గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబర్ 07న) --Child protection day(చైల్డ్ ప్రొటెక్షన్ డే),శిశు సంరక్షణ దినము- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము..
- Child protection day(చైల్డ్ ప్రొటెక్షన్ డే),శిశు సంరక్షణ దినము
తల్లిగర్భంలో నుంచి పేగుబంధంతో బయటకు వచ్చే చిన్నారి... పేగు తడి ఆరకముందే చనిపోతే ఆ తల్లి శోకాన్ని తీర్చడం ఆ భగవంతుడికీ సాధ్యం కాదు. ఏటా లక్షల సంఖ్యలో తల్లులు ఇలా పొత్తిళ్ళలోనే బిడ్డలను కోల్పోతున్నారు. అత్యాధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులో ఉన్న నేటి రోజుల్లోనూ ఇలా జరగడం విస్మయపేర్చే అంశం. ఇలా చోటు చేసుకునే మరణాల్లో అత్యధికం నివారించదగ్గవే అరుునా... వైద్యసౌకర్యాల లేమి, సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం... ఇలా ఎన్నో కారణాలు నవజాత శిశువులను బలి తీసుకుంటున్నారుు. ఏటా నవంబర్ 7న చైల్డ్ ప్రొటెక్షన్ డే. 15-21 తేదీల్లో వారం రోజుల పాటు న్యూ బార్న్ వీక్ పేరిట ఈ అంశంపై అవగాహన పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి . అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యధిక సంఖ్యలో శిశుమరణాలు మన జాతికే మచ్చగా మారుతున్నారు.
-కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో 48 గంటల్లో 12 మంది చిన్నారుల మృతి.... వెంటిలేటర్‌పై మాడిమసైన శిశువులు....ఇలాంటి వార్తలు చదివితే కంట నీరు పెట్టని కఠినాత్ములుండరు. సంక్షేమ రాజ్యంలో ప్రజల కనీసావసరాలు తీరేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదే. మరీ ముఖ్యంగా పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ నైతిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. ఆ బాధ్యత తనది కాదనే ప్రభుత్వం ఉన్నా, లేకున్నా ఒకటే. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన నిమిషాల్లో, గంటల్లో లక్షల సంఖ్యలో చిన్నారులు మరణించడం దేనికి నిదర్శనం? ఇదేనా మనం సాధించిన ప్రగతి? పొత్తిళ్ళలోని బిడ్డలను కాపాడుకోలేమా? లక్షలాది తల్లుల కన్నీళ్ళను తుడవలేమా? స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినా పేదలకు ఉచితవైద్యం అందించలేని దౌర్భాగ్య స్థితిలో దేశం ఉండటాన్ని ఏమనుకోవాలి..?
ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది చిన్నారులు మరణిస్తున్నారు. వీరిలో 98 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారే. ఇందులో పది లక్షల మంది ఏడాది కాలంలోనే తనువు చాలిస్తున్నారు. దేశంలో ఏటా 2.5 కోట్ల మంది చిన్నారులు జన్మిస్తున్నారు. ఇందులో పది లక్షల మంది ఏడాది కాలంలోనే తనువు చాలిస్తున్నారు. దేశంలో ఇప్పటికీ 70-80 శాతం జననాలు ఇంట్లో లేదా సరైన వసతులు లేని ఆసుపత్రుల్లో చోటు చేసుకుం టున్నాయి. శిక్షణ పొందని వారే అధిక సంఖ్యలో కాన్పులు చేస్తున్నారు. దీంతో మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. సరైన వైద్యసదుపాయాలు ఉన్న కేంద్రాల్లోనే కనీసం 80 శాతం జననాలు జరిగేలా చూసేం దుకు ప్రభుత్వం సంకల్పించింది.
అదే సమయంలో నూటికి నూరు జననా లు .. శిక్షణ పొందిన వారి చేతుల మీదుగా జరిగేలా చూడాలని కూడా ప్రభు త్వం భావిస్తోంది. జాతీయ స్థాయిలో శిశుమరణాల రేటును 1000కి 30గా తగ్గించాలని కూడా యోచిస్తోంది. సుమారుగా 12 ఏళ్ళుగా దేశంలో ఏటా నవంబర్ 15-21 మధ్య న్యూ బార్న్ వీక్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభు త్వం, కుటుంబ ఆరోగ్యం, సంక్షేమ మంత్రిత్వశాఖ, యునిసెఫ్‌లతో కలసి నేషనల్ నియోనాటాలజీ ఫోరమ్ ఈ వారోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
ఈ వారోత్సవాలను ఎందుకు నిర్వహిస్తున్నారంటే...
శిశుమరణాల్లో నవజాత(శిశువు పుట్టిన తరువాతి నెల రోజుల కాలాన్ని నవజాత శిశు కాలంగా పరిగణిస్తుంటారు) శిశువుల మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఈ మరణాలను అరికట్టగలిగితే శిశుమరణాలను చాలా వరకు తగ్గించవచ్చు. శిశుమరణాల గత దశాబ్ది కాలంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ నేటికీ ఈ సంఖ్య అధికంగా ఉంది. ఈ మరణాల్లో అధిక శాతం నవజాత శిశువులవే.
* దేశంలో ప్రస్తుతం శిశుమరణాల రేటు 1000కి 70గా ఉంది. పుట్టిన పిల్లల్లో ప్రతీ 1000 మందిలో 70 మందికి ఏడాదికే నూరేళ్ళూ నిండుతున్నాయి.
* ఇలా మరణిస్తున్న వారిలో మూడింట రెండు వంతుల మంది పుట్టిన నెలరోజుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఏటా 2.50 కోట్ల మంది చిన్నారులు జన్మిస్తుంటే, వీరిలో 12 లక్షల మంది మొదటి నెలలోనే మరణిస్తున్నారు. యావత్ ప్రపంచంలో నవజాత శిశుమరణాల్లో నాలుగో వంతు భారత్‌లోనే చోటు చేసుకుంటున్నాయి.
* శిశువు పుట్టిన తరువాతి నెల రోజుల కాలాన్ని నవజాత శిశు కాలంగా పరిగణిస్తుంటారు. నవజాత శిశు మరణాల్లో మూడింట రెండు వంతులు పుట్టిన మొదటి వారంలోనే చోటు చేసుకుంటున్నాయి.
తక్కువ బరువుతో పుట్టే శిశువులు
2.5 కిలల కన్నా తక్కువ బరువుతో పుట్టే శిశువులను లో-బర్త్ వెయిట్ బేబీస్‌గా వ్యవహరిస్తుంటారు. 1.5 కిలోల కన్నా తక్కువ బరువుతో పుట్టే వారిని వెరీ లో బర్త్ వెయిట్ బేబీస్‌గా వ్యవహరిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కిలో కంటే తక్కువ బరువుతో కూడా పిల్లలు పుడుతుంటారు. మన దేశంలో పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం అత్యంత సాధారణం. నవజాత శిశువుల్లో మూడో వంతు మంది తక్కువ బరువుతో పుడుతుంటారు.
తక్కువ బరువుతో పుట్టేందుకు గల కారణాలు:
* తల్లి సరిగా పోషకాహారం తీసుకోకపోవడం,
* అధిక రక్తపోటు, రక్తహీనత, ఇన్‌ఫెక్షన్లు,
* తల్లి పొగాకు వినియోగించడం,
* మహిళల్లో అక్షరాస్యత తక్కువగా ఉండడం,
* చిన్నవయస్సులోనే గర్భధారణ,
* తరచూ గర్భం దాల్చడం,
* గర్భధారణ సమయంలో సరైన జాగ్రత్తలు వహించకపోవడం,
వీటన్నింటిని కూడా మహిళల్లో అవగాహన పెంచడం ద్వారా నివారించే వీలుంది. నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణలో ఈ విధమైన అవగాహన ఎంతో కీలకపాత్ర వహిస్తుంది. మరీ ముఖ్యంగా ఈనాటి ఆడపిల్లలే రేపటి తల్లులు కాబట్టి వారి ఆరోగ్యం విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో యావత్ సమాజంలో అవగాహన పెంచాలి.
నవజాత శిశువులకు అవసరమైన సంరక్షణ--నవజాత శిశువులకు అవసరమైన సంరక్షణను అందించడం మరీ వ్యయం తో కూడుకున్నదేమీ కాదు. అత్యాధునిక ఉపకరణాలు అవసరం లేదు.
కనీస జాగ్రత్తలు:
- * తల్లి సరైన రీతిలో పోషకాహారం తీసుకునేలా చూడడం, రక్తహీనతకు చికిత్స, టి.టి ఇమ్యునైజేషన్,
- * శిక్షణ పొందిన వారిచే ప్రసవం అయ్యేలా చేయడం,
- * అప్పుడే పుట్టిన శిశువులను వెచ్చగా ఉంచడం,
- * పుట్టిన తరువాత వీలైనంత త్వరగా ఆరంభించి, కనీసం ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వడం,
- * తల్లీబిడ్డలకు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా చూడడం, వీలైనంత త్వరగా చికిత్స అందించడం,
- * వ్యాధి లక్షణాలను వీలైనంత త్వరగా గుర్తించి, చికిత్స అందించడం,
- * క్షేమకరంగా తల్లీబిడ్డల తరలింపు,
‘ఆశ’ ఫలించేనా?
-నవజాతశిశువులకు సంబంధించి మరణాల రేటు యావత్ ప్రపంచంలోనూ భారత్‌లోనే అధికంగా ఉండడం ప్రజాస్వామిక ప్రభుత్వానికే సిగ్గుచేటు. ప్రజల పట్ల ప్రభుత్వం కనబర్చే శ్రద్ధను ఈ గణాంకాలు వెల్లడిస్తాయి. నవజాత శిశువుల ఆరో గ్యాన్ని కాపాడేందుకు కేంద్రం వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశా) పథకం వీటిలో ఒకటి. దీని కింద, ఆశా వర్కర్లు, తమ పరిధిలో ప్రసవించిన తల్లుల ఇళ్ళలను 42 రోజుల వ్యవధిలో ఆరు సార్లు సందర్శించాల్సి ఉంటుంది. తల్లి సురక్షిత విధానాలను అవలంబించేందుకు, పిల్లల్లో ఏవైనా వ్యాధి లక్షణాలు కన్పిస్తే ఆసుపత్రులకు రెఫర్ చేసేందుకు ఈ సందర్శనలు తోడ్పడుతాయి.
గుర్తించిన ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఎలాంటి వ్యయం లేకుండా శిశువులకు ఆరోగ్యసంరక్షణ అందించేందుకు ఈ పథకం తోడ్పడుతుంది. ఆశా కార్యకర్తలు తాము సందర్శించిన ప్రతీ ఇంటికి (నవజాత శిశువులు ఉండే) రూ. 250 లను 42 రోజుల తరువాత పొందుతారు. ఈ కాలంలో వీరు ఎంసీపీ (మెటర్నల్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్) కార్డుల్లో శిశువు బరువును, వారికి ఇచ్చిన టీకాల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. బిడ్డ పుట్టిన 3,7,14, 21, 28, 42 రోజుల్లో వీరు ఆయా ఇళ్ళను సందర్శించి వివరాలు సేకరించాలి. 2009 నాటి గణాం కాల ప్రకారం దేశంలో 8.84 లక్షల మంది శిశువులు పుట్టిన 28 రోజుల్లోనే మరణిస్తు న్నారు.
ఇందులో 7.02 లక్షల మంది పుట్టిన వారం రోజుల్లోనే ప్రాణం కోల్పోతున్నారు. మొత్తం శిశు మరణాల్లో 68 శాతం పసికందుల మరణాలే. మొత్తం మీద శిశుమరణాల్లో తగ్గుదల కన్పిస్తున్నప్పటికీ, నవజాత శిశుమరణాల శాతంలో మాత్రం పెద్దగా తేడా లేదు. దీంతో ఈ నవజాత శిశుమరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. 1990 -2009 మధ్య కాలంలో నవజాత శిశుమరణాల్లో 33 శాతం తగ్గుదలను భారత్ సాధించగలిగింది. అప్పటికీ ఏటా సుమారు 9 లక్షల మంది చిన్నారులు దేశంలో మరణిస్తూనే ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 1990లో నవజాత శిశుమరణాల రేటు 49 (ప్రతీ 1000కి)గా ఉంది. 2009 నాటికి ఇది 34గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 33 లక్షల మంది నవజాతశిశువులు మరణిస్తున్నట్లు అంచనా. అత్యంత తక్కువ వ్యయంతో, చాలా సందర్భాల్లో ఎలాంటి వ్యయం లేకుండానే వీరిలో అత్యధికులను కాపాడే అవకాశం ఉన్నా అలా చేయలేకపోతున్నాం. బిడ్డ పుట్టిన తొలి నాలుగు వారాలు అత్యంత కీలకమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నేడు భారత్‌తో సహా ఎన్నో దేశాలు రక్షణ కోసం రూ. వేల కోట్లు వ్యయం చేస్తున్నాయి. శాంతియుత వాతావరణం నెలకొల్పి, రక్షణ వ్యయంలో కొద్దిశాతాన్ని తగ్గించుకున్నా, ఎన్నో ఆసుపత్రులను ఏర్పాటు చేయవచ్చు. కొన్ని లక్షల ప్రాణాలను కాపాడవచ్చు. దేశంలోని అపర కుబేరులు ఈ అంశంపై దృష్టి సారిస్తే శిశుమరణాలను తగ్గించే అవకాశం ఉంది. తల్లీబిడ్డల పేగుబంధం తెగిపోకుండా చూడవచ్చు.
మనదేశంలో నవజాత శిశు మరణాలకు ప్రధాన కారణాలు
- * ఇన్‌ఫెక్షన్ - 52 శాతం
- * ప్రాణవాయువు సరిగా అందకపోవడం - 20 శాతం
- * నెలలు నిండకముందే పుట్టడం - 15 శాతం
- * పుట్టుకతోనే లోపాలు, ఇతరత్రా కారణాలు- 13 శాతం
- * వీటిలో చాలావరకు నివారించదగ్గవే అయినా, నివారించలేక పోవడం విచారదాయకం.
నవజాత శిశువుల ఆరోగ్యం సరిగా ఉండాలంటే..
- * గర్భధారణ కాలంలో లోపలి శిశువు ఆరోగ్యాన్ని దెబ్బ తీసే వివిధ అంశాల గురించి గర్భిణులకు అవగాహన కల్పించడం,
- * గర్భధారణ కాలంలో కనీస సంరక్షణ అందించడం, పోషకారంపై సూచనలు అందించడం,
- * ప్రసవాలు తగు సదుపాయాలు గల ఆసుపత్రుల్లో లేదా శిక్షణ పొందిన వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో జరిగేలా చూడడం,
- * నవజాత శిశువులకు అవసరమైన సంరక్షణ అందించడం,
- * నవజాత శిశువుల్లో ఉండే అనారోగ్యాలను సత్వరమే గుర్తించి, నిర్ధారించి, తగు చికిత్స అందించడం,
- భారత్‌లో.... నర్గీస్
- కోల్‌కతా దారుణం
- డానియా జననంతో ప్రపంచ జనాభా 700 కోట్లు
కొత్తగా వాడుకలోకి వచ్చిన రోగ నిరోధక మందులు--అనగా హెపటై టిస్-ఎ వ్యాక్సిన్ (నీటి ద్వారా సంక్రమించే పచ్చకామెర్లు), హెప్-బి వ్యాక్సిన్ మరియు వెరిసెల్లా (ఆట లమ్మ / చికెన్ పాక్స్) రోగ నిరోధక మందు లు పిల్లల వైద్యనిపుణులు వాడుటలో ఒక వైద్యునికి మరో వైద్యునికి చాలా వైరుధ్యం వుంటుంది. పిల్లల తల్లిదండ్రులతో పిల్లల వైద్యనిపుణులు చర్చించి వీటిని వాడాలి. ప్రస్తుతం దేశంలో ఇప్పుడు అమలులో వు న్న రోగ నిరోధక మందుల కార్యాచరణ ప్రణాళికలో పైన పేర్కొన్న రోగ నిరోధక మందులను ఇంకా చేర్చలేదు. ఈ రోగ నిరో ధక మందుల ఖరీదు, పిల్ల వాని వయస్సు, తల్లి దండ్రుల ఇబ్బందులు, వీటి వాడకం లో పిల్ల వానికి వచ్చే ప్రమాదాలు, వైద్యుడు, పిల్లవాని తల్లిదండ్రుల మధ్య చర్చల అనంతరం తీసుకున్న నిర్ణయం మొదలైన అంశాల ఆధారంగా వివేచనతో వీటిని వాడాలి.
సంక్షిప్త పదాలు: బి సి జి = బేసిలస్ కాల్ మేట్ గ్యారిన్, ఒ పి వి = ఓరల్ పోలియో వైరస్ వ్యాక్సిన్ అనగా నోటిలో వేసే పోలియో చుక్కలు , డి టి డబ్ల్యుడి = డిఫ్తిరియా,టెటనెస్, హొల్ సెల్ పెర్టుసిస్, డి టి = డిఫ్తిరియా, టెటనెస్ టాక్సాయిడ్, టి టి = టెటనెస్ టాక్సాయిడ్, హెప్ బి = హెపటైటీస్ బి వ్యాక్సిన్, ఎమ్ ఎమ్ ఆర్ = మిజిల్స్, మమ్స్, రుబెల్లా వ్యాక్సిన్, హిబ్ = హెమోఫిలస్ ఇన్ ఘ్ల ఎంజా టైప్ బి వ్యాక్సిన్, ఐ పి వి = ఇన్ యాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్, టి డి = టెటనెస్,డిఫ్తిరియా టాక్సాయడ్ తగ్గించిన మోతాదు, టి డాప్ = టెటనెస్,డిఫ్తిరియా యొక్క తగ్గించిన మోతాదు, యేసెల్యులర్ పెర్టుసిస్, హెచ్ పి వి = హ్యుమన్ పెపిల్లోమా వైరస్ వ్యాక్సిన్, పి సి వి = న్యూమోకోకల్ కంజుగేట్ వ్యాక్సిన్, డిటాప్ = డిఫ్తిరియా, టెటనస్, యేసెల్యూలర్ పెర్టుసిస్ వ్యాక్సిన్, పిపివి 23 = 23 వేలంట్ న్యూమోకోకల్ పోలీ సేకారైడ్ వ్యాక్సిన్ .
- source : Surya Telugu Newspaper
- =========================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .