Thursday, May 3, 2012

జాతీయ సినీ దినోత్సవం , National Film (Cinema) Day


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhmiZCXYzfAKgajJBDH89nUVzYweg5nRe5liWzplgPrM8YSTZCld-uAVxt_E-3HgaJma89D7O1ChRt4rl6GnNTROp6-2JjFwONrIeBN0Ga5hPw0WoB2F7-qsloWvIdniXukRlM5y7KT0cAS/s1600/First+Indian+Talky+film+release+day%25281931+%25E0%25B0%25AE%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%259A%25E0%25B0%25BF+14%2529.jpg


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (మే 03) న -జాతీయ సినీ దినోత్సవం - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


సరిగా 21 ఏప్రిల్ 1913 న తొలి భాతీయ చలంచిత్రం బొంబాయిలో ప్రదర్శించబడింది . నగరములోని ఒలింపియా థియేటత్ ముందు గుంపులు గుంపులు గా జనము , సామాన్యుడు , ధనవంతుడు తేడా లేకుండా కదిలే బొమ్మల తతంగం చూడాలని అక్కడ చేరారు . తొలి ప్రదర్శనము తిలకించిన వారంతా ఆనందముతో పులకించారు . ఆ విధముగా తొకిసారిగా పూర్తి భారతీయతతో తీసిన సినిమా " రాజాహరిశ్చంద్ర " తో భారతీయ సినిమా తొలి అడుగుపడింది . అదే సంవత్సరము మే 03 న " రాజాహరిశ్చంద్ర " కొరనేషన్‌ సినిమాటోగ్రాఫ్ లో విడుదల చేసారు . ఈ సం. నుండి జాతీయ సినిమా అవార్డుల ఫంక్షన్‌ ను మే 03 న బహూకరించాలని నిర్ణయించారు .


రాజాహరిశ్చంద్ర ని నిర్మించిన దాదాసాహెబ్ ఫాల్కేని బారతీయ చలనచిత్ర పితామహుడిగా గుర్తించి ఆయన పేరుతో సినిమా రంగానికి విశిష్టసేవలఆందించిన వారికి ఏటా ఫాల్కే అవార్డు ఇవ్వడం జరుతుతూఉంది . అయితే 1913 కి ముందు భారతదేశములో సినిమాలు లేవని కాదు . సినిమాటోగ్రాఫ్ ని కనుక్కున్న " లుమియర్ బ్రదర్స్ జూలై 07 -1897 లో భారతదేశములో చలనచిత్రం ప్రదర్శించారు . అవన్నీ కొద్ది నిమిషాలు నడిచిన చిత్రాలు . ఆ తర్వాత వరుసగా పలువిదేశీ సంష్థలు తక్కువ నిడివి చిత్రాలను , డాక్యుమెంటరీలను భారతదేశము లో ప్రదర్శించారు . 1896 నుండి భారతీయులము సినీ నిర్మాణము మీద మక్కువ కొదలైంది . అప్పటివరకూ నాటకాలు , యక్షగానాలు , హరి కధలు , బుర్ర కథలు వినోదాన్ని అందించేవి . వాటి స్థానము లో సినిమారాకను అందరూ స్వాగతించారు . 1912 లో బ్రిటిష్ వారి సాంకేతిక సహకారము తో " పుండలిక్ " అనే సినిమా విడుదల అయింది కాని " రాజాహరిశ్చంద్ర " లో తెర ముందు , తెరవెనుక పూర్తిగా బారతీయ హస్తాలే పనిచేసాయి. అందుకే అది తొలి భారతీయ చలన చిత్రం గా చరిత్రలోకి ఎక్కింది . రాజాహరిశ్చంద్ర - మూకీ సినిమా . అప్పటికే ఆ నాటకము దేశములో అన్ని ప్రాంతాలవారికి పరిచయము కాబట్టి మాటలు కేకున్నా ప్రేక్షకులకు ఇబ్బంది అని పించలేదు . భారతీయ సినిమా మాగ దశనుండి మాటలు నేర్చుకునేందుకు 18 ఏళ్ళు పట్టింది . 1931 లో విడుదలైన " ఆలమ్‌ ఆరా" తొలి భారతీయ టాకీ . దానిని నిర్మించిన అర్దేషిర్ ఇరానీకి అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేసిన వ్యక్తి - హెచ్.ఎమ్‌.రెడ్డి అనే తెలుగువాడు . ఇరానీ సినిమా నిర్మాణము చేస్తున్న సమ్యం లోనే హెచ్.ఎమ్‌.రెడ్డి మంసులో తెలుగు చలనచిత్రనిర్మాణము ఆలోచన కలిగింది . వెనువెంటనే ఆంధ్రప్రాంతానికి వచ్చి అప్పటికే అక్కడ బాగా ప్రాచుర్యము పొందిన భక్తప్రహ్లాద నాటకము ఆడే బృందాన్ని మొత్తాన్ని బొంబాయికి తీసుకువెళ్ళి తొలితెలుగు సినిమా నిర్మాణము పూర్తిచేసారు . ఆ విధముగా టాకీ సినిమాల విషయము లో హిందీతో పాటే తెలుగు సినిమాకూడా నిలిచింది . తొలి టాకీ లో పాలుపంచుకొన్న ఎల్.వి.ప్రసాద్ , సి.యస్.అర్ వంటివారు ఆ తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు .

భారతీయ సినిమా మాటలు నేచిన మరో నాలుగేళ్ళ కు గాని పాటలు పాడలేదు . 1935 లో తొలిసారిగా నేపద్యగానము మోదలనది . తలుగు సినిమా రాకతో ఆంధ్రప్రదేశాములో విప్లవమే వచ్చింది . తొలి స్టుడియోని రాజమండ్రిలో నిర్మించారు . చెన్న పట్ణము లో తొలి పర్మనెంట థియేటర్ నిర్మించిన రఘుపతివెంకయ్య తెలుగవాడే . ప్రతి పట్టణములో టూరింగ్ థియేటర్లు వెలిశాయి. భారత సినిమాలు నాటకరంగానికి ప్రతిరూపాలే . చాలా కాలము హిందీ , తెలుగు , తమిళము భాషలలోనే సినిమాలు నిర్మించబడ్డాయి. మెల్లమెల్లగా కన్నడ , మలయాళము , ఒరిస్సా , మరాఠీ, గుజరాతీ సినిమాలతో పాటు భోజ్ పురి భాషలోనూ సినిమాలు వచ్చాయి. ఇటీవలే లిపిలేని భాసలలోనూ అనగా తుళు , కొంకిణి , బ్యారీ , మోన్‌సా భాష , త్రిపురలోని కోక్ బొరోక్ భాసలోనూ సినిమాలు నిర్మాణము జరిగాయి.

ప్రపంచములొ సినీ నిర్మాణములో నంబర్ వన్‌ స్థానము భారతదేశానిది . ప్రపంచ సినిమాలకు కేంద్రము గా చెప్పుకునే హాలీవుడ్ లో కూడా నిర్మాణము కానన్ని సినిమాలు మన దేశములో నిర్మిస్తారు . అన్ని భాషలలో కలిపి ఏటా వెయ్యికి (1000) తక్కువకాకుండా 24 భాషలలో చలనచిత్రాలు తయారవుతున్నాయి . మనకన్న పెద్దదేశమైన చైనా లో కూడా ఇన్ని సినిమాలు తియ్యడము లేదు . మన సినిమాలు సుమారు 90 దేశాలలో ప్రదర్శన జరుగుతుంది . సినిమాలు వచ్చి నాటకరంగం సుమారు కనుమరుగవుతుంది ... అయ్యిపోయింది . అదేవిధం గా టెలివిజన్‌ (బుల్లెతెర ) వచ్చి సినిమా వ్యాపారము కష్ట , నష్టాలలో పడింది . సినిమాలలో పైరసీ వచ్చి స్నినీ రంగాన్ని సమూలం గా నాశనము చేస్తుంది . నిలదొక్కుకోవడానికి సెక్ష్ (అశ్లీల స్నిమాలు ) మోతాదు ఎక్కువగా చూపి యువతను ఆకర్షించి ... వారిని పెడత్రోవపట్టేందుకు సినిమాలు దోహదము అవుతున్నాయి .


Source : An Article by Dr.Dugguraju Srinivasarao.



  • ===============================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .