ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఉల్లాసపరిచేవి సినిమాలు. నేడు సినిమాలు చూడనివారు ఉండరంటే అతి శయోక్తి కాదు. ఒకొ్కక్కరికీ ఒక రకమైన చిత్రాలంటే ఇష్టం. కుటుంబ కథా చిత్రాలు, హారర్ సినిమాలు, యాక్షన్ సినిమాలు, లవ్, రొమాన్స్ చిత్రాలు...వంటివి ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్నారుు. ఈ నేపథ్యంలో అసలు తెలుగులో తొలి టాకీ చిత్రం ఏదన్న విషయం చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. మూకీ చిత్రాల కాలం పోరు తెలుగులో వచ్చిన తొలి టాకీ చిత్రం ''భక్త ప్రహ్లాద''. ఈ సినిమా 1931 సంవత్సరం సెప్టెంబర్ 15న విడుదలైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 15నాడు ‘తెలుగు సినిమా జన్మదినం’ను జరుపుకుంటున్నారు. 80వ తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకున్నారు .
భారతీయ చలనచిత్ర పరిశ్రమను తీసుకుం టే మూకీల కాలం పోయి టాకీ సినిమాలు వచ్చినవి 1931లో. 1931 మార్చి 14న ముంబయిలోని మెజిస్టిక్ థియేటర్‌లో విడులైన ''ఆలమ్ ఆరా'' సినిమాయే తొలి భారతీయ టాకీ చిత్రం. ముంబయిలోని ఇంటీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత అర్దేషిర్ ఎం.ఇరానీ ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ఇక ఈ సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత దక్షిణాదిన టాకీ సినిమా విడుదలైంది
- తొలి టాకీ సినిమా...
ఆ తర్వాత హెచ్.ఎం.రెడ్డి తన మకాంను ముంబయికి మార్చి దర్శక నిర్మాత అర్దేషిర్ ఎం.ఇరానీ వద్ద సహాయకుడిగా పనిచేశారు. ఇరానీ నిర్మించిన పలు టాకీ చిత్రాలకు హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక మూకీ రోజుల్లో ముంబయిలో ఉన్న నటుడు ఆ తర్వాత దర్శక, నిర్మాతగా మారిన ఎల్.వి.ప్రసాద్ ఆలమ్ ఆరా సినిమాలో నటించడం విశేషం. ఆయన హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్కున్న తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాదలో సైతం నటించారు.
- తొలి డిటెక్టివ్ చిత్రం...
- తొలి కలర్ సినిమా...
- తొలి స్కోప్ సినిమా...
- దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు-
బి.నాగి రెడ్డి చెన్నైలో విజయ వాహిని స్టూడియోను నిర్మిం చారు. ఆ కాలంలో ఆసియాలోనే అతిపెద్ద స్టూడియోగా ఇది పేరుగాంచింది. నాగిరెడ్డి పలు సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు.
సినీ నటుడు, దర్శక నిర్మాత అయిన ఎల్.వి.ప్రసాద్ అసలు పేరు అక్కినేని లక్ష్మీ వర ప్రసాద రావు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు 1982లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేసింది. ప్రసాద్ ప్రొడక్షన్‌ను నెలకొల్పిన ఎల్.వి.ప్రసాద్ హిందీలో మిలన్, ఖిలోనా, ససురాల్, ఏక్ దూజే కె లియే వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించి ఎంతో పాపులారిటీ సంపాదించారు.
టాలీవుడ్గలో 69 సంవత్సరాల సినీ ెకరీర్‌లో హీరోగా అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు. 1941 నుంచి ఆయన సినిమాల్లో నటిస్తుండడం విశేషం. తెలుగు సినిమా జన్మించిన 10 సంవత్సరాల కాలం నుంచి ఆయన టాలీవుడ్గలో కొనసాగుతున్నారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రేమాభిషేకం సినిమా హైదరాబాద్‌లో 533 రోజులు ఆడడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావుకు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(1990), పద్మశ్రీ (1968), పద్మభూషణ్(1988), పద్మ విభూషణ్ (2011) తదితర అవార్డులు దక్కాయి.
భారతదేశ సినీ రంగంలో డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు సినీ నిర్మాతగా ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఆయన ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ అవార్డును 2009లో దక్కించుకున్నారు. ఇక అత్యధికంగా సినిమాలను నిర్మించిన సినీ నిర్మాతగా ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించారు. తెలుగు సినిమాలేగాకుండా హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ సినిమాలను సైతం నిర్మించి పేరుతెచ్చుకున్నారు.
- గిన్నిస్ బుక్‌లో...
హాస్యనటుడు బ్రహ్మానందం గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బ నటించే బ్రహ్మానందం తెలుగు చిత్రాల్లో 850 చిత్రాల కు పైగా చేసి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపా దించారు. ఒకే భాషలో ఇన్ని చిత్రాలు ఏ నటుడు చేయక పోవడం విశేషం. కేంద్ర ప్రభు త్వం ఆయనకు పద్మ శ్రీ అవా ర్డును, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.
అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించారు. ఆమె 47 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ హీరో కృష్ణ సతీమణి అయిన విజయనిర్మల భర్త ప్రోత్సాహంతో మహిళా దర్శకురాలిగా ఎంతో పేరుతెచ్చుకున్నారు. ఇక సినీ హీరోయిన్‌గా ఆమె పలు విజయవంతమైన సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించారు. తెలుగు సినీ రంగంలో చేసిన కృషికి గాను ఆమె 2008లో రఘుపతి వెంకయ్య అవార్డును దక్కించు కున్నారు.
సినీ దర్శకుడిగా,నిర్మాతగా, రాజకీయనాయకుడిగా పేరుతెచ్చుకున్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. 150 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన 53 సినిమాలను నిర్మించారు. ఇక 250 సినిమాలకు మాటలు రాయడమే కాకుండా పాటలు కూడా రాశారు. తాత మనవడు, స్వర్గం నరకం, మేఘ సందేశం, మామగారు వంటి సూపర్‌హిట్ చిత్రాలు ఆయనకు అవార్డులను తెచ్చిపెట్టాయి. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా దాసరి నారాయణరావు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదిం చారు.
-ఎస్.అనిల్‌కుమార్ (Courtesy with Surya Daily news paper)
- =================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .