Monday, October 3, 2011

అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం , international day of Conservation of Natural Resources



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (12th December) -అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకుగాను, దీనిపట్ల ఆందోళన వ్యక్తపరుస్తూ... 100కు పైగా దేశాలు పాల్గొన్న ఒక పెద్ద సమావేశం అమెరికాలో జరిగింది. ఈ సమావేశంలో భారత ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం 29-12-1993న జరిగింది. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ రోజును ‘అంతర్జాతీయ జీవ వైవిధ్య దినంగా పాటిస్తారు.

మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అంతరిస్తున్న జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం సమష్టి బాధ్యత . ఒకప్పుడు ఉన్న లక్షలాది జీవజాతులు నేడు భూమిపై కనుమరుగై పోయాయి . అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డు, జాతీయ బయో డైవర్సిటీ అథారిటీలు సంయుక్తంగా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిసారు .సాంకేతిక పరిజ్ఞానం విచ్ఛలవిడిగా విస్తరిస్తుండడం, వాయు, శబ్ధ కాలు ష్యాలు పెరిగిపోవడం వల్ల పశు పక్ష్యాదులు నానాటికీ కనుమరుగవు తున్నాయి . చివరికి కొన్ని రకాల చీమలు కూడా కనిపించకుండా పోవడం భవిష్యత్‌ పరిణామాలకు అద్దం పడుతున్నాయి . రాష్ట్రంలో రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత చదువులు చదవి విదేశాల్లో స్థిరపడు తున్నారని, ఫలితంగా వ్యవసాయరంగంపై ఆసక్తి తగ్గిపోయి జీవ వైవిధ్యం అంతరించిపోతుందని ఆందోళ న వ్యక్తం చేయడం అనివార్యమవుతుంది . నేడు అనేక జీవజాతులు అంతరించి పోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణము .జీవ వైవిధ్యాన్ని పరిరక్షించా ల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది . ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న అటవీ సంపదలో 12 శాతం మన దేశంలోనే ఉన్నాయి . 5,727 రకాల చెట్లు మనకే సొంతం , వాటిని నేడు సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది . ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో జీవ వైవిధ్య ఉత్సవాలు జరుగుతున్నాయి . మానవాళికి ప్రకృతి, జీవ వైవిధ్యం రెండు కళ్ళ లాంటివి . ఈ సందర్భంగా జీవ వైవిద్యంలో చురుకైన పాత్ర పోషిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులకు పురస్కారాలను అందజేస్తారు .
ఆకట్టుకున్న పండ్లు, పశు ప్రదర్శన--అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవం సందర్భంగా బయో డైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పండ్లు, పశు ప్రదర్శన ఎంతోమందిని ఆకట్టుకున్నది .. మేలు రకం ఒంగోలు జాతి పశువులు, సాంప్రదాయ పంటలు, విత్తనాలు, సుమారు 37 రకాల మామిడిపండ్లు, అంతరించిపోతున్న అనేక రకాల జీవజాలాన్ని ప్రతిబింబించే విధంగా స్టాళ్ళను ఏర్పాటు చేస్తారు . అనేకమంది ఈ స్టాళ్ళను సందర్శిస్తారు .

జీవవైవిద్య దినోత్సవ సభలో వక్తలు

అడవులు, జీవ, జలరాశులను ఇప్పటికైనా పరిరక్షించుకోనట్లయితే రాబోయే రోజుల్లో మానవ జాతి మనగడకే ముప్పు వాటిల్లుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పేరుతో మనం ఇప్పటికే ఎంతో విలువైన ప్రకృతి సంపదను కొల్పోయామని, అయినా ఇప్పటికీ ఎంతో మిగిలివున్న వన సంపందను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషిపైనా ఉందన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జూబ్లీ హాల్‌లో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ జీవవైవిధ్య మండలి, అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి మధుకర్‌ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటవీ, పర్యావరణశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామారాజు, ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి పాల్గొన్నారు. అతిథులుగా సూర్యాపేట ఎమ్మెల్యే ఆర్‌. దామోదర్‌రెడ్డి, ఎపి జీవ వైవిధ్య మండలి చైర్మన్‌ డా. హంపయ్య, మెంబర్‌ సెక్రటరి డా. ఎస్‌.ఎన్‌.జాదవ్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ అధికారి ఫారూక్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అరుదైన జాతుల ఆవులు, ఎద్దులతో పాటు పండ్లు, ఆహార ధాన్యాల ప్రదర్శన ఏర్పాటు
చేశారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లా డుతూ అడవులను ఇష్టానుసారంగా నరకి వేయడంతో పర్యావర ణం దెబ్బతిని సకాలంలో రుతు పవనాలు రాక, వర్షాలు కురవ డంలేదన్నారు. అకాల వర్షాలు తుపాన్ల వల్ల అతివృష్టి, అనావృష్టి విపత్తు పరిస్థితి మనం సృష్టించుకున్నదేనని అన్నారు.

విజయ రామరాజు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యం దెబ్బ తినడమే ఇప్పుడు సంభవిస్తున్న భూ ప్రళయాలకు కారణమని తెలిపారు. అభివృద్ధి పేరుతో విలువైన అడవులు, జల జీవరాశులను నాశ నం చేయడంతో మన దేశంలో అరుదైన చిరుతపులి లాంటి జంతు, పక్షి, వృక్ష అనేక జాతులు అంతరించి పోయాయని, ఇది మానవ జాతి మనుగడకు ఒక హెచ్చరిక వంటిదన్నారు. రాబోయే తరాలు ఇబ్బందుల పాలుకాకుండా ఇప్పటికైనా మన మందరం ప్రకృతి పర్యవారణాన్ని కాపాడాలని ఆయన పిలుపు నిచ్చారు. దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ
పరిరక్షణకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాల్సిదేనాన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో చెట్లను నరకాల్సి వచ్చినప్పుడు ఒక్క చెట్టు స్థానాంలో పది చెట్లు నాటే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా మన దేశానికే గర్వ కారణమైన ఒంగోలు జాతి గిత్త సంతతిని కాపాడడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శిం చారు. 1960 లో లక్షల్లో ఉన్న ఈ జాతి గిత్తలు నేడు వేల సంఖ్యలోకి పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గిత్త జాతిని రైతులకు విరివిగా అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. హంపయ్య, మధుకర్‌ రాజులు మాట్లాడుతూ ఈ భూమి ఏర్పడి 350 కోట్ల సంవత్సరాలు అవుతుండగా, ప్రపంచ వ్యాప్తంగా 1కోటి 40 లక్షల జీవ రాశులు ఉండగా 80 లక్షలు మాత్రమే గుర్తించినట్లు చెప్పారు. అందులో మన దేశంలో కేవలం 17 లక్షల జీవ రాశుల సమాచారం మాత్రమే ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వన జల జీవ రాశులున్న దేశాల్లో మన దేశం 17 స్థానంలో ఉండగా, మొత్తం 12 శాతం అడవులు ఇక్కడే ఉన్నాయన్నారు.ఇప్పటికి మన దేశంలో జీవ వైవిధ్యంపై 60 శాతం మంది ఆధారపడి బతుకుతున్నట్లు వారు తెలిపారు. అలాంటి ఈ జీవవైవిధ్యాన్ని మనం కాపాడుకోలేక పోతే చివరకు మనిషి మనుగడే లేకుండా పోతుందని వారు హెచ్చరించారు.అందరం పర్యావారణాన్ని కాపాడడానికి ప్రతిన పూనాల్సిన అవసరముంద న్నారు.

అనంతరం జీవవైవిధ్యాన్ని కాపాడుటలో విశేష కృషి చేస్తున్న 20 మంది ప్రముఖులను శాలువలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .