Saturday, October 22, 2011

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం,police-martyrs-day
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (అక్టోబర్‌ 21) -పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం,police-martyrs-day- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


అక్టోబర్‌ 21వ తేదీ పోలీసు శాఖలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న దినం. భారత చైనా సరిహద్దులోని లడక్‌ ప్రాంతంలో గల హాట్‌ స్ప్రింగ్స్‌ అనే ప్రదేశంలో 1959 అక్టోబర్‌ 21న చైనా సైనికులు దాడి చేసిన సంఘటనలో 10 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్‌లు నేలకొరిగారు. అప్పటి నుంచి వారిని స్మరించుకుంటూ ప్రతి యేటా అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల స్మారక దినంగా జరుపు కుంటూరు .విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పోలీసు శాఖ పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపు కోవడం ఆనవాయితీగా వస్తుంది. విధి నిర్వహణలో తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన వారికి యావత్‌ పోలీసు శాఖ ఘనంగా నివాళులు అర్పించి, వారి ఆశయ సాధన కోసం పని చేస్తామని ప్రతిన భూనడానికి పోలీసుల అమరవీరుల దినోత్సవం వేదికగా నిలుస్తోంది.

రక్షకభటులు తమ ప్రాణాలకు తెగించి సమాజ రక్షణకు పాటుపడుతూ ఉంటారు. ఖాకీ యూనిఫాంలో ప్రజలకు సహజమితృలుగా కనిపించే పోలీసులను చూస్తే కొండత ధైర్యం ఆపదలో వున్నవారికి కలుగుతుంది. పోలీసులు కూడా కట్టుకున్న వారిని, కన్న పిల్లలను విడిచి విధి నిర్వహణ పరమావధిగా భావిస్తూ ప్రాణాలను తణప్రాయంగా త్యాగించి సంఘటనలు కోకొల్లలుగా వుంటాయి. అమరజవానుల బలిదానంను స్మరించుకోవలసిన క్షణాలు ఇవి. చైనా యుద్దం నుంచి నేటి అతర్గత భద్రత కోసం సాయుధసంఘర్షణలో ప్రతి నిత్యం చావుబ్రతుకుల మధ్య పోరాటం సాగిస్తూనే వున్నారు. ధర్మ సంరక్షణార్థం సమాజ వనానికి కంచెలుగా నిలిచి నిలువెత్తు ప్రాణాలను తృ ణపాయంగా అర్పించిన వారి సేవలకు నివాళులర్పించాల్సిన రోజే అమరవీరుల సంస్మరణ దినోత్సవం. వేసుకున్న ఖాకి దుస్తుల చాటున కారుణ్యం, కన్నీరు దాగి ఉన్న వత్తి ధర్మానికి తలొగ్గి దైర్యసహసాలు ప్రదర్శించి వారి ప్రాణాలను తణ ప్రాయంగా పెట్టి ప్రజా రక్షణలో అమరులైన పోలీసులకు జోహార్లు. అసాంఘిక శక్తులను అనిచివేయడానికి పోలీసులు నిరంతరం కషి చేస్తూ విధి నిర్వహణలో సమిదలవుతున్నారు.

పోలీసు అమరవీరుల దినోత్సవ ఆవిర్భావం ఇలా :
భారత చైనా సరిహద్దులోని లడక్‌ ప్రాంతంలో గల హాట్‌ స్ప్రింగ్స్‌ అనే ప్రదేశంలో 1959 అక్టోబర్‌ 21న చైనా సైనికులు దాడి చేసిన సంఘటనలో 10 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్‌లు నేలకొరిగారు. అప్పటి నుంచి వారిని స్మరించుకుంటూ ప్రతి యేటా అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల స్మారక దినంగా జరుపుకుంటూ దేశ వ్యాప్తంగా శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.

త్యాగాలకు ఫలితం శూన్యం
అనునిత్యం అప్రమత్తంగా ఉండి శాంతి భద్రతలను కంటికి రెప్పలా కాపాడి విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు తగిన సహాయం అందించటలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ అమర వీరుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్మరణ దినం రోజు మాత్రమే గుర్తుకు వస్తున్నామని మళ్లీ ఏడాది వరకు తమ కుటుంబాలను పట్టించుకునే వారు ఉండరని బోరున విలపిస్తున్నారు. కొందరికి ఆర్థిక సహాయం అందకపోగా మరికొందరికి ఉద్యోగం ఇవ్వలేదని, మరికొందరి పిల్లలకు ఉన్నత చదువులకు సహాయం అందించడం లేదని ఆవేదన చెందుతున్నారు. నక్సలైట్ల దాడిలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందే సహాయం నేటి వరకు అందలేదన్నది నిజం. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తీవ్రవాద, ఉగ్రవాద దాడులతో పాటు అసాంఘిక శక్తుల దాడిలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన వారిని సదా స్మరించుకుందాము .

=========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .