ప్రేమ , ద్వేషము , ఆవేశము , ఆలోచన , పట్టుదల్ , నిర్లిప్తత , అనురాగము , అసూయ , సృజనాత్మకత , స్తబ్దత ... ఇలాఎన్నో వైరుద్యాల కలబోత తీనేజ్ . చందమామతో ఆడుకోవాలని , అరుదైన సాహసము చేసి ప్రపంచాన్నంతా ఔరా అనిపించాలనుకుంటూ పొంగిఒరిలే ఉత్సాయము ఒక ప్రక్క , చిమ్మ చీకట్లో తలదాచుకొని వెక్కివెక్కి ఏడవాలనే నైరాశ్యము మరో వైపు కనిపిస్తుంది . చదువులో ఇంటర్మీడియట్ ఎటు వంటిదో ... వయసు లో ఈ టీనేజ్ అటువంటిది . ఏదైనా చేసేయగలమనుకుంటూ సాధ్యాసాధ్యాలను సరిగ్గా అంచనా వేసుకోలేక , తల్లిదండ్రుల నుండి పూర్తి స్వేచ్చ కోరుకుంటూ .... కాదంటే కార్చిచ్చు సృస్టిసుంటూ ప్రవర్తిస్తుంటారు . ప్రపంచీకరణ నేపధ్యము లో ఏర్పడిన పోటీవాతావరణము , అందుబాటులోకి వచ్చిన సాంకేతిక సౌకర్యాలు ... ఎంత మేలుచేస్తున్నాయో అంతే కీడు సృస్టిస్తున్నాయి . భవిష్యత్తుకు ఓ కీలక మజిలీగా నిలుస్తున్న ఈ " టీనేజ్ " లో కుటుంబమంతా అప్రమత్త్తము గా ఉంటే పిల్లలు ఉత్తమం గా ఎదిగేందుకు అవకాశము ఉంటుంది .
యవ్వనము :
పిల్లలకు 13 ఏళ్ళు దాటితే వారు యవ్వనము ( టీనేజ్) లోమి ప్రవేశించినట్లే . అప్పటి నుంచి 20 ఏళ్ళు వచ్చేవరకు యవ్వనదశ అంటారు . ఇది చాలా కీలకము . అటు కుటుంబ సభ్యులకు , వ్యక్తిగతం గా ఇటు పిల్లలకు ఇది చాలా కీలకమైన సమయము . పేరెంట్స్ ఈ దశ పిల్లలను అన్ని కోణాలనుండి కనిపెట్టే విధంగా ఉండాలి ... అలా అని బంధించకుండా ఒక దిక్సూచిలా ఉండాలి . ఈ కాలము లోనె వారు పదోతరగతి , ఇంటర్ పూర్తి చేసి మెడిసన్ , ఇంజనీరింగ్ , కంప్యూటర్ , దిగ్రీ వంటి తరగతులలోమి వెళుతుంటారు . అందువల్ల వారు తీసుకున్న నిర్ణయాలకు తోడు తల్లిదండ్రుల ప్రణాళిక ఒకే విధంగా ఉంటే యవ్వనము హాయిగా గడిచిపోయినట్లే . ఈ సమయము (వయసు) లో అబ్బయిలు , అమ్మాయిలు అనేక లక్షణాలు కనబరుస్తారు .
- స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి .
- పోటీతత్వము ఎక్కువగా ఉంటుంది .
- అనుకరణకు ఇస్టపడతారు ,
- తోటివారితో తిరగడం , గడపడానికి ఇస్టపడతారు ,
- పెద్దలు చెప్పిన మాటలకన్న తోటివారి సలహాలను అధికం గా గౌరవిస్తారు .
- సమాజము లో వారికి గుర్తింపు రావాలని కోరుకుంటారు ,
- వారి మాటే నెగ్గాలనే పట్టుదల అధికంగా ఉంటుంది ,
- ఆత్మాభిమానము ఎక్కువగా ఉంటుంది ,
- విజయము తప్ప ఓటమి ని భరించలేరు .
- పట్టుదలతో సహా ఆత్మనూన్యతాభావము కూడా ఎక్కువగానే ఉంటుంది .
- విమర్శలు చేయడం తప్ప వాటిని తట్టుకోలేరు .
- ఆడంబరాలకు , కొత్తదనానికి , ఫ్యాషన్‌లకు ప్రాధావ్యత ఇస్తారు .
- అవమానము భరించలేరు ... అధికారము సహించలేరు .
తల్లిదండ్రుల పాత్ర :
యవ్వనము లో ఉన్న పిల్లల పెంపకములో తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది . ఈ సమయము లో పేరెంట్స్ తీసుకోవలసిన జాగ్రత్తలు :
- తల్లిదండ్రులు పిల్లల్కు స్వేచ్చనివ్వడం తో పాటు వారి ప్రవర్తనను పరిశీలిస్తుండాలి ,
- తప్పు జరిగి నపుడు దండించకుండా సంయమనము పాటించాలి ,
- ప్రతీ విషయాన్ని విమర్శించడం , తీవ్రంగా పరిగణించడం చేయకూడదు ,
- మంలింపు స్థానములో సలహాలు చెప్పి సర్ధి చెప్పడం జరగాలి ,
- అనవసర దర్పాలకు , గౌరవాలకు పోయి వారిని బలవంతంగా శాసించరారు ,
- వారి మాటలకు , భావాలను ఆదరిస్తూనే ఎప్పటికప్పుడు మానసిక పరివర్తనకు ప్రయత్నించాలి .
- ఓటమిని , విజయాన్ని ఒకే విధం గా చూడాలి ... దాని ప్రభావము పిల్లల ఎదుగుదల కు ఎంతో ఉపకరిస్తుంది .
- వారి ఎదుట అసభ్యకరం గా ప్రవర్తించకూడదు .
- తల్లి దండ్రులు , ఉపాధ్యాయులు తమకు దిక్సూచి వంటివారని పిల్లలు గ్రహించాలి ,
- తల్లిదండ్రులు మా కోసమే చెబుతున్నారని ... ఆ క్షణము లో ఆలోచిస్తే ఎన్నో సమస్యలకు పరిస్కారము దొరుకుతుంది .
- క్షణికావేషము లో నిర్ణయాలు తీసుకోకూడదు .
- ప్ర్రాణము ఎంతో విలువైనది ... ఆత్మహత్యా ప్రయత్నాలు చేయకూడదు .
- ప్రేమ , దోమ అని తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలు వమ్ముచేయకూడదు .
- తల్లి దండ్రులు లతో స్నేహపూరితం గా ఉండాలి ... అన్ని విషయాలు కూలంకషం గా డిస్కస్ చేసి వారి అభిప్రాయాలనూ గౌగవించి అందరూ కలిసికట్టుగా ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలి .
- మన మన మంచి కోసమేనని భావించాలి .
- ===============================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .