గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు ( జూలై మొదటివారము ) - వనమహోత్సవం - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
గాలి, నీరు, నిప్పు, నేల, అంబరం, వనం లేకపోతే ప్రకృతే లేదు. ఇందులో ముఖ్యంగా నేలపై చూసేది మనకు నిత్యం కనపడేటివి నీరు, నేల, అడవి. ఇవి సమృద్ధిగా ఉంటేనే మనిషి పరిణమించడానికి అవకాశముంటుంది . పర్యావరణములో ప్రముఖ పాత్ర వహించేవి వనాలు (అడవులు ). వాటిని రక్షించాల్సిన బాధ్యత మానవులపై ఉన్నది . వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకునే ప్రయత్నం లో మనము కొత్తగా సమాజిక వనాలను పెంచమని ప్రోత్సహిస్తూ ప్రతిసంవత్సరమూ జూలై మొదటివారములో సామూహిక వనమహోత్సవాలు నిర్వహిస్తున్నాము . ప్రభుత్వ పరముగా జరిగే కార్యక్రమాలకు అయినా విద్యార్ధులు , ఉద్యోగులు , మిగిలిన అన్ని వర్గాలవారు తమ వంతు బాధ్యతగా పాల్గొనాలి . వనము అనగా అడవులు గుర్తుకొస్తాయి. అడవి అనగానే దట్టంగా అలుముకున్న చెట్లు , ఊడలు దిగిన మర్రెచెట్లు , ఘీంకరించుకుంటూ తిరిగే వన్యప్రాణులు కంటిముందు కదలాడుతాయి . అలాంటి అడవులు మనము పెంచనక్కరలేదు . అవి ప్రకృతి సహజము గా కొండలు , గుట్టలు వెంట మానవ నివాసాలకు దూరముగా పెరుగుతాయి . అలాగని మానవ నివాసాల దగ్గరిలో చెట్లు అక్కర్లేదా ? తప్పని సరిగా ఉండాలి . ఈ విధముగా మానవ నివాసాల మధ్యన చెట్లు పెంచే ఉద్దేశముతో వనమహోత్సవాలు జరుపుకుంటున్నాము . ఆ వారం రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక మొక్కనైనా నాటి దాని పోషణ బాధ్యతను చేపట్టాలి . జూలై నెలలో వర్షాలు కురవడం ప్రారంభం అవుతుంది గాన భారతదేశము లో ఋతుపవనాలు ఆరంభమవుతాయి.
గాలి, నీరు, నిప్పు, నేల, అంబరం, వనం లేకపోతే ప్రకృతే లేదు. ఇందులో ముఖ్యంగా నేలపై చూసేది మనకు నిత్యం కనపడేటివి నీరు, నేల, అడవి. ఇవి సమృద్ధిగా ఉన్నపుడే వాతావరణము సమతుల్యముగా ఉంటుంది . ప్రతిఏటా అటవీ సంరక్షణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నప్పటికీ వేసవిలో కొందరు ఆకతాయిల చేష్టలకు పచ్చని అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఫలితంగా అడవులు నానాటికి అంతరించిపోతున్నాయి. భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అడవులు వుండాలని అప్పుడే పర్యావరణం సమతుల్యంగా వుంటుందని శాస్త్రవేత్తలు చెబుతుంటే కేవలం 10శాతం పచ్చదనం కూడా నేడు కనిపించడంలేదు. . ఒకప్పుడు దట్టంగా అడవులు వుండేవి. నేడు వున్నవికూడా అగ్నికి అహుతవుతున్నాయి. ఉపాధి పథకం కింది లక్షలాది రూపాయలతో అటవీ శాఖాధికారులు మొక్కల పెంపకం చేపట్టారు. కోట్లాదిరూపాయల ప్రభుత్వ ధనం వృథా అవుతున్నా అడవులు కాపాడటానికి పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడటం, గ్రామీణులలో అడవుల పట్ల తగిన చైతన్యం లేకపోవడం కూడా అడవులు తరిగిపోవడానికి కారణమవుతోంది. టిడిపి పాలనా కాలంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో, ప్రజల భాగస్వామ్యంతో వనసంరక్షణ కమిటీలు పనిచేస్తుండేవి. అప్పట్లో అటవీ సంరక్షణపై అటవీ శాఖ విస్తృత ప్రచారం నిర్ణయించడమేగాక అటవీ సంరక్షణ బాధ్యతలు కూడా విఎస్‌ఎస్ కంపెనీలకు అప్పగించేవి. 8 సంవత్సరాలుగా ప్రపంచ బ్యాంక్ నిధులు నిలిపివేయడంతో అటవీ సంరక్షణ కుంటిపడింది. ఎండిన బోదకు నిప్పుపెడితే దాని స్థానంలో పచ్చనిగడ్డి వస్తుందని గొర్రెల కాపరులు వేలాది ఎకరాల అడవులను నాశనం చేస్తున్నారు. దీంతో వేలాది వన్యప్రాణులు అగ్నికి అహుతవు తున్నాయి. వనమూలికలు, ఫలసాయం తదితర సంపద కూడా కాలిబూడిదవుతోంది. మానవ తప్పిదంతో ప్రతి రోజూ ఏదో ఒక చోట అగ్నికి పచ్చనిచెట్లు నేలకొరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అటవీ సంరక్షణకు బృహత్తర కార్యక్రమం చేపట్టి అడవులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ప్రపంచ అటవీ దినోత్సవం ప్రకృతిలో సరైన సమతూకం ఉండాలంటే ఒక దేశ వైశాల్యంలో 33 శాతం అటవీ ప్రాం తం ఉండాలి. ప్రస్తుతం మొత్తం భారత వైశా ల్యంలో అటవీ విస్తీర్ణం సుమారు 21 శాతం మాత్రమే ఉన్నట్టు సెంట్రల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఇటీవల ప్రకటించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్.ఆర్.ఎస్.ఏ) ఉపగ్రహం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం భారతదేశం ఏటా 13,101 చ.కి .మీ. అటవీ భూమిని కోల్పోతున్నది. నేడు మనదేశంలో సుమారు ఆరు కోట్ల 49 లక్షల హెక్టార్ల భూమి అటవీ ప్రాంతం కింద ఉన్న ట్టు అంచనా. ప్రపంచ జనాభాలో 17 శాతం భారతదేశంలో ఉండగా ప్రపంచ అడవుల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే కలిగి ఉంది.
ప్రపంచవ్యాప్తంగా నెలకు సుమారు 20 లక్షల హెక్టార్లలో అడవులు నాశనమవుతు న్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు పర్యావరణం పూర్తిగా నాశనమై ఘోర విపత్తులు సంభవించే అవకాశముం దని వారు హెచ్చరిస్తున్నారు.
అడవులు అనగా-- దట్టమైన వృక్షాలతో కూడిన ప్రాంతం.
భూమధ్యరేఖా ప్రాంతంలో విస్తరించియున్న అడవులు-- ఉష్ణమండలపు వర్షపాత అడవులు.
అడవులు అత్యధికంగా ఉన్న ఖండం-- ఆసియా.
భారతదేశంలో అత్యధిక అడవులు కలిగియున్న రాష్ట్రం-- మధ్యప్రదేశ్.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక అడవులు ఉన్న జిల్లా-- ఖమ్మం.
సముద్రతీర అడవులకు పేరు-- మడ అడవులు.
యూరప్‌లోని కోనిఫెరస్ అడవులకు పేరు-- టైగా.
ప్రపంచంలో అతిపెద్ద కోనిఫెరస్ అడవులు కలిగిన దేశం-- రష్యా.
భారత్‌లో వనమహోత్సవం ఎప్పుడు ప్రారంభించారు-- 1950.
చిప్కో ఉద్యమం వలన పేరుపొందినది-- సుందర్‌లాల్ బహుగుణ.
భారత్‌లో చందనపు వృక్షాలు అధికంగా ఉన్న అరణ్యాలు ఏ రాష్ట్రంలో కలవు-- కర్ణాటక.
దండకారణ్య అడవులు భారత్‌లో ఏ భాగంలో ఉన్నాయి-- మధ్య భారత్.
అడవుల పరిరక్షణకై సుందర్‌లాల్ బహుగుణ చేపట్టిన ఉద్యమం-- చిప్కో ఉద్యమం.
భారత్‌లో మడ అడవులు అధికంగా ఉన్న రాష్ట్రం-- పశ్చిమ బెంగాల్.
గిర్ అరణ్యాలు ఏ రాష్ట్రంలో కలవు-- గుజరాత్.
ఫారెస్ట్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ కలదు-- భోపాల్.
పర్యావరణ సమతూకంకై కనీసంగా ఉండవలసిన అడవుల శాతం-- 33%.
ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ కలదు-- డెహ్రాడూన్.
దేశంలో అడవుల శాతం అధికంగా ఉన్న రాష్ట్రం-- అరుణాచల్ ప్రదేశ్.
కేంద్ర అటవీసంఘాన్ని ఎప్పుడు ఏర్పాటుచేశారు-- 1965.
=========================================
Visit My Website - > Dr.seshagirirao.com/
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .