భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన భారత స్వాతంత్య్రానికి ముందు 62 ఏళ్ళ క్రితం తేది 28-12-1885న వివిధ ప్రాంతాలనుండి హాజరైన 72 మంది ప్రతి నిధులు బొంబాయిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత జాతీ య కాంగ్రెస్ ఆవిర్భవిం చింది. ఉమేష్‌చంద్ర బెనర్జీ మొదటి అధ్యక్షుడి ఎన్నిక య్యాడు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమన్వ యానికి ప్రభుత్వయం త్రాంగంలోని లోపాలను బట్టబయలు చేయడానికి ఈ సంస్థ స్థాపించబడింది. అప్పనుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పరి ణామాలు చోటు చేసుకు న్నాయి. ఇప్పుడు దేశంలో నే అతిపెద్ద రాజకీయ పార్టీ గా అవతరించిన కాంగ్రెస్ ఈ సంవత్సరంతో 125 ఏ ళ్ళు పూర్తిచేసుకుంటోంది.
కాంగ్రెస్ పార్టీ 126వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను 28 డిసెంబర్ మంగళవారం రాష్ట్ర రాజధానిలోని గాంధీ భవన్‌లో జరిగాయి.దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. పార్టీ 125వ వ్యవస్థాపక దినోత్సవం రోజునే ఢిల్లీలోని కోట్లా రోడ్‌లో రెండెకరాల స్థలంలో నూతన ప్రధాన కార్యాలయానికి (ఇందిరా భవన్‌కు) పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ శంకు స్థాపన చేయనున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పాత్ర, దేశ అభివృద్ధిలో పోషించిన భూమిక పేరుతో ప్రత్యేకించి యువతరాన్ని ఆకట్టుకునేలా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని, కాంగ్రెస్ పార్టీ ద్వారా నెహ్రూ కుటుంబమేకాక అనేకమంది నిస్వార్థమహనీయులు దేశానికి ఎనలేని సేవలందించారన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయిలో అందరిని భాగస్వాములను చేయాలని కోరారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరాన్ని, దుస్తులు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు తలపెట్టామన్నారు.
భారత జాతీయ కాంగ్రెస్ - ఐ (ఇందిరా కాంగ్రేసు) Indian National Congress-I) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయ పార్టీ. దీనిని 1885 లో దాదాభాయ్ నౌరోజీ, దిన్‌షా వాచా, వుమేష్ చంద్ర బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, మొనొమోహన్ ఘోష్, ఏ.వో. హ్యూమ్, మరియు విలియం వెడ్డర్‌బర్న్ మున్నగు వారు కలిసి స్థాపించారు. ఈ పార్టీ భారత స్వాతంత్ర్య ఉద్యమం నకు ప్రాతినిధ్యం వహించింది. దాదాపు ఒకటిన్నర కోట్లమంది సభ్యులతో, ఏడుకోట్లమంది ఉద్యమకారులతో బ్రిటిష్ రాజ్ ను ఎదిరించి పోరాడింది. స్వాతంత్ర్యం తరువాత, ఒక రాజకీయ పార్టీగా అవతరించింది
- =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .