Saturday, October 1, 2011

బాక్సింగ్‌ డే , Boxing day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసెంబర్‌ 26) బాక్సింగ్‌ డే , Boxing day గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


బాక్సింగ్‌ డే (డిసెంబర్‌ 26): ఏసుక్రీస్తు పుట్టినపుడు ఆయనను చూడడానికి ముగ్గురు విజ్ఞానులు బెథ్లెహామ్‌ వెళ్ళారు. భగవంతుడిని చూడడానికి ఉత్త చేతుల్తో వెళ్ళకూడదని ముగ్గురు మూడు వస్తువులను తీసుకొని వెళ్ళారు. అందులో ఒకటి బంగారు పాత్ర, సాంబ్రాణి కొమ్మ, బోలం బెరడు. ఆనాటి ఆచారాన్ని పాటిస్తూ... ఇప్పటికీ కానుకలు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. డిసెంబర్‌ 25న కానుకల బాక్సులు విప్పి చూసుకునే తీరిక ఉండదు. కనుక మరుసటి రోజు ఆ బాక్సుల ను తెరిచి చూస్తారు. కనుక డిసెంబర్‌ 26 ‘బాక్సింగ్‌ డే’గా పరిగణించబడుతోంది.బాక్సింగ్ డే అంటే మల్ల యోధుల యుద్ధం కాదు. దానికా పేరు ఎలా వచ్చిందంటే క్రిస్‌మస్ పండుగ రోజున వ్యాపారులు ఒకరికొకరు పరస్పరం స్నేహభావంతో అందచేసుకునే బహుమతి పెట్టెలు (గిఫ్ట్‌బాక్సెస్) వాటిని సంప్రదాయం ప్రకారం తెరవబడే రోజు కాబట్టి దానికి ‘బాక్సింగ్ డే’ అనే పేరు వచ్చింది.

  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .