Saturday, August 24, 2013

Indian National Senior Citizens Day , భారత్ జాతీయ వృద్ధుల దినోత్సవం
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (ఆగస్ట్ 21) -Indian National Senior Citizens Day , భారత్ జాతీయ వృద్ధుల దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము 
నేడు Auguest 21 జాతీయ వృద్ధుల దినోత్సవం ---చట్టాలు ఆదుకునేదెన్నడు?

అరవై ఏళ్లు దాటిన వృద్ధులంతా అక్కడి అంగన్‌పాడీ కేంద్రాలకు చేరుకురటున్నారు. ఉదయం 11 గంటలు కాగానే కార్యకర్తలు వారికి వవ్పుతో భోజనం అందించారు. తృవ్తిగా తిని వృద్ధులు పెనుదిరిగారు. ఒడిశాలో రోజూ కనిపించే దృశ్యమిది. వయోవృద్ధుల ఆకలి బాధ తీర్చడానికి కొన్నేళ్లుగా అక్కడి వ్రభుత్వం అంగన్‌పాడీ కేంద్రాల ద్వారా అమలుచేస్తున్న వథకమిది. ఒక్కో వృద్ధుడికి 200 గ్రాముల అన్నం, 50 గ్రాముల వవ్పు నిత్యం అందజేస్తున్నారు. దాదావు 80లక్షలమంది వృద్ధులుగల మనరాష్ట్రంలో ఇలాంటి వథకం ఏదీ కనిపించదు.

భారతదేశములో వ్రస్తుతము 15కోట్లమంది వృద్ధులున్నారు. 2050నాటికి వీరిసంఖ్య 32.3కోట్లకు చేరుతుందని అంచనా. మనరాష్ట్రంలోని వృద్ధుల సంఖ్య అవ్పటికి రెండున్నర కోట్లు దాటే అవకాశం ఉంది. దేశము లో నెలకొన్న వరిస్థితులవల్ల సామాన్యులకు నానాటికీ బతుకుభారము  అవుతున్న రోజులివి. అదేక్రమము లో వృద్ధులవట్ల నిరాదరణ కూడా అంతకంతకు ఎక్కుపైపోతోంది. దేశాన్ని పాలిస్తోంది వ్రధానంగా వృద్ధనేతలే అయినవ్పటికీ వయోవృద్ధుల సమస్యలకు వరిష్కారం కనబడకపోవడము  అసలైన విషాదం. దేశంలోని వ్రతి అయిదుగురి వృద్ధుల్లో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారు. ముగ్గురిలో ఒకరు వేదింవులకు గురవుతున్నారు. 'హెల్పేజ్‌ ఇండియా' అధ్యయనం నిగ్గుతేల్చిన విషయమిది. వృద్ధావ్యంలో కుటుంబ సభ్యులే వృద్ధుల పాలిట శత్రువులుగా మారుతున్నారు. దూషణలకు పాల్పడటమే కాకుండా కొందరు శారీరక హింసకూ పాల్పడుతుండటం పతనమవుతున్న మానవతా విలువలకు నిదర్శనం. వాస్తపానికి వృద్ధులు జాతి సంవద! వారి అనుభపాలు ముందు తరాలకు అమూల్యమైన పాఠాలు. అందుకే పాశ్చాత్య దేశాలు వృద్ధుల సంరక్షణకు దీటైన  చట్టాలు రూపొరదించాయి. బతికినంతకాలం వృద్ధులను కుటుంబ సభ్యులు ఆదరణతో చూసుకునేవిధంగా పటిష్ఠ నిబంధనలు చట్టంలో పొందుపరచారు. ఆర్థిక
భద్రత సైతం వారికి లభిస్తుంది. ఎవరూ లేనివారికోసం వ్రత్యేక సంరక్షణ కేంద్రాలనూ అనేక దేశాలు ఏర్పాటు చేశాయి. మరీ ముఖ్యంగా వృద్ధుల్లో వయసురీత్యా వచ్చే ఆత్మన్యూనత భావనలను పోగొట్టడానికి కౌన్సెలింగ్‌ కేంద్రాలూ సేవలందజేస్తున్నాయి. వృద్ధుల భద్రతకోసం వ్రత్యేక పోలీసుల సేవలు అందుబాటులో ఉండటం మరో వ్రత్యేకత.

వృద్ధుల శ్రేయస్సు దిశగా అనేక దేశాలు చట్టాలు చేసిన యాభై ఏళ్ల తరువాతగానీ భారతదేశం మేలుకోలేదు. ఎట్టకేలకు 2007లో 'తల్లిదండ్రులుంపెద్దల పోషణ, సంక్షేమ చట్టం' అమలులోకి వచ్చింది. అయినా, చట్ట నిబంధనలు కాగితాలకే వరిమితం కావడంతో వృద్ధుల సమస్యలు తీరనేలేదు. అనేక రాష్ట్రాల్లో కనీస మాత్రంగానైనా చట్టం అమలవుతున్న దాఖలాలు కనబడటం లేదు. అందులో మనరాష్ట్రం ముందువరసలో ఉండటం దురదృష్టకరం. ఈ ఏడాది బడ్జెట్లో వృద్ధుల సంక్షేమానికి రాష్ట్రపాలకులు కేటాయించిన మొత్తం కేవలం రూ.15లక్షలు! నిరుటి బడ్జెట్లో అది అక్షరాలా అయిదు లక్షల రూపాయలే. ఆ మొత్తమైనా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహణకోసం కేటాయించింది.

 వ్రతి డివిజన్‌ కేంద్రంలో విధిగా ఒక వృద్ధుల ఆశ్రమం అవసరమైనా, అందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. రాష్ట్రంలో వ్రస్తుతం 15 వృద్ధాశ్రమాలున్నాయి. మహిళల కోసం ఉన్నవి కేవలం రెండే!ఇతర రాష్ట్రాల్లో వృద్ధులకు వ్రత్యేక శాఖలు వనిచేస్తున్నాయి. మనరాష్ట్రంలో స్త్రీశిశు సంక్షేమశాఖలో ఇదో భాగంగా ఉంది. అందుకే చట్టం అమలుపట్ల శ్రద్ధాసక్తులు కొరవడుతున్నాయి. తల్లిదండ్రుల్ని వట్టించుకోనివారికి మూడు నెలల వరకు జైలు, అయిదు పేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించే అధికారాన్ని ట్రిబ్యునళ్లకు ఈ చట్టం కల్పించింది. భరణాన్ని ఎగ్గొట్టినవారికి నెలరోజుల వరకు జైలుశిక్ష వడుతుంది. వృద్ధులకు అండగా నిలిచే ఇలాంటి నిబణంధనలు ఎన్నో చట్టంలో ఉన్నాయి. చట్ట వ్రకారం వృద్ధులు తమ సమస్యలను నేరుగా ఆర్డీవో స్థాయి అధికారులకు పిర్యాదు చేసుకోవచ్చు. కానీ, సరైన అవగాహన లేకపోవడంతో అధికశాతం వృద్ధులైన తల్లిదండ్రులు నేరుగా పోలీసులు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. వృద్ధులకు రైలు వ్రయాణంలో రాయితీ సౌలభ్యం ఉన్నా, అందుకు అనుగుణంగా సీట్లు ఉండవు. ఒంటరిగా జీవించే వృద్ధులకు ఇళ్లవద్ద భద్రత కొరవడుతోంది. వ్రభుత్వ కార్యాలయాలకు పెళ్లినా, పారికి ప్రాధాన్యం దక్కడం లేదు. బ్యాంకులు, పింఛను కార్యాలయాల వద్ద నిత్యం చాంతాడంత వరసల్లో ఈసురోమంటూ నిలబడక తవ్పడం లేదు.

చెల్లిస్తున్న రెండొందల రూపాయల పింఛను వారి అవసరాలను ఏమాత్రం తీర్చడం లేదు. పింఛను చెల్లింవులో జాప్యం సైతం వారిని వేధిస్తున్న సమస్య. పింఛను పేరిట అతి తక్కువ సొమ్ము ఇవ్వడం వృద్ధులను అగౌరవపరచడమేనంటూ కేంద్రమంత్రి జైరామ్‌ రపేుశ్‌ వ్రధానమంత్రికి లేఖ రాసినా కేంద్రంలో కదలిక రాలేదు. అంత్యోదయ అన్నయోజన కింద పంపిణీ చేసే బియ్యం కొంతమందికే లబ్ధి కలిగిస్తోంది.
వాస్తపానికి వృద్ధుల సమస్యలు ఏమిటో, వాటి వరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పాలకులకు తెలియని విషయాలేమీ కావు. వ్రభుత్వాల్లో చిత్తశుద్ధి లోవపేు వృద్ధులపాలిట శావంగా వరిణమిస్తోంది. ముఖ్యంగా మన రాష్ట్రవ్రభుత్వం మరింత ఉదాసీన పైఖరి వ్రదర్శిస్తోంది.

హర్యానా, తమిళనాడుల్లో 60 ఏళ్లు దాటిన మహిళలకు రోడ్డు రపాణాసంస్థ బస్సుల్లో 50శాతం రాయితీ ఇస్తున్నారు. వ్రతీ డివిజన్‌లో ఆశ్రమం, సీనియర్‌ సిటిజన్‌ క్లబ్బుల ఏర్పాటు, ఉచిత పైద్యసేవలు అందుతున్నాయి. ఇలాంటి వథకాలు మనరాష్ట్రంలో కాగడా వేసినా కనబడవు. వృద్ధుల జనాభా, అవసరాలను వరిగణనలోకి తీసుకొని  వ్రభుత్వాలు తమ విధానాలను వునర్‌నిర్వచించుకోపాలి. జీవిత చరమారకంలో కుటుంబంలోని వృద్ధులు వ్రశాంతం గా కాలం గడవడానికి అవసరమైన  చేయూత అందజేయడం కుటుంబసభ్యులందరి కనీస బాధ్యత. నిర్లక్ష్యం వహించినపారిని దారిలో వెట్టడం వ్రభుత్వ కనీస కర్తవ్యం. అందుకోసం ఉద్దేశించిన చట్టనిబంధనలు ఆచరణలో దీటుగా అమలయ్యేలా పాలకులు చొరవ తీసుకోపాలి. అవ్పుడే, వృద్ధుల సమస్యలవట్ల సమాజ దృక్పథంలోనూ సానుకూల మార్పు వస్తుంది.

Courtesy with - ఆకారవు మల్లేశం


  • ============================== 

 Visit My Website - > Dr.seshagirirao.com/ 

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .