Wednesday, December 28, 2011

అంతర్జాతీయ కారము-మసాల ఆహారదినోత్సవం , International hot and spicy food day


  • image : courtesy with ... Andhraprabha news paper

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (జనవరి 16 న ) -అంతర్జాతీయ కారము-మసాల ఆహారదినోత్సవం - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

  • January 16, every year .
స్వీటు వాసనలు కూడా పరిసరాలంతా ప్రసరించి ఆకర్షించినా వాటికి ఇంత బలమైన ఆకర్షణ ఎందుకు ఉండదు స్వీట్లు కొన్ని తినగానే మొహం మొత్తినట్ల యిపోతుంది. ఇక తినబుద్ధికాదు. కడుపుబ్బరంగా కూడా అవుతుంది. కొందరైతే కళ్ళు తిరుగుతాయని కూడా అంటారు. మరికొందరికి విచిత్రంగా స్వీటుతింటే కడుపు లో మంట కూడా వస్తోందంటారు. అదే కారం కారంగా ఉండేది ఎంత తిన్నా మొహం మొత్తినట్టుండదు. కారం దెబ్బకు కాస్త నాలుక చుర్రుమన్నా, వేడి వల్ల చురుక్కుమన్నా, కడుపులో మంటగా అనిపించినా ఆగబుద్ధికాదు...ఆపబుద్ధి అంతకన్నా కాదు. దేశంలో అనేక రకాల వంటకాలు తయారవుతున్నా ఈ వంటకాలే ఎందుకు ఇంతిలా మనసును, మనుషులను పరుగులెతిస్తాయి ఈ వంటకాలే ఎందుకు గిజగిజలాడిస్తాయి


మిరపకాయను కాని, మిరియం గింజను కాని కొరకగానే మంటపుట్టించే లక్షణం కాప్సాసిన్‌ కారణంగా వస్తుంది. మసాలా దినుసులలో కారం, మిరియం కాక చింతపండు, ధనియాలు, ఆవాలు ఉంటాయి. కారం కారంగా ఏదైనా తింటే బాగుంటుందని నోరు చచ్చిన ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. కొద్దిమంది మాత్రం కారం నోటికి తాకగానే చెమటలు కక్కేస్తారు. మరికొందరికి ముక్కు కూడా కారి పోతుంది. అందుకు కారణం కారం తినగానే సైనస్‌లు, బ్రాంకియల్‌ గొట్టాలు తెరుచుకుంటాయి. అందువల్ల ముక్కు కారడం ఆరంభమవుతుంది. అంతే కాదు ఈ ఘాటుకు కళ్ళ వెంట నీళ్ళు కూడా కారతాయి. ఈ కన్నీరు ముక్కు గూండా ప్రవహించి ముక్కులో శ్వాస క్రియను నిరోధించే చీమిడిని కరిగించి కిందికి తోసేస్తుంది. అందువల్ల ముక్కు ద్వారా గాలి ఆడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆవాలతో కూడిన కారానికి మంట అధికం చేయగల సత్తా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆవపెట్టిన కూరలు, పచ్చళ్ళు, ఆవకాయలు తినగానే కిక్కు ఇస్తాయి. పూర్వ కాలంలో ఆవాలను, కారాన్ని రసాయన బాంబుల తయారీకి వాడేవారు. జలుబుచేసిన వారు, బ్రాంకైటిస్‌తో బాధపడేవారు కారంగా ఉండే ఆహారం ఏదైనా తింటే ముక్కుదిబ్బడ నుంచి తక్షణ విముక్తి కలుగుతుంది. హాట్‌హాట్‌గా, కారం కారంగా ఉండే ఆహారానికి దిబ్బళ్ళు తగ్గించగల బాంబు లాంటి శక్తి ఉంటుంది. బాగా జలుబు చేసిన వారు మంటమండే బామ్‌ రాసుకుని ఆవిరి పట్టుకుని ఉపశమనం పొందడం చూస్తూనే ఉన్నాం. ఈ మొత్తం ఎఫెక్టను హాట్‌ అండ్‌ స్పైసీ ఫుడ్‌ అంది స్తుంది. నరాలను బాగా తెరిచి రక్తప్రసరణ ను పెంచే శక్తి కారానికి ఉంటుంది కనుకనే కారం బాగా తిన్న వారి ముఖం ఎర్రబడుతుంటుంది. మొద్దుబారిపో యినట్టు, స్విచాఫ్‌ అయి పోయినట్టు, నరాలు చచ్చుపడినట్టు, తిమ్మిరి పట్టినట్టు అవుతుంది. అలాంటపðడు మెదడులో కదలిక తెచ్చి సవ్యంగా పనిచేసేలా చేయాలంటే కారం కారంగా ఉంటే ఆహారం తీసుకోవడం ఉత్తమమైన మార్గం. డిప్రెషన్‌, మైగ్రైన్‌ వంటి సమస్యలకు కూడా కారమే బ్రహ్మాండమైన విరుగుడు. అన్నిటికన్నా ముఖ్యంగా బరువు తగ్గ దలచుకున్న వారికి కారం ఎంతో ఉపయోగకారి. నొప్పులు, వాపులు, తీపులు ఆపడంలోనూ కాప్సాసిన్‌ ఎంతగానో ఉపయోగపడు తుందని తాజా పరిశోధనలలో వెల్లడైంది. లోబిపి (తక్కువ రక్తపోటు) ఉన్న వారికి కారం అద్భుతమైన ఔషధంలా ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ సరిగా ఉండేందుకు కారం దోహద కారణమవుతుంది. రక్త ప్రసారాన్ని చక్కదిద్దడం ద్వారా గుండెపై అనవసర భారాన్ని తగ్గిస్తుంది. బిపితో ఉన్న వారు మందులు మానేసి కారాన్ని నమ్ముకోమని దీని అర్థం కాదు కాని కారం రక్తాన్ని ఉరకలెత్తించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.


పాత తరం వారు కారం తినాలంటే భయపడిపోయే వారు. కారం తింటే కడుపులో అల్సర్లు వస్తాయని, గ్యాస్‌ బాధలు వస్తాయని అనే వారు. ఇది కేవలం అపోహ మాత్రమే. కడుపులో పుళ్ళు బాక్టీరియా వల్ల వస్తుందే కాని కారం వల్ల కాదు. అల్సర్‌తో బాధపడే వారు కారం తింటే మంట రావడానికి ఆస్కారం ఉంటుంది. కొందరివి సహజంగానే ఉష్ట దేహాలు. అలాంటి వారు కారం తిన్నపడు ఏమైనా ఇబ్బంది పడితే పడవచ్చు. కానీ ఆ ఇబ్బందికి కారం కారణం కాదు. కారం తింటే చెమటలు పడుతున్నాయంటే, ముక్కు కారిపోతోందంటే అందుకు వారు తినే ఆహారం లో ఉన్న ఇతరత్రా రసాయనాలేవైనా కారణమవు తాయి. ఈ రకమైన ముక్కు సంబంధ ఇబ్బందులు అధికంగా ఉంటే దానికి విరుగుడుగా పనిచేసే మందులు బజార్లో దొరుకుతున్నాయి. వాటిని వాడు కోవచ్చు. ఈ చిన్న ఇబ్బంది కోసం కారం తినడం మానుకో వద్దు. కాప్సాసిన్‌ క్రీములు దొరుకుతున్నాయి. వీటిని నొప్పి నివారక బామ్‌లా పై పూతకు వాడుకోవచ్చు. కాప్సి కమ్‌లో కైన్‌పెప్పర్‌ ఉంటుంది. ఇది వేడిని స్తుంది. దీని వాడడం వల్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్ళు బిగుసు కున్నా, కండరాలు బిగదీసుకున్నా ఇది నయం చేస్తుంది. కాప్సాసిన్‌ క్రీమ్‌ వాడకం వల్ల తక్షణ నొప్పి నివారణ జరుగుతుంది. కొన్ని గంటలపాటు దీని ప్రభావం ఉంటుంది కనుక దాన్ని క్రీడాకారులు, శారీరక శ్రమ అధికంగా చేసే వారు ఎక్కువగా వాడుతుంటారు. ఈ మందువల్ల తాత్కాలిక ఉపశమనమే కలుగుతుంది కాని శాశ్వతమైన నివారణ జరగదు. అయితే శరీరంలోనే నొప్పిని నివారించే వ్యవస్థ ఉంటుంది. దాన్ని ఇది ఉత్సాహపరుస్తుంది కనుక చిన్నా చితకా నొపðలు శాశ్వతంగానే తగ్గే అవకాశాలున్నాయి. మన శరీరంలోని కణాలు నొక్కుకుపోయి స్పర్శ బాగా తగ్గిపోయినపుడు ఈ కాప్సాసిన్‌ మందు దివ్యంగా పనిచేస్తుంది. కాప్సికమ్‌లో ఈ కాప్సాసిన్‌ ఎక్కు వగా ఉంటుంది. దీనికి ఉండే కైన్‌ హీట్‌ లక్షణం నరాలలో రక్తప్రసరణను చక్కదిద్ద డానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ మందుకు గల ఉడుకు దనం వల్ల కాపడం పెట్టినట్టుగా ఉండి నొప్పితో బాధ పడే వారికి ఎంతో ఉపశమ నాన్ని కలిగిస్తుంది. రాత్రి సుఖంగా నిద్రపోడానికి తోడ్పడుతుంది. కనుక కారం అనగానే నోరు మండుతుందని చక్కెర దగ్గ రకు పరుగులు తీయ కండి. కాస్త నోరు మండినా కారమే బెటర్‌. చక్కెరను నమ్ముకుంటే చక్కెర వ్యాధి వచ్చే అవ కాశాలు ఎక్కువగా ఉంటాయి.

సో..కారం తినండి..ఉపకారం పొందండి.
  • ===============================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .