తామని హెచ్చరించింది. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక ఎంబీఏ విద్యార్థి ఫిర్యాదు మేరకు ర్యాగింగ్‌లో పాల్గొన్న ఐదుగురు విద్యార్థులను విద్యా సంస్థ నుంచి తొలగించారు. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ ర్యాగింగ్‌ నిరోధంపై కొంత కదలిక వచ్చింది. కళాశాలల్లో డిటన్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు సంసిద్ధమౌతున్నాయి.

ఇంకా ఏం చేయాలి?

ర్యాగింగ్‌ సంఘటన చోటు చేసుకోగానే, అది బయట ప్రపంచానికి తెలిస్తే తమ కళాశాలకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళన చెందుతూ, దాచి పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అది కళాశాల ప్రాంగణంలోనో, హాస్టల్లోనో కాదు. ఇందులో తమ బాధ్యత లేదని తప్పుకోచూస్తున్నాయి. విద్యా సంస్థల యాజమాన్యాలు, సిబ్బందిని బాధ్యులను చేస్తే తప్ప ఈ విధానంలో మార్పు వచ్చే అవకాశం కనిపించటం లేదు. ఒకసారి ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే అది మిగతావారికి హెచ్చరికగా మిగులుతుంది. భయంతో కొద్దిగా వెనకడుగు వేస్తారు. హాస్టల్‌ వార్డెన్లు రాత్రి సమయాల్లో ఆకస్మిక తనిఖీల్లాంటివి చేయాలి. కళాశాలలో చేరిన రోజునే ర్యాగింగ్‌కు పాల్పడమని అందరి దగ్గరా లేఖలు రాయించుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా సంతకాలు చేయించుకోవాలి. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే నిర్భయంగా ఫిర్యాదు చేయగల వాతావరణం కళాశాలల్లో, విద్యాసంస్థల్లో ఉండాలి. ఇందుకు సిబ్బంది దోహదం చేయాలి. అప్పుడే బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తారు.

కొత్త విద్యార్థులు రాగానే సీనియర్ల పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. అందరూ సన్నిహితంగా మెలిగేలా కొన్ని క్రీడల పోటీల్లాంటివి నిర్వహించవచ్చు. అప్పుడే విద్యార్థుల్లో హింసాత్మక ప్రవృత్తికి కొంతవరకు అదుపు చేయవచ్చని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. ఫ్రెషర్లను గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపుకి సీనియర్‌ని నాయకునిగా నియమించాలి. ఇవన్నీ ర్యాగింగ్‌ విజృంభణను కొంతవరకు నియంత్రిస్తాయి. ర్యాగింగ్‌ బెడదతో విద్యార్థులు బెదిరిపోయి చదువు మానేస్తున్నారు. విలువైన విద్యాసంవత్సరాన్ని కోల్పోతున్నారు. ఉన్నత విద్యా రంగంలో ఒక కళాశాల నుండి వేరొక కళాశాలకు బదిలీ అయి చదువుకునే వెసులుబాటు కల్పిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.ర్యాగింగ్‌ దుష్పరిణామాలను మీడియా కూడా విస్తృత ప్రచారంలోకి తేవాలి. తమ ప్రవర్తన ఎంత హేయమైందో, అది సాటివారిని ఎంత ఇబ్బందులపాలు చేస్తుందో విద్యార్థులందరికీ అవగతమౌతుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు అందరూ పూనుకుంటే ఈ జాఢ్యాన్ని తరిమికొట్టడం అసాధ్యం కాదు.

మీకు తెలుసా?

ర్యాగింగ్‌ నిరోధక చట్టం ప్రకారం - ర్యాగింగ్‌కు పాల్పడే వ్యక్తులు కింద పేర్కొన్న వివిధ రకాల శిక్షలకు లోనయ్యే అవకాశముంది.

ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను బర్తరఫ్‌ చేయడమేకాక, నేర తీవ్రతనుబట్టి వారికి యావజ్జీవ కారాగార శిక్షను విధించడానికి సైతం అవకాశం ఉంది.

విద్యా సంస్థల లోపల /బయట ర్యాగింగ్‌ చేసినా, అందులో పాల్గొన్నా లేక ప్రేరేపించినా, ప్రచారం చేసినా శిక్షార్హులవుతారు.

ఒక విద్యార్థిని అక్రమంగా నిర్భంధించినా, గాయపరిచినా రెండేళ్ల జైలుశిక్ష లేదా అయిదువేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

ర్యాగింగ్‌ వల్ల విద్యార్థి మరణించినా లేక ఆత్మహత్యకు పాల్పడినా యావజ్జీవశిక్ష / పదేళ్ళ జైలు శిక్షతో పాటు యాభైవేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.

ర్యాగింగ్‌ నేరం రుజువై, కొంతకాలం శిక్ష అనుభవిస్తే విద్యాసంస్థ నుంచి బర్తరఫ్‌ చేయాలి. శిక్ష ఆరునెలలు దాటినట్లయితే ఆ విద్యార్థిని తిరిగి ఎక్కడా చేర్చుకోరాదు.

ర్యాగింగ్‌ జరిగినట్లు ఫిర్యాదు వస్తే - పరిశీలించి, ప్రాథమిక ఆధారాలున్నట్లయితే ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థిని సస్పెండ్‌ చేయాలి.

ర్యాగింగ్‌ జరిగినపుడు - సంబంధిత విద్యాసంస్థ అధికారులు ఏ కారణంగా అయినా చర్య తీసుకోకపోయినా, ఆ అపరాధాన్ని ప్రేరేపించినట్లు భావించినా వారు కూడా శిక్షార్హులవుతారు.

ర్యాగింగ్‌ పేరిట విద్యార్థిని వేధించినా, ఇబ్బంది పెట్టినా, చిన్నబుచ్చుకునేలా చేసినా వారికి 6 నెలలు జైలుశిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

ఒక విద్యార్థికి తీవ్రమైన దెబ్బలు తగిలినా, అపహరించినా, బలవంతంగా ఎత్తుకుపోయినా, అత్యాచారం లేదా అసహజ నేరాలకు పాల్పడినా, ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు, పదివేల రూపాయల జరిమానా కూడా విధించవచ్చు.

ఒక విద్యార్థిపై దౌర్జన్యం చేసినా, బలప్రయోగం కావించినా ఏడాదిపాటు జైలుశిక్ష లేదా రెండువేల జరిమానా, లేదా రెంటినీ విధించవచ్చు.--- సీపీఎస్‌.
----------------------------------------------
Courtesy : Praja Shakti Daily newspaper
  • ===============================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Wednesday, July 28, 2010

అంతర్జాతీయ న్యాయదినోత్సవం , International Justice Day





ఒక్క అమాయకుడికి కూడా అన్యాయము జరగకూడదన్న సూత్రము న్యాయవయ్వస్థకు పునాది . అంర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తింపు చర్యగా ప్రతిఏటా ప్రపంచ వ్యాప్తం గా " జూలై 17 " న అంతర్జాతీయ న్యాయదినోత్సవం జరుపుకుంటున్నారు .

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ సృష్టికి కారణమయిన ఒడంబడిక ' రోమ్‌ స్టాట్యు ' వార్షికోత్సవము కారణము గా జూలై 17 వ తేదీని ఇంటర్నేషనల్ జస్టిస్ డే కోసం ఎంచుకున్నారు . ప్రపంచవ్యాప్తం గా ఈ రోజున ఆంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ను ప్రోత్సహిస్తూ ముఖ్యం గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడతారు .

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐ.సి.సి.) రోమ్‌ స్టాట్యు పదవ వార్షికోత్సవం సందర్భం గా 2008 లో ఇంటర్నేషనల్ జస్టిస్ డే ను సెలబ్రేట్ చేశారు . ఐ.సి,సి. అసాధారణ సేవల్ని గుర్తిస్తూ మరింత ప్రశాంత ప్రపంచసృస్టికి , మరింత న్యాయానికి అనువుగా ఎల్లలులేని న్యాయాన్నీ నొక్కిచెప్పడానికి గాను ఇంటర్నేషనల్ జస్టిస్ డే ని ప్రకటించారు . జూలై 17 తేదీన ఇంటర్నేషనల్ జస్టిస్ డే గా ప్రకటిస్తూ తీర్మానిస్తూ సంతకాలు చేసిన తొలి ఏకైక మేయర్ గా పోర్ట్ ల్యాండ్ మేయర్ - టామ్‌ పాటర్ ' నిలిచిపొయారు . " ఒకరి హక్కుల్ని ఒకరం పరస్పరం కాపాడుకోలేక పోతే , మన హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం , వాటిని బహుశా ఎవరూ కాపాడలేకపోవడం సంభవించే సమయం రాగలదని నేను ప్రగాఢముగా విశ్వసించే వ్యక్తిని " అని మేయర్ టామ్‌పాటర్ పేర్కొనారు . ప్రపంచ వ్యాపతం గా ప్రతి ఒక్కరికీ సమానత్వం , సమాన న్యాయము ఉండాలని అభిప్రాయపడ్డారు .
సుమారు 150 దేశాలు సబ్యులగా చేరారు . అంతర్జాతీయ న్యాయానికి ఐ.సి.సి ఎంతగానొ తో్డ్పడుతుంది . టెర్రరిజం పెచ్చుమీరిన ఈ రోజుల్లో అన్నిదేశాలు కూడగట్తుకొని న్యాయాన్ని కాపాడెతేనే మానవ మనుగడ ప్రశాంతం గా అహింసామార్గము లో పయనించడానికి వీలుపడుతుంది .
చికాగొ లో -- జూలై 17 ,
బోస్టన లొ -- జూలై 14 ,
వాషింగ్టన్‌ లో -- జూలై 17 ,
ఇండియా లో -- జూలై 17
ఇలా ఒక్కొచోట ఒక్కోవిధం గా ఆరంభమైన ఈ ఇంటర్నేషనల్ జస్టిస్ డే ప్రపంచదేశాలన్నీ రెండు సంవత్సరాలుగా సమిస్టిగా జూలై 17 న నిర్వహించుకుంటున్నాయి .
  • ==========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Tuesday, July 27, 2010

ప్రపంచ నీటి దినోత్సవం , world water day



ఉత్సవం అంటే - కేళి , పండుగ , సంబరం , జాతర ,వేడుక . ఉత్సవం అంటే గొప్పయజ్ఞమనీ, మిక్కిలి ఆనందాన్ని కలిగించేదని అర్థం ఉంది. జీవితంలో ఒక సంగీతం ఉండదు. ఒక నాట్యం ఉండదు. జీవితం ఉన్నంత వరకు అలా పనిచేస్తూనే ఉండిపోతారు. ఉత్సవమంటే ఏమిటో తెలియకుండానే జీవితం గడిచిపోతుంది. అలా కాకుండా గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .
  • ప్రతిసంవత్సరము మార్చి 22 వ తేదీన ప్రపంచ జల దినోత్సవము నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించినది .
ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, " పర్యావరణం, ప్రగతి అనే అంశంపై 1992లో రియో డి జెనేరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి మహాసభ '' (యు ఎన్ సి ఇ డి) లో రూపుదిద్దుకున్నది. ఇందులో భాగంగా, 2010 సంవత్సరాన్ని " ఆరోగ్యవంతమైన ప్రపంచంకోసం, పరిశుభ్రమైన నీరు " అనే, నిర్దిష్ట భావనతో పాటించడం జరుగుతుంది.

మనం నివసించే భూగోళంలో 70 శాతానికిపైగా నీరే. అయితే, ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే. మొత్తం భూగోళంలోని నీటిలో దాదాపు 2.7 శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా, ఇందులోనూ 75.2 % ధృవప్రాంతాలలో మంచురూపంలో ఘనీభవించి వుంటే, మరో 22.6 % నీరు భూగర్భంలో వుంది. మిగతా నీరు సరస్సులు, నదులు, వాతావరణం, గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ, చెట్టు చేమలలో వుంటుంది. ఇంతేకాదు, సరస్సులు, నదులు, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు చక్కగా ఉపయోగపడగలిగిన నీరు, చాలా కొద్ది పరిమాణం మాత్రమే.

ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే, పరిశుభ్రమైన నీటిలో, 1 % కంటెకూడా తక్కువ పరిమాణంలో, ( లేదా, భూమిపై లభించే మొత్తంనీటిలో దాదాపు 0.007 % మాత్రమే) నీరు మానవ వినియోగానికి నేరుగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ , మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. కాని, ఇప్పటికీ, 88.4 కోట్ల మంది( 884 మిలియన్ల మంది) ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.

ప్రపంచవ్యాప్తంగా, ప్రతిఏటా , 1,500 ఘన కిలోమీటర్ల పరిమాణంలో, వ్యర్ధమైన నీరు వస్తుంటుంది. వ్యర్ధ పదార్ధాలను, వ్యర్ధమైన నీటిని పునర్వినియోగ ప్రక్రియ ద్వారా, ఇంధనోత్పత్తికి, వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు. కాని, సాధారణంగా , అలా జరగడం లేదు. అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికారణంగా, 80 శాతం వ్యర్ధాలను పునర్వినియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక ప్రగతికూడా, కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతున్నాయి. ఇదే దామాషాలో, పరిశుభ్రమైన నీటి అవసరం పెరుగుతున్నది. ఈ కారణంగా, ఇటు వర్తమానంలోను, అటు భవిష్యత్తులోను మానవ ఆరోగ్యానికి , పర్యావరణ స్వచ్ఛతకు ముప్పు పొంచివుండగా ; తాగడానికి ఉపయోగపడే పరిశుభ్రమైన నీటికి, వ్యవసాయ అవసరాలకు కావలసిన నీటికి తీవ్రమైన కొరత ఏర్పడుతున్నది. అయినప్పటికి, నీటి కాలుష్యం ‘అత్యవసరంగా దృష్టిసారించవలసిన అంశం’ అనే ప్రస్తావన, అరుదుగా కాని రావడంలేదు.

నీళ్లు-నిజాలు
వేసవి వస్తోందంటేనే భయమేస్తోంది. నీటి కొరత దడ పుట్టిస్తుంది. బిందెలతో బారులు తీరే జనాలు కనిపిస్తారు. మరి నీటి సమస్య అంత విస్తృతమైనది. నీరు లభించని ప్రాంతాలలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నేల తల్లి నెర్రెలిచ్చి నీటిచుక్కకోసం ఆబగా ఎదురుచూస్తుంటే ఇక మానవమాత్రులెంత! గొంతు తడుపుకునే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. పరిశుభ్రమైన నీళ్లు దొరక్క కుంటల్లో, గుంటల్లో అడుగుబొడుగు మురికి నీటినే తాగాల్సిన దుస్థితి. ఇలాంటి కఠోర వాస్తవాలు కొన్ని...

ప్రపంచంలో 80 దేశాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి.

భూమండలంమీద లభించే నీటిలో ఉప్పు సుమద్రాల వాటా 97 శాతం. మిగిలిన దానిలో 69 శాతం హిమపాతం, మంచుగడ్డలే. భూమి మీద లభించే నీటిలో 0.008 శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు.

క్రీశ 2025 నాటికి 48 దేశాల్లో తీవ్రమైన నీటికొరత వస్తుందని చికాగోలోని జాన్‌ హాప్కిన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ హెచ్చరించింది.

3.575 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం నీటికి సంబంధించిన వ్యాధులతో మరణిస్తున్నారు.

నీటిమూలంగా సంభవించిన 43 శాతం మరణాలకు అతిసారవ్యాధే కారణం.

పైన పేర్కొన్న మరణాలలో 84 శాతంమంది 14 ఏళ్ల లోపువారే.

98 శాతం మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే సంభవిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్న రోగులలో సగం మంది నీటి సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారే.

భూమిమీదున్న నీటిలో ఒక్క శాతానికంటే తక్కువ మొత్తం నీళ్లు మాత్రమే మానవాళి వెనువెంటనే వాడుకునేలా వున్నాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మురికివాడల్లో నివసించే ఒక వ్యక్తి రోజుమొత్తంమీద ఉపయోగించే నీరు ఒక అమెరికన్‌ స్నానానికి వాడే నీటితో సమానం.

లీటరు నీటికి మురికివాడల్లో నివసించే పేదలు, అదే నగంలోని ధనికులకంటే 5-10 రెట్లు అధికధర చెల్లిస్తున్నారు.

ఆహారం లేకుండా మనిషి కొన్ని వారాలపాటు వుండగలడు. కానీ నీరు లేకుండా కొద్దిరోజులు మాత్రమే వుండగలడు.

ప్రతి 15 సెకన్లకు ఒక చిన్నారి నీటి సంబంధ వ్యాధితో చనిపోతోంది.

లక్షలాది మంది మహిళలు, పిల్లలు రోజుమొత్తం మీద అనేక గంటల సమయాన్ని సుదూర ప్రాంతాలనుంచి నీళ్లు తేవడం కోసం వెచ్చిస్తారు.

రోగాల నివారణలో దివ్య ఔషధం నీరు :

వాతావరణంలోని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల కలయిక వల్ల నీరు ఏర్పడు తుంది. ఈ రెండు వాయు పదార్ధాలు కలిస్తే ద్రవ రూపమైన నీరు ఏర్పడును. నిత్యజీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తాం. నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను తగ్గించే అవకాశం ఉంది. అవి ఏమిటంటే.

గొంతునొప్పి, టాన్సిల్స్‌ : నీరు వేడిచేయాలి. దానిలో కొద్దిగా ఉప్పు వేసి కరిగించాలి. ఆ నీటిని పుక్కిట పట్టాలి. ఉపశమనం కలుగుతుంది.

జలుబు, ఆస్త్మా, బ్రాంకైటిస్‌ : నీటిని మరి గించాలి. దానిలో కొద్దిగా పసుపు లేక యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండుచుక్కలు వేయాలి. ఆ నీటిఆవిరిపడితే మంచి రిలీఫ్‌.

తలనొప్పి : ఐస్‌ ముక్కలు నుదుటిపై రుద్దాలి.

జ్వరం : తడిగుడ్డతో/ మంచు ముక్కలతో శరీరం ముఖ్యంగా పాదాలు, ఆరిచేతులు తుడవాలి. దీనివల్ల 1-2 డిగ్రీల జ్వరం తగ్గుతుంది.

ఎక్కిళ్ళు : గోరువెచ్చని గ్లాసుడు నీరు నెమ్మదిగా సిప్‌ చేస్తూ త్రాగాలి.

కుక్క కరిస్తే : సబ్బునీటితో ఆ భాగం కడిగి శుభ్రం చేయాలి. గాయాన్ని కడగాలి. ఏకధారగా గాయం మీద నీరు పోస్తే రేబీస్‌ కల్గించే సూక్ష్మజీవులు, చొంగపోతాయి. తిరిగి సబ్బు నీటితో కడిగి కట్టుకట్టాలి.

చర్మం కాలితే : వెంటనే చల్లటి నీటితో కాలిన ప్రదేశం తడపాలి. దీనివల్ల కాలిన గాయం చల్లబడి మరింతగా చర్మం కాలి పోకుండా ఉంటుంది.

దగ్గు : వేడినీరు త్రాగితే కఫం కరుగు తుంది. పసుపును మరిగే నీటిలో వేసి ఆవిరి పట్టాలి.

చిన్న చిన్న గాయాలు : చల్లటి నీటిలో కడిగితే మలినాలు, సూక్ష్మజీవులు పోతాయి. రక్తం నెమ్మదిగా గడ్డకట్టి రక్తం కారడం తగ్గుతుంది.

నిద్రపట్టకపోతుంటే : చల్లటి/ గోరువెచ్చటి నీటితో స్నానం చెయ్యాలి. పాదాలు వేడినీటి తో తడుపుకోవడం మంచిది.

ఒళ్ళు నొప్పులు : వేడినీటిలో ఉప్పువేసి కాపడం కాయాలి.

మలబద్దకం : ఎక్కువగా నీరు త్రాగాలి. రాత్రి రాగి చెంబులో నీరుపోయాలి. అది పరగడుపున త్రాగాలి. దీనివల్ల మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగును.

వాపులవల్ల కలిగే నొప్పి : ఐస్‌ ముక్కతో బాగా రుద్దాలి.

ముక్కులోంచి రక్తం పడుతుంటే : చల్లటి నీరు తలమీద పోయాలి. నుదుట/ ముక్కుమీద తడిగుడ్డ వెయ్యాలి.

దంతాల నొప్పి : గోరువెచ్చని నీటిలొ ఉప్పువేసి పుక్కిలించాలి.

శరీరంలోనొప్పులు : వేడినీటి కాపడం, వేడినీటి ఆవిరి.

రుమాటిజం : ఎక్కువనీరు త్రాగితే రక్తం పలచబడుతుంది. యూరిక్‌ యాసిడ్‌ లెవెల్‌ తగ్గుతుంది. యూరిన్‌ ద్వారా యూరిక్‌ ఆమ్లం బయటికిపోతుంది.

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ : ఎక్కువనీరు త్రాగితే ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సూక్ష్మజీవులు వేగంగా, మూత్రం ద్వారా ఎక్కువగా విసర్జింపబడి ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది.

కంటిలో నలక పడితే : నలపకూడదు. గ్లాసు నిండా నీరు తీసుకోవాలి. దానిలో కన్ను ముంచి చికిలించాలి. కంటిలోని దుమ్ము, ధూళి, నలకలు వంటివి నీటిలోకి వచ్చి బయటికి పోతాయి.

విరోచనాలు, వాంతులు : శరీరంలో నుండి ఎంతనీరు బయటికిపోతుందో అంతే పరిమాణంలో నీరు త్రాగితే నిర్జలీకరణం అరికట్టబడుతుంది.

రసాయనాలు చర్మంపై పడితే : ఎక్కువసేపు, ఏకధారగా నీరుపోస్తూ కడగాలి. తీవ్రత తగ్గుతుంది.

మూత్ర పిండాలలో రాళ్ళు : ఎక్కువగా నీరు త్రాగాలి. చిన్న రాళ్ళు మూత్రం ద్వారా విసర్జింపబడతాయి. మూత్రం పలచబడడం వల్ల యూరిన్‌ యాసిక్‌ రాళ్ళు ఏర్పడవు. మూత్రకేశ సంబంధ వ్యాధులు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంది.

ఎక్కువగా నడవడంవల్ల కలిగే కాళ్ళనొప్పులు : గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలపాలి. కొద్దిసేపు ఆ నీటిలో పాదాలు ఉంచాలి.

కడుపునొప్పి : హాట్‌వాటర్‌ బేగ్‌ ఆ ప్రదేశంలో ఉంచాలి.

జ్వరం : గంటకు కనీసం ఒక గ్లాసు నీరు త్రాగడం మంచిది. శరీరం నుండి బయటికిపోయే నీరు భర్తీ అవుతుంది. నీరు ఆవిరి అవడంవల్ల చర్మం చల్లబడు తుంది. మలినాలు ఎక్కువగా విసర్జింప బడతాయి. ఇన్‌ఫెక్షన్‌ త్వరగా తగ్గుతాయి.

శరీరంలో ఏ అవయవమైనా వాపు, నొప్పి : ఐస్‌ముక్కలతో రాయాలి.

ఒంటికి నీరు పడితే : పెరుగు ఎక్కువగా వాడాలి. ఇది కఫాన్ని కరిగిస్తుంది కూడా.

ముక్కులో, గొంతులో శ్లేషం : దోసిట్లో నీరు పోసుకొని ముక్కుతో లోనికి లాగడం.

నీరు తక్కువగా తాగితే :
  • డీహైడ్రేషన్‌ కలుగు తుంది ,
  • మలబద్దకం ఏర్పడుతుంది ,
  • తలనొప్పి , తలతిరగడం , అలసట , నిస్రాణం , అందోళనం కలిగే అవకాశముంది .
  • మూత్రవిసర్జన తగ్గుతుంది , ఒక్కొసారి మూతవిసర్జన ఆగిపోవచ్చును ,కండరాల నొప్పులు, బలహీనత , కాళ్ళు చేతులు చల్లబడడం జరుగవచ్చును .
  • చర్మము పొడిబారుతుంది , కాంతివిహీనమవుతుంది . నోరు పొడిబారుతుంది . అజీర్ణము - అనేక జీర్ణసంబంధిత బాధలు కలుగుతాయి.
  • మూత విసర్జన సమయము లో మంట , నొప్పి కలుగుతాయి. మూతవిసర్జన సక్రమముగా జరగకపోతే రక్తం మలినాలతో నిండిపోయి విషపదార్ధాలు శరీరములో పేరుకు పోతాయి . అనేక రకాల వ్యాధులకు దారితీస్తుంది .
  • వయసు పెరిగినకొద్దీ దాహము తగ్గుతుంది . నీరు తాగాలని అనిపించకపోయినా తగినంత నీరు తాగాలి ,లేకపోతే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి. రోజుకు వ్యక్తి బరువు కిలోగ్రాములు /30 తో భాగించగా వచ్చే సంఖ్య లీటర్లలలో తీసుకుని సుమారుగా అన్ని లీటర్ల నీరు త్రాగాలి .
  • ఎక్కువ రక్తపోటు , ఆస్థమా , విపరీతమైన శారీరక నొప్పులు రావడానికి తక్కువ నీరు తాగడం ఒక కారణము .
నీటి వల్ల కనిగే వ్యాధులు :

* డయేరియా ,
* టైఫాయిడ్ ,
* డిసెన్ట్రి ,
* అమిబియసిస్ ,
* కలరా ,

నీరు తాగే సరియైన సమయాలు : Correct timings to take water->

ఒక గ్లాసు నీరు = సుమారుగా 200 మి.లీ.

* 2 గ్లాసులు నీరు -- నడక వ్యాయామం తర్వాత తీసుకుంటే శరీరములోని అవయవాలు ఉత్తేజితమగును,
* 2 గ్లాసులు నీరు-- 30 నిముషాలు భోజనము ముందు తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగును ,
* 2 గ్లాసులు నీరు-- 60 నిముషాలు భోజనము తరువాత తాగితే జీర్ణసంభందిత రుగ్మతలు పోవును .,
* 2 గ్లాసులు నీరు--05 నిముషాలు స్నానము చేసే ముందు తాగితే రక్తపోటు (బి.పి) తగ్గును ,
* 2 గ్లాసులు నీరు--05 నిముషాలు పడుకునే ముందు త్రాగితే గుండె పోటు వచ్చే అవకాశము చాలా శాతము తగ్గును ,
* 2 గ్లాసులు నీరు-- పరగడుపున త్రాగితే ఎసిడిటీ బాదలు లేకుండాపోవును .. మూత్రపిండాల వ్యాధులు దరిచేరవు

రోజుకు ఎంతనీరు త్రాగాలి :
మనిషికి రోజుకు 2.5 లీటర్ల నీరు అవసరము , ఆరోగ్యము . కొంత నీరు మనము తినే ఘన పదార్డ ఆహారము నుండి లభిస్తుంది ... మిగతాది త్రగావలసిందే .
ఒక మనిషి రోజుకి ఎంత నీరు త్రాగాలి అంటే : సుమారుగా
మనిషి బరువు కిలోగ్రాములలో / 30 = లీటర్లలో .
ఉదా : మనిషి బరువు =60 కి.గ్రా.
రోజూ త్రాగవలసిన నీరు =60/30 - 2.0 లీటర్లు .(సుమారు అటు .. ఇటు గా )

  • నీటి కోసం ఒక రోజును ఎందుకు కేటాయించారు?

    నీరు లేని భూమిని ఒకసారి ఊహించుకోండి. పచ్చని చెట్లు, పారే నదులు, జీవులు, మహా సముద్రాలు ఏమీ ఉండవు. ఇవేవీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా ఉంటుంది భూమి. అంతటి అమూల్యమైన నీటి విలువను తెలుసుకోడానికి, దానిని వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి ఈ రోజును కేటాయించారు. ఐక్య రాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జలదినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది. మన భూమ్మీద నీటి గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటే అదెంత విలువైనదో అర్థం అవుతుంది.
    * భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది. పెరగడం కానీ తరగడం కానీ కాలేదు. కానీ ఆ నీటిని వాడుకునేవారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు.
    * భూమ్మీద ఉన్న నీరు ఎండకు ఆవిరవుతూ, మేఘాలుగా మారుతూ, వర్షంగా కురుస్తూ, భూమిలో ఇంకుతూ, సముద్రంలో కలుస్తూ వేర్వేరు రూపాల్లోకి మారుతూ ఉంటుంది. అంటే ఒకప్పుడు డైనోసార్లు ఎంగిలి చేసిన నీటినే ఇప్పుడు మనం కూడా తాగుతున్నామన్నమాట.
    * భూమ్మీద మూడొంతులు నీరే ఉంది. కానీ అందులో 97 శాతం ఉప్పునీరే. కేవలం 3 శాతమే మంచి నీరు. ఇందులో కూడా 2 శాతం మంచురూపంలో ఉంది. మిగతా ఒక శాతం నీరులో 0.59 శాతం భూగర్భంలో ఉంటే, మిగతాది నదులు, సరస్సుల్లో ప్రవహిస్తోంది.
    * ఉన్న మంచి నీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమైపోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణించిన వారే ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు.
    * అమెరికాలో ఒక వ్యక్తి తన అవసరాలకి రోజుకి 500 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంటే, ఆఫ్రికాలోని గాంబియా దేశంలో ఒక వ్యక్తి రోజుకి కేవలం 4.5 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాడు. గాంబియాలాంటి చాలా దేశాల్లో తాగేందుకు కూడా నీరు దొరకడం లేదు.
    మనమేం చేయాలి?
    * ఎక్కడైనా కొళాయిల్లోంచి నీరు వృధాగా పోతున్నట్టు కనిపిస్తే వెంటనే కట్టేయండి.
    * షవర్‌తో స్నానం చేయడం మానేసి, బకెట్‌ నీళ్లతో చేయండి. దీని వల్ల రోజులో 150 లీటర్ల నీటిని కాపాడవచ్చు.
    * పళ్లు తోముకున్నంత సేపూ సింక్‌లోని కొళాయిని వదిలి ఉంచకండి. ఇలా చేయడం వల్ల నెలకి 200 లీటర్ల నీరు వృథా అవుతుంది.
    * టాయిలెట్‌ ఫ్లష్‌లో సుమారు 8 లీటర్ల నీరు పడుతుంది. లీటర్‌ నీరు పట్టే రెండు బాటిళ్లు తీసుకుని దానిలో ఇసుక లేదా చిన్న చిన్న రాళ్లు నింపి, టాయ్‌లెట్‌ ఫ్లష్‌లో పెట్టేయండి. దీనివల్ల ఒకసారి వాడే నీటిలో రెండు లీటర్ల నీళ్లు ఆదా అవుతాయి.
    * అక్వేరియంలోని నీళ్లు పారేయకుండా మొక్కలకి పోయండి.
    * కొళాయిలకి లీకేజీలు ఉంటే దానిని అరికట్టండి. దీనివల్ల నెలలో 300 గ్యాలన్ల నీరు ఆదా అవుతాయి.
    * స్కూల్లో, మీ ఇంటి చుట్టుపక్కల మొక్కలు పెంచండి
    మీకు తెలుసా?
    * ఒక కిలో బియ్యాన్ని పండించడానికి 5000 లీటర్ల నీరు అవసరమవుతుంది.
    * ఒక వార్తాపత్రికలో వాడే కాగితం తయారీకి 300 లీటర్ల నీరు ఖర్చవుతుంది.
    * ప్రపంచంలోని మంచినీటిలో 70 శాతాన్ని వ్యవసాయంలో, 22 శాతం పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు.
    * అరకిలో కాఫీ తయారవడానికి 11,000 లీటర్ల నీరు అవసరం.
    * ప్రపంచంలో నీటిపై జరుగుతున్న వ్యాపారం విలువ 400 బిలియన్‌ డాలర్లు.

source : wikipedia.org
  • =================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Teenagers Day , టీనేజర్స్ డే





ప్రతి సంవత్సరము జూలై 26 న జరుపుకునే కొత్త దినోత్సవము . 2007 సంవత్సరము లో లొండన్‌ లో మ్యూజిక ఎంటర్ టైన్‌ మెంట్ గా మొదలైనది . ఒక యాన్యుయల్ ఈవెంట్ గా రూపుదిద్దుకొని కాలక్రమేన ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది . మంచో .. చెడో ... మనమూ తెలుసుకుందాం . ఈ దినోత్సవము రోజున తల్లిదండ్రులు వారి పిల్లలతో యవ్వనము మొదలైన నాటి నుండి ఎలా ఉండాలి , పిల్లలను ఎలా మంచి మార్గములో పెట్టాలి , పిల్లల ఉద్దేశాలను ఎలా గౌరవించాలి అనే విషయాలు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశము చాలా మంచిది .

ప్రేమ , ద్వేషము , ఆవేశము , ఆలోచన , పట్టుదల్ , నిర్లిప్తత , అనురాగము , అసూయ , సృజనాత్మకత , స్తబ్దత ... ఇలాఎన్నో వైరుద్యాల కలబోత తీనేజ్ . చందమామతో ఆడుకోవాలని , అరుదైన సాహసము చేసి ప్రపంచాన్నంతా ఔరా అనిపించాలనుకుంటూ పొంగిఒరిలే ఉత్సాయము ఒక ప్రక్క , చిమ్మ చీకట్లో తలదాచుకొని వెక్కివెక్కి ఏడవాలనే నైరాశ్యము మరో వైపు కనిపిస్తుంది . చదువులో ఇంటర్మీడియట్ ఎటు వంటిదో ... వయసు లో ఈ టీనేజ్ అటువంటిది . ఏదైనా చేసేయగలమనుకుంటూ సాధ్యాసాధ్యాలను సరిగ్గా అంచనా వేసుకోలేక , తల్లిదండ్రుల నుండి పూర్తి స్వేచ్చ కోరుకుంటూ .... కాదంటే కార్చిచ్చు సృస్టిసుంటూ ప్రవర్తిస్తుంటారు . ప్రపంచీకరణ నేపధ్యము లో ఏర్పడిన పోటీవాతావరణము , అందుబాటులోకి వచ్చిన సాంకేతిక సౌకర్యాలు ... ఎంత మేలుచేస్తున్నాయో అంతే కీడు సృస్టిస్తున్నాయి . భవిష్యత్తుకు ఓ కీలక మజిలీగా నిలుస్తున్న ఈ " టీనేజ్ " లో కుటుంబమంతా అప్రమత్త్తము గా ఉంటే పిల్లలు ఉత్తమం గా ఎదిగేందుకు అవకాశము ఉంటుంది .

యవ్వనము :
పిల్లలకు 13 ఏళ్ళు దాటితే వారు యవ్వనము ( టీనేజ్) లోమి ప్రవేశించినట్లే . అప్పటి నుంచి 20 ఏళ్ళు వచ్చేవరకు యవ్వనదశ అంటారు . ఇది చాలా కీలకము . అటు కుటుంబ సభ్యులకు , వ్యక్తిగతం గా ఇటు పిల్లలకు ఇది చాలా కీలకమైన సమయము . పేరెంట్స్ ఈ దశ పిల్లలను అన్ని కోణాలనుండి కనిపెట్టే విధంగా ఉండాలి ... అలా అని బంధించకుండా ఒక దిక్సూచిలా ఉండాలి . ఈ కాలము లోనె వారు పదోతరగతి , ఇంటర్ పూర్తి చేసి మెడిసన్‌ , ఇంజనీరింగ్ , కంప్యూటర్ , దిగ్రీ వంటి తరగతులలోమి వెళుతుంటారు . అందువల్ల వారు తీసుకున్న నిర్ణయాలకు తోడు తల్లిదండ్రుల ప్రణాళిక ఒకే విధంగా ఉంటే యవ్వనము హాయిగా గడిచిపోయినట్లే . ఈ సమయము (వయసు) లో అబ్బయిలు , అమ్మాయిలు అనేక లక్షణాలు కనబరుస్తారు .
  • స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి .
  • పోటీతత్వము ఎక్కువగా ఉంటుంది .
  • అనుకరణకు ఇస్టపడతారు ,
  • తోటివారితో తిరగడం , గడపడానికి ఇస్టపడతారు ,
  • పెద్దలు చెప్పిన మాటలకన్న తోటివారి సలహాలను అధికం గా గౌరవిస్తారు .
  • సమాజము లో వారికి గుర్తింపు రావాలని కోరుకుంటారు ,
  • వారి మాటే నెగ్గాలనే పట్టుదల అధికంగా ఉంటుంది ,
  • ఆత్మాభిమానము ఎక్కువగా ఉంటుంది ,
  • విజయము తప్ప ఓటమి ని భరించలేరు .
  • పట్టుదలతో సహా ఆత్మనూన్యతాభావము కూడా ఎక్కువగానే ఉంటుంది .
  • విమర్శలు చేయడం తప్ప వాటిని తట్టుకోలేరు .
  • ఆడంబరాలకు , కొత్తదనానికి , ఫ్యాషన్‌లకు ప్రాధావ్యత ఇస్తారు .
  • అవమానము భరించలేరు ... అధికారము సహించలేరు .
టీనేజ్ చాలా సున్నితమైనది , ఈ సమయములో పిల్లలతో పాటు తల్లిదండులు కూడా అప్రమత్తం గా ఉండాలి . ఈ వయసులో పిల్లలను సానబెడితే అద్భుతాలు సాధించగలుగుతారు . చెడుదారులు పడితే భవిష్యత్తు చీకటిమయమువుతుంది .

తల్లిదండ్రుల పాత్ర :
యవ్వనము లో ఉన్న పిల్లల పెంపకములో తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది . ఈ సమయము లో పేరెంట్స్ తీసుకోవలసిన జాగ్రత్తలు :
  • తల్లిదండ్రులు పిల్లల్కు స్వేచ్చనివ్వడం తో పాటు వారి ప్రవర్తనను పరిశీలిస్తుండాలి ,
  • తప్పు జరిగి నపుడు దండించకుండా సంయమనము పాటించాలి ,
  • ప్రతీ విషయాన్ని విమర్శించడం , తీవ్రంగా పరిగణించడం చేయకూడదు ,
  • మంలింపు స్థానములో సలహాలు చెప్పి సర్ధి చెప్పడం జరగాలి ,
  • అనవసర దర్పాలకు , గౌరవాలకు పోయి వారిని బలవంతంగా శాసించరారు ,
  • వారి మాటలకు , భావాలను ఆదరిస్తూనే ఎప్పటికప్పుడు మానసిక పరివర్తనకు ప్రయత్నించాలి .
  • ఓటమిని , విజయాన్ని ఒకే విధం గా చూడాలి ... దాని ప్రభావము పిల్లల ఎదుగుదల కు ఎంతో ఉపకరిస్తుంది .
  • వారి ఎదుట అసభ్యకరం గా ప్రవర్తించకూడదు .
పిల్లల భాద్యత :

  • తల్లి దండ్రులు , ఉపాధ్యాయులు తమకు దిక్సూచి వంటివారని పిల్లలు గ్రహించాలి ,
  • తల్లిదండ్రులు మా కోసమే చెబుతున్నారని ... ఆ క్షణము లో ఆలోచిస్తే ఎన్నో సమస్యలకు పరిస్కారము దొరుకుతుంది .
  • క్షణికావేషము లో నిర్ణయాలు తీసుకోకూడదు .
  • ప్ర్రాణము ఎంతో విలువైనది ... ఆత్మహత్యా ప్రయత్నాలు చేయకూడదు .
  • ప్రేమ , దోమ అని తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలు వమ్ముచేయకూడదు .
  • తల్లి దండ్రులు లతో స్నేహపూరితం గా ఉండాలి ... అన్ని విషయాలు కూలంకషం గా డిస్కస్ చేసి వారి అభిప్రాయాలనూ గౌగవించి అందరూ కలిసికట్టుగా ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలి .
  • మన మన మంచి కోసమేనని భావించాలి .


  • ===============================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Monday, July 26, 2010

Parents Day , తల్లి దండ్రుల దినోత్సవం




కన్నవారిని గౌరవించేందుకు ... మదర్స్ డే , ఫాదర్స్ డే ఉన్నాయి కదా ... మల్లీ ఈ తల్లిదండ్రుల దినోత్సవం ఎందుకు ?. తల్లిదండ్రులను వేరువేరు గా గౌరవించడం ఇస్టములేక ...మదర్స్ డే ని , ఫాదర్స్ డే ని , రెండింటినీ కలిపి ఒకే రోజు సెలెబ్రేట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశముతొ అమెరికాలో ఈ ప్రపోజల్ మదలైంది .

అమెరికా లో ఫాదర్స్ డే ని జూన్‌ 3 వ ఆదివారము , మదర్స్ డే ని -మే 2 వ ఆదివారము - జరుపుకునే ఆచారము ఉంది . పేరెంట్స్ డే ని ప్రతి సంవత్సరము జూలై 4 వ ఆదివారము జరుపుతున్నారు . 1994 లో నాటి అమెరికా ప్రసిడెంట్ " బిల్ క్లింటన్‌ " సంతకము చేసి శాసనము చేసారు . అమెరికా సుప్రీం కోర్టు కూడా మదర్స్ డే , ఫాదర్స్ డే లను రద్దుచేసి తల్లిదండ్రుల విషయము లో లింగభేదము ఉండ కుండా చూడాలని తీర్మాణానికి అంగీకరించినది . అప్పటినుండే పేరెంట్స్ డే ని జరుపుకోవడం ప్రపంచమంతటా వ్యాపించినది .

కొరియా లో పేరెంట్స్ డే ని ' మే 08 ' న జరుపుకుంటారు . ఇండియా లో జూలై 4 వ ఆదివారమే ... ఇప్పుడిప్పుడే జరుపుకోవడం మొదలైనది .

------------------------------------------------------------------------------------------------------
పిల్లలు పెద్దవుతున్నకొద్దీ... పెద్దలు పసివాళ్లయిపోతారు. బిడ్డల్ని వదిలి ఉండలేరు. ఉన్నా ప్రశాంతంగా బతకలేరు. ఒంటరితనం వేయివైపుల నుంచి దాడిచేస్తుంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఉద్యోగాలు, వేరుకాపురాలు కన్నమమకారానికి కఠిన పరీక్ష పెడతాయి. 'ఎమ్టీనెస్ట్‌ సిండ్రోమ్‌' నడివయసు జీవితాలను సంక్షోభంలో ముంచెత్తుతుంది.

కాలింగ్‌బెల్‌ వోగుతుంది. 'వాడే, కాలేజీ నుంచి వచ్చుంటాడు'... తనలో తానే మాట్లాడుకుంటూ తలుపు తీస్తారామె.
ప్చ్‌... ఎదురుగా పోస్టుమాన్‌.
మళ్లీ బెల్లు వోగినా అంతే ఆశగా తీస్తారు.
అది పిచ్చి కాదు. పిచ్చి ప్రేమ.
''అయినా, వారం రోజుల క్రితం అమెరికా విమానం ఎక్కిన కొడుకు అప్పుడే ఎలా తిరిగొస్తాడమ్మా!''

* * *
మహానగరం. చిమ్మచికటి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఓ యువకుడు పరుగులు తీస్తున్నాడు. ఎవరో వెంటాడి తరుముతున్నారు. పరుగెత్తిపరుగెత్తి అలసిపోయాడు. నిస్త్రాణంగా నడిరోడ్డుమీదే కూలబడిపోయాడు. అంతలోనే ఓ లారీ రివ్వున దూసుకొచ్చింది.
ఆ యువకుడు ఎవరో కాదు, తన బిడ్డ. ఒక్కగానొక్క... 'కెవ్వు'మంటూ కేక.
కల. పీడకల. ఒళ్లంతా చెమటలు. గుండెల్లో దడ.
మంచినీళ్లు తాగి, దేవుడికి దండం
పెట్టుకుని పడుకుందామె.
''ముంబయిలో లక్షణంగా ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డ మీద అంత దిగులెందుకమ్మా? కలలంటే మన ఆలోచనలే. మంచి జరగాలన్న ఆకాంక్ష కంటే, చెడు జరుగుతుందేవో అన్న భయం ఎక్కువైనప్పుడే ఇలాంటి కలలొస్తాయి''

* * *
'పెళ్లి పందిరి విప్పనేలేదు. చుట్టాల సందడి తగ్గనేలేదు. పెళ్లికూతురి తండ్రి అంత దిగులుగా కనిపిస్తున్నాడేమిటి?'

'ఏం చేస్తాడు పాపం! నిన్నవెున్నటిదాకా అన్నీ తానైన కూతురు... ఓ అయ్యచేయి పట్టుకుని వెళ్లిపోయింది. పిచ్చి నాన్న!

ఆ మార్పును జీర్ణించుకోలేకపోతున్నాడు'

''నిన్నటిదాకా మీ కూతురు. ఈరోజు మరొకరి ఇల్లాలు. ఏ ఆడపిల్లకైనా పెళ్లితో ప్రాధాన్యాలు మారిపోతాయి. భర్త, అత్తమామలు, పిల్లలు..తనదైన ప్రపంచాన్ని సృష్టించుకోడానికి వెళ్లిపోయింది మీ చిట్టితల్లి- మీ ఆవిడ అత్తింటికి వచ్చినట్టు. అన్నీ తెలిసినవారు, ఇలా బెంగపెట్టుకుంటే ఎలా సార్‌!''
* * *
పక్షి గూడు కడుతుంది. గుడ్లు పెడుతుంది. వెచ్చగా పొదుగుతుంది. పిల్లల్ని గూట్లో వదిలేసి ఆహారానికి బయల్దేరుతుంది. దొరికినంతా నోటికి కరచుకుని, గబగబా గూటికొచ్చేస్తుంది. ఒక్కో ముక్కా పిల్లల నోట్లో పెడుతుంది. ఎలా తినాలో చెబుతుంది. ఎలా కూయాలో నేర్పుతుంది. ఎలా గాల్లో ఎగరాలో బోధిస్తుంది. చెప్పాల్సిందంతా చెప్పాక, నేర్పించాల్సినవన్నీ నేర్పించాక... తల్లి జీవితం తల్లిది. బిడ్డ జీవితం బిడ్డది. పిట్ట ఎగిరిపోతుంది. తనకో తోడు వెతుక్కుంటుంది. మళ్లీ ఆ పక్షుల జంటకు పిల్లలు. అవీ పెరిగిపెద్దవుతాయి. రివ్వున ఎగిరి ఎక్కడికో వెళ్లిపోతాయి. ఇదో చక్రం. నిరంతరం. తరంతరం. వెళ్తున్నప్పుడు బరువైన వీడుకోళ్లు ఉండవు. వెళ్లొద్దంటూ వేడుకోళ్లూ ఉండవు. పక్షులే కాదు, ఏ జీవుల్లోనూ ఆ మితిమీరిన మమకారం కనిపించదు.

మరి, మనం? మనుషులం?

వెళ్లారని బాధపడుతూ, ఎలా ఉన్నారో అని బెంగపడుతూ, ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తూ, తీరా వచ్చాక అప్పుడే వెళ్లిపోతున్నారని మధనపడుతూ... ప్రతి నిమిషం, ప్రతిరోజూ, బతుకంతా కుమిలిపోతూనే గడిపేస్తాం.

పక్షికి ఎగరడం అవసరం.

మనిషికి ఎదగడం అవసరం.

ఎదగాలంటే ఎగరాల్సిందే!

ఈ ఎడబాటు-మన తల్లిదండ్రులకు తప్పలేదు. మనకు తప్పదు. మన పిల్లలూ తప్పించుకోలేరు. కాస్త ముందో వెనకో ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే సంక్షోభమే ఇది. ఎంత హుందాగా, ఎంత నిబ్బరంగా ఆ దశను అధిగమిస్తే... అంత ప్రశాంతంగా జీవితం గడిచిపోతుంది.
పిల్లలే ప్రపంచం...
వాణ్ని నిద్రలేపాలి. బలవంతంగా బాత్‌రూమ్‌లోకి తోసెయ్యాలి. పాలు కలిపి ఇవ్వాలి. ఇష్టమైన టిఫిను చేసిపెట్టాలి. బీరువాలోంచి బట్టలు తీసివ్వాలి. బాక్సు సర్దాలి. బయల్దేరుతున్నప్పుడు బాబా విభూతి రాయాలి. సాయంత్రం వచ్చేసరికి చిరుతిళ్లు సిద్ధం చేయాలి. రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు, వాడు చెప్పే కాలేజీ కబుర్లు వినాలి. చదువుతూ చదువుతూ నిద్రలోకి జారుకుంటే దుప్పటి కప్పి, ట్యూబులైటు కట్టెయ్యాలి.

ఆడపిల్ల విషయంలో ఆ అనుబంధం మరింత ప్రగాఢం. ఆ ముగ్గు, ఆ సిగ్గు, ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ చొరవ, ఆ సందడి... ప్రతీదీ అపురూపమే! ఏ దేవతో శాపవశాత్తూ మనింట్లో పుట్టిందేవో అనిపిస్తుంది. కాఫీ కలిపితే తనే కలపాలి. పాయసం వండితే తనే వండాలి. షాపింగ్‌కి వెళ్లాలంటే తనుండాల్సిందే. బంగారు తల్లి మనసూ బంగారమే! అమ్మ కష్టాన్ని చూడలేదు. నాన్న బాధపడితే తట్టుకోలేదు. తోబుట్టువులంటే ప్రాణమిస్తుంది. అందరి అభిరుచులూ తనకే తెలుసు.

అందరి అవసరాలూ తనకే తెలుసు.

అబ్బాయి పైచదువులకు వెళ్లిపోతాడు. లేదంటే, పెళ్లిచేసుకుని వేరుకాపురం పెడతాడు. అమ్మాయి అత్తారింటికి బయల్దేరుతుంది. లేదంటే, అమెరికా చదువులకెళ్తుంది. కారణం ఏదైనా కావచ్చు. ప్రభావం మాత్రం ఒకేలా ఉంటుంది. పిల్లల చుట్టూ అల్లుకున్న తల్లిదండ్రుల జీవితాల్లో ఒక్కసారిగా శూన్యం. భరించలేనంత ఒంటరితనం. తట్టుకోలేనంత నిశ్శబ్దం.

అంతా బావుంటుంది. అబ్బాయి అక్కడ బుద్ధిగా చదువుకుంటూ ఉంటాడు. చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అమ్మాయి కాపురం హాయిగా సాగిపోతూ ఉంటుంది. అల్లుడు యోగ్యుడు. అత్తమామలు మంచివారు. ఆ పిల్లల గురించి అంతగా ఆలోచించి, బుర్ర పాడుచేసుకోవాల్సిన అవసరమే ఉండదు. అయినా ఏదో వెలితి. చింత, చికాకు, ఒత్తిడి, అర్థంలేని భయం, లేనిపోని భ్రమలు, పిచ్చిపిచ్చి వూహలు, అపోహలు, అనుమానాలు, నిస్పృహ, పరధ్యానం...

మనసునిండా బోలెడంత కల్లోలం. మానసిక శాస్త్రవేత్తలు ఈ సంక్షోభానికి పెట్టినపేరు 'ఎమ్టీనెస్ట్‌ సిండ్రోమ్‌'. గూడు ఖాళీ అయిపోయి, గుండె బరువెక్కిపోవడం.

కొన్నిసార్లు ఈ సిండ్రోమ్‌ ప్రభావాలు... కన్నవారికీ పిల్లలకూ మధ్య అగాథాన్ని సృష్టిస్తాయి. తండ్రి అంతదూరం పంపనని భీష్మించుకు కూర్చుంటాడు. కొడుకు వెళ్లితీరాల్సిందేనని పట్టుపడతాడు. 'ప్రాణంపోయినా సరే...' అంటూ ఇద్దరూ శపథాలు చేసుకుంటారు. ఇష్టమైన కోర్సులో చేరలేకపోతున్నందుకు బిడ్డ ఏ అఘాయిత్యానికో పూనుకోవచ్చు. డిప్రెషన్‌లో కూరుకుపోవచ్చు. కొడుకు ఎడబాటును భరించలేక తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. హింసాత్మకంగా వ్యవహరించవచ్చు. ఇలాంటి కారణంతోనే, ఆమధ్య అహ్మదాబాద్‌లో రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ దత్తాత్రి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. నిస్పృహలోంచి బయటపడి, ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే... ఎవరూ ఇలాంటి చర్యలకు ఒడిగట్టరు. అసలు, చావు ఏ సమస్యకూ పరిష్కారం కాదు. కొందర్లో 'ప్రీ ఎమ్టీనెస్ట్‌ సిండ్రోమ్‌' లక్షణాలూ కనబడుతుంటాయి.

బిడ్డ పదోతరగతి పరీక్షలు రాస్తున్నప్పుడే... భవిష్యత్‌లో తాము అనుభవించబోయే ఒంటరితనాన్ని తలుచుకుని కుమిలిపోతుంటారు. పొరుగింటి అమ్మాయి పెళ్లి జరిగినా, తమ కూతురు అత్తింటికి వెళ్లే ఘట్టాన్ని వూహించుకుని కన్నీళ్లుపెడుతుంటారు.

పిల్లలూ తెలుసుకోండి
''ఎవరి కలలు వారికుంటాయి. వాటిని నిజం చేసుకోవాలనుకోవడం తప్పుకాదు. ఇల్లొదిలి వెళ్లవచ్చు. అవసరమైతే, దేశం వదిలి కూడా వెళ్లవచ్చు. ఎంతదూరం వెళ్లినా..బిడ్డ దూరమైపోతున్నాడన్న భావన మాత్రం కలిగించకూడదు. చదువుల్లో ఉద్యోగాల్లో ఎంత తీరికలేకపోయినా... రోజుకు ఒకసారి, ఒక్క నిమిషం పలకరించినా... కన్నవారు సంతోషిస్తారు ''

''అప్పుడప్పుడూ అమ్మానాన్నలకు ఎంపీత్రీ ప్లేయర్‌, కెమెరా, కంప్యూటర్‌... వంటి కానుకలు ఇవ్వండి. వాటి మీద ఆసక్తి లేకపోయినా, బిడ్డ ప్రేమగా ఇచ్చాడన్న మమకారంతో అయినా... ఉపయోగించడం నేర్చుకుంటారు. దీనివల్ల వారికో వ్యాపకం ఏర్పడుతుంది. మనసు పక్కదారి పట్టకుండా ఉంటుంది''

''పండగలకూ పబ్బాలకూ కలుసుకున్నప్పుడు మీ వ్యక్తిగత వృత్తి జీవితాల్లో సంతోషాన్నిచ్చే విషయాలు మాత్రమే చెప్పండి. కష్టాలూ సవాళ్లూ ఏకరవు పెట్టడం వల్ల... ఆ పెద్దల బుర్రలో మరిన్ని సమస్యలు జొప్పించినవారు అవుతారు''

''కన్నవారి జీవితంలో ఇది చాలా సంక్లిష్టమైన దశ. ఒకవైపు బిడ్డ దూరంగా వెళ్లిపోతున్నాడన్న బాధ వెంటాడుతూ ఉంటుంది. మరోవైపు ఆండ్రోపాజ్‌, మెనోపాజ్‌ చుట్టుముట్టే సమయమూ ఇదే. వీటన్నిటివల్ల మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. ఎప్పుడైనా, కోపంగానో చికాకుతోనో మాట్లాడితే భరించండి. పెద్దరికాన్ని గౌరవించండి''

''నాన్న పరిస్థితి వేరు. ఉద్యోగం, వ్యాపారం, స్నేహితులు... అతని ప్రపంచం అతనికుంటుంది. అమ్మకు మాత్రం ఇల్లే లోకం. పిల్లలే సర్వస్వం. ఆమెకు ఎంత ధైర్యాన్నిస్తే అంత మంచిది. సెల్‌ఫోన్‌ కబుర్లలో మెయిల్స్‌ విషయంలో అమ్మకే కాస్త ఎక్కువ సమయం కేటాయించండి''
.
పెద్దలూ జాగ్రత్త!
''పిల్లలు దూరమైపోగానే... ప్రపంచం చిన్నదైపోకూడదు. మరింత విస్తరించాలి. గతంలో పిల్లల పెంపకానికి కేటాయించిన సమయాన్ని సామాజిక జీవితానికి మళ్లించవచ్చు. అపార్ట్‌మెంట్‌ సంఘాల్లో స్వచ్ఛంద సంస్థల్లో చురుకైన పాత్ర పోషించవచ్చు. సోషల్‌ రా పరిచయాల్ని పెంచుకోవచ్చు''

''హాబీతో ఒంటరితనాన్ని వరంగా మార్చుకోవచ్చు. వెుక్కల పెంపకం, పుస్తక పఠనం, సంగీతం... అది ఏమైనా కావచ్చు. కొత్త ప్రదేశాల సందర్శనం జీవితానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఓపిక ఉంటే, పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేయవచ్చు. కొత్త పట్టాలకు ప్రయత్నించవచ్చు''

''గుండెల నిండా ప్రేమ ఉంది. ఆ ప్రేమను అందుకోవాల్సిన బిడ్డలు మాత్రం దూరంగా ఉన్నారనేగా మీ దిగులు. అనాథ శరణాలయాల్లోని పిల్లల్ని ప్రేమించండి. వారానికోరోజు వారితో గడపండి. నలుగురికీ చేతనైన సాయం చేయండి. ఇరుగుపొరుగువారికి తల్లో నాలుకలా మెలగండి''

''ఆలయ దర్శనం, ధ్యానం, ప్రార్థన, ప్రాణాయామం, పురాణపఠనం కొండంత వూరటనిస్తాయి. మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. భవబంధాల్ని గెలవడానికి ఆధ్యాత్మిక సాధన ఉపయోగపడుతుంది''

''పిల్లల మీద దిగులుపెట్టుకుని నాలుగు గోడలకే పరిమితం కావడం అంత మంచిది కాదు. నడక, వ్యాయామం జీవితంలో భాగం కావాలి. ఆరు నెలలకు ఓసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. నిరాశ, నిస్పృహ దీర్ఘకాలం కొనసాగితే... మానసిక నిపుణుడిని సంప్రదించడం మంచిది''

ఎందుకంత విషాదం...
ఎందుకంటే, కన్నవారి జీవితం అప్పటిదాకా... కూతురిచుట్టో కొడుకుచుట్టో ముడిపడి ఉంటుంది. ఇద్దరూ ఉంటే... రెండు కళ్లే! దినచర్య, జీవనశైలి, ఆలోచనలు, ఇష్టాయిష్టాలు, కలలు, లక్ష్యాలు... ప్రతీదీ పిల్లలతో ముడిపెట్టుకోవడం అలవాటై ఉంటుంది. ఇప్పుడు హఠాత్తుగా... కళ్లముందు పిల్లలు లేకపోయేసరికి పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. భోజనం సయించదు. నిద్రపట్టదు. ఎవరికోసం బతకాలన్న నిర్లిప్తత. గృహిణుల విషయంలో, ఒంటరి తల్లిదండ్రుల విషయంలో ఆ ప్రభావం మరీ ఎక్కువ.

''అమ్మానాన్నలూ ఒక్కసారి ఆలోచించండి! ఇలా బాధపడుతూ కూర్చుంటే ఏం లాభం? ఆరోగ్యం దెబ్బతింటుంది. హైపర్‌టెన్షన్‌ లాంటి సమస్యలు దాడిచేస్తాయి. అనేకానేక రోగాలకు అదే తొలి అడుగు. మనసు తీవ్రంగా గాయపడుతుంది. డిప్రెషన్‌ వంటి జాడ్యాలు రావచ్చు. ఆత్మహత్య ఆలోచనలూ కలగవచ్చు. మీరు ప్రేమించే బిడ్డ దూరమైపోయాడన్న బాధలో, మిమ్మల్ని ప్రేమించే జీవితభాగస్వామినీ ఇతర కుటుంబ సభ్యుల్నీ నిర్లక్ష్యం చేయడం భావ్యమా?

మీరిలా కుంగిపోతున్నారని తెలిస్తే... చదువుల కోసవో ఉద్యోగం కోసవో అంతదూరం వెళ్లిన బిడ్డ, ప్రశాంతంగా ఉండగలడా? అనుకున్న లక్ష్యాల్ని సాధించగలడా? అనుకోనిది జరిగితే, అతని కల భగ్నమైతే ఆ బాధ్యత మీదే.

పచ్చగా కాపురం చేసుకోవాల్సిన అమ్మాయి... తన కోసం నాన్న బెంగపెట్టుకున్నాడనో, అమ్మ అన్నం మానేసిందనో తెలిస్తే ఎంత ఇబ్బందిపడుతుంది? కళకళలాడుతూ తిరగాల్సిన ఇల్లాలు అన్యమనస్కంగా కనిపిస్తే భర్తేం అనుకోవాలి? అత్తమామలెలా అర్థంచేసుకోవాలి? ఆ కాపురంలో కలతలు రావా?''

నిజానికి, ఇలాంటి సందర్భాల్లో కన్నవారి బాధ్యత రెట్టింపు అవుతుంది. ముందుగా తాము, ఆ ఆలోచనల నుంచి బయటపడాలి. 'ఏం ఫర్వాలేదు. మేం సంతోషంగా ఉంటాం. మీరూ సంతోషంగా ఉండండి. మా గురించి ఎలాంటి దిగులూ వద్దు. నిశ్చింతగా వెళ్లిరండి' అని పిల్లలకు ధైర్యం చెప్పాలి. వాళ్లను చిరునవ్వుతో సాగనంపాలి. ఆమాత్రం భరోసా చాలు... పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. చొరవా ధైర్యం రెట్టింపు అవుతాయి.

తొలి నుంచే...
చదువుల కారణంగానో, ఉద్యోగాల పేరుతోనో పిల్లలు దూరంగా వెళ్లిపోడాన్ని, కన్నవారు తట్టుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు తీవ్రంగా స్పందిస్తున్నారు కూడా. మితిమీరిన మమకారమే ఈ సమస్యకు కారణం. గతంలో పరిస్థితులు వేరు. గంపెడు సంతానం. ఒకరి పెళ్లయిపోతే, మరొకరు సిద్ధంగా ఉండేవారు. లోటు తెలిసేది కాదు. ఒకరు పైచదువులకు వెళ్తే మరొకరు ఆ స్థానాన్ని భర్తీచేసేవారు. వెలితి అనిపించేది కాదు. ఇప్పుడలా కాదే. ఇద్దరు లేదా ఒకరు. మనసంతా వారిమీదే. ఆలోచనలన్నీ వారిచుట్టే. ఇరవై ఏళ్లు వచ్చేదాకా ఆ పిల్లలు ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా కన్నవారికి దూరంగా ఉన్న దాఖలాలుండవు. సెలవుల్లో ఏ తాతయ్య ఇంటికో వెళ్లడం... ఈతరానికి తెలియని అనుభవం. నీళ్లు పడవనో, సమ్మర్‌ క్లాసులు ఉంటాయనో... వేయి సాకులు చెప్పినా పిల్లల్ని వదిలి ఉండలేని బలహీనతే అసలు కారణం. చదువుల కోసవో ఉద్యోగాల కోసవో ఇల్లొదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్య ఓపట్టాన సర్దుకోలేరు.

కాకపోతే, లక్ష్యాలూ బాధ్యతలూ ఆ సమస్యను వీలైనంత తొందరగా అధిగమించే శక్తినిస్తాయి. కొత్త స్నేహాలు, కావలసినంత స్వేచ్ఛ... ఇంటి దిగులును మరిపిస్తాయి. ఇక్కడ... కన్నవారిని మాత్రం, పిల్లల ఆలోచనలే వెంటాడుతుంటాయి. అప్పటిదాకా కష్టమంటూ తెలియకుండా పెరిగిన బిడ్డలు, ప్రపంచాన్ని చూడని అమాయకులు, ఇటుపుల్ల అటుపెట్టని అతి సుకుమారులు, కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటేనే ముడుచుకుపోయే మృదుస్వభావులు... బయటికెళ్లి ఎలా బతుకుతారన్న భయం. లైంగిక వేధింపులు, హత్యలు, ఆత్మహత్యల గురించి మీడియా కథనాలొకటి. ఆలోచనలన్నీ బిడ్డచుట్టే. భయాలన్నీ బిడ్డ క్షేమం గురించే.

''బాబోపాపో పుట్టగానే... పెద్ద చదువుల కోసం, బంగారు భవిష్యత్‌ కోసం పొదుపు చేయడం వెుదలుపెడతారే! చక్కని 'చైల్డ్‌ ప్లాన్‌' గురించి పదిమందినీ వాకబు చేస్తారే! అమ్మాయి పెళ్లికి నగోనట్రో చేయించిపెడతారే. ఘనంగా పెళ్లిచేయడానికి ఎంతోకొంత వెనకేసుకుంటారే! ఆర్థిక విషయాల్లో ఉన్న ముందుచూపు... భావోద్వేగాల దగ్గరికి వచ్చేసరికి రవ్వంత కూడా కనిపించదెందుకు! 'ఏదో ఒక రోజు పెద్ద చదువులకో ఉద్యోగాలకో ఇల్లొదిలి వెళ్లాల్సినవారే' అన్న మానసిక సంసిద్ధత ఉంటే... రెక్కలొచ్చి ఎగిరిపోతున్న పిల్లల్ని చూసి ఎవరూ ఇంత విలవిల్లాడిపోరు.

'ఎమ్టీనెస్ట్‌ సిండ్రోమ్‌ ప్రభావాన్ని తప్పించుకోడానికి ముందస్తు ప్రణాళిక అవసరం. పిల్లలు ఎదుగుతున్న వయసులోనే ఆ ప్రయత్నం వెుదలుకావాలి. ఏడాదికి ఓ వారంరోజులు పిల్లల బాధ్యతల్ని ఆత్మీయులకు అప్పగించి తల్లిదండ్రులు ఏ విహార యాత్రలకో వెళ్లిరావచ్చు. వాళ్లు పెరిగి పెద్దయి... గడపదాటుతున్నప్పుడు బిక్కుబిక్కుమనకుండా ఈ అనుభవం పనికొస్తుంది. విజ్ఞానయాత్రలనో, వేసవి శిబిరాలనో... ఇంటికి దూరంగా ఉండటం పిల్లలకు అలవాటు చేయాలి. దీనివల్ల అమ్మానాన్నల మీద అతిగా ఆధారపడటం తగ్గిపోతుంది' అని సలహా ఇస్తారు సైకాలజిస్టు హర్ష. ఏ తల్లిదండ్రులైనా 'మా పిల్లలకు ఏమీ తెలియదు. అన్ని పనులూ మేమే చేసిపెట్టాలి...' అని చెప్పుకుంటే, అది గొప్ప కాదు. పెంపకంలో లోపం. పట్టు సడలిస్తే పిల్లలెక్కడ దారితప్పుతారో అన్న అపనమ్మకమూ కావచ్చు. ఆ పరాధీనత పిల్లల వ్యక్తిత్వవికాసాన్ని దెబ్బతీస్తుంది. ఓ వయసు వచ్చాక..కొన్ని విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛనివ్వాలి. మరికొన్ని విషయాల్లో మనం మార్గదర్శనం చేసి, వాళ్లే నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి.

కొత్తజీవితం...
అమ్మాయి పెళ్లిచేసుకుని అత్తారింటికి వెళ్లిపోతుంది. అబ్బాయి దూరదేశాలకు ప్రయాణమవుతాడు. ఓ పాతికేళ్లు ఆ దంపతులు పిల్లల కోసమే బతికారు. పిల్లల గురించే ఆలోచించారు. పిల్లల ఇష్టాలకే విలువనిచ్చారు. ఇన్నేళ్ల జీవితం పిల్లల చుట్టే తిరిగింది. తమ జీవితాన్ని తాము అనుభవించే అవకాశం వచ్చిందిప్పుడు. ఇలాంటి సందర్భాల్లో భర్త లేదా భార్య పాత్ర చాలా కీలకం. ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి. ఒకరి ఆవేదన ఒకరు అర్థంచేసుకోవాలి. జీవితభాగస్వామికి మరింత సమయం కేటాయించాల్సిన సమయం ఇది.

''పాతికేళ్లక్రితం పెళ్లయిన కొత్తలో ఏకాంతం కోసం ఎంత తహతహలాడారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ అవకాశం ఇప్పుడు కోరకుండానే దక్కింది. మనసారా మాట్లాడుకోండి. తీపి జ్ఞాపకాలు నెమరేసుకోండి. పాత ఆల్బమ్‌లు ముందేసుకోండి. చిన్ననాటి స్నేహితులకు ఫోన్లు చేయండి. పాత నేస్తాల్ని పలకరించండి. చూడాలనుకున్న ప్రదేశాలు చూసి రండి. వాతావరణంలో మార్పు, మనసుకు తగిలిన గాయాలకు మలాములా పనిచేస్తుంది. అప్పట్లో ఇద్దరూ కలిసి చూసిన... తెలుగు, హిందీ క్లాసిక్స్‌ను మరొక్కసారి డీవీడీలో చూడండి. ఆలూమగలు దగ్గరైనకొద్దీ 'ఎమ్టీనెస్ట్‌ సిండ్రోమ్‌' దూరంగా పారిపోతుంది.

కాలం మారింది. టెక్నాలజీ మారింది. ఇంటర్నెట్‌ యుగంలో ఉన్నాం. చిన్న మీట చాలు. వందలమైళ్ల దూరంలో ఉన్న కొడుకుతో మాట్లాడవచ్చు. చిన్న పరికరం చాలు. సప్తసముద్రాలకు అవతల ఉన్న కూతుర్ని కళ్లారా చూసుకోవచ్చు. 'వర్చువల్‌' డ్రాయింగ్‌రూమ్‌ను సృష్టించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఆ పక్కన వాళ్లు..ఈ పక్కన మీరు... తింటూ మాట్లాడుకోవచ్చు. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్‌తో పరిచయం పెంచుకుంటే, సగం సమస్య పరిష్కారం అయిపోయినట్టే. మెయిల్స్‌ ఇవ్వడం చాలా తేలిక. వారంరోజులు చాలు... కీబోర్డు మీద పట్టు తెచ్చుకోవచ్చు. తగిన సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే, తెలుగులోనూ ఇ-మెయిల్స్‌ పంపుకోవచ్చు. టెలికాం సర్వీసు ప్రొవైడర్లు మీలాంటివారికోసమే 'సకుటుంబ' ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. పైసాఖర్చు లేకుండా ఆత్మీయుల నంబర్లుకు అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. పిల్లలు దూరదేశాల్లో ఉంటే, ఏడాదికోసారి మీరు వెళ్లవచ్చు. ఏడాదికోసారి వాళ్లను రమ్మని చెప్పవచ్చు. అలా వెుత్తం రెండుసార్లు కలుసుకునే అవకాశం ఉంటుంది. మరీ చూడాలనుకుంటే, విమానాలున్నాయి. దేశంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా కొన్ని గంటల్లో వెళ్లిరావచ్చు. విదేశీ ప్రయాణాలూ మునుపటికంటే తేలికైపోయాయి. టెక్నాలజీ దూరాల్ని ఎప్పుడో గెలిచేసింది. పొడులు, పచ్చళ్లు, వడియాలు, అప్పడాలు... అమ్మప్రేమ కమ్మదనాన్ని రోజూ పిల్లలకు గుర్తుచేస్తూనే ఉంటాయి. ఫొటో ఆల్బమ్‌లూ చిన్నప్పటి ఆటబొమ్మలు, ఆ అల్లరీ ఆ జోకులూ... బిడ్డల్ని కన్నవారి కళ్లముందు నిలుపుతూనే ఉంటాయి. ఎన్ని సముద్రాలు దాటైనా చదువుకోనివ్వండి. ఎన్ని ఖండాలు దాటైనా ఉద్యోగాలు చేసుకోనివ్వండి.

మనోవాంఛాఫల సిద్ధిరస్తు... అని మనసారా ఆశీర్వదించండి''.
* * *

రాముడిని యాగసంరక్షణకు పంపమని విశ్వామిత్రుడు కోరతాడు. పసివాడిని అంతంతదూరం పంపేదిలేదని మహర్షి ఆదేశాన్ని ధిక్కరిస్తాడు దశరథుడు. అంతలోనే ఆ కోపిష్టి విశ్వామిత్రుడు తన బిడ్డకు ఎక్కడ శాపం పెడతాడో అని భయం. కావాలంటే, సర్వసైన్యాన్నీ పంపి యాగసంరక్షణ చేస్తానని విన్నవించుకుంటాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. కాళ్లమీద పడతాడు. ఇవన్నీ 'ప్రీ-ఎమ్టీనెస్ట్‌ సిండ్రోమ్‌' లక్షణాలు. వశిష్టాది రుషులు ధైర్యం చెప్పాకే దశరథుడి మనసు కుదుటపడుతుంది. రామలక్ష్మణుల ప్రయాణానికి ఆవోదం తెలుపుతాడు.

దశరథుడు భయాల్ని గెలవకపోతే, భ్రమల్ని తొలగించుకోకపోతే రాముడు ఎన్నో అమూల్యమైన అవకాశాల్ని కోల్పోయేవాడు. అహల్యకు శాపవివోచనం కలిగించేవాడు కాదు. విశ్వామిత్రుడి నుంచి దివ్యాస్త్రాలు పొందగలిగేవాడు కాదు. భవిష్యత్‌లో అరణ్యవాసం చేయడానికి సరిపడా అనుభవమూ దక్కేదికాదు. అన్నిటికీ మించి, స్వయంవరానికి వెళ్లగలిగేవాడు కాదు. సీతమ్మను మనువాడేవాడు కాదు. సీతారాముడు అయ్యేవాడు కాదు. ఆదర్శపురుషుడిగా ప్రపంచానికి తెలిసేవాడే కాదు.

కన్నమమకారం... నిచ్చెనలా తోడ్పడాలి. ముళ్లకంచెలా అడ్డుపడకూడదు. ఈ సత్యం అర్థమైతే- గూడు ఖాళీ అయిందని కుమిలిపోతూ కూర్చోం. నిన్నవెున్న నడక నేర్చిన మన బిడ్డలు ఎంత అందంగా ఎంత పొందికగా మరెంత సమర్థంగా కొత్త గూడును కడుతున్నారో ఆశ్చర్యంగా ఆనందంగా ఒకింత గర్వంగా చూస్తూ ఉంటాం. అప్పుడిక, ఈ ఎమ్టీనెస్ట్‌ సిండ్రోమే కాదు మరే దిగులూ ఆందోళనా కూడా మన దరిదాపులకైనా రాలేవు

soruce : Eenadu sunday magazine(24/07/2011)


శ్రవణ కుమారా... మమ్మల్ని మన్నించు!
శ్రీకాకుళం : శ్రవణ కుమారుడు.. ఇతని తల్లిదండ్రులిద్దరూ అంధులు.. శ్రవణుడికి వూహ తెలిశాక అమ్మానాన్న కష్టాలను చూసి చలించిపోయాడు. కళ్లు లేవని.. పుణ్యక్షేత్రాలను చూసే భాగ్యం లేదని బాధ పడే తల్లిదండ్రుల కోరిక తీర్చటం కోసం కావడిలో ఇద్దరినీ కూర్చోబెట్టుకుని తీర్థయాత్రలకు బయల్దేరాడు. దురదృష్టవశాత్తు అడవిలో దశరథమహారాజు బాణం దెబ్బకు గురయ్యాడు. ప్రాణం పోతున్న సమయంలో కూడా ఆ మహారాజుతో తన తల్లిదండ్రుల గురించే చెబుతాడు. వారిని బాగా చూసుకోమని చెబుతూ ప్రాణాలు విడుస్తాడు....

ఇది పురాణగాథే కావచ్చు.. మన తల్లిదండ్రులపట్ల మనం ఎలా ప్రవర్తించాలో చెప్పిన కథ. మన బాధ్యతను గుర్తు చేసే కథ. మరి మనం ఏం చేస్తున్నాం? మనకు జన్మనిచ్చి.. నిలబడడానికి ఆసరా ఇచ్చి.. తలెత్తుకు తిరగడానికి మంచి జీవితాన్నిచ్చి.. ఓ స్థాయికి చేర్చిన అమ్మానాన్నలను మనం ఎలా చూస్తున్నాం..? ఆసరాగా ఉండాల్సిన సమయంలో అన్నం పెడుతున్నామా..? కాస్తంత ఆప్యాయతానురాగాలను చూపుతున్నామా..?

సృష్టిలో ప్రతి జీవికీ అమ్మే ఆది గురువు! విద్యాబుద్ధులు నేర్చేటప్పుడు, జీవిత పాఠశాలలో అడుగిడినప్పుడు అనుభవ సారాన్ని పాఠంగా బోధించే తొలి ఉపాధ్యాయుడు నాన్నే! తొలి నమస్సుల్ని అమ్మా నాన్నలకే సమర్పించాలని నేర్పే సంస్కృతి మనది. పురాణ పురుషులైన పరశురాముడు, శ్రీరాముడు మొదలు శ్రవణుడి వంటి ముని బాలకులు, ప్రవరుడు, పుండరీకుడు వంటి కావ్య నాయకులు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను దైవంగా భావించి సేవించినవారే. తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచర్య దీక్ష పాటిస్తానని 'భీష్మ' ప్రతిజ్ఞ చేసిన దేవవ్రతుడు, స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందాడు. సంస్కృతాంధ్రల్లో మహాకవి భారవి... తండ్రి తనను చిన్నచూపు చూస్తున్నాడన్న భావనతో విపరీతమైన ద్వేషం పెంచుకుని, ఒక దశలో తండ్రినే హతమార్చేందుకు సిద్ధమయ్యాడు. చివరి నిమిషంలో తండ్రి ఎందుకు తన పట్ల అలా ప్రవర్తిస్తున్నాడో తెలిసి, పశ్చాతాపంతో దహించుకుపోయాడు. అది మొదలు తల్లిదండ్రులే పరమ దైవంగా పూజించి, వారి సేవలో తరించాడు.

నవ భారత నిర్మాత జవహర్‌లాల్‌నెహ్రూ - తన ప్రియ పుత్రిక ఇందిరా(గాంధీ) ప్రియదర్శినిపై చూపిన అవ్యాజ ప్రేమానురాగాలు, జైలు నుంచి సైతం కూతురికి ప్రపంచ చరిత్ర మొత్తాన్ని లేఖల రూపంలో బోధించిన విధానం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. 'తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు - పుట్టనేమి వాడు గిట్టనేమి - పుట్టలోని చెదలు పుట్టవా.. గిట్టవా..' అంటూ అమ్మా నాన్నల్ని దయతో, ప్రేమతో ఆదరించలేని బిడ్డలు.. ఎవరికీ ప్రయోజనం లేకుండా పుట్టల్లో పుట్టి చనిపోయే చెద పురుగులతో సమానమని ఈసడించాడు మన వేమన.

బిడ్డల కోసం తపించి, పుణ్యక్షేత్రాలెన్నో తిరిగి, పూజలు, వ్రతాలు చేసే తల్లిదండ్రులు, ఆపై ఆ బిడ్డల ఆలనాపాలనా, అభివృద్ధి కోసం రెక్కలు ముక్కలు చేసుకొంటారు. పుస్తెలు తాకట్టుపెట్టి బిడ్డల ఫీజులు కట్టిన తల్లులు, రక్తాన్ని స్వేదంగా మార్చి వారిని పెద్దవారిగా చేసిన నాన్నలు ఎందరో! మరి ఆ పిల్లలే పెద్దవాళ్త్లె.. పెళ్లాం మోజులోనో, ఇంకే కారణంతోనో.. 'ఛీ ఈ ముసలి పీడ ఎప్పుడొదులుతుందో..?నని విసుక్కొంటూ, చివరకు ఇళ్ల నుంచి గెంటేసినా, 'పోన్లే బాబూ.. వాళ్లనేమీ అనకండి'.. అంటూ విశ్వమంత ప్రేమను పంచుతూనే ఉన్నారు! పంచుతూనే ఉంటారు!!

'పున్నామ నరకం నుంచి తప్పిస్తారో లేదో కానీ, బతికుండగానే అమ్మానాన్నలకు నరకం చూపకుండా వుంటే అంతే చాలు' అనే స్థాయిలో నేటి తరం ఉంది. అందుకే.. ఇకపై ఏ అమ్మా నాన్నా నిరాశ్రయులుగా, అనాథలుగా బతికే దుస్థితి కలగనీయమని నేటి 'తల్లిదండ్రుల దినం' సందర్భంగా ప్రతిన బూనుదాం రండి. రోజూ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టకపోయినా.. సకల సౌఖ్యాలు ఇవ్వలేకపోయినా.. ఫరవాలేదు. కొద్దిసేపు వాళ్ల దగ్గర కూర్చొని, అప్యాయంగా మాట్లాడేందుకైనా వీలవదా? 'నేటి తాత స్థితే.. రేపటి కొడుకు గతి' అన్న సత్యాన్ని గుర్తెరిగి, పెద్దల్ని ప్రేమగా గౌరవించేలా
యువతను చైతన్యపరుద్దాం.. కదలండి..!

అమ్మా.. నాన్నకు చేద్దాం..ప్రేమాభిషేకం
న్యూస్‌టుడే - పాతశ్రీకాకుళం, కలెక్టరేట్‌ : 'కేవలం మూడు, నాలుగు లక్షల రూపాయలు పెట్టి కొనుకున్న కారుపైన చిన్న మరక పడితే అల్లాల్లాడిపోయే వ్యక్తులు... తమను మూడు దశాబ్దాలు పాటు వ్యయప్రయాసలు కోర్చి పెంచి ఓ స్థాయికి చేర్చి.. మంచి జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులను మాత్రం నిర్లక్ష్యం చేస్తుండటం దురదృష్టకరం'.

- వైష్ణవి ఇంజినీరింగు కళాశాల విద్యార్థిని సంతోషి చెప్పిన మాట ఇది. ప్రస్తుత సమాజ ధోరణిని చక్కటి ఉదాహరణతో చెప్పినా... ఆ మాట అక్షర సత్యమన్నది అందరికీ ఎరుకే. పిల్లలు ఓ స్థాయికి వచ్చిన తరువాత తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఎంత చెప్పుకున్నా తక్కువే.

వృత్తిపరంగా కావచ్చు... సామాజికంగా కావచ్చు.. ఆర్థికంగా కావచ్చు.. మనం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాం.. ఎన్నో సందర్భాల్లో.. ఇంకెన్నో విషయాల్లో రాజీ పడుతున్నాం.. ఒక్క విషయంలో తప్ప..!!

వృద్ధాప్యంలో ఓ తోడో కోసం... ఓ తీయనైన మాట కోసం.. అల్లాడిపోతున్న తల్లిదండ్రుల విషయంలో మాత్రం సహనం చూపటం లేదు.. రాజీ పడడం లేదు. భార్య చెప్పిందనో... ఆమె బాధపడుతుందనో... తన తల్లిదండ్రులు తన వద్ద ఉంటే స్థాయి తగ్గిపోతుందనో.. ఇంకా ఏదో.. కారణం చూపుతున్నాం.. మనసు ఉన్నా.. దాని చంపుకుంటున్నాం.. దయనీయ స్థితిలో ఉన్న అమ్మానాన్నలపై దయ చూపలేకపోతున్నాం.. కుమారులు.. కోడళ్లు.. కూతర్లు.. మనుమలు... ఇలా అందరి ఆప్యాయతలకూ దూరం చేస్తున్నాం.. నా అనుకున్నవారి మధ్య ఆనందంగా గడపాల్సిన వారిని నా అనేవారికి దూరంగా గడిపే పరిస్థితి తీసుకొస్తున్నాం..

మరి ఈ దుస్థితికి మూలాలు ఎక్కడ? ఎవరిది తప్పు?? సామాజిక పరిస్థితుల ప్రభావం ఎంత??? ఈ దుర్భత స్థితి నుంచి అమ్మా నాన్నలను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఎవరి బాధ్యత ఎంత?

తల్లిదండ్రుల సందర్భంగా 'ఈనాడు' శ్రీకాకుళం పట్టణంలోని ప్రశాంతి వృద్ధ జనాశ్రమం ఆవరణలో ఓ చర్చా వేదికను నిర్వహించింది. నాటి తరంతో... నేటి తరం భేటీని నిర్వహించింది. నాటి తరం ఆవేదనకు... నేటి తరం ప్రతిస్పందనను రాబట్టింది. ఈ చర్చలో వృద్ధాశ్రమానికి చెందిన ఆశ్రితులు, నిర్వాహకులతో పాటు వైష్ణవి ఇంజినీరింగు కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. వృద్ధుల అంతరంగం విన్న ఆ విద్యార్థులు చలించిపోయారు. ఇంత అన్యాయంగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నవారున్నారా..? అంటూ మనోవేదన చెందారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా తల్లిదండ్రులను దూరం చేసుకోమని ప్రతిన బూనారు. ఆ చర్చ సారాంశమేమిటో వారి మాటల్లోనే మీరూ చదవండి...

తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి

సినిమాలు, ప్రేమ పేరుతో పిల్లలు పాడవుతున్నారు. పెద్దలంటే పూర్తిగా గౌరవం లేకుండాపోయింది. ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులంటే భయం, గౌరవం ఉండేవి. ప్రస్తుతం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. పిల్లల ఉన్నతికి తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలను భరిస్తుంటారు. అటువంటిది పెద్దయిన తర్వాత పిల్లలు వారి మాట వినరు. విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సి ఉంది.

విశ్రాంత ప్రధానాచార్యులు రోణంకి ఆనందరావు
* సహజంగా పిల్లల వయసు పెరిగిన కొద్దీ తల్లిదండ్రులకు పెంపకంపై శ్రద్ధ తగ్గుతుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఎవరి కర్తవ్యాన్ని వారు చూసుకుంటుండాలి. విద్యతోనే నైతిక విలువలు కూడా అలవడతాయి. అందుకే తల్లిదండ్రులు కూడా ఎదుగుతున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చదువుతున్న అన్ని దశల్లోనూ వారిపై పూర్తి పర్యవేక్షణ ఉండాలి.

- వృద్ధజనాశ్రమం అధ్యక్షుడు ఎ.శంకరనారాయణ
* తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తారో అర్థం చేసుకోవాలి. ఇంట్లో పెద్దలుంటే సంప్రదాయాలు, క్రమశిక్షణ అలవడతాయి. ప్రస్తుతం పెద్దలను వద్దనుకునే స్థితికి వస్తున్నారు. పెద్దలను గౌరవిస్తూ వారితోనే ఉండాలి. ఆలోచనలో మార్పులు రావాలి. పెద్దల సమక్షంలో పెరగకపోవడం వల్ల పిల్లలకు, పెద్దలకు మధ్య అంతరం పెరుగుతోంది.

- వృద్ధ జనాశ్రమ ఆశ్రితురాలు సుందరీభాయి
* ప్రస్తుతం అంతా యంత్రాలతోనే పనిచేస్తున్నారు. దీంతో పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య దూరం పెరుగుతోంది. ఇంట్లో ఇద్దరూ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుండడంతో పిల్లలను కూడా పట్టించుకోవడం లేదు. అదే సమయంలో పిల్లలను తాత, మామ్మల వద్ద ఉంచేందుకు ఇష్టపడడంలేదు. ఈ విధానాలను తల్లిదండ్రులు మార్చుకుంటే కుటుంబ వ్యవస్థ కూడా ఆనందోత్సాహాలతో ఉంటుంది.

- వృద్ధ జనాశ్రమ ఆశ్రితుడు శంకరరావు
పెద్దవారిని బాధపెట్టవద్దు
వృద్ధ జనాశ్రమం లేకపోతే నా జీవితం పోయేది. అమ్మమ్మలు, తాతలు, నాన్నమ్మలను బాధ పెట్టవద్దు. పెద్దవారి నుంచి చాలా నేర్చుకోవాలి. అందుకే వారిని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రమశిక్షణతో ముందుకు నడవాలంటే, తల్లిదండ్రుల సూచనలు పాటించాలి. వారిని గౌరవించాలి. ప్రస్తుత సమాజంలో ఇవన్ని కొరవడ్డాయి.

- ఆశ్రితుడు జగన్నాథరావు.
*పిల్లలు, పెద్దలు కలిసి ఉంటే వారి ఆలోచనల మధ్య దూరం తగ్గుతుంది. దీంట్లో సంఘానికి కూడా బాధ్యత ఉంది. తల్లిదండ్రులు పిల్లలకు పొరపాటున కూడా తప్పు చెప్పరు. పెద్దలు ఏమి సూచనలు చేసినా బాధ్యతగా తీసుకుంటే మంచి భవిష్యత్‌ ఉంటుంది. క్రమశిక్షణగల వ్యక్తిగా ఆ పిల్లలు ఎదుగుతారు.

- ఆశ్రమ నిర్వాహకులు, విశ్రాంత ఎంపిడిఓ పి.దుర్గాప్రసాద్‌లాల్‌
నాడు భయం... నేడు వదిలేశారు
మాకు నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఒకప్పుడు నేనంటే అందరికీ విపరీతమైన భయం. అటువంటిది నా దగ్గర ఆస్తి లేదని బయటకు పంపేశారు. రెండో అబ్బాయి అప్పుడప్పుడు వస్తుంటాడు. మిగిలిన వారు అసలు పట్టించుకోరు.

- కన్నీళ్లపర్యంతమైన బి.ఆదినారాయణ
* నాకు ముగ్గురు అబ్బాయిలు. ఒక అమ్మాయి. అబ్బాయిలు వ్యాపారం చేస్తుంటారు. చిన్న కుమారుడికి పెళ్లయిన తరువాత నన్ను ఇంటి నుంచి పంపించేశారు. ప్రస్తుతం ఎవ్వరూ చూడడం లేదు. కనీసం మనుమలు కూడా దూరం నుంచి చూసి వెళ్లిపోతుండడం బాధగా ఉంది...

- ఇదీ రమణమూర్తి ఆవేదన
పాఠశాల విద్యలో మార్పు రావాలి
ప్రస్తుత విద్యావ్యవస్థలో విలువల బోధన లేదు. ఉరుకుల పరుగులతో ర్యాంకుల కోసమే చదువు సాగుతోంది. పాఠశాల విద్యలో మార్పు రావాలి. ఆనాడు చిన్నప్పుడే విద్యలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవని విలువలతో కూడిన విద్య నేర్పేవారు. ప్రస్తుత పాఠ్యాంశాల్లో ఇవి ఎక్కడ? పాశ్చ్యాత్య సంస్కృతిపై మోజు పెంచుకుంటున్నారు. ఈ విధానం వల్ల పెద్దలంటే గౌరవ మర్యాదలు లేకుండాపోతున్నాయి.

- వైష్ణవి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థి శరత్‌చంద్రప్రసాద్‌
* ప్రతిఒక్కరూ తమలోని అహంకారాన్ని పక్కన పెట్టాలి. చిన్న చిన్న మనస్పర్థలు వస్తుంటాయి. తప్పెవరిదైనా పిల్లలు అర్థం చేసుకోవాలి. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. టెలివిజన్లలోని సీరియళ్ల ప్రభావం ఎక్కువగా ఉంది. సీరియల్‌లోని పగ, ప్రతీకారాలు నిజజీవితంలో కూడా జరుగుతాయని భావిస్తుంటారు. వాస్తవ పరిస్థితులు అలా ఉండవని పెద్దలు, పిల్లలు అర్థం చేసుకోవాలి



  • ====================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Wednesday, July 21, 2010

బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం , Banks Nationalization Day





గతంలో ఉన్నత వర్గాలు, పారిశ్రామికవేత్తలకే పరిమితమైన బ్యాంకింగ్‌ సేవలను దేశంలోని రైతులు, వ్యవసాయదారులు, గ్రామీణ ప్రజానీకానికి, పేద-మధ్య తరగతి వర్గాలకు వడ్డీ వ్యాపారస్తుల నుండి విముక్తి కల్పించి సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సదాశయంతో మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరాగాంధీ 1969 జూలై 19న బ్యాంకుల జాతీయకరణను చేశారు .

జాతీయకరణ తర్వాత కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బ్యాంకింగ్‌ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే కాక దాదాపు అన్ని జాతీయ బ్యాంకులు వాటికి అనుబంధంగా గ్రామీణ బ్యాంకులను నెలకొల్పి మారుమూల ప్రాంతాలలోని గ్రామీణులు, రైతులు, వ్యవసాయదారులకు సేవలను అందిస్తున్నాయి .

అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం మేరకు పేద, మధ్య తరగతి కుటుంబీకుల పిల్లలకు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేలా జాతీయ బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తూ అనేక వేలమంది విదేశాల్లో చదువుకునేందుకు సహాయపడుతున్నాయి .
జీతము కావాలన్నా , పించన్లు తీసుకోవాలనా , బిల్లులు చిడుదల కావాలనా , ప్రభుత్వానికి వివిధ పనుల నిమిత్తము డబ్బులు చెల్లించాలనా ... అన్నీ బ్యాంకుల ద్వారానే జరుగుతున్నాయి . ప్రస్తుతము బ్యాంకులకు జనజీవనానికి మధ్య అనుబంధం పెరిగిపోయింది . ఒకప్పుడు గ్రామాలకు బ్యాంకులకు సంబంధము ఉండేదికాదు ... ఇప్పుడు బ్యాంకులు పల్లెబాట పడుతున్నాయి . ఒకప్పుడు గ్రామీన ప్రాంతాల్లొ ప్రైవేటు వడ్డీవ్యాపా్రుల తాకిడి ఉండేది . బ్యాంకు సేవలు కూడా పట్టాణ ప్రాంతాలకు మాత్రమే ఉండేవి . బ్యాంకుల జాతీయకరణము చేసి 40 యేళ్ళు పూర్తి అయినది .
బ్యాంకులు అందిస్తున్న సేవలు :
రైతులకు 7 శాతము వడ్డీ పౌ పంట రుణాలు అందజేస్తున్నాయి .
ట్రాక్టర్లకు , తొటల పెంపకము , మోటార్లు , ఎడ్ల బండ్ల కొనుగోలుకు , తక్కువ వడ్డీకే రుణాలు ,
డెయిరీ , కోళ్ళు ,మేకలు , గొర్రెల పెంపకానికి రుణాలు ,
మహిళా సంఘాలకు రూ. 5 లక్షలు వరకు పావలా వడ్డీపై రుణాలు ,ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు బ్రిడ్జి రుణాలు .
చిన్న త్రహా ,కుల , చేతి వృత్తిదారులతో పాటు .. ఆటోలు , మినీ బస్ లు , యంత్రాల కొనుగోలుకు రుణాలు ,
చిన్న పరిశ్రమల స్థాపనకు రూ.10 లక్షల వరకూ రుణాలు ,
ఇళ్ళ నిర్మాణానికి 9.25 శాతము వడ్డీ కే రుణాలు ,
N.S.S , KVP, బాండ్ల పై రుణాలు ,
విద్యార్ధుల చదువులకు రూ.4 లక్షల వరకు రుణాలు .
ఎస్టీ , ఎస్సీ , బిసీ .. విద్యా్ర్ధులకు , రైతులకు అయా శాఖలు ఇచ్చిన రాయితీల తో కూడిన రుణాలు ,

బ్యాంకు సేవలలో విప్లవాత్మక మార్పులు వచ్చినవి . పూరవము సొంత ఖాతా నుండి డబ్బులు తీయాలంటే ... నిర్ణీత సమయాల్లో బారులు తీరి వేచివుండే పరిస్తితి ఉండేది . ఎ.టి.యం. లు వచ్చి చిటికెలో ఆ పని జరిగిపోతుంది . ఇతర ప్రాంతాలకు దబ్బులు పంపించేందుకు ఆన్ లైన్ సేవలు వచ్చినవి . క్రెడిట్ కార్డ్లు వచ్చినవి . అంతేకాకుండా మనీ ట్రాంస్ఫర్ , వెస్ట్రన్ మనీ ట్రాన్ఫర్ , లాకర్లు , టెరమ్ డిపోజిట్లు వంటి సేవలు అందుబాటులోనికి వచ్చాయి .
  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhFiWbXsMam6xxPD_6yTTmeVYitWobZrEKh1glQZyEeYCzlsZWyp33zUk2HVYUNVSg298j_ReJjX-XtQqoDY3JuFwogkjNS236VBgBL7AqG1LmjSK1QiyLTzBZ8LvHoWnsa9MuchHd_KkrM/s1600/ATM.jpg
శ్రీకాకుళం లో బ్యాంకు సేవలు :

శ్రీకాకుళం జిల్లా లో ప్రస్తుతం వివధ రకాల బ్యాంకులు 188 వరకు ఉన్నాయి . ఇందులో
కమర్సియల్ బ్యాంకులు --------- 113,
గ్రామీణ బ్యాంకులు --------------62 ,
కోపరేటివ్ బ్యాంకులు ------------13 ,
ఇవి కాక ......
రైతు సేవా సహకార సంఘాలు ---2 ,
గిరిజన కార్పోరేషన్ రుణవిబాగము ,
కొన్ని ప్రవేటు బ్యాంకు ....................... ఉన్నాయి .

రిజర్వ్ బ్యాంకు కొత్త విధానము ప్రకారము జిల్లాలో ప్రతీ 2 వేల జనాభాకు బ్యాంకింగ్ సర్వీసులు సందించేందుకు ప్రణాళికలను సిద్ధము చేసినది . ఈ మేరకు 235 గ్రామాలలో బిజినెస్ కర్స్పాండెంట్లను ప్రారంభించనున్నారు .
ఆంద్రాబ్యాంక్ అద్వర్యములో --- 53 ,
గ్రామీణ వికాస బ్యాంక్ ---------118 ,
స్టేట్ బ్యాంక్ ----------------- 56 ,
ఇండియం ఓవర్ సీస్ బ్యాంక్ -- 2,
సిండికేట్ బ్యాంక్ ------------- 2 , ......... బిజినెస్ కరస్పాండెంట్లు ప్రారంభించనున్నాయి . కొత్త బ్రాంచీలు ఇంకా యేర్పాటు ప్రయత్నాలలో అన్ని బ్యాంకులు ఉన్నాయి .


  • =========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Tuesday, July 6, 2010

జూనోసిస్‌ డే , Zoonosis Day





పెంపుడు జంతువు కనబరిచే విశ్వాసం దాని పట్ల మనం ఏర్పర్చుకొనే ఆత్మీయత మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. మనిషి జంతువు మధ్య ఇలాంటి బంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. ఈ బంధం వెనుక ప్రాణాలను హరించే అంటురోగాల ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రేమను పెంచుకోవడం ఎంత అవసరమో అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా అంతే అవసరం. . . ఆప్యాయతలోనూ అప్రమత్తత! పెంపుడుజంతువుల పెంపకంలో జాగ్రత్తలు...... అవసరం .


జూనోసిస్‌ అంటే..
జూనోటిక్‌ అనే ఇటాలియన్‌ పదం నుంచి పుట్టిందే జూనోసిస్‌. 'జూ' అంటే జంతువులకు సంబంధించిన అంశం. మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్నే జూనోటిక్‌ వ్యాధులంటారు. ఇలాంటి వాటిని ఇప్పటి వరకు 253 వరకు గుర్తించారు.

వీటిలో 'ర్యాబిస్‌' (విచ్చికుక్క ప్యాధి) అనేది అత్యరత వ్రమాదకరమైనది , ప్రాణాంతకరమైన వ్యాధి. లూయిస్‌పాశ్చర్‌ అనే వ్రఖ్యాత శాస్త్రవేత్త విచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి జూలై ఆరు 1885 వ సంవత్సరంలో మొట్ట మొదటిసారిగా యాంటీర్యాబిస్‌ టీకాను వేసి సఫలీకృతులయ్యారు. ఆ రోజును అంటే జూలై ఆరో తేదీని ఆనాటి నుంచి వ్రతి సంవత్సరం 'వరల్డ్‌ జూనోసిస్‌ డే'గా నిర్వహిరచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జూనెటిక్‌ ప్యాధుల గురించి వ్రజలను అవ్రమత్తర చేసి, రోగాల బారిన వడకుండా చేయటమే వరల్డ్‌ జూనోసిస్‌ డే వ్రధానోద్దేశ్యము . జంతువులు, వక్షులకు సmబరధించిన కొన్ని ప్యాధులు మనుషులకు సరక్రమించి సాధారణ సమస్యలతోపాటు ప్రాణహాని కలిగేంతటి వ్రమాద పరిస్థితులెదురవుతున్నాయి. ఈ కారణరగా జరతువులు, కోళ్లు, వక్షులను పెంచేపారు, వ్రయోగశాలలు, వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో వనిచేసే్వారు, వశువుల ఆస్పత్రుల సిబ్బంది, చర్మము , తోళ్ల వరిశ్రమల కార్మికులు ఈ జూనోటిక్‌ ప్యాధుల వట్ల అవ్రమత్తరగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఆంత్రాక్స్‌:
జూనోటిక్‌ వ్యాధుల్లో ‌, ఆంత్రాక్స్‌ ప్రాణాంతకమైనవి. ఈవ్యాధి పచ్చగడ్డి ద్వారా పశువులకు సంక్రమిస్తుంది. గాలి ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది.

వ్యాధి నివారించాలంటే
* ఆంత్రాక్స్‌ వ్యాధి గుర్తించిన ఆరు కిలోమీటర్ల పరిధిలో ఐదేళ్లపాటు నిర్ణీతగడువులో వ్యాధినిరోధకటీకాలు చేయించాలి.
* మనుషుల్లో వ్యాధి సోకినట్లు అనిపిస్తే పరీక్షలు చేయించి అత్యవసర చికిత్స అందించాలి.

రాబిస్‌ :
మూగజీవాలద్వారా మనుషులకు సోకే ప్రాణాంతకమైన వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది రాబిస్‌. తోడేళ్లు, నక్కలు, ముంగిసల్లో ఈవ్యాధికారక క్రిములు ఎప్పుడూ ఉంటాయి.

జంతువుల నుంచి, పక్షుల నుంచి సోకే మరికొన్ని వ్యాధులు ->

పైరస్‌ ద్వారా ప్యాపించేవి:
  • ర్యాబిస్‌,
  • మెదడుపావు,
  • మ్యాడ్‌కౌ,
  • గాలికుంటు ప్యాధి.

బ్యాక్టీరియా వల్ల వ్యాపించేవి :
  • బ్రూసెల్లోసిస్‌,
  • క్షయ,
  • సాల్మొనెల్లోసిస్‌,
  • ఆంత్రాక్స్‌,
  • గ్లాండర్స్‌.

వరాన్నజీవుల వల్ల వచ్చేవి:
  • ఏంకైలో స్టోమియాసిస్‌,
  • హైడాటియోసిస్‌,
  • అలర్జీ,
  • ఎగ్జిమా (గజ్జి),
  • అమీబియాసిస్‌,
  • బాలంటీడియోసిస్‌,
  • టాక్సోప్లాస్మా.

ప్యాధులు రాకుండా...
  • వూర్తిగా ఉడికిన మారసాన్ని, గుడ్లను మాత్రమే తినాలి.
  • ప్యాధి సోకిన వశువుల పాలను తాగకూడదు. అనుమానర ఉన్నవ్పుడు పాలను బాగా మరిగిరచి తాగాలి.
  • వశువులు, జరతువులు, వక్షులు, కోళ్లకు కాలానుగుణరగా ఇవ్వవలసిన ప్యాధి నిరోధక టీకాలను చేయిరచాలి.
  • వెంవుడు కుక్కలకు తవ్పక టీకాలు పేయించాలి.
  • వందులకు గ్రామ శిపార్లలో ఆవాసరం ఏర్పాటు చేయాలి.
  • పౌల్ట్రీఫారాలు, జంతు వ్రదర్శనశాలలు, సర్కస్‌ కరవెనీలు, డెయిరీ ఫారాల్లో వనిచేసే పారు, వశుపోషకులు, జంతు వ్రేమికులు వ్యక్తిగత వరిశుభ్రతవై మరిరత శ్రద్ధ చూపాలి. మాస్క్‌ ధరించటం శ్రేయస్కరం.
  • మృత జంతు కళేబరాలను లోతైన గోతిలో సున్నం చల్లి వూడ్చివెట్టాలి.
  • జంతు ఆవాసాలను అవ్పుడవ్పుడు క్రిమిసంహారాలతో శుభ్రము చేయాలి

పాటించాల్సిన జాగ్రత్తలివీ..
  • వీధి కుక్కల నిర్మూలన,
  • ఊరికి దూరంగా 3, 4 కిలోమీటర్ల దూరంలో పరిశుభ్రమైన వాతావరణంలో పందులు పెంచాలి.
  • పశుపెంపకం దారులు పాలఉత్పత్తిలో పరిశుభ్రత పాటించాలి.
  • పెంపుడు కుక్కలకు తప్పక రాబిస్‌ నిరోధక టీకాలు వేయించాలి.
  • చిన్నపిల్లలు కుక్కలతో ఆడేటపుడు నోట్లో చేతులు పెట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.

  • ==================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Thursday, July 1, 2010

Post card Day , పోస్టుకార్డు దినోత్సవం




తోకలేని పిట్టకు 131 ఏళ్ళు .
గతం లో సమాచార మార్పిడికి , క్షేమ సమాచారము తెలుసుకునేందుకు పోస్టు కార్డే(ఉత్తరము) ప్రధాన ఆధారము . పేదల నుండి ధనికుల వరకు ఎక్కువగా దీనిపైనే ఆధారపడేవారు . కాలగమనం లో వచ్చిన మార్పులు దీనిపై మెనుపర్భావము చూపాయి . ప్రస్తుతము పొస్టుకార్దు మనుగడకోసం పొరాడుతోంది . సెల్ ఫోన్లు , కంప్యూతర్లు , ఇతర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చాక దీని అవసరము తగ్గిపోయినది . ఇ-మెయిల్స్ చాలావరకు ప్రస్తుతం పోస్టుకార్దు పాత్రను పోసిస్తున్నాయి . కొన్ని ప్రదే్శములలో మాత్రం ఇప్పటికీ పోస్టుకార్డునే వినియోగిస్తున్నారు .

సుమారు పదిహేనేళ్ళ కిందట వరకు పొస్టుకార్డుకు జనజీవనము తో విడదీయలేని సంభందము ఉండేది . పొట్టకూటికి వలస వెళ్ళిన కొడుకు క్షేమ సమాచారము కోసం తల్లి , భర్త కోసము భార్య , కుటుంబసబ్యులు అక్కడనుండి ఉత్తరం ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూసేవారు . బంధువుల మధ్య క్షేమసమాచారము ఉత్తరం ద్వారానే తెలుపునేవారు . పర్స్తుతం ఆ పరిస్థితి కనుమరుగైనది . కొన్ని వ్యాపార సంస్థలు మాత్రము వ్యాపార లావదేవీలు , బకాయిల చెల్లింపుల సమాచారము తెలుపుకుంటున్నారు .
ఉత్తరం పుట్టుక ఇలా ....
అమెరికా సమ్యుక్త రాస్ట్రాలలో 1861 లో తొలిసారిగా పోస్టుకార్డును ప్రవేశపెట్టేరు . తరువాత మిగిలిన దేసాల్లో వాడుకలోనికి వచ్చినది . మన దేశములో 1879 జూలై ఒకటిన (01/07/1879) ప్రవేశపెట్టి వినియోగం లోనికి వచ్చినది .
ధరలు ఇలా ....
ప్రస్తుతం పొస్టుకార్డు ధర 50 పైసలు . ప్రభుత్వ , వ్యాపార సంస్థల ప్రకటనలతో ఉన్న మేఘదూత్ కార్డు వెల 25 పైసలు . ఆయా సంస్థలు తపాల శాఖకు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తే చిరునామా ప్రక్కన ప్రకటనలు ముద్రించి వినియోగధారులకు 25 పైసలకే అమ్ముతారు . స్వాతంత్ర్యం రాకముందు మనదేశము లో కాని , అర్ధ అణా , అణా , మూడు పైసలు , ఐదు పైసలు , పది పైసలు , 15 పైసలు , 25 పైసలు ధరలు ఉండేవి . వివిద చానళ్ళు నిర్వహించే పలు పోటీలకు సంబంధించిన సమాచారము పంపించేందుకు ఉపయోగించే పోస్టుకార్దు ధర మాత్రము 10 రూపాయిలు ఉన్నది . తొలుత ఈ కార్డు 2 రూపాయిలు ఉండేది . ఎస్.ఎం.ఎస్ లు రావదం తో ఈ కార్డులు మూలన పడ్డాయి .

కార్డు తయారీకి ప్రభుత్వానికి రూ.1.33 ఖర్చు అవుతుంది . ప్రజా సంక్షేమముకోసం ఈ ధరను తగ్గించి నస్టాలను భరించి అమ్ముతుంది .
శ్రీకాకుళం లో శ్రీకాకుళం తపలా దివిజన్ పరిధిలో
2008 - 2009 ఆర్ధిక సం . లో 79,600 కార్డులు అమ్మినారు .
2007 - 2008 ఆర్ధిక సం . లో 1,54,300 కార్డులు అమ్మినారు .

  • =============================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS