Thursday, December 1, 2011

కామన్‌వెల్త్ డే , Commonwealth Dayగత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (march 2nd Monday) కామన్‌వెల్త్ డే గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

కామన్‌వెల్త్ దేశాలన్నిటిలో ఏటేటా జరుపుకునే ఉత్సవం " కామన్‌వెల్త్ డే " నిజానికి ఈ రోజు గతములో " ఎంపైర్ డే " గా ఉండేది . ఎంపైర్ డే జరపాలన్న ఆలోచన 1894 సంవత్సరము నాటిది . ఇప్పటి రాయల్ కామన్‌వెల్త్ సొసైటి అయిన నాటి రాయల్ కలోనియల్ నిన్‌స్టిత్యూట్ కెనడియన్‌ శాఖ ఎంపైర్ డే జరపాలన్న సూచన చేసింది . ఒంటారియో ఎడ్యుకేషన్‌ మంత్రి '' సెనేటర్ జార్జి డబ్ల్యూ, రోజ భార్య క్లెమెంటినా ఫెసెండెన్‌ ప్రతిఏటా ఎంపైర్ డే నాడు చేయాల్సిన పనులకు సంబంధించి పాఠశాల విద్యార్ధులకు ఒక స్కీమును రూపొందించింది . ఈ ప్రతిపాధనను 1898 లో కెనడియన్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ సమావేశములో ప్రవేశపెట్టగా ఏకగ్రీవం గా అమోదించారు . ఇలా ఎంపైర్ డే ఓ జాతీయ కార్యక్రమమైనది .ఈ రోజున ఆ దేశము లో రాజ్యాధినేతల కీర్తిని, ఘనతను , త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలు ఇస్తారు , జాతీయ పతాకం ఎగురవేస్తారు . అన్నిస్కూళ్ళు , ప్రభుత్వ , ప్రవేటు కార్యాలయాలు , స్వచంద సంస్థలు వారి గతించిన రాజ్య , దేశాధినేతల విషయ విశేషాలను పొగడుతారు , జాతీయ గీతాలను ఆలపిస్తారు . ఇది ఒకరకమైన దేశభక్తి కార్యక్రమము . కెనడియన్‌ స్కూలు పిల్లలు నిర్వహించే ఎంపైర్ డే కార్యక్రమాలు మిగతావానిని ప్రభావితము చేసాయి. ఏటా ఈ ఎంపైర్ డే ను ఒక్క స్కూలు పిల్లలే కాక అందరూ జరుపుకోవాలని ప్రతిపాదించారు .

యునైటెడ్ కింగ్ డమ్‌ లో " లార్డ్ మీథ్ " ఎంపైర్ డే కు ఏక వ్యక్తి ప్రచారముకోసం స్వంతం గా డబ్బు వెచ్చించాడు . ఆయన కృషి ఫలించింది . తొలి ప్రపంచయుద్ధం కాలములో బ్రిటన్‌ లో ఎంపైర్ డే కు అధికారిక గుర్తింపు లభించింది . 1916 మే 24 వ తేదీన తొలిసారిగా ఎంపైర్ డే ను దేశవ్యాప్తం గా జరుపుకున్నారు . 70 వేల స్కూళ్ళు , స్టాక్ ఎక్షేంజ్ వంటి సంస్థలు జెండావందనము చేసి జాతీయ గీతం ను ఆలపించారు . 1921 జనవరిలో ఎంపైర్ డే ఉద్యమాని వీలైనంతగా ముందుకు తీసుకువెళ్ళాలని భావించిన " మీథ్ రాయల్ కలోనియల్ ఇన్‌స్టిట్యూట్ ను లాంచనము గా అహ్వానించారు . ఇన్‌స్టిట్యూట్ సభ్యులతో ఏర్పాటుచేసిన కమిటీ, మీథ్ బృందము కలిసి సంథ భవనాన్ని ఉద్యమ కేంద్రము గా చేసారు . 1927 నుంచి 1929 దాకా ఉద్యమ తొలి అద్యక్షుడు గా మీథ్ కొనసాగాడు . 1901 లో మరణించిన క్వీన్‌ విక్టోరియా జన్మదినం అయిన మే 24 వ తేదీన ఏటా ఎంపైర్ డే ని నిర్వహించాలని నిర్ణయించారు .

1949 లో ఆధునిక కామన్‌వెల్త్ ఆవిర్భవించాక ఆస్ట్రేలియా, బ్రిటన్‌ , సిలోన్‌ , భారత్ , న్యూజిలాండ్ , పాకిస్తాన్‌ , దక్షిణాఫ్రికా , కెనడా దేశాధిపతులు లండన్‌ లో సమావేశమై ఎంపైర్ డే గురించి చర్చించారు . ఫలితంగా అప్పటిదాకా కొనసాగిన ఎంపైర్ డే 1958 నుండి బ్రిటిష్ కామన్‌వెల్త్ డే గా మారినది . తరువాత 1966 లో కామన్‌వెల్త్ డే గా రూపాంతరము చెందినది . పాత పోకడలు , చరిత్రతో నిమిత్తము లేకుందా సరికొత్త కామన్‌వెల్త్ డే నిర్వహించాలని నిర్ణయించారు . అదే ఏడాది యునైటెడ్ కింగ్డమ్‌ లో జూన్‌ పదో (జూనె 10)తేదీన కామన్‌వెల్త్ డే కోసం తాత్కాలికం గా నిర్ణయించారు .ఆ రోజూ క్వీన్‌ ఎలిజబెత్ జన్మదినము . 1975 లో జమైకాలోని కింగ్స్టన్‌ లో జైగిన ప్రభుత్వాధినేతల సమావేశము లో కెనడియన్‌ ప్రతినిధులు సహకారము , సామరస్య ప్రపంచ వతావరణాలపై దృష్టిసారిస్తూ కాన్‌వెల్త్ డే ను ఒకేసారి నివహించాలని ప్రతిపాదించారు . మార్చి 2 వ సొమరారము కానన్‌వెల్త్ డే నివహించాలని 1976 లో నిర్ణయించారు .

ప్రస్తుతము కామన్‌వెల్త్ దేశాలన్నింటిలొనూ విభిన్న మార్గాలలో కామన్‌వెల్త్ డే ను నిర్వహిస్తున్నారు . 1994 నుంది నిర్వహణ " థీమ్‌ " మారింది . 2008 లో కామన్‌వెల్త్ డే గా క్యాలండర్ లో చోటుచేసుకుంది .

Commonwealth Day Themes
Year Theme
2011 Women as Agents of Change
2010 Science, Technology and Society
2009 Commonwealth@60 - Serving a New Generation
2008 The Environment, Our Future
2007 Respecting Difference, Promoting Understanding
2006 Health & Vitality
2005 Education - Creating Opportunity, Realising Potential
2004 Building a Commonwealth of Freedom
2003 Partners in Development
2002 Diversity
2001 A New Generation
2000 Sharing Knowledge - The Communications Challenge
1999 Music
1998 Sport Brings Us Together
1997 Talking to One Another
1996 Our Working Partnership
1995 Our Commonwealth Neighbourhood - Working Together for Tolerance and Understanding

In 1983 Commonwealth Day --కొన్ని కామన్‌వెల్త్ దేశాలు :

* Aitutaki * Anguilla * Antigua and Barbuda * Australia * The Bahamas * Bangladesh * Barbados * Barbuda * Belize * Botswana * British Virgin Islands
* Brunei * Canada * Cayman Islands * Cook Islands * Cyprus * Commonwealth of Dominica * Falkland Islands * Fiji * The Gambia * Ghana
* Gibraltar * Grenada * Guyana * Hong Kong * India * Jamaica * Kenya
* Kiribati * Lesotho * Malawi * Malaysia * Malta * Mauritius * Nevis * New Zealand * Nigeria * Niue * Pakistan * Papua New Guinea * Penrhyn *Island * Pitcairn Islands * St Kitts * Saint Lucia * St Vincent & the Grenadines
* Samoa * Seychelles * Sierra Leone * Singapore * Solomon Islands * Sri Lanka * Swaziland * Tanzania * Tonga * Trinidad & Tobago * Turks & Caicos
* Tuvalu * Uganda * United Kingdom * Vanuatu * Zambia * Zimbabwe

  • మూలము : http:wikipedia.org/

  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .