Monday, February 6, 2012

రథ సప్తమి, సూర్యదినోత్సవం , Sun day-celebrations, Radhasaptami


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh44uyFaEnLt6lo-srGyQlzoSknD47I4Vih_xCTuPOr2sKQO6ggFLLfCkt-NP1IbUarDujT-B21bm_wcWPQe7kCT-6Bi6tlNxgzpHzJXagWAo0DBNDSt3U0kjs78HWKclzgskI4GHVFyU9J/s1600/Sun+%28surya%29.jpg


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (మాఘ శుక్ల సప్తమి) -సూర్యదినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

* సూర్య గోళానికి ... అధితి -కష్యపముని పుత్రుడు , తేజోమూర్తి అయిన సూర్యనారయణ మూర్తికి ఎటువంటి సంబంధము లేదు కాని హిందూపురాణాలు ఆ ఇద్దరిని ఒకటిగా చేసి అన్వయించడము , పూజించడము జరిగినది. నవగ్రహాలు , రాసులు , నక్షత్రాలు మనిషి జీవితాన్ని ప్రభావితము చేస్తాయనడము ఒక నమ్మకము మాత్రమే ... ఎటువంటి సైంటిఫిక్ బేస్ (scirntific base) కనబడడములేదు. Life goes as per Genes... and with the influence of surrounding people , wether & atmospher . నమ్మకము ఉండవచ్చును గాని అది మూఢనమ్మకము కాకూడదు .

ఇక కధా వివరాలలోనికి వెళ్తే :
మాఘ శుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజుని రధసప్తమి అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన ఉత్తేజాన్ని నింపే సుర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రధసప్తమి. షష్ఠితో కూడిన సప్తమి (తిధిద్వయం) కలిసి రావడం వల్ల రధసప్తమి అత్యంత శ్రేష్టమైనది. ఆ రోజు చేసే స్నానాలు, వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధికఫలాన్నిస్తాయి. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వభూతాలు ఆయన వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మ అని (నమస్తే ఆదిత్యత్వమేవ-చందోసి) సూర్యోపనిషత్తు తెలిపింది. వేదకాలం నుంచే సూర్యారాధన ఉంది. వేదాల్లోని సౌర సూక్తులు, ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం మొదలైనవి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సూర్యుడు నవగ్రహాల్లో ప్రధముడే కాదు, ప్రధానం కూడా. ఆయన పన్నెండు రాశుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలితాలు కలిగిస్తాడు. కోణార్క్, అరసవిల్లి ఆదిత్యాలయాలకు ప్రసిద్దం. అనంతపురం జిల్లాలోని దొడ్డేశ్వరాలయంలో సంజ్ఞ, ఛాయ అనే ఇద్దరు భార్యలతో సూర్యుడు దర్శనమిస్తాడు. రధసప్తమి నాడు సూర్య వ్రతాన్ని ఆచరించేవారు నెత్తిమీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకొని స్నానం చేయాలి...అనే ఆచారము ఉన్నది .

రధ సప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది

హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు.ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. సుర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకము రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును భారతీయులే.

మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆరోజు అరుణోదయవేళ స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలనిచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడయున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈయోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.


రథసప్తమినాడు బంగారముగాని, వెండిగాని, రాగిగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయవలెనని, ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుత భారతీయతకు చిహ్నము.

ఆంద్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం సమీపంలో గల అరసవిల్లి పుణ్యక్షేత్రం లో ప్రతి ఏటా రెండు సార్లు ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. అదేమిటంటే, సంవత్సరంలో రెండు రోజులలో మాత్రం ప్రభాత భాస్కరుని కిరణాలు నేరుగా ఆలయం ముఖ ద్వారం నుండి ప్రవేశించి స్వామి వారైన ఉషా, చాయా, పద్మినీ సమేత శ్రీ సూర్య నారాయణ స్వామి వారి పాదాలను తాకుతాయి. ఈ ఘట్టం ఉదయం 6.00 నుండి 6.15 మధ్య కేవలం ఒక అయిదు నిముషాలు మాత్రమె వుంటుంది. తదుపరి సూర్య కిరణాలు గర్భ గుడి నుండి నిష్క్రమిస్తాయి. ఈ అద్భుతాన్ని చూడడానికి ఎందఱో స్థానిక భక్తులు, దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆలయానికి వేకువనే వచ్చి ఈ వింత చూడటానికి ఎదురు చూస్తారు. సుమారు ఏడవ శతాబ్దంలో ఈ కోవెలను సూర్యుని గమనాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మించడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మార్చిలో, అక్టోబరు లో వచ్చే ఈ శుభ దినాలు ఉత్తరాయనాన్ని, దక్షిణాయనాన్ని సూచిస్తాయి. ఈ దినం ప్రసరించే సూర్య కిరణాలలో శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరచే మహిమ వుందని అందరి భక్తుల నమ్మకం. ఆ విధంగా ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన కిరణాలతో అద్భుతాలు చేస్తూ ప్రాణికోటి కంతటికీ జీవనాధారమౌతున్నాడు.
  • ===============================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .