Sunday, December 16, 2012

శ్రీ ధన్వంతరీ జయంతి , Dhanvantari birth day




  • గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు "(కార్తీక బహుళ త్రయోదశి)'' నాడు -శ్రీ ధన్వంతరీ జయంతి- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
  అది ఒక వనము , వనమనేకన్న అరణ్యము అంటే భావుంటుంది . . ఎందుకంటే అనేక రకాల ఫలవృక్షాల చేత సారవంతమైన భూమి పై మొలకెత్తిన మూలికలచేత శ్రావ్యమై , స్వరభరితమై ప్రకృతినే పరవశింపచేస్తున్న వేదఘోష చేత , పశుపక్ష్యాదుల సయ్యాటలచేత శోభిల్లుతున్నఅరణ్యమట . . . సృస్టి అంతములో జలావధిలో మునిగి పోకుండా ఉన్న ఏకైక ధరాతలమట .. అది . దానిపేరే " నైమిశారణ్యము . విధాత రాబోయే సృష్టి  రచన కోసము మేధావులైన సప్తఋషివర్గాన్ని ఉంచడానికి నిలిపి ఉంచిన భూమి కనుక దానిని " నైమిశారణ్యము " అన్నారు. ఎన్నో వేద సంహితలకి , పురాణ ఇతిహాసాలకి , విజ్ఞానచర్చలకి ... అది అలవాలము . గంభీర వాతావరణములో కూర్చొనివున్నారు అందు ' అగస్త్యమహర్షి , గౌతమమహర్షి , భరద్వాజమహర్షి  మొదలగు నిష్ణాతులైన , శాత్రజ్ఞులైన మహర్షులు . అందరు ఒకానొక రోజున మానవలోకము లో మనుజులు కనిపించని రోగాలు కొన్నింటికి  , కనిపించి బాధపెట్టే మరెన్నో రోగాలకు గురి అవుతున్నారు . తెలియకుండా కబళిస్తున్న వృద్ధాప్యము , ప్రకృతి పరివర్తనలో విపరీతాల వలన వచ్చేటటువంటి సాంక్రమిక జనపద విధ్వంసక వ్యాధులు ... అంటే సమాజాన్నంతటినీ ఒకేసారి కబలించే  కలరా , ప్లేగు  , వైరల్ జ్వరాదులు - ప్రతీక్షణము మనిషి రోగ భయము తోనూ , మరణ భయముతోను బ్రతుకుతున్నాడని ఆలోచింప సాగారు . నివారణకోసము మార్గాన్ని అన్వేసించే దిశలో సమాదానము చర్చించుకుంటూ తమలో ఒకరైన భరద్వాజమహర్షిని ... ఆయుష్షును పోషించి రక్షించే వైద్యశాస్త్రాన్ని ఏదైనా తెలుసుకొని రమ్మని దేవేంద్రుని వద్దకు పంపారు.

దేవేంద్రుడు ఇంద్రలోక భోగలాలసుడే కాదు తన అర్హతవల్ల ఈ సృస్టి చక్కగా జరిపే ప్రతీశక్తికీ సంచాలకుడు . తనని దర్శించుకున్న బరద్వాజమహర్షిని ఉద్దేశించి " విధాత ముఖమునుండి  వెలువడిన వేదాలలోని అధర్వణవేదానికి  ఉపవేదముగా ఉన్న ఆయుర్వేదాన్ని తెలియజేసాడు . ఈ ఆయుర్వేదము క్షీరసాగగ మధనము లో చివరిగా అమృతభాండము తో పుట్టిన " ధన్వంతరి" భగవానుల  సృష్టి అనియు , మృత్యువునుంచి , రోగాలనుండి రక్షించే ఓషదులతో నిక్షిప్తము చేయబడిందనియు చెప్పెను . విధాతనుండి  నేను (ఇంద్రుడు),నానుండి సూర్యభగవానుడు , సూర్యును నుండి నకుల , సహదేవులు , అశ్వనీదేవతలు గ్రహించారని చెప్పి " అయుర్వేదాన్ని ఉపదేశించారు .. భరద్వాజమహర్షికి . అలా వైద్యశాస్త్రానికి మూలపురుషుడు ధన్వంతరి . Father of Ayurveda - ఆయుర్వేద వైద్యపెతామహుడుగా ఖ్యాతి గాంచినవారు ఈ ధన్వంతరి .
ఇంకా పూర్తి వ్యాసము కోసము ఇక్కడ క్లిక్ చేయండి -> ధన్వంతరీ జయంతి
  •  ==========================
 Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .