Monday, December 24, 2012

వరల్డ్‌ కిడ్నీ డే ,World Kidney Day



  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiAVZQLeO3XagFB-AB1QNc3NRIwtni3aMp5Yi6yu-xMEr7Coz-e45ptCJr4H3fhfu8GsltgWnUgZTIWyH2onex7jVuGheoClNGSGi-jGu7MCNK9jEbcLaubkOWtjN8UxRaQNv-vkHKUfrs/s1600/Kindneys.JPG

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (ప్రతి ఏటా మార్చి 2వ గురువారం) -వరల్డ్‌ కిడ్నీ డే (World Kidney Day)- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

మార్చి 10న వరల్డ్‌ కిడ్నీ డే---ప్రతి ఏటా మార్చి 2వ గురువారం దీన్ని జరుపుకుంటారుం మూత్ర పిండాల పట్ల ప్రజల్ని జాగృతం చేసే ఉద్దేశ్యము తో ఇంటర్నేషనల్ నెఫ్రాలజీ సొసైటీ (INS-International Nephrology society) , ఇంటనేషనల్ ఫెడరేషన్‌ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్‌ (IFKF) లు సంయుక్తం గా వరల్డ్ కిడ్నీ డే ను ఏటా నిర్వహిస్తున్నారు . ఇంటర్నేషనల్ నెఫ్రాలజీ సొసైటీ లాభేతర సంస్థ . మూత్రపిడాల వ్యాధుల గుర్తింపు , చికిత్స , నియంత్రణ లను ప్రపంచవ్యాప్తం గా చేపట్టడం ఈ సంస్థ ప్రధాన ధ్యేయము . ఇంటర్నేషనల్ ఫెడరేషన్‌ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్‌ 1999 లో ఏర్పాటైన లాభేతర సంస్థ . 63 కిడ్నీ ఫౌండేషన్ల సభ్యత్వము , 41 దేశాలలో పేషెంట్ గ్రూఫులు ఉన్నాయి . కిడ్నీ వ్యాధులు గలవారికి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాల్సిన విధానాన్ని , జీవన ప్రమాణాల పెంపు గురించి , చికిత్సలు , జాగ్రత్తలు గురించి ప్రజలకు వివరిస్తుంది . వివిద దే్శాలలో కిడ్నీ ఫౌండేషన్ల ఏర్పాటుకు సహకరిస్తుంది . ఈ రెండు సంస్థలు అధ్వర్యములో ఏటేటా " వరల్డ్ కిడ్నీ డే" నిర్వహిస్తుస్తున్నారు . మూత్రపిండాల వ్యాధుల్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంతసులువుగా తగ్గించుకోవచ్చు .

ఇటీవల జాతీయ కిడ్నీ ఫౌండేషన్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం చాలామందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నా తమకి కిడ్నీ డిసీజ్ ఉన్నట్లు కూడా తెలియదట! ప్రత్యేక లక్షణాలు ప్రారంభ దశలో లేకపోవడమే ఇందుకు కారణమని పరిశోధకులు గ్రహించారు. రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నవాళ్లు.. అంటే డయాబెటిస్, అధిక రక్తపోటు లాంటి వాటితో బాధపడేవారు తరచూ కిడ్నీ ఫంక్షన్ పరీక్షలు చేయించుకోవటం అవసరమని అంటున్నారు.
నాష్‌విల్లే, వ్యాండర్ బిల్డ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ వారు 401 మందిని , నెఫ్రాలజిస్ట్‌లతో పరీక్షించారు. వీరిలో డెబ్బై ఐదు శాతం మందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ 3వ దశలో ఉంది. 94 శాతం మందిలో మూత్రపిండాల ఇబ్బంది ఉందని తేలింది. వీరిలో 30 శాతం మందికి తమకి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు కూడా తెలియదు. ఇందుకు అవగాహనా రాహిత్యమే కారణమంటున్నారు పరిశోధకులు.
అందుకే మూత్రపిండాల నిర్మాణం గురించి, అవి చేసే పనుల గురించి, అవి దెబ్బతినే కారణాల గురించి, దెబ్బ తినకుండా తీసుకునే చర్యల గురించి తెలుసుకోవాల్సిన అవసరముందని కూడా పరిశోధకులు చెబుతున్నారు. అంతే కాకుండా పరిశోధకులు 34 ప్రశ్నలతో కూడిన పత్రాన్ని అభ్యర్థులకిచ్చారు. వాటివల్ల తేలిందేంటంటే 78 శాతం మందికి లక్షణాలు లేకుండానే ఈ వ్యాధి వృద్ధి చెందుతుందని. ఇంకా విచిత్రమేమిటంటే 32 శాతం మందికి మూత్రం కిడ్నీల ద్వారానే వస్తుందని తెలియదు.
‘కిడ్నీ డిసీజ్ చాలా సైలెంట్‌గా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే అధిక రక్తపోటు, డయాబెటిస్, వంశపారంపర్య చరిత్ర ఉన్నవారు తరచూ కిడ్నీ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాల’ని అంటున్నారు పరిశోధకుల్లో ఒకరైన డా.జోసఫ్ వ్యాసలోటి.
సకాలంలో వ్యాధి ఉన్నట్లు గుర్తించగలిగితే కిడ్నీ వ్యాధులు ప్రబలకుండా కాపాడుకోవచ్చు. డయాబెటిస్, రక్తపోటు లాంటి వాటిని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. కొన్ని మందులు మూత్రపిండాలకి హాని కల్గిస్తాయి. అందుకని ఏ మందులు పడితే ఆ మందులు వైద్యుని సలహా లేకుండా తీసుకోకూడదు. ఈ జాగ్రత్తలతో మూత్రపిండాల వ్యాధులు ప్రబలకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు.
అపరిశుభ్రత వల్ల యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది తరచూ ఈ ఇబ్బందికి లోనవుతుంటారు. మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్స్, మూత్రపిండాలలో రాళ్లు లాంటివి కలుగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డేకి ప్రధానాంశం "కిడ్నీ జబ్బులతో గుండెకు ప్రమాదం" అని, గుండెకి అధిక రక్తపోటుకి సంబంధం ఉంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదముంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. గుండెపోటు వస్తే నొప్పి కూడా తెలియదు డయాబెటిస్ ఉన్నవారికి. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఇదే కాదు మూత్రపిండాల జబ్బులు సైలెంట్ కిల్లర్స్ తీవ్రమయ్యే వరకూ ఎటువంటి లక్షణాలు కనిపించవు. అలాగే అధిక రక్తపోటు, డయాబెటిస్ ప్రభావం కిడ్నీల మీదా ఉంది. కాబట్టి కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటే ఈ అనారోగ్య ప్రభావం క్రమంగా గుండె మీదా పడే అవకాశముంది. అందుకని కిడ్నీల ఆరోగ్యం జాగ్రత్త. కిడ్నీ ఆరోగ్యంతోపాటు గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది అని హెచ్చరిస్తుంది ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే.



మన దేశంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు 20లక్షల మంది వరకు ఉన్నారని ఒక అంచనా. ఏటా అదనంగా రెండు లక్షల మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని, మన రాష్ట్రం విషయానికి వస్తే రాజధాని నగరంలో 30వేల మంది నుంచి 40 వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్థుకు డయాలసిస్‌ అవసరం అవుతున్నది. ఈ కిడ్నీ సమస్యలకు ప్రధానంగా మధుమేహం (40శాతం), హైబిపి (30శాతం) కారణమవుతున్నాయి. వీటిని అదుపులో ఉంచుకుంటే మూత్రపిండాలు చాలా వరకు కాపాడుకోవచ్చు.

-నిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. మూత్ర పిండాలు మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఈ ‘డయాలసిస్‌’ కోసం నెలకు సుమారు రూ.4-5వేలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. చికిత్స తీసుకున్నా కిడ్నీ తిరిగి సమర్ధంగా మారదు. గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినటం వంటివీ మొదలవుతాయి. పోనీ దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే కిడ్నీ దాతలు దొరకటం కష్టం. ఆపరేషన్‌ పెద్ద ప్రయత్నమనుకుంటే ఇక ఆ రత్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎన్నో ఇబ్బందులు, దుష్ర్పభావాలు. ఇంత ఖర్చు చేసి చికిత్స తీసుకున్నా జీవనకాలమూ తగ్గవచ్చు. ఇలాంటి ప్రమాదాలన్నీ దరిచేరకుండా ఉండాలంటే ముందే మేల్కొని, అసలు కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

మన జీవనశైలి మార్పులే కిడ్నీలకు చెడు :
-మన దేశంలో మధుమేహం ఎంత విపరీతంగా విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2015 నాటికి వీరి సంఖ్య రెట్టింపు కావచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఈ మధుమేహంతో పాటే మూత్రపిండాల వైఫల్యం కేసులు పెరుగుతున్నాయి. టైప్‌-1 మధుమేహ బాధితుల్లో 10-30శాతం, టైప్‌-2 మధుమేహుల్లో 40శాతం మంది కిడ్నీ సమస్యల బారినపడే అవకాశం ఉంది. ఒకసారి ఈ మూత్రపిండాల సమస్య మొదలైందంటే.. దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. అందుకే సమస్యను తొలిదశలో గుర్తిస్తే దాన్ని ముదరకుండా నిలువరించే అవకాశం ఉంది. అందుకే మధుమేహులంతా కిడ్నీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ ఆరోగ్యవంతులు అసలు మధుమేహం బారినపడకుండా చూసుకోవాలి.

కిడ్నీల పరిరక్షణకు తేలికైన పరీక్షలు :
-టైప్‌-1 రకం బాధితులు మధుమేహం బారినపడిన ఐదేళ్ళ నుంచి ప్రతి ఏటా కిడ్నీ సమస్యలు వస్తున్నాయేమో పరీక్షించుకోవటం మంచిది. టైప్‌- 2 మధుమేహులైతే దాన్ని గుర్తించిన తక్షణమే కిడ్నీ పనితీరు తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత కనీసం ఏడాదికి ఒకసారైనా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీ సమస్యలేమైనా తల ఎత్తుతున్నాయా? అన్నది తేలికైన పరీక్షల ద్వారా చాలా ముందుగానే గుర్తించవచ్చు.

1. మూత్రంలో అల్బుమిన్‌ : అల్బుమిన్‌ అనేది ఒక రకం ప్రోటీను. మూత్రంలో ఈ సుద్ద ఎక్కువగా పోతోందంటే కిడ్నీల వడపోత సామర్ధ్యం తగ్గిపోతున్నట్టే. అందుకే ప్రతి ఏటా తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే. దీని ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు.

2. రక్తంలో సిరమ్‌ క్రియాటిన్‌ : మన కిడ్నీల వడపోత సామర్ధ్యం ఎలా ఉందో చెప్పేందుకు ఈ పరీక్ష కీలకం. దీని ఆధారంగా వడపోత సామర్ధ్యాన్ని - ఎస్టిమేటెడ్‌ గ్లోమెరూలార్‌ ఫిల్టరేషన్‌ రేట్‌-ఈజీఎఫ్‌ఆర్‌ ను లెక్కించి... కిడ్నీల సమస్య తలెత్తే అవకాశం ఎంతవరకూ ఉందన్నదనే అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 110 మి.లీ. వరకూ ఉంటుంది. ఇది 60 మి.లీ.కన్నా తక్కువుంటే మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. కేవలం క్రియాటినైన్‌ పరీక్ష చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50శాతం దెబ్బతినే వరకూ కూడా సిరమ్‌ క్రియాటినైన్‌ పెరగకపోవచ్చు. కాబట్టి ‘ఈజీఎఫ్‌ఆర్‌’ను చూసుకోవటం ముఖ్యం. సీరమ్‌ క్రియాటినైన్‌ పరీక్షించి దానితో పాటు వయసు, బరువు, ఎత్తు వంటి ప్రమాణాల ఆధారంగా ‘ఈజీఎఫ్‌ఆర్‌’ లెక్కిస్తారు.

3. బ్లడ్ యూరియ : కిడ్నీ పనితనము తగ్గిందంటే రక్త్మ లో యూరియా శాతము పెరిగిపోతుంది . ఇది సాదారణము గా 40 మి.గ్రా/100 మి.లీ లోపు ఉంటుంది . దీని స్థాయిని బట్తి మనము మూత్ర పిండాల సామర్ధ్యము తెలుసుకోవచ్చును .

కిడ్నీలను కాపాడుకోవాలంటే?
మధుమేహం, అధిక రక్తపోటు కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహులు- హెచ్‌బి ఎ1సి (గ్లైకాసిలేటెడ్‌ హిమోగ్లోబిన్‌) పరీక్ష ఫలితం 7కన్నా తక్కువ ఉండేలా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గత మూడు నెలల సమయంలో మధుమేహం కచ్చితంగా అదుపులో ఉందా లేదా? అని చెప్పే పరీక్ష. మధుమేహం, హైబీపీ రెండూ ఒకదానికి ఒకటి తోడై.. చివరికి కిడ్నీలను దెబ్బతీసే స్థాయికి చేరకుంటాయి. అందుకే రక్తపోటును 130/80 కంటే తక్కువే ఉండేలా చూసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి. అలాగే రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. మూత్రంలో సుద్ద పోతుంటే వెంటనే గుర్తించి తక్షణం చికిత్స తీసుకోవాలి. అందుకే తరచూ పరీక్షలు చేయించుకోవటం అవసరము .

సుగరు వ్యాధి లో కి్డ్నీ జాగ్రత్తలు -> kidneys in Diabetes

  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .