(ఫిబ్రవరి 28)- నేడు కంప్యూటర్ మనిషి జీవితంలో విడదీయరాని భాగం అయిపోయింది. ప్రతిరోజు ప్రత్యక్షం గానో పరోక్షంగా ప్రతి వ్యక్తి కనీసం ఒక్కసా రైనా కంప్యూటర్‌తో అనుసంధానం కాకతప్ప డం లేదు. అయితే కంప్యూటర్‌తో ఎన్ని ఉపయో గాలు ఉన్నాయో అంతే సమస్యలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేయడం వల్ల దృష్టి, నాడీ వ్యవస్థ, కీళ్ళకు సంబంధించిన అనేక సమస్య లు ఉత్పన్నమవుతాయని పరిశోధనల్లో వెల్లడ య్యింది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటి ప్రభావం నుండి కొంతమేరకు బయట పడవచ్చు. కంప్యూటర్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్దేశించిందే ‘కంప్యూటర్ రిలేటెడ్ ఇన్‌జ్యూరీస్ అవేర్‌నెస్ (అవగాహన) దినోత్సవం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
- =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .