గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (08 ఆగస్ట్ ) -AISF formation day, ఏఐఎస్‌ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము .
అఖిల భారత విద్యార్ధి సమాఖ్య -ఏఐఎస్‌ఎఫ్ -77వ ఆవిర్భావ దినోత్సవాన్ని12-08-2013 నాడు జరుపుకున్నారు. దేశ విముక్తికి జరుగుతున్న పోరాటంలో భాగంగా 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్‌ఎఫ్ ఆవిర్భవించింది . నాటి నుంచి నేటి వరకు విద్యార్థి సంఘాలు అనేకం ఆవిర్భవించడం జరిగింది కాని
దీనిలా దే్శమంతటా విస్తరించలేకపోయాయి. . శాంతి, అభ్యుదయం శా స్త్రీయ విధానాలతో దేశవ్యాప్తంగా విద్యార్థులకు చైతన్య పరుస్తూ ఏఐఎస్‌ఎఫ్ పోరాటం చేస్తున్నదీ విద్యార్ధి సంఘం ..ఎన్నో పోరాటాల్లో ఎంతో మంది ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థులు పాల్గొని ప్రాణత్యాగం చేశాసారు.
భారత విద్యార్ధి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) స్వాతంత్య్ర ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించి, స్వాత్య్రాన్ని సాధించుకోవడం జరిగిందని, ప్రస్తుత తెలంగాణా ఉద్యమంలో కూడా ఏఐఎస్‌ఎఫ్ తెలంగాణా ఉద్యమంలో అగ్రభాగంలో నిలిచి తెలంగాణా రాష్ట్రం కొరకు ఏఐఎస్‌ఎఫ్ శక్తివంచన లేకుండా కృషి చేయాలని విద్యార్థిలోకానికి పిలుపునిచ్చింది..
ఏఐఎస్‌ఎఫ్ 1936 ఆగష్టు 12న లక్నో నగరంలోని బెనారస్ యూనివర్సీటిలో ఆవిర్భవించి 76 వసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక సంఘం . విద్యార్థుల సమస్యల కోసం ఏఐఎస్‌ఎఫ్ ముందుండి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలు, ఫీజు రియంబర్స్‌మెంట్స్, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ సమస్యలను పరిష్కరించడంలో . సంఘం పేద, బడుగు, మధ్యతరగతి వర్గాలకు ఉచిత నిర్భంద విద్య అందించడములోనూ పోరాడుతోంది . దేశంలో 60లక్షల సభ్యత్వంతో దేశంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘం ఇది. కమ్యూనిస్టు పార్టీ స్టూడెంట్ వింగ్ గా ఆవిర్భవించి నేటికీ కమ్యూనిస్ట్ పార్టీ కి అనుబంధ సంస్థగానే ఉంటుంది.
శ్రీకాకుళం లో : అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్ ) ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగిరది. సోమపారర స్థానిక వ్రభుత్వ జూనియర్ ఏఐఎస్‌ఎఫ్ జెరడాను ఆవిష్కరిరచారు. ఈ సరదర్భరగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు
టి.సూర్యం మాట్లాడుతూ భారత విద్యార్థిలోకం లో స్ఫూర్తిని రగిలించి, చైతన్యాన్ని కలిగించి సంఘటితరగా ముందుకు నడిపే చోదక శక్తి ఏఐఎస్‌ఎఫ్ అని కొనియాడారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలవై భవిష్యత్తు పోరాటాలకు అంతా సిద్ధం కావాలని విలువునిచ్చారు.
courtesy with eenadu news paper 6:19 PM 13-Aug-13
- ===========================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .