సిరిమావొ బండారునాయకే - Sirimavo_Bandarunayake: ప్రపంచంలో తొలి మహిళా ప్రధానమంత్రి సిరిమావో బండారు నాయకే. శ్రీలంకకు ప్రధానమంత్రిగా మూడుసార్లు పనిచేసి బండారునాయకే రికార్డు సృష్టించారు. శ్రీలంక ఫ్రీడం పార్టీ తరఫున ఆమె పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. సిరిమావో రతవాత దియాస్ బండారునాయకే 1916 ఏప్రిల్ 17వ తేదీన జన్మించారు. లంక రాజధాని కొలంబోలోని సెయింట్ బ్రిగేడ్స్ కాన్వెంట్‌లో చదువుకుంది సిరిమావో. బండారునాయకే కుటుంబం బౌద్ధమతానికి చెందింది. ఆమెకు దియాస్ బండారునాయకేతో 1940లో వివాహం జరిగింది. శ్రీలంక ఫ్రీడం పార్టీకి దాదాపు 40 ఏళ్లపాటు ఆవిరాళ కృషిని దియస్ బండారునాయకే అందించారు. బండారునాయకే రాజకీయ హత్యకు గురైన తర్వాత పార్టీలోకి సిరిమావో బండారునాయకే ప్రవేశించింది. సిరిమావో తొలిసారి 1960 జులై 21వ తేదీన శ్రీలంక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
- =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .