Sunday, November 20, 2011

world fisheries day , ప్రపంచ మత్స్యకార దినోత్సవం

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (Nov 21) ----- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


జాతీయ స్ధాయిలో మూడుసార్లు నిర్వహించిన ఉత్సవాలకు యానాం వేదిక కానుంది. సముద్రపు ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే మూడోస్ధానంలో ఉన్న భారతదేశం మత్స్య పరిశ్రమలకు సంబంధించి అనేక రకాల ఉత్పత్తులు వాటిలభ్యత వినియోగం లాభాలను ప్రదర్శిస్తారు. చేపల వంటకాలు, ఆరోగ్య పరిస్ధితులపై ప్రజలకు వివరిస్తారు. ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో వివిధ రకాల సముద్ర వంటకాలను
అగ్నికుల క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. అనంతరం మత్స్యకార కార్యాలయం నందు తాలుకా మత్స్యకార సొసైటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మత్స్యకారుల ఐక్యత కొరకు పలు తీర్మాణాలు చేశారు

దేశ విదేశాలకు యానాం ఖ్యాతిని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని 2010 ఫాన్‌ఫిష్‌ ఫెస్టివల్‌ను ప్రతిష్టాత్మకంగా నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ ఫిషర్‌మెన్‌ వెల్పేర్‌ ఆఫ్‌ పుదుచ్ఛేరిలు సంయుక్తంగా ఈ కార్యక్రమాలను యానాంలో నిర్వహించుకోగలిగామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలకు యానాం అంటే ఏమిటో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. విస్తీర్ణానికే యానాం ప్రాంతం చిన్నదిగాని ఆలోచనలకు కాదని ఆయన ఉద్ఘాటించారు. మల్లాడి కృష్ణారావు 21సంవత్సరాల రాజకీయ జీవితంలో మత్స్యకారుల కోసం 47 స్కీమ్‌లు తీసుకువచ్చారని, దీనిలో ప్రధానంగా 50సంవత్సరాలు నిండిన మత్స్యకారునికి ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పుదుచ్ఛేరి ద్వారా నెలకు రూ.700 పింఛన్‌ ఇచ్చే విధంగా తీసుకువచ్చానని, 2011 సంవత్సరానికి దీన్ని రూ.900కు పెరిగేలా ప్రణాళికను సిద్ధం చేశానన్నారు.

అలాగే వేట నిలుపుదల సమయాల్లో, వరదలు, సునామీలు, అధిక వర్షాల సమయాల్లో ప్రభుత్వం మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం, దీంతో మత్స్యకారులు వేట లేకుండా పది పదిహేను రోజులు ఇళ్ల వద్దనే ఉండిపోవడం జరుగుతుందన్నారు. ఈ సమయాల్లో వారికి ప్రభుత్వం తరపున రూ.2,700 ఇచ్చేలా జిఓ. తీసుకువచ్చామని ఆయన తెలియజేశారు. అంతేగాకుండా మత్స్యకారులకు వేట నిమిత్తం పడవులు, ఉండడానికి ఇళ్లు, తినడానికి తిండి, బట్ట, విద్య, వైద్య సదుపాయాల్లో ఎన్నో జీఓ.లు తీసుకువచ్చినట్లు ప్రపంచ మత్స్యకార దినోత్సవ ముగింపు సభలో ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మత్స్యకార గ్రామాలకు కనీస వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి అవసరమైన రోడ్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులు కల్పించేందుకు కలెక్టర్‌ దృష్టి సారించాలని సభాముఖంగా తెలియజేశారు.

ఇందిరా గాంధీ ఒక ప్రత్యేక బిల్లును పార్లమెంట్ వరకు తీసుకురాగలిగిందని, దురదృష్టవశాత్తూ ఆ బిల్లు ఇంత వరకు పాస్ కాలేదని అన్నారు. ప్రభుత్వం మత్స్యకారులను రైతులుగా పరిగణించి ప్రకృతి వైఫరీత్యాల సమయంలో రైతులను ఆదుకున్న విధంగానే మత్స్యకారులను ఆదుకోవాలని, దీనికి సంబంధించి పార్లమెంట్‌లో మత్స్యకారుల తరపున వాదన వినిపించాలని కోరారు. . ఇటువంటి మత్స్యసంపద దినోత్సవాలను ప్రతీ రాష్ట్రం నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ మత్స్యసంపద దినోత్సవాలు నిర్వహించడం ద్వారా మత్స్యకారుల్లో చైతన్యం పెరుగుతుందని అన్నారు.


  • =========================================


Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .