Thursday, September 15, 2011

హిందీ భాషా దినోత్సవం, Hindi Language Day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (Sept.14) -హిందీ దినోత్సవం, Hindi Language Day - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.


జాతీయ భాషగా హిందీ వర్ధిల్లుతోంది. హిందీనేర్చుకోవడానికి చాలామంది ప్రాధాన్యమిస్తున్నారు. ఉద్యోగాల్లో హిందీ భాష కీలకంగా మారింది. సెప్టెంబరు 14వ తేదీన హిందీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబరు 14వ తేదీన హిందీని జాతీయ భాషగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర భాషా ప్రచార సమితి (వార్థా) పిలుపుమేరకు అప్పటి నుంచి హిందీ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.

మన జాతీయ భాష(నేషనల్ ల్యాంగ్వేజ్)గా పేరుగాంచిన "హిందీ" భాషకు సెప్టెంబర్ 14న ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14ను "హిందీ దివస్" (హిందీ దినోత్సవం)గా జరుపుకుంటారు. ఇందుకు గల కారణం 1949వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుండి ఈ తేదీను హిందీ దివస్‌గా జరుపుకోవడం ఆనవాయితీ.

అధికారిక భాష హిందీ దేవనాగరిక లిపి నుంచి రూపొందించబడింది. ఈ భాష ఇండో యూరోపియన్ భాష సంతతికి సంబంధించిన ఇండో-ఆర్యన్ శాఖకు చెందినది. హిందీ అంటే "పర్షియన్ కానుక" అని అర్థం. హిందీ భాష చాలావరకూ సంస్కృతం నుంచి గ్రహించబడినది. అయితే కాలక్రమంలో ఉత్తర భారతదేశంలోని ముస్లిం ప్రభావం వల్ల పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు హిందీలో చేరి ఉర్దూ భాష ఆవిర్భవించింది.

మనం గమనించినట్లయితే శుద్ధ హిందీ(ప్యూర్ హిందీ) భాషను రేడియోలలో, టి.వి. వార్తలలో వినవచ్చు. ప్రస్తుతం చలామణిలో ఉన్న హిందీ భాష చాలా వరకూ సులభతరం చేయబడింది. ప్రపంచంలోని చాలా దేశాలలో హిందీ భాషను మాట్లాడుతారు. మారిషస్, ట్రినిడాడ్, అమెరికా, దక్షిణాఫ్రికా, న్యూజిల్యాండ్ వంటి చాలా దేశాలలో ఇప్పటికీ హిందీ ముఖ్య భాషగా ఉంది.

అయితే... మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడే భాషలలో హిందీ భాష రెండవది కావడం. ఇది మనం అందరం గర్వించదగిన విషయం. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా దేశంలో ఐక్యతను తీసుకురావడానికి ఈ భాషనే వాడేవారు. ఈ భాషను "లాంగ్వేజ్ ఆఫ్ యూనిటి" అనేవారు. అంత గొప్పది మన హిందీ భాష, అందుకే అన్నారు మేరా భారత్ మహాన్ అని..! కాబట్టి హిందీ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భాష సమస్య లేకుండా జీవించ వచ్చన్నమాట. ఇతరులు అర్దం చేసుకోవడాన్ని సులభమైన బాష హిందీ ఒక్కటేనని గుర్తు చేశారు

మాతృభాషాదినోత్సవాన్ని జరుపుకొన్న వారు , మాతృభాషపై ఉన్న మమకారము తో రాస్ట్రములో ప్రతివారికి విద్యవిధానాలు అందాలంటే తప్పనిసరిగా మాతృభాషలోనే చదువుకోవాలి . విభిన్న భాషలు ఉన్న భారతదేశములో ఒకరి భావావేశాలు మరివొకరు అర్ధము చేసుకునేందుకు ఒక కామన్‌ ల్యాంగ్వేజ్ అవసరము ఎంతైనా ఉంది . ప్రపంచ దేశాల ప్రజలతో సంభాషించేందుకు ఇంగ్లిష్ కు ఉన్న ప్రాముఖ్యత మరియేఇతర భాషకు లేదు . ఇంగ్లిష్ నేర్చుకోవడం తప్పనిసరి అవుతుంది . ఈ విధము గా హిందీయేతర ప్రాంతాలలో మూడు భాషలు నేర్చుకోవడం కష్టతరము , అసంపూర్ణము అవుతుంది . అందువలన హిందీని అనవసరముగా నేర్చుకోమని బలవంతము పెట్టకూడదని , మాతృభాష ను కించపరచవద్దని మనవి .
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .