గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు ( అగష్టు 19న) -World Potato Day , బంగాళదుంప దినోత్సవం - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
ప్రపంచ వ్యాప్తంగా అగష్టు 19న బంగాళదుంప దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. మన ఇళ్లలో చాలా మంది బంగాళదుంప ‘ఆరోగ్యానికి’ మంచిది కాదని చెబుతుంటారు, కాని స్వచ్ఛమైన బంగాళదుంపలు అత్యధిక కార్బొహైడ్రేట్లను కలిగి ఆరోగ్యానికి మంచి చేకూరుస్తాయి. ప్రపంచములో ఆహారపదార్ధాలలో బంగాళా దుంపలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. మొదటిగా ఇవి దక్షిణ పెరూ లో 8000 BC - 5000 BC లో గుర్తించడం జరిగిందని అంచనా. ఒక్క అమెరికాలోనే ప్రతిసంవత్సరమూ సుమారు 45 బిలియన్ల పౌండ్స్ బంగాళాదుంపలు పండిస్తున్నారు . రకరకాల వంటకాలుగా వీటిని ఉపయోగిస్తున్నారు . కూరగాను , చిప్స్ గాను , వేపుడు కూరగాను , ఇతర కూరలలోను , చికెన్ , మటన్ వాటితో కలిపి గాని వాడితే మంచి రుచిగా ఉంటయి. . ఇవి రుచింకే కాదు ముఖ్యమైన విటమిన్లు , ఖనిజలవణాలు ఉన్నాయి. . . ఉదా : విటమిన్ సి , పొటాషియం , ఐరన్ , బి-కాంప్లెక్ష్ మున్నగునవి.
చికాగో జీనియస్ డేటా ప్రకారము :
పొటాటో తో తయారయ్యే వంటకాలు ---- 10642,
బంగాళాదుంపలు సుమారు పండించే దేశాలు ---125 ,
పొటాటా లో రకాలు -----------------------4000.,
బంగాళాదుంపలు లలో నీటిశాతము ----- 80%.,
బంగాళాదుంపలు లలో ఎక్కువగా ఉండే ఖనిజము -- పొటాషియం (అరటి పండు లో కంటే ఎక్కువే).
* బంగాళదుంప (Potato) అనేది దుంప జాతికి చెందిన ఒక కూరగాయ. ఒక్కో ప్రాంతములో ఒక్కోక పేరుతో ఈ దుంప కూర పిలవబడుతున్నది. కొన్ని చోట్ల ఆలు గడ్డ అని లేదా ఉర్ల గడ్డ అని మరికొన్ని ప్రాంతములలో బంగాళదుంప అని పిలుస్తారు. ఈ మొక్క సొలనేసి కుటుంబానికి చెందిన గుల్మము.
పౌష్టిక విలువలు
* ఆహార పౌష్టికత పరంగా బంగాళదుంపలలో పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేటులు) ప్రధానమైన ఆహార పదార్ధం. ఒక మధ్య రకం సైజు దుంపలో 26 గ్రాములు పిండిపదార్ధం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఈ స్టార్చిలో కొద్ది భాగం పొట్టలోను, చిన్న ప్రేవులలోను స్రవించే ఎంజైములు వలన జీర్ణం కాదు. కనుక ఈ జీర్ణం కాని స్టార్చి భాగం పెద్ద ప్రేవులోకి తిన్నగా వెళ్ళిపోతుంది. ఈ జీర్ణం కాని స్టార్చి (resistant starch) వలన శరీరానికి ఆహార పీచు పదార్ధాలు (Dietary fiber) వల్ల కలిగే ఉపయోగాలవంటి ప్రయోజనాలే కలుగుతాయని భావిస్తున్నారు
* శరీర పౌష్టికత,
* కోలన్ క్యాన్సర్ నుండి భద్రత,
* గ్లూకోజ్ ఆధిక్యతను తట్టుకొనే శక్తి,
* కొలెస్టరాల్ తగ్గింపు,
* ట్రైగ్లిజరైడులు తగ్గింపు వంటివి.
* దుంపను ఉడకపెట్టి ఆరబెడితే ఇలా జీర్ణంకాని స్టార్చి ఎక్కువవుతుంది. ఉడికిన వేడి దుంపలో ఉండే 7% జీర్ణంకాని స్టార్చి, దానిని ఆరబెట్టినపుడు 13%కు పెరుగుతుంది.
* బంగాళ దుంపలలో పలువిధాలైన విటమిన్‌లు, ఖనిజ లవణాలు (minerals) ఉన్నాయి. 150 గ్రాముల బరువుండే ఒక మాదిరి బంగాళ దుంపలో 27 మిల్లీగ్రాముల విటమిన్-సి (ఒక రోజు అవుసరంలో 45%), 620 మి.గ్రా. పొటాషియం ( అవుసరంలో 18%), 0.2 మి.గ్రా. విటమిన్-B6 (అవుసరంలో 10%) మాత్రమే కాకుండా కొద్ది మోతాదులలో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్ధాలు లభిస్తాయి. ఇంతే కాకుండా బంగాళదుంప తొక్కలో ఉన్న పీచు పదార్ధం కూడా చాలా ఉపయోగకరం. ఒక మాదిరి బంగాళ దుంప తొక్క బరువు 2 గ్రాములు ఉంటుంది. ఇందులో ఉన్న పీచు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం. ఇంకా బంగాళదుంపలో కార్టినాయిడ్స్ మరియు పాలీఫినాల్స్ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి. బంగాళ దుంపలో లభించే ఇన్ని పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై బాగా ఆధారపడి ఉంటుంది.
- ====================================
Visit My Website - > Dr.seshagirirao.com/
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .